
పోలీస్ యంత్రాంగం బిజీబిజీ
– నయీమ్ అనుచరుల కోసం ముమ్మర గాలింపు
– వ్యాపార లావాదేవీలపై ఆరా
– ఇప్పటికే పలు కీలకపత్రాలు స్వాధీనం, ఆస్తుల గుర్తింపు
భువనగిరి
నయీమ్ ఎన్‌కౌంటర్ తర్వాత పోలీస్ యంత్రాంగం మరింత బిజీగా మారిపోయింది. గ్యాంగ్‌స్టర్ అనుచర వర్గాన్ని పట్టుకునేందుకు వేట ముమ్మరం చేసింది. ఇప్పటికే రాష్ట వ్యాప్తంగా జరిగిన సోదాల్లో లభించిన సమాచారం మేరకు నÄæూమ్‌తో ఎవరెవరితో సంబంధాలు ఉన్నాయి..? వ్యాపార లావాదేవీలు ఏంటీ..?అనుచరులు ఎవరు..? సెటిల్‌మెంట్ల వ్యవహారాల్లో ఎవరెవరు ఇన్‌వాల్వ్ అయ్యేవారు..? కేసులను నÄæూమ్ వద్దకు తీసుకెళ్లేది ఎవరు..? డబ్బు ముట్టజెప్నిప ‘బడా’బాధితులెందరు..? నÄæూమ్ బినామీలు ఎవరు..? ఇంకా ఎక్కడెక్కడ ఆస్తులు ఉన్నాయి..? ఇలా అన్ని కోణాల్లో పోలీస్ శాఖ దర్యాప్తును ముమ్మరం చేసినట్టు తెలుస్తోంది.
పక్కా సమాచారం కోసం..
జిల్లాలోని భువనగిరి, యాదగిరిగుట్ట, బీబీనగర్, బొమ్మలరామారం, యాదగిరిగుట్ట,ఆలేరు, వలిగొండ, రాజాపేట, చౌటుప్పల్, సంస్థాన్‌నారాయణపురం, నల్లగొండ, మిర్యాలగూడ, నకిరేకల్ ప్రాంతాల్లో లభించిన ఆధారాల మేరకు పోలీసులు కచ్చితమైన సమాచారం సేకరిస్తున్నారు. పలు చోట్ల భూములకు సంబంధించి లభించిన కీలకపత్రాలు, నయీం కుటుంబ సభ్యులు,వారి ఇళ్లలో లభించిన డైరీలు, ఇతర రికార్డుల అధారంగా లభించిన ఈ ప్రాంత వాసులు పేర్లతో పాటు నయీంకు అనుచరులు, అయన బినామీలుగా రియల్టర్ వ్యాపారం సాగించిన వారు, డబ్బు వసూళ్ల ఇక్కడి వ్యాపారులను నయీం వద్దకు తీసుకుపోయిన వారి వివరాలు, సెటిల్‌మెంట్లలో మధ్యవర్తులుగా వ్యవహరించిన వారి వివరాలను సేకరిస్తున్నారు. అలాగే వివిధ ప్రాంతాలకు చెందిన వ్యాపారులు, రియల్టర్‌లు, రాజకీయ నాయకులతో పాటు వివిధ వర్గాల చెందిన వారు ఎంత మెుత్తంలో నÄæూమ్ నగదు ముట్టజెప్పారనే వివరాలను సేకరిస్తున్నారని తెలుస్తోంది. వినాయక చవితి, ఉర్సు ఉత్సవాల సందర్భంగా బలవంతంగా చందాలు వసూలు చేసే వారి వివరాలను కూడా వ్యాపారుల నుంచి సేకరిస్తున్నారు. అదే విధంగా భువనగిరి,యాదగిరిగుట్ట, బీబీనగర్, చౌటుప్పల్ ప్రాంతాల్లో రియల్‌ఎస్టేట్ వ్యాపారానికి ప్ర«ధాన రిజిష్ట్రేషన్ శాఖలో ఉన్న కొందరు ప్రభుత్వ ఉద్యోగులు, ప్రైవేట్ వ్యక్తుల సమాచారం రాబడుతున్నారు. మొత్తానికి నయీం అనుచరులను పూర్తిగా గుర్తించడంతో పాటు నయీంకు సహకరించిన వారి వేటలో పోలీస్ అనుబంధ శాఖలు బిజీగా మారిపోయాయి.