brother and sister died
-
వెంగళరావునగర్‌లో విషాదం.. అక్కా తమ్ముడు ఆత్మహత్య
వెంగళరావునగర్: అనుమానాస్పద స్థితిలో అక్కా తమ్ముడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన మధురానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో సోమవారం ఆలస్యంగా వెలుగులోకి వచి్చంది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. రహమత్‌నగర్ డివిజన్ సంతోషగిరి బస్తీలో బి.సాయి(28) నివాసం ఉంటున్నాడు. గత పదేళ్లుగా అతడి సోదరి రాజశ్రీ (30) తమ్ముడి వద్దే ఉంటోంది. నెలలో ఒకటి రెండు రోజులు మాత్రం తన ఇంటికి వెళ్లి వచ్చేది. తరచూ భర్త నర్సింగరావు వేధిస్తున్నాడని తమ్ముడితో చెప్పేది. ఇద్దరూ కలిసి కల్లు సేవించేవారు. సోమవారం సాయి నివాసం ఉంటున్న ఇంటి నుంచి దుర్వాసన రావడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు తలుపులు తెరిచి చూడగా సాయి, రాజశ్రీ మృతిచెంది ఉన్నారు. ఇద్దరి మృతదేహాలు పూర్తిగా కుళ్లిపోయిన స్థితిలో ఉన్నాయి. దాదాపు వారం రోజుల క్రితం వారు ఆత్మహత్య చేసుకుని ఉండవచ్చునని పోలీసులు భావిస్తున్నారు. సంఘటనా స్థలంలో సూసైడ్ నోట్‌ను స్వాధీనం చేసుకున్నారు. భర్త, తమ్ముడు, పెద్దమ్మ, పెదనాన్న ఎవరూ తనను సరిగ్గా చూసుకోవడంలేదని, తనకు బతకాలని లేదని రాజశ్రీ అందులో పేర్కొంది. వారి మృతికి గల కారణాలు తెలియరాలేదని పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
రాజేంద్రనగర్‌లో విషాదం.. ఒకే ఇంట్లో వేర్వేరు గదుల్లో..
హైదరాబాద్: వారిద్దరూ వరుసకు అక్కా తమ్ముడు అవుతారు. ఏం జరిగిందో ఏమోగానీ ఇద్దరూ వేర్వేరు గదుల్లో ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడిన ఘటన రాజేంద్రనగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో మంగళవారం చోటు చేసుకుంది. ఎస్సై మోనిక తెలిపిన వివరాల ప్రకారం.. యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు మండలం ధర్మారం గ్రామానికి చెందిన నర్సింహ గౌడ్, సోమేశ్ గౌడ్ అన్నదమ్ములు. పన్నెండేళ్ల క్రితం బతుకుదెరువు కోసం నగరానికి వలస వచ్చారు. రాజేంద్రనగర్ సర్కిల్ హైదర్‌గూడ కేశవ్‌నగర్‌లో ఇల్లు కట్టుకుని కుటుంబ సభ్యులతో నివసిస్తున్నారు. పై అంతస్తులో నర్సింహ, స్వప్న దంపతులు తమ ఇద్దరు కుమారులతో పాటు నర్సింహ మేనమామ కుమారుడు, స్వప్న సోదరుడైన శేఖర్ (26) ఉంటున్నారు. కింది అంతస్తులో సోమేశ్, ఆయన భార్య స్రవంతి (28), ఇద్దరు కుమారులతో కలిసి నివసిస్తున్నారు. నర్సింహ, సోమేశ్ అన్నదమ్ములిద్దరూ ప్రైవేటు జాబ్ చేస్తుండగా.. శేఖర్ ప్రైవేటు కంపెనీలో పని చేస్తున్నాడు. పిల్లలు ఇంటికి వచ్చి చూడగా.. మంగళవారం స్వగ్రామంలో బంధువు దశదిన కర్మ ఉండటంతో నర్సింహ, సోమేశ్‌తో పాటు స్వప్న వెళ్లారు. ఉదయం పిల్లలను స్కూల్లో వదిలి వచ్చిన సోమేశ్ భార్య స్రవంతి ఇంట్లోనే ఉంది. మధ్యాహ్నం 3.30 గంటల ప్రాంతంలో స్రవంతి కుమారులు శశి, చందు ఇంటికి వచ్చి చూడగా తలుపులు తెరిచి ఉన్నాయి. గది లోపలి వెళ్లగా తల్లి ఉరేసుకొని వేలాడుతూ కనిపించింది. భయంతో వెంటనే బయటికి వచ్చి పక్కింటి వారితో ఈ విషయం చెప్పారు. వారు సోమేశ్కు సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న రాజేంద్రనగర్ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. హాల్లో స్రవంతి, బెడ్రూంలో శేఖర్ ఉరేసుకొని విగతజీవులై కనిపించారు. పంచనామా చేసి ఇరువురి మృతదేహాలను ఉస్మానియా మార్చురీకి తరలించారు. విషయం తెలుసుకున్న నర్సింహ, సోమేశ్, స్వప్న ఇంటికి చేరుకున్నారు. ఏ కారణంతో స్రవంతి, శేఖర్ ఆత్మహత్యకు పాల్పడ్డారో తెలియడం లేదని, తామంతా కలిసి మెలిసి ఉండేవాళ్లమన్నారు. శేఖర్ ఐదేళ్లుగా తమతోనే ఉంటున్నాడని.. వరుసకు తమకు మేనమామ కుమారుడు అవుతాడని నర్సింహ, సోమేశ్ వెల్లడించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. -
గొడవపడి అన్నాచెల్లి తీవ్ర నిర్ణయం..! చివరికి తల్లి!
మహబూబ్‌నగర్: అన్నాచెల్లి బలవన్మరణంతో జిల్లా కేంద్రంలో విషాదఛాయలు అలుముకున్నాయి. వివరాల్లోకి వెళితే.. జిల్లా కేంద్రంలోని పళ్ల ఏరియాలోని కోటవీధికి చెందిన చేనేత కుటుంబం అన్నాచెల్లెలు మహేష్ (35), లక్ష్మి (32) తల్లి రాములమ్మ కొన్నేళ్లుగా మానసిక, ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నారు. ఆదివారం రాత్రి అన్నాచెల్లి గొడవపడ్డారు. దీంతో అన్న మహేష్ మనస్తాపంతో చీరతో ఉరేసుకున్నాడు. గమనించిన చెల్లి చీరను కత్తిరించగా, అప్పటికే ఆయన మృతి చెందాడు. చెల్లి సైతం మానసిక స్థితి బాగులేకపోవడంతో ఉరేసుకుంది. తల్లి రాములమ్మకు కళ్లు సరిగా కనిపించకపోవడంతో ఇంట్లో ఏమి అయ్యిందో తెలియని పరిస్థితి. తెల్లారేసరికి కొడుకు, కుతురుని పిలిచినా పలకకపోవడంతో రోధించింది. చుట్టుపక్కల వారు వచ్చి చూడడంతో వారు మృతి చెందినట్లు గమనించి, పోలీసులకు సమాచారం ఇచ్చారు. విషయం తెలుసుకున్న ఎస్పీ ఎన్.