శిల్పకళావేదికగా హ్యాండ్ టు హ్యాండ్ చేనేత ప్రదర్శన షురూ..
ప్రారంభించిన మిస్ యూనివర్స్ ఆంధ్రప్రదేశ్ చందనా జయరాం
సాక్షి, సిటీబ్యూరో: మాదాపూర్‌లోని శిల్పకళావేదికలో మిస్ యూనివర్స్ ఆంధ్రప్రదేశ్ చందనా జయరాం సందడి చేశారు. ఆదివారం ఇక్కడ ఏర్పాటు చేసిన హ్యాండ్ టు హ్యాండ్ చేనేత వస్త్ర ప్రదర్శనను ఆమె ముఖ్యఅతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా అక్కడ కొలువుదీరిన వ్రస్తోత్పత్తుల గురించి చేనేత కళాకారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆమె మాట్లాడుతూ అనాదిగా వస్తున్న మన సంస్కృతిలో పట్టు, హ్యాండ్లూమ్ వ్రస్తోత్పత్తులకు ఎంతో ప్రత్యేకత ఉందన్నారు.
వేడుకలు, సంబరాల్లో ఫ్యాషన్ వేర్ కన్నా ఇలాంటి ఉత్పత్తులవైపే యువత ఎక్కువ మొగ్గు చూపుతున్నారని పేర్కొన్నారు. ఈ నెల 30వ తేదీ వరకు కొనసాగనున్న ఈ ప్రదర్శనలో దేశవ్యాప్తంగా దాదాపు 14 రాష్ట్రాల నుంచి చేనేతకారులు తమ ఉత్పత్తులను ప్రదర్శిస్తారని నిర్వాహకులు జయేష్ గుప్తా తెలిపారు. ఇందులో భాగంగా
75 వేల రకాల వస్త్ర ఉత్పత్తులను అందుబాటులో ఉంచినట్లు వివరించారు.
వినూత్నంగా మెటల్ సిరీస్ వాచ్‌లు..
సాక్షి, సిటీబ్యూరో: అధునాతన ఫ్యాషన్ హంగులను ఎప్పటికప్పుడు అందిపుచ్చుకునే హైదరాబాద్ నగర వేదికగా బోల్డ్–ఫ్యాషన్–ఫార్వర్డ్ మెటల్ సిరీస్ వాచ్‌లు అందుబాటులోకి వచ్చాయి.
ప్రముఖ ‘ఫా్రస్టాక్ స్మార్ట్’ఆధ్వర్యంలో ఆవిష్కరించిన ఈ మెటల్ సిరీస్ యువతను విశేషంగా ఆకర్షిస్తోంది. ఈ సందర్భంగా టైటాన్ కంపెనీ సేల్స్ హెడ్ ఆదిత్యరాజ్ మాట్లాడుతూ ఫా్రస్టాక్ స్టెయిన్‌లెస్–స్టీల్ వాచ్‌ల నుంచి ప్రేరణ పొంది ఈ స్మార్ట్‌వాచ్ కలెక్షన్ ప్రీమియం–గ్రేడ్ మెటల్‌తో రూపొందించామని తెలిపారు. అధునాతన ఫ్యాషన్ గాడ్జెట్స్‌ను ఆస్వాదించడంలో నగరం ఎల్లప్పుడూ ముందుంటుందని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment