మహిళ వద్ద అప్పు తీసుకున్న యువకుడు
ఫోన్ సంభాషణలతో అనుమానం పెంచుకున్న మహిళ
ప్లాన్ ప్రకారం యువకుడి హత్య
వివరాలు వెల్లడించిన డీఎస్పీ రామ్మోహన్‌రెడ్డి
కాళేశ్వరం: ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళ వడ్డీలకు అప్పులు ఇస్తుందని తెలుసుకున్న ఓ యువకుడు ఆమె సోదరుడి ద్వారా రూ.లక్ష అప్పుగా తీసుకున్నాడు. ఈక్రమంలో మహిళతో తరచూ ఫోన్‌లో మా ట్లాడేవాడు. దీంతో ఆమె భర్తకు అనుమానం పెరి గి అపార్థం చేసుకొని యువకుడిని హత్య చేశా డు. జయశంకర్‌భూపాలపల్లి జిల్లా మహదేవపూ ర్ మండలం చండ్రుపల్లిలో గత బుధవారం జరిగిన ఈ హత్యకు సంబంధించి శుక్రవారం రాత్రి కాటారం డీఎస్పీ గడ్డం రామ్మోహన్‌రెడ్డి వివరాలు వెల్లడించారు.
మంచిర్యాల జిల్లా చెన్నూర్ మండలం కొమ్మెర గ్రామానికి చెందిన ముత్యాల శ్రీకాంత్‌గౌడ్(24) పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం చందనాపూర్ గ్రామానికి చెందిన వాటర్ ప్లాంట్ నిర్వాహకుడు పొన్నం శివకృష్ణగౌడ్ భార్యతో ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయం పెంచుకున్నాడు. ఆ మహిళ సోదరుడు పవన్, శ్రీకాంత్‌గౌడ్ ఇద్దరూ స్నేహితులు కావడంతో ఆమె వద్ద రూ.లక్ష అప్పుగా తీసుకున్నాడు. ఆ అప్పు విషయంలో వారిద్దరు తరచూ ఫోన్‌లో మాట్లాడుకునేవారు.
గమనించిన ఆమె భర్త పలుమార్లు మహిళను మందలించాడు. ఫోన్‌లో మాట్లాడడంతోపాటు, వారిద్దరు దగ్గరయ్యారనే అనుమానంతో శివకృష్ణ, అతని స్నేహితుడు ఎండీ ఫయాజ్‌తో కలిసి శ్రీకాంత్‌ను చంపాలని నిర్ణయించుకున్నాడు. ఈ క్రమంలో కొమ్మెర గ్రామానికి చెందిన కిరాణ దుకాణం నిర్వాహకుడు కురుమ సాయితో పరిచయం పెంచుకుని శ్రీకాంత్ కదలికలను తెలుసుకున్నాడు. ఈ నెల 27వ తేదీన (బుధవారం) గ్రామంలో రెక్కీ నిర్వహించగా అక్కడ లేడని, అన్నారం సమీపంలోని చండ్రుపల్లిలో హార్వెస్టర్ నడిపిస్తున్నట్లు సాయి తెలిపాడు. దీంతో శివకృష్ణ, అతని స్నేహితుడు ఫయాజ్.. సాయి దుకాణంలో బీర్లు, ఆ తర్వాత కల్లు తాగి మహదేవపూర్ మండలం చండ్రుపల్లికి వచ్చారు.
అక్కడ హార్వెస్టర్ డ్రైవర్ కోసం తన కారులో వేచి చూస్తున్న శ్రీకాంత్‌తో గొడవపడ్డారు. వెంటతెచ్చుకున్న కత్తితో చాతి, కడుపులో విచక్షణారహితంగా పొడవగా శ్రీకాంత్ అక్కడికక్కడే మృతిచెందడంతో బైక్ వదిలేసి పారిపోయారు. దీంతో పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. హత్యచేసిన రోజు ధరించిన రక్తపుదస్తులు, కత్తి, హెల్మెట్ దాచి ఉంచిన స్థలానికి శుక్రవారం నిందితులు చేరుకోగా చండ్రుపల్లి వద్ద మహదేవపూర్ సీఐ రామచంద్రరావు, ఎస్సైలు చక్రపాణి, పవన్‌కుమార్, తమాషారెడ్డిలతోపాటు పోలీసులు పట్టుకున్నారు. వారినుంచి పల్సర్ బైక్, కత్తి, రక్తపు మరకలతో ఉన్న దుస్తులు, రెండు సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment