
అన్నానగర్: చెన్నై శివారులోని తురైపాక్కంకు చెందిన ఇబ్రహీం బాషా (54) డ్రైవర్. ఇతని చెల్లెలు శంషాద్ బేగం (50). వీరిద్దరూ రెండు రోజుల క్రితం కోయంబత్తూరు గాందీపురానికి కారులో వచ్చి ఓ హోటల్‌లో బస చేశారు. ఆదివారం ఇబ్రహీం బాషా హఠాత్తుగా హోటల్ గది నుంచి బయటికి వెళ్లాడు. ఎంతసేపటికీ తిరిగి రాలేదు. హోటల్ సిబ్బందికి అనుమానం వచ్చి గదిలోకి వెళ్లారు. గదికి లోపలి భాగంలో తాళం వేసి ఉంది. వెంటనే, సేవకులు తలుపులు పగులగొట్టి లోపలికి ప్రవేశించగా, శంషాద్ బేగం నోటి నుండి నురగతో చనిపోయి కనిపించింది.
శంషాద్ బేగం పెద్ద మొత్తంలో నిద్రమాత్రలు వేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు వెల్లడైంది. ఆమె మృతదేహం దగ్గర ఓ లేఖ కూడా లభ్యమైంది. అందులో నేను, మా అన్న అధిక బరువుతో బాధ పడుతున్నామని, బతకడం ఇష్టం లేక ఇద్దరం ఆత్మహత్య చేసుకుంటున్నట్లుగా రాసి ఉంది. పోలీసులు ఇబ్రహీం బాషాను పట్టుకుని విచారించారు. ఆపై ఆత్మహత్య చేసుకునేందుకు తన చెల్లెలితోపాటు నిద్ర మాత్రలు వేసుకున్నానని, చెల్లెలు కంటే తక్కువ నిద్రమాత్రలు వేసుకుని చనిపోలేదని బ్లేడ్ పగలగొట్టి మింగినట్లు చెప్పాడు. అనంతరం అతడికి ఆస్పత్రిలో తీవ్ర చికిత్స అందిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment