ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, బెంగళూరు: మోడలింగ్‌లో అవకాశాలు కల్పిస్తామంటూ యువతుల నగ్న ఫొటోలు, వీడియోలు తీసుకుని వికృతానందం పొందుతున్న యువకుడిని మంగళవారం కర్ణాటకలోని హలసూరు పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నిందితుడు ప్రపంచన్ ఓ ప్రైవేటు కళాశాలలో చదువుతున్నాడు. సామాజిక మాధ్యమాల్లో నకిలీ అకౌంట్లు ఓపెన్ చేశాడు. మోడలింగ్‌పై ఆసక్తి ఉన్నవారిని గుర్తించి మాయమాటలు చెప్పి వారి నగ్నఫొటోలు, వీడియోలు తీసుకొని వికృతానందం పొందేవాడు. అతని మొబైల్‌ను పరిశీలించగా వెయ్యికిపైగా యువతుల ప్రైవేటు ఫొటోలు, దాదాపు 400 వీడియోలు వెలుగు చూశాయని డీసీపీ శరణప్ప తెలిపారు.
చదవండి: ప్రియుని మోజులో భర్త హత్య.. నిజం చెప్పిన కొడుకు
Comments
Please login to add a commentAdd a comment