Hyderabad: పటోలా ఆర్ట్స్‌.. వస్త్ర ప్రదర్శన ప్రారంభం! | Patola Arts Textile Exhibition Begins In Banjarahills Hyderabad, Check Out The Details Inside | Sakshi
Sakshi News home page

Hyderabad: పటోలా ఆర్ట్స్‌.. వస్త్ర ప్రదర్శన ప్రారంభం!

Published Tue, Aug 20 2024 12:47 PM | Last Updated on Tue, Aug 20 2024 1:04 PM

Patola Arts Textile Exhibition Begins In Banjarahills Hyderabad

సాక్షి, సిటీబ్యూరో: బంజారాహిల్స్‌లోని లేబుల్స్‌ పాప్‌–అప్‌ స్పేస్‌ వేదికగా కొలువుదీరిన ’డి సన్స్‌ పటోలా ఆర్ట్స్‌ వస్త్ర ప్రదర్శన’ను ప్రముఖ సామాజికవేత్త బినా మెహతా ప్రారంభించారు.  విభిన్నమైన హ్యాండ్లూమ్‌ చీరలతోపాటు  పటోలా ఆర్ట్‌ చీరలు, డిజైనర్‌ వేర్‌ వ్రస్తోత్పత్తులను ఒకే వేదికలో ప్రదర్శించడం అభినందనీయమని ఆమె అన్నారు. వస్త్ర ఉత్పత్తులను ఫ్యాషన్‌ప్రియులకు నేరుగా అందించేందుకు ఏర్పాటు చేసిన ఈ ప్రదర్శన అద్భుతంగా ఉందన్నారు.

డి సన్స్‌ పటోలా ఆర్ట్స్‌ ఎక్స్‌పో నిర్వాహకులు భవిన్‌ మక్వానా మాట్లాడుతూ చేనేత పరిశ్రమకు మంచి మార్కెట్‌ను అందించడమే ఈ ఎగ్జిబిషన్‌   లక్ష్యమని వివరించారు. ఈ నెల 27వ తేదీ వరకు కొనసాగే ఈ ప్రదర్శనలో రాజ్‌కోట, పటోలా దుపట్టా, పటోలా శాలువాలు, సింగిల్‌ పటాన్‌ చీరలు, సింగిల్‌ పటోలా దుప్పట, పటాన్‌ పటోలా చీరలు, సిల్క్‌ టిష్యూ పటోలా వంటి 2 వేల రకాల ఉత్పత్తులు అందుబాటులో ఉన్నాయని చెప్పారు.

35 మంది కళాకారులు.. 70 చిత్రాలు!
– ఆర్ట్‌ గ్యాలరీలో ప్రారంభమైన చిత్రప్రదర్శన
మాదాపూర్‌: కళాకారులు వేసిన చిత్రాలు సందేశాత్మకంగా ఉన్నాయని తెలంగాణ టూరిజం శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ వాణీప్రసాద్‌ అన్నారు. మాదాపూర్‌లోని చిత్రమయి స్టేట్‌ ఆర్ట్‌గ్యాలరీలో సోమవారం ఏర్పాటు చేసిన చిత్రప్రదర్శనను ఆమె ప్రారంభించారు.

మున్ముందు చిత్రకారులకు మంచి భవిష్యత్తు ఉంటుందని తెలిపారు. 35 మంది కళాకారులు వేసిన 70 పెయింటింగ్‌ చిత్రాలు అందుబాటులో ఉన్నాయని ఈ నెల 25వ తేదీ వరకు ప్రదర్శన కొనసాగనుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఆర్కియాలజీ డైరెక్టర్‌ భారతి హోలికేరి, ఆర్ట్‌ గ్యాలరీ డైరెక్టర్‌ డాక్టర్‌ కె.లక్షి్మ, టూరిజం డిపార్ట్‌మెంట్‌ కార్పొరేషన్‌ ఎం.డి. ప్రకాశ్‌రెడ్డి, టూరిజం డైరెక్టర్‌ ఇలా త్రిపాఠి, భాషా సాంస్కృతిక డైరెక్టర్‌ మామిడి హరికృష్ణ, కళాకారులు పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement