Shilpa Chakravarthy
-
మెట్లపై నిద్రపోయేది.. సుమ సీక్రెట్ బయటపెట్టిన మరో యాంకర్!
యాంకర్ సుమ కన్నీళ్లు పెట్టుకుంది. సాధారణంగా ఈవెంట్, షో ఏదైనా సరే తన మాటలతో అలరించే సుమ.. ఆ విషయం మళ్లీ గుర్తొచ్చేసరికి ఎమోషనల్ అయింది. అలానే సుమ గురించి ఎవరికీ తెలియని ఓ విషయాన్ని ప్రముఖ లేడీ యాంకర్ బయటపెట్టింది. ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. (ఇదీ చదవండి: Bigg Boss 7: రైతుబిడ్డకు ఆ బ్యాడ్ న్యూస్ చెప్పిన తండ్రి!) ఇంతకీ ఏంటి విషయం? దీపావళి దగ్గరకొచ్చేసింది. దీంతో తెలుగు ఛానెల్స్ స్పెషల్ ఈవెంట్స్ ప్లాన్ చేస్తుంటాయి. అలా ఓ కార్యక్రమానికి సుమ గెస్ట్‌గా వచ్చింది. ఈమెతో పాటు ఒకప్పటి యాంకర్ శిల్పా చక్రవర్తి కూడా వచ్చింది. సందర్భం ఏంటనేది కరెక్ట్‌గా తెలీదు గానీ సుమ గురించి శిల్పా చక్రవర్తి ఓ సీక్రెట్ బయటపెట్టింది. రాత్రుళ్లు కొన్నిసార్లు మెట్లపై నిద్రపోయేదని చెప్పుకొచ్చింది. కన్నీళ్లు పెట్టుకున్న సుమ రాత్రుళ్లు కొన్నిసార్లు షూటింగ్స్ లో చాలా ఆలస్యమయ్యేదని, ఇంటికొచ్చి తలుపు చాలాసేపు కొట్టినా ఎవరు తీయకపోవడంతో కొన్నిసార్లు మెట్లపై సుమ నిద్రపోవడం తాను చూశానని యాంకర్ శిల్పా చక్రవర్తి.. తాజాగా రిలీజ్ చేసిన దీపావళి ఈవెంట్ ప్రోమోలో చెప్పుకొచ్చింది. అలా పాత విషయాలు చెప్పేసరికి సుమ కన్నీళ్లు పెట్టుకుంది. సినిమా ప్రమోషన్లో భాగంగా ఇదే షోకి వచ్చిన సుమ కొడుకు, తల్లిని దగ్గరకు తీసుకుని ఎమోషనల్ అయ్యాడు. (ఇదీ చదవండి: 'జిగర్ తండ డబుల్ ఎక్స్' మూవీ రివ్యూ) (ఇదీ చదవండి: Japan Review: ‘జపాన్’ మూవీ రివ్యూ) -
శ్రీముఖి.. అవకాశవాది : శిల్పా
బిగ్‌బాస్ హౌస్‌లో ఎనిమిదో వీకెండ్ సందడిగా గడిచింది. వీకెండ్లో వచ్చిన నాగ్.. హౌస్మేట్స్ చేసిన తప్పులను సరిదిద్దే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలో ఇంటి సభ్యులతో కాస్త కటువుగా ప్రవర్తించాడు. అయితే నేటి ఎపిసోడ్లో పూర్తిగా ఎంటర్టైన్ చేసే ప్రయత్నం చేశాడు. హౌస్‌మేట్స్‌కు కొన్ని టాస్క్‌లను ఇచ్చి ఫన్ క్రియేట్ చేసేందుకు ట్రై చేశాడు. శిల్పా-శ్రీముఖి, వితికా-శ్రీముఖి, రాహుల్-పునర్నవి, మహేష్-రవి-హిమజలు చేసిన టాస్క్‌లు ఎంటర్టైన్ చేశాయి. వీటిలో శిల్పా-శ్రీముఖి చేసిన టాస్క్‌ను నచ్చిందని నాగ్ పేర్కొన్నాడు. అనంతరం రాహుల్ చేత గానకచేరి పెట్టించాడు. హౌస్మేట్స్ అందరి మీద పాటలు పాడి ఎంటర్టైన్ చేశాడు. శ్రీముఖి, మహేష్‌లు సేవ్ అయినట్లు నాగ్ పేర్కొన్నాడు. చివరగా.. శిల్పా చక్రవర్తి ఎలిమినేట్ అయినట్లు ప్రకటించాడు. అయితే ఈ విషయం హౌస్మేట్స్ కంటే ముందే ప్రేక్షకులకు తెలిసిపోవడంతో అంత ఆశ్చర్యానికి గురి కాలేదు.శనివారం సాయంత్రమే శిల్పా ఎలిమినేట్ అయినట్లు వార్తలు వైరల్ అయ్యాయి. దీంతో రెండో వైల్డ్‌కార్డ్ ఎంట్రీ కూడా తుస్సుమన్నట్లు నెటిజన్లు కామెంట్లు పెట్టారు. బయటకు వచ్చిన శిల్పా.. హౌస్‌మేట్స్‌పై తన అభిప్రాయాన్ని పంచుకుంది. మహేష్.. తిక్కలోడు, శివజ్యోతి.. అందాల రాక్షసి, రాహుల్.. కోపిష్టి, రవి.. మొండోడు, పునర్నవి.. మూర్ఖురాలు, వితికా.. గయ్యాలి, హిమజ.. అహంకారి, బాబా.. జిత్తులమారి నక్క, శ్రీముఖి.. అవకాశవాది అంటూ చెప్పుకొచ్చింది. డే టైమ్‌లో ఎవరు నిద్రపోయినా.. కుక్కలు అరిసినా.. స్విమ్మింగ్‌పూల్‌లో దూకాలనే బిగ్ బాంబ్‌ను మహేష్‌పై వేసింది. -
బిగ్‌బాస్.. శిల్పా ఎలిమినేటెడ్!
బిగ్‌బాస్ హౌస్‌లో ఎలిమినేషన్ ప్రక్రియ అనేది ఎంత ఉత్కంఠగా సాగాల్సి ఉంటుందో.. అందుకు భిన్నంగా జరుగుతూ వస్తోంది. మొదటి వారం నుంచి ఎలిమినేట్ కాబోయే కంటెస్టెంట్ ఎవరన్నది బిగ్‌బాస్ కంటే ముందుగానే షోను చూసే ప్రేక్షకులకు తెలిసిపోతోంది. అయితే అవి ఊహాగానాల వరకు అయితే పర్లేదు కానీ.. అనధికారికంగా వచ్చే అధికార వార్త అవుతోంది. ఎలిమినేషన్ కాబోతున్నది వీరే అంటూ శనివారమే లీకవుతోంది. అదే సంప్రదాయాన్ని కొనసాగిస్తూ.. ఎనిమిదో వారంలో ఎలిమినేషన్‌కు గురయ్యే కంటెస్టెంట్ ఎవరన్నది ముందే తెలిసిపోయింది. వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చిన శిల్పా చక్రవర్తి.. ఈ వారం బయటకు వెళ్లనున్నట్లు తెలుస్తోంది. వచ్చిన వారంలో తనను నామినేట్ చేసేందుకు వీలుండదు.. కాబట్టి రెండో వారంలో అందరూ ఒకే కారణంతో ఆమెను నామినేట్ చేసేశారు. దీంతో శిల్పా నిష్క్రమణ తప్పదనిపిస్తోంది. అయితే ఎలిమినేట్ అయిన విషయం అధికారికంగా తెలియాలంటే ఆదివారం నాడు షో ప్రసారమయ్యే వరకు ఆగాలి. -
అందరూ ఆమెనే టార్గెట్ చేశారా?
నామినేషన్ ప్రక్రియ అంటే ఇంటి సభ్యుల గుండెల్లో రైళ్లు పరిగెడుతుంటాయి. సోమవారం వచ్చిందంటే ఎవరిని నామినేట్ చేయాలి? అంటూ ఆలోచించుకుంటూ ఉంటారు. హౌస్‌లో ఇప్పటికీ యాభై రోజులు పూర్తయ్యాయని, ఇకపై కఠినతరంగా ఉంటుందని ఇంటి సభ్యులను బిగ్‌బాస్ హెచ్చరించాడు. నామినేషన్ విషయంలో కూడా సరైన కారణాలను చెప్పాలని సూచించాడు. ఇక నామినేషన్ ప్రక్రియలో భాగంగా ఇంటి సభ్యులను రెండు టీమ్స్‌గా విడగొట్టాడు. బాబా భాస్కర్ కెప్టెన్ అయిన కారణంగా ఏ గ్రూప్‌లోనూ సభ్యుడు కాదంటూ తెలిపాడు. ఓ టీమ్‌లోని సభ్యుడు ఇంకో టీమ్‌లోని ఇద్దరు కంటెస్టెంట్లను నామినేట్ చేయాల్సి ఉంటుందని తెలిపాడు. వరుణ్, వితికా, రాహుల్, పునర్నవి, శిల్పాలను ఓ టీమ్ మేట్స్‌గా.. శ్రీముఖి, హిమజ, రవి, శివజ్యోతిలను మరో టీమ్స్‌గా విభజించాడు. ఈ నామినేషన్స్‌లో వైల్డ్ కార్డ్ఎంట్రీ ఇచ్చిన శిల్పా చక్రవర్తినే అందరూ టార్గెట్ చేసినట్టు కనిపిస్తోంది. అయితే ఈసారి రాహుల్‌ను శ్రీముఖి నామినేట్ చేయకపోవడం విశేషం. కానీ రాహుల్ మాత్రం ఈసారి శ్రీముఖిని నామినేట్ చేశాడు. మొత్తంగా ఎనిమిదో వారంలో ఇంటి నుంచి వెళ్లిపోయేందుకు శిల్పా చక్రవర్తి, హిమజ, రవి, శ్రీముఖి, పునర్నవి, మహేష్ నామినేట్ అయ్యారు. కెప్టెన్ అయిన బాబా భాస్కర్‌కు ఒకర్ని సేవ్ చేసే అవకాశాన్ని బిగ్‌బాస్ ఇచ్చాడు. అయితే అందరూ మహేష్ లేదా శ్రీముఖిని సేవ్ చేస్తారని భావించినా.. రవిని సేవ్ చేస్తున్నట్లు తెలిపాడు. దీంతో నామినేషన్ ప్రక్రియ పూర్తయిందని ఈ వారం శిల్పా చక్రవర్తి, హిమజ, శ్రీముఖి, పునర్నవి, మహేష్‌లు నామినేట్ అయినట్లు ప్రకటించాడు. అనంతరం మహేష్, పునర్నవిలు నామినేషన్ గురించి ముచ్చటించుకుంటూ ఉన్నారు. వరుణ్, వితికాలకు శ్రీముఖి అంటే నచ్చదని.. అయితే ఆమెను మాత్రం నామినేట్ చేయరని.. తనను చేశారని పునర్నవితో మహేష్ చెప్పుకొచ్చాడు. బాబా భాస్కర్ తనను సేవ్ చేయలేదని శ్రీముఖి బాధపడినట్టు కనిపిస్తోంది. ఇదే విషయమై హిమజ, శ్రీముఖిలు ముచ్చటించుకున్నారు. మహేష్‌ను మాత్రం సేవ్ చేయరని తాను అనుకున్నట్లు హిమజ తెలిపింది. ఈ వారం టాస్క్‌లో బిగ్‌బాస్ హౌస్ దెయ్యాలకోటగా మారనున్నట్లు తెలుస్తోంది. మరి అలా ఎందుకు మారాల్సి వచ్చిందో తెలియాలంటే బిగ్‌బాస్ చూడాల్సిందే. -
బిగ్‌బాస్.. కన్నీరు పెట్టిన శిల్పా
-
బిగ్‌బాస్.. కన్నీరు పెట్టిన శిల్పా
బిగ్‌బాస్ హౌస్‌లో వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చి.. టాస్క్‌లో గట్టిపోటి ఇచ్చింది శిల్పా చక్రవర్తి. అందరూ ఏకమై తన మీద పడ్డా.. పట్టు వదలకుండా గట్టిగా నిల్చుంది. దొంగల రాణి క్యారెక్టర్‌కు తగ్గట్టు తెగువ చూపించింది. అలీ, శ్రీముఖి, హిమజ, వితికా ఎంత ప్రయత్నించినా.. తన వద్ద నుంచి తుపాకీని లాక్కోలేకపోయారు. చివరకు తనను సింహాసనం నుంచి పక్కకు తప్పించాలని చూసినా.. రాహుల్, వరుణ్, అలీ సహాయంతో చివరి వరకు ప్రయత్నించసాగింది. ఈ క్రమంలో ఎన్ని గాయాలైనప్పటికీ వెనుదిరగలేదు. స్విమ్మింగ్‌పూల్‌లో కూడా శిల్పాపై అందరూ దాడి చేసేందుకు ప్రయత్నించినా పట్టువదలకుండా ఉంది. అయితే ఆ టాస్క్‌లో శిల్పా బాగానే గాయపడింది. టాస్క్‌లో ఎంతో బాధను భరిస్తూ.. చివరకు కన్నీరు పెట్టుకుంది. హింస శ్రుతిమించడంతో బిగ్‌బాస్ ఆ టాస్క్‌ను రద్దు చేసేశాడు. ఇక వీకెండ్లో నాగ్ ఇదే విషయంపై హౌస్‌మేట్స్‌ను ప్రశ్నిస్తున్నట్లు తెలుస్తోంది. తన బాధను చెప్పుకుంటూ శిల్పా కన్నీరు పెట్టుకుంది. ఓడిపోవాలని ఎవరో అన్నట్లు, ఆ మాట తనకు నచ్చలేదని.. ఈ ఇంట్లో గార్లు, జీలు అని అనొద్దు.. మీ ప్రవర్తనలో కొంచెం రెస్పెక్ట్ ఇస్తే చాలు అంటూ తీవ్ర భావోద్వేగానికి లోనైంది. మరి వీటిపై నాగ్ ఎలా స్పందిస్తాడో చూడాలి. -
బిగ్‌బాస్.. దొంగలు సృష్టించిన బీభత్సం
దొంగలు దోచిన నగరం టాస్క్‌తో బిగ్‌బాస్ హౌస్ అంతా గందరగోళంగా మారింది. హింసకు తావివ్వొద్దంటే.. హింసే ప్రధానంగా జరిగినట్లు కనిపిస్తోంది. టాస్క్‌లో భాగంగా రాహుల్ కాలికి గాయమై రక్తం కారింది. నిధిని కాపాడే ప్రయత్నంలో శివజ్యోతి, రవి చాలా కష్టపడ్డారు. వరుణ్-వితికాలు గొడవపడటం, శ్రీముఖి.. పునర్నవిని పట్టుకోవడం, హిమజ.. శిల్పాను పట్టుకుని ఉండటం.. హైలెట్‌గా నిలిచింది. దొంగలు దోచిన సరుకులన్నీ వారి ఆధీనంలో ఉంటాయని.. దొంగలకు రాణి శిల్పా చక్రవర్తి అని ఆ గ్యాంగ్‌లోని సభ్యులుగా పునర్నవి, రాహుల్, వరుణ్, రవి, శివజ్యోతి ఉంటారని తెలిపారు. మహేష్, అలీ, హిమజ, బాబా భాస్కర్, వితికా, శ్రీముఖిలను నగరవాసులుగా ఉంటారని ఆదేశించాడు. దొంగల రాణి ఫోటోలను నాశనం చేయడం, వారి జెండాలను తీసిపారేయడంలాంటివి నగరవాసులు చేస్తూ ఉంటే దొంగల ముఠా వాటిని రక్షించుకుంటూ ఉండాలి. చివరకు దొంగల రాణి చేతిలో ఉన్న తుపాకిని నగరవాసులు సొంతం చేసుకోవాల్సి ఉంటుంది. ఇక ఈ టాస్క్‌లో హింసకు చోటు ఉండకుండదని ఆదేశించాడు. కానీ టాస్క్‌లో హింస మితిమీరిపోయినట్లు కనిపిస్తోంది. శ్రీముఖి కావాలనే రాహుల్‌ను టార్గెట్ చేస్తోందని, టాస్క్‌లో భాగంగా తనను కూడా పట్టుకుంటున్నారని అయితే తనలా అరవడం లేదంటూ శ్రీముఖిపై పునర్నవి ఫైర్ అయింది. జెండాలను కాపాడే ప్రయత్నంలో వరుణ్ సందేశ్ గట్టిగా ప్రయత్నించినా విఫలమయ్యాడు. అందరూ కలిసి వరుణ్‌పై పడేసరికి చివరికి చేతులెత్తేశాడు. రాహుల్-అలీరెజాలు కొట్టుకునేంతా పని చేశారు. స్విమ్మింగ్ పూల్‌లో నిధిని కాపాడే ప్రయత్నంలో అలీ, రాహుల్, మహేష్, రవిలు చాలా కష్టపడ్డారు. సింహాసనంపై కూర్చున్న శిల్పాను, ఆమె చేతిలో ఉన్న తుపాకిని తీసుకునేందుకు అందరూ ఆమెపై పడ్డారు. అయినా ఆమె వారందర్నీ నిరోదిస్తూ ఉండగా.. పునర్నవి, రాహుల్, శివజ్యోతి వచ్చి మద్దతుగా నిలిచారు. ఎపిసోడ్ చివరకు వచ్చేసరికి రాహుల్ కాలికి గాయకావడం.. దీంతో ఆటకు విరామం ఇవ్వడం.. ఆ సమయంలో వితికా తుపాకిని తీసుకురావడంతో వరుణ్ సందేశ్ ఆమె వద్ద నుంచి లాక్కుని హెచ్చరించాడు. రాహుల్‌కు గాయమైందని చెబుతున్నా.. వినకుండా ఎందుకలా చేస్తున్నావంటూ ఫైర్ అయ్యాడు. ఇక బుధవారం నాటి ఎపిసోడ్లో మరింత హింస జరిగేట్టు కనిపిస్తోంది. మరి ఈ టాస్క్‌లో దొంగల ముఠా గెలుస్తోందో? నగరవాసులు గెలుస్తారో చూడాలి. -
బిగ్‌బాస్.. అందుకే వైల్డ్‌కార్డ్ ఎంట్రీనా?
బిగ్‌బాస్ మూడో సీజన్లో శ్రీముఖి స్ట్రాంగ్ కంటెస్టెంట్ అని అందరికీ తెలిసిందే. శ్రీముఖి తన స్ట్రాటజీతో ఆట ఆడే విధానం, అందర్నీ అంచనా వేయడం, అన్నింటికంటే ముఖ్యంగా ప్రేక్షకులను ఎంటర్టైన్ చేసే విధానానికి ఫాలోయింగ్ పెరుగుతూ ఉంది. అయితే శ్రీముఖికి ఎంత ఫాలోయింగ్ పెరుగుతుందో.. అంతే నెగెటివిటీ పెరగుతోంది. అయితే బిగ్‌బాస్ నిర్వాహకులు కూడా శ్రీముఖికే సపోర్ట్ చేస్తున్నారని ఆమెను వ్యతిరేకించేవారు ఆరోపణలు చేస్తున్నారు. ఆమెకు ఫేవర్‌గానే బిగ్‌బాస్ నడుచుకుంటోందనే రూమర్స్ వినిపిస్తున్నాయి. శ్రీముఖిని నిలువరించేందుకు వైల్డ్ కార్డ్ ఎంట్రీని హౌస్‌లోకి పంపించాలని కొందరు నెటిజన్లు కోరారు. ఒకప్పటి యాంకర్, హోస్ట్ అయిన శిల్పా చక్రవర్తిని హౌస్‌లోకి పంపడం వెనుక ఇలాంటి కారణమే ఉందని కొందరు కామెంట్స్ చేస్తున్నారు. ఇంట్లోకి వచ్చిన వెంటనే నామినేషన్ ప్రక్రియలో భాగంగా శ్రీముఖి పేరు చెప్పడం కూడా ఇదే కారణమై ఉంటుందని భావిస్తున్నారు. మరి మున్ముందు శిల్పా చక్రవర్తి, శ్రీముఖిలు స్నేహితులుగా ఉంటారా? శత్రువులుగా మారుతారా? అన్నది చూడాలి. హౌస్‌లోకి కొత్తగా వచ్చిన వ్యక్తికి కొంత ప్లస్, మరికొంత మైనస్ ఉండటం సహజమే. మరి శిల్పా చక్రవర్తి అందరితో కలిసిపోయి చివరివరకు నిలబడుతుందా? అన్నది చూడాలి. -
బిగ్‌బాస్.. నామినేషన్లో ఉన్నది ఎవరంటే?
అనుకున్నట్టే.. వైల్డ్ కార్డ్ ఎంట్రీలో శిల్పా చక్రవర్తి వచ్చింది. అయితే ఈ సారి డిఫరెంట్ స్టైల్లో ఈ ఎంట్రీ జరిగింది. ఇంటిసభ్యులందర్నీ ఇంటర్వ్యూ చేస్తూ.. నామినేషన్ ప్రక్రియను శిల్పా చక్రవర్తి పూర్తి చేసింది. ఇక దీంతో ఇంటి సభ్యుల మనస్తత్వం ఏంటో.. వారికి ఎవరంటే నచ్చదు.. ఇలా ప్రతీ విషయం శిల్పాకు తెలిసింది. కన్ఫెషన్ రూమ్‌కు వెళ్లిన హౌస్మేట్స్.. ఆమెను కనిపెట్టడానికి ప్రయత్నించినా తెలుసుకోలేకపోయారు. వైల్డ్‌కార్డ్ ఎంట్రీతోనే నామినేషన్ ప్రక్రియను జరిపించిన బిగ్‌బాస్.. ఇద్దరి చొప్పున ఐదు జంటలను కన్ఫెషన్ రూమ్‌కు పిలిచాడు. దీంట్లో భాగంగా.. మొదటగా అలీ-రవిలు వెళ్లారు. రాహుల్‌ను అలీ, మహేష్‌ను రవి నామినేట్ చేశారు. అనంతరం వెళ్లిన వితికా-పునర్నవిలు అలీ, రవిలను, శివజ్యోతి-హిమజలు మహేష్, రాహుల్‌ను, రాహుల్-మహేష్‌లు శ్రీముఖి,అలీను, బాబా భాస్కర్-శ్రీముఖిలు అలీ, రాహుల్‌ను నామినేట్ చేశారు. కెప్టెన్ అయిన వరుణ్ సందేశ్‌ను రెండు పేర్లను సూచించాలని కోరింది. దీంతో అలీ, రవిలను నామినేట్ చేశారు. ఈ నామినేషన్ ప్రక్రియ పూర్తైందని అనుకుంటూ లివింగ్ ఏరియాలో ఉన్న హౌస్మేట్స్ సర్ప్రైజ్ ఇచ్చేలా వైల్డ్ కార్డ్ ఎంట్రీలో శిల్పా చక్రవర్తి ఇంట్లోకి ప్రవేశించింది. అయితే తనను ముందుగానే గుర్తుపట్టేసిందని శివజ్యోతికి దండం పెట్టింది. శ్రీముఖి తనను గుర్తుపడుతుందని గొంతు మార్చి మాట్లాడనని చెప్పుకొచ్చింది. అయితే నామినేషన్ ప్రక్రియలో భాగంగా.. రెండు పేర్లను సూచించాలని శిల్పాను బిగ్‌బాస్ ఆదేశించాడు. ఇంతవరకు నామినేషన్ ఫేస్ చేయలేదని అలీని, స్ట్రాంగ్ కంటెస్టెంట్ అని శ్రీముఖిని నామినేట్ చేస్తున్నట్లు తెలిపింది. దీంతో రాహుల్, మహేష్, అలీ, రవి, శ్రీముఖి ఏడో వారానికి గానూ నామినేషన్లో ఉన్నట్లు బిగ్‌బాస్ ప్రకటించారు. మరి ఈ వారంలో ఇంటిని ఎవరు వీడనున్నారో చూడాలి. -
యాంకర్.. హోస్ట్‌గా అదరగొట్టే శిల్పా చక్రవర్తి
వైల్డ్ కార్డ్ ఎంట్రీ అన్నది బిగ్‌బాస్ హౌస్‌లో ఎప్పుడూ ప్రత్యేకమే.. మొదటి సీజన్లో నవదీప్, రెండో సీజన్లో పూజా రామచంద్రన్ ఇంట్లోకి ఎంట్రీ ఇచ్చి ప్రేక్షకులను ఎంటర్టైన్ చేశారు. ఇక మూడో సీజన్‌కు వచ్చేసరికి ఓ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇవ్వడమూ, వెళ్లిపోవడమూ జరిగిపోయింది. ట్రాన్స్ జెండర్ తమన్నా సింహాద్రి ఎంట్రీ ఇచ్చి.. సంచలన కామెంట్లు చేసి, హౌస్‌మేట్స్‌తో ఎప్పుడూ గొడవలు పెట్టుకుంటూ ఇంటి నుంచి వెళ్లిపోయింది. ఇక రెండో వైల్డ్‌కార్డ్ ఎంట్రీ ద్వారా శిల్పా చక్రవర్తి ఎంటర్ అయింది. మోడలింగ్ నుంచి టీవీ సీరియల్స్‌లో నటిస్తూ.. యాంకరింగ్ చేస్తూ ఫేమస్ అయింది. పలు సినీ కార్యక్రమాలకు హోస్ట్‌గా పాపులార్టీ సంపాదించింది. బెంగాలీ మాతృభాష అయినా.. తెలుగులో అనర్గళంగా మాట్లాడటం ఆమె ప్రత్యేకత. మరి బిగ్‌బాస్ హౌస్‌లో చివరకు వరకు నిలబడుతుందా? లేదా అన్నది చూడాలి. -
బిగ్‌బాస్ : వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఆమె ఎవరు..?
-
ఆమె ఎవరన్నది కనుక్కోలేక పోతున్నారా!
వైల్డ్ కార్డ్ ఎంట్రీ అన్నది బిగ్‌బాస్ హౌస్‌లో ఎప్పుడూ ప్రత్యేకమే.. మొదటి సీజన్లో నవదీప్, రెండో సీజన్లో పూజా రామచంద్రన్ ఇంట్లోకి ఎంట్రీ ఇచ్చి ప్రేక్షకులను ఎంటర్టైన్ చేశారు. ఇక మూడో సీజన్‌కు వచ్చేసరికి ఓ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇవ్వడమూ, వెళ్లిపోవడమూ జరిగిపోయింది. ట్రాన్స్ జెండర్ తమన్నా సింహాద్రి ఎంట్రీ ఇచ్చి.. సంచలన కామెంట్లు చేసి, హౌస్‌మేట్స్‌తో ఎప్పుడూ గొడవలు పెట్టుకుంటూ ఇంటి నుంచి వెళ్లిపోయింది. (బిగ్‌బాస్.. వైల్డ్‌కార్డ్ ఎంట్రీ ఎవరంటే?) ఇక మళ్లీ ఓ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇవ్వబోతోన్నట్లు తెలుస్తోంది. ఏడో వారంలో ఈమె హౌస్‌లోకి ఎంట్రీ ఇవ్వనుంది. సోషల్ మీడియాలో నడుస్తున్న ట్రెండ్ ప్రకారం.. యాంకర్, హోస్ట్‌గా ఫేమస్ అయిన శిల్పా చక్రవర్తి ఇంట్లోకి ప్రవేశించనున్నట్లు తెలుస్తోంది. ఇక ఇదే విషయమై.. హౌస్‌మేట్స్‌ను కన్ఫెషన్ రూమ్‌కు పిలిపించి ఆమెను గుర్తుపట్టేలా ఓ టాస్క్ ఇచ్చినట్టు తెలుస్తోంది. ఇక ఆ అజ్ఞాతంలో ఉన్న వ్యక్తి ఎవరన్నది హౌస్మేట్స్ గుర్తించలేకపోతున్నట్లు ప్రోమోలో తెలుస్తోంది. మరి నేటి ఎపిసోడ్లో ఇంటి సభ్యులకు ఆ వ్యక్తి దర్శనమివ్వనుందో లేదో తెలియాలంటే ఇంకొన్ని గంటలు ఆగాల్సిందే. -
బిగ్‌బాస్.. వైల్డ్‌కార్డ్ ఎంట్రీ ఎవరంటే?
బిగ్‌బాస్ హౌస్‌లో ఆరు వారాలు గడిచేందుకు వచ్చాయి. ఇంతలో ఐదు ఎలిమినేషన్లు, ఒక్క వైల్డ్‌కార్డ్ ఎంట్రీలు జరిగాయి. అయితే వైల్డ్కార్డ్ఎంట్రీ ఇచ్చిన తమన్నా సింహాద్రి.. మరుసటి వారంలో వెనుదిరిగి పోయింది. అలా స్పెషల్ ఎంట్రీ ఇచ్చిన కంటెస్టెంట్.. అనూహ్యంగా ఎలిమినేట్ కావడంతో మరో వ్యక్తిని హౌస్‌లోకి పంపుతారని అంతా భావించారు. దీనికి తగ్గట్లే గత వారంలో ఓ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఉంటుందని వార్తలు ప్రచారం అయ్యాయి. శ్రద్దా దాస్, ఈషా రెబ్బా లాంటి హీరోయిన్ల పేర్లు ఆ జాబితాలో వినిపించాయి. తీరా చూస్తే.. అవన్నీ వట్టి గాలి వార్తల్లానే మిగిలాయి. అయితే ఆరో వారంలో రమ్యకృష్ణ హోస్టింగ్.. నో ఎలిమినేషన్.. ఇలా ఎన్నో విశేషాలు జరుగుతున్న నేపథ్యంలో మరో ఆసక్తికర వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఒకప్పటి యాంకర్ శిల్పా చక్రవర్తి.. వైల్డ్‌కార్డ్ ఎంట్రీ ఇవ్వబోతోందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. మరి ఈమె హౌస్‌లోకి ఎప్పుడు ఎంట్రీ ఇస్తుందనేది తెలుసుకోవాలంటే ఇంకొన్ని గంటలు ఆగాల్సిందే. -
స్ట్రాంగ్‌గా ఉండాలి
ఏ ఆడపిల్లకైనా లైఫ్‌లో చాలా రోల్స్ ఉంటాయి. మొదట పేరెంట్స్‌తో ఉంటాం. తర్వాత పెళ్ళి, అత్తగారిల్లు, పిల్లలు, వాళ్ళ చదువులు. ఇలా డిఫరెంట్ రోల్స్ ప్లే చేయాల్సి వస్తుంది. చదువుకొని ఎదిగే కొద్దీ చాలా ఛాలెంజెస్ ఉంటాయి. మన కాళ్ళ మీద మనం నిలబడాలంటే ప్రొఫెషనల్‌గా పర్ఫెక్ట్గా ఉండాలి. ఆడపిల్ల బయటకు వస్తుందంటే రకరకాల మనుషులుంటారు. వాళ్ళందరిని బేరీజు వేసుకొంటూ ముందుకెళ్ళాలి. సోషల్‌గా స్ట్రాంగ్‌గా ఉండాలి. -
ఫుల్‌గా తినేది ఒక్కరోజే..
సీనియర్ యాంకర్స్‌లో ఒకరైన శిల్పాచక్రవర్తి... పెళ్లయి, ఇద్దరు పిల్లల తల్లి అని చెబితే ఠక్కున నమ్మాలంటే కష్టం అన్నంత చక్కని ఫిజిక్‌ని మెయిన్‌టెయిన్ చేస్తున్నారు. ఇప్పుడు తగినంత బరువుతో ఫిట్‌గా కనిపించే ఈ ‘శిల్ప’మ్ కూడా ఒకప్పుడు అధిక బరువు బాధితురాలే. తనను తాను స్లిమ్ అండ్ ట్రిమ్గా మలచుకున్న వైనం గురించి ఆమె చెప్పిన విశేషాలివి... పిల్లలతో మొదలు... ఓ రకంగా చెప్పాలంటే నా వ్యాయామం నా ఇద్దరు పిల్లల పనులతో తెల్లవారుజామునే మొదలవుతుందనాలి. వాళ్లను స్కూల్‌కి పంపేవరకూ ఇంట్లో ఉరుకులు పరుగులే. ఆ తర్వాత కాసేపు ఊపిరి పీల్చుకుని నన్ను నేను షేప్ అప్ చేసుకునే పనులపై దృష్టి పెడతాను. కార్డియోతో స్టార్ట్... మా ఇంటికి దగ్గర్లోనే ఉన్న ఫిట్‌బజ్ జిమ్‌కి ఉదయం 8 గంటల సమయంలో వెళతాను. అక్కడ మాలిని, అత్తర్లు నా ట్రైనర్స్. వ్యాయామం కార్డియోతో స్టార్ట్ చేస్తాను. ఒక రోజు 10నిమిషాలు కార్డియో తర్వాత వర్కవుట్ ఆ తర్వాత మళ్లీ కార్డియో మళ్లీ వర్కవుట్ అలా మార్చి మార్చి చేస్తుంటాను. ఒక్కో రోజు కేవలం వెయిట్ ట్రైనింగ్, ఒక్కోరోజు కేవలం లోయర్ బాడీకి మాత్రమే వర్కవుట్ ఉంటుంది. ఒక రోజు కార్డియో ప్లస్ ఆప్పర్బాడీ, ఒకరోజు కార్డియో ప్లస్ లోయర్ బాడీ... ఇలా నా వర్కవుట్ షెడ్యూల్ ఉంటుంది. అదే విధంగా స్టెప్పర్ వినియోగించి ఒక రోజు ఎరోబిక్స్ చేస్తాం. రోజూ ఒకటే కాకుండా 5 రోజులు 5 రకాల రొటీన్స్ ఉంటాయి. ఒక్కో రోజు సర్క్యూట్ ట్రైనింగ్ ఉంటుంది. దీనిలో భాగంగా ఒక్కరోజులో 15 రకాల వేరియేషన్స్ చేస్తాం. ఒక్కో వేరియేషన్ 20 రిపిటీషన్స్, 2 సెట్స్ చొప్పున చేస్తాను. సగటున రోజుకి గంటన్నర సమయం వర్కవుట్‌కి కేటాయిస్తాను. బ్రేక్‌ఫాస్ట్ భారీగానే... జిమ్‌కి వెళ్లడానికి ముందుగానే బిస్కట్స్, వాల్నట్స్ తిని వెళతాను. దీని వల్ల వ్యాయామ సమయంలో అవసరమైనంత ఎనర్జీ వస్తుంది. వర్కవుట్ నుంచి రాగానే గ్రీన్ టీ తాగుతాను. ఆ తర్వాత రెగ్యులర్ టిఫిన్ దోసె లేదా ఇడ్లీ అయితే చాలా మితంగా... తీసుకుంటాను. ఒక ఎగ్‌వైట్ కూడా ఇందులో భాగమే. మిల్క్–కార్న్‌ఫ్లేక్స్ కలిపి తీసుకుంటాను. జ్యూస్ లేదా ఫ్రూట్ తప్పకుండా తీసుకుంటాను. బ్రేక్‌ఫాస్ట్ మాత్రం కొంచెం హెవీగానే ఉంటుంది. మధ్యాహ్నం ఒక రోటీ, కాస్త ఎక్కువగా వెజ్ కర్రీ తింటాను. ఆదివారం మాత్రమే రైస్ లేదా రైస్‌తో చేసిన బిరియానీ లాంటివి తీసుకుంటాను. ఐస్‌క్రీమ్, బట్టర్ బ్రెడ్ వంటివి కూడా తీసుకుంటాను. డిన్నర్ టైమ్ 8 గంటలకు కాస్త అటూ ఇటూ. డిన్నర్లో లావురవ్వ ఉప్మా లేదా ఓట్స్ ఉప్మా వంటివి తింటాను. బటర్‌మిల్క్, వాటర్ మిలన్, యాపిల్, కోకోనట్ వాటర్... వంటివి రోజంతా సిప్ చేస్తూనే ఉంటాను. గ్రీన్ టీ కూడా. 3నెలలకు ఒకసారి వారం పాటు పూర్తిగా ద్రవపదార్ధాలే నా ఆహారం. ఇది టాక్సిన్స్‌ను పోగొట్టడానికి ఉపకరిస్తుంది. వెయిట్‌లాస్... ఫిట్ ప్లస్... డెలివరీ తర్వాత నా బరువు 82 కిలోలకు పెరిగింది. అయితే తగిన జాగ్రత్తలు తీసుకోవడం, వ్యాయామం వల్ల 60కి తగ్గాను. యోగా నాకు సెట్‌కాలేదు. బ్యాక్ వీక్ అందుకని చేయలేను. క్లాసికల్ డ్యాన్స్, వెస్ట్రన్ డ్యాన్స్ అంటే నాకు ఇష్టం బాగా ప్రవేశం కూడా ఉంది. వారంలో 3 రోజులు తప్పకుండా ఏదో ఒక డ్యాన్స్ చేస్తాను. సమన్వయం ,సత్యబాబు -
మహారుచులకు ఫిదా
పుట్టింది కోల్‌కతాలోనే అయినా, పెరిగింది మాత్రం భాగ్యనగరంలోనే. తెలుగు సంస్కృతితో మమేకమైన బెంగాలీ భామ శిల్పా చక్రవర్తి, తెలుగు అబ్బాయినే పెళ్లాడి, ఇక్కడే స్థిరపడింది. చిన్ననాటి నుంచి ఈ నగరంతో ముడివేసుకున్న అనుబంధాన్ని ఆమె ‘సిటీప్లస్’తో పంచుకుంది. బాల్యంలోని మధుర స్మృతులను నెమరువేసుకుంది. అవి ఆమె మాటల్లోనే.. మా అమ్మ, నాన్న ఇద్దరూ రైల్వే ఉద్యోగులు. మా నాన్నకు హైదరాబాద్ బదిలీ కావడంతో నేను నాలుగో క్లాస్ చదువుతున్నప్పుడు ఇక్కడకు వచ్చేశాం. మేం తార్నాకలో ఉండేవాళ్లం. నాకు అన్న ఉన్నాడు. నాకంటే ఐదేళ్లు పెద్ద. మా చదువులన్నీ రైల్వేకు సంబంధించిన విద్యాసంస్థల్లోనే సాగాయి. అమ్మ, నాన్న ఇద్దరూ ఉద్యోగాలకు వెళ్లిపోవడంతో తినిపించడం, స్కూలుకు, కాలేజీకి తీసుకువెళ్లడం సహా నా పనులన్నీ అన్నయ్యే చూసుకునే వాడు. స్కూలుకి కాలినడకనే వెళ్లేదాన్ని. తోవలో బళ్ల మీద అమ్మే జాంకాయులు, రేగుపళ్లు కొనుక్కుని తినేదాన్ని. కాలేజీకి బస్సులో వెళ్లే దాన్ని. అలాంటి రోజులు మళ్లీ రావు. పెద్ద ఫుడీని.. మా స్వస్థలం కోల్‌కతా. మేం బెంగాలీలం. ఇక్కడకు వచ్చిన కొత్తలో ఆహారం విషయుంలో కాస్త ఇబ్బందులు పడ్డాం. బెంగాలీ వంటకాలైన కచోడీ, పూరీ, స్వీట్లకు అలవాటు పడిన మేం ఇక్కడి రుచులకు అలవాటు పడటానికి కొంత టైమ్ పట్టింది. నిజానికి నేను పెద్ద ఫుడీని. అప్పట్లో సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ దగ్గర స్వాతి హోటల్లో వడలు చాలా టేస్టీగా ఉండేవి. చట్నీస్ రెస్టారెంట్లో ఆచారి ఇడ్లీ, స్టీమ్డ్ దోశ కూడా ఇష్టంగా తింటాను. ఇంటర్నెట్లో వెదికి మరీ కొత్త కొత్త రుచులతో ప్రయోగాలు చేస్తుంటా. చిన్నప్పటి నుంచి సిటీతో మమేకం కావడంతో ఇక్కడి బిర్యానీకి, రంజాన్ సీజన్లో హలీంకు బాగా అలవాటు పడిపోయూ. ఈ ప్రాంతంతో మమేకమైన నేను పక్కా తెలుగు అబ్బాయిని పెళ్లాడాను. స్కూల్లో చదువుకునే రోజుల్లో నేనే లీడర్‌గా ఉండేదాన్ని. కల్చరల్ షోస్, స్టేజ్ షోస్‌లో పాల్గొనేదాన్ని. చదువులో మంచి మార్కులే వచ్చేవి. ఈసీఐఎల్ క్రాస్‌రోడ్స్‌లోని ఓయుూ అఫిలియేటెడ్ సాయి సుధీర్ కాలేజీ నుంచి ఎంబీఏ (హెచ్ఆర్) పూర్తిచేశాను. చదువుకునే రోజుల నుంచి నాకు చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారు. వాళ్లందరితో ఇప్పటికీ టచ్‌లో ఉంటుంటాను. శిల్పారామం చాలా ఇష్టం.. సిటీలో నాకు శిల్పారామం అంటే చాలా ఇష్టం. అక్కడి కళాకృతులు, ఆభరణాలు నన్నెంతో ఆకట్టుకుంటాయి. నేను తరచూ అక్కడకు వెళుతుంటాను. చిన్నప్పుడు ఒకసారి ఫ్యామిలీ అంతా యాదగిరిగుట్టకు వెళ్లాం. చాలా అద్భుతమైన ప్రదేశం. మా నాన్న ఎక్కువగా పూజలు చేస్తుంటారు. సికింద్రాబాద్‌లోని కీస్ హైస్కూల్లో మా బెంగాలీ అసోసియేషన్ వాళ్లు ఏటా దసరా వేడుకలను ఘనంగా జరుపుతారు. ఆ ఉత్సవాల్లో ఉత్సాహంగా పాల్గొంటుంటాను. ఇక డ్యాన్స్ నా ఫేవరేట్ హాబీ. కథక్ డ్యాన్స్‌లో డిప్లొమా కూడా చేశా. లలితకళాతోరణంలో తొలి ప్రదర్శన ఇచ్చా. హైదరాబాదీలు మంచి కళాభిమానులు. ఇక్కడి ప్రజలు నాకు ఇచ్చిన ప్రోత్సాహం మరువలేనిది. నెల్లాళ్ల కిందటే అమెరికా వెళ్లి, ‘ఆటా’ వేడుకల్లో కథక్ ప్రదర్శన ఇచ్చా. హైదరాబాద్ సిటీ అంటే నాకు చాలా ఇష్టం. ఇక్కడి చారిత్రక ప్రదేశాలైన చార్మినార్, గోల్కొండ వంటి వాటి పరిరక్షణ కోసం ప్రభుత్వం చర్యలు తీసుకుంటే బాగుంటుంది. అవకాశం ఉంటే ఈ దిశగా చేపట్టే ప్రచారంలో పాల్గొనేందుకూ నేను సిద్ధం.