పుట్టిన రోజే పెను విషాదం.. తండ్రి కళ్లెదుటే అక్కాతమ్ముడి గల్లంతు | Brother And Sister Stuck In Flood, Found Dead In YSR District | Sakshi
Sakshi News home page

పుట్టిన రోజే పెను విషాదం.. తండ్రి కళ్లెదుటే అక్కాతమ్ముడి గల్లంతు

Published Mon, Nov 22 2021 2:53 AM | Last Updated on Mon, Nov 22 2021 2:53 AM

Brother And Sister Stuck In Flood, Found Dead In YSR District - Sakshi

వైఎస్సార్‌ కడప జిల్లాలో పింఛ, అన్నమయ్య ప్రాజెక్టులు తెగిపోవడంతో సంభవించిన వరదల్లో గల్లంతైన వారికి సంబంధించి 15 మృతదేహాలు లభ్యమైనట్లు కలెక్టర్‌ విజయరామరాజు ప్రభుత్వానికి నివేదించారు. ఆదివారం సాయంత్రానికి మరికొన్ని మృతదేహాలు బయటపడినట్లు తెలుస్తోంది. వీటిని గుర్తించాల్సి ఉంది. మరోవైపు రాయచోటి సమీపంలోని మాండవ్య నదిలో గల్లంతైన అక్కా, తమ్ముడి మృతదేహాలను వెలికితీశారు.

వీరిద్దరూ నది దాటుతుండగా తండ్రి కళ్లెదుటే ఈ విషాదం చోటు చేసుకుంది. మృతులను సాజియా(19), కుమారుడు జాసిన్‌(12)గా గుర్తించారు. ఆదివారం సాజియా పుట్టినరోజు కావడంతో అమ్మమ్మ ఊరు కలకడలో నిర్వహించుకోవాలని భావించారు. తొలుత స్కూటీపై తండ్రి నదిని దాటగా అనంతరం చిన్నారులిద్దరూ చేతులు పట్టుకుని వస్తున్న సమయంలో నీటి ప్రవాహానికి కొట్టుకుపోయారు.    

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement