సాక్షి, మైసూరు(కర్ణాటక):నంజనగూడు తాలూకా హుల్లహళ్లి పోలీస్‌స్టేషన్‌లో హెడ్ కానిస్టేబుల్‌గా పనిచేసే సి.కృష్ణపై కేసు నమోదైంది. వివరాలు.. నిందితుడు టి.నరిసిపుర తాలూకా బన్నూరు పీఎస్‌లో పనిచేసే సమయంలో ఒక మహిళ భర్తతో గొడవలతో ఫిర్యాదు చేయడానికి వచ్చింది. కృష్ణ ఆమెను లోబర్చుకుని మైసూరు నగరంలో కాపురం పెట్టాడు. ఆమె పేరుతో రూ.5 లక్షల రుణం తీసుకున్నాడు. కొంతకాలం తరువాత తనని పెళ్లి చేసుకోవాలని ఆమె కృష్ణని కోరగా పెళ్లి చేసుకోనని, తాను చెప్పినట్లు వినకపోతే కష్టాలు తప్పవని బెదిరించాడు. ఇటీవల కృష్ణ, అతని కుమారుడు కిరణ్ కలిసి ఆమెను కొట్టారు. దీంతో బాధితురాలు హుల్లహళ్లి పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు విచారణ చేపట్టారు.
పెళ్లయి ఏడాది.. ఆత్మహత్య
హోసూరు: డెంకణీకోట తాలూకా తళి జయంతి కాలనీకి చెందిన తిరుమలప్ప భార్య భూమిక (19). వీరికి గత ఏడాది క్రితం పెళ్లి జరిగింది. భూమిక గత కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ పలు ఆస్పత్రుల్లో చికిత్స పొందింది. ఆరోగ్యం బాగుపడక పోవడంతో విరక్తి చెందిన ఆమె గురువారం ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకొంది. తళి పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారణ జరుపుతున్నారు.
చదవండి: భర్త కర్కశత్వం..భార్య విడాకుల నోటీసులో సంతకం చేయలేదని..
Comments
Please login to add a commentAdd a comment