ఆమె కుమార్తెతో అసభ్య ప్రవర్తన
–వ్యక్తిపై కేసు నమోదు
బంజారాహిల్స్: పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు. శారీరక సంబంధం పెట్టుకోవడమే కాకుండా ఆమె కుమార్తె అయిన మైనర్‌తో అసభ్యంగా ప్రవర్తించిన వ్యక్తిపై పోలీసులు కేసు నమోదుచేశారు. ఖమ్మంకు చెందిన ఓ మహిళ భర్త, కుమార్తెతో కలిసి బతుకుదెరువు కోసం నగరానికి వచి్చంది. అస్లాం అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. మహిళ, ఆమె భర్త మధ్య చిచ్చు పెట్టి మనస్పర్థలు వచ్చేలా చేసి దూరం ఉండేలా చేశాడు. అనంతరం పెళ్లి చేసుకుంటానని మహిళతో శారీరక సంబంధం పెట్టుకున్నాడు.
పెళ్లి చేసుకోకపోగా మహిళ కష్టపడి తెచ్చే డబ్బును తన విలాసాలకు వాడేవాడు. అంతే కాకుండా ఆమె కుమార్తె మైనర్‌పై పలుమార్లు అసభ్యకరంగా ప్రవర్తించాడు. ఈ విషయం బయటకు చెబితే చంపేస్తానని బెదిరించాడు. ఇటీవలె ఇంట్లో ఉన్న రెండు తులాల బంగారు ఆభరణాలు, 15 తులాల వెండి తీసుకొని తనఖా పెట్టి వచి్చన డబ్బుతో జల్సా చేస్తున్నాడు. ఇదేమని ప్రశి్నస్తే సమాధానం చెప్పకుండా ముఖం చాటేశాడు. బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదుచేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment