
చేనేతకు చేయూతనందించాలి
కోదాడఅర్బన్: చేనేత కళాకారుల సంక్షేమం కోసం ప్రతి ఒక్కరూ చేనేత వస్త్రాలను కొనుగోలు చేసి వారికి చేయూతనందించాలని మున్సిపల్ చైర్‌పర్సన్ వంటిపులి అనిత కోరారు. హైదరాబాద్‌కు చెందిన కళాభారతి చేనేత,హస్త కళల సొసైటీ ఆధ్వర్యంలో పట్టణంలోని టీటీడీ కల్యాణమండపంలో ఏర్పాటు చేసిన చేనేత వస్త్ర, హస్తకళల ప్రదర్శనను ఆమె బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ దేశవ్యాప్తంగా పెరుగల చేనేత, హస్తకళల వస్తువులు ఒకేచోట ప్రదర్శించడం హర్షణీయమన్నారు. ఈనెల 21వ తేదీ వరకు నిర్వహించే ఈ ప్రదర్శనలో పలు చేనేత వస్త్రాలతో పాటు హస్తకళల వస్తువులను అమ్మకానికి ఉంచినట్లు నిర్వాహకులు జెల్లా సత్యనారాయణ తెలిపారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ తెప్పనిశ్రీనివాస్, కౌన్సిలర్లు కెఎల్‌ఎన్.ప్రసాద్, పలువురు నాయకులు పాల్గొన్నారు.