బెల్లంపల్లిరూరల్: ప్రేమ పేరుతో వంచనకు గురైన యువతి బలవన్మరణం చెందిన సంఘటన పట్టణంలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు హనుమాన్ బస్తీకి చెందిన జంగపల్లి సాయిస్నేహిత(21), మహ్మద్‌ఖాసీం బస్తీకి చెందిన బీఆర్‌ఎస్వీ బెల్లంపల్లి నియోజకవర్గ అధ్యక్షుడు ఈదునూరి శ్రీనాథ్ కొంతకాలంగా ప్రేమించుకున్నారు.
యువతి పెళ్లి ప్రస్తావన తీసుకరావడంతో కుటుంబసభ్యులు నిరాకరిస్తున్నారని చెప్పడంతో తీవ్ర వేదనకు గురైంది. సోమవారం రాత్రి ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్యకు యత్నించింది. గమనించిన కుటుంబసభ్యులు స్థానిక ప్రభుత్వ ఏరియా ఆస్పత్రికి తీసుకెళ్లగా పరీక్షించిన వైద్యులు మంచిర్యాలకు రెఫర్ చేశారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందింది.
బెల్లంపల్లి ఏసీపీ రవికుమార్ మృతురాలి కుటుంబ సభ్యులతో మాట్లాడి వివరాలు తెలుసుకన్నారు. శ్రీనాథ్ మోసం చేశాడనే తమ కూతురు ఆత్మహత్య చేసుకుందని మృతురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఏఎస్సై నర్సయ్య తెలిపారు. కాగా సాయి స్నేహిత మృతిలో ఆరోపణలు ఎదుర్కొంటున్న బీఆర్‌ఎస్వీ నియోజకవర్గ అధ్యక్షుడు ఈదునూరి శ్రీనాథ్‌ను పదవి నుంచి తొలగించినట్లు బీఆర్‌ఎస్వీ జిల్లా అధ్యక్షుడు బడికెల శ్రావణ్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment