అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో కమలా హారిస్ ఓటమి తర్వాత, ఆమె మద్దతుదారులు తీవ్ర నిరాశకు గురయ్యారు. ఆమె అభిమానులు కొందరు వెక్కివెక్కి ఏడుస్తూ కనిపించారు.
ఎన్నికల్లో కమలా హారిస్‌ను గెలిపించేందుకు ఆమె మద్దతుదారులు ఎంతో కృషి చేశారు.
కొన్ని సందర్భాలలో కమలా మద్దతుదారులు ఎంతో దూకుడుగా కనిపించారు. అయితే ఫలితాలు వెలువడ్డాక సీన్ మారిపోయింది.
కమలా హారిస్ కోసం సోషల్ మీడియా మొదలుకొని వీధులలో ప్రచారం సాగించిన ఆమె అభిమానులు ఫలితాలు వెలువడ్డాక తమ భావోద్వేగాలను అదుపు చేసుకోలేకపోయారు.
అధ్యక్ష ఎన్నికల్లో ఓటమిని అంగీకరించిన కమలా హారిస్ వాషింగ్టన్‌లో ప్రసంగించారు. మీరు నాపై చూపిన నమ్మకానికి హృదయపూర్వక కృతజ్ఞతలు అని ఆమె పేర్కొన్నారు.
ఎన్నికల్లో ఓడిపోయినా మన లక్ష్య సాధన కోసం పోరాటం కొనసాగుతుందని కూడా కమలా హారిస్ అన్నారు.
ట్రంప్ అధ్యక్ష ఎన్నికల్లో కమలా హారిస్‌ను ఓడించారు. నాలుగేళ్ల క్రితం డెమొక్రాట్ల చేతిలో తన ఓటమికి ప్రతీకారం తీర్చుకున్నారు.
వాషింగ్టన్‌లో కమలా హారిస్ ప్రసంగిస్తున్నప్పుడు, ఆమె మద్దతుదారులు విచార వదనాలతో కనిపించారు.
తమ నేత దేశానికి తొలి మహిళా అధ్యక్షురాలిగా ఎన్నికై చరిత్ర సృష్టిస్తారని కమలా హారిస్ మద్దతుదారులు భావించారు. అయితే వారి ఆశలు అడియాసలుగా మిగిలాయి.
ఇది కూడా చదవండి: రాఘవేంద్ర స్వామి మఠంలో రిషి సునాక్ దంపతుల పూజ
Comments
Please login to add a commentAdd a comment