చిత్తూరు రూరల్: చిత్తూరు ప్రభుత్వ ఆస్పత్రి జిల్లా వైద్య ఆరోగ్యశాఖ పరిధిలోకి వచ్చే ఓ అధికారి ఓ విభాగ అధిపతిగా ఉన్నారు. గతంలో ఓ కాంట్రాక్టు మహిళా వైద్యురాలితో అనుచితంగా ప్రవర్తించి చెప్పుదెబ్బలు తిన్నాడు. తాజాగా ఓ యువతిని లైంగింక వేధింపులకు గురిచేసి అజ్ఞాతంలోకి వెళ్లినట్లు ప్రచారంలోకి వచ్చింది. యువతి బంధువులు అతడిని చితకబాదడంతో ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందిన ఆ అధికారి.. ఆపై, సెలవు పెట్టి జిల్లా నుంచి జంప్ అయినట్లు తెలుస్తోంది.
ప్రస్తుతం తన సొంతూరైన ఖమ్మంలో ఓ ప్రైవేటు క్లినిక్ పెట్టుకుని ప్రాక్టీస్ చేస్తున్నట్లు భోగట్టా! ప్రస్తుతం ఇది చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రితో పాటు వైద్య ఆరోగ్యశాఖలో హాట్ టాపిక్‌గా నానుతోంది. దీనికి సంబంధించి సేకరించిన వివరాల మేరకు.. ఓ యువతికి (వైద్య సిబ్బంది) పర్మినెంట్ ఉద్యోగం పేరిట వల వేసి, గర్భం చేసినట్లు తెలిసింది.
ఇది యువతి కుటుంబీకులు తెలియడంతో తిరుపతిలోని ఆ అధికారి ఇంటికి వెళ్లి చితకబాధినట్లు సమాచారం. ఆ అధికారి బాగోతం కలెక్టర్ దృష్టికి వెళ్లడంతో ఆయన సీరియస్ అయ్యారని తెలుస్తోంది. దీంతో ఆయన దీర్ఘకాలిక సెలవు పెట్టి తన స్వస్థలానికి వెళ్లినట్లు తెలియవచ్చింది.
ఫిర్యాదు అందితే విచారణ చేస్తాం
దీనిపై డీఎంఅండ్‌హెచ్ శ్రీహరిని వివరణ కోరగా..బాధితులు ఎవరైనా రాత పూర్వకంగా ఫిర్యాదు చేస్తే ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు విచారణ చేసి, చర్యలు తీసుకుంటామని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment