Suma
-
రాకీ అవెన్యూస్ వివాదంపై వివరణ ఇచ్చిన యాంకర్ సుమ
రాజమండ్రిలో రాకీ అవెన్యూస్ ప్రైవేట్ లిమిటెడ్ అనే రియల్ ఎస్టేట్ సంస్థ బోర్డు తిప్పేయడంతో చాలామంది రోడ్డున పడ్డారు. మధ్య తరగతి కుటుంబాల సొంతింటి కల నెరవేరుస్తామని చెప్పి తమ నుంచి లక్షల్లో డబ్బు తీసుకుని ఆ సంస్థ మోసం చేసిందని వారు ఆరోపించారు. ఆ సంస్థను ఒక యాడ్ ద్వారా సుమతో పాటు ఆమె భర్త, రాజీవ్ కనకాల ప్రమోట్ చేయడంతో తామందరం పెట్టుబడి పెట్టామని వారు తెలిపారు. దీంతో సుమ కూడా వివాదంలో చిక్కుకున్నారు. తాజాగా యాంకర్ సుమ సోషల్‌మీడియా ద్వారా వివరణ ఇచ్చారు.'రాకీ అవెన్యూస్కు సంబంధించిన ఒక యాడ్‌లో నేను గతంలో నటించాను. నా వృత్తిలో భాగంగా 2016-2018 వరకు మాత్రమే వారితో ఒప్పందం ఉంది. ఆపై ఆ ప్రకటనలు రద్దు చేయబడ్డాయి. ఈ ప్రకటనలు ఇప్పుడు అనధికారమైనవి అని నేను స్పష్టం చేయాలనుకుంటున్నాను. పైన పేర్కొన్న వ్యవధి తర్వాత నేను ఏ సందర్భంలోనూ రాకీ అవెన్యూస్కు సంబంధించిన యాడ్‌లో కనిపించలేదు. అయితే, కొంత కాలం తర్వాత పాత ప్రకటనలు సోషల్ మీడియాలో ప్రసారం అవుతున్నాయని నా దృష్టికి వచ్చింది. ఇటీవలి కాలంలో నేను రాకీ అవెన్యూల ఆస్తుల కొనుగోలుదారుల నుంచి కొన్ని లీగల్ నోటీసులను అందుకున్నాను. ఆపై వారి నోటీసులకు నేను సమాధానం ఇవ్వడం కూడా జరిగింది. ఈ క్రమంలో రాకీ అవెన్యూలకు పంపిన లీగల్ నోటీసులో కొనుగోలుదారుల జాబితాను కూడా పరిశీలించమని వారిని కోరాను. నేను కూడా ఈ సమస్యను పరిష్కరించేందకు చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నాను. తప్పుడు సమాచారాన్ని అరికట్టండి. అధికారిక ఛానెల్‌ల నుంచి వచ్చే ఏదైనా ప్రకటనలు, ప్రమోషన్లు, వీడియోలను ధృవీకరించమని నేను మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాను. ధృవీకరించబడిన సమాచారాన్ని మాత్రమే ఇతరులతో పంచుకోవాలని నేను ప్రతి ఒక్కరికీ విజ్ఞప్తి చేస్తున్నాను.' అని సుమ తెలిపారు. View this post on Instagram A post shared by Suma Kanakala (@kanakalasuma) -
వివాదంలో చిక్కుకున్న యాంకర్ సుమ.. ఏమైందంటే?
యాంకర్ సుమ పేరు చెప్పగానే చలాకీ మాటలు, స్పాంటేనియస్ పంచులు గుర్తొస్తాయి. టీవీ షోలు, ప్రీ రిలీజ్ ఈవెంట్స్, మూవీ ఇంటర్వ్యూలు ఇలా ఒకటేమిటి ఊపిరి సలపనంత బిజీగా ఉండే ఈమె ఆచితూచి మాట్లాడుతూ ఉంటుంది. వివాదాలకు పూర్తిగా దూరంగా ఉంటుంది. కానీ ఇప్పుడు ఊహించని కాంట్రవర్సీలో చిక్కుకుంది. సుమ చెప్పడం వల్లే తాము లక్షల రూపాయలు పోగొట్టుకున్నామని కొందరు అంటున్నారు.ఇంతకీ అసలేమైంది?రాజమండ్రిలో రాకీ అవెన్యూస్ ప్రైవేట్ లిమిటెడ్ అనే రియల్ ఎస్టేట్ సంస్థ.. మధ్య తరగతి కుటుంబాల సొంతింటి కల నెరవేరుస్తామని చెప్పింది. అపార్ట్మెంట్స్ కట్టి ఫ్లాట్స్ ఇస్తామని చెప్పి ప్రచారం చేసింది. ఈ క్రమంలోనే పలువురు ప్రజలు ఇందులో పెట్టుబడులు పెట్టారు. అలా రూ.88 కోట్ల మొత్తంతో సంస్థ బోర్డు తిప్పేసింది. దీంతో తమకు న్యాయం చేయాలని బాధితులు ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు.(ఇదీ చదవండి: నమ్మించి మోసం చేసిన ప్రముఖ సీరియల్ నటి!)'రాకీ అవెన్యూస్ కట్టిన ఫేజ్-1 బిల్డింగ్స్ చూశామని, ఫేజ్-2 త్వరలో కడతామని సుమతో ప్రచారం చేయించడం వల్ల ఈ సంస్థలో ఇన్వెస్ట్ చేసేందుకు ముందుకొచ్చాం. నేను త్రీ బెడ్రూమ్ ఫ్లాట్స్ నాలుగు తీసుకుని ఒక్కో దానికి రూ.25 లక్షలు కట్టాను. ఇప్పుడు మోసపోయామని' ఓ బాధితుడు మీడియాతో తన ఆవేదన వ్యక్తం చేశాడు.ఇలా రియల్ ఎస్టేట్ సంస్థ ప్లేట్ ఫిరాయించడంతో యాంకర్ సుమపై పలువురు విమర్శలు చేస్తున్నారు. ఈ యాడ్‌లో సుమతో పాటు ఆమె భర్త, నటుడు రాజీవ్ కనకాల కూడా నటించారు. ఇప్పుడు కొందరు బాధితులు.. సుమ ఈ విషయంపై స్పందించాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ వివాదంలో తర్వాత ఏం జరుగుతుందనేది చూడాలి?(ఇదీ చదవండి: వయనాడ్ బాధితులకు ప్రభాస్ భారీ విరాళం.. ఎన్ని కోట్లంటే?) -
ఆ యాంకర్లు భ్రష్టు పట్టిస్తున్నారు.. యాంకర్ వింధ్య షాకింగ్ కామెంట్స్
యాంకర్ అనే పేరు చెప్పగానే తెలుగు వాళ్లకు సుమ గుర్తొస్తుంది. ఎందుకంటే దాదాపు 20 ఏళ్ల నుంచి యాంకరింగ్ ఇండస్ట్రీలో తనదైన మార్క్ సృష్టించింది. ప్రస్తుత జనరేషన్లో చాలామందిని ఈమెని స్ఫూర్తిగా తీసుకుని ఈ ఫీల్డ్‌లోకి వస్తున్నారని చెప్పొచ్చు. అలా వచ్చిన అమ్మాయే వింధ్య విశాఖ. షోలు, ప్రీ రిలీజ్ ఈవెంట్స్‌తో పాటు ఐపీఎల్‌లోనూ తెలుగు కామెంటరీతో ఈమె చాలా గుర్తింపు తెచ్చుకుంది. అలాంటిది ఇప్పుడు తోటి యాంకర్స్‌పై షాకింగ్ కామెంట్స్ చేసింది.(ఇదీ చదవండి: చిరు, పవన్ సినిమాల వల్ల అన్యాయం.. ప్రముఖ నటుడు ఆవేదన)'సుమక్క అంటే నాకు చాలా ఇష్టం. ఆమెని కలిసినప్పుడల్లా.. మాకు కొన్ని షోలు విడిచిపెట్టొచ్చు కదా అని ఫన్నీగా సతాయిస్తుంటాం. సుమక్క విషయానికొస్తే ఆమె టైమింగ్ సూపర్. ఉదయభాను ఇన్నేళ్ల నుంచి యాంకరింగ్ చేస్తున్నారు. గ్లామర్, లుక్స్ మాత్రం ఫెర్ఫెక్ట్గా మెంటైన్ చేస్తున్నారు. ఝాన్సీ గారికి సమాజం పట్ల నాలెడ్జ్ చాలా ఉంది. ఆమెతో కాసేపు మాట్లాడితే చాలా విషయాలు నేర్చుకోవచ్చు''ఇంకొందరు యాంకర్స్ ఉన్నారు. తెలుగు సరిగ్గా మాట్లాడలేరు. ఓ రకంగా చెప్పాలంటే వాళ్లు యాంకరింగ్‌ని భ్రష్టు పట్టిస్తున్నారు. కొన్ని షోల్లో బూతులని, డబుల్ మీనింగ్ కామెడీని వాళ్లు జనాలకు అలవాటు చేస్తున్నారా అనిపిస్తుంది' అని యాంకర్ వింధ్య చెప్పుకొచ్చింది. ఈమె చెప్పిన దానిబట్టి చూస్తుంటే 'జబర్దస్త్' షో, అందులోని యాంకర్స్ గురించే సెటైరికల్ కామెంట్స్ చేసిందా అనిపిస్తోంది.(ఇదీ చదవండి: వీడియో: గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న యంగ్ హీరోయిన్) -
యాంకర్ సుమ సాయం.. ఎమోషనల్ అయిన 'బిగ్ బాస్' సోహైల్
బిగ్ బాస్ ఫేమ్ సయ్యద్ సోహైల్ హీరోగా శ్రీ కోనేటి తెరకెక్కించిన చిత్రం 'బూట్ కట్ బాలరాజు'. గ్లోబల్ ఫిలిమ్స్ & కథ వేరుంటాది బ్యానర్స్‌పై నిర్మాతగా ఈ చిత్రాన్ని సోహైల్ నిర్మిస్తున్నాడు. ఈ చిత్రంలో మేఘ లేఖ హీరోయిన్గా నటిస్తుండగా.. సునీల్, సిరి హన్మంత్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. వినోదాత్మకంగా సాగే ఓ ఆసక్తికర కథాంశంతో రూపొందిన ఈ చిత్రం ఫిబ్రవరి 2న విడుదల కానుంది. ఈ చిత్రానికి భీమ్స్ సిసిరోలియో సంగీతం అందించారు. ఇందులోని పాటలకు కూడా మంచి గుర్తింపు దక్కింది. 'బూట్ కట్ బాలరాజు' చిత్రానికి నిర్మాతగా మారిన సయ్యద్ సోహైల్ ఇప్పటికే ప్రమోషన్స్ కార్యక్రమాలు ప్రారంభించాడు. సినిమాను ప్రజల్లోకి తీసుకుపోవాలంటే పలు ఈవెంట్స్‌తో ప్రమోట్ చేసుకోవాలి. అప్పుడే ప్రేక్షకులకు రీచ్ అవుతుంది. ఇలాంటి వేడుకలకు భారీగానే ఖర్చు కూడా అవుతుంది. ముఖ్యంగా ఇలాంటి కార్యక్రమాల్లో పాల్గొనే యాంకర్‌కు కూడా అధిక మొత్తంలో చెల్లించుకోవాల్సి ఉంటుంది. ఈ విషయంపై రీసెంట్గా సోహైల్ పలు వ్యాఖ్యలు చేశాడు. 'బూట్ కట్ బాలరాజు' చిత్రం ఫిబ్రవరి 2న విడుదల కానున్నడంతో ప్రీ రిలీజ్ ఈవెంట్ ప్లాన్ చేశామని అందులో యాంకర్‌గా సుమ ఉంటే బాగుంటుందని అనుకున్నట్లు సోహైల్ ఇలా చెప్పాడు.. 'సుమ అక్కతో మాట్లాడాలని మేనేజర్‌కు కాల్ చేశాను. ఆయనతో మాట్లాడుతూ ఈవెంట్ కోసం ఎక్కువ డబ్బులు ఇవ్వలేను అని కొంచెం తగ్గించాలని కోరాను. దీంతో సుమ గారితో మాట్లాడి చెబుతానని ఆయన తెలిపాడు. కానీ కొంత సమయం తర్వాత సుమ అక్క నుంచి కాల్ వచ్చింది. అక్కా.. ఈ కార్యక్రమం కోసం నేను తక్కువ డబ్బు ఇద్దాం అనుకుంటున్నాను. ఈ సినిమాకు నేనే ప్రొడ్యూసర్, అంత డబ్బు నా వద్ద లేదు. ఈ సినిమా కోసం చాలా కష్టపడుతున్నాను అని చెప్పాను. దీంతో వెంటనే నీ దగ్గర డబ్బు తీసుకోను.. ఉచితంగానే ఈవెంట్ చేస్తాను. లైఫ్‌లో ఇంత ఎదిగిన తర్వాత కూడా మీలాంటి వాళ్లకు సాయం చేయలేకపోతే ఎందుకు.. తప్పకుండా 'బూట్ కట్ బాలరాజు' ప్రీ రిలీజ్ ఈవెంట్లో పాల్గొంటానని సుమ చెప్పినట్లు సోహైల్ ఎమోషనల్ అయ్యాడు. -
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సుమ, బ్రహ్మానందం, సునీత (ఫోటోలు)
-
యాంకర్ సుమ గొప్ప మనసు.. వారి కోసం ఆర్థిక సాయం!
టాలీవుడ్లో యాంకర్ సుమ పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు. ఈవెంట్ ఏదైనా సరే సుమక్క లేకపోతే ఏదో కాస్తా తక్కువైనట్లు అనిపిస్తుంది. అంతలా తన మాటలతో మాయ చేసి ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. వేదికపై గలగల మాట్లాడే యాంకర్ సుమ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. రెండున్నర దశాబ్దాలుగా బుల్లితెరపై ప్రేక్షకులను ఇప్పటికీ అలరిస్తూనే ఉన్నారు. అయితే సుమ యాంకరింగ్‌తో పాటు సమాజసేవలో తనవంతు పాత్ర పోషిస్తున్నారు. ఫెస్టివల్ ఫర్ జాయ్ సంస్థ పేరుతో ఆమె సేవలందిస్తున్నారు. ఏదైనా పండుగ వచ్చిందంటే తన వంతు సహకారంతో సేవ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. తాజాగా క్రిస్మస్ సందర్భంగా ఫిల్మ్ జర్నలిస్ట్స్ అసోసియేషన్‌కు రూ.5 లక్షల చెక్‌ను అందజేసింది. ఉత్తర అమెరికా తెలుగు సంఘం(నాట్స్) సహకారంతో ఫిల్మ్ జర్నలిస్ట్స్ ఇన్సూరెన్స్ ఫండ్‌కు సాయం అందజేసినట్లు సుమ వెల్లడించారు. ఈ విషయంలో నాట్స్ సహకారం గొప్పదని సుమ తెలిపారు. కాగా.. సుమ, రాజీవ్ కనకాల కుమారుడు రోషన్ హీరోగా ఎంట్రీ ఇస్తున్నారు. బబుల్ గమ్ అనే చిత్రం ద్వారా ఇండస్ట్రీలో అడుగుపెడుతున్నారు. ఈ సినిమాలో మానస చౌదరి హీరోయిన్గా కనిపించనుంది. ఈ చిత్రం డిసెంబర్ 29న థియేటర్లలో సందడి చేయనుంది. A heartfelt thank you to @follownatsworld for their generous 5 Lakh donation to the @FilmJournalists through @ItsSumaKanakala @FestivalsforJoy Special appreciation to #SreedharAppasani Garu, #ArunaGanti, #BapuNuthi , #PrashanthPinnamaneni & #RajAllada garu, #NATS Board of… pic.twitter.com/FJo1Bzzx57 — Telugu Film Journalists Association (@FilmJournalists) December 25, 2023 -
మళ్లీ టంగ్ స్లిప్ అయిన సుమ.. ఈసారి అలా దొరికిపోయిందిగా!
బాలీవుడ్ హీరో రణ్‌బీర్ కపూర్, నేషనల్ క్రష్ రష్మిక మందన్నా జంటగా నటించిన చిత్రం యానిమల్. ఈ చిత్రాన్ని అర్జున్ రెడ్డి ఫేమ్ సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కించారు. ఇప్పటికే ఈ మూవీ ట్రైలర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. ప్రస్తుతం ట్రైలర్‌ను యూట్యూబ్‌ను షేక్ చేస్తోంది. ఈ ట్రైలర్‌పై సినీ ప్రముఖులు సైతం ప్రశంసలు కురిపించారు. దీంతో ఈ మూవీపై అభిమానుల్లో భారీ అంచనాలు పెంచేశాయి. తాజాగా ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను హైదరాబాద్‌లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి టాలీవుడ్ ప్రిన్స్ మహేశ్ బాబు, దర్శకధీరుడు రాజమౌళి ప్రత్యేక అతిథులుగా హాజరయ్యారు. అయితే ఈవెంట్‌కు యాంకర్‌గా సుమ వ్యవహరించారు. తన మాటలు, కామెడీ ఆడియన్స్‌లో జోరు తెప్పించే యాంకర్ సుమ ఎంతో యాక్టివ్‌గా ఉంటోంది. అలాగే స్టేజీపై చాలా సందర్భాల్లో సుమ టంగ్ స్లిప్ అయిన సందర్భాలు కూడా ఉన్నాయి. తాజాగా జరిగిన యానిమల్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో మళ్లీ అదే సీన్ రిపీట్ అయింది. ఈసారి యాంకర్ సుమ ఎలా దొరికిపోయిందో మీరు చూసేయండి. ప్రీ రిలీజ్ ఈవెంట్లో వేదికపై ఉన్న రష్మికకు సుమ ఓ ఆసక్తికర ప్రశ్న వేసింది. మహేశ్ బాబు సర్కారు వారి పాట చిత్రంలోని ఓ సాంగ్‌ను పాడాలని కోరింది. అయితే మహేశ్, రష్మిక జంటగా నటించిన చిత్రం సరిలేరు నీకెవ్వరు. ఈ చిత్రంలోని 'అబ్బబ్బా అబ్బాయి ఎంత ముద్దుగున్నాడే'.. అనే సాంగ్‌లో 'హీజ్ సో క్యూట్.. హీజ్ సో స్వీట్.. హీజ్ సో హ్యాండ్సమ్' అంటూ రష్మిక డ్యూయేట్ పాడుతుంది. ఈ సాంగ్ అప్పట్లో మంచి క్రేజ్ దక్కించుకుంది. అయితే యాంకర్ సుమ మాత్రం సర్కారు వారిపాటలోని ఈ పాటను పాడమంటూ రష్మికను అడిగింది. అయితే దీనిపై నెటిజన్స్ సుమక్కను ట్రోల్ చేస్తున్నారు. ఎందుకంటే ఈ పాట సరిలేరు నీకెవ్వరు చిత్రంలోనిది కావడంతో నెటిజన్స్ కామెంట్స్ పెడుతున్నారు. అయితే హడావుడిలో సరిలేరు నీకెవ్వరు బదులుగా సర్కారు వారి పాట అనేసి దొరికిపోయింది. ఇటీవలే కన్నడ నటుడు రక్షిత్ శెట్టి సప్త సాగరాలు దాటి సైడ్ బి ఇంటర్వ్యూలో సుమకు ఇలాంటి అనుభవమే ఎదురైంది. రక్షిత్ శెట్టి గురించి ఏ మాత్రం తెలుసుకోకుండా ప్రశ్నలు వేసి దొరికిపోయింది సుమ. అయితే పెద్ద ఈవెంట్ కావడంతో అలా పొరపాటుగా అనేసి ఉంటుందని కొందరు కామెంట్స్ చేస్తున్నారు. -
భర్తకు స్పెషల్‌గా విష్ చేసిన సుమ.. సోషల్ మీడియాలో వైరల్!
టాలీవుడ్లో యాంకర్ అనగానే అందరికీ ఠక్కున గుర్తొచ్చే పేరు ఆమెనే. ఏ ఈవెంట్ జరిగినా సరే తన మాటలతో మాయ చేసి ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. వేదికపై గలగల మాట్లాడే యాంకర్ సుమ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. పుట్టింది కేరళ అయినా.. తెలుగబ్బాయి రాజీవ్ కనకాలను పెళ్లి చేసుకుని తెలుగింటి కోడలిగా మారిపోయింది. రెండున్నర దశాబ్దాలుగా బుల్లితెరపై ప్రేక్షకులను ఇప్పటికీ అలరిస్తూనే ఉన్నారు. అయితే తాజాగా తన భర్త బర్త్ డే సందర్భంగా ఇన్‌స్టాలో ఓ వీడియోను పోస్ట్ చేసింది. తన భర్తకు పుట్టిన రోజు శుభాకాక్షంలు చెబుతూ పోస్ట్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. సుమ తన ఇన్‌స్టాలో రాస్తూ.. 'నా ప్రియమైన భర్తకు పుట్టినరోజు శుభాకాంక్షలు. మీరు లేకుండా నా వృత్తిని కొనసాగించడం కష్టం. మీరు ఎల్లప్పుడూ నాకు మద్దతుగా ఉంటూ ప్రోత్సహించారు. లవ్ యూ రాజీవ్.' అంటూ లవ్ సింబల్ ఎమోజీలను పంచుకుంది. ఇది చూసిన ఆడియన్స్ సైతం రాజీవ్ కనకాలకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతున్నారు. కాగా.. సుమ, రాజీవ్ కనకాల కుమారుడు రోషన్ కనకాల 'బబుల్గమ్' చిత్రంతో హీరోగా రాబోతున్న సంగతి తెలిసిందే. View this post on Instagram A post shared by Suma Kanakala (@kanakalasuma) -
మెట్లపై నిద్రపోయేది.. సుమ సీక్రెట్ బయటపెట్టిన మరో యాంకర్!
యాంకర్ సుమ కన్నీళ్లు పెట్టుకుంది. సాధారణంగా ఈవెంట్, షో ఏదైనా సరే తన మాటలతో అలరించే సుమ.. ఆ విషయం మళ్లీ గుర్తొచ్చేసరికి ఎమోషనల్ అయింది. అలానే సుమ గురించి ఎవరికీ తెలియని ఓ విషయాన్ని ప్రముఖ లేడీ యాంకర్ బయటపెట్టింది. ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. (ఇదీ చదవండి: Bigg Boss 7: రైతుబిడ్డకు ఆ బ్యాడ్ న్యూస్ చెప్పిన తండ్రి!) ఇంతకీ ఏంటి విషయం? దీపావళి దగ్గరకొచ్చేసింది. దీంతో తెలుగు ఛానెల్స్ స్పెషల్ ఈవెంట్స్ ప్లాన్ చేస్తుంటాయి. అలా ఓ కార్యక్రమానికి సుమ గెస్ట్‌గా వచ్చింది. ఈమెతో పాటు ఒకప్పటి యాంకర్ శిల్పా చక్రవర్తి కూడా వచ్చింది. సందర్భం ఏంటనేది కరెక్ట్‌గా తెలీదు గానీ సుమ గురించి శిల్పా చక్రవర్తి ఓ సీక్రెట్ బయటపెట్టింది. రాత్రుళ్లు కొన్నిసార్లు మెట్లపై నిద్రపోయేదని చెప్పుకొచ్చింది. కన్నీళ్లు పెట్టుకున్న సుమ రాత్రుళ్లు కొన్నిసార్లు షూటింగ్స్ లో చాలా ఆలస్యమయ్యేదని, ఇంటికొచ్చి తలుపు చాలాసేపు కొట్టినా ఎవరు తీయకపోవడంతో కొన్నిసార్లు మెట్లపై సుమ నిద్రపోవడం తాను చూశానని యాంకర్ శిల్పా చక్రవర్తి.. తాజాగా రిలీజ్ చేసిన దీపావళి ఈవెంట్ ప్రోమోలో చెప్పుకొచ్చింది. అలా పాత విషయాలు చెప్పేసరికి సుమ కన్నీళ్లు పెట్టుకుంది. సినిమా ప్రమోషన్లో భాగంగా ఇదే షోకి వచ్చిన సుమ కొడుకు, తల్లిని దగ్గరకు తీసుకుని ఎమోషనల్ అయ్యాడు. (ఇదీ చదవండి: 'జిగర్ తండ డబుల్ ఎక్స్' మూవీ రివ్యూ) (ఇదీ చదవండి: Japan Review: ‘జపాన్’ మూవీ రివ్యూ) -
యాంకర్ సుమతో నాని మరియు కార్తీ జోకులు
-
జూనియర్ డాక్టర్‌గా విధులు నిర్వహిస్తూ.. ఒక్కసారిగా ఇలా అవ్వడంతో..
ఖమ్మం: మండలంలోని సీతానగరం గ్రామానికి చెందిన జూనియర్ డాక్టర్ సుమ (23) డెంగీ జ్వరంతో బాధపడుతూ గురువారం తెల్లవారుజామున మృతి చెందారు. సుమ హైదరబాద్‌లో ఓ ప్రైవేట్ వైద్యశాలలో జూనియర్ డాక్టర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. వారం రోజుల నుంచి డెంగీ జ్వరంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. పరిస్థితి విషమంగా మారి గురువారం తెల్లవారుజామున మృతి చెందింది. మృతదేహాన్ని హైదరబాద్ నుంచి సీతానగరం తీసుకొచ్చి అంత్యక్రియలు నిర్వహించారు. సుమ మృతితో తల్లిదండ్రులు శోకసంద్రంలో మునిగిపోగా గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. చదవండి: దయచేసి.. మా కుమారుడిని కాపాడండి! -
77వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో సెలబ్రిటీలు షేర్ చేసిన ఫోటోలు
► 100 జాతీయ జెండాలను పంచిన హీరోయిన నమిత ► జాతీయ జెండాతో రాశీ ఖన్నా ► స్వాతంత్య్ర దినోత్సవం రోజున బేబి సినిమా నుంచి మరో న్యూస్ ► వైట్ డ్రెస్‌లో జాతీయ జెండాతో హీరోయిన్ శ్రీలీల ► సైంధవ్ టీజర్‌ను పోస్ట్ చేసిన వెంకటశ్ View this post on Instagram A post shared by Namitha Vankawala (@namita.official) View this post on Instagram A post shared by Vishnu Manchu (@vishnumanchu) View this post on Instagram A post shared by Raashii Khanna (@raashiikhanna) View this post on Instagram A post shared by Anand Deverakonda (@ananddeverakonda) View this post on Instagram A post shared by Shilpa Reddy (@shilpareddy.official) View this post on Instagram A post shared by Sreeleela (@sreeleela14) View this post on Instagram A post shared by Venkatesh Daggubati (@venkateshdaggubati) View this post on Instagram A post shared by Sunny Deol (@iamsunnydeol) View this post on Instagram A post shared by Divi Vadthya (@actordivi) View this post on Instagram A post shared by Divi Vadthya (@actordivi) View this post on Instagram A post shared by Suma Kanakala (@kanakalasuma) -
అందరి ముందు కన్నీరు పెట్టుకున్న ‘బిగ్ బాస్’ ఫేమ్ సయ్యద్ సోహైల్
‘బిగ్ బాస్’ ఫేమ్ యంగ్ హీరో సయ్యద్ సోహైల్ హీరోగా నటిస్తున్న కొత్త సినిమా ‘మిస్టర్ ప్రెగ్నెంట్’. రూపా కొడవాయుర్ హీరోయిన్గా నటిస్తోంది. మైక్ మూవీస్ బ్యానర్లో అప్పి రెడ్డి, రవీందర్ రెడ్డి సజ్జల, వెంకట్ అన్నపరెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని నూతన దర్శకుడు శ్రీనివాస్ వింజనంపాటి రూపొందిస్తున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ‘మిస్టర్ ప్రెగ్నెంట్’ మూవీ ఆగస్టు 18న విడుదలకు సిద్ధమవుతోంది. (ఇదీ చదవండి: యంగ్ హీరోపై బాహుబలి నిర్మాత శోభు సంచలన వ్యాఖ్యలు) హీరో సోహైల్ ‘మిస్టర్ ప్రెగ్నెంట్’ చిత్రంలో ప్రెగ్నెంట్‌గా కనిపించనున్నాడు. ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే ప్రమోషన్స్ కూడా ప్రారంభించారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించి సోహైల్‌తో పాటు దీప్తి నల్లమోతు,రూపా,అలీ రెజా ఒక కార్యక్రమంలో పాల్గొన్నారు. అక్కడ సోహైల్ మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యాడు. మిస్టర్ ప్రెగ్నెంట్ సినిమా సమయంలో చాలా మంది అవమానించారని ఆయన కన్నీరు పెట్టుకున్నాడు. (ఇదీ చదవండి: రూ. 500 కోట్లు అయినా సరే నచ్చకపోతే నో చెప్పేస్తా: హీరోయిన్) ఇక్కడ లైఫ్‌లో ముందుకెళ్లాలి.. ప్రేక్షకులు యాక్సెప్ట్ చేస్తారా లేదా..? వీడు రియాల్టీ షో నుంచి వచ్చాడు, చిన్న స్క్రీన్ నుంచి వచ్చాడు అని అంటూ ఉంటే ఒక్కోసారి భయమేస్తూ ఉంటుందని ఆయన ఎమోషనల్ అయ్యాడు. ఈ సినిమా యాక్సెప్ట్ చేసినప్పుడు కొందరు నెగిటివ్ కామెంట్లు చేశారు. తర్వాత ‘మిస్టర్ ప్రెగ్నెంట్’ సినిమా గ్లింప్స్ రిలీజ్ అయినప్పుడు చాలామంది ఏందిరా ఈ తేడా గాడు.. అది ఇది అంటూ హేళన చేశారని ఆయన స్టేజీపైనే అందరి ముందు కన్నీరు పెట్టుకున్నాడు. దీంతో ఆయన్ను అభిమానించే వారు సపోర్ట్‌గా నిలుస్తున్నారు. -
'బిగ్‌బాస్ 7' సీక్రెట్ బయటపెట్టిన నాగార్జున!
తెలుగులో సక్సెస్ అయిన రియాలిటీ షో అంటే చాలామంది చెప్పే పేరు 'బిగ్‌బాస్'. ప్రతి ఏడాది ఈ షోపై ఏదో ఓ కాంట్రవర్సీ నడుస్తూనే ఉంటుంది. చాలామంది బహిరంగంగానే విమర్శిస్తుంటారు. అయినాసరే ఇప్పటికే ఆరు సీజన్లు విజయవంతంగా పూర్తి చేసుకుంది. త్వరలో 7వ సీజన్ ప్రారంభానికి రెడీ అయిపోతోంది. ఈ మధ్య టీజర్ రిలీజ్ చేయగా, బాగానే రెస్పాన్స్ వచ్చింది. కొత్త సీజన్‌కి హోస్ట్‌గా నాగార్జున తప్పుకొన్నారని కొన్నాళ్ల ముందు రూమర్స్ వచ్చాయి. వాటికి చెక్ పెడుతూ ఓ ఐదారు రోజుల క్రితం టీజర్ లో నాగ్ ప్రత్యక్షమయ్యారు. స్పైసీ లుక్‌తో సందడి చేశారు. అయితే షో గురించి ఏం చెప్పకుండా కేవలం.. 'కుడి ఎడమైతే పొరపాటు లేదోయ్..' అని పాట పాడి ముగించారు. ఇప్పుడు దాని వెనకున్న సీక్రెట్‌ని ఆయనే బయటపెట్టేశారు. (ఇదీ చదవండి: 'బేబీ' ఫ్యాన్స్‌కి బ్యాడ్ న్యూస్) ఈసారి బిగ్ బాస్ ఏడో సీజన్ ఆగస్టులో మొదలయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. దాని కోసం ఏర్పాట్లు కూడా జరుగుతున్నట్లు తెలుస్తోంది. షో స్టార్టింగ్ కి ఇంకా బోలెడంత సమయముంది. అంతలో 'బిగ్‌బాస్ షైనింగ్ స్టార్స్' పేరుతో ఓ ఈవెంట్ ఏర్పాటు చేశారు. గత ఆరు సీజన్లలో పాల్గొన్న కొందరు పార్టిసిపెంట్స్‌ని తీసుకొచ్చి ఎంటర్టైన్ చేశారు. అందుకు సంబంధించిన ప్రోమోని తాజాగా రిలీజ్ చేయగా హోస్ట్ నాగార్జున తనదైన శైలిలో సందడి చేశారు. 'కుడి ఎడమైతే..' అని టీజర్లో చెప్పారు కదా దానికి అర్థమేంటి అని సుమ.. నాగార్జునని అడిగింది. దీనికి బదులిచ్చిన నాగ్.. 'న్యూ గేమ్ న్యూ ఛాలెంజెస్ న్యూ రూల్స్' అని చెప్పుకొచ్చారు. దీనిబట్టి చూస్తే ఈసారి షో సమ్‌థింగ్ డిఫరెంట్‌గా ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. చూడాలి మరి ఈసారి ఏం జరగబోతుందో? కంటెస్టెంట్స్ గా ఎవరు రాబోతున్నారో? (ఇదీ చదవండి: ఉపాసనపై రామ్‌చరణ్ కామెంట్స్.. అలా చేసిందంటూ!) -
ప్రభాస్ తో స్టార్ట్..సుమకు భారీ షాక్
-
మహిళా సీఐ సస్పెండ్
శివాజీనగర: విధుల్లో అలసత్వం, అవినీతి ఆరోపణలతో నగరంలో శివాజీనగర మహిళా పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ సుమ ను పై అధికారులు సస్పెండ్ చేస్తూ పోలీస్ కమిషనర్ దయానంద్ ఉత్తర్వులిచ్చారు. కొన్నిరోజుల క్రితం ఈ పోలీస్‌స్టేషన్‌లో లోకాయుక్త అధికారులు సోదాలు చేశారు. ఆ సమయంలో ఎస్ఐ సవిత రూ.5 వేలు లంచం డిమాండ్ చేసి, తీసుకుంటూ రెడ్‌హ్యాండ్‌గా చికకారు. ఇందులో సీఐ సుమ పాత్ర ఉందని వినిపించింది. సీనియర్ అధికారులతో దురుసుగా ప్రవర్తించిన ఆరోపణలు కూడా ఆమైపె ఉన్నాయి. ఉన్నతాధికారులు చెప్పి పంపిన కేసుల్లో కూడా ఆమె లంచం డిమాండ్ చేసి, ఇచ్చేవరకూ పనిచేసేది కాదని ఆరోపణలున్నాయి. ఇంతకుముందు డీసీపీ భీమాశంకర్ గుళేద్ హెచ్చరించినా కూడా ఏమాత్రం మార్పు రాలేదు. ఈ నేపథ్యంలో విచారణ జరిపిన ఉన్నతాధికారులు లంచం, అలసత్వం, దుష్ప్రవర్తన తదితర ఆరోపణల కింద ఆమైపె సస్పెన్షన్ వేటు వేశారు. -
Period Leave: లోలోపల మెలిపెట్టే బాధ.. సెలవు బలహీనతేనా.. కానేకాదు!
శరీరమంతా ఒక చోటే గడ్డకట్టినప్పుడు ఒక వైయక్తిక పర్వతం విస్ఫోటం చెందినప్పుడు నేను బాధని అరచేతిలో పట్టుకోవడానికి విఫల ప్రయత్నాలు చేస్తుంటాను అంటూ కె. గీత అనే కవయిత్రి మహిళల రుతుక్రమ బాధను వర్ణించారు. స్త్రీలకు మాత్రమే అర్థమయ్యే ఈ బాధ, ఇబ్బందికి కాస్త విశ్రాంతితో ఎంతోకొంత ఉపశమనం పొందవచ్చు. గృహిణులకు కొంచెం ఆ వెసులుబాటు ఉండొచ్చేమో కానీ కుటుంబం కోసం ఆర్థిక బాధ్యతలనూ పంచుకుంటున్న మహిళలకు ఆ విశ్రాంతి ఎలా దొరకుతుంది? సెలవు పెట్టాలంటే జీతం (ఆ రోజులకు) నష్టపోవాలి. పోనీ దానికీ సిద్ధపడి.. ‘నెలసరి వచ్చింది.. సెలవు కావాలి’ అని అడగడానికి ఏదో జంకు.. బిడియం.. భయం.. అర్థం చేసుకుంటారా? వెకిలిగా చూస్తే? కామెంట్ విసిరితే? ఇన్ని సంకోచాల మధ్య సెలవు అడిగే బదులు ఎలాగోలా కొలువుకు రావడమే నయమనే నిస్సహాయ సర్దుబాటు. సగటు మహిళా ఉద్యోగి ప్రతినెలా ఎదుర్కొనే సున్నితమైన సమస్య ఇది. ఇలాంటి స్థితిలో ఆఫీస్ యాజమాన్యాలే అర్థం చేసుకొని నెలసరిలో విశ్రాంతి తీసుకోమని అధికారికంగా ఒక రూల్ పాస్ చేస్తే ఎంత హ్యాపీ! బహిష్టు సమయంలో మహిళలు ఎదుర్కొనే ఇబ్బందులపై ఇప్పుడిప్పుడే అవగాహన పెంచుకుంటోంది సమాజం. ఆ క్రమంలోనే పీరియడ్ లీవును మంజూరు చేస్తున్నాయి కొన్ని కంపెనీలు.. సిక్ లీవ్, మెటర్నిటీ లీవ్ తరహాలో! అయితే ఈ సెలవు మహిళల అవకాశాలను గండికొట్టడానికే తప్ప ఆమె సామర్థ్యానికి విలువనిచ్చేది కాదు అనే వాదన.. దీని వల్ల మహిళలు తాము శారీరకంగా బలహీనుమలని ఒప్పుకుంటున్నట్టే అనే అసంతృప్తి ఓ చర్చగా మారింది సర్వత్రా! ఆ చర్చనీయాంశాన్ని ఫన్డే కవర్ స్టొరీగా మీముందుకు తెచ్చాం! జ్వరం, జలుబు, ఒళ్లు నొప్పులు, తలనొప్పి, వాంతులు, విరోచనాలు, కాలు బెణికింది, బ్యాక్ పెయిన్ ఇలా ఎన్నో అనారోగ్య సమస్యలకు లేదనకుండా లీవ్ ఇస్తారు. ఇంట్లో పెద్దలు, పిల్లల అనారోగ్యాలు, పుట్టిన రోజులు, పెళ్లిళ్లు, ఫంక్షన్లు, పిక్నిక్లు, వ్రతాలు, యాత్రలు ఇలా సెలవు ఇవ్వడానికి అన్నీ సకారణాలే. కానీ పీరియడ్స్‌ను మాత్రం ‘సెలవు తీసుకోవడానికి ఓ వంకలా వాడుకుంటున్నారు మహిళలు’ అన్నట్టుగా చూస్తారు.. ‘అదేమైనా రోగమా రొష్టా సెలవు తీసుకోవడానికి’ అనీ అనుకుంటారు కొందరు మగబాసులు. దీనికి ప్రధాన కారణం శారీరకంగా స్త్రీ, పురుషుల్లో భేదమే. ఇది ప్రతి నెల స్త్రీలకి తప్పనిసరి వ్యవహారం. సృష్టికి ప్రతిసృష్టిని అందించే అమ్మతనానికి ఇదే మూలం. ఒకప్పుడు నెలసరి వచ్చిందంటే అమ్మాయిలు ఓ మూల కూర్చోవాలి. ఎవరినీ ముట్టుకోకూడదు. ఎటూ తిరగకూడదు. నలుగురిలో కలవకూడదు. గుళ్లు, గోపురాలకు వెళ్లకూడదు. ప్రకృతి సహజంగా స్త్రీకి వచ్చే శారీరక మార్పులకు ఇన్ని ఆంక్షలు విధించడం కచ్చితంగా ఆమెపై చూపించే వివక్షే. కానీ అందులో అంతర్లీనంగా బహిష్టు సమయంలో మహిళ శరీరం విశ్రాంతి కోరుకుంటుందని, అందుకే ఈ సంప్రదాయాలు వచ్చాయని వాదించే వారు ఉన్నారు. రోజూ ఇంట్లో గొడ్డు చాకిరి చేసే మహిళకి ఆ మూడు రోజులే విశ్రాంతి దొరికేది. అలా ఎవరికీ కనిపించకుండా మూల కూర్చొనే స్థాయి నుంచి మహిళలు మగవారితో దీటుగా పనిచేయగల సమర్థతను సాధించడం వెనుక ఎంతో పోరాటం ఉంది. మహిళల పట్ల సానుభూతితో కాకుండా ఆ సమయంలో వారిలో కలిగే నొప్పిని, బాధను, మానసికంగా పడే ఆవేదనను కొందరైనా అర్థం చేసుకుంటున్నారు. అయినా మన దేశంలో కేవలం 15 కంపెనీలు మాత్రమే పీరియడ్ లీవ్ మంజూరు చేస్తున్నాయి. ఆ బాధ వర్ణనాతీతం కౌమరంలోకి అడుగు పెట్టి రజస్వల అనే దశను మొదలు కొని అయిదు పదుల వయసులో ఏర్పడే మెనోపాజ్ వరకూ ప్రతి అమ్మాయి, ప్రతి మహిళా నెల నెల క్రమం తప్పకుండా ఎదుర్కోవలసిన స్థితి నెలసరి. కొంత మంది మహిళల్లో నెలసరి అనేది వారి శరీర తత్వాన్ని బట్టి ఏ మాత్రం ఇబ్బంది పెట్టకుండా గడిచిపోతుంది. కానీ ఎక్కువ మంది మహిళల్లో పొత్తి కడుపులో తెరలు తెరలుగా నొప్పి వస్తుంది. మరికొందరిలో అధిక రక్తస్రావం జరుగుతుంది. కొందరిలో నరాల్లో రక్తమంతా ఆవిరైపోతున్నట్టు శరీరం వశం తప్పుతూ ఉంటుంది. కాళ్లల్లో సత్తువ ఉండదు. నిల్చోలేరు. కూర్చోలేరు. పడుకోలేరు. ఏమీ తినాలనిపించదు, తాగాలనిపించదు. ఆలోచనలు కుదురుగా ఉండవు. మూడ్ స్వింగ్స్ అసాధారణంగా ఉంటాయి. లోలోపల మెలిపెట్టే బాధని దాచుకునే పరిస్థితులతో అసహనం కట్టలు తెచ్చుకుంటూ ఉంటుంది. చిన్న విషయాలకే కోపం తెచ్చుకోవడం, మూడీగా ఉండడం చూస్తుంటాం. ఆ సమయంలో ఆఫీసుకి వెళ్లాలంటే ప్రాణం పోతున్నంత పని అవుతుంది. అధిక రక్త స్రావంతో మరకలు అంటుకుంటే ఎలాగన్న భయం, పదే పదే శానిటరీ ప్యాడ్ మార్చుకోవడానికి వాష్ రూమ్‌కు పరిగెత్తాలంటే ఓ జంకు, నొప్పులు వేధిస్తున్నా పని మీద దృష్టి నిలపలేని నిస్సహాయత ఇవన్నీ మహిళల్ని కుంగదీస్తున్నాయి. దీనికీ వెస్టే ఫస్ట్ పీరియడ్స్ టైమ్‌లో మహిళలకు సెలవు ఇవ్వాలన్న ఆలోచన పాశ్చాత్య దేశాల్లోనే ముందు మొదలైంది. సంప్రదాయాలకు, హిందూ జీవన విధానాలకు నెలవైన మన దేశంలో ఇలాంటి ఆలోచన చేయడం ఆలస్యంగా మొదలైంది. వందేళ్ల క్రితం 1920–30ల్లో మొట్టమొదటిసారి సోవియట్ రష్యా మహిళల్లో పునరుత్పత్తి సామర్థ్యాన్ని కాపాడడం కోసం ఈ సెలవు ఇవ్వాలన్న ఆలోచన చేసింది. మహిళలకు బహిష్టు సెలవు ఇవ్వాలని కార్మిక సంస్థలకు సిఫారసు చేసింది. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత జపాన్.. మహిళల పీరియడ్ లీవ్‌కి ప్రాచుర్యాన్ని కల్పించింది. 1947లో దీనిపై చట్టం చేసింది. దక్షిణ కొరియా 1953లో ఒక్క రోజు పీరియడ్ లీవ్ ఇస్తూ చట్టం చేసింది. ఇండోనేసియాలో రెండు రోజులు, జాంబియాలో ఒక్క రోజు, తైవాన్‌లో ఏడాదికి మూడు రోజుల సెలవుతోపాటు ఆ సమయంలో అధికంగా మరో అరగంట బ్రేక్ ఇస్తోంది. ఇటీవల స్పెయిన్ కూడా మూడు రోజుల పాటు సెలవు ఇవ్వడానికి ఆమోదించింది. భారత్‌లో ఇలా.. మన దేశంలో అత్యంత వెనుకబడిన రాష్ట్రం బిహార్. కానీ మహిళల అంశంలో పాశ్చాత్య దేశాలతో పోటీ పడింది. మహిళలకి ప్రతినెల రెండు రోజుల పీరియడ్ లీవ్ మంజూరు చేస్తూ 1992లోనే చట్టం చేసింది. కేంద్రం, ఇతర రాష్ట్రాలు ఆ దిశగా ఒక్క అడుగు కూడా ముందుకు వెయ్యలేదు. అయితే అరుణాచల్ ప్రదేశ్‌కు చెందిన కాంగ్రెస్ లోక్‌సభ సభ్యుడు నినోంగ్ ఎరింగ్ మహిళలకు పీరియడ్ లీవ్ ఇవ్వాలంటూ 2017 నవంబర్‌లో ఒక ప్రైవేటు బిల్లును సభలో ప్రవేశపెట్టారు. స్కూలు, కాలేజీలకు వెళ్లే అమ్మాయిలకు, ఆఫీసుల్లో పని చేసే మహిళలకు టాయిలెట్ సౌకర్యాలు సరిగా లేవని, అవసరమైతే కాసేపు విశ్రాంతి తీసుకునే పరిస్థితి లేదని, అందుకే వారికి సెలవు మంజూరు చేస్తూ ఒక చట్టం చేయాలని ఆ బిల్లులో కోరారు. అయిదేళ్లు అవుతున్నా ఇప్పటివరకు ఆ బిల్లుపై కనీసం చర్చ కూడా జరగలేదు. సెలవు తీసుకుంటే వెనుకబడిపోతారా ? సమానత్వం కోసం దశాబ్దాల తరబడి పోరాడుతున్న మహిళలు ఇప్పుడిప్పుడే ఆర్థికవృద్ధిలోనూ తమ వాటా ఉందని నినదిస్తున్నారు. మన దేశంలో దాదాపుగా 43.2 కోట్ల మంది స్త్రీలు ఎంతో ఉత్సాహంతో, అంకితభావంతో పని చేస్తూ ఆర్థిక వ్యవస్థకి వెనుదన్నుగా నిలుస్తున్నారు. దేశ జీడీపీలో 18% వాటాను మహిళలే అందిస్తున్నారు. మగవారితో సమానంగా మహిళలకూ అవకాశాలు లభిస్తే 2025 నాటికి దేశ జీడీపీలో 58 లక్షల కోట్ల రూపాయలు మహిళల వాటాయే అవుతుందని మెకిన్సీ గ్లోబల్ ఇనిస్టిట్యూట్ అంచనా వేసింది. ఇలా మహిళలు ఎదుగుతున్న వేళ పీరియడ్స్‌లో మహిళలు విశ్రాంతి కోరుకొని సెలవు తీసుకున్నా ఇంట్లో విశ్రాంతి లభిస్తుందన్న గ్యారంటీ లేదు. ఇంటి పనుల భారం, బాధ్యత మహిళలే తీసుకోవాలి కాబట్టి అక్కడ పని చేయడం ఎలాగూ తప్పదు. ఇప్పటికే రకరకాల కారణాలతో ఆఫీసుల్లోకి మహిళా ఉద్యోగుల్ని తీసుకోవడం లేదు. తీసుకున్నా ఆడవారిపై వివక్ష కొనసాగు తూనే ఉంది. ఈ మధ్య విడుదలైన జాతీయ కుటుంబ సర్వే ప్రకారం గత అయిదేళ్లలోనే రెండు కోట్ల మంది మహిళలు ఉద్యోగాలు వదులుకున్నారు. ఇప్పుడు పీరియడ్ లీవ్ ఇస్తే కంపెనీలు మహిళా ఉద్యోగులను వద్దనుకోవడానికి ఇదీ ఓ కారణం అవుతుందని వాదించేవారూ ఉన్నారు. ఆ వాతావరణమే లేదు 21వ శతాబ్దంలోకి అడుగుపెట్టాం. ఇంకా మహిళలు స్వేచ్ఛగా ఈ అంశంపై మాట్లాడే వాతావరణమే మన దగ్గర లేదు. ఇదే అంశంపై ప్రజాభిప్రాయం కోరినప్పుడు సామాన్య మహిళలే కాదు, చదువుకుని ఉద్యోగాలు చేసే మహిళలు కూడా మాట్లాడేందుకు కాస్త తటపటాయించడం, మొహమాటపడటం ఆశ్చర్యం కలిగించే అంశం. ప్రతినెల అవసరమయ్యే శానిటరీ నాప్కిన్స్ కొనుగోలు చేసినప్పుడు ఎవరికీ కనిపించకుండా నల్ల క్యారీబ్యాగ్‌లలో ఇస్తూ అదేదో ఎవ్వరికీ తెలియకూడని బ్రహ్మపదార్థంలా దాచేస్తున్నారు. స్త్రీలు తమ శరీరంలో సహజసిద్ధంగా జరిగే మార్పులపై చర్చించడం, మనసు విప్పి మాట్లాడ్డంలో తప్పులేదు. ఇది స్త్రీ ఆరోగ్యానికి సంబంధించిన విషయం. కాబట్టి దీనిని బలాలు, బలహీనతలు, సమర్థత, అసమర్థత అన్న కోణంలోంచి చూడలేం. మహిళలు ఆరోగ్యంగా, ఆనందంగా, ఆత్మగౌరవంతో ఉంటేనే సమాజ పురోగతి సాధ్యమవుతుంది లేదంటే అభివృద్ధి గతి తప్పుతుంది. అమ్మ బాగుంటేనే ఇల్లు బాగుంటుంది. మహిళ బాగుంటేనే సమాజం బాగుంటుంది. ఇది అక్షర సత్యం. నెలసరి సమయాల్లో మహిళలకి విశ్రాంతి కల్పించడానికి ఇంటా, బయటా వారి చుట్టూ ఉండే మగవాళ్లు సహకారం అందివ్వాలి. ఇలా చేయడం మహిళలకి చేసే అదనపు సాయం కానేకాదు. ఇది అందరి బాగుకోసమే అన్న అవగాహన పెరగాలి. మహిళలు బహిరంగంగా డిమాండ్ చేసినా చేయకపోయినా పీరియడ్ లీవ్ ఇస్తే లాభమే తప్ప నష్టం లేదు. ఆఫీసుకు వచ్చి కూడా