బిగ్‌బాస్‌.. నామినేషన్‌లో ఉన్నది ఎవరంటే? | Bigg Boss 3 Telugu Elimination Process For Seventh Week | Sakshi
Sakshi News home page

బిగ్‌బాస్‌.. నామినేషన్‌లో ఉన్నది ఎవరంటే?

Published Mon, Sep 2 2019 10:58 PM | Last Updated on Mon, Sep 2 2019 10:58 PM

Bigg Boss 3 Telugu Elimination Process For Seventh Week - Sakshi

అనుకున్నట్టే.. వైల్డ్‌ కార్డ్‌ ఎంట్రీలో శిల్పా చక్రవర్తి వచ్చింది. అయితే ఈ సారి డిఫరెంట్‌ స్టైల్లో ఈ ఎంట్రీ జరిగింది. ఇంటిసభ్యులందర్నీ ఇంటర్వ్యూ చేస్తూ.. నామినేషన్‌ ప్రక్రియను శిల్పా చక్రవర్తి పూర్తి చేసింది. ఇక దీంతో ఇంటి సభ్యుల మనస్తత్వం ఏంటో.. వారికి ఎవరంటే నచ్చదు.. ఇలా ప్రతీ విషయం శిల్పాకు తెలిసింది. కన్ఫెషన్‌ రూమ్‌కు వెళ్లిన హౌస్‌మేట్స్‌.. ఆమెను కనిపెట్టడానికి ప్రయత్నించినా తెలుసుకోలేకపోయారు.

వైల్డ్‌కార్డ్‌ ఎంట్రీతోనే నామినేషన్‌ ప్రక్రియను జరిపించిన బిగ్‌బాస్‌.. ఇద్దరి చొప్పున ఐదు జంటలను కన్ఫెషన్‌ రూమ్‌కు పిలిచాడు. దీంట్లో భాగంగా.. మొదటగా అలీ-రవిలు వెళ్లారు. రాహుల్‌ను అలీ, మహేష్‌ను రవి నామినేట్‌ చేశారు. అనంతరం వెళ్లిన వితికా-పునర్నవిలు అలీ, రవిలను, శివజ్యోతి-హిమజలు మహేష్‌, రాహుల్‌ను, రాహుల్‌-మహేష్‌లు శ్రీముఖి,అలీను, బాబా భాస్కర్‌-శ్రీముఖిలు అలీ, రాహుల్‌ను నామినేట్‌ చేశారు. కెప్టెన్‌ అయిన వరుణ్‌ సందేశ్‌ను రెండు పేర్లను సూచించాలని కోరింది. దీంతో అలీ, రవిలను నామినేట్‌ చేశారు.

ఈ నామినేషన్‌ ప్రక్రియ పూర్తైందని అనుకుంటూ లివింగ్‌ ఏరియాలో ఉన్న హౌస్‌మేట్స్‌ సర్‌ప్రైజ్‌ ఇచ్చేలా వైల్డ్‌ కార్డ్‌ ఎంట్రీలో శిల్పా చక్రవర్తి ఇంట్లోకి ప్రవేశించింది. అయితే తనను ముందుగానే గుర్తుపట్టేసిందని శివజ్యోతికి దండం పెట్టింది. శ్రీముఖి తనను గుర్తుపడుతుందని గొంతు మార్చి మాట్లాడనని చెప్పుకొచ్చింది. అయితే నామినేషన్‌ ప్రక్రియలో భాగంగా.. రెండు పేర్లను సూచించాలని శిల్పాను బిగ్‌బాస్‌ ఆదేశించాడు. ఇంతవరకు నామినేషన్‌ ఫేస్‌ చేయలేదని అలీని, స్ట్రాంగ్‌ కంటెస్టెంట్‌ అని శ్రీముఖిని నామినేట్‌ చేస్తున్నట్లు తెలిపింది. దీంతో రాహుల్‌, మహేష్‌, అలీ, రవి, శ్రీముఖి ఏడో వారానికి గానూ నామినేషన్‌లో ఉన్నట్లు బిగ్‌బాస్‌ ప్రకటించారు. మరి ఈ వారంలో ఇంటిని ఎవరు వీడనున్నారో చూడాలి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement