
ప్రముఖ రియాలిటీ షో బిగ్‌బాస్ ద్వారా పాపులర్ అయిన నటి పునర్నవి భూపాలం. అంతకు ముందు ఉయ్యాల జంపాల వంటి పలు చిత్రాల్లో నటించినప్పటికీ అవి అమెకు అంతగా గుర్తింపు తెచ్చిపెట్టలేదు. కానీ బిగ్‌బాస్ మూడో సీజన్‌లో పాల్గొని, తనదైన ఆటతీరుతో అందరిని ఆకట్టుకుంది. ఏ విషయంలోనైనా ఓపెన్‌గా మాట్లాడుతూ..బోల్డ్ బ్యూటీగా పేరు తెచ్చకుంది.
బిగ్‌బాస్ షో తర్వాత చాలా సినిమా అవకాశాలు వచ్చినప్పటికీ.. నో చెప్పి పై చదువుల కోసం లండన్ వెళ్లింది. ప్రస్తుతం ఆమె లండన్‌లో సైకాలజీలో హయ్యర్ స్టడీస్ చేస్తోంది. లండన్ వెళ్లినప్పుటికీ సోషల్ మీడియా తరచూ తన పోస్ట్‌లు పెడుతూ ఫ్యాన్స్‌కి టచ్‌లో ఉంటుంది. అంతేకాదు వీలు చిక్కినప్పుడల్లా లైవ్‌చాట్‌లో ఫ్యాన్స్‌తో చిట్‌చాట్ చేస్తుంది. కొద్ది రోజులుగా సైలెంట్‌గా ఉన్న పునర్నవి కొత్త సంవత్సరంలో ఫ్యాన్స్‌కి బ్యాడ్ న్యూస్ చెప్పింది.
తాను కొద్ది రోజుల క్రితం అనారోగ్యం బారిన పడ్డానంటూ ఇన్‌స్టాగ్రామ్ స్టోరీ పోస్ట్ షేర్ చేసింది. ‘కొద్ది రోజులుగా ఛాతి(ఊపిరితిత్తులకు సంబంధించిన) సమస్య(Chest Congestion) వ్యాధితో బాధపడుతున్నా. నా కొత్త సంవత్సరం ఇలా మొదలైంది. చాలా రోజులుగా(long sick) అనారోగ్యంతో బాధపడటం ఇదే మొదటిసారి. ఇదే చివరిసారి కావాలని ఆశిస్తున్నా’ అంటూ తన ఫొటో షేర్ చేసింది. అలాగే మరో ఫొటో షేర్ చేస్తూ.. ‘ఇప్పటికీ అనారోగ్యంగానే(Still Sick)’ ఉన్నాను అంటూ క్యాప్షన్ ఇచ్చింది.
చదవండి:
వ్యాపారవేత్తతో శ్రీముఖి పెళ్లి? త్వరలోనే అధికారిక ప్రకటన!
Comments
Please login to add a commentAdd a comment