నామినేషన్ ప్రక్రియ అంటే ఇంటి సభ్యుల గుండెల్లో రైళ్లు పరిగెడుతుంటాయి. సోమవారం వచ్చిందంటే ఎవరిని నామినేట్ చేయాలి? అంటూ ఆలోచించుకుంటూ ఉంటారు. హౌస్‌లో ఇప్పటికీ యాభై రోజులు పూర్తయ్యాయని, ఇకపై కఠినతరంగా ఉంటుందని ఇంటి సభ్యులను బిగ్‌బాస్ హెచ్చరించాడు. నామినేషన్ విషయంలో కూడా సరైన కారణాలను చెప్పాలని సూచించాడు.
ఇక నామినేషన్ ప్రక్రియలో భాగంగా ఇంటి సభ్యులను రెండు టీమ్స్‌గా విడగొట్టాడు. బాబా భాస్కర్ కెప్టెన్ అయిన కారణంగా ఏ గ్రూప్‌లోనూ సభ్యుడు కాదంటూ తెలిపాడు. ఓ టీమ్‌లోని సభ్యుడు ఇంకో టీమ్‌లోని ఇద్దరు కంటెస్టెంట్లను నామినేట్ చేయాల్సి ఉంటుందని తెలిపాడు. వరుణ్, వితికా, రాహుల్, పునర్నవి, శిల్పాలను ఓ టీమ్ మేట్స్‌గా.. శ్రీముఖి, హిమజ, రవి, శివజ్యోతిలను మరో టీమ్స్‌గా విభజించాడు. ఈ నామినేషన్స్‌లో వైల్డ్ కార్డ్‌ఎంట్రీ ఇచ్చిన శిల్పా చక్రవర్తినే అందరూ టార్గెట్ చేసినట్టు కనిపిస్తోంది. అయితే ఈసారి రాహుల్‌ను శ్రీముఖి నామినేట్ చేయకపోవడం విశేషం. కానీ రాహుల్ మాత్రం ఈసారి శ్రీముఖిని నామినేట్ చేశాడు. మొత్తంగా ఎనిమిదో వారంలో ఇంటి నుంచి వెళ్లిపోయేందుకు శిల్పా చక్రవర్తి, హిమజ, రవి, శ్రీముఖి, పునర్నవి, మహేష్ నామినేట్ అయ్యారు.
కెప్టెన్ అయిన బాబా భాస్కర్‌కు ఒకర్ని సేవ్ చేసే అవకాశాన్ని బిగ్‌బాస్ ఇచ్చాడు. అయితే అందరూ మహేష్ లేదా శ్రీముఖిని సేవ్ చేస్తారని భావించినా.. రవిని సేవ్ చేస్తున్నట్లు తెలిపాడు. దీంతో నామినేషన్ ప్రక్రియ పూర్తయిందని ఈ వారం శిల్పా చక్రవర్తి, హిమజ, శ్రీముఖి, పునర్నవి, మహేష్‌లు నామినేట్ అయినట్లు ప్రకటించాడు. అనంతరం మహేష్, పునర్నవిలు నామినేషన్ గురించి ముచ్చటించుకుంటూ ఉన్నారు. వరుణ్, వితికాలకు శ్రీముఖి అంటే నచ్చదని.. అయితే ఆమెను మాత్రం నామినేట్ చేయరని.. తనను చేశారని పునర్నవితో మహేష్ చెప్పుకొచ్చాడు. బాబా భాస్కర్ తనను సేవ్ చేయలేదని శ్రీముఖి బాధపడినట్టు కనిపిస్తోంది. ఇదే విషయమై హిమజ, శ్రీముఖిలు ముచ్చటించుకున్నారు. మహేష్‌ను మాత్రం సేవ్ చేయరని తాను అనుకున్నట్లు హిమజ తెలిపింది. ఈ వారం టాస్క్‌లో బిగ్‌బాస్ హౌస్ దెయ్యాలకోటగా మారనున్నట్లు తెలుస్తోంది. మరి అలా ఎందుకు మారాల్సి వచ్చిందో తెలియాలంటే బిగ్‌బాస్ చూడాల్సిందే.
Comments
Please login to add a commentAdd a comment