Delhi Man Stabbed To Death Over Rs 3000 - Sakshi
Sakshi News home page

పట్టపగలే అతి దారుణం.. రూ.3000 కోసం కత్తితో..

Published Wed, Aug 2 2023 6:59 PM | Last Updated on Wed, Aug 2 2023 9:10 PM

Man Repeatedly Stabbed On Busy Street In Delhi Over Rs 3,000 - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

ఢిల్లీ: దేశ రాజధానిలో దారుణం జరిగింది. రూ.3000 కోసం ఓ వ్యక్తిని దారుణంగా హత్య చేశారు. పట్టపగలే ఈ దారుణం జరుగుతున్న ఏ ఒక్కరు కూడా ఆపే సాహసం చేయలేకపోయారు. దక్షిణ ఢిల్లీలోని టిగ్రీ ప్రాంతంలో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. కేసు నమోదు చేసిన పోలీసులు.. నిందితున్ని అదుపులోకి తీసుకున్నారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. యూసఫ్ అలీ అని వ్యక్తి హత్యకు గురయ్యాడు. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు బాధితున్ని ఆస్పత్రికి తరలించారు. కానీ అతడు అప్పటికే మృతి చెందినట్లు పోలీసులు గుర్తించారు. బాధితున్ని ఢిల్లీలోని సంఘమ్ విహార్ ప్రాంతానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు.

ఆర్థిక వ్యవహారాలపై షారుక్‌ అనే వ్యక్తి తన కుమారున్ని కొన్ని రోజులుగా బెదిరిస్తున్నాడని యూసఫ్ తండ్రి షాహిద్ అలీ తెలిపారు. అయితే.. షారుక్‌ వద్ద యూసఫ్ రూ.3000 అప్పుగా తీసుకున్నాడని పోలీసులు గుర్తించారు. ఈ వ్యవహారంలోనే షారుక్‌ దాడి చేసినట్లు ప్రాథమిక విచారణలో తెలిసింది. 

షారుక్‌.. బాధితుడు యూసఫ్‌పై కత్తితో అతి దారుణంగా దాడి చేశాడు. ఈ ఘటనను స్థానికులు వీడియో తీశారు. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అయింది. అయితే.. నిందితుడు షారుక్‌ కూడా సంగమ్‌ విహార్‌కు చెందిన వ్యక్తిగా పోలీసులు గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. 

ఇదీ చదవండి: 'ప్రతి ఒక్కరినీ రక్షించలేం..' అల్లర్లపై సీఎం కీలక వ్యాఖ్యలు..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement