Busy
-
కాంబినేషన్ కుదిరిందా?
హీరో అజిత్ ప్రస్తుతం ‘విడాముయార్చి’ సినిమాతో బిజీగా ఉన్నారు. మగిళ్ తిరుమేని దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా తాజా షెడ్యూల్ అజర్బైజాన్లో పూర్తయిందని కోలీవుడ్ టాక్. అయితే అజిత్ తెలుగులో ఓ సినిమా కోసం రెడీ అవుతున్నారని, మైత్రీ మూవీమేకర్స్ సంస్థ ఈ సినిమాను నిర్మించనుందనే టాక్ తెరపైకి వచ్చింది. అంతే కాదు.. ఈ సినిమాకు దర్శకుడిగా గోపీచంద్ మలినేని పేరు అనుకుంటున్నారట. మరి.. అజిత్, గోపీచంద్ మలినేని కాంబినేషన్ కుదిరిందా? లేదా? అన్నది తెలియాలంటే మరికొంత సమయం వేచి చూడాలి. -
పనులు.. నిధులు.. పథకాలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర శాసనసభ ఎన్నికల షెడ్యూల్ అక్టోబర్ పదో తేదీలోపు వెలువడుతుందనే సంకేతాల నేపథ్యంలో అధికార బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు ప్రగతిభవన్, సచివాలయానికి ఉరుకులు పరుగులు పెడుతున్నారు. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు పార్టీ, ప్రభుత్వ కార్యక్రమాలతో బిజీగా ఉంటుండడంతో.. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీ రామారావును కలుస్తూ వినతి పత్రాలు అందిస్తున్నారు. తమ నియోజకవర్గాలకు అభివృద్ధి పనులు మంజూరు చేయాలని, వివిధ పనులకు సంబంధించిన పెండింగు బిల్లులు ఇప్పించాలని కోరుతున్నారు. నిధుల అడ్డంకి ఉంటే తాము ప్రతిపాదించిన పనులకు కనీసం పాలనా పరమైన అనుమతులు అయినా ఇప్పించాలని విన్నవిస్తున్నారు. ఎన్నికల షెడ్యూల్ వెలువడేందుకు సుమారు పక్షం రోజుల సమయం మాత్రమే ఉన్నందున తమ వినతులను సత్వరం పరిష్కరించాలంటూ లేఖలు సమర్పిస్తున్నారు. కేటీఆర్ సంతకాలతో కూడిన సిఫారసు లేఖలను తీసుకుని సచివాలయంలోని సంబంధిత శాఖల ఉన్నతాధి కారులు, జిల్లా అధికారుల వద్దకు పరుగులు పెడుతున్నారు. పనులు.. పోస్టింగులు ఎమ్మెల్యేల వినతుల్లో పట్టణ ప్రాంతాల్లో సీసీ రోడ్లు, ఇతర మౌలిక వసతుల కల్పనకు సంబంధించిన పనులే ఎక్కువగా ఉంటున్నట్లు తెలిసింది. గ్రామీణ ప్రాంతాల్లో సంక్షేమ పథకాలకు సంబంధించిన అర్జీలు తమ వద్ద ఎక్కువ సంఖ్యలో ఉన్నందున వాటికి పరిష్కారం చూపాల్సిందిగా కోరుతున్నారు. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు దీర్ఘకాలంగా ఒకేచోట పనిచేస్తున్న రెవెన్యూ, పోలీసు అధికారు లను ఇతర ప్రాంతాలకు బదిలీ చేశారు. అయితే వీరిలో తమకు అనుకూలురైన పోలీసు, రెవెన్యూ అధికారుల పోస్టింగుల కోసం కొందరు ఎమ్మెల్యేలు సిఫారసు లేఖలు పట్టుకుని తిరుగుతున్నారు. ఇప్పటికే పోస్టింగులు పూర్తయిన కొన్నిచోట్ల మార్పులకు ఎమ్మెల్యేలు ఒత్తిడి చేస్తున్నట్లు సమాచారం. అయితే తక్షణం నిధుల విడుదలకు సంబంధం లేని పనులకు ఓకే చెప్తూ, ఇతర అంశాలను పరిశీలిస్తామని మాత్రమే కేటీఆర్ స్పష్టం చేస్తున్నట్లు తెలిసింది. అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు ఎన్నికలు సమీపిస్తుండటంతో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పంపిణీ ప్రక్రియపై ఎమ్మెల్యేలు దృష్టి సారించారు. వీటితో పాటు తుది దశలో ఉన్న అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాలకు రావాల్సిందిగా సంబంధిత శాఖల మంత్రులను ఎమ్మెల్యేలు ఆహ్వానిస్తు న్నారు. ఇదిలా ఉంటే సిట్టింగ్ ఎమ్మెల్యేలకు పెద్దపీట వేస్తూ నెల రోజుల క్రితం ఆగస్టు 21న సీఎం కేసీఆర్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే బీఆర్ఎస్ అభ్యర్థుల జాబితాను ప్రకటించారు. వీరిలో ఎక్కువ మంది రెండేసి పర్యాయాలకు పైగా వరుస విజయాలు సాధించిన వారే ఉండటంతో వివిధ పథకాల ద్వారా లబ్ధి ఆశిస్తున్న వారి నుంచి వీరు ఒత్తిడి ఎదుర్కొంటున్నారు. తమపై ఉన్న ప్రతికూలతను తొలగించుకునేందుకు, వీలైనంత ఎక్కువ మందికి ప్రయోజనం చేకూర్చే పనులపై అధికార పార్టీ ఎమ్మెల్యేలు దృష్టి కేంద్రీకరించి నియోజకవర్గాల్లో విస్తృతంగా పర్యటిస్తున్నారు. బీసీబంధు, గృహలక్ష్మి ఒత్తిడి.. ఎన్నికల నేపథ్యంలో తమ నియోజకవర్గాల్లో క్షేత్రస్థాయి పర్యటనలకు వెళ్తున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు.. తమకు సంక్షేమ పథకాలు వర్తింపచేయాలనే ఒత్తిడి ఎక్కువగా ఎదురవు తున్నట్లు సమాచారం. బీసీబంధు పథకం కింద రూ.లక్ష ఆర్థిక సాయానికి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా లక్ష మందికి చెక్కులు పంపిణీ చేయాలని నిర్ణయించారు. మూడు నెలల పాటు చెక్కుల పంపిణీ కొనసాగుతుందని ప్రకటించగా, ప్రస్తుతం లబ్ధిదారులకు తొలి విడత చెక్కుల పంపిణీ ప్రక్రియ తుది దశకు చేరుకుంది. ఈ నేపథ్యంలో మిగతా రెండు విడ తలకు సంబంధించిన నిధులు కూడా విడుదల చేయాలని ఎమ్మెల్యేలు కోరుతున్నారు. మరో వైపు గృహలక్ష్మి పథకం లబ్ధిదారుల వడపోత కార్యక్రమం జరుగుతోంది. దీంతో ఎన్నికల షెడ్యూల్ వెలువడే లోపు లబ్ధిదారుల జాబితా పై స్పష్టత వచ్చేలా ఎమ్మెల్యేలు ఒత్తిడి చేస్తు న్నారు. మరోవైపు సామాజిక పింఛన్ల కోసం కూడా ఎమ్మెల్యేలకు ఎక్కువ సంఖ్యలో దరఖా స్తులు అందుతున్నాయి. -
మెత్తబడని అసమ్మతి!
సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే బీఆర్ఎస్ అభ్యర్థుల జాబితా వెలువడి పది రోజులు దాటినా అసమ్మతి నేతలు మెత్తబడటం లేదు. టికెట్ దక్కించుకున్న నేతలు అసమ్మతి నేతల సహకారం కోరుతూ వారి ఇళ్ల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నా సానుకూలంగా స్పందించడం లేదు. బీఆర్ఎస్ అభ్యర్థుల్లో ఎక్కువ మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలు కాగా ఇన్నాళ్లూ అధికార బలాన్ని ఉపయోగించి తమను తొక్కిపెట్టారని అసమ్మతి నేతలు ఆరోపిస్తున్నారు. ఎమ్మెల్యేలతో తాము ఎదుర్కొన్న అనుభవాలను గుర్తుచేసుకుంటూ ఇప్పుడు సర్దుబాటుకు ససేమిరా అంటున్నారు. మరోవైపు అధికార పార్టీ ఎమ్మెల్యేలతో అంటకాగి పదవులు, పనులు పొందిన చోటా మోటా నేతలు కూడా ఏదో ఒక సాకు చూపుతూ ప్రస్తుతం దూరం పాటిస్తున్నారు. దీంతో ఎన్నికల ప్రచారంలోకి దిగాలనుకుంటున్న అభ్యర్థుల అడుగులు ముందుకు పడట్లేదు. ఆయా అభ్యర్థుల కుటుంబ సభ్యులు, ముఖ్య నేతలు అసమ్మతిని చల్లార్చేందుకు రాయబారం నెరపుతున్నా ఆశించిన ఫలితం రావట్లేదు. చాలా నియోజకవర్గాల్లో బుజ్జగింపుల పర్వం వికటించి కిందిస్థాయి నేతలు ఇతర పార్టీల వైపు చూస్తున్నారు. నియోజకవర్గాలవారీగా ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్న ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ బుజ్జగింపుల పర్వాన్ని పర్యవేక్షిస్తున్నారు. మంత్రులు హరీశ్‌రావు, గంగుల కమలాకర్, ఇంద్రకరణ్‌రెడ్డి, పువ్వాడ అజయ్, జగదీశ్‌రెడ్డి తదితరులు వారు ప్రాతినిధ్యం వహిస్తున్న ఉమ్మడి జిల్లా పార్టీ నేతలతో మంతనాలు జరుపుతూ దిద్దుబాటుకు ప్రయత్నిస్తున్నారు. సొంతదారి వైపు అసమ్మతి చూపు ఒకేసారి 115 మంది అభ్యర్థులను ప్రకటించడం బీఆర్ఎస్లో సంచలనం సృష్టించగా టికెట్ ఆశించి భంగపడిన నేతలు సొంత దారి చూసుకోవడంపై దృష్టిసారించారు. ఇప్పటికే ఎమ్మెల్యే రేఖానాయక్ (ఖానాపూర్), వేముల వీరేశం (నకిరేకల్) పార్టీనీ వీడగా మైనంపల్లి హన్మంతరావు (మల్కాజిగిరి), మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు (పాలేరు) తమ అనుచరులతో మంతనాలు జరుపుతున్నట్లు చెబుతున్నారు. తాము సైతం బీఆర్ఎస్ను వీడటం ఖాయమని ఇప్పటికే స్పష్టమైన సంకేతాలు ఇస్తున్నారు. పటాన్చెరు, జహీరాబాద్, మెదక్, కల్వకుర్తి, సంగారెడ్డి, అలంపూర్, నాగార్జునసాగర్, కోదాడ, సూర్యాపేట, రామగుండం తదితర నియోజకవర్గాల్లో అసమ్మతి నేతలు మండల స్థాయిలో సమావేశాలు నిర్వహిస్తున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యేలకు ఇచ్చిన టికెట్లు రద్దు చేసి తమకు కేటాయించాలంటూ అధిష్టానానికి విజ్ఞప్తి చేస్తున్నారు. నియోజకవర్గ స్థాయిలో నెలకొన్న అసమ్మతి దిద్దుబాటుకు మంత్రి టి.హరీశ్‌రావు స్వయంగా రంగంలోకి దిగి అసమ్మతి నేతలతో తన నివాసంలో వరుస భేటీలు జరుపుతున్నారు. పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉంటూ అభ్యర్థుల గెలుపు కోసం కలసికట్టుగా పనిచేయాలని కోరుతున్నారు. మెదక్, మహబూబ్‌నగర్, వరంగల్ జిల్లాలకు చెందిన అసమ్మతి నేతలు శుక్ర, శనివారాల్లో హరీశ్‌రావుతో భేటీ అయ్యారు. మరోవైపు అమెరికా పర్యటనలో ఉన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ ఈ నెల 6న తిరిగి హైదరాబాద్‌కు చేరుకుంటారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. కేటీఆర్ రాక తర్వాత బుజ్జగింపుల పర్వం వేగం పుంజుకోవడంతోపాటు క్షేత్రస్థాయిలో ప్రచారం కూడా పట్టాలెక్కుతుందని చెబుతున్నాయి. జనగామ, నర్సాపూర్ పంచాయితీ యథాతథం జనగామ, నర్సాపూర్ అసెంబ్లీ నియోజకవర్గాల్లో అభ్యర్థుల ప్రకటనపై నెలకొన్న సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది. సిట్టింగ్ ఎమ్మెల్యేలు ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి (జనగామ), చిలుముల మదన్‌రెడ్డి (నర్సాపూర్) తమకు టికెట్ దక్కుతుందనే ధీమాతో ఉన్నారు. మరోవైపు మాజీ మంత్రి సునీతా లక్ష్మారెడ్డి (నర్సాపూర్), ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి (జనగామ) తమ ప్రయత్నాలను ముమ్మరం చేస్తున్నారు. కేటీఆర్ వచ్చిన తర్వాత ఈ రెండు నియోజకవర్గాలపై పీటముడి వీడే అవకాశముంది. జనగామలో ఎమ్మెల్యే ముత్తిరెడ్డి, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి టికెట్ కోసం సర్వశక్తులూ ఒడ్డుతుండటంతో మధ్యేమార్గంగా ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి పేరు తెరమీదకు వస్తున్నట్లు తెలిసింది. -
పట్టపగలే అతి దారుణం.. రూ.3000 కోసం కత్తితో..
ఢిల్లీ: దేశ రాజధానిలో దారుణం జరిగింది. రూ.3000 కోసం ఓ వ్యక్తిని దారుణంగా హత్య చేశారు. పట్టపగలే ఈ దారుణం జరుగుతున్న ఏ ఒక్కరు కూడా ఆపే సాహసం చేయలేకపోయారు. దక్షిణ ఢిల్లీలోని టిగ్రీ ప్రాంతంలో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. కేసు నమోదు చేసిన పోలీసులు.. నిందితున్ని అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. యూసఫ్ అలీ అని వ్యక్తి హత్యకు గురయ్యాడు. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు బాధితున్ని ఆస్పత్రికి తరలించారు. కానీ అతడు అప్పటికే మృతి చెందినట్లు పోలీసులు గుర్తించారు. బాధితున్ని ఢిల్లీలోని సంఘమ్ విహార్ ప్రాంతానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు. ఆర్థిక వ్యవహారాలపై షారుక్ అనే వ్యక్తి తన కుమారున్ని కొన్ని రోజులుగా బెదిరిస్తున్నాడని యూసఫ్ తండ్రి షాహిద్ అలీ తెలిపారు. అయితే.. షారుక్ వద్ద యూసఫ్ రూ.3000 అప్పుగా తీసుకున్నాడని పోలీసులు గుర్తించారు. ఈ వ్యవహారంలోనే షారుక్ దాడి చేసినట్లు ప్రాథమిక విచారణలో తెలిసింది. షారుక్.. బాధితుడు యూసఫ్‌పై కత్తితో అతి దారుణంగా దాడి చేశాడు. ఈ ఘటనను స్థానికులు వీడియో తీశారు. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది. అయితే.. నిందితుడు షారుక్ కూడా సంగమ్ విహార్‌కు చెందిన వ్యక్తిగా పోలీసులు గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. ఇదీ చదవండి: 'ప్రతి ఒక్కరినీ రక్షించలేం..' అల్లర్లపై సీఎం కీలక వ్యాఖ్యలు.. -
ఒకేఒక్క వ్యక్తి రోడ్డుపై సృష్టించిన బీభత్సం చూస్తే..వామ్మో! అని నోరెళ్లబెడతారు
-
ఒకేఒక్క వ్యక్తి రోడ్డుపై సృష్టించిన బీభత్సం చూస్తే..వామ్మో! అని నోరెళ్లబెడతారు:
కొంతమంది వేగంగా నడిపో లేక మద్యం తాగో నిర్లక్ష్యంగా డ్రైవ్ చేసి వాళ్ల ప్రాణాలనే గాక ఇతరుల ప్రాణాలను కూడా ప్రమాదంలోకి పడేస్తారు. మరికొందరూ ట్రాఫిక్ రూల్స్‌పై అవగాహన లేకనో లేక అనుకోకుండానో ప్రమాదవశాత్త ఘోర ప్రమాదాల బారిన పడటం కారణమవ్వటమో జరుగుతుంది.. ఇదంతా ఒక ఎత్తైతే ఇక్కడొక వ్యక్తి కేవలం రోడ్డుపై నడుస్తూ ఏకంగా ఎన్ని ప్రమాదాలకు కారణమయ్యాడో వింటే వామ్మ! అంటారు. అతను మూర్ఖత్వంగానో లేక ట్రాఫిక్ రూల్స్ తెలియక చేశాడో తెలియదు గానీ ఏకంగా రోడ్డు మధ్యలో నడిచి తన ప్రాణాల మీదకే కాకుండా ఇతరుల ప్రాణాలపైకి ప్రమాదాన్ని తెచ్చిపెట్టాడు. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట హల్చల్ చేస్తోంది. ఆ వీడియోలో సదరు పాదాచారుడి రోడ్డు మధ్యలో నడవడంతో ఒక కారుతో మరొక కారు ఢీ కొని వరుస రోడ్డు ప్రమాదాలకు కారణమయినట్లు కనిపిస్తుంది. ఈ ఘటన మొత్తం సమీపంలోని సీసీఫుటేజ్‌లో రికార్డు అయ్యింది. ఈ ఘటనలో మొత్తం ఎంత నష్టం వాటిల్లిందనేది తెలియాల్సి ఉంది. Very lucky guy! pic.twitter.com/AC6w7o2NTp — Instant Karma (@Instantregretss) December 31, 2022 (చదవండి: ఘోర అగ్నిప్రమాదం..పలువురికి తీవ్ర గాయాలు) -
బ్యాంకులు కిటకిట
తీరని కరెన్సీ కష్టాలు బ్యాంకులు, ఏటీఎంల వద్ద భారీ క్యూలు అనంతపురం అగ్రికల్చర్ : కాలం సాగిపోతున్నా ప్రజల కరెన్సీ కష్టాలు మాత్రం తీరడం లేదు. వరుసగా 41వ రోజు కూడా బ్యాంకులు, ఏటీఎంల వద్ద జనం క్యూ కట్టారు. జిల్లా వ్యాప్తంగా అన్ని బ్యాంకులు సోమవారం కిటకిటలాడాయి. తెరిచిన ఏటీఎంల ఎదుట జనం పోటెత్తారు. అనంతపురంలోని సాయినగర్‌లో ఉన్న స్టేట్‌బ్యాంకు ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) ప్రధాన శాఖ వద్ద జాతరను తలపించింది. నగదు కొరత కారణంగా గత వారం ఇబ్బందులు ఎదురుకావడం, ప్రస్తుతం రూ.150 కోట్ల వరకు నగదు సరఫరా కావడంతో జనం తరలివచ్చారు. అయితే.. ఎక్కడా ఒకేసారి రూ.24 వేల విత్‌డ్రా ఇవ్వలేదు. దాదాపు అన్ని బ్యాంకుల్లోనూ రూ.6 వేల నుంచి రూ.10 వేల వరకు చెల్లింపులు జరిగాయి. ఎస్బీఐ, ఆంధ్రాబ్యాంకు, ఏపీజీబీ, కెనరా, సిండికేట్, కార్పొరేషన్ తదితర ప్రధాన బ్యాంకులు, వాటి శాఖల్లో ఎక్కువ లావాదేవీలు కొనసాగాయి. వృద్ధులు, వికలాంగులు, పెన్షనర్లు, ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగులతో పాటు పేదలు, సామాన్య వర్గాల వారికి బ్యాంకులు, ఏటీఎంల వద్ద పడిగాపులు తప్పలేదు. నగదు సరఫరాలో జాప్యం కావడంతో జిల్లాలో 10 నుంచి 12 బ్యాంకు శాఖల్లో విత్‌డ్రాలు నిలిచిపోయినట్లు బ్యాంకర్లు తెలిపారు. షరా మామూలే అన్నట్లు సోమవారం జిల్లా వ్యాప్తంగా 45 నుంచి 60 ఏటీఎంలు మాత్రమే పనిచేశాయి. రోజూ సాయంత్రం వేళల్లో తమ ఏటీఎంలో డబ్బు పెడుతున్నామని, అందులోనూ రూ.2 వేల నోట్లతో పాటు కొత్త రూ.500 నోట్లు కూడా ఉంచుతున్నామని అనంతపురంలోని ఆంధ్రాబ్యాంకు సీనియర్ మేనేజర్ అమ్మయ్య తెలిపారు. రూ.160 కోట్లకు పైగా నగదు సరఫరా కావడంతో రానున్న మూడు, నాలుగు రోజుల పాటు ఎలాంటి ఇబ్బందులూ ఉండవని ఎల్డీఎం జయశంకర్ తెలిపారు. -
అవసరాల బాగా బిజీ!
ఇండస్ట్రీలో హీరోలను ‘బాబు’ అనడం కామన్. దర్శక–నటుడిగా వరుస సినిమాలు చేస్తోన్న అవసరాల శ్రీనివాస్ మళ్లీ హీరోగా నటిస్తున్నారు. ఇప్పుడీ హీరోగారు కూడా బాగా బిజీ అట! సాధారణంగా సినిమాలో ఇద్దరు, ముగ్గురు హీరోయిన్లు ఉంటారు. అవసరాల సినిమాలో నలుగురమ్మాయిలు మిస్తీ చక్రవర్తి, తేజస్వి మదివాడ, సుప్రియ ఐసోల, శ్రీముఖి నటిస్తున్నారు. నలుగురు హీరోయిన్లు ఉంటే సినిమాలో హీరో బిజీగానే ఉంటారు కదా! అందుకేనేమో అవసరాల శ్రీనివాస్ హీరోగా నవీన్ మేడారంను దర్శకునిగా పరిచయం చేస్తూ అభిషేక్ నామా నిర్మిస్తున్న రొమాంటిక్ కామెడీ చిత్రానికి ‘బాబు బాగా... బిజీ’ అనే టైటిల్ ఖరారు చేశారు. హిందీ హిట్ ‘హంటర్’కి తెలుగు రీమేక్ ఇది. ‘‘ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. త్వరలో ఆడియో విడుదల తేదీ ప్రకటిస్తాం’’ అన్నారు నిర్మాత. -
పోలీస్ యంత్రాంగం బిజీబిజీ
– నయీమ్ అనుచరుల కోసం ముమ్మర గాలింపు – వ్యాపార లావాదేవీలపై ఆరా – ఇప్పటికే పలు కీలకపత్రాలు స్వాధీనం, ఆస్తుల గుర్తింపు భువనగిరి నయీమ్ ఎన్కౌంటర్ తర్వాత పోలీస్ యంత్రాంగం మరింత బిజీగా మారిపోయింది. గ్యాంగ్‌స్టర్ అనుచర వర్గాన్ని పట్టుకునేందుకు వేట ముమ్మరం చేసింది. ఇప్పటికే రాష్ట వ్యాప్తంగా జరిగిన సోదాల్లో లభించిన సమాచారం మేరకు నÄæూమ్తో ఎవరెవరితో సంబంధాలు ఉన్నాయి..? వ్యాపార లావాదేవీలు ఏంటీ..?అనుచరులు ఎవరు..? సెటిల్మెంట్ల వ్యవహారాల్లో ఎవరెవరు ఇన్వాల్వ్ అయ్యేవారు..? కేసులను నÄæూమ్ వద్దకు తీసుకెళ్లేది ఎవరు..? డబ్బు ముట్టజెప్నిప ‘బడా’బాధితులెందరు..? నÄæూమ్ బినామీలు ఎవరు..? ఇంకా ఎక్కడెక్కడ ఆస్తులు ఉన్నాయి..? ఇలా అన్ని కోణాల్లో పోలీస్ శాఖ దర్యాప్తును ముమ్మరం చేసినట్టు తెలుస్తోంది. పక్కా సమాచారం కోసం.. జిల్లాలోని భువనగిరి, యాదగిరిగుట్ట, బీబీనగర్, బొమ్మలరామారం, యాదగిరిగుట్ట,ఆలేరు, వలిగొండ, రాజాపేట, చౌటుప్పల్, సంస్థాన్‌నారాయణపురం, నల్లగొండ, మిర్యాలగూడ, నకిరేకల్ ప్రాంతాల్లో లభించిన ఆధారాల మేరకు పోలీసులు కచ్చితమైన సమాచారం సేకరిస్తున్నారు. పలు చోట్ల భూములకు సంబంధించి లభించిన కీలకపత్రాలు, నయీం కుటుంబ సభ్యులు,వారి ఇళ్లలో లభించిన డైరీలు, ఇతర రికార్డుల అధారంగా లభించిన ఈ ప్రాంత వాసులు పేర్లతో పాటు నయీంకు అనుచరులు, అయన బినామీలుగా రియల్టర్ వ్యాపారం సాగించిన వారు, డబ్బు వసూళ్ల ఇక్కడి వ్యాపారులను నయీం వద్దకు తీసుకుపోయిన వారి వివరాలు, సెటిల్మెంట్లలో మధ్యవర్తులుగా వ్యవహరించిన వారి వివరాలను సేకరిస్తున్నారు. అలాగే వివిధ ప్రాంతాలకు చెందిన వ్యాపారులు, రియల్టర్లు, రాజకీయ నాయకులతో పాటు వివిధ వర్గాల చెందిన వారు ఎంత మెుత్తంలో నÄæూమ్ నగదు ముట్టజెప్పారనే వివరాలను సేకరిస్తున్నారని తెలుస్తోంది. వినాయక చవితి, ఉర్సు ఉత్సవాల సందర్భంగా బలవంతంగా చందాలు వసూలు చేసే వారి వివరాలను కూడా వ్యాపారుల నుంచి సేకరిస్తున్నారు. అదే విధంగా భువనగిరి,యాదగిరిగుట్ట, బీబీనగర్, చౌటుప్పల్ ప్రాంతాల్లో రియల్ఎస్టేట్ వ్యాపారానికి ప్ర«ధాన రిజిష్ట్రేషన్ శాఖలో ఉన్న కొందరు ప్రభుత్వ ఉద్యోగులు, ప్రైవేట్ వ్యక్తుల సమాచారం రాబడుతున్నారు. మొత్తానికి నయీం అనుచరులను పూర్తిగా గుర్తించడంతో పాటు నయీంకు సహకరించిన వారి వేటలో పోలీస్ అనుబంధ శాఖలు బిజీగా మారిపోయాయి. -
ఈవెంట్ మేనేజర్లు బిజీబిజీ
-
మా రాష్ట్రానికి రండి:కేసీఆర్
-
హన్సిక టాలీవుడ్‌కి ఎందుకు దూరమైంది ?
-
సంబర పడిపోతున్న లావణ్య
-
ఫోన్లతో ఏపీ సీఎం చంద్రబాబు బిజీ బిజీ
-
బ్యూటీ టిప్స్ ఇస్తోన్న బబ్లీ బేబీ
-
అగిపోయిన హన్సిక సినిమాలు
-
షూటింగ్లో బిజిగా మారిన జక్కన్న
-
పెళ్లికి నో అంటోన్న త్రిష
-
రిటైర్మెంట్ టైంలో పుల్ వర్క్‌లో మన్మోహన్
-
బాలా డైరెక్షన్లో మిల్క్‌బ్యూటీ
-
దక్షిణం: ప్రకటనలకు ఎక్కిన మగబుద్ధి !
స్త్రీలపై జోకులకు వయసెక్కువ. మగాళ్లపై సెటైర్లకు ప్రచారమెక్కువ. స్త్రీలైపై జోకులే ముందుగా పుట్టాయి. ముందుగా ప్రచారం పొందాయి. ఎక్కువగా ఉన్నాయి. కానీ ఈ మధ్యనే మగాళ్లపై కూడా బాగా ఎక్కువగా సెటైర్లు పడుతున్నాయి. అంతేకాదు ముందొచ్చిన చెవుల కొంటే వెనుకొచ్చిన కొమ్ములు వాడి అన్నట్టు పురుషుల మీద వస్తున్నవి (ముఖ్యంగా మగబుద్ధికి సంబంధించినవి) ఈ మధ్య ప్రముఖ కంపెనీల ప్రచారానికి ఉపయోగపడుతున్నాయి. నిజానికి ఆ ప్రకటనలకు - వాటికి సంబంధం లేకపోయినా క్రేజు కోసం వాడేస్తున్నారు. నిజానికి అవి మగజాతి సహజ లక్షణాలు ! ఎంత బిజీగా ఉన్నా అందాన్ని ఆస్వాదిస్తాడు: మగాడికి సౌందర్యారాధన ఎక్కువ. దానిని ఎంత శ్రద్ధగా చేస్తాడంటే ఎంత టెన్షన్లో, బిజీగా ఉన్నా మానడు. దీని ఆధారంగా ఓ మందు కంపెనీ ఈ ప్రకటన తయారుచేసింది. ఓ వృద్ధ జంట ఆపమని పరుగెత్తుకు వస్తున్నా బాగా బిజీగా ఉండటం వల్లే లిఫ్టును ఆపకుండా పద్దెనిమిదో ఫ్లోరుకు అర్జెంటు పనిమీద వెళ్లిపోతాడు. అక్కడో అందమైన యువతిని చూడగానే పనంతా మరిచిపోయి మళ్లీ ఆమెతోపాటు పద్దెనిమిది ఫ్లోర్లు దిగుతాడు. సెలక్టెవ్ మెమొరీ సిండ్రోమ్: సాధారణంగా చాలామంది భర్తలకు పెళ్లి రోజు, భార్య పుట్టిన రోజు గుర్తుండవు. పాపం ఇందులో వాళ్ల తప్పేం లేదట. అదొక వ్యాధి అట. దానికి సెలక్టెవ్ మొమరీ సిండ్రోమ్ అని పేరుపెట్టారు. కాకపోతే చికిత్సే కాస్త ఖరీదు. పెళ్లయిన మూడు-నాలుగేళ్లకు ఇది సోకే అవకాశం ఉంటుంది. ఏడాదికి రెండు మూడు సార్లు డిప్రెషన్ కలిగించే ఈ వ్యాధికి చీరలు, బంగారం, వజ్రాలతో చికిత్స చేయించొచ్చు. దీనిపై ఓ ప్రకటన వచ్చింది. ‘ఆఫీసు పార్టీ హడావుడిలో పెళ్లిరోజును మరిచిన ఓ మగాడు వజ్రాల దుకాణానికి వెళ్తాడు. పెళ్లిరోజు డైమండ్ రింగ్ అడిగితే 1 క్యారెట్, 2 క్యారెట్ డైమండ్ చూపించినా మెప్పడు. పెళ్లిరోజు నిన్న అని తెలియడంతో షాపువాడు ఏకంగా ఐదు క్యారెట్ల డైమండ్ చూపిస్తాడు. అపుడు కానీ ఆ మొహం వెలగదు’. ఇది ఓ మద్యం ప్రకటన. అందమైన అమ్మాయి అడిగితే కాదంటారా? పడవ నిండా కుర్చీలు రవాణా చేస్తుంటాడొకతను. ఓ గట్టు మీద చక్కటి యువతి. నేను రానా అని సైగ చేయగానే కొన్ని కుర్చీలు పడేస్తాడు. ఆమె మేకపిల్ల కోసం మరికొన్ని, దాని మేత కోసం ఇంకొన్ని... కుర్చీలు నీళ్లలో. ఆ యువతి, ఆమె సంత పడవలో. ఇది ఫెవికాల్ యాడ్. అబ్బాయిల హృదయం సున్నితం, అందమైన అమ్మాయి అడిగినపుడు మంచులా కరుగుతుంది నష్టమైనా, కష్టమైనా అని చెప్తోందీ ప్రకటన! టీవీల్లో రోజుకు పదుల సార్లు వస్తున్న ఈ ప్రకటనలు ఆయా కంపెనీలకు ప్రచారాన్ని, ప్రేక్షకులకు వినోదాన్ని పంచుతున్నాయి. కాకపోతే మన గురించి మరీ అలా బహిరంగంగా తెలిస్తే ప్లస్‌లూ ఉన్నాయి. మైనస్లూ ఉన్నాయి. కొన్ని ఘాటు నిజాలు అన్నిసార్లు రాజ్యం మనదే కాదండోయ్. ఓడలు బళ్లు, బళ్లు ఓడలు అవడం అంటే ఏంటో మగాళ్ల విషయంలోనూ అపుడపుడు అర్థమవుతోంది. మచ్చుకు కొన్ని. - 1950 కి ముందు అమెరికాలో 80 శాతం మంది మగాళ్లకు ఉద్యోగాలుంటే ఇపుడు 60 శాతం మందికే ఉన్నాయట. - ఉద్యోగాలున్న మగాళ్లకంటే నిరుద్యోగంతో బాధపడే మగాళ్లకి డైవర్స్ అవకాశాలు మూడు రెట్లు ఎక్కువట. - ఆధునిక సేవా రంగాల్లో మగాళ్లు మిడిల్ మేనేజ్మెంట్లో ఎక్కువ ఉద్యోగాలు కోల్పోతున్నారట. వాటిని స్త్రీలు చేజిక్కించుకుంటున్నారు. - ఇపుడు మనదేశంలోని ఐదుకు పైగా రాష్ట్రాల్లో వధువుల కొరత పెరిగింది. - శృంగారం విషయంలో స్త్రీల అభిప్రాయానికి భారతీయులు తక్కువ ప్రాధాన్యం ఇస్తారు. - ప్రకాష్ చిమ్మల