weaving
-
Chandana Jayaram: వస్త్రోత్పత్తుల సోయగం! హ్యాండ్ టు హ్యాండ్ చేనేత ప్రదర్శన షురూ..
సాక్షి, సిటీబ్యూరో: మాదాపూర్‌లోని శిల్పకళావేదికలో మిస్ యూనివర్స్ ఆంధ్రప్రదేశ్ చందనా జయరాం సందడి చేశారు. ఆదివారం ఇక్కడ ఏర్పాటు చేసిన హ్యాండ్ టు హ్యాండ్ చేనేత వస్త్ర ప్రదర్శనను ఆమె ముఖ్యఅతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా అక్కడ కొలువుదీరిన వ్రస్తోత్పత్తుల గురించి చేనేత కళాకారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆమె మాట్లాడుతూ అనాదిగా వస్తున్న మన సంస్కృతిలో పట్టు, హ్యాండ్లూమ్ వ్రస్తోత్పత్తులకు ఎంతో ప్రత్యేకత ఉందన్నారు. వేడుకలు, సంబరాల్లో ఫ్యాషన్ వేర్ కన్నా ఇలాంటి ఉత్పత్తులవైపే యువత ఎక్కువ మొగ్గు చూపుతున్నారని పేర్కొన్నారు. ఈ నెల 30వ తేదీ వరకు కొనసాగనున్న ఈ ప్రదర్శనలో దేశవ్యాప్తంగా దాదాపు 14 రాష్ట్రాల నుంచి చేనేతకారులు తమ ఉత్పత్తులను ప్రదర్శిస్తారని నిర్వాహకులు జయేష్ గుప్తా తెలిపారు. ఇందులో భాగంగా75 వేల రకాల వస్త్ర ఉత్పత్తులను అందుబాటులో ఉంచినట్లు వివరించారు.వినూత్నంగా మెటల్ సిరీస్ వాచ్‌లు..సాక్షి, సిటీబ్యూరో: అధునాతన ఫ్యాషన్ హంగులను ఎప్పటికప్పుడు అందిపుచ్చుకునే హైదరాబాద్ నగర వేదికగా బోల్డ్–ఫ్యాషన్–ఫార్వర్డ్ మెటల్ సిరీస్ వాచ్‌లు అందుబాటులోకి వచ్చాయి.ప్రముఖ ‘ఫా్రస్టాక్ స్మార్ట్’ఆధ్వర్యంలో ఆవిష్కరించిన ఈ మెటల్ సిరీస్ యువతను విశేషంగా ఆకర్షిస్తోంది. ఈ సందర్భంగా టైటాన్ కంపెనీ సేల్స్ హెడ్ ఆదిత్యరాజ్ మాట్లాడుతూ ఫా్రస్టాక్ స్టెయిన్లెస్–స్టీల్ వాచ్‌ల నుంచి ప్రేరణ పొంది ఈ స్మార్ట్‌వాచ్ కలెక్షన్ ప్రీమియం–గ్రేడ్ మెటల్‌తో రూపొందించామని తెలిపారు. అధునాతన ఫ్యాషన్ గాడ్జెట్స్‌ను ఆస్వాదించడంలో నగరం ఎల్లప్పుడూ ముందుంటుందని పేర్కొన్నారు. -
చేనేత పనితనాన్ని చూసే ఛాన్స్.. లైవ్లూమ్స్
విజయవాడ: చేనేత కళాకారుల పనితనం గురించి వినడమే కానీ... ప్రత్యక్షంగా చూసే అవకాశం అందరికీ కలగదు. ఈ నేపధ్యంలో టాటా గ్రూప్ ఆధ్వర్యంలోని బ్రాండ్ తనైరా.. చేనేత వస్త్రాల విక్రయ షోరూమ్స్‌లో లైవ్ లూమ్స్ ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది. వీటిని ఇటీవలే విజయవాడలో ప్రారంభించి త్వరలోనే మరిన్ని నగరాలకు విస్తరించనున్నారు. ఈ సందర్భంగా తనైరా ప్రతినిధులు పంచుకున్న వివరాల ప్రకారం...వైభవానికి ప్రతీక..సంప్రదాయ దుస్తులలో తనదైన ప్రత్యేకత కలిగిన టాటా తనైరా. భారతీయ చేనేత వైభవాన్ని దశదిశలా విస్తరించాలని యోచిస్తోంది. మారుతున్న అభిరుచులు పెరిగిన సాంకేతికతో పోటీ పడలేక అంతరించే దశకు చేరిన ఎన్నో చేనేత కళారూపాలకు పునర్జీవనం పోసేందుకు కృషి చేస్తోంది. అలనాటి చేనేత వైభవాన్ని నేటి తరానికి పరిచయం చేయటంతో పాటుగా ప్రాంతీయ అరుదైన పనితనంతో అద్భుతాలు అందదించడంలోని శ్రమను, సంక్లిష్టతను తెలియజెప్పేలా.. సంప్రదాయ నేత పద్ధతులతో కస్టమర్లను మళ్లీ అనుసంధానించడానికి తనైరా స్టోర్లలో ఈ లైవ్ లూమ్లని ఏర్పాటు చేసింది. ఇక్కడ, నైపుణ్యం కలిగిన నేత కార్మికులు తమ పనితనం, కళాత్మకతను కస్టమర్స్‌కి ప్రదర్శిస్తారు. ఉప్పాడ, మంగళగిరి, కలంకారి, ఇకత్లతో సహా గద్వాల్, నారాయణపేట, బనారస్, చందేరి, మహేశ్వర్ తదితర ప్రత్యేకమైన క్రాఫ్ట్‌ల కళాత్మక వైభవాన్ని మరింత అందంగా ప్రదర్శిస్తుంది.ఎనిమిదేళ్లుగా..తమ కార్యకలాపాలను 2017లో ప్రారంభించిన తనైరా, దేశవ్యాప్తంగా మహిళలను ఆకర్షిస్తూ రూ. 50,000 కోట్ల ఎత్నిక్ వేర్ మార్కెట్లో భారీ వాటాను సొంతం చేసుకుంది. స్థానిక కళాకారుల సహకారంతో సంప్రదాయ నేత పద్ధతులను పునరుద్ధరించడానికి ఈ బ్రాండ్ కట్టుబడి ఉంది, తద్వారా చేనేతల వారసత్వాన్ని కాపాడే పనిలో నిమగ్నమైంది. అరుదైన అంతగా తెలియని బాలుచారి, రంగకత్, వైరౌసి, పటాన్ పటోలా డోలీ బరాత్ వంటి విభిన్న శ్రేణి భారతీయ చేనేతలు సైతం తనైరా ఎంపికలో ఉన్నాయి.విపణిలో నిలిపేలా.. వీవర్శాలసాంప్రదాయ చేనేత పద్ధతులను సంరక్షించడంతో పాటు ఆధునీకరించే లక్ష్యంతో తనైరా గత 2022లో ’వీవర్‌శాల’ కార్యక్రమాన్ని ప్రారంభించింది. వారణాసి, చంపా, కోయంబత్తూర్, బారుయ్‌పూర్, ఫులియా, మంగళగిరి లాంటి ప్రాంతాల్లో దాదాపు వంద మంది కళాకారులతో 20 వీవర్శాలలల ఏర్పాటు ద్వారా బహుళ తరాలకు చెందిన కళాకారులతో కలిసి పనిచేస్తోంది. -
మగ్గం నేసి.. భళా అనేసి!
భూదాన్‌పోచంపల్లి: ఆస్ట్రేలియాలోని న్యూ సౌత్‌వేల్ గవర్నర్ మార్గరేట్ బీజ్లీ ఏసీబీక్యూ చేనేత మగ్గంపై పోచంపల్లి ఇక్కత్ వస్త్రం నేసి అబ్బురపర్చారు. స్వాతంత్య్ర వజ్రోత్సవాలను పురస్కరించుకుని ఇండియన్ ఎక్స్పోర్ట్ ప్రమోషన్, కేంద్ర జౌళి శాఖ సంయుక్త ఆధ్వర్యంలో ఆస్ట్రేలియాలోని సిడ్నీలో ఉన్న పవర్హౌస్మ్యూజియంలో ‘చరఖా అండ్ కర్గా’ పేరిట నిర్వహించిన చేనేత ఇక్కత్ కళా ప్రదర్శనలో పోచంపల్లికి చెందిన నేషనల్ హ్యాండ్లూమ్ మెరిట్ సర్టిఫికెట్ విన్నర్ తడక రమేశ్ ఇక్కత్ వస్త్రాల తయారీ ప్రత్యక్ష ప్రదర్శనను ఏర్పాటు చేశారు. సోమవారం భారతదేశ రాయబారి మనీష్ గుప్తా ఆధ్వర్యంలో జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి ఆమె బీజ్లీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఇక్కత్ కళ ఎంతో నైపుణ్యంతో కూడుకొన్నదని కొనియాడారు. సిడ్నీలో మొదటిసారిగా ఇక్కత్ వస్త్ర తయారీ ప్రదర్శన ఏర్పాటు చేయడం అభినందనీయమని పేర్కొన్నారు. అనంతరం తడక రమేశ్, మాస్టర్‌వీవర్ పాలాది యాదగిరిని భారత రాయబారి శాలువా కప్పి సన్మానించారు. (క్లిక్: సిడ్నీలో పోచంపల్లి ఇక్కత్ నేత ప్రదర్శన) -
చేనేతల కళత: ఇక్కత్ ఇక్కట్లు.. గొల్లభామ గొల్లు
శ్రీగిరి విజయ్‌కుమార్‌రెడ్డి, సాక్షి, ప్రత్యేక ప్రతినిధి తరతరాల వృత్తిపై మమకారం.. వదులుకోలేని, కొనసాగించలేని దైన్యం. మూరెడు బట్ట నేసినా.. జానెడు పొట్ట నిండని దౌర్భాగ్యం. అరకొర సాయం మినహా ప్రఖ్యాతిగాంచిన కళలు బతికి ‘బట్ట’ కట్టేలా కొరవడిన ప్రోత్సాహం..వెరసి చేనేత మనుగడను ప్రశ్నార్థకం చేస్తున్నాయి. ఆరు తరాలుగా వస్తోన్న అరుదైన చేనేత రంగుల కళ, కళ్ల ముందే చెదిరిపోతోంది. తెలంగాణాలో రెండు దశాబ్దాల క్రితం లక్ష మగ్గాలపై పడుగూ, పేకలతో అద్భుతాలు సృష్టించి అబ్బుర పరిచిన నేతన్నల సంఖ్య ఇప్పుడు ఇరవై రెండువేలకు పడిపోయిందంటేనే పరిస్థితి అర్ధమవుతోంది. మార్కెట్‌తో పోటీ పడే స్థితి లేక, నేసిన బట్టకు ధర గిట్టుబాటు కాక ఇతర ఉపాధి అవకాశాలను చూసుకుంటున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఒకరు, ఇద్దరు తప్ప కొత్త తరం ఈ వృత్తి వైపే కన్నెత్తి చూడటం లేదు. దీంతో చేనేతకు సంబంధించి ఇదే చివరి తరం అవుతుందనే ఆందోళన వ్యక్తమవుతోంది. నైపుణ్యం ఉన్నా.. చేయూత సరిపోక యాదాద్రి భువనగిరి, సిద్దిపేట, నారాయణపేట, గద్వాల, జనగామ జిల్లాల్లో చేనేత కళాకారులు తమ నైపుణ్యంతో గుప్పిట్లో పట్టే చీరలను సైతం నేసి ఔరా అనిపించారు. నూలు దారాలకు రబ్బర్ ట్యూబ్‌ను బిగించి (టై), సహజ రంగులద్ది (డై) మగ్గాలపై 3,384 పోగుల పడుగు (పొడవు), 17,000 పోగుల పేక (వెడల్పు)తో నేసిన ‘పోచంపల్లి ఇక్కత్’ పట్టుచీర ఇప్పటికీ ప్రపంచాన్ని అబ్బురపరుస్తోంది. తలపై పాలకుండతో వయ్యారి నడకలకు తమ పోగులతో ప్రాణం పోసి గొల్లభామ బ్రాండ్‌తో మార్కెట్లో మగువలను ఆకట్టుకుంది సిద్దిపేట నేతన్న కళ. దశాబ్దాల క్రితమే అంతరించిన పీతాంబరి పట్టుకు సైతం సిద్దిపేట కళాకారులు మళ్లీ ప్రాణం పోశారు. జకాడ మగ్గంపై వెండి జరీ ఉపయోగించి నేయటం పీతాంబరం ప్రత్యేకత. చీర అంచులు, డిజైన్లకు ప్రత్యేక పోగులను వాడుతారు. ఈ చీర ధర రూ.30 నుండి రూ.40 వేల వరకు ఉంటుంది. చేనేత కళాకారులు తమ మేథోసంపత్తితో రూపొందిస్తున్న ఇలాంటి చీరల డిజైన్లకు.. చేనేత రిజర్వేషన్ చట్టాన్ని అమలు చేయలేని వైఫల్యంతో, కొందరు వారం వ్యవధిలో నకళ్లు తయారు చేస్తున్నారు. పవర్‌లూమ్స్‌పై ప్రింట్ చేసి చేనేత బ్రాండ్‌గా తక్కువ ధరలతో మార్కెట్లోకి వదులుతున్నారు. ఈ ప్రింటెడ్ చీరలతో పోటీ పడలేక నేత చీర చతికిల పడుతోంది. దీనికి తోడు పోటీ ప్రపంచంలో మారుతున్న అభిరుచులకు అనుగుణంగా డిజైన్లు రూపొందించే శక్తి, సామర్థ్యాలు సహకార సంఘాలు, మాస్టర్ వీవర్లకు ఉండటం లేదు. మరోవైపు తమదైన శైలిలో రూపొందించిన వస్త్రాలను మార్కెట్ చేసుకోవటంలో వారు విఫలమవుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం కొద్దిమేర వస్త్ర ఉత్పత్తులు కొనుగోలు చేయడంతో పాటు కార్మికులకు పొదుపు, భద్రతా పథకం అమలు చేస్తూ రసాయనాలపై సబ్సిడీలు ఇస్తున్నా అవి ఏ మూలకు సరిపోవడం లేదు. పోటీని తట్టుకునేలా పాతవారితో పాటు కొత్త తరం వారికి తగిన శిక్షణ ఇవ్వడంతో పాటు, అంతరించే పోయే పరిస్థితుల్లో ఉన్న కళలను కాపాడేలా అనేక రూపాల్లో మరిన్ని ప్రోత్సాహకాలు అవసరమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. కింకర్తవ్యం ఏమిటి? ►ఐదేళ్లుగా ఎన్నికలు లేని, ఐదు మాసాలుగా కొనుగోళ్లు చేయని చేనేత సహకార సంఘాలన్నింటిలో కార్యాచరణ ప్రారంభించి రాజకీయాలకు సంబంధం లేకుండా మగ్గం నేసే వారికి సభ్యత్వం ఇవ్వాలి. సహకార సంఘాలకు కార్పొరేట్ హంగులద్ది ప్రతి నెలా తప్పనిసరిగా వస్త్రాలను కొనుగోలు చేయాలి ►మాస్టర్ వీవర్లకు ఆర్థిక పరిపుష్టినిచ్చేలా ప్యాకేజీలు ప్రకటించాలి. పరిశోధన, అభివృద్ధిలో భాగస్వామ్యం కల్పించాలి. ►నూలు, రంగులు, రసాయనాలపై ప్రస్తుతం ఇస్తున్న సబ్సిడీని పెంచాలి. మాల్స్, షాపింగ్ కాంప్లెక్సుల్లో చేనేత షోరూమ్‌లను తప్పనిసరి చేయాలి. ►ఇళ్లల్లో మగ్గం నేసే కార్మికులకు గృహ విద్యుత్ వినియోగంలో సబ్సిడీ ఇవ్వాలి. చేనేత బీమా వయో పరిమితి పెంచాలి. ►చేనేత వస్త్ర ఉత్పత్తులన్నింటిపై నకిలీకి తావులేకుండా ప్రత్యేక హోలోగ్రామ్ ముద్రించాలి. 1985 చేనేత రిజర్వేషన్ చట్టాన్ని కఠినంగా అమలు చేయాలి. ►ప్రస్తుతం చేష్టలుడిగిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఎన్ఫోర్స్మెంట్ను పటిష్టం చేసి నకిలీ ఉత్పత్తులు అమ్ముతున్న వ్యాపారులపై కఠిన చర్యలు తీసుకోవాలి. ►అన్ని రకాల చేనేత వస్త్రాలపై జీఎస్టీని తొలగించాలి. చేనేత వస్త్రాలు ఆరోగ్యానికి మంచిదని, తెలంగాణ ఖ్యాతికి నిదర్శనమనే ప్రచారాన్ని విస్తృతంగా చేయాలి. ►ప్రభుత్వం ఇస్తున్న కల్యాణలక్ష్మీ, షాదీ ముబారక్ కానుకల్లో చేనేత పట్టుచీర, ధోవతిని చేర్చాలి. బతుకమ్మ చీరల్లోనూ కొంత వాటా చేనేతకు కేటాయించాలి. రిజర్వేషన్ చట్టం ఏం చెబుతోంది చేనేత రిజర్వేన్ చట్టం 1985 ప్రకారం.. 11 రకాల ఉత్పత్తులు..అంటే కాటన్.. పట్టు చీరలు, ధోతి, టవల్స్, లుంగీలు, బెడ్‌షీట్స్, జంపఖానాలు, డ్రెస్ మెటీరియల్, బ్యారక్ బ్లాంకెట్స్, ఉన్ని శాలువలు, మఫ్లర్లు, చద్దర్లు పూర్తిగా చేనేత (కొన్ని మినహాయింపులతో) ద్వారానే ఉత్పత్తి చేయాలి. పవర్‌లూమ్స్ నిబంధనలు ఉల్లంఘించి ఉత్పత్తి, విక్రయాలు చేస్తే.. క్రిమినల్ చర్యలు చేపట్టి జరిమానాతో పాటు జైలుశిక్ష సైతం విధించవచ్చు. సంఘం సామగ్రి, పని ఇవ్వడం లేదు నేను చేనేత సహకార సంఘంలో ఎప్పటి నుండో సభ్యుడిని. కానీ సంఘం.. సామగ్రి, పని ఇవ్వడం లేదు. నాకు నేత తప్ప మరో పని రాదు. అందుకే ఓ మాస్టర్ వీవర్ వద్ద కూలీ పని చేస్తున్న. పోచంపల్లి నేత ఖ్యాతి క్రమంగా మసకబారుతోంది. కొత్తతరం రావడం లేదు. కళ్ల ముందే అరుదైన కళ కనుమరుగవుతుంటే బాధగా ఉంది. –చిట్టి ఐలయ్య, నేత కార్మికుడు, పోచంపల్లి తక్షణ కార్యాచరణ అవసరం చేనేత ఒక వృత్తి కాదు నాగరికత. అందులో పోచంపల్లి చేనేత కళ దేశంలోనే మరీ ప్రత్యేకమైనది. ప్రస్తుత పరిస్థితిలో మార్పు రాకుంటే అతి త్వరలో చేనేత కళ కనుమరుగు కావడం ఖాయం. ముందు తరాలకు అందించడం, మన ప్రత్యేకతను ప్రపంచవ్యాప్తం చేయాలంటే తక్షణ కార్యాచరణ అవసరం. కొత్త టెక్నాలజీ, డిజైన్లు, మార్కెటింగ్ అంశాలపై శిక్షణ ఇవ్వాలి. మరిన్ని ప్రోత్సాహకాలు కల్పించాలి. – చింతకింది మల్లేశం, ఆసు యంత్రం రూపకర్త ఇదే చివరి తరం అనుకుంటున్న చేనేత మాతోనే అంతం అయ్యేలా ఉంది. కొత్త తరం రాకపోతే గొప్ప కళను సమాజం కోల్పోతుంది. పొద్దంతా చీర నేస్తే రోజుకు రూ.200 నుంచి రూ.220 కూలీయే లభిస్తోంది. ఏదైనా షాప్‌లో పనికి వెళ్తే కనీసం రోజుకు రూ 300 ఇస్తున్నారు. నేను 53 ఏళ్లుగా మగ్గం నేస్తున్నా. వేరే పనికి వెళ్లలేక ఈ వృత్తిలో కొనసాగుతున్న. నాకు ఇప్పుడు 65 ఏళ్లు.. ప్రభుత్వం అమలు చేస్తున్న చేనేత బీమా వర్తించడం లేదు. చేనేత బీమాకు వయసుతో నిమిత్తం లేకుండా అందరికీ అమలు చేయాలి. – గంజి లింగం, లింగారెడ్డిపల్లి, సిద్దిపేట పీతాంబరానికి ‘ప్రాణం’ పోశారు తుమ్మ గాలయ్య సిద్దిపేటకు చెందిన చేనేత కార్మికుడు. అధికారులు చెప్పారని కనుమరుగైన పీతాంబరం పట్టు చీరకు పునర్వైభవం తెచ్చే దిశగా కృషి చేశాడు. ఇతర నేత కార్మికులతో కలిసి అనేక వ్యయ ప్రయాసలతో 270 వరకు పీతాంబరం పట్టు చీరలు నేశాడు. ప్రభుత్వం, టీఎస్సీఓ 60 చీరలను కొనుగోలు చేయగా మరో 60 వరకు చీరలు ప్రైవేటులో విక్రయించాడు. అయితే తగిన ప్రచారం లేకపోవడంతో పూర్తిస్థాయిలో చీరలు అమ్మలేకపోయాడు. ఇంకా 150 చీరల వరకు స్టాక్ ఉంది. భారీ పెట్టుబడితో నేసిన వస్త్రాల నిల్వ చూస్తుంటే నిద్ర పట్టడం లేదని, ప్రభుత్వం స్పందించి త్వరగా కొనుగోలు చేయకపోతే, భవిష్యత్తులో పీతాంబరం వెరైటీని తీసుకురాలేమని అంటున్నాడు. – తుమ్మ గాలయ్య, చేనేత కార్మికుడు, సిద్దిపేట పోచంపల్లికి.. కొత్త హంగులద్దాలని ఉంది ప్రపంచ ఖ్యాతి ఉన్న పోచంపల్లి చేనేతకు కొత్తహంగులు అద్దాలని ఉంది. అనేక ఉన్నత ఉద్యోగాలను వదులుకుని చేనేత పనినే ఎంచుకున్నా. సొంత ఖర్చులతో అనేక ప్రయోగాలు, కొత్త డిజైన్లు రూపొందించి మార్కెట్ చేస్తున్నా. అనేక సవాళ్లు ఎదురవుతున్నాయి. ప్రభుత్వానికి చేనేతను బతికించే ప్రతిపాదన ఇచ్చా.. ఏమవుతుందో చూడాలి. –సాయిని భరత్, పీహెచ్డీ స్కాలర్, పోచంపల్లి నావంతుగా.. నా నియోజకవర్గంలో కల్యాణలక్ష్మీ, షాదీ ముబారక్ కానుకలతో పాటు నా వంతుగా వధూవరులకు పోచంపల్లి చేనేత పట్టుచీర, జాకెట్, పంచె, టవల్ సొంత ఖర్చులతో ఇస్తున్నా. నేతన్నను ప్రోత్సహించే దిశగా నా వంతు ప్రయత్నం ఇది. – పైళ్ల శేఖర్‌రెడ్డి, ఎమ్మెల్యే, భువనగిరి -
సిడ్నీలో పోచంపల్లి ఇక్కత్ నేత ప్రదర్శన
భూదాన్‌పోచంపల్లి: భారత స్వాతంత్య్ర వజ్రోత్సవ వేడుకలను ఆస్ట్రేలియాలోనూ ఘనంగా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా సిడ్నీలోని పవర్‌హౌస్ మ్యూజియంలో ‘చరఖా అండ్ కర్గా’ పేరిట చేనేత హస్తకళల ప్రదర్శన జరుగుతోంది. ఇండియన్ ఎక్స్పోర్ట్ ప్రమోషన్, కేంద్ర జౌళి శాఖ సంయుక్త ఆధ్వర్యంలో జరుగుతున్న ప్రదర్శనలో పోచంపల్లికి చెందిన నేషనల్ హ్యాండ్లూమ్ మెరిట్ సర్టిఫికెట్ విన్నర్ తడక రమేశ్‌కు అవకాశం వచ్చింది. తడక రమేశ్ మగ్గంపై ఇక్కత్ వస్త్రాల తయారీ, చిటీకి కట్టడం, రంగులద్దకం, ఆసుపోయడం వంటి నేత ప్రక్రియలను ప్రత్యక్షంగా ప్రదర్శిస్తున్నారు. ఇండియా నుంచి పోచంపల్లి ఇక్కత్‌తో పాటు బనారస్ వస్త్రాల తయారీ ప్రత్యక్ష ప్రదర్శనకు అవకాశ వచ్చిందని రమేష్ తెలిపారు. భారత రాయబారి మనీష్ గుప్తా ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ కార్యక్రమాల్లో ఆగస్టు 15న ఉదయం 10 గంటలకు సిడ్నీలో జాతీయ జెండావిష్కరణ ఉంటుందని, స్థానికంగా ఉన్న భారతీయులందరూ పాల్గొంటారని చెప్పారు. ఈ వేడుకల్లో తాను, మాస్టర్‌వీవర్ పాలాది యాదగిరి భాగస్వామికావడం గర్వంగా ఉందన్నారు. (క్లిక్: మిస్ ఇండియా యూఎస్–2022 రన్నరప్‌గా సంజన) -
జాతీయ చేనేత దినోత్సవం: ‘వైఎస్‌ను గుర్తుచేస్తున్న సీఎం జగన్’
సాక్షి, అమరావతి: ‘మగ్గాలను పెట్టినాం.. నూలు నూలు ఒడికినాం.. మా నరాలనే దారాలుగా గుడ్డలెన్నో నేసినాం.. శ్రమ ఎవడిదిరో.. సిరి ఎవడిదిరో అని ఆక్రోశించిన నేతన్నల బతుకు చిత్రం ఇప్పుడు మెరుగుపడుతోంది. నవరత్నాలతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అందించిన సాయం చేనేతపై ఆధారపడిన వేలాది కుటుంబాలకు ఉపాధి దక్కేలా చేసింది. కరోనా కష్టకాలంలోనూ ‘నేతన్న నేస్తం’ ఆదుకుంది. చేనేత రంగం.. ఇప్పుడు సంక్షేమ రంగులు అద్దుకుంటోంది. ఆంధ్రప్రదేశ్‌లో చేనేత రంగం బతికి బట్టకడుతున్న వైనం పూర్వాపరాలపై ‘జాతీయ చేనేత దినోత్సవం’ సందర్భంగా ప్రత్యేక కథనం. సుదీర్ఘ చరిత్ర గల చేనేత రంగానికి రాష్ట్ర ప్రభుత్వం సరికొత్త రంగులు అద్దుతోంది. వైఎస్సార్ నేతన్న నేస్తం ద్వారా మగ్గం కలిగివున్న 81,703 మందికి రూ.383.79 కోట్లు అందించి జీవనోపాధి కల్పించింది. ఇప్పటికే రెండు పర్యాయాలు నేతన్న నేస్తం అందించిన ప్రభుత్వం మూడో పర్యాయం కూడా ఒక్కొక్కరికీ రూ. 24 వేల చొప్పున సాయమందించేందుకు ఏర్పాట్లు పూర్తి చేసింది. కరోనా సమయంలో చేనేత సొసైటీల్లో పేరుకుపోయిన వస్త్రాలను ఆప్కో ద్వారా కొనుగోలు చేయాలని సంకల్పించింది. ఆర్గానిక్ వస్త్రాల తయారీ, కొత్త కొత్త డిజైన్లు వంటి అనేక వినూత్న ప్రయోగాలతో చేనేత రంగానికి మరింత ఊతమిచ్చేలా ఆప్కో ద్వారా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ( ఫైల్ ఫోటో ) చేనేత ఉపాధికి చేయూత.. ఆంధ్రప్రదేశ్‌లో చేనేత రంగం ఒక కులానికి పరిమితం కాకుండా అనేక సామాజికవర్గాలకు ఉపాధి చూపుతోంది. పద్మశాలి, దేవంగ, కర్ణిభక్తులతోపాటు దాదాపు 18 ఉపకులాలు ఈ వృత్తిపై ఆధారపడి జీవిస్తున్నారు. నాల్గవ అఖిల భారత చేనేత లెక్కలు 2019–2020 ప్రకారం చేనేత, నేత, అనుంబంధ కార్యకలాపాల్లో దేశంలో 31.45 లక్షల మంది ఉపాధి పొందుతున్నారు. రాష్ట్రంలో 90,775 చేనేత కుటుంబాలు ఉన్నట్టు అంచనా. రాష్ట్రంలోని వెంకటగిరి, ధర్మవరం, చీరాల, మంగళగిరి, పెడన, మచిలీపట్నం, ఉప్పాడ, రాజాం తదితర అనేక ప్రాంతాల్లో చేనేత రంగం రారాజుగా గుర్తింపు పొందింది. పట్టుచీరలు, జరీ చీరలు, కాటన్ చీరలు, కలంకారీ, పొందూరు ధోవతులు, పుత్తూరు లుంగీలు అంటూ ఒక్కో ప్రాంతంలో ఒక్కో చేనేత వస్త్రం ప్రసిద్ధి పొందాయి. స్వదేశీ ఉద్యమ స్ఫూర్తి.. స్వదేశీ ఉద్యమ స్ఫూర్తిని గుర్తుకు తెచ్చేలా ప్రతియేటా ఆగస్టు7న జాతీయ చేనేత దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. ప్రపంచంలో ఉత్పత్తి అవుతున్న చేనేత వస్త్రాల్లో 95 శాతం మన దేశానివే. చేనేత వస్త్రాలకు కొంతకాలంగా పవర్ లూమ్స్, షటిల్ మగ్గాలు, స్పిన్నింగ్ మిల్లులు, ప్రాసెసింగ్ మిల్లులతో పోటీ ఎదురవుతుండగా.. నేడు కంప్యూటర్ సాయంతో ఎయిర్‌జెట్ వంటి మగ్గాల నుంచి పోటీ వచ్చిపడింది. ఇటువంటి పరిస్థితిలో చేనేతను ప్రోత్సహించేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనేక చర్యలు చేపట్టాయి. ( ఫైల్ ఫోటో ) హామీలు మరచిన బాబు.. ‘నేతన్న నేస్తం’ అందించిన సీఎం జగన్ రాష్ట్రంలో చేనేత రంగాన్ని ఆదుకుంటానంటూ 2014 ఎన్నికల్లో చంద్రబాబు ఇచ్చిన హామీలు గెలిచిన తర్వాత మరిచిపోయారని ఇప్పటికీ నేతన్నలు గుర్తు చేసుకుంటున్నారు. కాగా.. 2019లో అధికారం చేపట్టిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ‘నేతన్న నేస్తం’ తదితర పథకాల ద్వారా చేనేత రంగానికి సంక్షేమ రంగులు అద్దుతున్నారని నేతన్నలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కరోనా కష్టకాలంలో ఉపాధి చూపారు నేతన్న నేస్తం ద్వారా రూ.24వేలు ఇచ్చిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కరోనా కష్టకాలంలో మా కుటుంబానికి ఉపాధి చూపారు. మొత్తంతో ముడి సరుకులు(మెటీరియల్) కొనుక్కున్నాను. పెట్టుబడి పెట్టిన రూ.24 వేలు రాగా, రోజువారీ కూలీ డబ్బులు(ఉపాధి) గిట్టుబాటు కాగా, అదనంగా మరో రూ.3వేల లాభం వచ్చింది. –జంజనం లక్ష్మీ, మంగళగిరి, గుంటూరు జిల్లా మగ్గాన్ని ఆధునీకరించుకున్నాను పాత మగ్గంతో ఎన్నో ఏళ్లుగా అవస్థలు పడ్డాను. ప్రభుత్వం ఇచ్చిన రూ.24 వేలకు తోడు.. నేను కొంత సొమ్ము కలిపి లిఫ్టింగ్ మిషన్, జాకార్డ్ అమరికం ఏర్పాటు చేసుకున్నాను. దీని వల్ల నాకు నేత పని ఎంతో సులువు అయ్యింది. 2019 నుంచి మా జీవితాల్లో కొత్త కాంతి వచ్చింది. –జక్కుల వెంకట సుబ్బారావు, పెడన, కృష్ణా జిల్లా జీవితాల్లో రంగులు నింపారు దివంగత ముఖ్యమంత్రి, మహానేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి చేనేతకు ఎంతో ఊతమిచ్చారు. అచ్చం తండ్రి మాదిరిగానే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నేతన్నలను ఆదుకోవడంలో నిజంగానే నేస్తం అన్పించుకున్నారు. మహానేత వైఎస్‌ను గుర్తు చేస్తున్నారు. కళా విహీనంగా మారిన చేనేత బతుకుల్లో రంగులు నింపుతున్నారు. – ఊటుకూరి రంగారావు, పెడన, కృష్ణా జిల్లా -
యూపీలో మగ్గాలు నేస్తున్న టీచర్లు
సాక్షి, న్యూఢిల్లీ : ఉత్తరప్రదేశ్‌లోని లహర్‌పూర్‌కు చెందిన మొహమ్మద్ అక్రమ్ తెల్లవారు జామున మూడు గంటలకే నిద్ర లేస్తారు. ఉదయం నాలుగు నుంచి ఆరు గంటల వరకు ఇంటికి సమీపంలోనే ఉన్న రగ్గుల తయారీ కేంద్రంలో పనిచేస్తారు. అక్కడి నుంచి ఇంటికెళ్లి ఇంత టిఫిన్ తిని 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న బిశ్వాన్ మదర్సాకు సైకిల్‌పై వెళతారు. ఉదయం 9 గంటల నుంచి 2.30 గంటల వరకు అక్కడ పనిచేస్తారు. అక్కడి నుంచి ఇంటికి తిరిగొచ్చాక సాయంత్రం ఆరు గంటల నుంచి ఎనిమిది గంటల వరకు మరో రెండు గంటలు రగ్గుల తయారీ కేంద్రంలో పనిచేస్తారు. కాన్పూర్ యూనివర్శిటీ నుంచి పొలిటికల్ సైన్స్‌లో మాస్టర్ డిగ్రీ పుచ్చుకున్న అక్రమ్ బిశ్వాన్ మదర్సాలో లెక్కలు, ఇంగ్లీషు చెప్పేందుకు 2009లో నియమితులయ్యారు. 2016 వరకు ఆయన జీవితం కాస్త సాఫీగానే సాగింది. అప్పటి నుంచి జీతం రాకుండా నిలిచి పోవడంతో రగ్గుల తయారీ కేంద్రంలో పనిచేస్తున్నారు. అందులో రోజుకు 150 రూపాయలు వస్తాయట. ఎప్పటికైనా జీతానికి సంబంధించిన ఎరియర్స్ వస్తాయన్న ఆశతో ఆయన క్రమం తప్పకుండా మదర్సాకు వెళ్లి పిల్లలకు చదువు చెబుతూనే ఉన్నారు. అక్రమ్ ఒక్కడిదే కాదు ఈ బాధ. యూపీలోని మదర్సాల్లో ఆధునిక విద్యను బోధించేందుకు నియమితులైన 20 వేల మంది టీచర్ల పరిస్థితి ఇదే. వారిలో కొందరు పార్ట్‌టైమ్‌గా ఇళ్ల వద్ద విద్యార్థులకు ట్యూషన్లు చెబుతున్నారు. కొందరు ఎలక్ట్రిక్ ఆటో రిక్షాలు నడుపుతున్నారు. మరి కొందరు ఇంటింటికి సరకులు మోస్తూ బతుకుతున్నారు. వీరంతా కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సహాయంతో నడుస్తున్న ‘స్కీమ్ ఫర్ ప్రొఫైడింగ్ ఎడ్యుకేషన్ టు మదర్సాస్ అండ్ మైనారిటీస్’ కింద మదర్సాలలో మ్యాథమేటిక్స్, సైన్సెస్, సోషల్ సైన్సెస్, ఇంగ్లీష్ బోధించేందుకు నియమితులైనవారు. మదర్సా నిర్వహణకు, గ్రంధాలయం లాంటి మౌలిక సదుపాయాలకు కేంద్రం ఆర్థిక సహాయం చేయడమే కాకుండా ప్రతి మదర్సాకు ముగ్గురు టీచర్ల చొప్పున గౌరవ వేతనాన్ని చెల్లిస్తుంది. గ్రాడ్యువేట్ టీచర్లకు ఆరు వేలు, పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్లకు 12వేల రూపాయలను చెల్లిస్తుంది. దానికి తోడుగా గ్రాడ్యుయేట్లకు యూపీ రాష్ట్ర ప్రభుత్వం రెండు వేలు, పోస్ట్ గ్రాడ్యుయేట్లకు మూడు వేల రూపాయలను చెల్లిస్తూ వచ్చింది. 2016, మార్చి నెల నుంచి వీరి జీతాలన్ని నిలిచిపోయాయి. ఈ మదర్సాలలో ముస్లిం పిల్లలే కాకుండా 30 శాతం మంది హిందూ పిల్లలు కూడా చదువుకుంటున్నారు. ఇందుకు తమ తప్పేమి లేదని, కేంద్రం నుంచి రావాల్సిన నిధులు విడుదల కాకపోవడమే కారణమని యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం వాదిస్తోంది. గ్రాంటును మంజూరు చేసినప్పటికీ 284.87 కోట్ల రూపాయలను కేంద్రం విడుదల చేయలేదు. దేశవ్యాప్తంగా 18 రాష్ట్రాలు ఈ కేంద్రం స్కీమ్‌ను అమలు చేస్తున్నప్పటికీ ఒక్క యూపీకే ఈ సమస్య రావడానికి కూడా కారణాలు ఉన్నాయి. దేశంలో ఏ రాష్ట్రంలో లేనన్ని 8,584 మదర్సాలు ఇక్కడ ఉన్నాయి. వీటిల్లో 18,27,566 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. మధ్యప్రదేశ్, బీహార్ రాష్ట్రాల్లో వెయ్యికిపైగా మదర్సాలు ఉన్నాయి తప్పా, మిగితా రాష్ట్రాల్లో తక్కువగానే ఉన్నాయి. మదర్సాలంటే ఏమిటీ? మదర్సా అనే పదం అరబిక్ నుంచి వచ్చింది. అరబిక్‌లో దరా అంటే నేర్చుకోవడం అనే అర్థం. మదర్సా అంటే నేర్కుకునే బడి అని అర్థం. దేశ స్వాతంత్య్రానికి ముందు భారత్‌లో బ్రిటీష్ ప్రభుత్వం ఆర్థిక సహాయంతో నడిచే మదర్సాలు, ముస్లిం సామాజిక వర్గం నడిపే మదర్సాలు రెండు రకాలు ఉండేవి. ప్రైవేటు మదర్సాల్లో ఇస్లాం మతంతోపాటు అరబిక్, ఉర్దూ, పర్షియన్ భాషలను నేర్పేవారు. ప్రభుత్వ ఆర్థిక సహాయంతో నడిచే మదర్సాల్లో కేవలం అరబిక్, ఉర్దూ, పర్షియన్ భాషలను మాత్రమే నేర్పేవారు. దేశానికి స్వాతంత్వ్రం వచ్చిన తర్వాత వీటిని మైనారిటీ వర్గానికి చెందిన ప్రాథమిక విద్యాకేంద్రాలుగానే పరిగణించారు. ప్రైవేట్ మదర్సాలలో ఇస్లాంను బోధిస్తారుకనుక అందులో చదువుకున్న వారు ఎక్కువగా ఇమామ్‌లు, ముస్లిం మత గురువులు అయ్యేవారు. ప్రభుత్వ ఆర్థిక సహాయంతో నడిచే మదర్సాలలో చదువుకునే వారు ఆ తర్వాత చదువుకు స్వస్తి చెప్పడమో, ప్రభుత్వ పాఠశాలల్లో చేరడమో చేసేవారు. సంస్కరణలు, ఆధునీకరణ ప్రభుత్వ ఆర్థిక సహాయంతో నడుస్తున్న మదర్సాల సంస్కరణలకు భారత ప్రభుత్వం 1993 నుంచి కృషి చేస్తోంది. ‘ఏరియా ఇంటెన్సివ్ ప్రోగామ్ ఫర్ ఎడ్యుకేషనల్లీ బ్యాక్వర్డ్ మైనారిటీస్ అండ్ ఫైనాన్సియల్ అసెస్టెంట్స్ ఫర్ మోడరనైజేషన్ ఆఫ్ మదర్సా ఎడ్యుకేషన్’ అనే రెండు స్కీమ్‌లు తెచ్చింది. వీటికి హిందువుల పిల్లలకు కూడా అనుమతి ఉండడంతో వారికి అరబిక్, పర్షియన్ భాషలకు బదులుగా సంస్కృతం బోధిస్తూ వస్తున్నారు. కేవలం భాషలకు, భాషా సంస్కృతి, సంప్రదాయాలకు పరిమితం అవుతున్న వీటిని ఆధునిక విద్యా కేంద్రాలుగా మార్చాలన్న ఉద్దేశంతోని కేంద్ర ప్రభుత్వం 2009లో ‘స్కీమ్ ఫర్ ప్రొఫైడింగ్ ఎడ్యుకేషన్ టు మదర్సాస్ అండ్ మైనారిటీస్’ ప్రైవేశపెట్టింది. ఈ స్కీమ్ కింద మదర్సాల్లో చదువుకున్నవారు ప్రభుత్వ పాఠశాలల్లో నేరుగా తొమ్మిదవ తరగతిలో చేరుతున్నారు. తొమ్మిది నుంచి 12వ తరగతి వరకు యూపీ స్కూళ్లలో చేరుతున్న వారిలో 25 శాతం మంది మదర్సా విద్యార్థులే ఉంటున్నారు. నిధుల విడుదలకు కఠిన నిబంధనలు కేంద్రంలో నరేంద్ర మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 2016లో మదర్సాలకు నిధులు విడుదల చేయడానికి నిబంధనలను కఠినతరం చేసింది. మదర్సాల ఆర్థిక సహాయం స్కీమ్‌ను కొనసాగించాలా, వద్దా? అన్న అంశంపై 2018లో మదర్సాల పనితీరును సమీక్షించింది. మరో రెండేళ్లపాటు 2020 వరకు కొనసాగించాలని నిర్ణయించింది. ప్రతి ఏటా రాష్ట్రాల విద్యాబోర్డు అనుమతిని తప్పనిసరి చేసింది. అయితే నిధుల విడుదలలో తాత్సారం చేస్తోంది. యూపీ మదర్సా టీచర్లు ఢిల్లీ జంతర్‌మంతర్‌కు వెళ్లి ఎన్నిసార్లు ఆందోళన చేసినా ఎవరు పట్టించుకోవడం లేదు. -
చేనేతకు పన్నుపోటు
-
చేనేతకు జీఎస్టీ వాత
అభిప్రాయం జీఎస్టీ పేరుతో చేతివృత్తులను, చేనేతను పూర్తిగా నాశనం చేయడానికి ప్రభుత్వం పూనుకుందా అనిపిస్తోంది. ‘స్వదేశీ’, ‘మేక్ ఇన్ ఇండియా’ వంటి నినాదాలను వినిపించే ప్రభుత్వం చేనేతలను, చేతివృత్తులను ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నది? మన గ్రామీణ ఆర్థిక వ్యవ స్థలో వ్యవసాయం తరువాతి స్థానం చేనేతకు ఉంది. వలసవాదుల పరిపాలన నుండి ఈ రంగం ఎన్నో ఆటుపోట్లను చవిచూసింది. పారిశ్రామికీకరణలో భాగంగా బ్రిటన్ నుంచి వచ్చిపడిన మిల్లు దారంతో 1830లలో దేశంలోని చేతి రాట్నాలు మూలనపడ్డా యి. వాటిపై ఆధారపడ్డ స్త్రీలు ఉపాధి కోల్పోయారు. మన మగ్గాలు మిల్లు దారం వాడడం ఈ సమయం లోనే ప్రారంభమైంది. అంటే ఇంటిలో తన మగ్గంపై స్వతంత్రంగా పని చేసుకునే నేతకారుడు కూడా దారం కోసం ఎక్కడో దూరంగా ఉన్న స్పిన్నింగు మిల్లులపై ఆధారపడే పరిస్థితి ఏర్పడింది. దీని వలన చేనేత కొంతవరకు తన ప్రత్యేక ఉనికిని కోల్పో యింది. ఇదే తరువాత వచ్చిన పవర్లూమ్ అనుకర ణలకు సులభమైన తోవ చూపింది. ఈనాడు చేనేత పేరుతో అమ్మకం జరిగే ఉత్పత్తుల్లో 70% పవర్ లూమ్ అనుకరణలే. ఆర్థిక సరళీకరణ పేరుతో రెండు దశాబ్దాల క్రితం మనదేశంలో పత్తి, దారం ఎగుమతులపై ఆంక్షలు సడలించారు. అంతర్జాతీయ మార్కెట్లో ముడి పత్తి, కాటన్ దారం కోసం విపరీతమైన డిమాండ్ ఉంది. జాతీయ మార్కెట్ అవసరాలను పట్టించుకోకుండా, ఎగుమతులకు ప్రోత్సాహకాలు ఇవ్వడం వలన దారం కోసం అంతర్జాతీయ మార్కె ట్‌తో పోటీ పడవలసి వచ్చింది. తత్ఫలితంగా దారం ధరలకు రెక్కలొచ్చాయి. పెరుగుతున్న దారం ధరలు, విదేశీ మార్కెట్ ఒత్తిడి వలన సమయానికి దారం అందకపోవడం వంటి కారణాలతో చేనేత రంగం బాగా దెబ్బతింది. 1995లో 66లక్షలు ఉన్న చేనేత కుటుంబ జనాభా, 2010 లెక్కల ప్రకారం 44 లక్షలు మాత్రమే ఉంది. 1990వ దశకంలో దేశీయ మార్కెట్లో విశేష ఆదరణ పొందిన మంగళగిరి బట్ట, ఈ రోజు పవర్ లూమ్ అనుకరణల వలన తన ప్రత్యేకతను కోల్పోయింది. 1995లో 20,000ల మగ్గాలు ఉన్న మంగళగిరిలో, నేడు కేవలం 6,000 మగ్గాల వరకే పని చేస్తున్నాయి. పెరుగుతున్న నూలు ధరలు, పవర్ లూమ్ పోటీతో నలుగుతున్న చేనేత రంగంపై జీఎస్టీ గొడ్డలి పెట్టయింది. స్వాతంత్య్రం వచ్చిన 70 ఏళ్ల తరువాత మొట్ట మొదటి సారిగా చేనేతపై పన్ను విధించారు. జీఎస్టీ కింద పేర్కొన్న ఉత్పత్తుల్లో, చేతివృత్తుల ప్రస్తావన కనిపించదు. ఇప్పటివరకు జౌళి రంగంలో మిల్లు, పవర్లూమ్, చేనేత అనే మూడు రంగాల విభజన జీఎస్టీతో ముగిసింది. అంటే ఇక నుంచి చేతితో తయారయ్యే బట్ట, యంత్ర సహాయంతో తయా రయ్యే బట్ట సమానం. అందుకే జీఎస్టీ సూచికలో వాడిన పదజాలం ఎగుమతుల కోసం జౌళి రం గంలో వాడే పదాలకు దగ్గరగా ఉంది. ఉదాహరణకు జీఎస్టీ లిస్టులో ‘చీర’ అనే పదం కనపడదు. ఇప్పుడు మార్కెట్లో ఎక్కువగా అమ్ముడుపోయే ‘కుర్తా’ లేదా ‘పంజాబీ డ్రస్సు’ ప్రస్తావన కూడా లేదు. జీఎస్టీ ‘ఒక పన్ను, ఒకే దేశం’ నినాదంతో ముందుకెళ్తూ, ఎన్నో గ్రామీణ చేతివృత్తులు, అసం ఘటిత రంగంలోని ఉపాధులను అణగదొక్కేసింది. ఈ పన్ను వలన లాభం కలిగేది పెద్ద ఎత్తున పెట్టు బడులతో నడిచే పెద్ద ఫ్యాక్టరీలకు మాత్రమే. ఉదాహ రణకు కార్ల తయారీ తీసుకుంటే, అన్ని దశల తయారీ ఒకే కప్పు కింద నిర్వహిస్తే, ప్రతి దశలో ఉత్పత్తిపై పడే పన్ను భారం నుంచి తప్పించుకోవచ్చు. అందు వలన జీఎస్టీ తరువాత పెద్ద పెద్ద కార్ల రేటు తగ్గింది. ఇంటిలోని మగ్గంపై తయారయ్యే చేనేత బట్ట రేటు పెరిగింది. చేనేత వస్త్ర తయారీలో వివిధ దశలైన రంగు అద్దకం, పడుగుకు గంజిపెట్టడం, వాషింగ్ వంటి సర్వీసులపైన కూడా జీఎస్టీ విధించారు. అంటే దారం నుంచి బట్ట తయారీ ఒక కప్పు కింద ఉత్పత్తి జరిగితేనే చేనేతకు జీఎస్టీ వలన లాభం కలు గుతుంది. ఈ పన్ను తరువాత చేనేత ధరలు 5%– 10% వరకు పెరగే అవకాశం ఉంది. కొనుగోలు దార్లను చేనేత బట్ట నుంచి దూరం చేస్తుంది. పై అంశాలను గమనిస్తే జీఎస్టీ పేరుతో చేతి వృత్తులను, చేనేతను పూర్తిగా నాశనం చేయడానికి ప్రభుత్వం పూనుకుందా అనిపిస్తోంది. ‘స్వదేశీ’, ‘మేక్ ఇన్ ఇండియా’ వంటి నినాదాలను తరచూ వినిపించే ప్రభుత్వం ‘స్వదేశీ’ ఉత్పత్తికి అద్దంపట్టే చేనేతలను, చేతివృత్తులను ఎందుకు నిర్లక్ష్యం చేస్తు న్నదో అర్థం కాదు. చేనేతపై ఆధారపడి 44 లక్షలు, చేతివృత్తులపై ఆధారపడి 68 లక్షలు, దాదాపు కోటి కుటుంబాలు ఉపాధి పొందుతున్నాయి. వీరికి కేవలం ‘బ్రాండు’ కల్పించడం, పండుగలు జరపడం వలన ప్రయోజనం కలుగదు. వారు వాడే ముడి సరుకులను పన్ను చట్రంలో ఇరికించకూడదు. వాటిపై ధరల నియంత్రణ ఉండాలి. చిన్న ఉత్పత్తి దార్లను అంతర్జాతీయ మార్కెట్‌తో పోటీపడి ముడి సరుకుల్ని కొనుక్కోమనడం భావ్యం కాదు. వారికి అదనపు ఇబ్బందుల్ని కలిగించకపోతే, చేతివృత్తుల ఉత్పత్తులకు మార్కెట్ కొరత లేదు. ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా వారిపై జీఎస్టీ భారం పడకుండా చేసే బాధ్యత ప్రభుత్వానిదే. చేతిలో ఉన్న అవకాశాలకు గండికొట్టి కొత్త అవకాశాలు వెదుక్కోవడం అవివేకం. వ్యాసకర్త దస్తకార్ ఆంధ్ర‘ 9000199920 శ్యామసుందరి -
చేనేతకు పన్ను మినహాయింపు ఇవ్వాలి
మంత్రి అచ్చంనాయుడికి వినతి కాకినాడ సిటీ : కుంటుపడుతున్న చేనేత రంగానికి పన్ను విధానంలో మినహయింపు ఇవ్వాలని జౌళి శాఖ మంత్రి కింజరపు అచ్చంనాయుడిని వీవర్స్ యునైటెడ్ ఫ్రంట్ రాష్ట్ర కన్వీనర్ తూతిక శ్రీనివాసవిశ్వనాథ్ కోరారు. బుధవారం జిల్లాకు వచ్చిన మంత్రిని ఫ్రంట్ ప్రతినిధులు బృందం సత్కరించి చేనేత సమస్యలపై వినతిపత్రం సమర్పించింది. చేనేత వస్త్రాలకు ‘రిబేటు’ఇవ్వకపోవడం వల్ల సంఘాలలో వస్త్రాలు నిల్వ ఉండి పాడైపోతున్నాయన్నారు. కేంద్ర, రాష్ట్ర జౌళి శాఖల మధ్య సమన్వయ లోపం వల్ల కేంద్ర పథకాల లబ్ధిని రాష్ట్రంలోని చేనేత కార్మికులు పొందలేకపోతున్నారని వివరించారు. దీంతో నైపుణ్యం ఉన్న నేత కార్మికులే వృత్తి వదిలివెళ్లిపోతున్నారని మంత్రి దృష్టికి తీసుకెళ్ళారు. మంత్రిని కలిసిన వారిలో ఫ్రంట్ కో-కన్వీనర్ శీరం లక్ష్మణప్రసాద్, యర్రా వీరభద్రారావు, చింత వీరభద్రరావు, మలిపెద్ది అప్పారావు, వీసా పరమేశ్వరరావు, శీరం అప్పారావు, గుడిమెట్ల వీర్రాజు, చేనేత సహకార సంఘ ప్రతినిధులు ఉన్నారు. -
గ్రామీణ అభివృద్ధిలో భాగమే ‘చేనేత’
టీఆర్ఎస్ ప్రభుత్వం గ్రామీణ పునరుజ్జీవం పేరుతో చేతివృత్తుల వారికి 2017–18 బడ్జెట్లో ప్రత్యేకమైన కేటాయింపులు చేసినట్లు కనపడుతోంది. వివిధ కుల వృత్తులకు నిలయమైన గ్రామీణ అభి వృద్ధికి ఉత్తేజం కల్పించాలనే తపనతో అదనంగా నిధుల కేటా యింపు అని చెబుతున్నారు. అందులో భాగంగానే ‘చేనేత వృత్తికి భరోసా’ కల్పించేందుకు, మొత్తంగా వృత్తికారుల ఉనికిని నిల బెట్టేందుకు చేనేతకు రూ. 12 వందల కోట్లను ప్రభుత్వం ప్రకటిం చింది. దీంతో రాష్ట్రంలో ఒక వర్గానికి జనాభా ప్రాతిపదికన బడ్జెట్ కేటాయింపు చేసే ప్రక్రియకు తెరతీసింది. చేనేతలకు, వృత్తులపై ఆధారపడిన వారికి మాత్రం ఇలాంటి కేటాయింపులు లేవు. చేనేతకు రూ. 1,200 కోట్లు అనగానే బంగారు తెలంగాణ ఏమోగానీ, చేనేతల బ్రతుకుకు బంగారు భవిష్యత్ ఉందని కార్మికులు ఆశపడుతున్నారు. చావుభయంతో ఉన్న దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తునికి బ్రతుకు ఆశ కల్పించినట్లుగా ఉనికి కోల్పోతున్న చేనేత రంగానికి పునరు త్తేజం తెస్తున్నట్లు ప్రభుత్వం మరోసారి భ్రమలు కల్పిస్తున్నది. తెలంగాణ చేనేత ఉత్పత్తులకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు ఉంది. ప్రత్యేకంగా పోచంపల్లి టై అండ్ డై, గద్వాలు కుప్పడం చీరలు, హన్మకొండ తివాచీ, కరీంనగర్ దుప్పట్లు, ధోతీలు, లుంగీలు; దుబ్బాక గొల్ల భామలు చీరలు ఎంతో ప్రత్యేకత కల్గిన ఉత్పత్తులు. అంతేగాక దేశీయ, అంతర్జాతీయ మార్కెట్ అవకా శాలు అంది పుచ్చుకుంటున్న ఉత్పత్తి రకాలు. అయితే 1980ల నుంచి చేనేత రంగం తన ఉనికిని కోల్పోతూ సహకార వ్యవస్థ కుంటుపడింది. దీనికి అవినీతి, యాజమాన్యాల నిర్వహణ లోపాలు, రాజకీయ పార్టీల జోక్యమే కారణం. ఈ దుస్థితి వల్లనే 1995 వరకు సుమారు 73,119 మగ్గాలు ఉండగా నేడు 17,000 సంఖ్యకు తగ్గిందని ప్రభుత్వ లెక్కలు చెబుతున్నాయి. అయితే ప్రభుత్వ డేటా మగ్గాల సంఖ్య తగ్గిందని చూపు తుందే కానీ, 11,643 మగ్గాలపై ఆధారపడి జీవిస్తున్న 69,858 మంది చేనేతపై పొందుతున్న ఉపాధిని కోల్పోయారని మాత్రం చెప్పదు. వృత్తిపై ఆధారపడి జీవిస్తూ అప్పుల బాధ తట్టుకోలేక, అనారోగ్య పీడితులై ఆత్మహత్యలు చేసుకున్న 234 కుటుంబాలలో 89 మందికి సంబంధించిన పోస్ట్‌మార్టం రిపోర్టులు, ఎఫ్ఐఆర్ కాపీలు లేవంటూ ఎక్స్‌గ్రేషియా ఇవ్వడానికి ప్రభుత్వం నిరాకరిం చింది. చావులో కూడా ప్రభుత్వ వివక్షకు ఇంతకంటే నిదర్శనం లేదు. కేసీఆర్ పాలనలో 11 మంది చేనేతలు ఆత్మహత్య చేసుకు న్నారు. చేనేతపట్ల చేసిన నిర్లక్ష్యానికి బలైన కుటుంబాలకు జవాబు దారీ ఎవరు? రాజ్యం భరోసా ఇవ్వనందునే, సంక్షేమ చర్యలు, వృత్తిని ఆదుకొనే విధానాలు లేనందునే తెలంగాణలో కానీ మరె క్కడైనా శ్రమించే లక్షణం పుణికి పుచ్చుకునే చేనేత కార్మికులు ఆత్మ గౌరవంతో ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. 2014–15 ఆర్థిక సంవత్సరంలో కేటాయించిన నిధులలో రూ. 74.93 లక్షలలో కేవలం రూ. 49.87 లక్షలు మాత్రమే త్రిఫ్ట్ పథకంకు ఖర్చు చేశారు. 2015–16 సంవత్సరంలో కూడా రూ. 199.50 లక్షలు కేటాయించి రూ. 49.47 లక్షలు మాత్రమే ఖర్చు చేశారు. రుణమాఫీ పథకానికి రూ. 239 లక్షలు కేటాయించి, రూ. 176.16 లక్షలు మాత్రమే నిధులు విడుదల చేసింది. ముడిసరుకు సరసమైన ధరలకు అందించాలనే చేనేతల డిమాండ్ ఫలితంగా ప్రవేశపెట్టిన యారన్ సబ్సిడీ పథకానికి (10 శాతం) రూ. 450.00 లక్షలు కేటాయించి రూ. 225.00 లక్షలు మాత్రమే నిధులిచ్చింది. గద్వాల్ చేనేత పార్క్ స్థాపనను ప్రకటనకే పరిమితం చేసి నిధులు కేటాయించక పోవడంతో పనులు ప్రారంభించక చేనేత కార్మికుల ఆశలు ‘ఎండమావి’గా మారాయి. వడ్డీ రాయితీని రూ. 750.70 లక్షలు మాత్రమే ఖర్చు చేశారు. బడ్జెట్ కేటాయింపుల ప్రకారం పథకాలను అమలు చేయకపోవడం వలన తెలంగాణలో చేనేత ఉపాధి ప్రశ్నార్థకమై కార్మికులు ఇతర రంగాలలో ఉపాధి పొందేందుకు పట్టణ ప్రాంతాలకు వలసలు వెళ్లడం వలన చేనేత గ్రామాలలో మగ్గాల సంఖ్య గణనీయంగా తగ్గింది. ఇప్పటికే సూరత్, భివాంధే, షోలాపూర్‌లకు వలసలు వెళ్లిన తెలంగాణ చేనే తలు నేడు అమలు జరుగుతున్న వేతనాల సమస్యతో చాలీ చాలని జీతాలతో బ్రతుకునీడ్చలేక అనారోగ్య పీడితులై దుర్భర దారిద్య్ర జీవితాలను అనుభవిస్తున్నారు. వారందరినీ ఇక్కడకు తెచ్చే ఏర్పా టుచేస్తానని కేసీఆర్ ఎన్నికల్లో వాగ్దానం చేశారు. అయితే వారిని ఇక్కడికి తీసుకొచ్చేది వేతన కూలీలుగా చేయడానికా లేక స్వయం సమృద్ధి చెందించడానికా అనేది ప్రశ్న. నిజంగా స్వయంసమృద్ధి కొరకు అయితే అపెరల్ పార్కులను, మెగా టెక్స్టైల్ పార్కులను ప్రతిపాదించాల్సిన అవసరం లేదు. ప్రభుత్వానికి చేనేత పరిశ్రమలను కాపాడాలనే తపన ఉంటే తక్షణమే 20 శాతం వేతన రాయితీని కార్మికులకు ప్రకటించాలి. ఈ పథకం అమలుకు సగటు నెల వేతనాన్ని రూ. 12 వేల నుంచి రూ. 15 వేలుగా గుర్తించి, కార్మికులు నెలవారీగా సంఘాలు లేక మాస్టర్ వీవర్స్ వద్ద పొందుతున్న మజూరీలనుబట్టి వేజ్ ఇన్సెం టివ్‌ను లెక్కకట్టి ఇవ్వాలి. చేనేత అభివృద్ధిని గ్రామీణ అభివృద్ధిలో భాగంగా ఆలోచించి విధానాలు రూపొందించాలి. గ్రామీణ నిరు ద్యోగ నిర్మూలనకు చేనేత రంగ అభివృద్ధి ఒక చక్కని అవకాశంగా గుర్తించి ప్రత్యేక ప్రణాళికలను, స్థానిక మార్కెట్ అవకాశాలను రూపొందించాలి. అంతిమంగా చేనేతనాయకులు, కార్మికులు సమస్య ప్రాతిపదికగా జరిపే పోరాట ఆచరణ మాత్రమే నిజమైన గుర్తింపుగా భావించి సంఘటిత పోరాటాలు చేయాలి. - మాచర్ల మోహన్‌రావు, వ్యవస్థాపక అధ్యక్షులు రాష్ట్ర చేనేత జనసమాఖ్య, తెలంగాణ weavers.hl@gmail.com -
రాజ్యాధికారం కోసం పోరాడుదాం
రాష్ట్ర చేనేత కులాల ఐక్యవేదిక సమావేశంలో నాయకులు పిఠాపురం టౌన్ : చేనేత కుటుంబాలు కష్టాల నుంచి బయటపడాలంటే సమానత్వం, ఆర్థికస్వాలంభన, రాజ్యాధికారం దిశగా పోరాడాలని రాష్ట్రంలోని పలు చేనేత కులాల నాయకులు పిలుపునిచ్చారు. స్థానిక మున్సిపల్ కల్యాణ మండపంలో శనివారం జరిగిన రాష్ట్ర వీవర్స్ యునైటెడ్ ఫ్రంట్ ప్రతినిధుల సమావేశంలో పలువురు నాయకులు మాట్లాడారు. చేనేతే రంగం మీద ఆధారపడి జీవిస్తున్నవారు అనేక ఒడిదుడుకులు ఎదుర్కొంటూ ఆత్మహత్యలకు పాల్పడుతున్నారన్నారు. రాష్ట్రంలో 19 శాతంగా ఉన్న చేనేత వర్గం అభివృద్ధి చెందాలంటే రాజకీయ ఆవశ్యకత అవసరమని కనీసం 10 మంది ఎమ్మెల్యేలను నెగ్గించుకునేందుకు ప్రతి చేనేత కుటుంబం కృషి చేయాలన్నారు. ఫ్రంట్ వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్ శ్రీరం శ్రీరామచంద్రమూర్తి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో పలు తీర్మానాలు ఆమోదించారు. వీటికి నవరత్నాలు అని పేరుపెట్టారు. ఫ్రంట్‌కు రాష్ట్ర కన్వీనర్‌గా ఎంపికైన తూతిక శ్రీనివాస విశ్వనాథ్ తీర్మానాలను చదివి వినిపించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సమన్యాయంతో సమగ్ర చేనేత జాతీయ, రాష్ట్ర విధానం అమలు చేయాలని, చేనేత కార్మికుల ఆత్మహత్యల నివారణకు వర్షాకాలంలో నేత విరామం అమలు చేయాలని, చేనేత కార్పొరేషన్ ఏర్పాటు చేసి రూ.2 వేల కోట్లు వార్షిక బడ్జెట్ కేటాయించాలని తీర్మానించారు. అలాగే చేనేత రంగానికి ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఉండాలి ముఖ్యమంత్రికి స్వీయపర్యవేక్షణ ఉండాలని తదితర తీర్మానాలను ఆమెదించారు. వివిధ సంఘాల అధ్యక్షులు వై.కోటేశ్వరరావు, కోట వీరయ్య, మలిపెద్ది అప్పారావు, పాలాటి బాలయోగి, అడికి మల్లిఖార్జునరావు, ఎం.వెంకటేశ్వర్లు, తూతిక అప్పాజి, నక్కిన చినవెంకటరాయుడు, జగ్గారపు శ్రీనివాసరావు, రాయలసీమ ఇన్ చార్జ్ నేతాంజలి సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రతినిధి డాక్టర్ సంజీవ్‌కుమార్, మాజీ ఎమ్మెల్యే చందన రమేష్, రాజమండ్రి జాంపేట కోఆపరేటివ్ బ్యాంకు డైరెక్టర్ బొమ్మన రాజ్‌కుమార్, ఆప్కో డైరెక్టర్ ముప్పన వీర్రాజు, కార్యనిర్వాహక కమిటీ అధ్యక్షుడు శీరం ప్రసాదు, సభ్యులు, నాయకులు మాట్లాడారు. సమావేశం ప్రారంభంలో జ్యోతిప్రజ్వలన చేసి చేనేత నాయకులు స్వర్గీయ ప్రగడ కోటయ్య, స్వర్గీయ బొమ్మన రామచంద్రరావు చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులరి్పంచారు. అతుకులు లేకుండా జాతీయ జెండాను మగ్గంపై నేసిన పశ్చిమగోదావరి జిల్లా ఆచంట వేమవరం గ్రామానికి చెందిన రుద్రాక్ష సత్యన్నారాయణను ఘనంగా సత్కరించారు. సమావేశంలో తోపులాట సమావేశంలో తమ నాయకుడు జిల్లా పద్మశాలీ సంఘం అధ్యక్షుడు పంపన రామకృష్ణకు సరైన ప్రాధాన్యం ఇవ్వలేదని ఆయన వర్గీయులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో సమావేశంలో వాగ్వివాదం చోటు చేసుకుని తోపులాటకు దారితీసింది. ఇరువర్గాల మధ్య మాటల యుద్ధం చెలరేగింది. కొంతసేపు అంతరాయం ఏర్పడి తర్వాత సద్దుమణిగింది. -
బడా వస్త్రవ్యాపారులకే వత్తాసు
అధికారుల తీరు సరికాదు ► చున్నీ వస్త్రం కొనుగోళ్లలో పక్షపాతం ► మ్యాక్స్ సంఘాలకు చెప్పకుండానే నిర్ణయం ► ఒకే వస్త్రవ్యాపారిపై జౌళిశాఖ అమిత ప్రేమ ఏమిటి? ► జిల్లా కేంద్రంలో ఆందోళనకు దిగిన నేతకార్మికులు సిరిసిల్ల : చేనేత, జౌళిశాఖ అధికారులు వస్త్రం కొనుగోళ్లలో బడా వ్యాపారులకే వత్తాసు పలుకుతున్నారని నేతకార్మికులు ఆరోపించారు. ఈమేరకు శుక్రవారం వ్యవసాయ మార్కెట్ యార్డులోని వస్త్రం కొనుగోళ్ల గోదాం వ ద్ద ఆందోళన వ్యక్తం చేశారు. స్కూల్ విద్యార్థులకు యూ నిఫామ్స్ అందించేందుకు రాజీవ్ విద్యామిషన్ (ఆర్వీఎం) ద్వారా నేతకార్మికుల నుంచి 1.14 కోట్ల మీటర్ల వ స్రా్తన్ని చేనేత జౌళిశాఖ అధికారులు కొనుగోలు చేశారని తెలిపారు. ఇందులో బాలికలకు అవసరమైన ఓనీ(చు న్నీ) బట్ట సుమారు 51వేల మీటర్లు తక్కువ పడడంతో మళ్లీ కొనుగోలుకు ఆర్డర్లు ఇచ్చిందన్నారు. కానీ, సంఘాలకు సమాచారం ఇవ్వకుండా ఓ ప్రముఖ వస్త్రవ్యాపారి ఒక్కరికే అవకాశం ఇవ్వడం ఏమిటని మ్యాక్స్ సొసైటీల ప్రతినిధులు ప్రశ్నించారు. ఒక్కో మీటర్ ఓనీ వస్రా్తనికి రూ.31 చెల్లిస్తున్నారని, ఈ లెక్కన 51 వేల మీటర్ల వస్రా్తన్ని రూ.15.81 లక్షలతో కొనుగోలు చేస్తున్నారని అన్నా రు. అధికార పార్టీకి చెందిన కౌన్సిలర్ అయిన ఆ వస్త్రవ్యాపారి వద్దనే ఓనీ బట్టను కొనుగోలు చేయడం సరికాదన్నారు. దీనిపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని ఆసాములు కోరారు. ఈసందర్భంగా గోదాములో వస్త్రం కొనుగోళ్లను అడ్డుకున్నారు. మ్యాక్స్ సొసైటీల ప్రతినిధులు మంచికట్ల భాస్కర్, చిమ్మని ప్రకాశ్, పోలు శంకర్, మూషం రాజయ్య, వెల్దండి శంకర్, గౌడ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ చెప్పాం.. ఎవరూ స్పందించలేదు – వి.అశోక్‌రావు, చేనేత, జౌళిశాఖ ఏడీ ఓనీ వస్త్రం ఉత్పత్తి చేయాలని మ్యాక్స్ సొసైటీల ప్రతినిధులదరికీ చెప్పాం. ఎవరూ స్పందించలేదు. కొన్ని సంఘాల ద్వారా కొనాలని భావించాం. కానీ 51 సంఘాలకు ఈఆర్డర్లు ఇస్తే ఒక్కో సంఘం వెయ్యి మీటర్లు ఉత్పత్తి చేయాల్సి వస్తుంది. అవుతుంది. ఒక్క బీము రెండు వేల మీటర్లు ఉంటుంది. ఎవరికీ సరిగా పని సాధ్యం కాదు. ఇప్పటి వరకు 20వేల మీటర్ల ఓనీ బట్టను కొన్నాం. ఇంకా ఎవరైనా ఇస్తే కొనుగోలు చేస్తాం. ఇందులో ఎలాంటి దురుద్దేశాలు లేవు. -
చేనేత విక్రయాలపై 30 శాతం రాయితీ ఇవ్వాలి
జనతా వస్త్రాల పథకం ప్రారంభించాలి చేనేత కార్మికులకు ఉపాధి కల్పించాలి చేనేత సహకార సంఘాల జిల్లా అధ్యక్షుడు రాము దానవాయిపేట (రాజమహేంద్రవరం) : రాష్ట్ర ప్రభుత్వం చేనేత సహకార సంఘాల వస్త్ర విక్రయాలపై 30 శాతం రాయితీ మంజూరు చేసి చేనేత రంగాన్ని అదుకోవాలని చేనేత సహకార సంఘాల జిల్లా అధ్యక్షుడు సిహెచ్.రాము డిమాండ్ చేశారు. రాజమహేంద్రవరంలోని లాలాచెరువు ఆప్కో భవనంలో సోమవారం నిర్వహించిన సమావేశంలో చేనేత కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించారు. సమావేశానికి అధ్యక్షత వహించిన రాము మాట్లాడుతూ సీఎం చంద్రబాబు నాయుడు జనతా వస్త్రాల పథకాన్ని ప్రారంభించి నేత కార్మికులకు హామీతో కూడిన ఉపాధి కల్పించాలని కోరారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఉపాధి హామీ పథకాన్ని చేనేతలకూ వర్తింపజేయాలని, వర్క్షెడ్లతో కూడిన గృహాలు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. చేనేత సహకార సంఘాల అభివృద్ధికి అడ్డంకిగా ఉన్న సహకార చట్టంలోని 116 (సీ) నిబంధన నుంచి చేనేత సహకార సంఘాలను మినహాయించాలని తీర్మానించారు. సమావేశంలో రాష్ట్ర చేనేత సంఘాల సమాఖ్య చైర్మన్ దొంతంశెట్టి విరూపక్షం, ఆప్కో డైరెక్టర్లు ముప్పన వీర్రాజు, దొంతంశెట్టి సత్యనారాయణ మూర్తి, డీసీసీబీ డైరెక్టర్ పి.లాలయ్య, మోరి చేనేత సహకార సంఘాల అధ్యక్షుడు చింతా వీరభద్రేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. -
అరికట్టకపోతే ఆత్మహత్యలే
యాడికి : పవర్‌లూమ్స్‌ను అరికట్టకపోతే చేనేతలకు ఆత్మహత్యలే శరణ్యమని చేనేత కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పోలా రామాంజనేయులు ఆవేదన చెందారు. చేనేత కార్మికుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ సోమవారం యాడికిలో నిర్వహించిన చేనేతల మహా ధర్నాలో ఆయన పాల్గొన్నారు. పవర్‌లూమ్స్ రాకతో చేనేత వృత్తి పూర్తిగా అంతరించిపోతోందన్నారు. జిల్లాలో ఎన్ఫోర్స్మెంట్ కార్యాలయాన్ని ఏర్పాటు చేసి, చేనేత రిజర్వేషన్ చట్టాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. శిల్క్‌హౌస్‌ల పేరుతో పవర్‌లూమ్స్ చీరలను విక్రయిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని, చేనేతల రుణమాఫీని అమలు చేయాలని, కొత్త రుణాలు మంజూరు చేయాలని కోరారు. అనంతరం తహశీల్దార్ కుమారస్వామికి వినతిపత్రం ఇచ్చారు. చేనేత కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి మామిళ్ల నారాయణస్వామి, మండల అధ్యక్షుడు మోహన్, అభివృద్ధి వేదిక కన్వీనర్ కులశేఖర్‌నాయుడు, సీపీఎం పట్టణ కార్యదర్శి బషీర్ అహమ్మద్ తదితరులు పాల్గొన్నారు. -
చేనేతకు ముద్ర రుణాలు
–తెలంగాణ చేనేత, జౌళీశాఖ డిప్యూటీ డైరెక్టర్ రాంగోపాల్‌రావు భూదాన్‌పోచంపల్లి : అర్హత కలిగిన చేనేత కార్మికులందరికీ ముద్ర పథకం కింద రుణాలు ఇప్పించేందుకు కృషి చేస్తున్నామని, ఇందుకోసం ఈ నెల 29న హైదరాబాద్‌లోని బూర్గుల రామకృష్ణారావు చేనేత కాంప్లెక్స్‌లో ముద్ర లోన్స్ మేళా ఏర్పాటు చేశామని తెలంగాణ రాష్ట్ర చేనేత, జౌళిశాఖ డిప్యూటీ డైరెక్టర్ కె. రాంగోపాల్‌రావు తెలిపారు. గురువారం మండల కేంద్రంలో పోచంపల్లి టై అండ్ డై సిల్క్ చీరెల ఉత్పత్తిదారుల సంఘం ఆధ్వర్యంలో కేంద్ర, ప్రభుత్వాలు అమలు చేస్తున్న చేనేత పథకాలపై అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ముద్ర పథకంలో భాగంగా ఎలాంటి ష్యూరిటీ అవసరం లేకుండా శిశు విభాగంలో రూ.50వేలు, కిషోర్ కింద రూ. 5లక్షలు, తరుణ్ కింద రూ. 20లక్షల వరకు రుణాలు ఇప్పిస్తుందని తెలిపారు. నల్లగొండ జిల్లాలో 3 వేల మందికి రుణాలు ఇప్పించాలని లక్ష్యంగా నిర్ణయించారని పేర్కొన్నారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వం చేనేత కార్మికుల జీవన ప్రమాణాలను పెంచడానికి త్వరలో టెక్స్టైల్ పాలసీని ప్రకటించనుందని వెల్లడించారు. ఇండియా హ్యాండ్లూమ్ బ్రాండ్‌లో స్థానం సంపాదించాలి : హిమజకుమార్ ఇండియా హ్యాండ్లూమ్ బ్రాండ్‌లో స్థానం సంపాదించుకుంటే ప్రభుత్వ పరంగా, మార్కెటింగ్ పరంగా ఎన్నో ప్రయోజనాలను పొందవచ్చని, చేనేత కార్మికులు ఆ దిశగా కృషి చేయాలని వీవర్స్ సర్వీస్‌సెంటర్ అసిస్టెంట్ డైరక్టర్ వి. హిమజకుమార్ పేర్కొన్నారు. దేశంలోనే ప్రప్రథమంగా పోచంపల్లి హ్యాండ్లూమ్ పార్క్‌కు ఈ అవకాశం లభించిందన్నారు. జాతీయ, సంత్‌కబీర్ అవార్డులతో పాటు ఢిల్లీ హట్, జనపత్మేళా, క్రాప్ట్మేళా, ఇండియన్ హ్యాండ్లూమ్ బ్రాండ్ల ద్వారా కేంద్ర ప్రభుత్వం చేనేతను ప్రొత్సహిస్తుందని తెలిపారు. ప్యారిస్‌లో నిర్వహించే హ్యాండ్లూమ్ మేళాకు జాతీయ అవార్డులు పొందిన పుట్టపాకకు చెందిన పిల్లలమర్రి రాధాకృష్ణమూర్తి, కొలను బుచ్చిరాములతో పాటు పోచంపల్లి, కొయ్యలగూడెం సంఘాల ప్రతిని«ధులను పంపిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. కార్మికుల వృత్తి నైపుణ్యాలను మెర్గు పరిచేందుకు వీవింగ్, డైయింగ్‌లో శిక్షణ శిబిరాలను ఏర్పాటు చేస్తామని అన్నారు. టై అండ్ డై అసోసియేషన్ అ«ధ్యక్షుడు తడక రమేశ్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో వీవర్స్ సర్వీస్‌సెంటర్ టెక్నికల్ సూపరింటెండెంట్ టి. సత్యనారాయణరెడ్డి, క్వాలిటీ అస్సెస్మెంట్ అధికారి శేషగిరిరావు, కొంగరి భాస్కర్, తడక వెంకటేశం, సహకార సంఘం అధ్యక్షుడు భారత వాసుదేవ్, హ్యాండ్లూమ్ పార్క్ చైర్మన్ కడవేరు దేవేందర్, అర్భన్‌బ్యాంకు చైర్మన్ చిట్టిపోలు శ్రీనివాస్, అసోషియేషన్ ఉపాధ్యక్షుడు సంగెం చంద్రయ్య, కార్యదర్శి భారత లవకుమార్, సుంకి భాస్కర్, గుండేటి శ్రవన్, బోగ విష్ణు, గుండు శ్రీరాములు, వనం శంకర్, వినోద్, కుడికాల నర్సింహ, పెండెం రఘు తదితరులు పాల్గొన్నారు. -
చేనేత, వస్త్ర పాలసీలు సిద్ధం
సాక్షి, హైదరాబాద్: చేనేత, వస్త్ర పరిశ్రమలకు ఊతమిచ్చే లక్ష్యంతో రూపొందించిన ప్రత్యేక పాలసీల ఆవిష్కరణకు రంగం సిద్ధమైంది. ఈ పాలసీలను రాష్ట్ర పరిశ్రమలు, టెక్స్‌టైల్‌శాఖ మంత్రి కె.తారక రామారావు శనివారం విడుదల చేయనున్నారు. చేనేత, వస్త్ర, రెడీమేడ్ దుస్తుల తయారీ పరిశ్రమలకు ఇవ్వాల్సిన ప్రోత్సాహకాలు, చేనేత పరిశ్రమల స్థాపనలో సింగిల్ విండో విధానంలో అనుమతులు తదితర అంశాలను ఈ పాలసీల్లో చేర్చారు. టీఎస్ ఐపాస్‌లో పేర్కొన్న రాయితీలే కాకుండా అదనపు రాయితీలు, ప్రోత్సాహకాలనూ నూతన పాలసీల్లో చేర్చినట్లు తెలిసింది. దారం తయారీ మొదలుకొని వస్త్రాల ఉత్పత్తి, మార్కెటింగ్, పరిశోధన, శిక్షణ తదితర సౌకర్యాలన్నీ ఒకేచోట అందుబాటులో ఉండేలా వరంగల్ జిల్లాలో ‘కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కు’ ఏర్పాటును నూతన పాలసీల్లో భాగంగా చేర్చినట్లు సమాచారం. చేనేత రంగంలో పరిశోధన, నైపుణ్యానికి పెద్దపీట వేస్తూ అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో పరిశోధన, శిక్షణ సంస్థలను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. చేనేత, టెక్స్టైల్ రంగాల్లో పెట్టుబడులను ఆకర్షించేందుకు టీఎస్ ఐపాస్‌కు అనుబంధంగా ప్రత్యేక డెస్క్ ఏర్పాటును ప్రతిపాదించారు. వీటితోపాటు అంతర్జాతీయ ఎగుమతులకు అనువైన రీతిలో వస్త్ర ఉత్పత్తుల నాణ్యత కోసం ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌ను నూతన పాలసీల్లో ప్రతిపాదించినట్లు సమాచారం. ఇరు రంగాలకూ సమ ప్రాధాన్యత... వ్యవసాయం తర్వాత ఉపాధి, ఉత్పత్తి, ఆదాయపరంగా చేనేత, వస్త్ర పరిశ్రమలకు రాష్ట్రంలో అత్యంత ప్రాధాన్యత వుంది. రాష్ట్రంలో ఏటా 60 లక్షల బేళ్ల పత్తి దిగుబడి వస్తుండగా ఇందులో కేవలం 10 శాతాన్ని మాత్రమే రాష్ట్రంలో వినియోగిస్తున్నారు. పత్తి లభ్యతకు అనుగుణంగా కాటన్ ఆధారిత అనుబంధ పరిశ్రమలు రాష్ట్రంలో లేకపోవడం చేనేత రంగం అభివృద్ధికి అవరోధంగా మారింది. రాష్ట్రంలో చేనేత రంగానికి ఆదరణ తగ్గడంతోపాటు ఇప్పటికే ఏర్పాటైన చేనేత పార్కులు ఆశించిన ఫలితాన్ని ఇవ్వడం లేదు. ఈ నేపథ్యంలో చేనేత రంగాన్ని ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేనేత పాలసీ రూపకల్పనపై దృష్టి సారించింది. ఇందులో భాగంగా మహారాష్ట్ర, గుజరాత్, తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్‌లలో చేనేత పరిశ్రమల స్థితిగతులపై అధికారులు నివేదిక రూపొందించి దాని ఆధారంగా ‘తెలంగాణ చేనేత, వస్త్ర ఉత్పత్తుల పాలసీ 2015-2020’ (టీ టాప్)ను సిద్ధం చేశారు. ముసాయిదా ప్రతిని గతేడాది డిసెంబర్లో సీఎం కేసీఆర్ పరిశీలనకు సమర్పించగా ఆమోదానికి నోచుకోలేదు. దీంతో అధికారులు చేనేత, టెక్స్టైల్ రంగాలకు సమ ప్రాధాన్యత ఇస్తూ వేర్వేరు పాలసీలను రూపొందించారు. పాలసీల విధి విధానాలపై చేనేత సంఘాల ప్రతినిధులతో జూలైలో మంత్రి కేటీఆర్ ప్రత్యేక సమావేశం నిర్వహించారు. క్షేత్రస్థాయిలో గద్వాల, పోచంపల్లి తదితర ప్రాంతాల నేత కార్మికుల నుంచి ప్రతిపాదనలు స్వీకరించారు. -
చేనేతకు చేయూతనందించాలి
కోదాడఅర్బన్: చేనేత కళాకారుల సంక్షేమం కోసం ప్రతి ఒక్కరూ చేనేత వస్త్రాలను కొనుగోలు చేసి వారికి చేయూతనందించాలని మున్సిపల్ చైర్పర్సన్ వంటిపులి అనిత కోరారు. హైదరాబాద్‌కు చెందిన కళాభారతి చేనేత,హస్త కళల సొసైటీ ఆధ్వర్యంలో పట్టణంలోని టీటీడీ కల్యాణమండపంలో ఏర్పాటు చేసిన చేనేత వస్త్ర, హస్తకళల ప్రదర్శనను ఆమె బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ దేశవ్యాప్తంగా పెరుగల చేనేత, హస్తకళల వస్తువులు ఒకేచోట ప్రదర్శించడం హర్షణీయమన్నారు. ఈనెల 21వ తేదీ వరకు నిర్వహించే ఈ ప్రదర్శనలో పలు చేనేత వస్త్రాలతో పాటు హస్తకళల వస్తువులను అమ్మకానికి ఉంచినట్లు నిర్వాహకులు జెల్లా సత్యనారాయణ తెలిపారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ తెప్పనిశ్రీనివాస్, కౌన్సిలర్లు కెఎల్ఎన్.ప్రసాద్, పలువురు నాయకులు పాల్గొన్నారు. -
చేనేతకు చేయూత జాతీయ అవసరం
సందర్భం స్వాతంత్య్ర పోరాటంలో ‘స్వదేశీ’ ఒక ప్రధాన సాధనంగా ఏ విధంగా మారిందో, నేడు పేదరికంపై పోరాటానికి చేనేత రంగం సైతం ఒక సాధనం కాగలదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విశ్వాసం వ్యక్తం చేయడం చెప్పుకోదగినది. తల్లి ఇచ్చే ప్రేమానుబంధాలను ఖాదీ, చేనేత ఉత్పత్తులు కూడా కలిగిస్తా యని చెప్పారు. చేనేత ఉత్పత్తులను ప్రోత్సహించడం కోసం ప్రతి సంవత్సరం ఆగస్టు 7న ‘జాతీయ చేనేత దినోత్సవం’గా పాటించాలని పిలుపునిచ్చారు. గత సంవత్సరం చెన్నైలో జరి పిన మొదటి చేనేత దినోత్సవం సందర్భంగా ఆయన ఈ మాటలు అన్నారు. ప్రపంచంలో పర్యావరణం, సంపూర్ణ ఆరోగ్య సంరక్షణల గురించిన ఆలోచనలు ప్రాధాన్యం సంతరించుకుంటున్న ప్రస్తుత తరుణంలో పర్యావరణ అనుకూ లమైన మన చేనేత ఉత్పత్తుల గురించి ప్రచారం చేయవలసిన అవసరం ఉన్నదని కూడా మోదీ సూచించారు. వ్యవసాయం తరువాత దేశంలో ఎక్కువ మందికి ఉపాధి కల్పిస్తున్న పరిశ్రమ -చేనేత. దీనికి జీవం పోయడం ద్వారానే దేశ ఆర్థికాభివృద్ధి, సూపర్ పవర్‌గా ఎదుగుదల సాధ్యమవుతాయి. ఇదంతా గ్రామాలలోనే ఉండడంతో మన గ్రామీణ ఆర్థిక వికాసానికి చేనేత పట్టుగొమ్మ అని చెప్పవచ్చు. అయితే దశాబ్దాలుగా ఈ రంగం తీవ్ర నిర్లక్ష్యానికి గుర యింది. దానితో పెద్ద సంఖ్యలో చేనేత కార్మికులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. గత 15 ఏళ్లుగా చేనేత కార్మికుల సంఖ్య తగ్గుతున్న సంగతి ఆందోళన కలిగిస్తుంది. 1995 నాటి గణాంకాల ప్రకారం దేశంలో 65 లక్షల మగ్గాలు ఉండగా 2009-10 నాటికి 43.32 లక్షలకు తగ్గిపోయాయి. కోటి మందికి పైగా ఈ వృత్తిని నమ్ముకుని ఉన్నారు. అనుబంధంగా కోట్ల మంది ఆధారపడి ఉన్నారు. చేనేత వారిలో 45.18 శాతం మంది ఓబీ సీలు. ఎస్సీలు 10.13 శాతం, ఎస్టీలు 18.12 శాతం, ఇతరులు 26.57 శాతం ఉన్నారు. ఆ వర్గాలలో సుమారు 78 శాతం మహిళలకు ఇదే ఆధారం. వారిలో 87 శాతం మంది గ్రామీ ణులు. వీరందరిదీ దుర్భర జీవన స్థితి. 54 శాతం మంది కచ్చా ఇళ్ళలో (గుడిసెలు, రేకుల షెడ్లు) నివసిస్తున్నారు. 31 శాతం మం దికి పాక్షిక పక్కా గృహాలు ఉన్నాయి. 15 శాతం మంది మాత్రమే పక్కా గృహాలలో ఉంటు న్నారు. 9.7 శాతం మందికి మాత్రమే అంత్యోదయ అన్న యోజన రేషన్ కార్డులు ఉన్నాయి. 36.9 శాతం మందికి బీపీఎల్ రేషన్ కార్డులు ఉన్నాయి. 34.5 శాతం మందికి ఏపీఎల్ రేషన్ కార్డులు ఉండగా, 18.9 శాతం మందికి అసలు రేషన్ కార్డులు లేవు. 29 శాతం చదువుకోనివారే. 12.7 శాతం మంది ప్రాథమిక విద్యను మధ్యలో ఆపివేయగా, 18.2 శాతం మంది ప్రాథమిక విద్యను పూర్తి చేశారు. 22.9 శాతం మంది మాధ్యమిక పాఠశాల విద్యనూ పూర్తిచేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో గ్రామీణ ప్రాంతాలలో వీరి సగటు ఆదాయం సంవత్సరానికి రూ.29,314గా ఉండగా, పట్టణ ప్రాంతాలలో రూ. 31 వేలు ఉంది. జాతీయస్థాయిలో గ్రామీణ ప్రాంతాల్లో రూ. 38,260, పట్టణ ప్రాంతాల్లో రూ. 33,038 సగటున ఉంది. కేవలం 14.4 శాతం మందికి మాత్రమే బ్యాంక్‌ల నుండి రుణాలు అందుతుండగా, 44.6 శాంతం మందికి మాస్టర్ వీవర్స్ నుండి, 13,4 శాతం మందికి వడ్డీ వ్యాపారుల నుండి రుణం లభిస్తున్నది. చేనేత పనివారి సంఖ్య తగ్గుతున్నా ఉత్పత్తి మాత్రం పెరుగుతూనే ఉంది. దేశంలో మొత్తం ఉత్పత్తి అవుతున్న వస్త్రాలలో 14 శాతం, అంటే 6,900 మిలియన్ల చదరపు మీటర్ల వస్త్రాలను వీరే ఉత్పత్తి చేస్తున్నారు. మొత్తం జీడీపీలో వీరి వాటా 4 శాతంగా ఉంది. ఎగుమతులలో సహితం వీరి భాగస్వామ్యం గణనీయంగా ఉంది. కానీ ఈ రంగంలో వేతనాలు తక్కువగా ఉండడంతో చేనేత కార్మికులు ఇతర రంగాలకు వలస వెళ్లడం పెరుగుతున్నది. గృహ నిర్మాణం, దోభీలు, క్షురకులు వంటి ఇతర అసంఘటిత రంగా లలోని కార్మికులు చేనేత కార్మికుల కన్నా ఎక్కువగా వేతనాలు పొందుతున్నారు. వారికి రోజుకు కనీసం రూ. 250 నుండి రూ. 500 వరకు వేతనం లభిస్తున్నది. చేనేత వారికి మాత్రం రూ. 80 నుండి 100 మించి లభించడం లేదు. ఇంతటి కీలక ప్రాధాన్యం గల రంగానికి ప్రణాళికా పరంగా కేటాయింపులు కూడా అంతంత మాత్రమే. ఈ రంగం ఎదుర్కొంటున్న సమస్యల పట్ల అవగాహన గల నరేంద్ర మోదీ ప్రభుత్వం చేనేతను పున రుజ్జీవింప చేయడం ద్వారా గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయాలి. ఇందుకోసం విసృ్తతమైన కృషి జరగాలి. విధానపరమైన నిర్ణయాలను అమలు పరచడంతో పాటు, తగు బడ్జెట్ కేటాయింపులు జరపాలి. కోటి మంది నమ్ముకున్న ఈ రంగాన్ని నిర్లక్ష్యం చేయడం ఆర్థిక వ్యవస్థకు పెద్ద నష్టమే. ఇది గమనించాలి. ఆగస్టు 7 : జాతీయ చేనేత దినోత్సవం (వ్యాసకర్త : టి.ఇంద్రసేనారెడ్డి గ్రామ వికాస భారతి ఫౌండేషన్ వ్యవస్థాపకులు) indrasena.reddy11@gmail.com -
సంప్రదాయ కళల్లో సమస్యల 'ప్రదర్శన'
నాగాలాండ్ సంప్రదాయ కళలు అక్కడి ఫిల్మ్ ఫెస్టివల్లో భాగమయ్యాయి. స్థానిక సమస్యల కథాంశాలుగా మారాయి. నాగాలాండ్ మహిళల రోజువారీ కార్యకలాపాల్లో భాగంగా ఉండే నూలు వడకడం, నేత, నృత్యం, అల్లికలు, కాన్వాస్, పెయింటింగ్స్, ఫోక్ డ్యాన్స్ వంటి సంప్రదాయ కళలను కాన్వాస్‌లు, షాల్స్ రూపంలో రూపొందించిన ఓ కళాకారిణి ఫిల్మ్ ఫెస్టివల్ సందర్భంలో 'హీలింగ్' పేరున ప్రదర్శన ఏర్పాటుచేసింది. సమస్యలు ప్రధానాంశంగా ఏర్పాటు చేసిన ఆ ప్రదర్శన చూపరులను అమితంగా ఆకట్టుకుంటోంది. నాగాలాండ్‌కు చెందిన విద్యావంతురాలు, కళాకారిణి ఐరిస్ ఓడ్యూ తన కళకు అక్కడి సమస్యలను జోడించింది. గృహహింస, లైంగిక వేధింపుల వంటి సమస్యల పరిష్కారంతో పాటు... వారి గౌరవానికి వన్నె తెచ్చేలా శాలువాలు, పెయింటింగ్స్ గా అనేక కళాత్మక డిజైన్లను రూపొందించి ప్రదర్శన ఏర్పాటు చేసింది. నాగాలాండ్ లోని వివిధ సామాజిక వర్గాల ద్వారా తయారైన 9 ఎక్రిలిక్ పెయింటింగ్స్, ఉలెన్ సంప్రదాయ శాలువాలను ఓడ్యూ 12వ ఆసియా ఉమెన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ సందర్భంగా ప్రదర్శించారు. మహిళలే కాదు.. బాధిత పురుషులు, బాలల సమస్యలను కూడ తన కళల్లో పొందుపరిచారు. ప్రపంచయుద్ధ సమయంలో జర్మన్ సైనిక యూనిఫారాల కోసం మొదటిసారి ఫ్యాబ్రిక్స్ వాడకం మొదలు పెట్టారని, నాగాలాండ్ బర్మా సరిహద్దు ప్రాంతంలో నేటికీ అదే సంప్రదాయం కొనసాగుతోందని, అత్యధిక సమయం పట్టడంతో పాటు, కఠినంగా కూడా ఉండే నేత కళను గ్రామాల్లోని మహిళలు అందమైన శాలువాలుగా వారి కోసం నేస్తూనే ఉన్నారని ఓడ్యూ చెబుతున్నారు. తన కాన్వాస్ కోసం శాలువాలను నేసే విధానం చూస్తే అక్కడి మహిళల కష్టం ప్రత్యక్షంగా తెలిసిందంటున్నారు. ఈ ప్రదర్శనలు గ్రామీణ మహిళలకు మెరుగైన జీవితాన్ని అందించగలవని, సమస్యల పరిష్కారానికి సహకరిస్తాయని ఓడ్యూ ఆశాభావం వ్యక్తం చేశారు. అదే ఆలోచనతోనే హీలింగ్ పేరున తాను ప్రదర్శన ఏర్పాటు చేసినట్లు ఓడ్యూ వెల్లడించారు. -
చేనేతకు ‘చంద్ర’గ్రహణం
మాఫీకాని రుణాలు రూ.20 కోట్లు ఆరు నెలలుగా అందని సిల్క్ సబ్సిడీ కూలి పనులకు వెళ్తున్న నేతన్నలు అధికారంలోకి వచ్చాక అన్ని వర్గాలకూ చుక్కలు చూపిస్తున్న చంద్రబాబు.. ఇప్పుడు నేతన్నలనూ వదిలిపెట్ట లేదు. చేనేత రంగానికి కనీస స్థాయిలో ప్రోత్సాహకాలు ఇవ్వడం లేదు. పదవిలోకి వచ్చి ఏదాదిన్నర కాలం పూర్తయినా చేనేత రుణమాఫీ పూర్తి స్థాయిలో అమలు కాలేదు. బకాయిలు పేరుకుపోయి.. దిక్కుతోచని స్థితిలో నేతన్నలు ప్రత్యామ్నామార్గాలను ఎంచుకుంటున్నారు. మదనపల్లె సిటీ: ఇది ఒక వెంకటరమణ, సుబ్రమణ్యంకే జిల్లాలోని చేనేత కార్మికుల పరిస్థితి. రుణమాఫీ అవుతుందని ఆశలు పెట్టుకున్న నేతన్నల్లో నిరాశే మిగిలింది. చేనేత రుణమాఫీ ఇదిగో ఇస్తాం.. అదిగో ఇస్తామంటూ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటనలకే పరిమితమైంది. బ్యాంకుల్లో కొత్త రుణాలు అందక నేతన్నలు సతమతమవుతున్నారు. కుటుంబ పోషణ కోసం వారు కుల వృత్తిని వదిలి కూలికి పోవాల్సిన దుస్థితి ఏర్పడింది. జిల్లాలోదాదాపు 42 వేల మంది చేనేత కార్మికులు ఉన్నారు. మదనపల్లె(నీరుగట్టువారిపల్లె), కలకడ, కలికిరి, సత్యవేడు,రొంపిచెర్ల, నగిరి, పుత్తూరు, వరదయ్యపాళ్యం, బి.కొత్తకోట, కురబలకోట, శ్రీకాళహస్తి, తంబళ్లపల్లె, నిమ్మనపల్లెలలో అధికంగా చేనేతలు ఉన్నారు. ఓ వైపు ప్రభుత్వం ప్రోత్సాహం లేకపోవడం, మరో వైపు చేనేత వస్త్రాలకు రోజు రోజుకు ఆదరణ తగ్గడంతో మగ్గాలు మూలపడుతున్నాయి. కుల వృత్తే ఆధారంగా జీవించిన నేతన్నలు ప్రస్తుతం రోడ్డున పడ్డారు. చేనేతలకు సంబంధించిన రుణమాఫీపై స్పష్టత రాకపోవడంతో జిల్లాలో దాదాపు రూ.20 కోట్లు రుణాలు మాఫీకి నోచుకోలేదు. జీవో ఎప్పుడు వస్తుందా? రుణాలు ఎప్పుడు మాఫీ అవుతాయా? అని చేనేతలు ఎదురు చూస్తున్నారు. కొత్త రుణాల కోసం బ్యాంకర్లు ఆశ్రయిస్తే పాత అప్పులు కడితే కొత్త అప్పులు ఇస్తామని చెబుతున్నారు. చేనేతలకు సంబంధించి సిల్క్‌పై ప్రభుత్వం అందిస్తున్న సబ్బిడీ ఆరు నెలలుగా అందడం లేదు. ఒకొక్కరికి నెలకు రూ.600 ప్రకారం ఆరు నెలలగా ఇవ్వాల్సి ఉంది. నిలిచిపోయిన నగదు రహిత వైద్యం.. అతి తక్కువ ప్రీమియంతో చేనేత కార్మికులకు అందుతున్న నగదు రహిత వైద్యం (క్యాష్‌లెస్) ఈ ఏడాది ప్రారంభం నుంచి నిలిచిపోయింది. 2014 డిసెంబర్ వరకు చేనేత కార్మికులకు ఏడాదికి రూ.100, ప్రభుత్వం రూ.370 కడితే ఒకే కుటుంబంలో 80 సంవత్సరాల లోపు వయసున్న నలుగురు వ్యక్తులకు ఐసీఐసీఐ లంబార్డ్ బీమా కంపెనీ క్యాష్‌లెస్ వైద్యాన్ని అందించేది. అవుట్ పేషంట్లకు రూ.15 వేలు, ఇన్ పేషంట్లకు రూ.7500 సంబంధిత బీమా కంపెనీ ఆయా ఆస్పత్రులకు చెల్లించేది. అయితే ఈ ఏడాది ప్రారంభం నుంచి ఈ వైద్యం ఆగిపోయింది. దీని స్థానంలో రాష్ట్ర స్వస్థ బీమా యోజన ద్వారా రూ.35 వేల వరకు చేనేతలకు వైద్య ఖర్చును అందిస్తామని ప్రభుత్వం జారీ చేసిన ప్రకటన నేటికి నెరవేరలేదు. -
పోదాం పద.. పోచంపల్లికి
► చేనేత కళా జగతికి పర్యాటక శోభ కల్పించేందుకు సర్కారు నిర్ణయం ► ప్రపంచవ్యాప్తంగా టూరిస్టులను ఆకట్టుకొనేలా బృహత్తర ప్రణాళిక ► కేంద్రం నుంచి భారీగా నిధులు పొందేందుకు యత్నాలు ► ఆన్లైన్లో నేత వస్త్రాల వ్యాపారం చేసేలా ప్రత్యేక ఏర్పాట్లు ► అంతర్జాతీయ డిమాండ్ ఉన్న డిజైన్లపై నేత కార్మికులకు శిక్షణ ► వచ్చే నెల ఐదో తేదీన కన్సల్టెంట్లతో కీలక భేటీ చూడచక్కని చేనేత పనితనంతో అంతర్జాతీయంగా ప్రసిద్ధి చెందిన పోచంపల్లికి మరింత ఖ్యాతి తెచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళిక సిద్ధం చేస్తోంది. ప్రపంచ ప్రఖ్యాత ‘ఇక్కత్’ డిజైన్ వస్త్రాలతో గుర్తింపు తెచ్చుకున్న పోచంపల్లి ప్రాంతాన్ని.. గ్రామీణ పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయనుంది. జాతీయ, అంతర్జాతీయ పర్యాటకులను ఆకట్టుకునేలా ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేయటం ద్వారా... అక్కడి చేనేత వస్త్రాలకు డిమాం డ్ పెంచడం, నూతన డిజైన్లపై ఇక్కడి కార్మికులకు శిక్షణ ఇప్పించడం, తద్వారా నేత వస్త్రాల మార్కెటింగ్‌ను పెంచడంపై ప్రధానంగా దృష్టి సారించింది. ఇందుకోసం కేంద్రం నుంచి రూరల్ టూరిజం ఖాతాలో నిధులు పొందేందుకు ప్రయత్నాలు ప్రారంభించిం ది. దీనికోసం ఏప్రిల్ 5న కన్సల్టెంట్లతో కీలక భేటీ నిర్వహిస్తోంది. - సాక్షి, హైదరాబాద్ ఏం చేస్తారు..? పోచంపల్లి నేత పనిలోని నైపుణ్యాన్ని కళ్లకు కట్టే ప్రదర్శన కేంద్రాలు, ‘ఇక్కత్’ డిజైన్‌పై డాక్యుమెంటరీలు, ప్రత్యేక ప్రదర్శనలను ఏర్పాటు చేస్తారు. తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించే ఏర్పాట్లను, తెలంగాణ వంటకాలతో కూడిన భోజనశాలలను సిద్ధం చేస్తారు. పండుగల సమయంలో ఇక్కడ ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహిస్తారు. పల్లె సౌందర్యాన్ని ప్రతిబింబించేలా ప్రత్యేక చర్యలు చేపడతారు. ఈ ప్రాంతంలో తాటి వనాలు ఎక్కువగా ఉన్నందున నాణ్యమైన సంప్రదాయ పానీయం ‘నీరా’కు ప్రాచుర్యం కల్పించనున్నారు. చుట్టూ నెలకొన్న గుట్టలను ఈ ప్రాజెక్టులో భాగం చేసి వాటి వద్ద సాహసక్రీడలకు అవకాశం కల్పిస్తారు. సమీపంలోని ఆలయాలను తెలంగాణ సంప్రదాయ కేంద్రాలుగా మారుస్తారు. మొత్తంగా ఈ ప్రాంతం సందర్శనకు వచ్చేవారు పల్లె సౌందర్యాన్ని ఆస్వాదించటంతోపాటు, ‘ఇక్కత్’ వస్త్రాలు ఎలా రూపొందుతాయో తెలుసుకోగలుగుతారు. అంతేగాకుండా ఇక్కడి వస్త్రాలను ఆన్‌లైన్‌లోనూ కొనుగోలు చేసేందుకు ఏర్పాట్లు చేయనున్నారు. ఇక ప్రపంచ మార్కెట్లో డిమాండ్ ఉన్న డిజైన్లలో వస్త్రాలు రూపొందించేందుకు వీలుగా ఇక్కడి చేనేత పనివారికి ప్రత్యేక శిక్షణ కోసం కేంద్రాలను ఏర్పాటు చేస్తారు. ప్రత్యేకతలెన్నో.. పోచంపల్లి అనగానే వెంటనే గుర్చొచ్చేది ‘ఇక్కత్’ డిజైన్‌లోని నాణ్యమైన నేత వస్త్రాలు. ఇండోనేసియా, జపాన్లలో గుర్తింపు పొందిన ‘ఇక్కత్’కు మన దేశంలో పేరు తెచ్చింది పోచంపల్లే. పోచంపల్లి పరిధిలో రెండు క్లస్టర్లుగా ఉన్న దాదాపు 80 గ్రామాలకు చెందిన పది వేల కుటుంబాలు నేత పనిపైనే ఆధారపడ్డాయి. ఈ ప్రాంతం కేవలం నేత పనికే కాకుండా ప్రకృతి రమణీయతకూ గుర్తింపు పొందింది. అంతేకాదు భూదాన్ ఉద్యమంతో దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన చారిత్రక ప్రాంతం కూడా. వీటన్నింటి నేపథ్యంలో పోచంపల్లి ప్రాంతాన్ని తెలంగాణ సంస్కృతికి చిరునామాగా చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. తొలి గ్రామీణ పర్యాటక కేంద్రం కొత్తగా ఏర్పడ్డ తెలంగాణలో ప్రత్యేకంగా అభివృద్ధి చేసిన పర్యాటక ప్రదేశాలు పెద్దగా లేవు. ఇటీవలి కేంద్ర బడ్జెట్లోనూ ఈ విషయంలో రాష్ట్రానికి ప్రాధాన్యం దక్కలేదు. ఒక్క హైదరాబాద్‌లోని కుతుబ్‌షాహీ టూంబ్స్ అభివృద్ధి ప్రాజెక్టు మాత్రమే దక్కింది. అయితే దేశంలో గ్రామీణ పర్యాటకానికి ప్రాధాన్యమివ్వాలని ప్రధాని మోదీ భావిస్తున్న నేపథ్యంలో... ఈ కేటగిరీలో పోచంపల్లికి నిధులు పొందాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. వచ్చే నెలలో దీనికి సంబంధించిన ప్రతిపాదన సిద్ధం చేసి పంపనున్నారు.