Several
-
కుండపోత.. జల దిగ్బంధంలో విజయవాడ (ఫొటోలు)
-
ఒకేఒక్క వ్యక్తి రోడ్డుపై సృష్టించిన బీభత్సం చూస్తే..వామ్మో! అని నోరెళ్లబెడతారు
-
ఒకేఒక్క వ్యక్తి రోడ్డుపై సృష్టించిన బీభత్సం చూస్తే..వామ్మో! అని నోరెళ్లబెడతారు:
కొంతమంది వేగంగా నడిపో లేక మద్యం తాగో నిర్లక్ష్యంగా డ్రైవ్ చేసి వాళ్ల ప్రాణాలనే గాక ఇతరుల ప్రాణాలను కూడా ప్రమాదంలోకి పడేస్తారు. మరికొందరూ ట్రాఫిక్ రూల్స్‌పై అవగాహన లేకనో లేక అనుకోకుండానో ప్రమాదవశాత్త ఘోర ప్రమాదాల బారిన పడటం కారణమవ్వటమో జరుగుతుంది.. ఇదంతా ఒక ఎత్తైతే ఇక్కడొక వ్యక్తి కేవలం రోడ్డుపై నడుస్తూ ఏకంగా ఎన్ని ప్రమాదాలకు కారణమయ్యాడో వింటే వామ్మ! అంటారు. అతను మూర్ఖత్వంగానో లేక ట్రాఫిక్ రూల్స్ తెలియక చేశాడో తెలియదు గానీ ఏకంగా రోడ్డు మధ్యలో నడిచి తన ప్రాణాల మీదకే కాకుండా ఇతరుల ప్రాణాలపైకి ప్రమాదాన్ని తెచ్చిపెట్టాడు. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట హల్చల్ చేస్తోంది. ఆ వీడియోలో సదరు పాదాచారుడి రోడ్డు మధ్యలో నడవడంతో ఒక కారుతో మరొక కారు ఢీ కొని వరుస రోడ్డు ప్రమాదాలకు కారణమయినట్లు కనిపిస్తుంది. ఈ ఘటన మొత్తం సమీపంలోని సీసీఫుటేజ్‌లో రికార్డు అయ్యింది. ఈ ఘటనలో మొత్తం ఎంత నష్టం వాటిల్లిందనేది తెలియాల్సి ఉంది. Very lucky guy! pic.twitter.com/AC6w7o2NTp — Instant Karma (@Instantregretss) December 31, 2022 (చదవండి: ఘోర అగ్నిప్రమాదం..పలువురికి తీవ్ర గాయాలు) -
స్కూలు బస్ ప్రమాదం.. చిన్నారుల మృత్యువాత
వాషింగ్టన్: అమెరికాలో ఘోర బస్సు ప్రమాదం సంభవించింది. టెనస్సీ లోని ఓ పాఠశాలకు చెందిన బస్సు చెట్టును ఢీకొట్టడంతో ఈ ప్రమాదం సంభవించింది. ఈ ప్రాణాంతకమైన ప్రమాదంలో పలువురు చిన్నారులు మృత్యువాత పడినట్టు తెలుస్తోంది. కిండర్ గార్టెన్ , ప్రాథమిక పాఠశాల విద్యార్థులు 35 మందితో వెళ్తుండగా ఈ విషాదం చోటు చేసుకుంది. సంఘటనా స్థలానికి చేరుకున్న అధికారులు సహాయక చర్యల్ని చేపట్టారు. గాయపడిన చిన్నారులను స్థానిక ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఎంతమంది మరణించారనేది ఇపుడే చెప్పలేమని, తీవ్ర గాయాలపాలైన 20 మందిని ఆసుపత్రికి తరలించినట్టు ఛత్తనూగ పోలీసు అధికారి ట్రేసీ ఆర్నాల్డ్ తెలిపారు. అయితే ఎక్కువమంది చనిపోయి వుంటారని భావిస్తున్నామన్నారు. మరోవైపు హామిల్టన్ కౌంటీ ప్రాసిక్యూటర్ కార్యాలయం ఆరుగురు చనిపోయారని నివేదించింది. సుమారు 12 మంది పిల్లలు చనిపోయారని స్థానిక మీడియా వెల్లడించింది. దీనిపై పూర్తి సమాచారం ఇంకా తెలియాల్సి ఉంది. We will be shooting for our 1st press briefing @ corner of Howard & Talley Rd @ 5:00 pm. #ChattFire pic.twitter.com/1bpnabsHmJ — Chattanooga FireDept (@ChattFireDept) November 21, 2016 -
ఛండీగడ్‌లో విషాదం