నగ్న రెస్టారెంటులో ఊబకాయులకు నో ఎంట్రీ! | Japanese Naked Restaurant To Ban 'Overweight' Diners | Sakshi
Sakshi News home page

నగ్న రెస్టారెంటులో ఊబకాయులకు నో ఎంట్రీ!

Published Fri, Jun 10 2016 4:54 PM | Last Updated on Tue, Oct 16 2018 8:34 PM

నగ్న రెస్టారెంటులో ఊబకాయులకు నో ఎంట్రీ! - Sakshi

నగ్న రెస్టారెంటులో ఊబకాయులకు నో ఎంట్రీ!

భోజనప్రియుల కోసం టోక్యోలో కొత్త కాన్సెప్ట్ తో ప్రారంభం కానున్న నగ్న రెస్టారెంట్ (నేకెడ్ రెస్టారెంట్) అతిథులకు  కొన్ని నిబంధనలను విధించింది. విభిన్న రుచులతో రెస్టారెంట్ లో భోజనం చేయాలని ఉవ్విల్లూరే వారికి నగ్నంగా భోజనం చేసే సదుపాయం అందిస్తున్న రెస్టారెంట్... తమ నిబంధనల ప్రకారం ఊబకాయులకు అనుమతి నిరాకరిస్తోంది. సరికొత్త డైనింగ్ అనుభవాలను పొందాలనుకుంటే తమ వెబ్ సైట్ లోని నియమాల జాబితాను తప్పనిసరిగా ఫాలో అవ్వాల్సిందేనని నిక్కచ్చిగా చెప్తోంది.

టోక్యోలో ప్రారంభం కానున్న జపనీస్ నేకెడ్ రెస్టారెంట్ వినియోగదారులకు కఠిన నిబంధనలను విధిస్తోంది. ముఖ్యంగా ఊబకాయులకు ప్రవేశాన్ని నిషేధించడంతోపాటు, వయో నిబంధనలను కూడ అమలుచేస్తోంది. రెస్టారెంట్ విధించిన నిబంధనల ప్రకారం వయసుతోపాటు బరువును కూడా పాటించగలిగే వారే అక్కడ నగ్నంగా భోజనం చేసే అవకాశం పొందుతారు. లండన్, మెల్‌బోర్న్ సంస్థలను అనుసరిస్తూ.. కేవలం 16 - 60 ఏళ్ల మధ్య వయస్కులనే అనుమతించడంతోపాటు... వచ్చిన వారి బట్టలను చెక్ చేసి, పేపర్‌లో ఉంచి వారికి ప్రత్యేకమైన అండర్ వేర్‌ను అందిస్తోంది. అందుకు సంబంధించిన నియమ నిబంధనల లిస్టును స్టేట్స్ రెస్టారెంట్స్ వెబ్ సైట్లో పోస్ట్ చేసింది. నగ్న రెస్టారెంట్ ను సందర్శించి అక్కడి భోజనాన్ని ఆస్వాదించాలనుకునేవారు వెబ్ సైట్ లోని నియమాల జాబితాను ఫాలో అవ్వక తప్పదని నిర్వాహకులు చెప్తున్నారు.

భోజనానికి వచ్చిన వారిని అక్కడికక్కడే బరువును చూసి మరీ లోపలకు అనుమతిస్తారు. ఒకవేళ నిబంధనకు మించి బరువు ఎక్కువగా ఉంటే బయటకు పంపించేందుకు ఏమాత్రం వెనుకాడే పనిలేదని నిర్వాహకులు కచ్చితంగా చెబుతున్నారు. జూలై 29న ప్రారంభం కానున్న నేకెడ్ రెస్టారెంట్ కు సంబంధించిన ఆన్ లైన్ బుకింగ్ పేజిలోనే ముందుగా అన్ని రకాల చెల్లింపులు చేసి బుకింగ్ చేసుకోవాల్సి ఉంటుందని, మొత్తం డబ్బును అడ్వాన్స్ గా చెల్లించిన తర్వాత రెస్టారెంటుకు వచ్చిన తర్వాత బరువు ఎక్కువగా ఉన్నవారిని బయటకు పంపడమే కాక, డబ్బును తిరిగి ఇచ్చే పరిస్థితి ఉండదని నిర్వాహకులు చెబుతున్నారు. అప్పటికే ఉన్న అతిథులను నియమాల జాబితా గురించి అడగటం, వారిని విసిగించడం, సందర్శకులను ముట్టుకునేందుకు ప్రయత్నించడం చేస్తే... అలాంటివారి ప్రవేశాన్ని నిలిపివేస్తామని హెచ్చరిస్తున్నారు. అలాగే వచ్చిన అతిథుల మొబైల్ ఫోన్లు, కెమెరాలను వారికి దూరంగా టేబుల్ టాప్ బాక్స్ లో భద్రపరుస్తారు.

త్వరలో ప్రారంభానికి సిద్ధమౌతున్న నేకెడ్ రెస్టారెంటులో ప్రవేశ టికెట్ ఖరీదు దాదాపు రూ. 50 వేలు. దీన్ని ముందుగా వెబ్ సైట్ లో బుక్ చేసుకోవాలి. ఇలా  రెస్టారెంట్ కు వచ్చిన అతిథులకు... జీ స్ట్రింగ్స్ ధరించిన కండల వీరులు భోజనాన్ని వడ్డిస్తారు. కావలసిన రుచులను ఆస్వాదిస్తూ... మేల్ మోడల్స్ చేసే కనువిందైన డ్యాన్స్ షోను తిలకించే అవకాశాన్ని నిర్వాహకులు కల్పిస్తారు. అయితే నృత్య ప్రదర్శన చూడాలనుకున్నవారు భోజనం టికెట్ కాక, డ్యాన్స్ షో టికెట్ ను వారి వారి ఇష్టాన్ని బట్టి మెనూలో ఎంపిక చేసుకొని బుక్ చేసుకోవాల్సి ఉంటుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement