Bigg Boss 7: ఈ వారం డబుల్ ఎలిమినేషన్.. ఆ ఇద్దరు ఔట్? | Bigg Boss 7 Telugu Double Elimination Rathika And Ashwini 11th Week | Sakshi
Sakshi News home page

Bigg Boss 7 Elimination: ట్విస్ట్ ఇచ్చిన బిగ్‌బాస్.. ఇ‍ద్దరు లేడీస్ ఒకేసారి బయటకి!

Published Fri, Nov 17 2023 7:29 PM | Last Updated on Fri, Nov 17 2023 7:37 PM

Bigg Boss 7 Telugu Double Elimination Rathika And Ashwini 11th Week - Sakshi

బిగ్‌బాస్ 7 తెలుగు సీజన్ గతంతో పోలిస్తే గత కొన్నివారాలుగా పికప్ అయిందని చెప్పొచ్చు. గ్రూపులుగా తయారై కొట్టుకుంటున్నారు. అయితేనేం మంచి ఎంటర్‌టైన్‌మెంట్ ఇస్తున్నారు. ఇకపోతే ఉల్టాపుల్టా అనే ట్యాగ్ లైన్‌తో ఈ సీజన్ రన్ చేస్తున్నారు. ఇప్పుడు ఆ లైన్‌కి మరోసారి న్యాయం చేసేలా ఈ వారం డబుల్ ఎలిమినేషన్ ప్లాన్ చేసి ట్విస్ట్ ఇవ్వబోతున్నారట. ఇంతకీ మేటర్ ఏంటి? ఎలిమినేట్ అయ్యే ఆ ఇద్దరు ఎవరు?

(ఇదీ చదవండి: ఈ శుక్రవారం ఓటీటీల్లోకి ఏకంగా 33 సినిమాలు)

నామినేషన్స్‌లో ఎవరు?
ఈ వారం బిగ్ బాస్ హౌసులో 8 మంది నామినేట్ అయ్యారు. శివాజీ కెప్టెన్ కాబట్టి అతడు లిస్టులో లేడు. రైతుబిడ్డ ప్రశాంత్‌కి ఒక్క ఓటు పడటంతో అతడు సేఫ్ అయిపోయాడు. దీంతో మిగిలిన వాళ్లందరూ అంటే అమర్‌దీప్, యావర్, ప్రియాంక, శోభాశెట్టి, అర్జున్, గౌతమ్, అశ్విని, రతిక ఉన్నారు. వీళ్లలో యావర్‌కి ఈసారి ఎక్కువ ఓట్లు పడినట్లు తెలుస్తోంది. రెండులో అమర్ ఉన్నాడట. తర్వాత వరసగా రతిక, అశ్విని, గౌతమ్, అర్జున్, ప్రియాంక, శోభాశెట్టి ఉన్నట్లు తెలుస్తోంది.

ఎలిమినేట్ అయ్యేది ఎవరు?
ఓటింగ్ ప్రకారం చూసుకుంటే సీరియల్ బ్యాచ్‌లోని ప్రియాంక లేదా శోభాశెట్టిలో ఒకరు ఎలిమినేట్ అయిపోవాలి. కానీ బిగ్‌బాస్ ఆర్గనైజర్స్ అస్సలు వీళ్లని బయటకు పంపించారు. ఎందుకంటే ఆటైనా గొడవైనా వీళ్లిద్దరూ ముందుంటున్నారు. శివాజీకి ఎదురు నిలబడి మాట్లాడుతున్నది కూడా వీళ్లే. ఇలాంటోళ్లని ఎలిమినేట్ చేసి పంపించేస్తే షోలో మజా పోతుంది. అందుకే ఓట్లు తక్కువ పడినా సరే వీళ్లు బయటకెళ్లే ప్రసక్తే లేదనిపిస్తోంది.

(ఇదీ చదవండి: 'సప్త సాగరాలు దాటి సైడ్-బి' సినిమా రివ్యూ)

డబుల్ ట్విస్ట్
ఈ వారం ఎవిక్షన్ పాస్ ఇవ్వడాని కంటే ముందు.. ఇప్పటివరకు హౌసులో ఉన్నదాని ప్రకారం ర్యాంకింగ్ ప్రకారం నిలబడమని బిగ్‌బాస్ చెప్పాడు. దీంతో వరసగా శివాజీ, యావర్, ప్రశాంత్, ప్రియాంక, శోభా, అమర్, గౌతమ్, అర్జున్, అశ్విని, రతిక నిల్చున్నారు. చివరి రెండు స్థానాల్లో అశ్విని-రతిక ఉన్నారు. అంటే వీళ్లిద్దరూ ఎలిమినేషన్ కి అర్హులని పరోక్షంగా చెప్పినట్లే. అలా ఇప్పుడు ఈ ఇద్దరిని ఈవారం ఒకేసారి ఎలిమినేట్ చేస్తారని అంటున్నారు. లేదంటే మిడ్ వీక్ ఎలిమినేషన్ కూడా ప్లానింగ్‌లో ఉందని టాక్.

ఎవిక్షన్ పాస్ సంగతేంటి?
ఈవారం పెట్టిన పోటీల్లో గెలిచిన యావర్.. ఎవిక్షన్ పాస్ సొంతం చేసుకున్నాడు. అయితే మనోడు ఎలిమినేషన్‌లో ఉన్నాడు కాబట్టి సొంతంగా సేవ్ చేసుకోవాలని బిగ్ బాస్ ఫిట్టింగ్ పెడితే.. యావర్ తనకోసం తానే దీన్ని ఉపయోగించే అవకాశముంటుంది. వేరే వాళ్ల కోసం అంటే మాత్రం కచ్చితంగా రతికని యావర్ సేవ్ చేసేస్తాడు. మరి ఏం జరుగుతుందో చూడాలి. గేమ్, టాస్కుల పరంగా చూసుకుంటే రతిక ఎప్పుడో వెళ్లిపోవాలి. కానీ బిగ్‌బాస్ ఎందుకో ఆమెపై తెగ ప్రేమ చూపిస్తున్నాడు. ఈసారి ఆమె ఎలిమినేట్ అవుతుందా? సేవ్ అవుతుందా అనేది చూడాలి. అ‍ప్పటివరకు వెయిట్ అండ్ సీ.

(ఇదీ చదవండి: నెలన్నర నుంచి ఓటీటీ ట్రెండింగ్‌లో ఆ థ్రిల్లర్ మూవీ)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement