
అమ్మమ్మ సావిత్రమ్మతో యాంకర్ సుమ
బంజారాహిల్స్ : ప్రముఖ బుల్లితెర యాంకర్ సుమ కనకాల అమ్మమ్మ పల్లసన పచ్చువిట్టిల్ సావిత్రమ్మ మంగళవారం తన వందో పుట్టిన రోజు వేడుకను జరుపుకున్నారు. కేరళలో జరిగిన పుట్టిన రోజు వేడుకల్లో సుమతో పాటు భర్త రాజీవ్ కనకాల పాల్గొన్నారు. ఈ సందర్భంగా సుమ మాట్లాడుతూ అమ్మమ్మ వందేళ్ల పుట్టిన రోజు వేడుకల్లో పాల్గొనడం తన జీవితంలో మర్చిపోలేని రోజన్నారు.