వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో కీలకమైన పోలింగ్ తేదీ సమీపిస్తున్న వేళ డెమొక్రాట్లకు చేదు కబురు. ఆ పార్టీకి మద్దతిస్తున్న ఇండియన్ అమెరికన్ ఓటర్ల సంఖ్యలో గత ఎన్నికలతో పోలిస్తే ఏకంగా ఏడు శాతం తగ్గుదల నమోదైంది! భారత మూలాలున్న కమలా హారిస్‌కు మద్దతిస్తున్న వారి సంఖ్య 61 శాతానికి తగ్గింది. అంతేగాక తాము డెమొక్రాట్లమని చెప్పుకున్న ఇండియన్ అమెరికన్ల సంఖ్య కూడా 56 నుంచి 47 శాతానికి తగ్గింది. సోమవారం వెలువడ్డ ‘ఇండియన్ అమెరికన్ ఆటిట్యూడ్స్’ సర్వేలో ఈ మేరకు తేలింది. ట్రంప్‌కు ఓటేస్తామని వారిలో 32 శాతం మంది పేర్కొన్నారు. 2020లో డెమొక్రాట్ల అభ్యర్థి జో బైడెన్‌కు 68 శాతం మద్దతు దక్కగా ట్రంప్‌కు 22 శాతం మాత్రమే జైకొట్టారు!
→ ఇండియన్ అమెరికన్ మహిళా ఓటర్లలో 67 శాతం మంది హారిస్‌కు జైకొట్టారు. ట్రంప్‌కు మద్దతిచ్చిన వారు కేవలం 22 శాతమే.
→ 40 ఏళ్ల పైచిలుకు వయసు వారిలో ఏకంగా 70 శాతం మహిళలు, 60 శాతం పురుషులు హారిస్‌కు జైకొట్టారు.
→ 40 ఏళ్ల లోపువారిలో మాత్రం 60 శాతం మహిళలే హారిస్‌కు మద్దతిచ్చారు.
→ ఇండియన్ అమెరికన్ పురుషుల్లో 53 శాతం హారిస్‌కు, 39 శాతం మంది ట్రంప్‌కు ఓటేస్తామని చెప్పారు.
→ 40 ఏళ్లలోపు పురుషుల్లో మాత్రం ట్రంప్‌దే పైచేయి కావడం విశేషం. ఆయనకు 48 శాతం, హారిస్‌కు 44 శాతం జైకొట్టారు.
→ యువ ఇండియన్ అమెరికన్లలో మాత్రం ట్రంప్‌కు మద్దతిస్తున్న వారి సంఖ్య భారీగా పెరిగినట్టు సర్వే తేల్చింది.
→ అమెరికాలో 52 లక్షలకు పైగా భారత సంతతి వారున్నారు. వారిలో ఓటర్ల సంఖ్య 26 లక్షల పై చిలుకు.
→ హిందూయేతరులతో పోలిస్తే హిందువుల్లో ట్రంప్ మద్దతుదారులు అధికంగా ఉండటం విశేషం. ఆయనకు ఓటేస్తామని 58 శాతం మంది హిందువులు తెలిపారు. 35 శాతం హిందువులు హారిస్‌కు మద్దతిస్తామన్నారు.
→ హిందూయేతర భారతీయ అమెరికన్లలో 62 శాతం హారిస్‌కు, 27 శాతం ట్రంప్‌కు మద్దతిచ్చారు.
→ 17 శాతం మంది ద్రవ్యోల్బణాన్ని ప్రధాన సమస్యగా పేర్కొన్నారు.
→ ఉపాధి, ఆర్థిక అవ్యస్థ, అబార్షన్ ప్రధానాంశాలని 13 శాతం చెప్పారు.
→ భారత్–అమెరికా సంబంధాలకు ప్రాధాన్యమిస్తున్నట్టు చెప్పిన వారు కేవలం 4 శాతమే.
US Elections 2024: భారతీయ అమెరికన్లలో హారిస్‌కు తగ్గిన ఆదరణ!
Published Tue, Oct 29 2024 4:55 AM | Last Updated on Tue, Oct 29 2024 12:35 PM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment