deopt
-
చేనేతకు చేయూతనందించాలి
కోదాడఅర్బన్: చేనేత కళాకారుల సంక్షేమం కోసం ప్రతి ఒక్కరూ చేనేత వస్త్రాలను కొనుగోలు చేసి వారికి చేయూతనందించాలని మున్సిపల్ చైర్పర్సన్ వంటిపులి అనిత కోరారు. హైదరాబాద్‌కు చెందిన కళాభారతి చేనేత,హస్త కళల సొసైటీ ఆధ్వర్యంలో పట్టణంలోని టీటీడీ కల్యాణమండపంలో ఏర్పాటు చేసిన చేనేత వస్త్ర, హస్తకళల ప్రదర్శనను ఆమె బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ దేశవ్యాప్తంగా పెరుగల చేనేత, హస్తకళల వస్తువులు ఒకేచోట ప్రదర్శించడం హర్షణీయమన్నారు. ఈనెల 21వ తేదీ వరకు నిర్వహించే ఈ ప్రదర్శనలో పలు చేనేత వస్త్రాలతో పాటు హస్తకళల వస్తువులను అమ్మకానికి ఉంచినట్లు నిర్వాహకులు జెల్లా సత్యనారాయణ తెలిపారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ తెప్పనిశ్రీనివాస్, కౌన్సిలర్లు కెఎల్ఎన్.ప్రసాద్, పలువురు నాయకులు పాల్గొన్నారు. -
పోలీస్ యంత్రాంగం బిజీబిజీ
– నయీమ్ అనుచరుల కోసం ముమ్మర గాలింపు – వ్యాపార లావాదేవీలపై ఆరా – ఇప్పటికే పలు కీలకపత్రాలు స్వాధీనం, ఆస్తుల గుర్తింపు భువనగిరి నయీమ్ ఎన్కౌంటర్ తర్వాత పోలీస్ యంత్రాంగం మరింత బిజీగా మారిపోయింది. గ్యాంగ్‌స్టర్ అనుచర వర్గాన్ని పట్టుకునేందుకు వేట ముమ్మరం చేసింది. ఇప్పటికే రాష్ట వ్యాప్తంగా జరిగిన సోదాల్లో లభించిన సమాచారం మేరకు నÄæూమ్తో ఎవరెవరితో సంబంధాలు ఉన్నాయి..? వ్యాపార లావాదేవీలు ఏంటీ..?అనుచరులు ఎవరు..? సెటిల్మెంట్ల వ్యవహారాల్లో ఎవరెవరు ఇన్వాల్వ్ అయ్యేవారు..? కేసులను నÄæూమ్ వద్దకు తీసుకెళ్లేది ఎవరు..? డబ్బు ముట్టజెప్నిప ‘బడా’బాధితులెందరు..? నÄæూమ్ బినామీలు ఎవరు..? ఇంకా ఎక్కడెక్కడ ఆస్తులు ఉన్నాయి..? ఇలా అన్ని కోణాల్లో పోలీస్ శాఖ దర్యాప్తును ముమ్మరం చేసినట్టు తెలుస్తోంది. పక్కా సమాచారం కోసం.. జిల్లాలోని భువనగిరి, యాదగిరిగుట్ట, బీబీనగర్, బొమ్మలరామారం, యాదగిరిగుట్ట,ఆలేరు, వలిగొండ, రాజాపేట, చౌటుప్పల్, సంస్థాన్‌నారాయణపురం, నల్లగొండ, మిర్యాలగూడ, నకిరేకల్ ప్రాంతాల్లో లభించిన ఆధారాల మేరకు పోలీసులు కచ్చితమైన సమాచారం సేకరిస్తున్నారు. పలు చోట్ల భూములకు సంబంధించి లభించిన కీలకపత్రాలు, నయీం కుటుంబ సభ్యులు,వారి ఇళ్లలో లభించిన డైరీలు, ఇతర రికార్డుల అధారంగా లభించిన ఈ ప్రాంత వాసులు పేర్లతో పాటు నయీంకు అనుచరులు, అయన బినామీలుగా రియల్టర్ వ్యాపారం సాగించిన వారు, డబ్బు వసూళ్ల ఇక్కడి వ్యాపారులను నయీం వద్దకు తీసుకుపోయిన వారి వివరాలు, సెటిల్మెంట్లలో మధ్యవర్తులుగా వ్యవహరించిన వారి వివరాలను సేకరిస్తున్నారు. అలాగే వివిధ ప్రాంతాలకు చెందిన వ్యాపారులు, రియల్టర్లు, రాజకీయ నాయకులతో పాటు వివిధ వర్గాల చెందిన వారు ఎంత మెుత్తంలో నÄæూమ్ నగదు ముట్టజెప్పారనే వివరాలను సేకరిస్తున్నారని తెలుస్తోంది. వినాయక చవితి, ఉర్సు ఉత్సవాల సందర్భంగా బలవంతంగా చందాలు వసూలు చేసే వారి వివరాలను కూడా వ్యాపారుల నుంచి సేకరిస్తున్నారు. అదే విధంగా భువనగిరి,యాదగిరిగుట్ట, బీబీనగర్, చౌటుప్పల్ ప్రాంతాల్లో రియల్ఎస్టేట్ వ్యాపారానికి ప్ర«ధాన రిజిష్ట్రేషన్ శాఖలో ఉన్న కొందరు ప్రభుత్వ ఉద్యోగులు, ప్రైవేట్ వ్యక్తుల సమాచారం రాబడుతున్నారు. మొత్తానికి నయీం అనుచరులను పూర్తిగా గుర్తించడంతో పాటు నయీంకు సహకరించిన వారి వేటలో పోలీస్ అనుబంధ శాఖలు బిజీగా మారిపోయాయి. -
తెలంగాణ మజ్దూర్ యూనియన్‌దే గెలుపు
ఆర్టీసీ ఎన్నికలు ప్రశాంతం నార్కట్‌పల్లిలో డిపోలో 100 శాతం పోలింగ్ ఎంప్లాయీస్, ఎస్‌డబ్ల్యూఎఫ్ కూటమిపై 176 ఓట్ల మెజార్టీ నార్కట్పల్లిః ఆర్టీసీ కార్మిక సంఘాల గుర్తింపు ఎన్నికలు మంగళవారం ప్రశాంతంగా ముగిశాయి. రాత్రి విడుదలైన ఫలితాల్లో ఎంప్లాయీస్, ఎస్‌డబ్ల్యూఎఫ్ కూటమిపై టీఎంయూ విషయం సాధించింది. నార్కట్‌పల్లి డిపోలో 284 ఓట్లు ఉండగా అందులో 8 బ్యాలెట్ ఓట్లు ఉన్నాయి, 276 ఓట్లకు 276 ఓట్లు పోలయ్యాయి. ఉదయం 5 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఎన్నికల్లో ఎంప్లాయీస్ యూనియన్, ఎస్డూబ్ల్యూఎఫ్ కూటమిగా, తెలంగాణ మజ్దూర్, ఎన్‌ఎంయూలు ఒంటరిగా బరిలోకి దిగాయి. నార్కట్‌పల్లి డిపోలో క్లాస్ 3 తెలంగాణ మజ్జూర్ యూనియన్‌కు 222 ఓట్లు రాగ, ఎంప్లాయీస్ యూనియన్, ఎస్‌డబ్ల్యూఎఫ్ కూటమికి 46 , ఎన్ఎంయూకు 6 , చక్రం గుర్తుకు ఒక ఓటు పోలయ్యాయి. ఒక ఓటు చెల్లలేదు. క్లాస్ 6లో టీఎమ్యూకు 212, ఎంప్లాయీస్ యూనియన్, ఎస్‌డబ్ల్యూఎఫ్ యూనియాలకు 55,ఎన్‌ఎంయూకి 6 , చక్రం1 ఓటు రాగ రెండు ఓట్లు చెల్లలేదు. దీంతో 176 ఓట్లతో తెలంగాణ మజ్దూర్ యూనియన్ గెలుపొందినట్లు అధికారులు తెలిపారు. అనంతరం తెలంగాణ మజ్దూర్ యూనియన్ నాయకులు సంబరాలు జరుపుకున్నారు. వీరికి ఎంపీపీ రేగట్టె మల్లికార్జున్‌రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు.