
సాక్షి,హైదరాబాద్: బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 14లో గురువారం అర్ధరాత్రి పోర్షే కారు బీభత్సం సృష్టించింది. వేగంగా దూసుకొచ్చిన కారు అదుపుతప్పి కేబీఆర్ పార్కు ప్రహరీ గోడను ఢీకొట్టింది. కేబీఆర్ పార్క్ ఫుట్ పాత్ దాటి ప్రహరీ గోడ గ్రిల్‌ను ధ్వంసం చేసి చెట్టును ఢీకొట్టి కారు ఆగిపోయింది.
ప్రమాదం అనంతరం డ్రైవర్ కారును వదిలి అక్కడి నుంచి పరారయ్యాడు. ఎయిర్ బెలూన్స్ ఓపెన్ కావడంతో ప్రమాదం తప్పినట్లు తెలుస్తోంది. శుక్రవారం ఉదయం ప్రమాదస్థలికి చేరుకున్న పోలీసులు క్రేన్ సాయంతో కారును అక్కడి నుంచి తొలగించారు. ర్యాష్ డ్రైవింగ్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చదవండి: పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం
Comments
Please login to add a commentAdd a comment