వెంకటేశ్వర్లు, డీఎస్పీ సత్యనారాయణ, సీఐ రాంలాల్‌తో కలిసి సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. మృతదేహాలను జిల్లా ఆస్పత్రికి తరలించి పోస్టుమార్టం నిర్వహించారు. ఏఎస్ఐ ఆరీఫ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. చందాలు పోగుచేసి అంత్యక్రియలు.. అంత్యక్రియలు చేసేందుకు ఎవరూ లేకపోవడంతో సింగిల్ విండో డైరెక్టర్ మల్లేష్, నాయకులు కెంచె శ్రీనివాస్, గోపాల్‌యాదవ్, ఆ ప్రాంత యువకులు ముందుకు వచ్చి చందాలను పోగుచేశారు. పోలీసు అధికారులు సైతం వారికి తొచిన ఆర్థిక సాయం చేశారు. పోస్టుమార్టం అనంతరం అంత్యక్రియలు నిర్వహించి యువకులు మానవత్వం చాటుకున్నారు. రాములమ్మను జిల్లా ఆస్పత్రికి తరలింపు.. కొడుకు, కుమార్తె మృతి చెందడంతో తల్లి రాములమ్మ అనాథగా మారింది. పళ్ల ఏరియా యువకులు ఆమెను ఆటోలో వృద్ధాశ్రమానికి తీసుకెళ్లారు. ఆమె ఆరోగ్యపరిస్థితి బాగలేకపోవడంతో సిబ్బంది నిరాకరింది. దీంతో ఆమెను జిల్లా ఆస్పత్రిలో చేర్పించారు. సమాచారాన్ని డీడబ్ల్యూఓ వేణుగోపాల్‌కు ఇవ్వగా ఆయన స్పందించి సఖి కేంద్రం నుంచి సిబ్బందిని పంపించారు. వృద్దురాలి ఆరోగ్యం బాగైన తర్వాత వృద్ధాశ్రమనికి తరలిస్తామని తెలిపారు. -
వాళ్లు ఏం పాపం చేశారు.. దేవుడా ఎందుకిలా చేశావయ్యా..
చిన్నతనంలోనే వారిద్దరూ తల్లిదండ్రుల్ని కోల్పోయారు. పేరెంట్స్‌ను కోల్పోయిన అన్నాచెల్లెలిని.. పెదనాన్న, నానమ్మలే పెంచి పెద్దచేశారు. స్వయంకృషితో చదవి అన్న ఉద్యోగం చేస్తుండగా.. చెల్లి మరో రెండు రోజుల్లో ఉద్యోగంలో చేరాల్సి ఉంది. ఇంతలోనే రోడ్డు ప్రమాదం వారిని మృత్యువు రూపంలో వెంటాడింది. ఈ విషాద ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లక్ష్మీదేవిపల్లి మండలం ఇల్లెందులో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. చుంచుపల్లి మండలం ఎన్.కె.నగర్ పంచాయతీకి చెందిన మరికంటి నీరజ్(27), నిహారిక(22)లు అన్నాచెల్లెలు. తల్లిదండ్రులు విజయ్‌కుమార్, లలితలు వీరి చిన్నతనంలోనే మృతిచెందారు. ఈ క్రమంలో పెద్దదిక్కును కోల్పోవడంతో పెద్దనాన్న అశోక్, నాయనమ్మల వద్దే వారిద్దరూ పెరిగారు. కాగా, ఇంటర్ పూర్తి చేసిన నీరజ్.. స్థానికంగా ఓ కార్ల షోరూంలో సూపర్వైజర్గా పనిచేస్తున్నారు. నిహారిక డిగ్రీ చదివి హైదరాబాద్‌లోని ఓ కంపెనీలో ఇటీవల ఉద్యోగం సంపాదించింది. రెండు రోజుల్లో కొలువులో చేరేందుకు వెళ్లాల్సి ఉంది. దీంతో, వారు జీవితంలో సెటిల్ అయ్యారని ఎంతో సంతోషించారు. ఈ సందర్భంగా నిహారిక.. సోదరుడు నీరజ్, స్నేహితురాలు మేరీతో పార్టీ కోసం బైక్‌పై పాల్వంచ బయలుదేరారు. ఒక ధాబాలో డిన్నర్ చేసి రాత్రి తిరుగు పయనమయ్యారు. రేగళ్ల క్రాస్‌రోడ్డు సమీపంలో వీరి వాహనం అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టింది. ముగ్గురూ కిందపడ్డారు. తలలకు తీవ్ర గాయాలై నీరజ్, నిహారికలు అక్కడికక్కడే మృతిచెందారు. మేరీ పరిస్థితి విషమంగా ఉండటంతో ఆసుపత్రికి తరలించారు. దీంతో, ఒక్కసారిగా విషాద ఛాయలు అలుముకున్నాయి. ఇక, ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు. -
రెండు కార్లు ఢీ...మృత్యువులోనూ వీడని బంధం
దొడ్డబళ్లాపురం: మృత్యువులోనూ అన్నాచెల్లెళ్ల బంధం వీడలేదు. బెళగావి జిల్లా మూడలగి తాలూకా గుర్లాపుర వద్ద రెండు కార్లు ఢీకొన్న ప్రమాదంలో అన్నాచెల్లెలు మృతి చెందారు. గురువారం రాయబాగ తాలూకా కప్పలగుద్ది గ్రామానికి చెందిన అడివెప్ప బడిగేర (34), చెల్లెలు భాగ్యశ్రీ (22) కారులో వెళ్తుండగా ముధోళ–నిప్పాణి రాష్ట్ర రహదారిలో మరో కారు వేగంగా వచ్చి ఢీకొట్టింది. అడివెప్ప, భాగ్యశ్రీలు తీవ్ర గాయాలతో మరణించగా, మరో కారులో ఉన్న ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను గోకాక్‌లోని ఉమారాణి ఆస్పత్రికి తరలించారు. మూడలగి పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. (చదవండి: పెళ్లింట విషాదం..గ్యాస్ సిలిండర్ పేలి ఐదుగురి మృతి.. పలువురికి సీరియస్) -
పుట్టిన రోజే పెను విషాదం.. తండ్రి కళ్లెదుటే అక్కాతమ్ముడి గల్లంతు
వైఎస్సార్ కడప జిల్లాలో పింఛ, అన్నమయ్య ప్రాజెక్టులు తెగిపోవడంతో సంభవించిన వరదల్లో గల్లంతైన వారికి సంబంధించి 15 మృతదేహాలు లభ్యమైనట్లు కలెక్టర్ విజయరామరాజు ప్రభుత్వానికి నివేదించారు. ఆదివారం సాయంత్రానికి మరికొన్ని మృతదేహాలు బయటపడినట్లు తెలుస్తోంది. వీటిని గుర్తించాల్సి ఉంది. మరోవైపు రాయచోటి సమీపంలోని మాండవ్య నదిలో గల్లంతైన అక్కా, తమ్ముడి మృతదేహాలను వెలికితీశారు. వీరిద్దరూ నది దాటుతుండగా తండ్రి కళ్లెదుటే ఈ విషాదం చోటు చేసుకుంది. మృతులను సాజియా(19), కుమారుడు జాసిన్(12)గా గుర్తించారు. ఆదివారం సాజియా పుట్టినరోజు కావడంతో అమ్మమ్మ ఊరు కలకడలో నిర్వహించుకోవాలని భావించారు. తొలుత స్కూటీపై తండ్రి నదిని దాటగా అనంతరం చిన్నారులిద్దరూ చేతులు పట్టుకుని వస్తున్న సమయంలో నీటి ప్రవాహానికి కొట్టుకుపోయారు. -
విధి ఆడిన వింత నాటకం: ప్రమాదంలో కొడుకు.. ఉరి వేసుకుని కూతురు..
కాటారం: విధి ఆ కుటుంబంతో ఆడుకుంటోంది. అల్లారుముద్దుగా పెంచుకుంటున్న తమ పిల్లలు తమ కళ్లముందే తనువు చాలించడంతో ఓ అభాగ్య తల్లిదండ్రులు ఒంటరైపోయారు. రెండు నెలల వ్యవధిలో అన్నాచెల్లి వివిధ కారణాలతో మృతిచెంది తల్లిదండ్రులకు శోకాన్ని మిగిల్చారు. ఈ విషాద ఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారంలోని గారెపల్లి గ్రామంలో చోటు చేసుకుంది. కాటారం గ్రామానికి చెందిన పిట్ట మహేశ్, వసంత దంపతులకు కుమారుడు భరత్, కూతురు ప్రతిభ (19). రెండు నెలల కిందట భరత్ కరీంనగర్లో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతిచెందాడు. కాగా ప్రతిభ మంగళవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. స్థానికులు, బంధువులు తెలిపిన వివరాల ప్రకారం ప్రతిభ స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతుండేది. ఈ క్రమంలో మంగళవారం తండ్రి మహేశ్ ఊరికి వెళ్లగా తల్లి వసంత గారెపల్లిలోని వాచ్షాప్ నిర్వహణకు వెళ్లింది. ఇంట్లో ఒంటరిగా ఉన్న ప్రతిభ ప్యాన్‌కు ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. తల్లిదండ్రులు ఫోన్ చేయగా ఎంతకూ లిఫ్ట్ చేయకపోవడంతో అనుమానం వచ్చిన వారు చుట్టు పక్కల వారికి ఫోన్ చేసి చూడమని చెప్పారు. వారు వచ్చి చూడగా ప్రతిభ బలవన్మరణానికి పాల్పడిందని గుర్తించి సమాచారం ఇచ్చారు. ప్రతిభ ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు. సంఘటనా స్థలాన్ని పోలీసులు పరిశీలించి వివరాలు సేకరించారు. మృతికి సంబంధించి కేసు నమోదు చేసి విచారణ జరపనున్నట్లు ఎస్సై సాంబమూర్తి తెలిపారు. -
రోడ్డు ప్రమాదంలో అన్న, చెల్లి దుర్మరణం
హనుమంతునిపాడు: రోడ్డు ప్రమాదంలో అన్న, చెల్లి దుర్మరణం చెందారు. ఈ సంఘటన మండలంలోని దొడ్డిచింతల–హాజీపురం మధ్య గురువారం రాత్రి జరిగింది. వివరాలు.. వెలిగండ్ల మండలం అగ్రహారం గ్రామానికి చెందిన అంగిరేకుల కృష్ణయ్య (50), బోరెడ్డి చెన్న లక్ష్మమ్మ (45)లు సొంత అన్న, చెల్లి అవుతారు. కృష్ణయ్య కుమారుడి పెళ్లి నిశ్చయం కావడంతో బంధువులతో కలిసి సరుకుల కోసం కనిగిరి వచ్చారు. అనంతరం తిరిగి ఆటోలో అగ్రహారం బయల్దేరారు. అదే గ్రామానికి చెందిన మారంరెడ్డి నాగిరెడ్డి ట్రాక్టర్లో పొగాకు చెక్కులు వేసుకుని కనిగిరి బోర్డుకు బయల్దేరాడు. ఎదురుగా వస్తున్న ఆటోను తప్పించబోయాడు. అయినా ట్రాక్టర్ డోరు ఆటోకు తగిలింది. కుడి వైపు కూర్చొని ఉన్న కృష్ణయ్య, చెన్నలక్ష్మమ్మలు తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందారు. అందులో ప్రయాణిస్తున్న నలుగురికి స్వల్ప గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించి వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ సుబ్బారావు, ఎస్ఐ హరిబాబు తెలిపారు -
కొడిగట్టిన కోటి ఆశలు
కాళ్లపారాణి ఆరకముందే... అనంతలోకాలకు రోడ్డు ప్రమాదంలో అక్కాతమ్ముళ్ల మృతి విషాదంలో సబ్బన్నపేట ఆ నవవధువు కాళ్ల పారాణి ఇంకా ఆరలేదు. పెళ్లింటి గుమ్మాలకు కట్టిన తోరణాలు ఇంకా వాడిపోలేదు. కోటి ఆశలతో దాంపత్యజీవితంలోకి అడుగుపెట్టిన నవవధువును రోడ్డుప్రమాదం రూపంలో మృత్యువు తీసుకెళ్లిపోయింది. తిరుపతి వెంకన్నను దర్శించుకునేందుకు భర్త, తమ్ముడు, అత్తవారి కుటుంబసభ్యులతో వెళ్తున్న నవవధువు తన తమ్ముడితో సహా మృత్యువాత పడి కన్నవారికి, కట్టుకున్న వాడికి తీరని శోకాన్ని మిగిల్చింది. తన కుమార్తె, కుమారుడు మృత్యువాత పడ్డారన్న వార్త తెలుసుకున్న కన్నతండ్రి ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. గుండెలవిసేలా రోదిస్తున్న అతనిని ఓదార్చడం ఎవరి తరమూ కాలేదు. భోగాపురం: భోగాపురం మండలం గరినందిగాం పంచాయతీ సబ్బన్నపేట గ్రామానికి చెందిన ఉత్తాడ అప్పలరాములు, లక్ష్మి దంపతులకు ఇద్దరు సంతానం. అప్పలరాములు ఆటోనడుపుతూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. కుమార్తె స్వాతి (22) డిగ్రీ చదువుకుంది. కొడుకు కల్యాణ్ (19)బీటెక్ సెకండ్ ఇయర్ చదువుతున్నాడు. కుమార్తెకు వివాహ వయస్సు రావడంతో ఈనెల 2వ తేదీన విశాఖపట్నానికి చెందిన యువకుడికిచ్చి ఘనంగా వివాహం చేసి, చీర.సారెతో ఆనందంగా సాగనంపాడు. అయితే వియ్యాలవారు వధూవరులను తీసుకుని కుటుంబసభ్యులతో సహా తిరుపతి వెళ్తున్నాం, మీరూ రావాలని అప్పలరాములును కోరడంతో పనిఒత్తిడి కారణంగా తాను వెళ్లలేక భార్యలక్ష్మి, కొడుకు కల్యాణ్‌లను పంపించాడు. నవ వధువు అయిన కుమార్తె స్వాతితో కుమారుడైన కల్యాణ్‌ను పంపించి తల్లి లక్ష్మి తాను ఇంటివద్దే ఉండిపోయింది. శనివారం రాత్రి కుటుంబసభ్యులు 14మంది వింగర్ వ్యాన్‌లో తిరుపతికి ప్రయాణమయ్యారు. ప్రకాశం జిల్లా కొరిశపాడు- మేదరమెట్ల జాతీయ రహదారిపై వద్దకు వచ్చేసరికి జాతీయ రహదారిపై ఆగి ఉన్న పాలట్యాంకర్‌ను వింగర్ వ్యాన్ వెనుక నుంచి ఢీకొంది. ఈ సంఘటనలో అక్కడికక్కడే ఇద్దరు మృతిచెందగా మరో ముగ్గురు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. మరణించిన వారిలో నవవధువు స్వాతి, ఆమె తమ్ముడు కల్యాణ్‌తోపాటు కుటుంబ సభ్యులు సింహాద్రి, గోవిందమ్మ, ప్రసన్నకుమార్‌లు ఉన్నారు. సబ్బన్నపేట గ్రామంలో ఉన్న తండ్రి అప్పలరాములుకి ప్రమాద వార్త తెలియగానే ఒక్కసారిగా కుప్ప కూలిపోయాడు. తన రెండుకళ్లు అయిన కన్న పిల్లలు తనను వదిలి వెళ్లిపోయారన్న వార్తను జీర్ణించుకోలేకపోతున్నాడు. ఆదివారం ఉదయం ప్రమాదవశాత్తు కాలికి దెబ్బతగిలి కట్టుకట్టించుకుని మంచంమీద ఉన్న అతను ఏడుస్తున్న తీరు చూపరుల మనసును కలిచివేసింది. తన అన్న పిల్లలను తన చేతులమీద పెంచానని వారికి అప్పుడే నూరేళ్లు నిండిపోయాయా అని మృతుల చిన్నాన్న నేలపై పడి పొర్లిపొర్లి ఏడుస్తుంటే చూపరుల కళ్లు చెమర్చాయి. వైఎస్ఆర్సీపీ సీఈసీ సభ్యుడు కాకర్లపూడి శ్రీనివాసరాజు అందుబాటులో లేకపోవడంతో బాధితకుటుంబాన్ని ఫోన్లో పరామర్శించి వారికి అండగా ఉండమని పార్టీ కార్యకర్తలైన పోతిన రాంబాబు తదితరులకు సూచనలు అందజేశారు. -
గుప్తనిధుల వేటలో అన్నాచెల్లెళ్ల మృతి
వి. బొంతిరాళ్ల (డోన్‌టౌన్)/శంషాబాద్: రూరల్: ఆ యువతికి భక్తిభావమెక్కువ.. జ్యోతిష్యం కూడా తెలుసు. ఆమె అన్న ఓ ల్యాబ్ టెక్నీషియన్. వీరిద్దరికీ ఉన్నట్టుండి ఓ పెద్ద ఆశ కలిగింది. జీవితంలో ఒకేసారి ధనవంతులమైపోదామనుకున్నారు. తలుపుతట్టిన అవకాశాన్ని వదులుకోకుండా గుప్తనిధుల ముఠాతో చేతులు కలిపారు. మూఢనమ్మకాలపై ఉన్న విశ్వాసంతో తమ జీవితాలనే బలి పెట్టారు. నిధుల వేటలో మృత్యు ఒడికి చేరుకున్నారు. వివరాలు.. రంగారెడ్డి జిల్లా పాల్మాకుల గ్రామానికి చెందిన బుర్ర నర్సింహ, నాగమ్మ దంపతులకు కుమారుడు నాగరాజు(25), నలుగురు కుమార్తెలు ఉన్నారు. నాగరాజు డిగ్రీ పూర్తి చేసి నగరంలోని కింగ్‌కోఠి కామినేని ఆస్పత్రిలో టెక్నీషియన్‌గా పనిచేస్తున్నాడు. ఇతడి పెద్ద చెల్లి రమాదేవి(21) పదో తరగతి వరకు చదువుకుంది. ఈమె మహబూబ్‌నగర్ జిల్లా కొత్తూరు మండలం నందిగాంలో ఉన్న సన్చైన్ ప్లాస్టిక్ కంపెనీలో రోజూ కూలీగా పని చేస్త్తోంది. రమాదేవి జ్యోతిష్యం కూడా చెబుతుండేది. ఈక్రమంలో ఆమె పలువురికి పరిచయం అయింది. కర్నూలు జిల్లా డోన్, హైదరాబాద్‌తో పాటు ఇతర ప్రాంతాలకు చెందిన గుప్తనిధుల ముఠా సభ్యులు రమాదేవి గురించి విన్నారు. హైదరాబాద్ అంబర్‌పేటకు చెందిన కరాటే మాస్టర్ రాధాకృష్ణ వద్ద శిక్షణ తీసుకొని నాగరాజు బ్లాక్ బెల్ట్ సాధించాడు. ఈక్రమంలో వీరిద్దరూ సన్నిహితులయ్యారు. తమ ప్రాంతంలో కోట్ల రూపాయలు విలువ చేసే గుప్త నిధులు ఉన్నాయని, వాటి రహస్యం రమాదేవితో చెప్పించాలని కొందరు నాగరాజును పట్టుబట్టారు. దొరికే నిధిలో ఒకవంతు భాగాన్ని ఇస్తామని చెప్పడంతో ధనవంతులం అవుతామని అన్నాచెల్లెళ్లు అంగీకరించారు. బుధవారం మధ్యాహ్నం పాల్మాకుల నుంచి ప్రెస్ స్టిక్కర్ ఉన్న కారులో వీరు డోన్‌కు వచ్చారు. కర్నూలు నుంచి జేసీబీని తెచ్చిన ముఠా సభ్యులు వీరిని వెంటబెట్టుకొని బుధవారం అర్ధరాత్రి బొంతిరాళ్ల గ్రామ శివార్లలోని కంది పొలాల్లోకి వెళ్లారు. తమతో తెచ్చుకున్న సామగ్రితో పూజలు చేసి జేసీబీతో నిధుల కోసం తవ్వకాలు చేపట్టారు. శబ్దం రావడంతో సమీప పొలాల్లోని రైతులు ఘటనా స్థలానికి టార్చిలైట్లతో చేరుకొని వారిని చుట్టుముట్టారు. కేకలు వేస్తూ జేసీబీపై రాళ్లురువ్వారు. దీంతో హడలెత్తిపోయిన ముఠాసభ్యులు పరారయ్యేందుకు పరుగులు తీశారు. డ్రైవర్ భయంతో ఇష్టానుసారంగా జేసీబీని తిప్పాడు. దీంతో గట్టుకింద నక్కిఉన్న నాగరాజు, రమాదేవిలకు జేసీబీ తగిలి గాయాలై అక్కడికక్కడే మృతి చెందారు. సుమారు గంటన్నర పాటు గందరగోళం నెలకొంది. అక్కడే నక్కి ఉన్న కరాటే మాస్టర్ రాధాకృష్ణను గ్రామస్తులు పట్టుకొని పోలీసులకు అప్పజెప్పారు. పోలీసుల అదుపులో ముఠా...? హైదరాబాద్‌కు చెందిన సుభాష్‌రెడ్డి, నాగేశ్వరరెడ్డి, రాధాక్రిష్ణన్, లక్ష్మారెడ్డి, డోన్‌కు చెందిన ఆంజనేయులుగౌడ్, కోయిలకొండ రాజు, నందికొట్కూరుకు చెందిన విజయుడు, ఓర్వకల్లుకు చెందిన జేసీబీ డ్రైవర్ రవికుమార్, రుద్రవరానికి చెందిన కారు డ్రైవర్ సుంకన్న, కొలిమిగుండ్లకు చెందిన హుస్సేన్‌లు పోలీసుల అదుపులో ఉన్నట్లు సమాచారం. డైరీలో ఏముంది..? మృతి చెందిన రమాదేవి, నాగరాజుల డైరీలో ఏముందన్న సందేహాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. మృతుల వద్ద ఉన్న నగదుతో పాటు, డైరీని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. డైరీలో గుప్తనిధుల తవ్వకాలకు సంబంధించిన విషయాలు ఉన్నాయని స్థానికులు భావిస్తున్నారు. కాగా నాగరాజు, రమాదేవి హత్యకు గురయ్యారని మృతుల బంధువుల ఆరోపిస్తున్నారు. పాల్మాకులలో విషాదం.. అన్నాచెల్లెళ్ల మృతితో పాల్మాకులలో విషాదం అలుముకుంది. ఈ నెల 25న క్రిస్మస్ పండగ రోజు సెలవు దినం కావడంతో అన్నాచెల్లెల్లు ఇంటి వద్ద ఉన్నారు. మధ్యాహ్నం నాగరాజు సెల్‌కు ఫోన్ వచ్చింది. కాసేపటికే అన్నాచెలెళ్లు ఇద్దరు ఇంట్లోంచి బయలు దేరారు. కృష్ణ సారు రోడ్డు మీద ఉన్నాడంటా.. మమ్మల్ని రమ్మన్నాడంటూ చెప్పి వెళ్లిపోయారు.