మెట్లపై నిద్రపోయేది.. సుమ సీక్రెట్ బయటపెట్టిన మరో యాంకర్! | Anchor Suma Crying Etv Diwali Event 2023 Promo | Sakshi
Sakshi News home page

Anchor Suma: కన్నీళ్లు పెట్టుకున్న యాంకర్ సుమ.. ఆ విషయాలు బయటపెట్టేసరికి!

Published Fri, Nov 10 2023 6:58 PM | Last Updated on Fri, Nov 10 2023 7:42 PM

Anchor Suma Crying Etv Diwali Event 2023 Promo - Sakshi

యాంకర్ సుమ కన్నీళ్లు పెట్టుకుంది. సాధారణంగా ఈవెంట్, షో ఏదైనా సరే తన మాటలతో అలరించే సుమ.. ఆ విషయం మళ్లీ గుర్తొచ్చేసరికి ఎమోషనల్ అయింది. అలానే సుమ గురించి ఎవరికీ తెలియని ఓ విషయాన్ని ప్రముఖ లేడీ యాంకర్ బయటపెట్టింది. ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

(ఇదీ చదవండి: Bigg Boss 7: రైతుబిడ్డకు ఆ బ్యాడ్ న్యూస్ చెప్పిన తండ్రి!)

ఇంతకీ ఏంటి విషయం?
దీపావళి దగ్గరకొచ్చేసింది. దీంతో తెలుగు ఛానెల్స్ స్పెషల్ ఈవెంట్స్ ప్లాన్ చేస్తుంటాయి. అలా ఓ కార్యక్రమానికి సుమ గెస్ట్‌గా వచ్చింది. ఈమెతో పాటు ఒకప్పటి యాంకర్ శిల్పా చక్రవర్తి కూడా వచ్చింది. సందర్భం ఏంటనేది కరెక్ట్‌గా తెలీదు గానీ సుమ గురించి శిల్పా చక్రవర్తి ఓ సీక్రెట్ బయటపెట్టింది. రాత్రుళ్లు కొన్నిసార్లు మెట్లపై నిద్రపోయేదని చెప్పుకొచ్చింది.

కన్నీళ్లు పెట్టుకున్న సుమ
రాత్రుళ్లు కొన్నిసార్లు షూటింగ్స్ లో చాలా ఆలస్యమయ్యేదని, ఇంటికొచ్చి తలుపు చాలాసేపు కొట్టినా ఎవరు తీయకపోవడంతో కొన్నిసార్లు మెట్లపై సుమ నిద్రపోవడం తాను చూశానని యాంకర్ శిల్పా చక్రవర్తి.. తాజాగా రిలీజ్ చేసిన దీపావళి ఈవెంట్ ప్రోమోలో చెప్పుకొచ్చింది. అలా పాత విషయాలు చెప్పేసరికి సుమ కన్నీళ్లు పెట్టుకుంది. సినిమా ప్రమోషన్‪‌లో భాగంగా ఇదే షోకి వచ్చిన సుమ కొడుకు, తల్లిని దగ్గరకు తీసుకుని ఎమోషనల్ అయ్యాడు.

(ఇదీ చదవండి: 'జిగర్‌ తండ డబుల్ ఎక్స్' మూవీ రివ్యూ)

(ఇదీ చదవండి: Japan Review: ‘జపాన్‌’ మూవీ రివ్యూ)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement