'బిగ్‌బాస్' పునర్నవి ప్రేమలో పడిందా? మరి ఆ కుర్రాడెవరు? | Bigg Boss Telugu Punarnavi Bhupalam Boyfriend Details | Sakshi
Sakshi News home page

Bigg Boss Punarnavi: బాయ్ ఫ్రెండ్ ఇతడేనా? కానీ అది ఇంకా సస్పెన్సే

Published Fri, May 24 2024 1:41 PM | Last Updated on Fri, May 24 2024 1:41 PM

Bigg Boss Telugu Punarnavi Bhupalam Boyfriend Details

బిగ్‌బాస్ రియాలిటీ షో ఇప్పటివరకు 7 సీజన్లు పూర్తి చేసుకోగా, చాలామంది నటీనటులు ఇందులో పాల్గొని బాగానే గుర్తింపు తెచ్చుకున్నారు. ఇక అమ్మాయిల గురించి అయితే చెప్పనక్కర్లేదు. అలా మూడో సీజన్‌లో పెద్దగా అంచనాల్లేకుండా పాల్గొని మంచి క్రేజ్ సంపాదించిన తెలుగమ్మాయి పునర్నవి భూపాలం. ఈ షో తర్వాత పూర్తిగా యాక్టింగ్ పక్కనబెట్టేసిన పునర్నవి.. ఇప్పుడు ప్రేమలో పడిందా అనే సందేహం వస్తోంది.

(ఇదీ చదవండి: 'మంజుమ్మెల్ బాయ్స్'లో ఆ సీన్‌ కోసం ఓరియో బిస్కెట్స్‌: డైరెక్టర్‌)

హైదరాబాద్‌కి చెందిన పునర్నవి.. 'ఉయ్యాలా జంపాలా' మూవీతో నటిగా కెరీర్ ప్రారంభించింది. ఆ తర్వాత పలు సినిమాల్లో సహాయ పాత్రలు చేసింది. అలా బిగ్‌బాస్ 3వ సీజన్‌లో ఏకంగా 11 వారాల పాటు ఉంది. సింగర్ రాహుల్ సిప్లిగంజ్‌తో ఈమె నడిపిన ప్రేమ కహానీ గురించి చాలామందికి తెలుసు. అదంతా స్క్రిప్ట్ అయినప్పటికీ ఈ జంటకు చాలామంది కనెక్ట్ అయ్యారు.

ఇక ఈ షో నుంచి బయటకొచ్చిన తర్వాత ఒకటి రెండు సినిమాలు చేసిన పునర్నవి.. ఆ తర్వాత పైచదువుల కోసం విదేశాలకు వెళ్లిపోయింది. యూకేలో ఉంటున్న ఈ భామ.. ఇప్పుడు ప్రేమలో పడినట్లు తెలుస్తోంది. ఓ కుర్రాడితో ఉన్న ఫొటోని ఇన్ స్టాలో షేర్ చేసింది. అయితే ఇతడు బాయ్ ఫ్రెండ్ లేదంటే ఇంకెవరైనా అనేది తెలియాల్సి ఉంది.

(ఇదీ చదవండి: కేవలం రూ.4 కోట్ల సినిమా.. నెల రోజుల్లోనే యానిమల్‌ను దాటేసి!)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement