దొంగతో బట్టలిప్పించిన మహిళ
బొగొటా: చోరీ చేయడానికి ప్రయత్నించిన దుండగుడికి మరచిపోలేని శిక్ష విధించింది ఓ మహిళ. స్థానికులు అందరూ చూస్తుండగానే చోరీకి యత్నించిన వ్యక్తిని మోకాళ్ల మీద కూర్చోబెట్టింది. తర్వాత అతని జట్టుపట్టుకొని బట్టలు విప్పాలని ఆదేశించింది. ఎంత ప్రతిఘటించినా వినకుండా..ఆఖరికి అండర్ వేర్ను కూడా విప్పించి నిలుచోబెట్టి చివరకు అలానే ఇంటికి పంపించింది.
దీనికి సంబంధించి వీడియోను స్థానికులు తీసి సోషల్ మీడియాలో పెట్టడంతో ఈ విషయం వెలుగు చూసింది. దక్షిణ అమెరికా కొలంబియాలోని బొగొటాలో ఈ సంఘటన చోటు చేసుకుంది.