
కొంతమంది వేగంగా నడిపో లేక మద్యం తాగో నిర్లక్ష్యంగా డ్రైవ్ చేసి వాళ్ల ప్రాణాలనే గాక ఇతరుల ప్రాణాలను కూడా ప్రమాదంలోకి పడేస్తారు. మరికొందరూ ట్రాఫిక్ రూల్స్‌పై అవగాహన లేకనో లేక అనుకోకుండానో ప్రమాదవశాత్త ఘోర ప్రమాదాల బారిన పడటం కారణమవ్వటమో జరుగుతుంది.. ఇదంతా ఒక ఎత్తైతే ఇక్కడొక వ్యక్తి కేవలం రోడ్డుపై నడుస్తూ ఏకంగా ఎన్ని ప్రమాదాలకు కారణమయ్యాడో వింటే వామ్మ! అంటారు.
అతను మూర్ఖత్వంగానో లేక ట్రాఫిక్ రూల్స్ తెలియక చేశాడో తెలియదు గానీ ఏకంగా రోడ్డు మధ్యలో నడిచి తన ప్రాణాల మీదకే కాకుండా ఇతరుల ప్రాణాలపైకి ప్రమాదాన్ని తెచ్చిపెట్టాడు. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట హల్‌చల్ చేస్తోంది. ఆ వీడియోలో సదరు పాదాచారుడి రోడ్డు మధ్యలో నడవడంతో ఒక కారుతో మరొక కారు ఢీ కొని వరుస రోడ్డు ప్రమాదాలకు కారణమయినట్లు కనిపిస్తుంది. ఈ ఘటన మొత్తం సమీపంలోని సీసీఫుటేజ్‌లో రికార్డు అయ్యింది. ఈ ఘటనలో మొత్తం ఎంత నష్టం వాటిల్లిందనేది తెలియాల్సి ఉంది.
Very lucky guy! pic.twitter.com/AC6w7o2NTp
— Instant Karma (@Instantregretss) December 31, 2022
(చదవండి: ఘోర అగ్నిప్రమాదం..పలువురికి తీవ్ర గాయాలు)
Comments
Please login to add a commentAdd a comment