చిత్తూరు, సాక్షి: జిల్లా శివారు వద్ద అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఆగి ఉన్న టిప్పర్‌ను తప్పించబోయి ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బోల్తా పడింది. ఈ ఘటనలో నలుగురు మృతి చెందగా, 22 మందికి గాయాలయ్యాయి.
చిత్తూరు శివారులో గంగాసాగరం(Gangasagaram) వద్ద అర్ధరాత్రి 2 గం. సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. తచ్చూరు హైవే నిర్మాణ పనుల్లో భాగంగా ఓ టిప్పర్ అక్కడ ఆగి ఉంది. అదే సమయంలో అతివేగంతో దూసుకొచ్చిన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు(Private Travel Bus).. ఆ టిప్పర్‌ను తప్పించబోయి డివైడర్‌ను ఢీ కొట్టి పడిపోయింది. బస్సు తిరుపతి నుంచి మధురైకి వెళ్తున్నట్లు తెలుస్తోంది.
ప్రమాదంపై సమాచారం అందుకున్న జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్(Sumit Kumar) ఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను చిత్తూరు జిల్లా ఆసుపత్రికి తరలించి మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. వీళ్లలో పలువురి పరిస్థితి విషమంగా ఉండడంతో.. సీఎంసీ వేలూరు ఆసుపత్రి కి తరలించారు. అతివేగమే ప్రమాదానికి కారణంగా తెలుస్తోంది.
గంగసాగరం సమీపంలోని గాజుల పల్లి ఫ్లై ఓవర్ వద్ద టిప్పర్ లారీ వేగంగా ప్రవేట్ బస్సు ఢీ కొట్టడం తో ప్రమాదం జరిగింది. ప్రమాదానికి గురైన బస్సు తిరుపతి నుంచి మధురైకు వెళ్తోంది. రంగనాధన్ ఇన్ ట్రావెల్స్ బస్సు ఇది. నలుగురు స్పాట్‌లో చనిపోయారు. విషమంగా ఉన్న ఆరుగురిని చీలాపల్లి సి.ఏం.సి ఆసుపత్రి కు తలించాం. మిగిలిన వారు చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
:::శ్రీనివాసరావు, చిత్తూరు రూరల్ సీఐ
Comments
Please login to add a commentAdd a comment