
తిరువొత్తియూరు: సేలంలో ఓ ఫైనాన్షియర్‌ను మోసం చేసిన ఇన్‌స్ట్రాగామ్ బ్యూటీ కేరళ, కర్ణాటకలోనూ ప్రేమ వివాహాల మోసాలకు పాల్పడిన విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది. వివరాలు.. సేలం జిల్లా ధర్మంగళం సమీపంలోని తోలసంబట్టి ప్రాంతానికి చెందిన మూర్తి ఫైనాన్షియర్ (30) కొద్ది రోజుల క్రితం తొలసంబట్టి పోలీసులకు ఫిర్యాదు చేశారు. అందులో శ్ఙ్రీతాను ఇన్‌స్ట్రాగామ్ ద్వారా పరిచయమైన నీలగిరి జిల్లా కూడలూరుకు చెందిన రషీత అనే బ్యూటీతో ప్రేమలో పడ్డాను. గత మార్చిలో ఓమలూరు ఈశ్వవరన్ దేవాలయంలో పెళ్లి చేసుకున్నాం.
3 నెలల పాటు కాపురం చేసిన ఆమె గత నెల 4వ తేదీ ఉదయం కనిపించకుండా పోయింది. ఇంట్లో ఉన్న 4 తులాల నగలు, రూ.1.50 లక్షల డబ్బు తీసుకుని మాయమైంది. ఆమెను పట్టుకొని అరెస్ట్ చేయాలి అని తెలిపాడు. ఈ ఫిర్యాదుపై పోలీసులు సీరియస్‌గా విచారణ చేపట్టారు. ఈ సందర్భంలో రషీత ఇన్‌స్ట్రాగామ్‌లో మోడల్‌గా వివిధ రూపాల్లో ఉన్న చిత్రాలను పోస్ట్ చేయడం, డబ్బున్న పురుషులను ప్రలోభపెట్టడం ద్వారా వివాహ మోసానికి పాల్పడినట్లు వెల్లడైంది.
ఫైనాన్షియర్ మూర్తిని వివాహం చేసుకునేందుకు ముందే గతంలో కోయంబత్తూరు, కేరళ, కర్ణాటకలో కొందరిని మోసం చేసి పెళ్లి చేసుకున్న విషయం వెల్లడైంది. ఈ కోణంలో పోలీసులు ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నారు. అలాగే ప్రస్తుతం పరారీలో ఉన్న రషీత కోసం పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. ఆమె బంధువులు సేలం, నీలగిరిలో ఉన్నారని వారిని కూడా ప్రశ్నిస్తున్నట్లు తెలిసింది.
Comments
Please login to add a commentAdd a comment