Restraurant
-
బిట్ కాయిన్లతో, మెక్ డొనాల్డ్స్ కీలక నిర్ణయం
ప్రముఖ దిగ్గజ ఫాస్ట్ ఫుడ్ సంస్థ మెక్ డొనాల్డ్స్ కీలక నిర్ణయం తీసుకుంది. కస్టమర్లు బిట్ కాయిన్లతో బిల్ పేమెంట్స్ చేసుకోవచ్చని తెలిపింది. స్విట్జర్లాండ్ దేశం లుగానో నగరంలో బిట్‌కాయిన్, అసెట్ బ్యాక్డ్ స్టేబుల్ కాయిన్ టెథర్ చెల్లింపులకు మెక్ డొనాల్డ్స్ అంగీకరించింది. ఈ ఏడాది మార్చి నెలలో లుగానో అధికారులు టెథర్ ఆపరేషన్స్ లిమిటెడ్‌తో ఒప్పందం కుదుర్చుకున్నారు. తద్వారా డిజిటల్ కరెన్సీలను ఉపయోగించి ట్యాక్స్ చెల్లింపులు పన్నులు, వస్తువుల కొనుగోలు చేసేలా లుగానో నివాసితులకు అనుమతించింది. 🇨🇭 Paying at McDonald's with #Bitcoin in Lugano, Switzerland. pic.twitter.com/8IdcupEEKQ — Bitcoin Magazine (@BitcoinMagazine) October 3, 2022 బిట్ కాయిన్ చెల్లింపుకు సంబంధించిన ఓ వీడియో వైరల్ అవుతుంది. ఆ వీడియో ప్రకారం..మెక్‌డొనాల్డ్స్ రెస్టారెంట్లో ఫుడ్ లవర్స్ డిజిటల్ కియోస్క్‌లో ఫుడ్ ఆర్డర్ చేసి, ఆపై మొబైల్ యాప్ సహాయంతో బిల్ పే చేస్తున్న దృశ్యాల్ని మనం గమనించవచ్చు. -
ఎంత మోసమో?..నెటిజన్ పోస్ట్‌కు కామెంట్ల వరద, స్పందించిన జొమాటో!
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఆన్లైన్, ఆఫ్‌లైన్ ఫుడ్ ఆర్డర్ బిల్లుల వివాదంపై జొమాటో స్పందించింది. రాహుల్ కాబ్రా ఆఫ్‌లైన్ ఫుడ్ ఆర్డర్ ధరను జొమాటో డెలివరీ చేసే ఫుడ్ ఆర్డర్ ధరను పోల్చుతూ పోస్ట్ చేశాడు. ఆఫ్‌లైన్‌లో ఉన్న ధర కంటే జొమాటో పెద్ద మొత్తంలో కస్టమర్ల దగ్గర నుంచి వసూలు చేస్తుందని ఆరోపించాడు.ఆ ఆరోపణలపై జొమాటో రిప్లయి ఇచ్చింది. కస్టమర్లకు,రెస్టారెంట్ల మధ్య జొమాటో అనుసంధానంగా పనిచేస్తుంది.ఆఫ్‌లైన్‌లో అందించే ధరలకు జొమాటోకు ఎలాంటి సంబంధం లేదని పేర్కొంది. అయితే కాబ్రా పోస్ట్‌పై స్పందిస్తూ.. కస్టమర్ ఫిర్యాదుల్ని రెస్టారెంట్ల దృష్టికి తీసుకొని వెళ్తామని వెల్లడించింది. కామెంట్ల వరద రాహుల్ కాబ్రా ఓ సంస్థలో మార్కెటింగ్ మేనేజర్‌గా వర్క్ చేస్తున్నాడు. అయితే రెండు మూడు రోజుల క్రితం రాహుల్‌కు బాగా ఆకలి వేయడంతో ఆఫ్‌లైన్‌లో చెక్ చేసి వెజ్ బ్లాక్ పెప్పర్ సాస్, వెజిటబుల్ ఫ్రైడ్ రైస్, మష్రూమ్ మోమోలను ఆర్డర్ పెట్టాడు. ఫుడ్‌తో పాటు,ఇతర అదనపు ట్యాక్స్‌లు అన్నీ కలుపుకొని బిల్లు రూ.512 అయ్యింది. జొమాటోలో చెక్ చేస్తే ఆ ధర కాస్త రూ.75 డిస్కౌంట్ తీసేస్తే రూ.689.90గా ఉండడంతో కంగుతిన్నాడు. అంతా మోసం, దగా జొమాటో కస్టమర్ల దగ్గరనుంచి ఎంత మొత్తం వసూలు చేస్తుందో మీరే చూడండి అంటూ తాను ఆర్డర్ పెట్టిన ఫుడ్ ఆఫ్‌లైన్, ఆన్లైన్ బిల్స్‌ను లింక్డ్ఇన్లో పోస్ట్ చేశాడు. అంతేకాదు ఆఫ్‌లైన్‌లో ఫుడ్ ఆర్డర్‌పై ఉన్న ధర కంటే జోమాటో ఎక్కువగానే 34.76% శాతంతో 690-512 =రూ.178 వసూలు చేసినట్లు రాహుల్ మండిపడ్డాడు. ఫుడ్ ఆర్డర్‌పై ఇక రాహుల్ పెట్టిన లింక్డ్ఇన్ పోస్ట్ తెగ వైరల్ అయ్యింది.ఫుడ్ ఆర్డర్ పెట్టిన కస్టమర్ల నుంచి జొమాటో ఎంత వసూలు చేస్తుందో మీరే చూడండి అంటూ బిల్స్‌కు సంబంధించిన బిల్స్‌ను సైతం షేర్ చేశాడు. వీటిపై స్పందించిన నెటిజన్లు ఈ దిగ్గజ ఫుడ్ ఆగ్రిగ్రేటర్పై కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. అలా ఇప్పటి వరకు కాబ్రా పెట్టిన పోస్ట్‌కు 2వేల కామెంట్లు, 12వేలకు మందికి పైగా నెటిజన్లు అతనికి సపోర్ట్ చేస్తూ లైక్ కొట్టారు. -
బిల్లుకు 400 రెట్ల టిప్పు ఇచ్చి ఆశ్చర్యపరిచాడు!
వాషింగ్టన్: ప్రపంచాన్ని కరోనా మహమ్మారి అతలకుతలం చేసింది. లాక్డౌన్ కారణంగా అన్ని రకాల పరిశ్రమలు తీవ్రంగా నష్టపోయాయి. ముఖ్యంగా పుఢ్ ఇండస్ట్రీ బాగా నష్టపోయింది. కొవిడ్ నిబంధనలు,లాక్డౌన్ నియామాలు వల్ల రెస్టారెంట్లు అస్సలు తెరుచుకోలేదు. కరోనా కాస్త తగ్గు ముఖం పట్టడం వల్ల ఇప్పుడిప్పుడే రెస్టారెంట్లు తెరుచుకుంటున్నాయి. లాక్డౌన్ ముగియడం వలన అంతా పనులులోకి వచ్చేశారు. రెస్టారెంట్లులో పనిచేసే వారికి ఒక 50రూపాయలు టిప్ ఇస్తే ఎంతో ఆనందంగా ఫీల్ అవుతారు. అటువంటిది ఏకంగా 16000వేల డాలర్లు టిప్ గా వస్తే.. ఎలా ఫీల్ అయివుంటారో మీరే ఆర్ధం చేసుకోవాలి. అమెరికాలోని ఓ రెస్టారెంట్లో కస్టమర్ తాను చేసిన బిల్ 40డాలర్ల కంటే తక్కువే అయినా.. 16000వేల డాలర్లు టిప్ గా ఇచ్చి స్టాఫర్ ను ఆనందానికే కాకుండా ఆశ్చర్యంలో ముంచెత్తాడు. బిల్లుతో పాటు క్రెడిట్ కార్డు తీసుకున్న స్టాఫర్ అది చూసి ఒక్కసారి షాక్ అయింది. కస్టమర్ ఏదో పొరబాటు చేశాడని అతను దగ్గరకు వెళ్లి.. ‘‘ఓమైగాడ్.. ఇది నిజమా అని అడిగింది.. దానికి రెస్పాన్స్ ఇస్తూ.. అవును ఇది మీ కోసమే .మీరు చాలా కష్టపడుతున్నారంటూ బదులిచ్చాడు.. ఆ టిప్ ను ఆ షిఫ్ట్ లో వాళ్లే కాకుండా మొత్తం ఉద్యోగులంతా పంచుకున్నాం’’ అని స్టాఫర్ చెప్పింది. చదవండి:ఒకే కాన్పులో పదిమంది.. అంతా కట్టుకథ -
ఆ రెస్టారంట్ మె‘న్యూ’ చూస్తే కన్ఫ్యూజ్ అవ్వాల్సిందే..
కరోనాతో తీవ్రంగా దెబ్బతిన్న హోటళ్లు, రెస్టారెంట్లు, కేఫ్‌లు ఈ మధ్యనే కాస్త పుంజుకుంటున్నాయి. ఈ సమయంలో కస్టమర్లను ఆకర్షించేందుకు కొన్ని రెస్టారెంట్లు వివిధ రకాల ఆఫర్లను ప్రకటిస్తు్తంటే..ఫుణేలోని ఓ రెస్టారెంట్ వింత మెనూతో ముందుకొచ్చింది. సాధారణంగా మెనూలో ఆహార పదార్థాల లిస్టు ఉంటుంది. కానీ ఈ రెస్టారెంట్.. మెనూలో ‘డూస్ అండ్ డోంట్స్’ అంటూ విచిత్ర జాబితా పెట్టి కస్టమర్లను కన్ఫ్యూజ్ చేస్తోంది. విచిత్రంగా వ్యవహరిస్తున్న ఈ రెస్టారెంట్ పేరు ‘ఇరానీ కేఫ్’. ఈ కేఫ్‌లో ఎంతో రుచికరమైన తినుబండారాలు తక్కువ ధరకే దొరుకుతాయి. అయితే రెస్టారెంట్ ఫుడ్ మెనూలో రెండు డజన్ల వింత నిబంధనలను చేర్చింది యాజమాన్యం. రెస్టారెంట్‌కు వెళ్లినవారు, రెస్టారెంట్ పరిసరాల్లో ఉన్న వారంతా తప్పనిసరిగా ఈ రూల్స్ పాటించాల్సిందేన ట. నిబంధనల్లో ‘‘నో స్మోకింగ్, నో అవుట్ సైడ్ ఫుడ్, నో బార్గెయినింగ్, నో బ్రషింగ్ టీత్, నో స్లీపింగ్, నో కోంబింగ్, నో ఫ్రీ అడ్వైస్, గాంబ్లింగ్ గురించి చర్చించకూడదు, చిల్లర అడగడం వంటివాటిని రెస్టారెంట్లో అనుమతించరు. ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ అవుతుండడంతో నెటిజన్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. కొందరికి ఈ నిబంధనలు నచ్చుతుంటే మరికొందరికి ఊపిరి కూడా పీల్చుకోవద్దు అంటారా ? అని ప్రశ్నిస్తున్నారు. మరికొందరు ఈ రెస్టారెంట్‌కు ఒక్కసారైనా వెళ్లాల్సిందేనని చెబుతున్నారు. -
నగ్న రెస్టారెంటులో ఊబకాయులకు నో ఎంట్రీ!
భోజనప్రియుల కోసం టోక్యోలో కొత్త కాన్సెప్ట్ తో ప్రారంభం కానున్న నగ్న రెస్టారెంట్ (నేకెడ్ రెస్టారెంట్) అతిథులకు కొన్ని నిబంధనలను విధించింది. విభిన్న రుచులతో రెస్టారెంట్ లో భోజనం చేయాలని ఉవ్విల్లూరే వారికి నగ్నంగా భోజనం చేసే సదుపాయం అందిస్తున్న రెస్టారెంట్... తమ నిబంధనల ప్రకారం ఊబకాయులకు అనుమతి నిరాకరిస్తోంది. సరికొత్త డైనింగ్ అనుభవాలను పొందాలనుకుంటే తమ వెబ్ సైట్ లోని నియమాల జాబితాను తప్పనిసరిగా ఫాలో అవ్వాల్సిందేనని నిక్కచ్చిగా చెప్తోంది. టోక్యోలో ప్రారంభం కానున్న జపనీస్ నేకెడ్ రెస్టారెంట్ వినియోగదారులకు కఠిన నిబంధనలను విధిస్తోంది. ముఖ్యంగా ఊబకాయులకు ప్రవేశాన్ని నిషేధించడంతోపాటు, వయో నిబంధనలను కూడ అమలుచేస్తోంది. రెస్టారెంట్ విధించిన నిబంధనల ప్రకారం వయసుతోపాటు బరువును కూడా పాటించగలిగే వారే అక్కడ నగ్నంగా భోజనం చేసే అవకాశం పొందుతారు. లండన్, మెల్బోర్న్ సంస్థలను అనుసరిస్తూ.. కేవలం 16 - 60 ఏళ్ల మధ్య వయస్కులనే అనుమతించడంతోపాటు... వచ్చిన వారి బట్టలను చెక్ చేసి, పేపర్లో ఉంచి వారికి ప్రత్యేకమైన అండర్ వేర్‌ను అందిస్తోంది. అందుకు సంబంధించిన నియమ నిబంధనల లిస్టును స్టేట్స్ రెస్టారెంట్స్ వెబ్ సైట్లో పోస్ట్ చేసింది. నగ్న రెస్టారెంట్ ను సందర్శించి అక్కడి భోజనాన్ని ఆస్వాదించాలనుకునేవారు వెబ్ సైట్ లోని నియమాల జాబితాను ఫాలో అవ్వక తప్పదని నిర్వాహకులు చెప్తున్నారు. భోజనానికి వచ్చిన వారిని అక్కడికక్కడే బరువును చూసి మరీ లోపలకు అనుమతిస్తారు. ఒకవేళ నిబంధనకు మించి బరువు ఎక్కువగా ఉంటే బయటకు పంపించేందుకు ఏమాత్రం వెనుకాడే పనిలేదని నిర్వాహకులు కచ్చితంగా చెబుతున్నారు. జూలై 29న ప్రారంభం కానున్న నేకెడ్ రెస్టారెంట్ కు సంబంధించిన ఆన్ లైన్ బుకింగ్ పేజిలోనే ముందుగా అన్ని రకాల చెల్లింపులు చేసి బుకింగ్ చేసుకోవాల్సి ఉంటుందని, మొత్తం డబ్బును అడ్వాన్స్ గా చెల్లించిన తర్వాత రెస్టారెంటుకు వచ్చిన తర్వాత బరువు ఎక్కువగా ఉన్నవారిని బయటకు పంపడమే కాక, డబ్బును తిరిగి ఇచ్చే పరిస్థితి ఉండదని నిర్వాహకులు చెబుతున్నారు. అప్పటికే ఉన్న అతిథులను నియమాల జాబితా గురించి అడగటం, వారిని విసిగించడం, సందర్శకులను ముట్టుకునేందుకు ప్రయత్నించడం చేస్తే... అలాంటివారి ప్రవేశాన్ని నిలిపివేస్తామని హెచ్చరిస్తున్నారు. అలాగే వచ్చిన అతిథుల మొబైల్ ఫోన్లు, కెమెరాలను వారికి దూరంగా టేబుల్ టాప్ బాక్స్ లో భద్రపరుస్తారు. త్వరలో ప్రారంభానికి సిద్ధమౌతున్న నేకెడ్ రెస్టారెంటులో ప్రవేశ టికెట్ ఖరీదు దాదాపు రూ. 50 వేలు. దీన్ని ముందుగా వెబ్ సైట్ లో బుక్ చేసుకోవాలి. ఇలా రెస్టారెంట్ కు వచ్చిన అతిథులకు... జీ స్ట్రింగ్స్ ధరించిన కండల వీరులు భోజనాన్ని వడ్డిస్తారు. కావలసిన రుచులను ఆస్వాదిస్తూ... మేల్ మోడల్స్ చేసే కనువిందైన డ్యాన్స్ షోను తిలకించే అవకాశాన్ని నిర్వాహకులు కల్పిస్తారు. అయితే నృత్య ప్రదర్శన చూడాలనుకున్నవారు భోజనం టికెట్ కాక, డ్యాన్స్ షో టికెట్ ను వారి వారి ఇష్టాన్ని బట్టి మెనూలో ఎంపిక చేసుకొని బుక్ చేసుకోవాల్సి ఉంటుంది.