సిగరెట్ బ్రేక్ అని, కాఫీ బ్రేక్ అని, ఇతరులతో పిచ్చాపాటి పేరు చెప్పుకొని మగవారు పని గంటల్ని వృథా చేస్తూనే ఉంటారు. వారు చేసే వృథాతో పోల్చి చూస్తే మహిళలకు ఇచ్చే సెలవు ఏమంత విషయం కాదు. బాధ్యత కలిగిన ప్రజా నాయకులందరూ ఈ దిశగా ఆలోచించాలి. ఎన్నో దేశాలు పీరియడ్ లీవ్ ఇస్తూ ఉంటే మన దేశంలో అది ప్రైవేటు బిల్లు స్థాయిలోనే ఉండడం, దానిపై చర్చ జరగకుండా డర్టీ థింగ్ అంటూ కొందరు పురుష ఎంపీలు అడ్డుతగలడం అత్యంత విషాదం. చట్టసభల్లో మహిళా ప్రాతినిధ్యం పెరిగినప్పుడే వారి సమస్యలను అర్థం చేసుకుని తదనుగుణంగా చట్టాలు రూపొందించుకోగలుగుతాం. ఇక పీరియడ్ సెలవు వినియోగించుకోవాలా, వద్దా అనేది పూర్తిగా ఆమె ఇష్టం. ఆ స్వేచ్ఛ ఆమెకి అవసరం. మహిళల పడే రుతుక్రమం బాధలపై తండ్రి కావచ్చు, భర్త కావచ్చు, తోడబుట్టిన సోదరుడు కావొచ్చు. కన్న కొడుకే కావచ్చు.. ఆ మహిళతో కలిసి జీవన ప్రయాణం సాగించే ప్రతీ మగవాడు అర్థం చేసుకొని, వారికి అండగా ఉన్నప్పుడే మనందరం కలలు కనే జెండర్ సెన్సిటివిటీ సాకారం కావడానికి ఒక అడుగైనా ముందుకు పడుతుంది. ఎందుకీ నొప్పి వస్తుంది ? డిస్మెనోరియా అంటే తీవ్రమైన నొప్పితో కూడిన రుతుక్రమం. మనలో 30 శాతం మంది మహిళలను సాధారణ స్థాయి నుంచి తీవ్రమైన నొప్పి వేధిస్తూనే ఉంటుంది. 10 నుంచి 15 శాతం మందిని అధిక రక్తస్రావం బాధిస్తుంది. చాలామంది మహిళలు రుతుక్రమానికి ముందు శారీరక, మానసిక రుగ్మతలతో బాధపడుతుంటారు. 5 నుంచి 10 శాతం మందిలో కుంగుబాటు, మూడ్ స్వింగ్స్, కడుపులో సూదులతో గుచ్చుతున్నట్టుగా, కండరాలు మెలిపెడుతున్నట్లు విపరీతమైన నొప్పితో బాధపడుతుంటారు. వీటిలో కొన్ని వంశపారంపర్యంగా వచ్చేవి, ఇంకొన్ని జీవన శైలిలో మార్పుల కారణంగా వచ్చేవి. మరికొన్ని పర్యావరణ మార్పుల వల్ల వచ్చే సమస్యలు. అధిక బరువు (ఒబేసిటీ) కారణంగా హార్మోన్ల అసమతుల్యత, హైపో థైరాయిడిజం, అనీమియా (రక్త హీనత), తీవ్రమైన ఒత్తిడి కారణంగా పీరియడ్స్‌లో హెచ్చుతగ్గులు వస్తుంటాయి. పై లక్షణాలన్నింటికీ ఫలానా కారణమని చెప్పలేం. కొందరికే ఇలాంటి సమస్యలు ఎందుకు వస్తాయన్నదానికీ సమాధానం దొరకదు. వారి వారి శారీరక ధర్మాలను అనుసరించి ఇలాంటి లక్షణాలు కనిపిస్తాయి. మన శరీరంలో ఉండే ఈస్ట్రోజన్, ప్రొజెస్టరాన్ హార్మోన్ల అసమతుల్యత కూడా రుతుక్రమంలో నొప్పికి కారణం కావచ్చు. చాలా మంది మహిళల్లో తొలి ప్రసవం తర్వాత ఈ సమస్యలన్నీ సర్దుకుంటాయి. ఎండోమెట్రియాసిస్ లేదా ఇన్ఫెక్షన్ల కారణంగా కూడా బహిష్టు నొప్పి రావచ్చు. ఇలాంటి సమస్యలను తొలిదశలోనే గుర్తించి చికిత్స తీసుకుంటే సమస్య తగ్గుతుంది. అధిక రక్త స్రావంతో బాధపడేవారు, ప్రీమెన్స్ట్రువల్ సిండ్రోమ్ (నెలసరికి ముందు వచ్చే ఇబ్బందులు)తో బాధ పడేవారు తప్పనిసరిగా విశ్రాంతి తీసుకోవాలి. ఆధునిక జీవన శైలిలో భాగమైన రాత్రివేళ ఎక్కువ సమయాలు మేల్కొని ఉండటం, చదువు వల్ల ఒత్తిడి, ఆఫీస్ పని భారం వంటి సమస్యలు నెలసరిలో ఇబ్బందులకి కారణాలుగా చెప్పవచ్చు. – డాక్టర్ వాణి చెరుకూరి, గైనకాలజిస్ట్, ఇవా వుమెన్ కేర్ క్లినిక్ పీరియడ్స్‌తో యుద్ధం కవరేజీ : బర్ఖాదత్ 2020లో జొమాటో సంస్థ పీరియడ్ లీవ్ ప్రకటించినప్పుడు ప్రముఖ మహిళా జర్నలిస్టు బర్ఖాదత్ ఆ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. ఆ సంస్థ సదుద్దేశంతో ఆ నిర్ణయాన్ని తీసుకున్నప్పటికీ మహిళలు శారీరకంగా బలహీనులనే వాదనకు బలం చేకూరుతందని ఆమె అభిప్రాయడ్డారు. సైన్యంలో చేరాలని, కదనరంగం కవరేజీ ఇవ్వాలని, యుద్ధ విమానాలు నడపాలని, అంతరిక్షంలోకి వెళ్లాలని అనుకుంటూ ఇంకోవైపు పీరియడ్ లీవ్ అడగడం ఎంతవరకు సమర్థనీయమని ఆమె ప్రశ్నించారు. అంతేకాదు తాను కార్గిల్ యుద్ధం కవరేజీకి వెళ్లినప్పుడు పీరియడ్స్‌లో ఉన్నానని , నొప్పికి మాత్రలు వేసుకుంటూ, శానిటరీ నాప్కిన్స్ అందుబాటులో లేకపోతే టాయిలెట్ పేపర్లు వాడుతూ యుద్ధ వార్తల్ని ప్రపంచానికి వెల్లడించానన్నారు. బర్ఖా అప్పట్లో చేసిన ట్వీట్ హాట్ టాపిక్‌గా మారింది. కానీ సామాజిక మాధ్యమాల్లో ఆమెకు మద్దతు పలికిన వారి కంటే వ్యతిరేకించినవారే అధికంగా ఉన్నారు. ఆడవాళ్లకే ఆ బాధ తెలుస్తుంది ఉరుకుల పరుగుల జీవితంలో మగవారితో సమానంగా పోటీపడి పనిచేస్తున్న మహిళలకు సహజసిద్ధమైన ప్రకృతి నియమం పీరియడ్స్. వృత్తి రీత్యా మహిళా కానిస్టేబుల్స్, కండక్టర్లు మొదలు ఇలా ఎక్కువ సమయం విధుల్లో గడిపేవారు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటారు. అయినప్పటికీ ఆ సమయంలో కూడా వారికి పని చేయక తప్పనిసరి పరిస్థితి ఇంటా బయటా ఉంటుంది. మెటర్నటీ లీవ్ ఎలా ఇస్తారో అదే విధంగా మహిళలకు పీరియడ్ లీవ్ ఇవ్వడంలో తప్పులేదు. అందరిలోనూ ఈ బాధ ఒకే రకంగా ఉండదు కాబట్టి ప్రతినెల కాకుండా, ఏడాదికి కొన్ని రోజులు సెలవు కేటాయించడం మంచి పని. ఇక ఆ సెలవు తీసుకోవాలా, వద్దా అన్నది మహిళల చాయిస్. – సుమతి, తెలంగాణ డీఐజీ ఆహ్వానించాల్సిన అంశం నెలసరి వచ్చినప్పుడు చాలా మంది బాధపడుతుంటారు. ఆ సమయంలో విశ్రాంతి అవసరం. ఎన్నో ఆఫీసుల్లో స్త్రీల కోసం ప్రత్యేకమైన సౌకర్యాలు లేవు. కొన్ని స్కూళ్లల్లో టాయిలెట్స్ లేక శానటరీ ప్యాడ్స్ మార్చుకునే వీలు ఉండదు. ప్రభుత్వ కార్యాలయాల్లో ఎక్కడో దూరంగా బాత్రూమ్స్ ఉంటాయి. తలుపులు కూడా సరిగా ఉండవు. అలాంటి చోట్ల మహిళలు చాలా ఇబ్బంది పడాలి. అందుకే పీరియడ్ లీవ్ ఇవ్వాలన్న ఆలోచన ఆహ్వానించాల్సిన అంశం. ఆ సమయంలో సెలవు తీసుకున్నంత మాత్రానా మహిళలు శారీరకంగా బలహీనులమని అంగీకరించినట్లన్న వాదన అర్థరహితం. – కొండవీటి సత్యవతి, సామాజిక కార్యకర్త ఇప్పటికీ చాలెంజే! ఇప్పుడంటే ఆఫీసులు.. వాటిల్లో టాయ్‌లెట్స్.. కారవాన్స్ వచ్చాయి కానీ నేను యాంకరింగ్‌కు వచ్చిన కొత్తల్లో అంటే 1991 ఆ టైమ్‌లో ఊళ్లకు వెళ్లి షూటింగ్స్ చేయాల్సి వచ్చినప్పడు టాయ్లెట్కైనా పీరియడ్స్ టైమ్‌లో ప్యాడ్స్ చేంజ్ చేసుకోవాలన్నాæ.. చెట్టు.. పుట్ట.. గట్టే గతి. వాటి చాటుకు వెళ్లి చేంజ్ చేసుకోవడమే. కానీ గంటలు గంటలు నిలబడి చేసే ప్రీరిలీజ్ ఫంక్షన్స్ ఇప్పటికీ చాలెంజే పీరియడ్స్ టైమ్‌లో. ప్యాడ్స్ చేంజ్ చేసుకునే వీలే ఉండదు. కాస్ట్యూమ్స్ కూడా నా సౌకర్యం కోసం డార్క్ కలర్స్‌లో ఇవ్వమని అడగడానికి ఉండదు. ఒక్కోసారి లైట్ కలర్స్‌లో ఇస్తారు. అట్లాంటప్పుడు నేను తీసుకునే జాగ్రత్త ఒక్కటే ఎవ్రీ థింగ్ ఈజ్ ఇన్ ప్రాపర్ ప్లేస్ ఉండేట్టు చూసుకోవడమే. పాడ్ మీద పాడ్ .. పాడ్ మీద పాడ్ పెట్టుకుని వెళ్లిన సందర్భాలు, క్లాట్స్, క్రాంప్స్‌తో విలవిల్లాడిన సందర్భాలూ ఉన్నాయి. – యాంకర్ సుమ ఒక ఇంటర్వ్యూలో బలహీనతగానే పరిగణించాలి పురుషులతో సమానంగా పోటీపడుతున్నప్పుడు మహిళలు పీరియడ్ లీవ్ తీసుకుంటే వారి బలహీనతగానే పరిగణించాలి. ఈ ఆధునిక ప్రపంచంలో నెలసరి బాధల నుంచి బయట పడేందుకు ఎన్నో మార్గాలున్నాయి. మందులు, ప్రాణాయామం, యోగాసనాలు వంటి వాటితో ఈ బాధను అధిగమించే ప్రయత్నం చేయాలి. సెలవు కోసం చట్టం చేయడానికి ముందుకొస్తే అందరితోనూ చర్చించి చేయాలి – సంగీత వర్మ, విద్యావేత్త ఎన్నటికీ బలహీన పరచదు ఈ లీవ్ మహిళల్ని ఎన్నటికీ బలహీన పరచదు. మగవారి కంటే మహిళలే అన్ని పనులు బాధ్యతతో చేస్తారు. ఆ సమయంలో విశ్రాంతి దొరికితే ఆ మర్నాడు రెట్టించిన ఉత్సాహంతో పని చేస్తారు. – కవిత రాజేశ్, ఎంట్రప్రెన్యూర్ స్వాగతించాలి తప్ప.. నెలసరి సమయంలో మహిళలకు ఎన్నో ఇబ్బందులుంటాయి. అందరిలోనూ ఒకేలా ఉండవు. ప్రభుత్వం వాటిని గుర్తించి సెలవు మంజూరు చేస్తే స్వాగతించాలి. అంతే తప్ప అది మహిళల అసమర్థతగా చూడకూడదు. అయితే ఈ పీరియడ్ లీవ్‌ను ఐచ్ఛిక సెలవుగా ప్రకటించాలి. – పి. సౌదామిని, డైరెక్టర్, సీఓడబ్ల్యూఈ, ఇండియా స్విగ్గీ నుంచి ఫ్లిప్‌కార్ట్ వరకు ►ఆన్లైన్ ఫుడ్ డెలవరీ సంస్థ స్విగ్గీ తమ సంస్థలోని డెలివరీ గర్ల్స్‌కి నెలకి రెండు రోజులు పీరియడ్ లీవ్ ఇస్తోంది. మహిళల హైజీన్ కోసం ఉత్పత్తుల్ని తయారు చేసే వెట్ అండ్ డ్రై కంపెనీ తమ కంపెనీలో పని చేసే మహిళలకు రెండు రోజులు అదనంగా సెలవు ఇస్తోంది. ►హైదరాబాద్‌కు చెందిన స్టార్టప్ కంపెనీ ఇండస్ట్రీ ఆర్క్ తమ సెలవుల్లో పీరియడ్ లీవ్‌ను కూడా చేర్చింది. ఒకటి, లేదా రెండు రోజులు ఆఫ్ తీసుకునే అవకాశాన్ని కల్పించింది. ►మలయాళంలో మాతృభూమి పత్రిక నెలకి ఒక రోజు సెలవు ఇస్తోంది. ►చెన్నైకి చెందిన డిజిటల్ మ్యాగజైన్ మ్యాగ్టర్ నెలకి ఒక రోజు లీవ్ ప్రకటించింది. ►జొమాటో సంస్థ అమ్మాయిలకు ఏడాదికి అదనంగా 10 రోజుల సెలవు కల్పించింది. అవసరమైన వారు ఆ సెలవు వినియోగించుకుంటారని అలా ఇచ్చింది. ►ముంబైకి చెందిన డిజిటల్ మీడియా కంపెనీ కల్చర్ మిషన్ తమ సంస్థలో మహిళా ఉద్యోగులు వేతనంతో కూడిన ఒక్క రోజు సెలవు తీసుకోవడానికి అనుమతించింది. ►బెంగుళూరుకు చెందిన స్టార్టప్ హార్సెస్ స్టేబుల్ న్యూస్ ఉద్యోగుల్లో 60 శాతం మహిళలే. ఈ సంస్థ నెలకు రెండు రోజులు పీరియడ్ లీవ్ మంజూరు చేసింది. ► ఫ్లిప్‌కార్ట్ ఆన్లైన్ షాపింగ్ సంస్థ తమ కంపెనీలోని మహిళా ఉద్యోగుల కోసం నెలకు ఒక్క రోజు పీరియడ్ లీవ్ ఇచ్చింది. ►కరోనా తర్వాత వర్క్ ఫ్రమ్ హోమ్ కల్చర్ పెరగడంతో ఇప్పుడిప్పుడే కొన్ని కంపెనీలు మహిళలకు నెలసరి సమయంలో ఇంటి నుంచి పని చేసుకునే వెసులుబాటు కల్పిస్తున్నాయి. చదవండి: Russia- Ukraine: మూడో ముప్పు.. అసలు భయం అదే.. భారీ జనహనన ఆయుధాల వల్ల! -
సుమ ‘జయమ్మ పంచాయతీ’ రిలీజ్‌కు రెడీ
Suma Jayamma Panchayathi Movie Release Date: ప్రముఖ యాంకర్ సుమ కనకాల ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘జయమ్మ పంచాయతీ’. విజయ్ కుమార్ కలివరపు దర్శకత్వంలో బలగ ప్రకాశ్ నిర్మించిన ఈ సినిమాని ఏప్రిల్ 22న రిలీజ్ చేస్తున్నట్లు ఓ వీడియోను విడుదల చేసింది చిత్రయూనిట్. ‘‘పల్లెటూరి డ్రామాగా రూపొందిన చిత్రమిది. ఎవరికీ, దేనికీ లొంగని పల్లెటూరి మహిళగా సుమ నటించారు. రామ్‌చరణ్ రిలీజ్ చేసిన మా టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్‌కి, నాని రిలీజ్ చేసిన తొలి పాటకి, రానా దగ్గుబాటి విడుదల చేసిన టీజర్‌కు మంచి స్పందన వచ్చింది. అలాగే దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి ఆవిష్కరించిన టైటిల్ సాంగ్‌కి అనూహ్యమైన స్పందన వచ్చింది’’ అని చిత్రవర్గాలు పేర్కొన్నాయి. ఈ చిత్రానికి సంగీతం: ఎంఎం కీరవాణి, కెమెరా: అనూష్ కుమార్, సమర్పణ: విజయలక్ష్మి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్: అమర్–అఖిల. -
సుమ.. తొలి మహిళా బస్ కండక్టర్
తొలి మహిళా బస్ డ్రైవర్, తొలి మహిళా లోకో పైలట్, ఫలానా జిల్లాలో తొలి మహిళా కండక్టర్... ఇవన్నీ మనకు ఇప్పటికీ తాజాదనం నిండిన వార్తలే. కేరళలో ఇలాంటి తాజా వార్తగా ప్రచురితమై 28 ఏళ్లయింది. అప్పుడు తొలి మహిళా కండక్టర్‌గా ఉద్యోగంలో చేరిన సుమ ఈ నెలాఖరుకి రిటైర్ అవుతున్నారు. అది 1992, జూలై నాలుగవ తేదీ. త్రివేండ్రంలో ఆర్టీసీ బస్‌స్టాప్ కెళ్లింది సుమ. తనకు ఉద్యోగం కొత్త, తాను ఉద్యోగాన్ని ఎంచుకున్న రంగం మహిళలకు కొత్త. తెలిసిన బస్‌స్టేషన్ కూడా ఆమెకి కొత్తగా కనిపిస్తోంది. తనలో అలజడి కారణంగా అలా అనిపిస్తుందేమో అనుకుంది. కానీ అక్కడ ప్రయాణికులు మాత్రమే కాకుండా పోలీసులు, విలేఖరులు, ఫొటోగ్రాఫర్లు కూడా వచ్చారు. ప్రాంగణం కోలాహలంగా ఉంది. మహిళ... కండక్టర్ ఉద్యోగంలో చేరడాన్ని రాష్ట్రప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా భావించింది. అధికారికంగా ప్రారంభించడానికి రాష్ట్ర రవాణా మంత్రి బాలకృష్ణ పిళ్లై వచ్చారు. మంత్రి స్వయంగా సుమ చేతిలో టికెట్ ర్యాక్ పెట్టి సెక్రటేరియట్ హాల్ వరకు టికెట్ తీసుకున్నారు. ఆ వార్తను స్థానిక, జాతీయ పత్రికలు కూడా రాశాయి. ‘‘ప్రతి ఉద్యోగంలోనూ సమస్యలుంటాయి. నువ్వు కనుక ఆ సమస్యలకు భయపడి ఈ ఉద్యోగం మానేసి వెళ్లిపోతే తర్వాత తరం మహిళలు ఈ ఉద్యోగానికి రావడానికి ఇష్టపడరు. అదే జరిగితే మహిళలకు ఒక రంగంలో అవకాశాలు మూసుకుపోయినట్లే. ధైర్యంగా నిలబడి, నిబద్ధతతో ఉద్యోగం చేస్తే ఈ రంగంలో మహిళలకు సరికొత్త దారులు వేసిన దానివి అవుతావు’’ అని అప్పుడు మంత్రి చెప్పిన మాటలను రిటైర్ అవుతున్న సందర్భంగా గుర్తు చేసుకున్నారు సుమ. ఫస్ట్ ర్యాంకు ‘‘కేరళ రాష్ట్రప్రభుత్వం 1992లో మహిళలను కండక్టర్లుగా నియమించడానికి తొలి అడుగు వేసింది. రాతపరీక్షలో 300 మంది పాసయ్యారు. వారిలో నాది తొలి ర్యాంక్. ఇంటర్వ్యూలో పదిమందిమి సెలెక్ట్ అయ్యాం. మాకు త్రివేండ్రంలో స్టాఫ్ ట్రైనింగ్ కాలేజ్‌లో శిక్షణ ఇచ్చారు. ఇన్నేళ్లలో ప్రయాణికులెవ్వరూ నా పట్ల అనుచితంగా ప్రవర్తించలేదు. స్కూలు, కాలేజీలకెళ్లే అమ్మాయిల పట్ల అశ్లీలంగా వ్యవహరించే వారి విషయంలో నేను చాలా ఖండితంగా ఉండేదాన్ని. ఒకసారి ఒక పెద్ద వ్యక్తి ఒకమ్మాయితో అసభ్యంగా వ్యవహరించాడు. బస్సును పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లమని డ్రైవర్‌కు చెప్తున్నప్పుడు అతడు తాను రిటైర్ అయిన పోలీసు అధికారినని మమ్మల్ని బెదిరించాడు. ఇలాంటి విషయాల్లో నేను కోరలున్న సింహానికే భయపడను, కోరలూడిన తోడేలుకి భయపడతానా... అని అతడి మీద కేసు ఫైల్ చేయించాం. ఇన్నేళ్ల ఉద్యోగంలో మరిచిపోలేని మరో సంఘటన 1997లో బస్సు ప్రమాదం. అప్పుడు నేను గర్భిణిని. మా బస్సు మరుత్తమ్కుజి దగ్గర ప్రమాదానికి గురైంది. నాకు చిన్న గాయాలు తప్ప ప్రమాదమేమీ లేదు. గాయాలను తుడుచుకుని, తీవ్రంగా గాయపడిన ప్రయాణికులను ఆర్మీ ట్రక్కులోకి ఎక్కించి హాస్పిటల్‌కు పంపించడంలో సహాయం చేశాను. ఇవి మర్చిపోలేని సంఘటనలు’’ అన్నారు సుమ. కండక్టర్ మెమొరీ నా చిన్నప్పుడు స్కూల్లో టీచర్ చెప్పిన కండక్టర్స్ మెమొరీ అంటే ఏమిటో ఈ ఉద్యోగంలో చేరిన తర్వాత తెలిసింది. ఒక అబ్బాయికి జ్ఞాపకశక్తి చాలా తక్కువగా ఉండేది. పాఠాలను తరచూ మర్చిపోతుండేవాడు. అప్పుడు మా టీచర్ కండక్టర్ మెమొరీ ఉండాలని చెప్పారు. బస్సులో ప్రయాణికులందరి ముఖాలతోపాటు ఎవరు ఏ స్టాప్‌లో దిగుతారో గుర్తుపెట్టుకోవాలి. చిల్లర ఇచ్చేటప్పుడు ఎక్కువ తక్కువ కాకుండా కచ్చితంగా ఇవ్వగలగాలని అప్పుడామె వివరించారు. నాకు అవన్నీ ఆచరణలోకి వచ్చిన తర్వాత టీచర్ చెప్పిన మాటలో పరమార్థం తెలిసి వచ్చింది. –సుమ, తొలి మహిళా బస్ కండక్టర్, కేరళ కొన్నేళ్లుగా డెస్క్ డ్యూటీలో ఉన్న సుమ గత ఏడాది తిరిగి బస్ డ్యూటీకి వచ్చారు. ‘‘బస్సులో డ్యూటీ చేస్తూ రిటైర్ కావాలనేది నా కోరిక. కోవిడ్ కారణంగా ప్రజా రవాణా స్తంభించిపోయింది. నేను రిటైర్ అయ్యే లోపు బస్సులు తిరిగితే బావుణ్నని ఎదురు చూశాను. ఈ నెల 20వ తేదీన తిరిగి బస్సులు రోడ్డెక్కాయి. డ్యూటీ చేస్తున్నాను’’ అని చెప్పారామె సంతోషంగా. – మంజీర -
హ్యాట్సాఫ్ సుమ!
మహబూబాబాద్ రూరల్: నీళ్లు కలుషితమై ప్రజలు అనారోగ్యానికి గురికాకూడదనే ఉద్దేశంతో తాగునీటి బావిలోని నక్క కళేబరాన్ని ఓ స్వచ్ఛంద సంస్థ సభ్యురాలు సాహసం చేసి తొలగించింది. మహబూబాబాద్ మండలం బేతోల్ గ్రామ శివారులోని నల్లా బావిలో ఓ నక్క పడి రెండు రోజులవుతోంది. ఆ మూగజీవి నరకయాతన పడుతుండటంతో మాజీ సర్పంచ్ సంతోష్ శుక్రవారం ’నేను సైతం’ స్వచ్ఛంద సేవా సంస్థ సభ్యురాలు సుమకు సమాచారం అందించారు. ఆమె బావి వద్దకు చేరుకునే సరికి అప్పటికే నక్క చనిపోయి కళేబరం నీటిపై తేలడాన్ని గమనించి.. వెంటనే మునిసిపల్ ప్రత్యేక అధికారి దిలీప్‌కు ఫోన్ చేశారు. కళేబరాన్ని తొలగించి నీళ్లల్లో బ్లీచింగ్ పౌడర్ కలిపేందుకు సిబ్బందిని పంపాలని కోరగా ఆయన వద్ద నుంచి సానుకూల సమాధానం రాకపోవడంతో స్వయంగా ఆమె నడుముకి తాడు కట్టుకుని మాజీ సర్పంచ్ సంతోష్ సహకారంతో సుమారు 42 అడుగుల లోతుగల బావిలోకి దిగి నక్క కళేబరాన్ని బయటకు తీసింది. దీంతో గ్రామస్తులంతా సుమను అభినందించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అధికారుల తీరుపపై కలెక్టర్‌కు ఫిర్యాదు చేస్తామని చెప్పారు. -
స్క్రీన్ టెస్ట్
► భూమిక చావ్లాతో నటించిన మొదటి తెలుగు హీరో ఎవరో తెలుసా? ఎ) యన్టీఆర్ బి) మహేశ్ బాబు సి) సుమంత్ డి) వెంకటేశ్ ► ‘మిస్టర్’ సినిమా హీరో వరుణ్ తేజ్. ఆ సినిమాలో ఇద్దరు హీరోయిన్లు నటించారు. ఒక హీరోయిన్ లావణ్య త్రిపాఠి, మరో హీరోయిన్ ఎవరు? ఎ) హెబ్బా పటేల్ బి) ప్రణీత సి) అమలాపాల్ డి) ఆండ్రియా ► నాగార్జున నటించిన ‘శివ’ సినిమాకు మాటల రచయిత ఎవరో తెలుసా? ఎ) యం.వీ.యస్.హరనాథరావు బి) శివనాగేశ్వరరావు సి) తనికెళ్ల భరణి డి) సుద్దాల అశోక్‌తేజ ► బాలీవుడ్ నటి విద్యాబాలన్‌కి ఈ సౌత్ హీరోయిన్ దగ్గరి బంధువు. ఎవరామె? ఎ) ప్రియమణి బి) లక్ష్మీరాయ్ సి) అంజలి డి) గౌతమి ► వెంకటేశ్ నటించిన ‘నువ్వు నాకు నచ్చావు’ చిత్రానికి దర్శకుడెవరు? ఎ) త్రివిక్రమ్ శ్రీనివాస్ బి) కె. విజయభాస్కర్ సి) పి.వాసు డి) సురేశ్‌కృష్ణ ► నటి చార్మి ప్రస్తుతం హీరోయిన్గా కాకుండా ఓ ప్రముఖ దర్శకునితో కలిసి సినిమా ప్రొడక్షన్ కంపెనీని ప్రారంభించారు. ఆ కంపెనీ పేరేంటి? ఎ) పూరిచార్మి క్రియేటివ్స్ బి) పూరి కనెక్ట్స్ సి) పీసీ కనెక్ట్స్ డి) పీసీ క్రియేట్స్ ► ‘మామ మంచు అల్లుడు కంచు’ అనే సినిమా 2015 డిసెంబర్లో రిలీజైంది. మోహన్‌బాబు 23 సంవత్సరాల క్రితం నటించిన ఓ సినిమాకు సీక్వెల్‌గా ఈ చిత్రం రూపొందింది. ఏ చిత్రానికి ఈ సినిమా సీక్వెలో చెప్పగలరా ? ఎ) అల్లుడుగారు బి) అసెంబ్లీ రౌడి సి) అల్లరి మొగుడు డి) రౌడీగారి పెళ్లాం ► ప్రముఖ యాంకర్ సుమ గతంలో ఓ ప్రముఖ దర్శకుని చిత్రంలో హీరోయిన్గా నటించింది. ఎవరా దర్శకుడు? ఎ) కె.రాఘవేంద్రరావు బి) దాసరి నారాయణరావు సి) కోడి రామకృష్ణ డి) ఎ. కోదండరామిరెడ్డి ► శ్రీదేవి, కమల్‌హాసన్ కలిసి ఎన్ని సినిమాల్లో నటించారో తెలుసా? ఎ) 15 బి) 19 సి) 23 డి) 27 ► ప్రభాస్–అనుష్కల కాంబినేషన్లో ఇప్పటివరకు ఎన్ని సినిమాలు వచ్చాయో తెలుసా? ఎ) 7 బి) 3 సి) 5 డి) 4 ► హృదయం ఎక్కడున్నది.. హృదయం ఎక్కడున్నది నీ చుట్టునే తిరుగుతున్నది... అనే పాటను కంపోజ్ చేసిన సంగీత దర్శకుడెవరో తెలుసా? ఎ) దేవా బి) హారిస్ జయరాజ్ సి) యువన్ శంకర్ రాజా డి) విశాల్ శేఖర్ ► హీరోలు రానా, శర్వానంద్‌లకు ఈ ప్రముఖ హీరో స్కూల్‌మేట్. ఎవరా హీరో? కనుక్కోండి చూద్దాం? ఎ) యన్టీఆర్ బి) రామ్‌చరణ్ సి) విజయ్ దేవరకొండ డి) అల్లరి నరేశ్ ► అంతకుముందు చాలా సినిమాల్లో క్యారెక్టర్స్ చేసినప్పటికీ రామ్‌గోపాల్ వర్మ ‘ఐస్‌క్రీమ్’ సినిమా ద్వారా పేరు తెచ్చుకున్న నటి ఎవరు? ఎ) అవికా గోర్ బి) తేజస్విని మడివాడ సి) శ్రీముఖి డి) ఈషా రెబ్బా ► అక్కినేని నాగేశ్వరరావు నటించిన ‘దసరాబుల్లోడు’ చిత్రానికి దర్శకత్వం వహించిందెవరు? ఎ) వి.మధుసూదనరావు బి) కె.వి.రెడ్డి సి) వి.బి.రాజేంద్రప్రసాద్ డి) కె.విశ్వనాథ్ ► నాగార్జున ట్విట్టర్ ఐడీ ఏంటో కనుక్కోండి ? ఎ) ఐయామ్ నాగార్జున బి) నాగార్జున సి) దిస్ ఈజ్ నాగార్జున డి) ఐయామ్ నాగ్ ► ఈ నటి అసలు పేరు సుజాత. అప్పటికే ఆ పేరుతో ఓ నటి ఉండటం వల్ల ఆమె స్క్రీన్ నేమ్ మారిపోయింది . ఆ నటి ఎవరో తెలుసా? ఎ) జయసుధ బి) జయప్రద సి) దివ్యవాణి డి) రంభ ► తెలుగు సినీ పరిశ్రమకు సంబంధించినంత వరకు ‘నంది’ అనేది చాలా ప్రతిష్టాత్మకమైన అవార్డు. ఈ అవార్డులను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏ సంవత్సరం నుంyì ప్రారంభించిందో తెలుసా? ఎ) 1975 బి) 1964 సి) 1979 డి) 1993 ► చిరంజీవి నటించిన ‘పసివాడిప్రాణం’ చిత్రంలో ‘పదహారేళ్ల వయసు పడిపడిలేచె మనసు’ అనే పాట ఉంటుంది. ఇప్పుడు ‘పడిపడి లేచె మనసు’ అనే టైటిల్‌తో ఓ సినిమా రాబోతోంది. ఆ సినిమా హీరో ఎవరు? ఎ) నాని బి) నిఖిల్ సి) నాగచైతన్య డి) శర్వానంద్ ► ఈ ఫోటోలోని ఇప్పటి హీరో ఎవరో కనుక్కోండి? ఎ) శర్వానంద్ బి) కల్యాణ్‌రామ్ సి) అజిత్ డి) మాధవన్ ► అక్కినేని, సావిత్రి నటించిన ఈ ఫోటో ఏ సినిమాలోనిదో కనుక్కోండి? ఎ) మనుషులు మమతలు బి) మిస్సమ్మ సి) గుండమ్మకథ డి) డాక్టర్ చక్రవర్తి మీరు 6 సమాధానాల కంటే తక్కువ చెబితే... మీకు సినిమా అంటే ఇష్టం 10 సమాధానాల వరకూ చెప్పగలిగితే... మీకు సినిమా అంటే ఇంట్రెస్ట్ 15 సమాధానాల వరకూ చెప్పగలిగితే... మీకు సినిమా అంటే పిచ్చి 20 సమాధానాలూ చెప్పగలిగితే... ఇంకోసారి ఈ క్విజ్ చదవకండి! సమాధానాలు 1) సి 2) ఎ 3) సి 4) ఎ 5) బి 6) సి 7) సి 8) బి 9) డి 10) డి 11) బి 12) బి 13) బి 14) సి 15) ఎ 16) ఎ) 17) బి 18) డి) 19) ఎ 20) ఎ నిర్వహణ శివ మల్లాల -
వాళ్ల పెళ్లిలా ఇదీ హిట్టే!
‘‘రాజీవ్, సుమ నేను తీసిన ఓ యాడ్‌లో నటించారు. ఇద్దర్నీ వేర్వేరుగా రమ్మంటే... నాకు చెప్పకుండా పెళ్లి చేసుకొచ్చారు. ఇప్పుడు ఇదీ (జుజుబీ టీవీ, ఇండిపెండెంట్ ఫిల్మ్స్ నిర్మించడం) నాకు చెప్పకుండా స్టార్ట్ చేశారు. సో, హిట్టే. ‘సుమ రాజీవ్ క్రియేషన్స్’ సక్సెస్ కావాలని కోరుకుంటున్నా’’ అన్నారు కె. రాఘవేంద్రరావు. ప్రవీణ్ యండమూరి, శ్రీముఖి మేకల జంటగా సందీప్ మెండి దర్శకత్వంలో ప్రపూర్ణ ప్రొడక్షన్ హౌస్ తో కలసి సుమరాజీవ్ క్రియేషన్స్ నిర్మించిన ఇండిపెండెంట్ ఫిల్మ్ ‘అలనాటి రామచంద్రుడు’. త్వరలో ‘జుజుబీ టీవీ’ (యూట్యూబ్ ఛానల్)లో ఈ చిత్రాన్ని చూడొచ్చు. ట్రైలర్‌ను రాఘవేంద్రరావు, పాటల సీడీలను వరా ముళ్లపూడి, ‘జుజుబీ టీవీ’ ప్రోమోను కొరటాల శివ విడుదల చేశారు. ‘‘మా ఆత్మను తృప్తిపరిచే చిత్రాలు తీస్తూ, యువతను ప్రోత్సహించడానికి ‘జుజుబీ టీవీ’ స్టార్ట్ చేశాం’’ అన్నారు రాజీవ్ కనకాల. -
నిజమే సుమా!
నేను నా దైవం దేవుడున్నాడు... ప్రతి మంచి పనిలో దేవుడున్నాడు. మంచివాళ్ల కోసమే కాదు.. అందరిలో మంచిని పెంచే దేవుడున్నాడు. మనం ఒక మంచి పని చేస్తే... అది మన మంచి అవుతుంది. కానీ మనల్ని చూసి మరో పదిమంది... మంచి పనికి ముందడుగు వేస్తే? అది.. దైవత్వం అవుతుంది. మనిషిలోనే దేవుడున్నాడు... నిజం సుమా! గల గల మాట్లాడే మీకు ఈ నేర్పు దేవుడిచ్చిన వరంగానే భావిస్తారా? నూటికి నూరు శాతం దేవుడి వరమే. నా చిన్నప్పుడు దేవుడి శ్లోకాలు బాగా వల్లెవేయడం, గుళ్లో భజనల్లో పాల్గొనడం ఎక్కువగా జరిగింది. అమ్మానాన్నలకు ఒక్కత్తే కూతురునవడం వల్ల మా అమ్మ ఎప్పుడూ నా వెంటే ఉండేది. ఆ రోజుల్లో టీవీ సీరియళ్లు లేవు. మిక్సీలు గట్రా మా ఇంట్లో లేవు. దీంతో అమ్మ పప్పు రుబ్బుతూనో, వంట చేస్తూనో నా చేత విష్ణు, లలిత సహస్ర నామాలు అదేపనిగా చెప్పిస్తూ ఉండేది. ఎప్పుడూ ఖాళీగా ఉండనిచ్చేది కాదు. దీంతో ఏ పద్యమో, శ్లోకమో అప్పజెబుతూనే ఉండేదాన్ని. ఈ అలవాటు తర్వాత తర్వాత నా యాంకరింగ్‌కి బాగా పనికొచ్చింది. దైవం గురించి ఎప్పుడు తెలిసింది? మొదట గోడ మీద తెలిసింది. అమ్మా నాన్న గోడమీద దేవుడి పటం చూపించి దణ్ణం పెట్టుకోమనేవాళ్లు. నా చిన్నతనం చాలామటుకు గుళ్లోనే గడిచింది. మేం కేరళవాళ్లం అయినప్పటికీ నాన్న ఉద్యోగరీత్యా హైదరాబాద్‌లోని మెట్టుగూడలో ఉండేవాళ్లం. నాన్న, ఆయన స్నేహితులు కలిసి ఒకరింట్లో అయ్యప్ప పటం పెట్టి పూజలు, భజనలు చేసుకునేవాళ్లు. తర్వాత విరాళాలు సేకరించి, ఆలయం కట్టించి, కేరళ నుంచి అయ్యప్ప స్వామి విగ్రహం తెచ్చి ప్రతిష్టించారు. ఇప్పటికీ ఆ గుళ్ళో వైభవంగా పూజలు నిర్వహిస్తుంటారు. స్కూల్ అయ్యిందంటే చాలు దాదాపుగా ఆ గుళ్లోనే ఉండేదాన్ని అమ్మానాన్నలతో పాటు. అలాగే, మా ఇంటి నుంచి ఆ గుడికి వెళ్లేదారిలో అమ్మవారి దేవాలయాలు ఉండేవి. వరుసగా అందరికీ దణ్ణం పెట్టుకునేదాన్ని. ప్రతీ మంగళవారం లాలాగుడ చౌరస్తా దగ్గర ఉన్న అమ్మవారి గుడిలో అమ్మ నా చేత నిమ్మకాయ దీపాలు పెట్టించేది. ఇక మెట్టుగూడలోని ఆంజనేయ స్వామి టెంపుల్‌కి ప్రతి శనివారం వెళ్లేవాళ్లం. టెన్త్ క్లాస్ వరకు సెయింట్ ఆన్స్ స్కూల్లో చదివాను. అక్కడ క్రీస్తు ప్రార్థనల్లో పాల్గొనేదాన్ని. మా అమ్మ ఏ దేవుణ్ణీ తక్కువ చూడకూడదు అని, అందరికీ దణ్ణం పెట్టమని చెప్పేది. మెట్టుగూడలోని చర్చికి వెళ్లి క్యాండిల్స్ వెలిగించి, బ్రెడ్ పంచిపెట్టేవాళ్లం. గుడి, మసీదు, దర్గా, చర్చి.. ఇలా నా చిన్నతనం అంతా బీభత్సమైన భక్తిలో పెరిగాను. అమ్మవాళ్లు చెప్పేవారు కాబట్టి చేసినా మనస్ఫూర్తిగా అనుసరించేదాన్ని. దైవం అనుగ్రహం కలిగిన సందర్భాలు... నా పెళ్లికి ముందు ‘చిట్టిబాబు’గారు శిరిడీ సాయిబాబా జీవిత చరిత్ర పుస్తకం ఇచ్చారు చదవమని. బాబా జీవిత చరిత్ర చదువుతూ దాంట్లో బాగా లీనమైపోయాను. సాయిబాబా కల్లోకి కూడా వచ్చేవారు. ఒకసారి మరుసటి రోజు దర్గా దర్శనానికి వెళ్లాల్సి ఉంది. ఆ రోజు రాత్రి గతంలో నేనెప్పుడు చూడని ఆ దర్గా కల్లోకి రావడం, అక్కడ ద్వారం ముందు బాబా నిల్చొని లోపలికి రమ్మని చెప్పడం .. ఆ అనుభూతిని ఎప్పటికీ మర్చిపోలేను. అప్పుడే సాయిబాబాతో నాకు స్నేహం ఏర్పడింది. పిలిస్తే పలికే దేవుడు బాబా అనే ముద్ర మనసులో బలంగా నాటుకుపోయింది. దీనికి ఓ కారణమూ ఉంది. పెళ్లికి ముహూర్తం కుదిరి, బంధువుల పిలుపుల కోసం కేరళలోని మా మేనత్త ఇంటికి నేను, అమ్మానాన్న బస్సులో బయల్దేరాం. అక్కడన్నీ ఇరుకురోడ్లు. కోత కోసిన తర్వాత నీళ్లతో నిండి ఉన్న పొలాలు. మా అమ్మ ఉన్నట్టుండి ‘ఈ రోజు గురువారం కదా, బాబాకు దణ్ణం పెట్టుకున్నావా?’అని అడిగింది. అది కో ఇన్సిడెంట్ అవ్వచ్చు. ఈ లోపు ఎక్కడ నుంచో ఎగిరి వచ్చి నా ఒళ్లో కుంకుమ ప్యాకెట్ పడింది. దాన్నే చూస్తున్నాను. ఏమైందో ఏమో.. మా బస్సు రోడ్డు మీద నుంచి పొలాల్లోకి అటు నుంచి అడ్డంగా పడిపోయి కొంతదూరం వెళ్లింది. చాలా పెద్ద యాక్సిడెంట్ అది. కానీ, నేను ఆ సమయంలో ప్రశాంతంగా ఉన్నాను. కష్టపడకుండా పోతే చాలు బాబా అనుకున్నాను. కిటికీలో నుంచి బయటకు పడిపోతున్న నన్ను నాన్న పైకి లాగారు. ఆ తర్వాత నాకు స్పృహ వచ్చి చుట్టూ చూసి, టాప్ పైకి వెళ్ళి కొంతమందిని పైకి లాగాను కూడా! ఆ ప్రమాదంలో ముగ్గురు చనిపోయారు. కొంతమందికి బాగా గాయాలయ్యాయి. అప్పుడు భయమనిపించలేదు కానీ, ఇంటికి వచ్చాక తల్చుకున్న కొద్దీ వణికిపోయేదాన్ని. ఇప్పటికీ బస్సు ప్రయాణం అంటే చాలు నాటి సంఘటన గుర్తొస్తుంది. నాడు ఆ ప్రమాదం నుంచి బాబాయే బయటపడేశాడు అనిపిస్తుంది. మీ ప్రాణాలు కాపాడాడని బాబాపై ఎక్కువ భక్తి పెంచేసు కున్నారా? నమ్మకం. ఏదైనా సమస్య వచ్చినా బాబా చూసుకుంటా డుగా అనే ధైర్యం. ఉదయాన్నే దీపారాధన చేసుకుంటాను. ఆ తర్వాత రోజువారీ పనుల్లో పడిపోతాను కానీ మూఢంగా ఉండను. ఇన్నేళ్ల జీవితాన్ని ఒకసారి తరచి చూసుకుంటే మాత్రం భక్తి విషయంలో నాలో చాలా మార్పు వచ్చింది. దేవుడు పూజ గదిలోనే ఉండడు, ఏదైనా అన్నీ మన లోపల నుంచే జరగాలి అనే భావన కలిగింది. అది నా వృత్తిలో భాగంగా కొంతమంది మహానుభావులను కలుసుకోవడం వల్ల, ధ్యానం, అంతర్నేత్రం వంటివి పరిచయం అయ్యాయి. అయితే, గుడి వాతావరణం వేరు. అక్కడ పాజిటివ్ ఎనర్జీ పుష్కలంగా ఉంటుంది. ఆ ఎనర్జీ కోసం కుదిరినప్పుడల్లా ఆలయానికి వెళుతుంటాను. ఏయే ఆలయాలను సందర్శించారు? ఏ ఆలయం మీకు బాగా నచ్చుతుంది? నా చిన్నతనంలో సికింద్రాబాద్ గణేష్ ఆలయానికి తరచూ వెళ్లేదాన్ని. కేరళ వైపు మాత్రం వేల సంవత్సరాల క్రితం రాజులు కట్టించిన గొప్ప గొప్ప ఆలయాలు ఉన్నాయి. ్ఞఅవి ఎంత ప్రశాంతంగా ఉంటాయో మాటల్లో చెప్పలేను. ఆ గుళ్లలో అడుగుపెడితే చాలు.. ఎంతో హాయిగా ఉంటుంది.పెళ్లికి ముందు చాలా గుళ్లకు తిరిగాను. దాదాపు రోజూ ఏదో గుడికి వెళుతుండేదాన్ని. పెళ్లి తర్వాత వారానికో, పది రోజులకో వెళ్లేదాన్ని. దీని బట్టి చూస్తే పతి దేవుడు వచ్చాక మిగతా దేవుళ్లందరూ వెనకసీటు తీసుకున్నారు అనిపించింది. (నవ్వుతూ) పుట్టింటి పూజలకు, అత్తింటి పూజలకు వ్యత్యాసాలు. ఎలా బ్యాలెన్స్ చేసుకున్నారు? పెళ్లయ్యాక కూడా పెద్ద మార్పులేం లేవు. అత్తంటివారు అయ్యంగార్ ఫ్యామిలీ కావడంతో కొన్నిపూజలు కలిసిపోయాయి. పుట్టింటి తరపున రెండే పండగలు ఓనమ్, విషు. పంటలు వచ్చాయని ‘ఓనమ్,’ కొత్త సంవత్సరం అని ‘విషు’ చేసుకుంటాం. కేరళ సంస్కృతిలో నాకు నచ్చేది ఓనమ్ పండగ. దీని విశేషం ఏంటంటే హిందూ– ముస్లిం– క్రిస్టియన్ అనే తేడా లేకుండా అన్ని మతాల వారు ఈ పండగను సంబరంగా జరుపుకుంటారు. మా వైపు దసరా పండగకు అమ్మవారి పూజ ఉంటుంది. ఆ పూజ అంటే చిన్నతనంలో భక్తి కన్నా ఇష్టం ఎక్కువ ఉండేది. కారణం, ఆ పూజ రెండు రోజులు అమ్మవారి దగ్గర పుస్తకాలన్నీ పెట్టేవారు. చదువుకోవాల్సిన అవసరం పడేది కాదు. (నవ్వుతూ) దీంతో ఇంకో రెండు రోజులు పూజ ఉంటే బాగుండేది అనుకునేదాన్ని. వినాయకచవితికి కూడా దేవుడి పటానికి పువ్వులు పెట్టి, కొబ్బరికాయ కొట్టి, అగరువత్తులు వెలిగించి ప్రసాదాలు తినేవాళ్లం. అక్కడ చవితి రోజు మాత్రమే అలా చేసేవాళ్లం. కానీ, ఈ 18 ఏళ్లలో వినాయక పూజ జరిగే పది రోజులూ ఉత్సవాల్లో పాల్గొనడం అలవాటైపోయింది. దైవాన్ని అర్ధం చేసుకోవడం అంటే... మానవసేవయే మాధవ సేవ అనే కోణం నుంచి మాత్రమే అర్థం చేసుకోగలం. కొన్నేళ్ల క్రితం ఖమ్మం నుంచి ఒక పెద్దావిడ నన్ను వెతుక్కుంటూ వచ్చింది వృద్ధాశ్రమ ఏర్పాటుకు సాయం కోరుతూ! ఆమె భర్త రిటైర్మెంట్ తర్వాత వచ్చిన డబ్బుతో వృద్ధుల కోసం ‘హోమ్’ ఏర్పాటుచేస్తున్నారు. ఆశ్రమానికి కావల్సిన భూమి కొనుక్కోవడానికి వాళ్ల డబ్బులు సరిపోయాయి కానీ బిల్డింగ్ కట్టడానికి లేవు. అప్పుడు ఆమెకు కొంత సాయం చేశాను. కానీ, అవి ఏ మూలకూ సరిపోవు. అప్పుడే ఒక టీవీ షో చేస్తున్నప్పుడు వీరి విషయం చెప్పాను. ఆ కార్యక్రమంలో హోమ్ కోసం వృద్ధ దంపతులు పడుతున్న తపనను చెప్పాను. దాంతో వారికి బిల్డింగ్‌తో పాటు ఆ ఆశ్రమం నడపడానికి కావల్సినంత ధన సాయం అందింది. ఇది నాకు చాలా ఆనందాన్నిచ్చింది. ఎవరికైనా సాయం చేస్తే కలిగే ఆనందం ఎంత సంపాదించినా రాదని అప్పుడే అర్థమైంది. సుమ రాజీవ్‌కనకాల పేరుతో స్వచ్ఛంధ సంస్థను ఏర్పాటు చేసి, పేద విద్యార్థులకు సాయమందిస్తున్నాం. ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ కార్యక్రమంలో పాల్గొన్నప్పుడు వచ్చిన మొత్తాన్ని వృద్ధ నిరుపేద కళాకారులకు చేయూతనివ్వాలని– ‘మా’, టీవీ అసోసియేషన్‌కు కొంత, కనకాల ఊరిలోని స్కూల్ డెవలప్మెంట్కి, రాజమండ్రిలోని మరో స్కూల్‌కి కేటాయించాం. ఇప్పటికీ కొన్ని ప్రభుత్వ స్కూళ్లను ఎంచుకొని పిల్లలకు అవసరమైన టెక్నాలజీ పట్ల అవగాహన ఏర్పడటానికి కావల్సిన సదుపాయాలను కల్పిస్తున్నాం. దేవుడి పూజలో లీనమైనప్పుడు ఈ పనులే చేయాలనే గైడెన్స్ వస్తుంటాయా? ధ్యానం ద్వారా మాత్రం గైడెన్స్‌ను పొందవచ్చు. అప్పుడే దేవుడి పూజతోకన్నా మనం దేవుడితో ఉండటం ముఖ్యం అని తెలుస్తుంది. మనలో ఉండే అంతర్జ్ఞానం ద్వారా ఆ గైడెన్స్‌ను మనమే స్వీకరించవచ్చు. అలాంటివి నేనూ పొందుతుంటాను. ఎలాగంటే– ఏదైనా పనికి పూనుకున్నప్పుడు ‘ఇది చేయాలి అనో, ఇది వద్దు అనో’ ఒక ఇన్నర్‌వాయిస్ వస్తుంది. దీనిని జాగ్రత్తగా గమనిస్తే తెలుస్తుంది. అప్పుడు ఏది బలంగా అనిపిస్తే ఆ పనిని మొదలుపెట్టడం అలవాటైపోయింది. దీనికి రోజూ ఒక సాధన చేయడం కూడా అలవాటు చేసుకోవాలి. మంచి ఆలోచనలు పెంచుకోవాలి. వాటిని విశ్వంలోకి పంపించాలి. అప్పుడు మంచి ఏదైనా యూనివర్స్ నుంచి మనకు తిరిగి వస్తుంది. ఈ నమ్మకం ఇటీవల బలంగా ఏర్పడింది. దేవుడిని భయంతో ప్రార్థించిన సందర్భాలు... భయంతో ప్రార్థించింది, ఆనందంగా దైవానికి కృతజ్ఞతలు తెలుపుకున్నది ఒకే సందర్భంలో జరిగాయి. నేను ప్రెగ్నెంట్‌గా ఉన్నప్పుడు సూర్యగ్రహణం వచ్చింది. అప్పుడు షూటింగ్లో ఉన్నాను. గ్రహణ సమయంలో బయట తిరిగితే పుట్టే పిల్లలు అంగ వైకల్యంతో పుడతారని విని భయ పడ్డాను. బాబాను ప్రార్థించే దాన్ని. బాబు ఆరోగ్యంగా పుట్టినప్పుడు బాబాకు కృతజ్ఞతలు చెప్పుకున్నాను. – నిర్మలారెడ్డి చిల్కమర్రి -
‘ఎవరు మీలో కోటీశ్వరుడు?’ సొమ్ము సేవలకే..
-టీవీ యాంకర్ సుమ, నటుడు రాజీవ్ కనకాల యానాం : సేవా దృకృథంతో వివిధ కార్యక్రమాలను అమలు చేస్తున్నట్లు టీవీ యాంకర్ కనకాల సుమ పేర్కొన్నారు.శనివారం స్ధానిక కనకాలపేట ప్రభుత్వ హైస్కూల్‌కు రూ.60 వేల విలువచేసే ప్రొజెక్టర్, స్క్రీన్‌ను అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ హీరో, తనభర్త రాజీవ్ కనకాల, తాను కలిసి మాటీవీలో ప్రసారమైన ‘మీలో ఎవరు కోటీశ్వరుడు?’ కార్యక్రమంలో పాల్గొని గెలిచిన సొమ్ముతో వివిధ సేవాకార్యక్రమాలు చేస్తున్నట్టు చెప్పారు. దీనిలో భాగంగానే పాఠశాల విద్యార్థులకు ఉపయోగపడే ప్రొజెక్టర్ ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలిపారు. కనకాల రాజీవ్ మాట్లాడుతూ తన స్వగ్రామంలో ఇటువంటి సామాజిక కార్యక్రమాలు చేయడం ఎంతో ఆనందాన్నిస్తోందన్నారు. ఇప్పటికే హైదరాబాద్, రాజమండ్రి తదితర చోట్ల ప్రొజెక్టర్లు ఇచ్చినట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయురాలు కేఎన్ లక్ష్మి, ఉపాధ్యాయులు లక్ష్మణరావు, సూర్యప్రకాష్, నళినీకుమారి,మహ్మద్ యాకూబ్ తదితరులు పాల్గోన్నారు. -
డీజే ఆడియో: యాంకర్ సుమ షాక్
హైదరాబాద్: అల్లు అర్జున్ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం దువ్వాడ జగన్నాథమ్ చిత్ర ఆడియో వేడుక ఆదివారం శిల్ప కళా వేదికలో వైభవంగా జరిగింది. ఈ చిత్రానికి హరీష్ శంకర్ దర్శకుడు. పూజా హెగ్డే కథానాయిక. దిల్ రాజు నిర్మాత. ఆడియో విడుదల సందర్భంగా యాంకర్‌గా వ్యవహరించిన సుమకు చిత్ర బృందం షాక్ ఇచ్చింది. ‘డీజే’ చిత్రంలోని ‘మెచ్చుకో..’ పాటను సుమ విడుదల చేయాలంటూ దర్శకుడు హరీష్ శంకర్, నిర్మాత దిల్‌రాజు కోరడంతో సుమ ఆశ్చర్యపోయారు. తొలిసారి ఓ పాటను విడుదల చేయడానికి అవకాశం ఇచ్చిందుకు ధన్యవాదాలంటూ ఆనందపడ్డారు. డీజేలోని పాటను విడుదల చేయడం ద్వారా చరిత్రలో తనకూ కొన్ని పేజీలుంటాయని సుమ అనడంతో వేడుకలో నవ్వులు పూశాయి.