Actress Punarnavi Bhupalam Given Clarity About Returning India - Sakshi
Sakshi News home page

Punarnavi Bhupalam: ఆ విషయం చెప్పి పండగ చేస్కోమన్న పునర్నవి.. అసలు సంగతి చెప్పేసిన నటి తల్లి

Published Mon, Feb 27 2023 1:08 PM | Last Updated on Mon, Feb 27 2023 3:28 PM

Actress Punarnavi Bhupalam About Returning India - Sakshi

ఉయ్యాల జంపాల సినిమాతో ప్రేక్షకులను తనవైపు ఆకర్షించింది పునర్నవి భూపాలం. ఆ తర్వాత బిగ్‌బాస్‌ నాలుగో సీజన్‌తో బుల్లితెర ఆడియన్స్‌కు దగ్గరైంది. రాహుల్‌ సిప్లిగంజ్‌తో లవ్‌ ట్రాక్‌ నడిపి మరింత ఫేమస్‌ అయింది. అయితే విచిత్రంగా ఈ షో తర్వాత ఎవరి దారి వారు చూసుకున్నారు. కాగా ప్రస్తుతం యూకేలో ఉంటున్న పునర్నవి తాజాగా ఓ గుడ్‌న్యూస్‌ షేర్‌ చేసుకుంది. పీజీ డిప్లొమా ఇన్‌ డ్రామా అండ్‌ మూవ్‌మెంట్‌ థెరపీ కోర్సు పూర్తైందని తెలిపింది.

మరి ఇండియాకు ఎప్పుడొస్తావక్కా? అన్న ప్రశ్నకు 'వచ్చే నెల నుంచి ఇండియాకే అంకితం.. పండగ చేస్కోండి పో' అని రిప్లై ఇచ్చింది. వెంటనే పున్నూ తల్లి స్పందిస్తూ.. తను అబద్ధం చెప్తోంది.. వచ్చే నెలాఖరు నుంచి అమెరికాలో ఉండబోతోంది అని క్లారిటీ ఇచ్చింది. దీంతో సీక్రెట్‌ రివీలైపోయిందనుకున్న షన్నూ.. ఎందుకు చెప్పావమ్మా అన్నట్లుగా ఓ ఎమోజీని షేర్‌ చేసింది.

చదవండి: ఇలాంటివాళ్లను బాయ్‌కాట్‌ చేయాలి.. రష్మికపై ట్రోలింగ్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement