Street
-
ఛీఛీ.. మూమూస్ ఇలా చేస్తారా?
ఇటీవలి కాలంలో మూమూస్ చాలామందికి ఇష్టమైన చిరుతిండిగా మారిపోయింది. అయితే ఛత్తీస్‌గఢ్‌లోని ధామ్తరిలో మూమూస్ తయారీకి సంబంధించిన ఒక వీడియో వైరల్‌గా మారింది. ఈ వీడియోను చూసిన వారికి ఇకపై మూమూస్ జోలికి వెళ్లకూడదని అనిపించడం ఖాయం. ఈ వీడియో వైరల్ అయిన నేపధ్యంలో స్థానిక అధికారులు అప్రమత్తం అయ్యారు. ధామ్తరిలో మూమూస్ విక్రయించే అన్ని దుకాణాలపై దాడులు నిర్వహించేందుకు సిద్ధమయ్యారు. అలాగే మూమూస్ తినేవారంతా చాలా జాగ్రత్తగా ఉండాలని అధికారులు విజ్ఞప్తి చేశారు. ఈ వీడియోలో ఒక వ్యక్తి తన మురికి పాదాలతో మూమూస్ కోసం పిండిని కలపడం చూడవచ్చు. ఈ వీడియోను చూసిన పలువురు తమ సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేస్తున్నారు. मोमोज़ का आटा, क्या आप भी मोमोज़ खाते है..?? pic.twitter.com/hmA0QxbFRd — Abhishek Pandey (@Abhishe76395130) March 5, 2024 -
గాలి తగిలితే వణుకు, నీటిని చూస్తే భయం.. రేబిస్‌తో 14 ఏళ్ల బాలుడు మృతి!
ఉత్తరప్రదేశ్‌లోని ఘాజియాబాద్‌లో రేబిస్‌తో 14 ఏళ్ల బాలుడు హృదయవిదారక స్థితిలో కన్నుమూశాడు. నాలుగు రోజుల క్రితం బాలునిలో రేబిస్ లక్షణాలు కనిపించాయి. గాలికి, నీటికి భయపడటంతో పాటు చీకటిలో ఉండేందుకు ఇష్టపడసాగాడు. పిల్లాడి విచిత్ర ప్రవర్తన, అనారోగ్య పరిస్థితులను గమనించిన కుటుంబ సభ్యులు బాధితుడిని ఆసుపత్రికి తీసుకెళ్లగా, అక్కడి వైద్యులు ఆసుపత్రిలో చేర్చుకునేందుకు నిరాకరించారు. ఈ ఉదంతం విజయ్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని చరణ్‌సింగ్ కాలనీలో చోటుచేసుకుంది. ఈ ప్రాంతానికి చెందిన యూకూబ్ పెద్ద కుమారుడు సాబేజ్‌ను నెల రోజుల క్రితం కుక్క కరిచింది. భయం కారణంగా సాబేజ్ ఈ విషయాన్ని ఇంటిలోని వారికి చెప్పలేదు. అయితే నాలుగు రోజుల క్రితం ఆ కుర్రాడిలో రేబిస్ లక్షణాలు బయటపడ్డాయి. మొదట్లో ఇంటిలోని వారికి ఏమీ అర్థం కాలేదు. అయితే రానురాను సాబేజ్ ఆరోగ్యం క్షీణించసాగింది. పిల్లాడి ప్రవర్తనలో మార్పులు చోటుచేసుకోవడంతో కుటుంబ సభ్యులు సాబేజ్‌ను ఆసుపత్రికి తీసుకువెళ్లారు. అక్కడ వైద్యపరీక్షలు చేసిన అనంతరం వైద్యులు ఆసుపత్రిలో చేర్చుకునేందుకు నిరాకరించారు. వైద్యం అందని స్థితిలో సాబేజ్ హృదయవిదారక స్థితిలో కన్నుమూశాడు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులు మాట్లాడుతూ తమ కుమారునిడి చికిత్స కోసం ఘాజియాబాద్‌లోని ఎంశ్రీం ఆసుపత్రితో పాటు మీరఠ్, ఢిల్లీలోని జీటీబీ, ఎయిమ్స్ ఆసుపత్రులకు చికిత్స కోసం తీసుకువెళ్లామన్నారు. అయినా ప్రయోజనం లేకపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం సాబేస్ను పొరుగింటిలోని వారి కుక్క కరిచింది. ఒక మహిళ ఆ కుక్కను సంరక్షిస్తోంది. అలాగే ఆమె వీధి కుక్కలను ఆహారం కూడా అందిస్తుంటుంది. దీంతో ఐదారు కుక్కలు ఆమె ఇంటి వద్దనే ఉంటాయి. ఆ మహిళ పెంచుకుంటున్న కుక్క కరవడంతోనే తమ కుమారుడు మరణించాడని బాధితుని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. తమ పిల్లాడికి జరిగిన విధంగా ఎవరికీ జరగకూడదని వారు అంటున్నారు. ఈ ఉదంతం నేపద్యంలో నగరపాలక అధికారులు ఆ కుక్కను పెంచుకుంటున్న మహిళకు నోటీసు అందజేశారు. తదుపరి చర్యలకు ఉపక్రమించారు. ఇది కూడా చదవండి: విద్యాదానం వీరి జీవన విధానం! -
దటీజ్ "మహాలక్ష్మీ ఐస్ క్రీం"! అద్గది.. టెక్నాలజీని వాడటం అంటే..!
మన చుట్టూ సాధరణంగా ఉండే సామాన్యులు సైతం టెక్నాలజీని వాడుకునే సామర్థ్య కలిగి ఉంటారు. అవసరం వచ్చినప్పుడూ గానీ వారి నైపుణ్యం ఏంటో మనకు తెలియదు. వారు తమ నిత్యావసరాలకు టెక్నాలజీని వాడి చూపిస్తే..అందరూ అశ్చర్యపోతారు. నాలెడ్జ్ అనేది ఎవరీ సొత్తు కాదు. బుర్ర పెట్టి ఆలోచిస్తే ఎవ్వడైనా తమకు అందుబాటులో ఉన్నవాటితోనే అద్భుతాలు చేసి చూపగలరు. అచ్చం అలాంటి అద్భుత ఘటనే ఢిల్లీలో చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే..ఢిల్లీలోని మహాలక్మీ ఐస్ క్రీం బండి చూస్తే..కచ్చితంగా ఆశ్చర్యపోతారు. ఆ ఐస్ క్రీం ట్రక్ టెక్నాలజీని వాడేంత స్థాయిని చూస్తే కచ్చితంగా ఆశ్చర్యపోతారు. ఎందుకంటే అంత టెక్నాలజీ వాడగలిగే స్థోమత ఆ ఐస్‌క్రీం విక్రయించే అతనికి ఉండటమే..ఇక్కడ హాట్‌టాపిక్‌గా మారింది. నిజానికి వీధుల్లో అమ్మే ఐస్‌క్రీం బండి వాళ్లు శీతలీకరణం కోసం ఇంటెన్సివ్ గ్లైకాల్ ఫీజర్లపైనే ఆధారపడతారు. అవి భారీగా ఉండటమే కాకుండా గణనీయమైన విద్యుత్‌ని డిమాండ్ చేస్తుంది. వేసవిలో వీటి వినియోగం మరింత ఎక్కువగా ఉంటుంది. ఐసీక్రీంని కూల్‌గా ఉంచటం కోసం అని సోలార్ విద్యుత్‌ని వాడాలన్న ఆలోచనే గ్రేట్గానూ, కొత్తగానూ ఉంది. ఇక అంత సాంకేతికతకు పెట్టుబడి పెట్టగలిగే సామర్థ్యం ఆ ఐస్‌క్రీం విక్రయించే వ్యక్తికి ఉండటం..అందర్నీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఈ విషయమే నెట్టింట తెగ వైరల్ అవుతోంది. అతను ఆ వ్యాపారంలో లాభాలు గడించి ఆ స్థాయికి వచ్చాడని కొందరూ, విక్రయించే వ్యక్తికి వ్యక్తిగత సోలార్ టెక్నాలజీకి సంబంధించి కనెక్షన్ ఉంటే తప్ప ఇలా ఐస్‌క్రీం ట్రక్‌కి పెట్టలేరని కొందరూ కామెంట్లు చేస్తూ..పోస్ట్‌లు పెట్టారు. (చదవండి: -
పట్టపగలే అతి దారుణం.. రూ.3000 కోసం కత్తితో..
ఢిల్లీ: దేశ రాజధానిలో దారుణం జరిగింది. రూ.3000 కోసం ఓ వ్యక్తిని దారుణంగా హత్య చేశారు. పట్టపగలే ఈ దారుణం జరుగుతున్న ఏ ఒక్కరు కూడా ఆపే సాహసం చేయలేకపోయారు. దక్షిణ ఢిల్లీలోని టిగ్రీ ప్రాంతంలో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. కేసు నమోదు చేసిన పోలీసులు.. నిందితున్ని అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. యూసఫ్ అలీ అని వ్యక్తి హత్యకు గురయ్యాడు. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు బాధితున్ని ఆస్పత్రికి తరలించారు. కానీ అతడు అప్పటికే మృతి చెందినట్లు పోలీసులు గుర్తించారు. బాధితున్ని ఢిల్లీలోని సంఘమ్ విహార్ ప్రాంతానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు. ఆర్థిక వ్యవహారాలపై షారుక్ అనే వ్యక్తి తన కుమారున్ని కొన్ని రోజులుగా బెదిరిస్తున్నాడని యూసఫ్ తండ్రి షాహిద్ అలీ తెలిపారు. అయితే.. షారుక్ వద్ద యూసఫ్ రూ.3000 అప్పుగా తీసుకున్నాడని పోలీసులు గుర్తించారు. ఈ వ్యవహారంలోనే షారుక్ దాడి చేసినట్లు ప్రాథమిక విచారణలో తెలిసింది. షారుక్.. బాధితుడు యూసఫ్‌పై కత్తితో అతి దారుణంగా దాడి చేశాడు. ఈ ఘటనను స్థానికులు వీడియో తీశారు. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది. అయితే.. నిందితుడు షారుక్ కూడా సంగమ్ విహార్‌కు చెందిన వ్యక్తిగా పోలీసులు గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. ఇదీ చదవండి: 'ప్రతి ఒక్కరినీ రక్షించలేం..' అల్లర్లపై సీఎం కీలక వ్యాఖ్యలు.. -
మెత్తని మిఠాయి..ప్రపంచం మెచ్చిందోయి!
తీపి పదార్థాలు అంటే చాలా మంది చెవి కోసుకుంటారనేది సామెత. నిజంగా చెవి కోసుకోవడం ఏమోగానీ.. ముందు పెడితే చాలు జామ్మంటూ లాగించేస్తుంటారు. అందులోనూ మైసూర్ పాక్ అనగానే నోట్లో నీళ్లూరడం ఖాయం. అలా దేశవిదేశాల్లో ఆహార ప్రియుల నోరూరిస్తున్న మైసూర్ పాక్.. ఇప్పుడు ప్రపంచంలో ఎక్కువమంది ఇష్టపడే స్ట్రీట్ ఫుడ్ స్వీట్లలో 14వ స్థానంలో నిలిచింది. – మైసూర్ టాప్–50 స్వీట్లపై సర్వేలో.. ప్రఖ్యాత ఫుడ్ మ్యాగజైన్ ‘టేస్ట్ అట్లాస్’ ఇటీవల ఆన్లైన్లో వివిధ ఆహార పదార్థాలపై సర్వే చేసింది. ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లో వీధుల్లో అమ్మే మిఠాయిల్లో ప్రజాదరణ పొందినవి ఏవి అన్న అంశంపై ఓటింగ్ నిర్వహించింది. అందులో మైసూర్‌పాక్ 14వ స్థానంలో నిలవడం గమనార్హం. అంతేకాదు.. దీనికి స్వీట్ ప్రియుల నుంచి ఏకంగా 4.4 రేటింగ్ వచ్చింది. ఇక ఈ జాబితాలో అమెరికాకు చెందిన డోనట్స్ టాప్ ప్లేస్.. మన దేశానికే చెందిన కుల్ఫీ 24వ స్థానంలో, గులాబ్జమూన్ 26వ స్థానం సంపాదించాయి. రాజు కోసం వండిన మిఠాయి మైసూర్ పాక్ గురించి ఎన్నో కథలు, కథనాలు ప్రచారంలో ఉన్నాయి. అందులో ముఖ్యమైనది మైసూర్ రాజు అంతఃపురం వంటశాలలో మైసూర్ పాక్ పుట్టిందనే కథ. సుమారు 90 ఏళ్ల కింద మైసూర్ రాజు ఒడయార్ అంతఃపురంలో ముఖ్యమైన వంటగాడిగా మాదప్ప ఉండేవారు. అప్పటి రాజు కృష్ణరాజ ఒడయార్ భోజనం చేస్తున్న సమయంలో.. అక్కడ ఎలాంటి మిఠాయి లేదని మాదప్ప గుర్తించాడు. వెంటనే చక్కెర, నెయ్యి, శనగపిండి మిశ్రమంతో ఓ పాకం వంటి వంటకాన్ని తయారు చేశాడు. రాజు భోజనం చివరికి వచ్చేసరికి పాకం చల్లారి మెత్తటి ముద్దగా మారింది. మాదప్ప దాన్ని ముక్కలుగా కోసి వడ్డించగా.. రాజు తిని చూసి చాలా బాగుందని మెచ్చుకున్నారు. ఇదేం మిఠాయి అని రాజు అడిగితే.. మైసూర్ పాకం అని మాదప్ప బదులిచ్చారు. అదే కాస్త మార్పులతో మైసూర్ పాక్‌గా మారింది. అంతఃపురం నుంచి అంగళ్లకు, ఇళ్లకు చేరింది. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా మైసూర్ పాక్‌ను తయారు చేసి అమ్ముతున్నా.. మన దేశంలో చేసినంత బాగా మరెక్కడా రుచిగా రాదని మిఠాయి ప్రియులు చెప్తుంటారు. -
యూరోపియన్ స్టైల్లో..సాగర తీరాన ఈట్ స్ట్రీట్స్..
చల్లనిగాలి..సముద్ర అందాలు.. ఇష్టమైన ఆహారం..లైఫ్ బిందాసే కదా..అటువంటి యూరోపియన్ ఫుడ్స్టైల్స్ ఇక విశాఖలో నోరూరించనున్నాయి. ఇష్టమైన వంటకాలను తినాలనే కోరిక ఉండే ఆహారప్రియుల కల త్వరలో నెరవేరనుంది. గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ యూరోపియన్ స్టైయిల్లో ‘ఈట్ స్ట్రీట్స్’ను అభివృద్ధి చేయాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా సాగర్‌నగర్ వద్ద ఒకటి, డిఫెన్స్ కాలనీ వద్ద మరొకటి ఏర్పాటుకు సిద్ధమయ్యింది. ఇందుకు అనుగుణంగా టెండర్లను కూడా ఆహా్వనించింది. ఈట్ స్ట్రీట్స్ పేరుతో అందమైన ఆర్చ్‌తో ఆహార ప్రియులను ఆహ్వానించనున్నాయి. మొత్తం రూ.6.24 కోట్లతో అభివృద్ధి చేయనున్న ఈట్ స్ట్రీట్స్.. వైజాగ్ వాసులకు కొత్త వంటకాల రుచులను పరిచయం చేయనున్నాయి. ఆధునిక పద్ధతిలో.. ఆధునిక పద్ధతిలో ఈట్ స్ట్రీట్స్‌ను అభివృద్ధి చేస్తున్నాం. ప్రజలు పెద్దగా ఉపయోగించని ప్రదేశాలను ఇందుకోసం ఎంపిక చేశాం. యూరోపియన్ స్టైల్లో అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు రచించాం. వెరైటీ వంటకాలకు ఈట్ స్ట్రీట్స్ కేంద్రంగా మారనున్నాయి. నగరవాసులు ఆహ్లాదంగా సేద తీరేందుకు ఈట్ స్ట్రీట్స్ రానున్న రోజుల్లో దోహదం చేయనున్నాయి. – సాయికాంత్ వర్మ, జీవీఎంసీ కమిషనర్ నగర వాసుల కోసం ప్రజలకు ఎప్పటికప్పుడు కొంగొత్తగా విశాఖ నగరాన్ని పరిచయం చేసేందుకు జీవీఎంసీ ప్రయత్నిస్తోంది. ఇప్పటికే వైఎస్సార్ వ్యూ పాయింట్‌తో పాటు రోడ్లు, ఫుట్‌పాత్‌లు, సెంట్రల్ మెరిడీయన్ అభివృద్ధి చేస్తున్నాం. కొత్త బీచ్‌లను అభివృద్ధి చేస్తున్నాం. రానున్న రోజుల్లో మరింతగా నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నాం. ఆహార ప్రియులకు కొంగొత్త వంటకాలతో పాటు ప్రశాంతమైన వాతావరణంతో ఈట్ స్ట్రీట్స్‌ను అభివృద్ధి చేస్తున్నాం. అధునాతన పద్ధతిలో అభివృద్ధి చేయనున్న ఈట్ స్ట్రీట్స్ నగర వాసులను ఆకట్టుకోనున్నాయి. టెండర్లు పూర్తి అయిన తర్వాత 6 నెలల్లో వీటిని ఏర్పాటు చేయనున్నాం. – గొలగాని హరి వెంకట హరికుమారి, జీవీఎంసీ మేయర్ రూ. రూ. 6.24 కోట్లతో.. వాస్తవానికి ఈట్ స్ట్రీట్స్ ఏర్పాటు చేయాలని జీవీఎంసీ ఎప్పటి నుంచో భావిస్తోంది. అయితే, ఇప్పటివరకు అడుగు ముందుకు పడలేదు. ఈ నేపథ్యంలో పార్క్ హోటల్‌కు ఎదురుగా ఉన్న డిఫెన్స్ కాలనీ వద్ద, సాగర్‌నగర్‌లో ఒకటి ఏర్పాటు చేసేందుకు తాజాగా జీవీఎంసీ అడుగులు వేసింది. డిఫెన్స్ కాలనీ వద్ద రూ. 3.24 కోట్ల వ్యయంతో, సాగర్‌నగర్ వద్ద రూ.మూడు కోట్ల వ్యయంతో వీటిని ఏర్పాటు చేయనున్నారు. యూరోపియన్ స్టైయిల్లో ఈ ఈట్ స్ట్రీట్స్‌ను అభివృద్ధి చేయనున్నారు. 6 నెలల కాలంలో పూర్తి చేయాలని భావిస్తోంది. అన్ని వేళల్లో అందుబాటులో.. జీవీఎంసీ ఏర్పాటు చేయనున్న ఈట్స్ట్రీట్స్ను ఆధునిక పద్ధతిలో అభివృద్ధి చేయనున్నారు. మనకు కావాల్సిన వివిధ రకాల వంటకాలు ఇక్కడ లభించడంతో పాటు అప్పటికప్పుడు మన కళ్ల ముందే తయారుచేయడాన్ని కూడా ఎంజాయ్ చేసే వీలు కలగనుంది. అంతేకాకుండా విశాలమైన స్థలం...ప్రశాంతంగా వంటకాలను ఆస్వాదించడం ఇక్కడి ప్రత్యేకత. రాత్రి, పగలు అనే తేడా లేకుండా అన్ని సమయాల్లో అందుబాటు ఉండనుంది. ఇష్టమైనవి తింటూ..కూల్ డ్రింక్స్ తాగుతూ ఎంజాయ్ చేసేలా అభివృద్ధి చేసేందుకు జీవీఎంసీ తీర్చిదిద్దనుంది. ఈట్స్ట్రీట్స్ డిజైన్లను కూడా ఇప్పటికే జీవీఎంసీ తయారు చేసింది. మొత్తంగా విశాఖ వాసులకు త్వరలో వెరైటీ వంటకాల కోసం ఈట్ స్ట్రీట్స్ అందుబాటులోకి రానున్నాయి. (చదవండి: ఆ చెట్టు ఆకులు తెల్ల చుట్టుకి చెక్ పెడితే..వాటి పువ్వులు ఏమో..) -
మాది దిగువ వీధి కాదు..ఇందిరా నగర్
‘కీజ తెరు’ అనంటే తమిళంలో ‘దిగువ వీధి’ అని అర్థం. ప్రతి ఊరిలో దిగువ వీధి ఉంటుంది. దిగువ వీధిలో ఎవరుంటారో ఊరి వారికి తెలుసు. దళితులు. వారు నివసించే ప్రాంతాన్ని ఆ విధంగా గుర్తిస్తారు. ‘ఇలా పేరులో వివక్షను తొలగించండి’ అని తమ వాడ పేరును మార్చడానికి సంవత్సరం పాటు పోరాడింది అనసూయ అనే అమ్మాయి. దిగువ వీధికి బదులుగా వారి వీధి మొన్నటి జూలై 1న ‘ఇందిరా నగర్’ అయ్యింది. వివక్ష గుర్తులను చెరిపే పోరాటం కొనసాగిస్తానని అంటోంది అనసూయ. తమిళనాడు ముఖ్యమంత్రిగా స్టాలిన్ పదవి స్వీకరించాక 2022 అక్టోబర్‌లో గ్రేటర్ చెన్నై అంతటా కులాలను సూచించే వీధుల పేర్లను, భవంతుల పేర్లను తొలగించవలసిందిగా ఆదేశించాడు. దేశంలో అన్నిచోట్ల ఉన్నట్టే తమిళనాడులో కూడా ఊళ్లలోని కొన్ని వీధులను కులాల పేర్లతో పిలవడం వాడుకలో ఉంది. సామాజిక స్పృహ పెరిగాక ఈ ధోరణి తగ్గినా చైతన్యం ఎంతో అవసరం ఉంది. ముఖ్యంగా దళితుల విషయంలో. వీరికి ఆలయాల ప్రవేశంలోగాని, ఊరి కట్టుబాట్లలో ప్రాధాన్యం ఇవ్వడంలోగాని వివక్ష పాటిస్తున్నారనే ఎన్నో వార్తలు తమిళనాడు నుంచి వింటూ ఉన్నాం. ఈ నేపథ్యంలో అనసూయ శరవణ ముత్తు అనే 28 ఏళ్ల సివిల్ ఇంజినీర్ తన ఊరిలోని తన వాడకు మర్యాదకరమైన పేరు సాధించడంలో విజయం పొందింది. ఆది ద్రావిడార్ తెరు తమిళనాడులోని అరియలూర్ జిల్లాలో ఆనందవాడి అనే చిన్న పల్లె ఉంది. ఆ పల్లెలో 1994లో దళితులకు పట్టాలిచ్చారు. 2000 సంవత్సరానికి 100 కుటుంబాలు అక్కడ ఇళ్లు కట్టుకుని తమ పేటకు ‘ఇందిరా నగర్’ అని పేరు పెట్టుకున్నారు. అయితే వారు పెట్టుకునే పేరు వారు పెట్టుకోగా ఊరు వారిని తాను ‘ఎలా గుర్తించాలనుకుంటున్నదో’ అలా గుర్తించి ఆ పేటను ‘ఆది ద్రావిడార్ తెరు’, ‘పార తెరు’, ‘ఆది ద్రావిడార్ తెరు’, ‘కీజ తెరు’, ‘దళిత కాలనీ’... ఇలా పిలవడం మొదలెట్టింది. ఇవన్నీ కూడా దళితులు నివసించే ప్రాంతాన్ని సూచించేవే. ‘నా చిన్నప్పుడు స్కూల్లో మా పేట పేరు చెప్పిన వెంటనే నేనెవరో పోల్చుకునేవారు. అప్పుడు నేను ఏమీ చేయలేకపోయాను’ అని ఇదే ప్రాంతం, సామాజిక వర్గం నుంచి చదువుకుని సివిల్ ఇంజనీర్ అయిన అనసూయ శరవణముత్తు అంది. ‘నేను కాలేజీ పూర్తి చేసి ఉద్యోగం కోసం వెళ్లిపోయాను. 2022లో తిరిగి వస్తే ఇంకా కులాన్ని సూచించే పేరుతోటే నా పేటను పిలుస్తున్నారు. ఇది ఎంతమాత్రం కుదరదు అని నిశ్చయించుకున్నాను’ అంది అనసూయ. అందరితో పోరాడి... ఇందిరా నగర్ అనే పేరును రెవిన్యూ వారు ఏ మాత్రం పట్టించుకోకుండా ‘దిగువ వీధి’ అనే పేరుతోనే వీరి పేటను రికార్డుల్లో నమోదు చేసుకున్నారు. అలాగే రేషన్ కార్డుల్లో, ఆధార్ కార్డుల్లో, ఓటర్ కార్డుల్లో, చివరకు పాస్‌పోర్టుల్లో కూడా ఇందిరా నగర్ అని తప్ప రకరకాల వివక్ష పేర్లతో ఇక్కడ నివసిస్తున్న దళితుల గుర్తింపు కార్డులు నమోదై ఉన్నాయి. దాంతో అనసూయ 2022 ఆగస్టు నుంచి పోరాటం మొదలెట్టింది. ‘మొదట కలెక్టర్ చుట్టూ తిరిగాను. తిప్పించుకుని తిప్పించుకుని అక్టోబర్ నాటికి అఫీషియల్‌గా రికార్డుల్లో మార్చారు. కాని అసలు సమస్య పంచాయతీతో వచ్చింది. ఆనందవాడి పంచాయతీ మా పేటను దిగువ వీధి అని పిలవకూడదనే తీర్మానం చేయడానికి ఏమాత్రం ముందుకు రాలేదు. నేను పోరాడితే ఫిబ్రవరిలో తీర్మానం చేశారు. ఆ తర్వాత పంచాయితీ పెద్దలొచ్చి మా పేట ముందు బోర్డు పెట్టే కార్యక్రమంలో పాల్గొనమని ఎన్నిసార్లు తిరిగినా రాలేదు. దాని కోసం మళ్లీ పోరాడాల్సి వచ్చింది. చివరకు మొన్న జూలై 1న పంచాయతీ పెద్దలంతా వచ్చి బోర్డును నిలబెట్టి వెళ్లారు’ అని తెలిపింది అనసూయ. వివక్షాపూరితం వెనుకబడ్డ, దళిత వర్గాలను సులువుగా గుర్తించేందుకు ఎప్పటి నుంచో వారు నివసించే ప్రాంతాలకు వివక్షాపూరితమైన పేర్లు పెట్టే ఆనవాయితీ ఉందని ఈ ఉదంతం విన్నాక అనసూయను అభినందిస్తూ విల్లుపురం ఎంపీ రవికుమార్ అన్నారు. ‘నువ్వు ఎక్కడుంటావు అనే ప్రశ్నతో ఎదుటివారి కులం ఏమిటో ప్రాంతాన్ని బట్టి అర్థమవుతుంది. దీంతో వివక్ష మొదలవుతుంది. ఇలాంటి వివక్షాపూరితమైన పేర్లను రాష్ట్రమంతా తొలగించాలి’ అని రవికుమార్ అన్నారు. అనసూయలాంటి అమ్మాయిలు పూనుకుంటే అదెంత సేపు? -
Kiss Street In Mexico: ఇక్కడ భాగస్వామికి ఒక్కసారైనా కిస్ పెట్టాల్సిందే!
ప్రపంచంలో వింత ఆచారాలకు కొదవేలేదు. ఈ ప్రపంచంలో మనిషి పుట్టిన దగ్గర నుంచి మరణించేవరకూ ఏదో ఒక ఆచారానికి కట్టుబడి ఉంటాడని అనడంలో అతిశయోక్తి లేదు. ఇదేవిధంగా కొన్ని విచిత్రమైన ఆచారాలు కొనసాగే ప్రాంతాలను కూడా అప్పుడప్పుడు చూసి ఉంటాం. లేదా విని ఉంటాం. అటువంటిదే.. ‘కిస్’తో ముడిపడి ఉన్న ఆచారాన్ని పాటించే ప్రాంతం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. జీవితంలో ఒక్కసారైనా కపుల్స్ ఆ ప్రాంతానికి వెళ్లి ముద్దుల వర్షం కురిపించుకోవాలనుకుంటారు. అయితే ఈ ప్రాంతం ఎక్కడుంది? ముద్దులతో కూడిన నమ్మకాల వెనుక ఆధారమేమిటి? ఈ వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. ఈ వింత ప్రాంతం ఎలా ఉంటుందంటే.. ఈ ప్రాంతం ఒక బిల్డింగ్ లేదా ఏదో ధార్మిక స్థలమో కాదు. అది ఒక గల్లీ. దానిని కిస్ స్ట్రీట్ అని అంటారు. అది ఎంత ఇరుకైనదంటే ఒక జంట మాత్రమే దానిలోకి వెళ్లే వీలుంటుంది. ఒక్కొక్క జంటమాత్రమే వెళ్లేందుకు అవకాశం ఉన్నందున ఇక్కడ వేల జంటల క్యూ కనిపిస్తుంది. వీరంతా ఒక జంట తరువాత మరొక జంట ఈ గల్లీలోకి వెళుతుంటారు. అక్కడ కిస్ చేసుకుని తిరగివస్తారు. ఈ గల్లీ ఎక్కడుందంటే.. ఈ గల్లీ మెక్సికోలోని గువానాజువాటోలో ఉంది. దీనిని ‘ఎలో ఆఫ్ ది కిస్’ అని అంటారు. ఇంటర్నెట్లో ఈ గల్లీకి సంబంధించిన వివరాలు, ఫొటోలు విరివిగా కనిపిస్తాయి. మన దేశంలో కనిపించే అత్యంత ఇరుకైన గల్లీ మాదిరిగా ఇది ఉంటుంది. ఇక్కడి కిస్ వెనుక నమ్మకమిదే.. ఈ గల్లీకి సంబంధించిన ఒక కథ ప్రచారంలో ఉంది. ఒకానొకప్పుడు ఒక జంట పరస్పరం ఎంతో ప్రేమ కలిగివుండేది. ఈ జంటలోని యువతి ధనవంతురాలు. యువకుడు పేద ఇంటికి చెందినవాడు. వారు రహస్యంగా ఇక్కడికి వచ్చి, కిస్ చేసుకునేవారు. అయితే ఆ యువతి ఇంటిలోని వారు వీరి ప్రేమను వ్యతిరేకించారు. అయినా ఆ యువతి ఈ స్ట్రీట్‌కు వచ్చి అతనిని కలుసుకునేది. దీంతో కుటుంబ సభ్యులు ఆమెను హత్య చేశారు. ఫలితంగా వారి ప్రేమ అక్కడితో ముగిసిపోయింది. అయితే వారి ప్రేమ గాథను కలకాలం జీవింపజేసేందుకు వేల జంటలు ఇక్కడికి వచ్చి ముద్దులు పెట్టుకుంటాయి. ఈ గల్లీలో కిస్ చేసుకుంటే జంటల మధ్య ప్రేమ పెరుగుతుందని స్థానికంగా ప్రచారంలో ఉంది. ఇది కూడా చదవండి: ఏది ఇంపు?.. ఏది కంపు?.. సీక్రెట్ వెనుక సింపుల్ లాజిక్! -
పొరుగింటిలో 34 పెంపుడు కుక్కలు వీరంగమాడుతున్నాయని..
యూపీలోని లక్నోలో శునకాల వీరంగంతో జనం ఏ స్థాయిలో భయపడుతున్నారంటే చివరికి ఇంటిని కూడా అమ్మేసుకునేందుకు సిద్ధం అవుతున్నారు. లక్నోలోని జానకీపురంలో ఉంటున్న ఒక వృద్ధ జంట ఎదురింటిలోని కుక్కలకు భయపడి తమ ఇంటిని విక్రయించేందుకు సిద్ధం అయ్యారు. ఉత్తరప్రదేశ్‌లో చోటుచేసుకున్న ఈ విచిత్ర ఉదంతానికి సంబంధించిన వివరాల్లోకి వెళితే లక్నోలోని జానకీపురం ప్రాంతానికి చెందిన ఒక వృద్ధ జంట ఇటీవలే స్థానికంగా ఉన్న ఒక ఇంటిని కొనుగోలు చేశారు. అయితే వారు ఈ ఇంటిలోకి అడుగుపెట్టగానే వారికి కుక్కల బెడద మొదలయ్యింది. దీంతో వారు తాము ఉంటున్న ఇంటిని వెంటనే అమ్మివేయాలని భావిస్తూ, ఇంటి బయటి గేటుకు ‘ఇల్లు అమ్మబడును’ అనే బోర్డు తగిలించారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం ఈ ప్రాంతంలోని ఒక ఇంటిలోని వారు ఏకంగా 34కు మించిన కుక్కలను పెంచుతున్నారని,ఈ కుక్కలు రోజుంతా ఈ ప్రాంతంలో తిరుగుతూ అందరినీ వెంబడిస్తున్నాయని, చిన్నారులను భయపెడుతున్నాయని, కరుస్తున్నాయని తెలిపారు. వీటికి భయపడే ఆ వృద్ధ దంపతులు తమ ఇంటిని విక్రయించాలనుకుంటున్నారని అన్నారు. స్థానికుల ఫిర్యాదు మేరకు నగరపాలక సంస్థ అధికారులు ఆ కుక్కల యజమానికి నోటీసు అందించారు. కాగా లక్నోలో పెంపుడు కుక్కలు మనుషులపై దాడులకు దిగిన ఘటనలు అనేకం ఉన్నాయి. ఒక పిట్‌బుల్ డాగ్ తన యజమానిపై తీవ్రంగా దాడి చేయడంతో అతను మృతి చెందాడు. ఇదేవిధంగా రిటైర్డ్ టీచర్ సుశీల్(82) కూడా శునకాల దాడిలో కన్నుమూశారు. ఇది కూడా చదవండి: ఆ రాష్ట్రాన్ని కుదిపేస్తున్న ‘నీటిగండం’.. రాబోయే రోజుల్లో.. -
ఛేజ్ చేసి..నడి వీధిలో చుట్టుముట్టి..అందరూ చూస్తుండగానే..
తమిళనాడు:తమిళనాడులోని కరైకూడి జిల్లాలో దారుణం జరిగింది. నిత్యం రద్దీగా ఉండే కాలనీలో ఐదుగురు కలిసి ఓ యువకున్ని అందరూ చూస్తుండగానే హత్య చేశారు. బాధితున్ని వెంబడించి కర్రలతో దాడి చేసిన అమానవీయ దృశ్యాలు సీసీటీవీలో రికార్డ్ అయ్యాయి. బాధితున్ని మధురైకి చెందిన వినీత్‌గా పోలీసులు గుర్తించారు. ఓ మర్డర్ కేసులో పోలీస్ స్టేషన్‌కు వచ్చి సంతకం చేయడానికి బయటకు వచ్చాడు. ఇంతలోనే ఐదుగురు వ్యక్తులు ఎస్‌యూవీలో వెంబడించి బాధితున్ని చుట్టుముట్టారు. అనంతరం కర్రలతో తీవ్రంగా కొట్టారు. నిత్యం రద్దీగా ఉండే కాలనీలో అందరూ చూస్తుండగానే ఈ ఘటన జరిగింది. దుండగులు ఘటనాస్థలం నుంచి పారిపోగా.. బాధితున్ని ఆస్పత్రికి తరలించారు. కానీ అతడు అప్పటికే మృతి చెందినట్లు పోలీసులు గుర్తించారు. బాధితుడు ఓ కేసులో కండిషన్ బెయిల్‌పై బయటకు వచ్చాడని పోలీసులు తెలిపారు. ఇద్దరు స్నేహితులతో కలిసి లాడ్జ్‌లో ఉంటున్నట్లు చెప్పారు. బాధితుని స్నేహితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దుండగుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఇదీ చదవండి:వడగాల్పుల దెబ్బకు 54 మంది మృతి.. ఆస్పత్రుల్లో స్ట్రెచర్లు లేక భుజాలపైనే.. -
ప్రపంచంలోని టాప్ 10 స్ట్రీట్ మర్కెట్స్
-
షాకింగ్ ఘటన: కొండచిలువనే ఆయుధంగా..వ్యక్తిపై దాడి
కొందరూ తమ పెంపుడు జంతువులను, పక్షులను ప్రేమగా చూసుకుంటున్నట్లు కలరింగ్ ఇస్తారు. నిజానికి కొందరూ వారికేదో సరదా హాబీలా పెంచుతారు. తమకు ఇబ్బంది లేదా కష్టం అనుకుంటే వాటి ప్రాణాలు తీసేందుకు లేదా వాటిని ప్రమాదంలో పడేయడం వంటివి చేస్తారు. అచ్చం అలానే ఇక్కడో వ్యక్తి ఓ పెంపుడు కొండచిలువ పట్ల అలానే వ్యవహరించాడు. ఈ ఘటన కెనడాలో చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే..కెనడాలోని టొరంటోలో ఓ వ్యక్తి తన పెంపుడు కొండచిలువను ఆయుధంగా ఉపయోగించుకుని దాడికి దిగుతాడు. పాపం ఆ వ్యక్తిని నడి రోడ్డుపై ఆ పెంపుడు పాముని తాడు మాదిరిగా చేసుకుని ఇష్టారీతిలో కొడుతుంటాడు. అవతల వ్యక్తి తనను తాను రక్షించుకునేందుకు యత్నించినా కూడా వదలకుండా అలా దాడి చేస్తూనే ఉన్నాడు. సరిగ్గా అదే సమయంలో పోలీసు వాహానం అటుగా రావడంతో వెంటనే సదరు వ్యక్తిని ఆపి అదుపులోకి తీసుకున్నారు. ఆ దారుణానికి పాల్పడిన వ్యక్తిని టోరంటో నివాసి 45 ఏళ్ల లారేనియో అవిలాగా గుర్తించి అరెస్టు చేయడమే గాక ఒక ప్రాణిని ఇబ్బందులకు గురి చేసినందుకు పలు కేసులు నమోదు చేసి కోర్టులో హాజర్చారు కూడా. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో నెట్టింట హల్చల్ చేస్తోంది. Dude uses his pet snake as a weapon during street fight in Toronto 😳 pic.twitter.com/T2lLKaLe4E — Crazy Clips (@crazyclipsonly) May 13, 2023 (చదవండి: పదేళ్లు జైల్లో పెట్టేలా కుట్ర! అయినా తగ్గేదేలే! నాచివరి..!: ఇమ్రాన్ ఖాన్) -
ఊరు కాదు వీధి
ఈ ఫొటోలో కనిపిస్తున్నది ఒక ఊరు అనుకుంటే పొరపాటే. అదొక వీధి. అక్కడ ఏకంగా 6 వేల మంది నివసిస్తున్నారు. ఆ వీధి మొదలు ఎక్కడుందో, చివర ఎక్కడుంటుందో అక్కడ నివసించే వారికే సరిగ్గా తెలీదు. ఇలాంటి వీధి పోలండ్‌లో ఉంది. ఈ వీధికి సంబంధించిన ఏరియల్ వ్యూ ఫొటో ఇటీవల వైరల్‌గా మారింది. దక్షిణ పోలండ్‌లో సులోస్జోవా అనే పట్టణంలో ఈ వీధి ఉంది. దీని పొడవు ఏకంగా తొమ్మిది కిలో మీటర్లు. ప్రపంచంలోనే అతి పెద్ద వీధి ఇదే. ఇరువైపులా పచ్చని పంట పొలాలతో, పొందికగా అమర్చిన ఇళ్లతో ఈ వీధి ఫొటోలను చూసి నెటిజన్లు ఫిదా అయిపోయారు. -
రాజమండ్రిలో నేడు ప్రారంభంకానున్న హ్యాపీ స్ట్రీట్
-
ప్రపంచంలో ఎక్కడా లేదు.. ఆ వీధిలో అడుగుపెడితే 70 భాషలు వినిపిస్తాయ్!
ప్రపంచంలోని చాలా నగరాల్లో బహుభాషలు వినిపిస్తుంటాయి. నగర విస్తీర్ణం, ప్రాధాన్యం బట్టి అలా వినిపించే భాషలు పదుల సంఖ్యలో ఉండటమూ మామూలే! చిన్నా చితకా పట్టణాల్లోనైతే సాధారణంగా రెండు మూడు భాషలు; మహా అయితే, అరడజను భాషలు వినిపిస్తాయి. బ్రిటన్‌లోని ఒక చిన్న నగరంలో ఉన్న ఆ వీథి భాషావైవిధ్యానికి కేరాఫ్ అడ్రస్‌గా నిలుస్తుంది. ఈ వీథిలోకి అడుగుపెడితే, ఏకంగా డెబ్బయి భాషలు వినిపిస్తాయి. ఇంతటి భాషా వైవిధ్యమున్న వీథి ప్రపంచంలోని మరే నగరంలోనూ, పట్టణంలోనూ లేదు. ఇంతటి వైవిధ్యభరితమైన వీథి బ్రిటన్‌లోని గ్లూసెస్టర్ నగరంలో ఉంది. ఈ నగర జనాభా 1.32 లక్షలు. ఈ నగరంలోని బార్టన్ స్ట్రీట్‌లో రకరకాల ఆర్థిక తరగతులకు చెందిన వారు, నానా దేశాల వారు నివాసం ఉంటుంటారు. ఈ వీథి సందుల్లో పేదలు ఉండే నివాసాలు ఎక్కువగా కనిపిస్తాయి. ఇక్కడ స్థానిక ఇంగ్లిష్ ప్రజలతో పాటు తూర్పు యూరోప్‌లోని నానా దేశాల వారు, కరీబియన్ దీవుల నుంచి వచ్చినవారు, ఆఫ్రికాలోని పలు దేశాలకు చెందిన వారు, మన భారతీయులు ఉంటుంటారు. ఈ వీథిలో పశ్చిమాసియా నుంచి వలస వచ్చిన ముస్లింలు పెద్దసంఖ్యలోనే కనిపిస్తారు. ఇక్కడి వారు బయట ఇంగ్లిష్ మాట్లాడినా, ఇళ్లల్లో తమ తమ మాతృభాషల్లోనే మాట్లాడుకుంటారు. ఈ వీథిలో కనిపించే భాషావైవిధ్యం ఇంకెక్కడా కనిపించదని ఇక్కడి స్థానికులు గర్వంగా చెప్పుకుంటారు. -
ఘోర అగ్ని ప్రమాదం...దుకాణాలు ఆహుతి
ఒక స్ట్రీట్ మార్కెట్లో ఘోర అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. దీంతో దుకాణాలన్ని ఆహుతయ్యాయి. ఈ ఘటన ముంబైలోని ఫ్యాషన్ స్ట్రీట్‌లో శనివారం చోటు చేసుకుంది. ఈ ఘటనలో కొన్ని వస్త్ర దుకాణాలు, హ్యాండ్ బ్యాగ్ దుకాణాలు ఆహుతైనట్లు అధికారులు తెలిపారు. చాలా తక్కువ ఖరీదుకి వస్తువులు లభించే ముంబైలోని ప్రసిద్ధ మార్కెట్ అని చెబుతున్నారు. ఐతే ఎంత ప్రాణ, ఆస్తి నష్టం జరిగిందనేది తెలియలేదు. ఆ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మాధ్యమంలో తెగ వైరల్ అవుతోంది. Fire in shops of Fashion street #mumbai@mybmc @MumbaiPolice pic.twitter.com/qZqZ0L90Eg — Indrajeet chaubey (@indrajeet8080) November 5, 2022 #WATCH | Maharashtra: Fire broke out at 10-12 shops at Fashion Street in Mumbai today. It has now been extinguished. No casualties/injuries reported. pic.twitter.com/IboH8OMEkI — ANI (@ANI) November 5, 2022 (చదవండి: రోడ్డుపై చిరుత కలకలం... భయపెట్టించేలా పరుగు తీసింది) -
రద్దీ మార్కెట్లో యువతి ‘దిల్బర్’ స్టెప్పులు.. నీ కంటే అతనే బెటర్!
యువత సోషల్ మీడియాను ఓ రేంజ్లో వినియోగిస్తున్నారు. ప్రతి ఒక్కరూ పాపులర్ పాటలకు, డైలాగ్‌లకు రీల్స్ చేసి ఇన్‌స్టాలో పోస్టు చేయడం కామన్‌గా మారిపోయింది. ఈ క్రమంలో ఫేమస్ అవ్వడం కోసం కొంతమంది మితిమీరి ప్రవర్తిస్తున్నారు. ఒక్కొక్కసారి మనం ప్రవర్తించే తీరు ఇతరులకు ఇబ్బంది కలుగుతుంది. దానిని పట్టించుకోకుండా రైల్వే స్టేషన్, బస్టాండ్, మార్కెట్ వంటి రద్దీ ప్రదేశాల్లో రీల్స్, డ్యాన్స్‌లు చేస్తుంటారు. అచ్చం ఇలాగే నడిరోడ్డుమీద ఓ యువతి డ్యాన్స్ చేసిన వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది. సుస్మితా సేన్ దిల్బర్ పాటకు ఓ యువతి రద్దీగా ఉన్న మార్కెట్ మధ్యలో డ్యాన్స్ చేసింది. బ్లూ కలర్ జీన్స్, టాప్ ధరించి స్టెప్పులు వేసింది. ఆమె డ్యాన్స్ చేస్తుంటే మార్కెట్లో ఉన్న వాళ్లంతా తననే చూస్తున్నారు. అయితే ఈ వీడియో వైరల్ కావడానికి కారణం యువతి మాత్రమే కారణం కాదు. ఆమె డ్యాన్స్ చేస్తుంటే వెనకాల ఓ ఆటో డ్రైవర్ తనను అనుకరించేందుకు ప్రయత్నించాడు. యువతి ఎలాంటి స్టెప్పులు వేస్తుందో చూస్తూ అచ్చం అలాగే చేసేందుకు ట్రై చేశాడు. వీళ్లు ఇలా చేస్తుంటే మార్కెట్లోని ప్రజలు వారిని చుట్టుముట్టి ఆసక్తికరంగా చూశారు. కాగా ఈ వీడియోపై నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. యువతితోపాటు ఆమె వెనకాల వ్యక్తి డ్యాన్స్‌ను చూసి పలువురు నవ్వుకుంటుంటే.. మరికొందరు ఇతరులకు ఇబ్బంది కలిగేలా బహిరంగ ప్రదేశాల్లో ఆ పిచ్చి గంతులు ఏంటని ప్రశ్నిస్తున్నారు. యువతి కంటే అతనే అందంగా డ్యాన్స్ చేశాడని కామెంట్ చేస్తున్నారు. अच्छा है आजकल रोड साइड लोगों को कंपनी मिल जाती है pic.twitter.com/PoLcw8U5Vs — 24 (@Chilled_Yogi) October 6, 2022 -
గూగుల్ గుడ్ న్యూస్: ‘స్ట్రీట్ వ్యూ’ని ఎంజాయ్ చేయండి!
న్యూఢిల్లీ: టెక్ దిగ్గజం గూగుల్ తాజాగా తమ గూగుల్ మ్యాప్స్‌లో ’స్ట్రీట్ వ్యూ’ ఫీచర్‌ను భారత మార్కెట్లో మరోసారి తీసుకొచ్చింది. హైదరాబాద్, చెన్నై, బెంగళూరు, ఢిల్లీ, ముంబై తదితర 10 నగరాల్లో 1,50,000 కి.మీ. విస్తీర్ణంలో ఇది బుధవారం నుండి అందుబాటులోకి వచ్చింది. ఇందుకోసం జెనెసిస్ ఇంటర్నేషనల్, టెక్ మహీంద్రాతో జట్టు కట్టినట్లు పేర్కొంది. స్థానిక సంస్థల భాగస్వామ్యంతో స్ట్రీట్ వ్యూను అందుబాటులోకి తేవడం ఇదే తొలిసారని వివరించింది. 2022 ఆఖరు నాటికి ఈ ఫీచర్‌ను 50 నగరాలకు విస్తరించే ప్రణాళికలు ఉన్నట్లు గూగుల్ పేర్కొంది. ఏదైనా ప్రాంతం ఇమేజీని 360 డిగ్రీల కోణంలో చూసేందుకు ఈ ఫీచర్ ఉపయోగపడుతుంది. గతంలోనే దేశీయంగా ప్రవేశపెట్టినప్పటికీ భద్రతా కారణాల రీత్యా పూర్తి స్థాయిలో విస్తరించేందుకు కేంద్రం అనుమతించలేదు. మరోవైపు, ట్రాఫిక్ సిగ్నల్ టైమింగ్‌లను మెరుగుపర్చేందుకు బెంగళూరు ట్రాఫిక్ పోలీస్ విభాగంతో కూడా జట్టు కట్టినట్లు గూగుల్ వివరించింది. త్వరలో హైదరాబాద్, కోల్‌కతాలోని స్థానిక ట్రాఫిక్ విభాగంతో కూడా ఈ తరహా ఒప్పందాలు కుదుర్చుకోనున్నట్లు గూగుల్ మ్యాప్స్ ఎక్స్పీరియెన్సెస్ వైస్ ప్రెసిడెంట్ మిరియం కార్తీక డేనియల్ తెలిపారు. -
ఇలా స్టెప్పులు వేయాలంటే గట్స్ ఉండాలి.. వీడియో వైరల్!
ప్రతి ఒక్కరిలో ఏదో ఒక టాలెంట్ తప్పకుండా ఉంటుంది. వారు తమ కళను ఒక్కోరకంగా వ్యక్తపరుస్తారు. తాజాగా, ఒక స్ట్రీట్ డ్యాన్సర్ నడి వీధిలో తన స్టెప్పులతో అదరగొట్టాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్‌గా మారింది. ఈ వీడియోలో ఒక స్ట్రీట్ డ్యాన్సర్.. మైకేల్ జాక్సన్‌లా అలవోకగా స్టెప్పులేసి అక్కడున్న వారిని మెప్పించాడు. డ్యాన్స్ అనే కాకుండా రకరకాల భంగిమలతో వెరైటీ స్టెప్పులు వేశాడు. ఒకసారి తాను బౌలింగ్ వేసినట్లు.. ఆ వెంటనే బౌండరీ కొట్టినట్టు భంగిమను మార్చేశాడు. నేలకు కొట్టిన బంతిలా పడుతూ.. లేస్తూ స్టన్నింగ్ స్టంట్లు చేశాడు. అంతలోనే గాలిలో పతంగిని లాగినట్లు కూడా స్టెప్పులు వేసి చూపరులను ఆశ్చర్యపరిచాడు. అంతలోనే జిమ్‌లో ఎక్సర్సైజ్ చేస్తున్నట్లుగా.. రకారకాల యాంగిల్స్‌లో స్టెప్పులు వేశాడు. తన స్టన్నింగ్ స్టెప్పులతో అక్కడి జనాలను షాకింగ్‌కు గురిచేశాడు. ఇది ఎక్కడ జరిగిందో వివరాలు తెలియవు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగ చక్కర్లు కొడుతుంది. కాగా, అతని స్టన్నింగ్ స్టెప్పులకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ఇలాంటి స్టెప్పులు వేయాలంటే గట్స్ ఉండాలంటూ కామెంట్లు చేస్తున్నారు. చదవండి: వైరల్: చీర కట్టులో చూడముచ్చటైన కేరళ యువతుల డ్యాన్స్ .. -
Telangana: డిస్కంలు ఇక ‘గల్లీ’ స్థాయికి!
సాక్షి, హైదరాబాద్: విద్యుత్ పంపిణీ సంస్థ (డిస్కం)లు సమీప భవిష్యత్తులో గల్లీ లకు మాత్రమే పరిమితం కానున్నాయి. 11 కేవీ లైన్లు, రోడ్డు పక్కన దిమ్మెలపై ఉండే డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్లు (డీటీలు), వీటి నుంచి వినియోగదారులకు విద్యుత్ సరఫరా చేసే లోటెన్షన్(ఎల్టీ) లైన్లు మాత్రమే వీటి నిర్వహణలో ఉండ నున్నాయి. డిస్కంల యాజమాన్యంలోని కీలకమైన 33 కేవీ వ్యవస్థను గంప గుత్తగా విద్యుత్ సరఫరా సంస్థ (ట్రాన్స్‌కో)కు అప్పగించాలని కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ తాజాగా రాష్ట్ర ప్రభుత్వాలకు సంచలన ఆదేశాలు జారీ చేసింది. దీంతో 33 కేవీ సరఫరా లైన్లు, 33/11 కేవీ సబ్స్టేషన్లు ట్రాన్స్‌కోకు బదిలీ చేయక తప్పని పరిస్థితి నెలకొంది. ఇదే జరిగితే డిస్కంల అజమాయిషీ కింద ఒక్క సబ్‌స్టేషన్ కూడా ఉండదు. నష్టాల తగ్గింపు, విద్యుత్ సరఫరాలో నాణ్యత పెంపుదల, సరైన వ్యూహ రచన కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్టు కేంద్రం పేర్కొంది. విద్యుత్ పంపిణీ రంగం ప్రైవేటీకరణకు ముమ్మర కసరత్తు చేస్తున్న కేంద్ర ప్రభుత్వం.. అందులో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్టు విద్యుత్ రంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. 33 కేవీ భారం తప్పించడానికే.. ప్రతిపాదిత విద్యుత్ చట్ట సవరణ బిల్లు–2021ను చట్టసభలు ఆమోదిస్తే విద్యుత్ పంపిణీ రంగంలో డిస్కంలకు పోటీగా ప్రైవేటు ఫ్రాంచైజీలు, ప్రైవేటు డిస్ట్రిబ్యూషన్ లైసెన్సీల ఆగమనానికి మార్గం సుగమనం కానుంది. 33 కేవీ వ్యవస్థను ట్రాన్స్‌కోకు అప్పగించిన తర్వాత విద్యుత్ పంపిణీ వ్యవస్థ నిర్వహణ సాంకేతికంగా సరళీకృతం కానుంది. కొత్తగా వ్యాపారంలోకి దిగే ప్రైవేటు ఫ్రాంచైజీలు, డిస్ట్రిబ్యూషన్ లైసెన్సీలకు ఇలా సులభంగా ఉండేందుకే కేంద్రం ఈ నిర్ణయం తీసుకుందనే చర్చ జరుగుతోంది. డిస్కంల 11 కేవీ వ్యవస్థను మాత్రమే అద్దెకు తీసుకోవడం ద్వారా ప్రైవేటు ఆపరేటర్లు తమ వినియోగదారులకు నేరుగా విద్యుత్ సరఫరా చేసి బిల్లులు వసూలు చేసుకోవడానికి ఈ వ్యవస్థ ఉపయోగపడనుందని నిపుణులు పేర్కొంటున్నారు. దశల వారీ అప్పగింతకు చర్యలు తీసుకోండి డిస్కంల 33 కేవీ వ్యవస్థ ఆస్తులను దశల వారీగా ట్రాన్స్‌కోకు అప్పగించేందుకు చర్యలు తీసుకోవాలని కేంద్రం ఈ నెల 1న రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులకు రాసిన లేఖలో సూచించింది. తొలి దశలో 33 కేవీ వ్యవస్థకు సంబంధించిన ఇంక్రిమెంటల్ అసెట్స్‌తో పాటు ఓవర్ లోడెడ్ అసెట్స్‌ను ట్రాన్స్‌కోకు అప్పగించాలని కోరింది. 33 కేవీ వ్యవస్థ నవీకరణ, ఆధునీకరణకు రాష్ట్ర ప్రభుత్వాలు ట్రాన్స్‌కోకు ఆర్థిక సహాయం చేయాలని తెలిపింది. లేనిపక్షంలో పవర్ గ్రిడ్‌తో ట్రాన్స్‌కో జాయింట్ వెంచర్‌ను నెలకొల్పడం ద్వారా 50:50 వాటా పెట్టుబడితో నవీకరణ, ఆధునీకరణ పనులు చేపట్టేందుకు చర్యలు తీసుకోవాలని కేంద్రం స్పష్టం చేసింది. నష్టాలను సాకుగా చూపుతూ.. ప్రస్తుతం ట్రాన్స్‌కో యాజమాన్యం పరిధిలో 400 కేవీ 220 కేవీ, 132/110 కేవీ, 66 కేవీ విద్యుత్ సరఫరా వ్యవస్థ ఉంది. దీని నిర్వహణలో ఉన్న 66 కేవీ–220 కేవీ స్థాయి వ్యవస్థల్లో కేవలం 1.72–2.39 శాతం నష్టాలు మాత్రమే ఉండగా, డిస్కంల నిర్వహణలో ఉన్న సబ్ ట్రాన్స్మిషన్ వ్యవస్థ (33 కేవీ వ్యవస్థ)లో భారీగా 4.8 శాతం నష్టాలున్నట్టు పవర్ గ్రిడ్ కార్పొరేషన్ సీఎండీ నేతృత్వంలోని ఓ కమిటీ తేల్చింది. ఈ నేపథ్యంలో డిస్కంల చేతిలో ఉన్న 33 కేవీ వ్యవస్థను ట్రాన్స్‌కోకు అప్పగించాలని ఈ కమిటీ చేసిన సిఫారసులను గత నెల 16న కేంద్రం ఆమోదించింది. ఒక్క శాతం నష్టాన్ని తగ్గించుకున్నా ఏటా రాష్ట్రాలకు రూ.4,495 కోట్ల నష్టాలు తగ్గిపోతాయని ఈ కమిటీ అభిప్రాయపడింది. రాష్ట్రంలో ట్రాన్స్‌కోకు బదిలీ కానున్న డిస్కంల ఆస్తులు.. ఆస్తులు టీఎస్ఎన్పీడీసీఎల్ టీఎస్ఎస్పీడీసీఎల్ 33 కేవీ లైన్లు (కి.మీలో) 10,993 13,458 33/11 సబ్స్టేషన్లు 1,405 1,622 డిస్కంలకు మిగలనున్న ఆస్తులు.. ఆస్తులు టీఎస్ఎన్పీడీసీఎల్ టీఎస్ఎస్పీడీసీఎల్ 11 కేవీ లైన్లు (కి.మీలో) 87,260 91,997 డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్లు 2,95,000 4,35,453 -
విదేశీ గడ్డపై వెలిగిన ఖ్యాతి.. న్యూయార్క్ వీధికి రామ్‌లాల్ పేరు
మన ఖ్యాతి మరోసారి విదేశీ గడ్డపై వెలిగింది. న్యూయార్క్‌లో ఓ వీధికి భారత మూలాలున్న వ్యక్తి పేరును పెట్టారు. ప్రముఖ మత గురువు, భాషా పండితుడు ‘ధర్మాచార్య’ పండిట్ రామ్‌లాల్ పేరుతో ఓ వీధికి నామకరణం చేయగా, క్వీన్స్ రిచ్మండ్ హిల్‌లో అధికారిక వేడుక నిర్వహించారు. గుయానా స్కెల్డాన్లో భారత మూలాలు ఉన్న కుటుంబంలో పుట్టి పెరిగారు రామ్‌లాల్. ఆయన అక్కడ స్వాతంత్ర్యోద్యమంలో పాల్గొన్నారు. 1979లో అమెరికా బ్రూక్లిన్కు వెళ్లి అక్కడో ఆస్పత్రిలో పని చేశారు. ఇండో-కరేబియన్ కమ్యూనిటీ లీడర్లలో ఒకరిగా ఎదిగారు. ఆర్య సమాజం తరపున పనిచేశారు. ముఖ్యంగా హిందీ భాషాభివృద్ధికి ఎంతో కృషి చేశారు. గుయానాలో ఉన్నప్పుడు టాగూర్ మెమొరియల్ స్కూల్లో భారతీయ విద్యార్థులకు హిందీ బోధించేవారాయన. 2019లో 90 ఏళ్ల వయసులో ఆయన కన్నుమూశారు. లిబర్టీ అవెన్యూ, 133వ వీధికి రామ్‌లాల్ పేరు పెట్టాలని ఇండో-కరేబియన్స్ నుంచి ప్రతిపాదనలు రాగా, జూన్ 27న న్యూయార్క్ మేయర్ బిల్ డె బ్లాసియో సంతకం చేశారు. దీంతో వీధికి రామ్లాల్గా నామకరణం పూర్తికాగా, అట్టహాసంగా జరిగిన ప్రారంభ వేడుకలో న్యూయార్క్ సిటీ కౌన్సిల్ అడ్రిన్నె అడమ్స్ పాల్గొన్నారు. ఇంతకు ముందు న్యూయార్క్‌లో రమేశ్ కాళిచరణ్ వే, జోనాథన్ నారాయిన్ వే, పంజాబ్ అవే, గురుద్వారా వే, లిటిల్ గుయానా అవెన్యూలుగా కొన్ని వీధులకు పేర్లు పెట్టారు. -
బామ్మకు బజారే దిక్కయింది..
వేములవాడ : రక్తం సంబంధం కుదరదు పొమ్మంటే.. ఆ వృద్ధురాలికి బజారు దిక్కయింది. మానవత్వంలేని మనవరాలి పనితో శతాధిక వయసులో రోడ్డుపైనే గడిపేస్తోంది. వివరాలు.. రాజన్న సిరిసిల్ల జిల్లా, వేములవాడ పట్టణానికి చెందిన వెంకట స్వామికి నలుగురు కూతుళ్లు. ఇందులో ఇద్దరు కూతుర్లు చనిపోయారు. పెద్ద కూతురికి తానే స్వయంగా ఇల్లు నిర్మించి ఇచ్చాడు. తన తల్లి (బామ్మ) చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతుంటే తాను కిరాయికి ఉంటున్న ఇంటివారు వెళ్లి పొమ్మన్నారు. దీంతో గత్యంతరం లేక వెంకటస్వామి తన తల్లిని తీసుకొని తన కూతురు సునీత ఇంటికి చేరాడు. అయితే, మనవరాలు శతాధిక వృద్ధురాలిని ఇంట్లోకి రానివ్వలేదు. దీంతో వెంకటస్వామి కూతురి ఇంటి ముందు టెంట్ వేసుకుని బజార్లోనే తల్లిని పడుకోబెట్టి అక్కడే కూర్చుండిపోయాడు. మాతృ దినోత్సవం రోజున బామ్మకు జరిగిన ఇబ్బందిపై కాలనీవాసులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. -
పుస్తకం చల్లగుండ
కోల్‌కతా పేరు వినగానే ప్రధానంగా రెండు విషయాలు మన మదిలో మెదులుతాయి. ఆ ప్రాంతానికే ప్రత్యేకమైన మిష్టి దోయి అనే తీపి వంటకం, రెండవది రవీంద్రనాథ్ ఠాగూర్ రచనలు. కోల్‌కతా లో మిష్టిదోయితో పాటు బెంగాలీల రుచికరమైన పదార్థాలు అమ్మే ఓ షాప్ ముందు ఇటీవల ఠాగూరు పుస్తకాలతో పాటు మరికొన్ని పుస్తకాలున్న ఓ పాత ప్రిజ్ లాంటి అల్మరా మన చూపుల్ని విశేషంగా ఆకట్టుకుంటుంది. కాళిదాస్ హర్దాస్, కుంకుమ్లు దంపతులు. కోల్‌కతాలోని పాటులీలో వీరిద్దరూ ఇటీవల స్ట్రీట్ లైబ్రరీని ప్రారంభించారు. తమ పాత ఫ్రిజ్‌ను పుస్తకాల అల్మరాగా మార్చారు. తినుబండారాలు అమ్మే షాప్ ఓనర్‌తో మాట్లాడి, ఆ షాపు బయట ఏర్పాటు చేసిన ఈ ఫ్రీ ఫ్రిజ్ బుక్ లైబ్రరీ అందరినీ ఆకట్టుకుంటోంది. ప్రజలలో పుస్తకపఠన అలవాటును పెంచడానికే ఈ ప్రయత్నం అంటున్నారు ఈ బెంగాలీ దంపతులు. ‘మేం పుస్తకాలను ఎంతగా ప్రేమిస్తున్నామో, ఆ ప్రేమను విస్తృతం చేయడం ద్వారా అంతగా సంతోషాన్ని పొందుతున్నాం’ అని చెప్పిన ఈ ఇద్దరూ షాప్ యజమానితో కలసి కోల్‌కతాలోని పాటులీలో ఉచిత వీధి గ్రంథాలయాన్ని తెరిచారు. షాప్ యజమాని తారాపోద్ కహార్ ను సంప్రదించి, అతని షాప్ ముందు ‘కొంత స్థలాన్ని పుస్తకాలు ఉంచడానికి ఉపయోగించవచ్చా’ అని అడిగారు. కహార్ వెంటనే వీరి ప్రతిపాదనను అంగీకరించాడు. దీంతో ఆ దుకాణం బయట పెద్దలు, యువకులు చదవడానికి వీలుగా పుస్తకాలతో నిండిన ఫ్రిజ్ అల్మరాను ఏర్పాటు చేశారు. సందేశాల ఫ్రిజ్ల్మరా! పాఠకులు ఉచితంగా ఒక పుస్తకాన్ని తీసుకొని ఒక నెల తర్వాత తిరిగి ఇవ్వమనే సందేశాన్ని ఫ్రిజ్‌కు పక్కన రాసి ఉంచారు. ఎవరైనా తమకు నచ్చిన, చదివిన పుస్తకాలను కూడా ఈ ఫ్రిజ్ బుక్ లైబరీ లో ఉంచచ్చు. సామాజిక మాధ్యమాల్లో ఈ బుక్ లైబ్రరీ గురించి తెలుసుకున్న ప్రజలు ఈ చొరవను ఇష్టపడ్డారు. ఇలాంటి లైబ్రరీలను మిగతా వారూ ప్రారంభించాలని, తామూ ఏర్పాటు చేస్తామని చెప్పారు. -
బ్రాందీ వద్దు బుక్స్ కావాలి
తెలుగు రాష్ట్రాలలో గ్రంథాలయాలు, పుస్తక పఠనం ఆదరణ కోల్పోతుంటే ‘సెవన్ సిస్టర్స్’గా పిలువబడే ఈశాన్య రాష్ట్రాల్లో ‘రోడ్‌సైడ్ లైబ్రరీ’ల ఉద్యమం ఊపందుకుంది. మిజోరామ్‌లో మొదలైన రోడ్‌సైడ్ లైబ్రరీలు ఇప్పుడు అరుణాచల్‌ప్రదేశ్‌కు పాకాయి. నారంగ్ మీనా అనే గిరిజన స్కూల్ టీచర్ అక్కడ ‘వైన్ షాపుల కంటే గ్రంథాలయాలే ఎక్కువ కనపడేలా చేస్తాను’ అంటూ ప్రతిన బూని పని చేస్తోంది. ‘మా అమ్మ నిరక్షరాస్యతే నాకు చదువు అవసరాన్ని తెలియచేసింది’ అని ఆమె అంటోంది. నెల క్రితం వార్తల్లో వచ్చిన మీనా నేడు ఏ విధంగా ఉద్యమాన్ని విస్తరిస్తున్నదో తెలిపే కథనం... రోడ్డు పక్కన పూల చెట్లు కనిపించడం బావుంటుంది. కాని ఆ చెట్లకు పుస్తకాలు కాయడం ఇంకా బాగుంటుంది. ఈశాన్యరాష్ట్రాల్లో కొసాకు ఉండే అరుణాచల్ ప్రదేశ్‌లో వీధిలో నడుస్తుంటే లైబ్రరీలు కనిపించే ఉద్యమం మొదలైంది. రోడ్డు పక్కన ఖాళీ స్థలంలో ఒక పుస్తకాల అర, రెండు బల్లలు, రాత్రి పూట చదువుకోవడానికి రెండు లైట్లు... దీనిని ‘రోడ్‌సైడ్ లైబ్రరీ’ అంటారు. అక్కడ ఎంతసేపైనా కూచుని పుస్తకం చదువుకోవచ్చు. నచ్చిన పుస్తకం పట్టుకుపోవచ్చు. ఇంట్లో తాము చదివేసిన పుస్తకాలను తెచ్చిపెట్టవచ్చు. గొప్ప మెదళ్లు రెండు చోట్ల తయారవుతాయి. ఒకటి తరగతి గదిలో. రెండు గ్రంథాలయంలో. గొప్ప వ్యక్తిత్వాలు కూడా ఈ రెండుచోట్లే రూపు దిద్దుకుంటాయి. ఆ విషయాన్ని కనిపెట్టింది ఇటానగర్‌కు చెందిన నారంగ్ మీనా అనే గవర్నమెంట్ స్కూల్ టీచర్. వెనుకబడిన తన రాష్ట్ర ప్రజలు ముఖ్యంగా మహిళలు చైతన్యవంతం కావాలంటే లైబ్రరీలే మార్గం అని ఆమె రోడ్‌సైడ్ లైబ్రరీల ఉద్యమం మొదలెట్టింది. చదవండి: (వీధిలో విజ్ఞాన వెలుగులు) నారంగ్ మీనా ఏర్పాటు చేసిన రోడ్ సైడ్ లైబ్రరీలు గ్రంథాలయం మనసుకు చికిత్సాలయం ‘ఏ లైబ్రరీ ఈజ్ ఏ హాస్పిటల్ ఫర్ ది మైండ్’ అని ఉంటుంది మీనా నిర్వహిస్తున్న ‘నారంగ్ లెర్నింగ్ సెంటర్’ ఫేస్బుక్ పేజీలో. నాలుగేళ్ల క్రితం మీనా అరుణాచల్ ప్రదేశ్‌లోని గిరిజన మహిళలు తమ స్వావలంబన కోసం వివిధ ఉపాధి మార్గాలలో నైపుణ్యం పొందే నురంగ్ లెర్నింగ్ సెంటర్‌ను స్థాపించింది. దాని కార్యకలాపాల్లో భాగంగా రోడ్‌సైడ్ లైబ్రరీల స్థాపన మొదలెట్టింది. మొదటి లైబ్రరీ నెల క్రితం అరుణాచల్ ప్రదేశ్ రాజధాని ఇటానగర్ నుంచి గంట దూరంలో ఉండే నిర్జులి అనే ఊళ్లో ఒక రోడ్డు పక్కన స్థాపించింది. ‘దాని కోసం నేను 20 వేల రూపాయలు ఖర్చు చేశాను. పది వేల రూపాయలు పుస్తకాలకు, పదివేలు స్టాండ్ తయారీకి’ అని నారంగ్ మీనా చెప్పింది. ‘మిజోరంలో ఇద్దరు అధ్యాపకులు (సి.లాంజువాలా, లల్లైసంగ్జూలీ) రోడ్‌సైడ్ లైబ్రరీలను స్థాపించారు. వారు అమెరికాలో ఇలాంటి లైబ్రరీలు చూసి స్ఫూర్తి పొందారు. వాటికి వచ్చిన ఆదరణ చూసి నేను ప్రేరణ పొందాను’ అని మీనా అంది. మంచి వైపు లాగడానికి ‘మేము పిల్లలకు చాక్లెట్లు ఇచ్చి వాళ్లను ఆకర్షించాము. కాని పెద్దలను లాక్కురావాలంటే పెద్ద పనే అయ్యింది’ అని నవ్వుతుంది మీనా. కాని మెల్లగా పెద్దలు కూడా వచ్చి కూచుంటున్నారు. ‘మా నాన్న రాజకీయాల్లో యాక్టివ్‌గా ఉండేవారు. కాని ప్రత్యర్థులు ఆయనను హత్య చేశారు. మా అమ్మ నిరక్షరాస్యురాలు. 13 ఏటే పెళ్లి చేసుకొని బాదరబందీల్లో ఇరుక్కుంది. నేను, నా చెల్లెలు బాగా చదువుకున్నాం. బెంగళూరులో చదివాక అమెరికా వెళ్లే వీలున్నా నా ప్రాంతానికి ఏదైనా చేయాలని వెనక్కి వచ్చాను. చూస్తే దారుణమైన వెనుకబాటుతనం. అవినీతి. విలువల్లేనితనం కనిపించాయి. విలువలు ఎక్కడి నుంచి వస్తాయి? పుస్తకాలు చదవకుండా వీళ్లు ఏం తెలుసుకుంటారు’ అనిపించి రోడ్‌సైడ్ లైబ్రరీ స్థాపించాను అందామె. వైన్‌షాపులు కాదు కావాల్సింది ‘వీధికొక వైన్‌షాప్ కాదు కావాల్సింది. లైబ్రరీ. మా రాష్ట్రంలో వైన్‌షాప్స్‌కు మించి లైబ్రరీలు కనిపించాలనేదే నా తపన.’ అందామె. నారంగ్ మీనా ప్రయత్నం దేశంలోనే కాదు విదేశాలలో కూడా ప్రచారం పొందింది. ఆమె లెర్నింగ్ సెంటర్‌కు కేరళ నుంచి పంజాబ్ వరకు ఎందరో రచయితలు, పుస్తక ప్రేమికులు పుస్తకాల బండిల్స్ పంపుతున్నారు. ‘మీ లైబ్రరీల్లో వీటిని ఉపయోగించుకోండి’ అని కోరుతున్నారు. నారంగ్‌కు తానేం చేస్తున్నదో స్పష్టత ఉంది. ‘మా రాష్ట్రంలో తిరప్ జిల్లా అత్యంత వెనుకబడిన ప్రాంతం. రోడ్‌సైడ్ లైబ్రరీలు ఎక్కువ కావాల్సింది అక్కడే. అక్షరాస్యతను పెంచాలన్నా చదువు మీద ఆసక్తి కలగాలన్నా లైబ్రరీలు కళ్ల ముందు కనిపిస్తూ ఉండాలి. నేను ఆ ప్రాంతం మీద ఫోకస్ పెట్టాను’ అంది నారంగ్. వాక్యం రాయలేని విద్యార్థులు ‘నేను టీచర్‌గా మా విద్యార్థులను చూస్తున్నాను. సొంతగా వాక్యం రాయడం రావడం లేదు. పుస్తకాలు చదవకుండా వీరికి భాష ఎలా తెలుస్తుంది. వ్యక్తీకరణ ఎలా పట్టుబడుతుంది? పుస్తకం చదవకపోతే మాతృభాషను కూడా కోల్పోతాం. తల్లిదండ్రులు పిల్లలను పుస్తకాలు చదవడానికి ప్రోత్సహించాలి. ఇందుకు గట్టిగా ప్రయత్నించాలి’ అంటుంది నారంగ్. ఆమెలాంటి వారు ఈ దేశానికి గట్టిగా వంద మంది చాలు... పుస్తకాల చెట్లు వీధి వీధిన మొలవడానికి. ఈశాన్యరాష్ట్రాల ఉద్యమం దేశమంతా పాకాలని కోరుకుందాం. – సాక్షి ఫ్యామిలీ -
కీలక నిర్ణయం : సంతల్లో షావోమి
సాక్షి, న్యూఢిల్లీ : దేశంలో చైనా వ్యతిరేక సెంటిమెంట్ రోజు రోజుకు పెరుగుతున్న సమయంలో చైనా స్మార్ట్‌ఫోన్ దిగ్గజం షావోమీ కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలోని మారుమూల ప్రాంతాలకు కూడా తమ విక్రయాలను విస్తరించాలని భావిస్తోంది. ఈ నేపథ్యంలోనే ఎంఐస్టోర్ ఆన్ వీల్స్ అనే సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. తద్వారా గ్రామీణ భారతీయ వినియోగదారులను చేరుకోవాలని యోచిస్తోంది. దేశంలో స్మార్ట్‌ఫోన్ విక్రయాల్లో టాప్ బ్రాండ్ షావోమి ట్రావెలింగ్ స్టోర్ ప్రారంభించింది. అంటే గ్రామీణులకు చేరువయ్యేలా నిర్దిష్ట ప్రదేశాల్లో ఆగుతూ, వారాంతపు సంతలు, ఉత్సవాల్లో తమ ఉత్పత్తులను విక్రయిస్తూ షావోమి సంత నిర్వహిస్తుందన్నమాట. ఇందులో స్మార్ట్ఫోన్లతోపాటు, స్మార్ట్ టీవీలు, సీసీటీవీ కెమెరాలు, ఇయర్ ఫోన్లు, సన్ గ్లాసెస్, పవర్ బ్యాంకులు ఇలా పలు ఉత్పత్తులను విక్రయించనున్నట్లు షావోమి సోమవారం విడుదల చేసిన ప్రకటనలో తెలిపింది. "ఎంఐస్టోర్-ఆన్-వీల్స్" ను ప్రారంభించడం సంతోషంగా ఉందని షావోమి ఇండియా సీఎండీ మనుకుమార్ జైన్ వెల్లడించారు. మూవింగ్ స్టోర్ ద్వారా రీటైల్ అనుభవాన్ని గ్రామీణులకు చేరువ చేస్తున్నామని ట్వీట్ చేశారు. అంతేకాదు ఈ ప్రాజెక్టును కేవలం 40 రోజుల్లో పూర్తి చేసిన తమ ఆఫ్‌లైన్ బృందానికి ధన్యవాదాలు తెలిపారు. మేడిన్ ఇండియా ఉత్పత్తులకు తాము 100 శాతం కట్టుబడి ఉన్నామని మరో ట్వీట్ లో జైన్ వెల్లడించారు. అన్ని ఉత్పత్తులను ఇండియాలో తయారు చేయడమే తమ లక్ష్యమని పేర్కొన్నారు. మేక్ ఇన్ ఇ్ండియా, మేక్ ఫర్ ఇండియన్స్, మేడ్ బై ఇండియన్స్ అంటూ ట్వీట్ చేశారు. తమ స్టోర్-ఆన్-వీల్స్ అవుట్లెట్లు ప్రస్తుత కరోనా సమయంలో పూర్తిగా సురక్షితంగా ఉంటాయని ఎంఐ ఇండియా సీఓఓ మురళీకృష్ణన్ తెలిపారు. అతిపెద్ద సింగిల్ బ్రాండ్ రిటైల్ నెట్వర్క్ ఉన్న తాము ఈ కొత్త ప్రయోగం ద్వారా దేశంలోని మారుమూల ప్రాంతాలకు కూడా చేరుకోనున్నామని చెప్పారు. కాగా కరోనా సంక్షోభం, లాక్ డౌన్, ఇండో-చైనా సరిహద్దు ఉద్రిక్తతలు, చైనా ఉత్పత్తులపై నిషేధం డిమాండ్ లాంటి ఎదురుదెబ్బల మధ్య కూడా షావోమి జూన్ త్రైమాసికంలో స్మార్ట్ ఫోన్ విక్రయాల్లో అగ్రస్థానంలో నిలిచింది. "Mi"les to go before we sleep! Excited to launch "#MiStore-on-wheels", an innovative concept that brings #retail experience to the heart of #India, connecting villages through a moving store. So proud of our #offline #team who completed this project in just 40 days. I ❤️ Mi pic.twitter.com/7OECCNnlgb — Manu Kumar Jain (@manukumarjain) September 21, 2020