Cheating woman
-
ప్రేమ పేరుతో వంచించాడని..
బెల్లంపల్లిరూరల్: ప్రేమ పేరుతో వంచనకు గురైన యువతి బలవన్మరణం చెందిన సంఘటన పట్టణంలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు హనుమాన్ బస్తీకి చెందిన జంగపల్లి సాయిస్నేహిత(21), మహ్మద్‌ఖాసీం బస్తీకి చెందిన బీఆర్ఎస్వీ బెల్లంపల్లి నియోజకవర్గ అధ్యక్షుడు ఈదునూరి శ్రీనాథ్ కొంతకాలంగా ప్రేమించుకున్నారు. యువతి పెళ్లి ప్రస్తావన తీసుకరావడంతో కుటుంబసభ్యులు నిరాకరిస్తున్నారని చెప్పడంతో తీవ్ర వేదనకు గురైంది. సోమవారం రాత్రి ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్యకు యత్నించింది. గమనించిన కుటుంబసభ్యులు స్థానిక ప్రభుత్వ ఏరియా ఆస్పత్రికి తీసుకెళ్లగా పరీక్షించిన వైద్యులు మంచిర్యాలకు రెఫర్ చేశారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందింది. బెల్లంపల్లి ఏసీపీ రవికుమార్ మృతురాలి కుటుంబ సభ్యులతో మాట్లాడి వివరాలు తెలుసుకన్నారు. శ్రీనాథ్ మోసం చేశాడనే తమ కూతురు ఆత్మహత్య చేసుకుందని మృతురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఏఎస్సై నర్సయ్య తెలిపారు. కాగా సాయి స్నేహిత మృతిలో ఆరోపణలు ఎదుర్కొంటున్న బీఆర్ఎస్వీ నియోజకవర్గ అధ్యక్షుడు ఈదునూరి శ్రీనాథ్‌ను పదవి నుంచి తొలగించినట్లు బీఆర్ఎస్వీ జిల్లా అధ్యక్షుడు బడికెల శ్రావణ్ తెలిపారు. -
పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం...
బంజారాహిల్స్: పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు. శారీరక సంబంధం పెట్టుకోవడమే కాకుండా ఆమె కుమార్తె అయిన మైనర్‌తో అసభ్యంగా ప్రవర్తించిన వ్యక్తిపై పోలీసులు కేసు నమోదుచేశారు. ఖమ్మంకు చెందిన ఓ మహిళ భర్త, కుమార్తెతో కలిసి బతుకుదెరువు కోసం నగరానికి వచి్చంది. అస్లాం అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. మహిళ, ఆమె భర్త మధ్య చిచ్చు పెట్టి మనస్పర్థలు వచ్చేలా చేసి దూరం ఉండేలా చేశాడు. అనంతరం పెళ్లి చేసుకుంటానని మహిళతో శారీరక సంబంధం పెట్టుకున్నాడు. పెళ్లి చేసుకోకపోగా మహిళ కష్టపడి తెచ్చే డబ్బును తన విలాసాలకు వాడేవాడు. అంతే కాకుండా ఆమె కుమార్తె మైనర్‌పై పలుమార్లు అసభ్యకరంగా ప్రవర్తించాడు. ఈ విషయం బయటకు చెబితే చంపేస్తానని బెదిరించాడు. ఇటీవలె ఇంట్లో ఉన్న రెండు తులాల బంగారు ఆభరణాలు, 15 తులాల వెండి తీసుకొని తనఖా పెట్టి వచి్చన డబ్బుతో జల్సా చేస్తున్నాడు. ఇదేమని ప్రశి్నస్తే సమాధానం చెప్పకుండా ముఖం చాటేశాడు. బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదుచేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
ఈ మహిళ రూటే సపరేటు.. ప్రేమ, పెళ్లిళ్లు, మూడు నెలలు కాపురం చేసి!
తిరువొత్తియూరు: సేలంలో ఓ ఫైనాన్షియర్‌ను మోసం చేసిన ఇన్‌స్ట్రాగామ్ బ్యూటీ కేరళ, కర్ణాటకలోనూ ప్రేమ వివాహాల మోసాలకు పాల్పడిన విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది. వివరాలు.. సేలం జిల్లా ధర్మంగళం సమీపంలోని తోలసంబట్టి ప్రాంతానికి చెందిన మూర్తి ఫైనాన్షియర్ (30) కొద్ది రోజుల క్రితం తొలసంబట్టి పోలీసులకు ఫిర్యాదు చేశారు. అందులో శ్ఙ్రీతాను ఇన్‌స్ట్రాగామ్ ద్వారా పరిచయమైన నీలగిరి జిల్లా కూడలూరుకు చెందిన రషీత అనే బ్యూటీతో ప్రేమలో పడ్డాను. గత మార్చిలో ఓమలూరు ఈశ్వవరన్ దేవాలయంలో పెళ్లి చేసుకున్నాం. 3 నెలల పాటు కాపురం చేసిన ఆమె గత నెల 4వ తేదీ ఉదయం కనిపించకుండా పోయింది. ఇంట్లో ఉన్న 4 తులాల నగలు, రూ.1.50 లక్షల డబ్బు తీసుకుని మాయమైంది. ఆమెను పట్టుకొని అరెస్ట్ చేయాలి అని తెలిపాడు. ఈ ఫిర్యాదుపై పోలీసులు సీరియస్‌గా విచారణ చేపట్టారు. ఈ సందర్భంలో రషీత ఇన్‌స్ట్రాగామ్‌లో మోడల్‌గా వివిధ రూపాల్లో ఉన్న చిత్రాలను పోస్ట్ చేయడం, డబ్బున్న పురుషులను ప్రలోభపెట్టడం ద్వారా వివాహ మోసానికి పాల్పడినట్లు వెల్లడైంది. ఫైనాన్షియర్ మూర్తిని వివాహం చేసుకునేందుకు ముందే గతంలో కోయంబత్తూరు, కేరళ, కర్ణాటకలో కొందరిని మోసం చేసి పెళ్లి చేసుకున్న విషయం వెల్లడైంది. ఈ కోణంలో పోలీసులు ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నారు. అలాగే ప్రస్తుతం పరారీలో ఉన్న రషీత కోసం పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. ఆమె బంధువులు సేలం, నీలగిరిలో ఉన్నారని వారిని కూడా ప్రశ్నిస్తున్నట్లు తెలిసింది. -
ఇంతకీ.. ఆ డాక్టర్ సంగతేమిటో!?
చిత్తూరు రూరల్: చిత్తూరు ప్రభుత్వ ఆస్పత్రి జిల్లా వైద్య ఆరోగ్యశాఖ పరిధిలోకి వచ్చే ఓ అధికారి ఓ విభాగ అధిపతిగా ఉన్నారు. గతంలో ఓ కాంట్రాక్టు మహిళా వైద్యురాలితో అనుచితంగా ప్రవర్తించి చెప్పుదెబ్బలు తిన్నాడు. తాజాగా ఓ యువతిని లైంగింక వేధింపులకు గురిచేసి అజ్ఞాతంలోకి వెళ్లినట్లు ప్రచారంలోకి వచ్చింది. యువతి బంధువులు అతడిని చితకబాదడంతో ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందిన ఆ అధికారి.. ఆపై, సెలవు పెట్టి జిల్లా నుంచి జంప్ అయినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం తన సొంతూరైన ఖమ్మంలో ఓ ప్రైవేటు క్లినిక్ పెట్టుకుని ప్రాక్టీస్ చేస్తున్నట్లు భోగట్టా! ప్రస్తుతం ఇది చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రితో పాటు వైద్య ఆరోగ్యశాఖలో హాట్ టాపిక్‌గా నానుతోంది. దీనికి సంబంధించి సేకరించిన వివరాల మేరకు.. ఓ యువతికి (వైద్య సిబ్బంది) పర్మినెంట్ ఉద్యోగం పేరిట వల వేసి, గర్భం చేసినట్లు తెలిసింది. ఇది యువతి కుటుంబీకులు తెలియడంతో తిరుపతిలోని ఆ అధికారి ఇంటికి వెళ్లి చితకబాధినట్లు సమాచారం. ఆ అధికారి బాగోతం కలెక్టర్ దృష్టికి వెళ్లడంతో ఆయన సీరియస్ అయ్యారని తెలుస్తోంది. దీంతో ఆయన దీర్ఘకాలిక సెలవు పెట్టి తన స్వస్థలానికి వెళ్లినట్లు తెలియవచ్చింది. ఫిర్యాదు అందితే విచారణ చేస్తాం దీనిపై డీఎంఅండ్హెచ్ శ్రీహరిని వివరణ కోరగా..బాధితులు ఎవరైనా రాత పూర్వకంగా ఫిర్యాదు చేస్తే ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు విచారణ చేసి, చర్యలు తీసుకుంటామని చెప్పారు. -
ప్రేమా లేదు.. పెళ్లి లేదూ.. భర్త చనిపోతే ఆస్తి కోసం చేరదీశాడంతే!
ఆటోనగర్ (విజయవాడ తూర్పు): ఓ మహిళ భర్త కరోనాతో గత ఏడాది మృతి చెందారు. ఆమెకు పిల్లలు లేరు. ఆమె పేరిట రూ.1.20 కోట్ల ఆస్తి ఉంది. ఆ వితంతువును ఓ కానిస్టేబుల్ నమ్మించాడు. అతనికి అప్పటికే పెళ్లయింది. భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. అయితే వితంతు మహిళతో కానిస్టేబుల్ పరిచయం పెంచుకున్నాడు. అనధికారికంగా పెళ్లి చేసుకున్నాడు. ఆపై ఆమె ఆస్తిని కాజేసేందుకు యత్నించాడు. బాధితురాలి ఫిర్యాదుతో ఈ వ్యవహారం వెలుగుచూసింది. విజయవాడ పటమట పోలీసుల కథనం మేరకు.. విజయవాడ రామలింగేశ్వరనగర్‌కు చెందిన మహిళ భర్త గతేడాది కరోనాతో మృతి చెందాడు. వారికి పిల్లలు లేరు. కూచిపూడి పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్ ఉద్యోగం చేస్తున్న దేవేంద్రకు కొద్ది నెలల క్రితం ఆమెతో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం ప్రేమగా మారింది. వారిద్దరు ఓ గుడిలో దండలు మార్చుకొని అనధికారికంగా వివాహం చేసుకున్నారు. రామలింగేశ్వరనగర్లో ఆ మహిళకు రూ.1.20 కోట్ల విలువు చేసే ఇల్లు ఉంది. ఆమెకు తెలియకుండా ఆ ఇంటిని కానిస్టేబుల్ బేరానికి పెట్టాడు. కొనేందుకు వచ్చిన వారి నుంచి రూ.40 లక్షలు తీసుకున్నాడు. ఈ విషయం ఆ మహిళకు ఆలస్యంగా తెలిసింది. తీసుకున్న డబ్బులు ఇవ్వాలని దేవేంద్రపై వత్తిడి చేసింది. అయితే అతను పట్టించుకోకపోవడంతో పటమట పోలీసులకు మంగళవారం ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామని ఎస్ఐ జాన్‌బాషా తెలిపారు. -
మహిళపై కన్నేసిన హెడ్ కానిస్టేబుల్.. కంప్లైట్ ఇచ్చేందుకు వస్తే లోబర్చుకొని
సాక్షి, మైసూరు(కర్ణాటక):నంజనగూడు తాలూకా హుల్లహళ్లి పోలీస్‌స్టేషన్‌లో హెడ్ కానిస్టేబుల్‌గా పనిచేసే సి.కృష్ణపై కేసు నమోదైంది. వివరాలు.. నిందితుడు టి.నరిసిపుర తాలూకా బన్నూరు పీఎస్‌లో పనిచేసే సమయంలో ఒక మహిళ భర్తతో గొడవలతో ఫిర్యాదు చేయడానికి వచ్చింది. కృష్ణ ఆమెను లోబర్చుకుని మైసూరు నగరంలో కాపురం పెట్టాడు. ఆమె పేరుతో రూ.5 లక్షల రుణం తీసుకున్నాడు. కొంతకాలం తరువాత తనని పెళ్లి చేసుకోవాలని ఆమె కృష్ణని కోరగా పెళ్లి చేసుకోనని, తాను చెప్పినట్లు వినకపోతే కష్టాలు తప్పవని బెదిరించాడు. ఇటీవల కృష్ణ, అతని కుమారుడు కిరణ్ కలిసి ఆమెను కొట్టారు. దీంతో బాధితురాలు హుల్లహళ్లి పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు విచారణ చేపట్టారు. పెళ్లయి ఏడాది.. ఆత్మహత్య హోసూరు: డెంకణీకోట తాలూకా తళి జయంతి కాలనీకి చెందిన తిరుమలప్ప భార్య భూమిక (19). వీరికి గత ఏడాది క్రితం పెళ్లి జరిగింది. భూమిక గత కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ పలు ఆస్పత్రుల్లో చికిత్స పొందింది. ఆరోగ్యం బాగుపడక పోవడంతో విరక్తి చెందిన ఆమె గురువారం ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకొంది. తళి పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారణ జరుపుతున్నారు. చదవండి: భర్త కర్కశత్వం..భార్య విడాకుల నోటీసులో సంతకం చేయలేదని.. -
యువతులను వంచించి.. నగ్న ఫొటోలు, వీడియోలతో వికృతానందం
సాక్షి, బెంగళూరు: మోడలింగ్‌లో అవకాశాలు కల్పిస్తామంటూ యువతుల నగ్న ఫొటోలు, వీడియోలు తీసుకుని వికృతానందం పొందుతున్న యువకుడిని మంగళవారం కర్ణాటకలోని హలసూరు పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నిందితుడు ప్రపంచన్ ఓ ప్రైవేటు కళాశాలలో చదువుతున్నాడు. సామాజిక మాధ్యమాల్లో నకిలీ అకౌంట్లు ఓపెన్ చేశాడు. మోడలింగ్‌పై ఆసక్తి ఉన్నవారిని గుర్తించి మాయమాటలు చెప్పి వారి నగ్నఫొటోలు, వీడియోలు తీసుకొని వికృతానందం పొందేవాడు. అతని మొబైల్‌ను పరిశీలించగా వెయ్యికిపైగా యువతుల ప్రైవేటు ఫొటోలు, దాదాపు 400 వీడియోలు వెలుగు చూశాయని డీసీపీ శరణప్ప తెలిపారు. చదవండి: ప్రియుని మోజులో భర్త హత్య.. నిజం చెప్పిన కొడుకు -
నమ్మించి.. దోచేశాడు!
గోపాలపట్నం (విశాఖ పశ్చిమ): సబ్ ఇన్స్పెక్టర్ని అంటూ ఓ నకిలీ ఐడీ కార్డు... నాలుగు మాయ మాటలు... అవే పెట్టుబడిగా ఓ యువతిని నమ్మించి మోసగించిన నకిలీ ఎస్ఐపై కంచరపాలెం పోలీసులు కేసు నమోదు చేశారు.రూ.12.8లక్షలు దోచుకోవడంతోపాటు బంగారు ఆభరణాలూ తాకట్టు పెట్టేశాడని... నమ్మించి పెళ్లి చేసుకుని మోసగించాడని బాధితురాలు ఫిర్యాదులో పేర్కొంది. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... గవర కంచరపాలెంలో నివాసముంటున్న పైడి ధనలక్ష్మికి శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలస మండలం కొర్లకోటకు చెందిన పైడి రామచంద్రరావుతో పరిచయం ఏర్పడింది. తాను ఎస్ఐని అని, ప్రస్తుతం సస్పెండ్‌లో ఉన్నానని... గ్రూప్ – 1 పరీక్షల కోసం సిద్ధమవుతున్నానని నమ్మించాడు. కొన్నాళ్లకు ఆ పరిచయం ప్రేమగా మారడంతో గత ఏడాది జూన్ 19న నగరంలోని వన్‌టౌన్‌లోని వరసిద్ధి వినాయక ఆలయంలో కులాంతర వివాహం చేసుకుని రిజిస్టర్ చేయించారు. అయినప్పటికీ పెళ్లి వ్యవహారమంతా బయటకు పొక్కకుండా, తన కుటుంబ సభ్యులకు తెలియకుండా జాగ్రత్తపడ్డాడు. తన చదువుల కోసం డబ్బులు అవసరమంటూ ధనలక్ష్మి తండ్రి నుంచి పలుమార్లు డబ్బులు రామచంద్రరావు తీసుకున్నాడని.., తన బంగారు ఆభరణాలు సైతం తాకట్టు పెట్టాడని బాధితురాలు ఫిర్యాదులో పేర్కొంది. నకిలీ ఐడీ కార్డు తయారు చేసుకుని మోసం చేశాడని, తమ పెళ్లి విషయం తెలిసిన రామచంద్రరావు తల్లి పైడి జయలక్ష్మి, ఆడపడుచు దేవిక కులం పేరుతో దూషించారని, గవర కంచరపాలెంలో పెద్ద మనుషులపంచాయితీలో కూడా తన కుటుంబాన్ని దూషించారని ఫిర్యాదులో పేర్కొంది. నమ్మించి మోసానికి పాల్పడిన రామచంద్రరావుపై చర్యలు తీసుకోవాలని కోరింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు కంచరపాలెం పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడు రామచంద్రరావును ఆదివారం అదుపులోకి తీసుకున్నారు. అనంతరం కేసును ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ సెల్‌కు బదిలీ చేశారు. పూర్తిస్థాయి దర్యాప్తు అనంతరం చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. -
పెళ్లి చేసుకోమంటే.. నగ్న ఫోటోలతో బయపెడుతూ..
సాక్షి, కర్ణాటక : ఓ ఉపాధ్యాయురాలిని మోసగించిన కేసులో పోలీసులకు పట్టుబడిన వ్యక్తి సామాన్యుడు కాదు, మేకవన్నె పులి వంటి కామాంధుడు అని పోలీసుల విచారణలో వెలుగు చూసింది. అమాయక మహిళలను దోచుకోవడంలో నేర్పరి అని వెల్లడైంది. ఇతడు చదివింది కేవలం పీయూసీ వరకే. అయినా సాఫ్ట్వేర్ ఇంజనీర్ అని, లండన్‌లో ఉద్యోగమని చెలామణి అవుతూ ఓ ఉపాధ్యాయురాలిని లైంగికంగా, ఆర్ధికంగా దోచాడు, అలాగే పలువురిని లక్షలాది రూపాయల మేర చీటింగ్ చేసిన జో అబ్రహాం మాథ్యూస్ అనే కేరళవాసి ఉదంతం బెంగళూరులో చర్చనీయాంశమైంది. సహజీవనం, సొమ్ము కైంకర్యం ఇతని విచారణలో కొత్తకొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. బెంగళూరులో ఓ మహిళను వివాహం చేసుకుంటానని నమ్మించి గత 9 ఏళ్లు పాటు సహజీవనం చేసి రూ.45 లక్షలు సొమ్ము కాజేసినట్లు తెలిసింది. అతనిపై బాధితురాలు బెంగళూరులో కేసు పెట్టింది. అంతకు ముందే ఓ టీచర్‌కు కూడా ఇలాగే రూ.38 లక్షలు టోపీ వేశాడు. కోరమంగల నివాసి అయిన నిందితుడు (35)ని గత వారం అత్యాచారం కేసులో నగర పోలీసులు అరెస్ట్ చేశారు. అబద్ధాలతో గొప్పలు ఇతనికి పెళ్లయి బెంగళూరులో ఉంటున్నాడు. కానీ అవివాహితున్నని, లండన్‌లో ఉన్నట్లు నమ్మించి పలువురు మహిళలను వివాహం చేసుకుంటానని లైంగికంగా వాడుకుని డబ్బులు, ఆస్తులు కొట్టేయడంతో ఆరితేరాడు. ఎల్రక్టానిక్ సిటీ పోలీస్‌స్టేషన్‌లో 39 ఏళ్ల మహిళ ఫిర్యాదుతో ఇతని పాపాల పుట్ట కదిలింది. ఆమె ఓ మ్యాట్రిమోనియల్ వెబ్సైట్లో పెట్టిన ప్రొఫైల్‌ను చూసిన మోసగాడు 2012లో పరిచయం పెంచుకున్నాడు. తన పేరు తళత్ ప్రసాద్ అని పెళ్లాడతానని వలలో వేసుకున్నాడు. దేశంలో పలు ప్రాంతాల్లో విహార యాత్రలు చేశారు. లండన్‌లో బ్రిటిష్ రాయబార కార్యాలయంలో పనిచేస్తానని చెప్పుకున్నాడు. అనంతరం తనకు అనేక వ్యక్తిగత సమస్యలు ఉన్నాయని ఆమె నుంచి విడతల వారీగా రూ.45 లక్షలు దండుకున్నాడు. పెళ్లి చేసుకోమని అడగ్గా, ఏదో ఒక మాట చెప్పి వాయిదా వేయసాగాడు. ఇక 2016లో ఓ మహిళపై మాథ్యూస్ అత్యాచారానికి పాల్పడిన కేసులో జైలుకెళ్లి జామీనుపై విడుదలయ్యాడు. దీనిపై ప్రశ్నించిన మహిళను అబద్ధమని ఏమార్చాడు. ఆమె పెళ్లి చేసుకోవాలని, లేదంటే తన డబ్బులు తిరిగి ఇవ్వాలని అడిగితే నగ్న ఫోటోలను బయటపెడతానని బెదిరించేవాడు. కోరమంగలలో ఉన్న మ్యాథ్యూస్ ఇంటికి ఆ మహిళ వెళ్లినప్పుడు అతని భార్య స్త్రీ కనిపించింది. ఆమె తన సహోదరి అని నమ్మించాడు. కానీ ఆమె భార్య కాదని, అతని మోసాల్లో భాగస్వామి అని పోలీసులు తెలిపారు. చదవండి: జీవితం ఉన్నది అనుభవించడానికే.. ఎందరికో టోపీ ఎల్రక్టానిక్‌సిటీ పోలీసులకు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేసిన బాధితురాలు తన డబ్బు వెనక్కి ఇప్పించాలని పేర్కొంది. అంతకు ముందు కెనడాలో నివాసం ఉండే మహిళను సైతం ఇదేవిధంగా మోసగించాడు. ఆమె పేరుతో నకిలీ పత్రాలు సృష్టించి ఓ బ్యాంకు నుంచి భారీగా రుణాలు తీసుకుని ఎగవేశాడు. పోలీసులు దుండుగున్ని కోర్టులో హాజరు పరిచి తమ కస్టడీకి తీసుకుని విచారిస్తున్నారు. దర్యాప్తులో మరిన్న బాగోతాలు బయటపడే అవకాశముంది. చదవండి: ఉచితంగా బిర్యానీ ఇవ్వలేదని.. -
యువతిని మోసం చేసిన రైల్వే ఉద్యోగి అరెస్ట్
కోనేరు సెంటర్ (మచిలీపట్నం) : ప్రేమ పేరుతో యువతిని మోసగించిన రైల్వే ఉద్యోగిని ఇనగుదురుపేట పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు. అనంతరం కోర్టులో హాజరుపరిచారు. సీఐ ఎస్కే నభీ తెలిపిన వివరాలిలా ఉన్నాయి. బంటుమిల్లికి చెందిన జోగి హరికృష్ణ విజయవాడ రైల్వేలో ఉద్యోగం చేస్తున్నాడు. మచిలీపట్నంలో మరదలు వరస అయిన ఓ యువతిని ప్రేమించాడు. పెళ్ళి చేసుకుంటానని నమ్మించాడు. మాయమాటలతో లొంగ దీసుకున్నాడు. శారీరకంగా అనేకమార్లు ఆమెను కలిశాడు. పెళ్ళి విషయానికి వచ్చేసరికి కట్నం కోసం అడ్డం తిరిగాడు. పది లక్షలకుపైగా కట్నం ఇస్తే తప్ప పెళ్ళి చేసుకోనని చెప్పాడు. యువతి తల్లితండ్రులు ఈ విషయాన్ని పెద్దల సమక్షంలో పెట్టి చర్చలు జరిపారు. అయినా హరికృష్ణ ఒప్పుకోలేదు. గత్యంతరం లేని బాధితురాలు తనకు జరిగిన అన్యాయంపై ఈ నెల 16న పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు హరికృష్ణను మంగళవారం అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు. హరికృష్ణతో పాటు అతని తల్లితండ్రులను కూడా కోర్టులో హాజరుపరిచినట్లు సీఐ నభీ వివరించారు. ఈ సమావేశంలో ఎస్సై కుమార్, స్టేషన్ సిబ్బంది ఉన్నారు. -
‘మీ సేవ’లో మనీ ట్రాన్స్ఫర్ మోసం
మెదక్ మున్సిపాలిటీ: ‘మా తమ్ముడి కొడుకు ఆస్పత్రిలో ఉన్నాడని, అకౌంట్లోకి డబ్బులు ట్రాన్స్ఫర్ చేయాలని ఇచ్చిన డబ్బులు అకౌంట్లోకి రాలేదని అడిగితే’ మీ సేవ నిర్వాహకులు నానా దుర్భాషలాడుతున్నారని ఓ మహిళ మీ సేవ ముందు రోధించింది. ఈ సంఘటన బుధవారం మెదక్ పట్టణంలో చోటు చేసుకుంది. బాధితురాలి తెలిపిన వివరాల ప్రకారం.. పట్టణానికి చెందిన వనం పద్మ, తమ్ముడి కొడుకు అనారోగ్యంతో ఉండటంతో నిజామాబాద్‌లోని ఓ ఆస్పత్రిలో చికిత్స చేయిస్తున్నారు. అయితే ఆమె ఆçస్పత్రి ఖర్చుల కోసం డబ్బులను పంపించేందుకు మార్చి 31న పట్టణంలోని జీకేఆర్ గార్డెన్ ప్రాంతంలో మీసేవ సెంటర్‌కు వెళ్లింది. రూ.10వేలు నిర్వాహకులకు అప్పగించి తన తమ్ముడి ఖాతాలోకి ట్రాన్స్ఫర్ చేయాలని చెప్పింది. దీంతో డబ్బులు తీసుకున్న నిర్వాహకులు డబ్బులు పంపించామని పద్మకు చెప్పి, అందుకు సంబంధించిన రషీదు కూడా ఇచ్చారు. అయితే ఏప్రిల్ 4వ తేదీ ఖాతాలోకి డబ్బులు రాలేదు. ఈ విషయమై బాధితురాలు బుధవారం మీసేవ నిర్వాహకులను ప్రశ్నించింది. నిర్వాహకులు మాత్రం ‘గోల చేయకు ఖాతాలోకి డబ్బులోస్తాయని వెళ్లిపోమ్మంటూ’ గద్దించారు. దీంతో ఆగ్రహించిన ‘డబ్బులు ఇచ్చి వారం రోజులవుతున్నా.. ఇప్పటికీ కూడా డబ్బులు రాలేదంటే’ గద్దిస్తారా? అంటూ నిలదీసింది. దీంతో మీ సేవ నిర్వాహకులు నీ దిక్కున్న చోట చెప్పుకో అంటూ మహిళ అని చూడకుండా దుర్భాషలాడరని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేసింది. నా డబ్బులు నాకు ఇవ్వకుంటే ఇక్కడే పురుగుల మందు తాగి చచ్చిపోతానంటూ మీ సేవ ముందు బైఠాయించి రోధించింది. అయినప్పటికీ నిర్వాహకులు నీ దిక్కున్న చోట చెప్పుకో అంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈక్రమంలో అక్కడికిచేరుకున్న పోలీసులు బాధితురాలి ఆవేదన విని వెంటనే ఆమె డబ్బులు ఇవ్వాలని మీసేవ నిర్వాహకులను హెచ్చరించారు. అయినప్పటికీ వారు మాత్రం బ్యాంకులోకి సెలవులు ఉండటంతో డబ్బులు ట్రాన్స్ఫర్ కావడంలో ఆలస్యమైందని తెలిపారు. పోలీసుల సూచన మేరకు బాధితురాలికి డబ్బులు ఇస్తామని తెలిపారు. అధికారుల పర్యవేక్షణ లోపంతో మీసేవ సెంటర్ల నిర్వాహకులు తమ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. సెంటర్లకు వచ్చిన ప్రజలపై దురుసుగా వ్యవహరిస్తున్నారని ప్రజలు బహిరంగంగా ఆరోపిస్తున్న అధికారులు పట్టించుకోవడం లేదు. -
మహానగరంలో మాయలేడీ
హైదరాబాద్: మహానగరంలో ఓ మాయలేడీ మహిళలకు మాయమాటలు చెప్పి దాదాపు రెండు కోట్ల రూపాయలు కొల్లగొట్టింది. బాధితులు ఆమెను చితకబాది పఠాన్‌చెరు మండలం ఆర్సి పోలీసులకు అప్పగించారు. కర్ణాటకకు చెందిన ఈ మహిళ పటాన్ చెరు మండలం బీరంగూడలో ఆధ్యత డిజైనర్ క్రియేషన్ పేరుతో ఓ సంస్థను స్థాపించింది. ప్రజాకర్షణ పథకాలతో మహిళలకు వల వేసింది. వందలాది మహిళల నుంచి భారీ ఎత్తున డబ్బు వసూలు చేసింది. రాత్రికి రాత్రి బోర్డు తిప్పేయడంతో బాధితులు ఆందోళనకు దిగారు. కార్యాలయంపై దాడి చేశారు. ఆమెను కొట్టి, పోలీసులకు అప్పగించారు. కార్యాలయంలోని సామాగ్రి మొత్తాన్ని బాధితులు తీసుకువెళ్లారు. ఆర్సి పురం పోలీసులు రంగంలోకి దిగి విచారణ చేస్తున్నారు. -
మహానగరంలో ''మాయలేడీ''