strip
-
ఉక్రెయిన్ యుద్ధాన్ని నిరసిస్తూ.. నగ్నంగా నిలబడి..
ఉక్రెయిన్ యుద్ధాన్ని నిరశిస్తూ ఓ వ్యక్తి విచిత్రమైన రీతిలో నిరసన తెలిపాడు. వాటికన్ సిటీలో ప్రసిద్ధగాంచిని బసిలికా అనే చర్చిని చూసేందుకు చాలా మంది పర్యాటకుల వస్తుంటారు. ఓ పర్యాటకుడి మాదిరిగా సందర్శించడానికి వచ్చి అకస్మాత్తుగా బట్టలు విప్పి..చర్చి ప్రధాన ద్వారం వద్ద నగ్నంగా నిలబడి ఉన్నట్లు సమాచారం. అతను ఉక్రెయిన్ యుద్ధానికి వ్యతిరేకంగా నిరసన తెలిపినట్లు వాటికన్ మీడియా పేర్కొంది. అతను ఉక్రెయిన్ పిల్లలను కూడా రక్షించమని తన వీపుపై ఒక శాసనాన్ని కూడా చిత్రించడానికి వెల్లడించింది. అతని శరీరంపై వేలిగోళ్లతో గాయపరుచుకున్న గుర్తులు కూడా ఉన్నట్లు తెలిపింది. భద్రతా సిబ్బంది ఆ వ్యక్తిని గుర్తించి ఇటాలియాన పోలీసులకు అప్పగించినట్లు స్థానికి మీడియాలు పేర్కొన్నాయి. అంతేగాదు పలు ఇటాలియన మీడియా వైబ్సైట్లు ఆ సంఘటనకు సంబంధించి..పర్యాటకులు తీసిన ఫోటోలను కూడా ప్రశారం చేశాయి. (చదవండి: వీడియో: తుళ్లి కిందపడ్డ అమెరికా అధ్యక్షుడు.. 25వ సవరణ ఉసెత్తిన ట్రంప్) -
వెరైటీ వెడ్డింగ్ కార్డు! హర్ష గోయెంకా మనసును దోచింది!
ఇటీవలకాలంలో యువత తమ సృజనాత్మకతను జోడించి చాలా వినూతనంగా వివాహాలు చేసుకుంటున్నారు. అందర్నీ ఆకట్టుకునేలా ఔరా! అనిపించేలా వివాహాలు జరుపుకుంటున్నారు. కొంతమంది హంగు ఆర్భాటాలతో పెళ్లిళ్లు చేసుకుంటే మరికొంతమంది చాలా సింపుల్‌గా వివాహాలు చేసుకుని అందర్నీ ఆశ్చర్యచకితులను చేస్తున్నారు. అచ్చం అలానే ఇక్కడోక జంట భావించింది కాబోలు. ఆ నవ దంపతుల వివాహా ఆహ్వాన పత్రికను చూసే ఒక్కసారిగా షాక్ అవుతారు. అసలు విషయమేమిటంటే...ఆ దంపతులు తమ వెడ్డింగ్ కార్డు వెరైటీగా ఉండాలనుకున్నారు కాబోలు. అందుకోసం వారి వివాహా ఆహ్వాన పత్రికనే ఒక ట్యాబ్లెట్ స్టిప్స్ ఆకారంలో రూపొందించారు. ట్యాబ్లెట్ వెనుకవైపు ఉండే విభాగంలో ఆయా ట్యాబ్లెట్‌కి సంబంధించిన వివరాలు మాదిరిగా.. హెచ్చరిక, మాన్యుఫ్యాక్చరింగ్ వంటి తదితర అంశాలో వారి సమాచారం ఉంది. నిశితంగా చూస్తేనే అది ఆహ్వాన పత్రిక అని తెలుస్తుంది. పైగా చాలా ఫన్నీగా అనిపిస్తోంది కూడా. పెళ్లి పత్రికలో ఎలా అయితే వధువు, వరుడు వివరాలు ఉంటాయో అలానే అన్ని వివరాలు పొందుపరిచి ఉన్నాయి. ఇలాంటి ఆలోచన రావడం కూడా గ్రేట్. అంతేకాదండోయ్ వరుడు పేరు ఎళిలరసన్ ఫార్మసీ కాలేజ్‌లో అసిస్టెంట్ ప్రొఫెసర్ కాగా, వధువు వసంతకుమారి నర్సింగ్ కాలేజ్‌లో అసిస్టెంట్ ప్రోఫెసర్. తరుచు సోష్ల్ మీడియాలో యాక్టివిగ్ ఉండే ప్రముఖ వ్యాపారవేత్త ఆర్పీజీ చైర్మన్ హర్ష గోయెంకాను ఎంతగానో ఇంప్రెస్ చేసింది ఈ వివాహ పత్రిక. ప్రజలు చాలా కొత్తదనం కోరుకోవడమే కాదు వినూత్నంగా ఆలోచిస్తున్నారు అని కొనియాడారు. ఇది ఫార్మసిస్ట్ వివాహా ఆహ్వాన పత్రిక అంటూ...ఆ జంట ఆలోచనని ప్రశంసించారు. A pharmacist’s wedding invitation! People have become so innovative these days…. pic.twitter.com/VrrlMCZut9 — Harsh Goenka (@hvgoenka) August 20, 2022 (చదవండి: మెట్రో స్టేషన్‌పై వ్యక్తి హల్చల్.. పోయే కాలం అంటే ఇదేనేమో భయ్యా!) -
పోలీసులను హడలెత్తించిన మోడల్.. వీడియో వైరల్
ముంబై : ముంబైలోని ఓ అపార్ట్మెంట్లో జరిగిన వివాదానికి సంబంధించిన ఓ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. ఈ వివాదం ఈ నెల 25న జరిగినట్లు తెలుస్తోంది. వివరాలు.. మేఘ శర్మ అనే మోడల్ ముంబైలోని లోఖండ్వాలా కాంప్లెక్స్‌లోని ఓ అపార్ట్మెంట్లో పెయింగ్ గెస్ట్‌గా ఉంటోంది. ఈ క్రమంలో అపార్ట్మెంట్లో పనిచేసే సెక్యూరిటి గార్డ్ని పిలిచి సిగరెట్ ప్యాకెట్ తెమ్మని కోరింది. అర్థరాత్రి సమయం కావడంతో సెక్యూరిటి గార్డ్ అందుకు నిరాకరించాడు. దాంతో ఆగ్రహించిన శర్మ ఆ సెక్యూరిటి గార్డ్‌పై దాడికి దిగింది. అనంతరం పోలీసులకు ఫోన్ చేసింది. అపార్ట్మెంట్ వద్దకు చేరిన పోలీసులు శర్మను తమతో పాటు పోలీస్ స్టేషన్‌కి వచ్చి కంప్లైంట్ ఇవ్వాల్సిందిగా కోరారు. కానీ శర్మ అందుకు నిరాకరించింది. ఇంత రాత్రి పూట.. అది కూడా ఒక్క మహిళా కానిస్టేబుల్ కూడా లేకుండా మీతో పాటు ఇప్పుడు స్టేషన్‌కి రాలేను. రేపు ఉదయం పోలీస్ స్టేషన్‌కి వస్తానని తెలిపింది. ఇప్పుడు తనను తన ప్లాట్‌కి వెళ్లానివ్వాల్సిందిగా కోరింది. కానీ పోలీసులు అందుకు అంగీకరించలేదు. దాంతో సహనం కోల్పొయిన శర్మ పోలీసులపై అరుస్తూ తన ఒంటి మీద దుస్తులను తొలగించింది. ఈ అనూహ్య చర్యకు జడిసిన పోలీసులు అక్కడి నుంచి వెళ్లి పోయారు. అయితే అపార్ట్మెంట్లో జరిగిన ఈ వివాదానికి సంబంధించిన వీడియోను స్వయంగా శర్మనే సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దాంతో పాటు ‘ఇది మన ముంబై పోలీసుల పని తీరు. రాత్రి ఏడు తర్వాత మహిళలను పోలీస్ స్టేషన్‌కి తీసుకెళ్లకూడదు. కానీ ఈ పోలీసులు మాత్రం నన్ను తెల్లవారు జామున మూడు గంటలకు స్టేషన్ వచ్చి కంప్లైంట్ ఇవ్వమని ఆదేశించారు. వీరితో ఒక్క మహిళా కానిస్టేబుల్ కూడా లేదు’ అంటూ ట్వీట్ చేశారు. అంతేకాక ‘పోలీసులు నాకు, సెక్యూరిటి గార్డ్‌కు మధ్య జరిగిన గొడవను చూస్తూ ఉన్నారు. కానీ అతని మీద ఎలాంటి చర్య తీసుకోక పోగా నన్ను నా ప్లాట్‌కి వెళ్లలనీవ్వకుండా అడ్డుకున్నారు. దాంతో విధిలేని పరిస్థితుల్లో పోలీసులను అక్కడి నుంచి పంపించడం కోసమే నేను నా దుస్తులను తొలగించాల్సి వచ్చింది’ అని ట్వీట్ చేశారు. అయితే ఈ వివాదం జరిగిన సమయంలో శర్మ మద్యం సేవించి ఉందని అందుకే ఇంతలా రచ్చ చేసిందంటున్నారు స్థానికులు. ఈ విషయం గురించి పోలీసులు ‘శర్మనే మాకు ఫోన్ చేసింది. అందుకే ఆ సమయంలో డ్యూటీలో ఉన్న అధికారులు వెళ్లారు. అవసరమైన సమయంలో మాత్రమే మహిళ కానిస్టేబుల్ని పంపిస్తాము’ అని తెలిపారు. -
క్లాస్‌రూమ్‌లో వివస్త్రను చేసి...!
సాక్షి, భువనేశ్వర్ : తరగతి గదిలోనే వివస్త్రను చేసి.. ఆపై వీడియో తీసి.. అడ్డొచ్చిన లెక్చరర్‌ను చితకబాదిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దేశంలో అడుగడునా కీచక పర్వం సాగుతోంది. మహిళలమీద జరిగే అఘాయిత్యాలు.. అత్యంత వికృతంగా ఉంటున్నాయి. ఒడిశాలోని మైథిలి పోలీస్ స్టేషన్ పరిధిలో నవంబర్ 7న ఒక విద్యార్థినిపై ముగ్గురు కామంధులు అత్యంత పాశవికంగా దాడి చేశారు. ముగ్గురిలో ఇద్దరిని గుర్తించినట్లు పోలీసులు చెబుతున్నారు. బాధితురాలి కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. నవంబర్7న బాధితురాలు ప్రాక్టికల్ తరగతులు ముగించుకుని ఇంటికి వెళుతోంది. కొద్దిదూరం వెళ్లాక హ్యాండ్‌బ్యాగ్ మర్చిపోయిన విషయం గుర్తుకు వచ్చి తిరిగి తరగతి గదికి వచ్చినట్లు బాధితురాలు తెలిపారు. అప్పటికే క్లాస్‌రూమ్‌లో కాలేజీకి సంబంధంలేని ముగ్గురు యువకులు అక్కడ ఉన్నట్లు ఆమె తెలిపింది. అప్పటికే మద్యం సేవించి ఉన్న ముగ్గురు యువకులు.. బాధితురాలిని.. అత్యంత పాశవికంగా, రాక్షసంగా మీద పడి అత్యాచారం చేశారు. అంతేకాక ఆమెను వివస్త్రను చేసి సెల్ఫోన్లో వీడియో తీశారు. బాధితురాలి ఆర్తనాదాలు విన్న లెక్చరర్ అజయ్ కుమార్ ముగ్గురిని తీవ్రంగా ప్రతిఘిటించే ప్రయత్నం చేశారు. ముగ్గురు యువకులు తమ వెంట తెచ్చుకున్న కత్తులతో లెక్చరర్‌పై దాడి చేసి తీవ్రంగా గాయపర్చినట్లు బాధితురాలు తెలిపారు. ఈ ఘటనపై లెక్చరర్‌తో కలిసి బాధితురాలు నవంబర్ 9న పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే స్థానిక పోలీసులు బాధితురాలకి పట్ల నిర్లక్ష్యంగా వ్యహరించడంతో.. ఆమె పోలీస్ ఉన్నతాధికారులను సంప్రదించారు. ఉన్నతాధికారుల ఆదేశాలతో స్థానిక పోలీసులు కేసును రిజిస్టర్ చేసి ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు. మరో నిందితుడి కోసం గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
అయ్యా... నా బట్టలు మాత్రం విప్పొద్దు
సాక్షి, భోపాల్ : దేశంలో పలు రాష్ట్రాల్లో రైతుల నిరసనలు కొనసాగుతున్నాయి. భారతీయ జనతా పార్టీ పాలిత రాష్ట్రాల్లోనే ఇవి అధికంగా కనిపించటం గమనార్హం. అయితే తమ డిమాండ్లను కోసం రోడెక్కుతున్న అన్నదాతలను పట్టించుకోకపోగా... అణచివేత ధోరణిని ప్రదర్శించటంతో ఆయా ప్రభుత్వాలపై తీవ్ర స్థాయిలో విమర్శలు వినిపిస్తున్నాయి. తాజాగా మధ్యప్రదేశ్‌లో పోలీస్ స్టేషన్లోనే రైతులను బట్టలు విప్పి కొట్టిన ఘటన వెలుగులోకి వచ్చింది. మానవ హక్కుల సంఘం ప్రధాన కార్యదర్శి, డీజీపీలను నాలుగు వారాల్లో వివరణ ఇవ్వాలంటూ ఆదేశిస్తూ నోటీసులు జారీ చేసింది. విద్యుత్ సరఫరా, నీటి సమస్యలపై కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మంగళవారం రాష్ట్రవ్యాప్తంగా నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. ఈ సందర్భంగా అందులో రైతులను అదుపులోకి తీసుకున్న పోలీసులు స్టేషన్‌కి తీసుకెళ్లి దారుణంగా చితకబాదారు. అయ్యా... నా బట్టలు విప్పొద్దు. నా లో దుస్తులకు రంధ్రాలు ఉన్నాయని వేడుకున్నా.. వినకుండా బట్టలు విప్పించి కొట్టారని 45 ఏళ్ల బల్వాన్ సింగ్ ఘోష్ అనే రైతు ‘ది ఇండియన్ ఎక్స్ ప్రెస్’ ఇంటర్వ్యూలో పేర్కొన్నాడు. నా పంట నాశనం అయ్యింది. నిరసనలో పాల్గొంటే ప్రయోజనం దక్కుతుంది అనుకున్నా. కానీ, పరిహారంగా పోలీసుల చేతిలో తన్నులు తినాల్సి వచ్చింది అని బల్వాన్ చెప్పాడు. టికమ్‌గఢ్ డేహట్ పోలీస్ స్టేషన్లో బల్వాన్సహా ఐదుగురు రైతులను పోలీసులు చావబాదారనే ఆరోపణలు వినిపించాయి. తొలుత అలాంటిదేం వాదించిన రాష్ట్ర ప్రభుత్వం.. వారిని వివస్త్రులుగా చేసి బాదుతున్నట్లు ఫోటోలు మీడియాలో చక్కర్లు కొట్టడంతో నీళ్లు నమిలింది. దీంతో డీజీపీ నేతృత్వంలో గురువారం ఓ విచారణ కమిటీని నియమించిన ప్రభుత్వం మూడు రోజుల్లో నివేదిక సమర్పించాలని ఆదేశించింది. అయితే రైతులు స్వయంగా బట్టలు విప్పి నిరసన తెలిపారా? లేక పోలీసులే ఆ పని చేశారా? అన్నది తేలాల్సి ఉందని హోం శాఖ మంత్రి భూపేంద్ర సింగ్ తెలిపారు. మరోవైపు బీజేపీ మాత్రం ఇదంతా కాంగ్రెస్ పార్టీ ఆడిస్తున్న డ్రామా అని చెబుతుండగా.. పోలీస్ దెబ్బలు తిన్న అమోల్ సింగ్ ఘోష్ అనే మరో రైతు ఆ ఆరోపణలను తీవ్రంగా ఖండించారు. తామేం కాంగ్రెస్ కార్యకర్తలం కాదని ఆయన స్పష్టం చేశారు. -
మధ్యాహ్నం’ కలేనా?
► కళాశాలల్లో అమలుకు నోచుకోని భోజన పథకం ► అవస్థలు పడుతున్న విద్యార్థులు ► పట్టించుకోని ప్రభుత్వం ఆదిలాబాద్‌టౌన్: ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో అధికంగా చదివేది గ్రామీణ ప్రాంతానికి చెందిన పేద విద్యార్థులే. వీరు ప్రతిరోజు వివిధ గ్రామాల నుంచి ఆయా కళాశాలలకు జిల్లా కేంద్రానికి వస్తారు. వీరంతా చదువును మధ్యలో మానేయకుండా ఉండేందుకు రాష్ట్ర ప్రభుత్వం మధ్యాహ్న భోజన పథకం ఏర్పాటుకు గతేడాది నిర్ణయం తీసుకుంది. ఇప్పటికి ఆ పథకం గురించి ప్రభుత్వం ఊసేత్తకపోవడంతో మధ్యాహ్న కలనే మిగిలిపోయేట్లు కనిపిస్తోంది. ఇదివరకు ప్రతి కళాశాలలో ఒక్కో విద్యార్థికి ఎంత ఖర్చు చేయవచ్చు అనే విషయంపై ప్రభుత్వం సమగ్ర నివేదికను ఆయా ప్రభుత్వ కళాశాలల ప్రిన్సిపాళ్ల నుంచి తీసుకున్నారు. ఒక విద్యార్థికి రూ. 14లు ఖర్చు చేయాలని నిర్ణయించారు. ఈ పథకాన్ని ఇప్పటి వరకు ప్రారంభించకపోవడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సర్కార్ కళాశాలల్లో అధికంగా పేద విద్యార్థులే చదువుతున్నారు. నియోజక వర్గంలో.. పట్టణంలోని ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాలలో ప్రథమ, ద్వితీయ సంవత్సరం విద్యార్థులు కలిపి 800 మంది వరకు ఉంటారు. ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో దాదాపు వెయ్యి మంది వరకు, బేలలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో 600 మంది వరకు విద్యార్థులు చదువుతున్నారు. వీరిందరికి భోజనం అందించేందుకు ఇదివరకే అధికారులు ఇదివరకే ప్రణాళిక సిద్ధం చేశారు. ఈ ఏడాది ప్రారంభిస్తామని ప్రభుత్వం మరోసారి ప్రకటించినప్పటికి నేటికి సాకారం కాలేదు. దూరప్రాంతాల నుంచి కళాశాలలకు వస్తున్న కొంత విద్యార్థులు ఆకలికి తట్టుకోలేక మధ్యాహ్నం వరకు తరగతులకు హాజరై ఇంటి ముఖం పడుతున్నారు. చాలా మంది విద్యార్థులు ఇంటి టిఫిన్ బాక్సులు తీసుకువచ్చి కళాశాలలో భోజనం చేస్తున్నారు. ఈ సారైనా అమలయ్యేనా ఈ విద్యా సంవత్సరమైన ప్రభుత్వ కళాశాలల్లో మధ్యాహ్న భోజన పథకం అమలయ్యేనా అని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పలుమార్లు విద్యాశాఖ మంత్రి.. కళాశాలల్లో అమలు చేస్తామని హామీ ఇచ్చి, దీని ఊసెత్తడం లేదని విద్యార్థి సంఘాల నాయకులు పేర్కొంటున్నారు. బడ్జెట్ కొరత వల్లే పునరాలోచనలో పడినట్లు ప్రచారం ఉంది. ప్రభుత్వ కళాశాలల్లో మధ్యాహ్న భోజన పథకం అమలు చేస్తే విద్యార్థుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. అదేవిధంగా పథకం అమలు చేయడం వల్ల హాజరు శాతంతోపాటు ఉత్తీర్ణత శాతం పెరిగే అవకాశాలు ఉన్నాయని పలువురు లెక్చరర్లు పేర్కొంటున్నారు. ఉదయం తినకుండానే.. ఉదయం ఇంటి నుంచి తినకుండానే కళాశాలకు వస్తున్నాం. ఒక్కోసారి ఇంట్లో వంట కాకపోతే పస్తులు ఉండాలి. మధ్యాహ్న భోజన పథకం అమలు చేస్తే ఎంతో మంది విద్యార్థులకు ప్రయోజనం చేకూరుతుంది. – సౌందర్య, ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల -
జర్మనీలో బెంగళూరు మహిళకు తీవ్ర అవమానం
బెంగళూరు: యూరోపియన్ దేశంలో శ్రుతి బసప్ప అనే భారతీయ మహిళకు అవమానం చోటుచేసుకుంది. బెంగళూరు నుంచి ఐస్లాండ్ వెళుతున్న ఆమెను జర్మనీలోని ఫ్రాంక్ ఫర్డ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో తనిఖీ సిబ్బంది అవమానించారు. తనిఖీల్లో భాగంగా ఆమెను స్కానింగ్ చేసినప్పటికీ దుస్తులు విప్పేయాలంటూ ఆమెకు అడ్డు చెప్పారు. సాధారణ తనిఖీకి బదులు తాము నమ్మలేమని అనుమానం వ్యక్తం చేస్తూ వస్త్రాలు విప్పేయాల్సిందేనని నలుగురిలో అవమాన పరిచారు. అయితే, ఆమె భర్త ఒక యూరోపియన్ కావడంతో ఆ గండం నుంచి బయటపడింది. దీనిపై శ్రుతి తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ తాను ఒంటరిగా ఉంటే పరిస్థితి ఏమిటని ప్రశ్నించింది. తన భర్త ఒక యూరోపియన్ కాకుంటే ఎలాంటి అవమానం ఎదుర్కోవాల్సి వచ్చేదో అని తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ ఫేస్బుక్లో ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ చర్య ముమ్మాటికి జాతి వివక్షే అని మండిపడింది. ఈ ఘటనపై విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్ కూడా స్పందించి అక్కడి విదేశాంగ కార్యాలయ అధికారులు పూర్తి వివరాలు తనకు అందజేయాలని ఆదేశించారు. ఈ ఘటన వివరాలు శ్రుతి తెలియజేసింది. శ్రుతి తన భర్తతో కలిసి ఫ్రాంక్‌ఫర్డ్ ఎయిర్‌పోర్ట్‌లో అడుగుపెట్టింది. అక్కడి విమానాశ్రయంలో తనిఖీల్లో భాగంగా బాడీ స్కానింగ్‌కు వెళ్లి రిపోర్ట్ తీసుకుంది. అయినా అధికారులు అనుమానం వ్యక్తం చేయడంతో బాడీని తడుముతూ చేసే తనిఖీలకు ఒప్పుకుంది. అయితే, తనకు ఇటీవలె కడుపునకు సంబంధించి శస్త్ర చికిత్స అయిందని, తనిఖీని కాస్తంత నెమ్మదిగా చేయాలని చెప్పింది. కానీ, అందుకు కూడా వాళ్లు నిరాకరించి ఆమెను వస్త్రాలు పూర్తిగా తీసేయాల్సిందేనంటూ ఆదేశించారు. అందుకు ఆమె నిరాకరించింది. అక్కడే ఉన్న యురోపియన్ భర్త జోక్యం చేసుకోవడంతో బయటపడింది. -
దొంగతో బట్టలిప్పించిన మహిళ
బొగొటా: చోరీ చేయడానికి ప్రయత్నించిన దుండగుడికి మరచిపోలేని శిక్ష విధించింది ఓ మహిళ. స్థానికులు అందరూ చూస్తుండగానే చోరీకి యత్నించిన వ్యక్తిని మోకాళ్ల మీద కూర్చోబెట్టింది. తర్వాత అతని జట్టుపట్టుకొని బట్టలు విప్పాలని ఆదేశించింది. ఎంత ప్రతిఘటించినా వినకుండా..ఆఖరికి అండర్ వేర్‌ను కూడా విప్పించి నిలుచోబెట్టి చివరకు అలానే ఇంటికి పంపించింది. దీనికి సంబంధించి వీడియోను స్థానికులు తీసి సోషల్ మీడియాలో పెట్టడంతో ఈ విషయం వెలుగు చూసింది. దక్షిణ అమెరికా కొలంబియాలోని బొగొటాలో ఈ సంఘటన చోటు చేసుకుంది. -
సాటిదని చూడకుండా బట్టలిప్పి.. కారం చల్లి..
లఖింపూర్ ఖేరి: కన్న కుమారుడి ప్రేమ వ్యవహారం ఓ తల్లిని బజారుపాలు చేసింది. తన కుమారుడు ఓ యువతితో వెళ్లిపోయాడనే కారణంతో ఆ యువకుడి తల్లికి ఆ అమ్మాయి కుటుంబ సభ్యులు నరకం చూపించారు. ఆమె వయసుకు కూడా గౌరవం ఇవ్వకుండా అందరిముందు బట్టలూడదీసి కొట్టారు. చిత్రహింసలు పెట్టారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లో చోటుచేసుకుంది. లఖింపూర్ ఖేరీలో ప్రేమించుకున్న ఇద్దరు యువతీయువకులు ఆదివారం సాయంత్రం ఎవరికీ తెలియకుండా వెళ్లిపోయారు. దీంతో బాలిక తరుపు కుటుంబ సభ్యులు, బంధువులు యువకుడి ఇంటిపై దాడికి దిగారు. 60 ఏళ్ల వయసున్న అతడి తల్లిని బయటకు లాగి తీవ్రంగా కొట్టడంతోపాటు బట్టలూడదీశారు. అనంతరం ముఖంపై, చెప్పరాని చోట్ల కారంపోసి పొర్లించి కొట్టారు. తన భార్యకు సహాయం చేయాల్సిదిగా ఆమె భర్త గ్రామస్తులను బ్రతిమాలుకున్నా ఎవరూ సాయం చేయలేదు. అదే సమయానికి పోలీసులు వచ్చి దుశ్చర్యను అడ్డుకున్నారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉందని, ఆస్పత్రిలో చికిత్స పొందుతోందని పోలీసు అధికారులు తెలిపారు. మొత్తం ఐదుగురిపై పోలీసులు కేసు నమోదు చేయగా నిందితులు పరారీలో ఉన్నారు. వీరిలో నలుగురు మహిళలే. -
హోం వర్క్ చేయలేదని బట్టలు విప్పించింది
ఓ విద్యార్థికి బట్టలు ఊడదీయించి పూర్తి నగ్నంగా నిలబెట్టారు. మరో అబ్బాయి లోదుస్తులు లేకుండా చొక్కాలు విప్పిన షర్ట్‌పై అతని పక్కనే కనిపించాడు. వీరిద్దరినీ స్కూల్లోకి రానివ్వకుండా డోర్ ముందు నిలబెట్టారు. ఎవరైనా అటుగా వెళితే ఈ అబ్బాయిలు ఇద్దరూ సిగ్గుతో మొహం కనిపించకుండా చేతులు అడ్డుపెట్టుకున్నారు. ఇంతకీ వీరు చేసిన నేరం ఏంటో తెలుసా? హోం వర్క్ చేయకపోవడమే. ఇంత చిన్న తప్పుకు స్కూల్ టీచర్ వారిపట్ల పైశాచికంగా ప్రవర్తించింది. ముంబై శివారు ప్రాంతం మలడ్‌లోని కోచింగ్ సెంటర్లో ఈ ఘటన జరిగింది. ఎన్జీవోకు చెందని ఓ సభ్యుడు ఈ ఘటనను వీడియో తీయడంతో పెద్ద దుమారం రేగింది. విద్యార్థులకు శిక్ష వేసిన టీచర్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని వారి తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. విద్యార్థులు వయసు 8, 9 ఏళ్లు. వీళ్లను నగ్నంగా నిలబెట్టిన టీచర్ సరోజా నాయర్, కోచింగ్ సెంటర్ యజమాని గణేశ్ నాయర్‌పై కేసు నమోదు చేశారు. వీరిద్దరూ బంధువులు అవుతారు. కాగా పోలీసులు వీరిని ఇంకా అరెస్ట్ చేయలేదు. పిల్లలను అరగంట పాటు స్కూల్ బయట నిలబెట్టారని, తాము వెళ్లే సరికి వారు ఏడుస్తూ ఉన్నారని ఎన్జీవో ప్రతినిధులు చెప్పారు. -
బట్టలు విప్పించి బయట నిలబెట్టారు
ముంబయి: ముంబయిలో దారుణం చోటుచేసుకుంది. ఇంటిపనిచేయలేదని ఇద్దరు విద్యార్థులకు ఏ ఉపాధ్యాయులు వేయకూడని శిక్షను వేశారు. ఇద్దరు విద్యార్థుల బట్టలు విప్పించి తరగతి గదుల బయట నిలబెట్టించారు. అంతేకాకుండా, వారిని వీడియో తీసి వాట్సాప్ లో కూడా పెట్టారు. ఈ విషయం కాస్త ముంబయి పోలీస్ ఉన్నతాధికారులకు తెలిసి ఆ ఇద్దరు ఉపాధ్యాయులపై కేసు పెట్టారు. ముంబయిలోని మాల్వానికి చెందిన ఓ ట్యూషన్ క్లాస్ కు రెండు, మూడు తరగతులు చదువుతున్న ఇద్దరు పిల్లలు వెళుతున్నారు. వారు తమ టీచర్లు ఇచ్చిన హోం వర్క్ చేయలేదు. దీంతో ఆ ఇద్దరు విద్యార్థుల బట్టలు విప్పించి క్లాస్ బయట నిలబెట్టారు. దీంతో వారిపై జువెనైల్ జస్టిస్ యాక్ట్ 82, 75 సెక్షన్ల ప్రకారం కేసు నమోదు చేశారు. -
బిడ్డ పేలిక
పురిటినొప్పుల కంటే భరించలేని నొప్పులు ఏవో చెప్పుకోండి?! గొడ్రాలి నొప్పులు! ఈ నొప్పులు కడుపులోంచి తన్నుకురావు. సమాజమే స్వయంగా వచ్చి తన్నిపోతుంది. ఎలాగైనా ఈ నొప్పుల్నుంచి బయటపడాలి. ఒక పేలిక దొరికినా పట్టుకుని ఈ గొడ్రాలి సముద్రాన్ని ఈదేయాలి. కానీ... అదే పేలిక.. ముంచింది! బిడ్డ అచ్చం వాళ్ల నాన్న పోలికే... మా తమ్ముణ్ని చూసినట్టే ఉంది... మేనల్లుడి బుగ్గలు పుణుకుతూ మురిసిపోతోంది మేనత్త. రంగు మేనమామది... అంటూ నచ్చని వాటిని అవతలి వాళ్ల మీదకు తోసేసే ప్రయత్నం చేస్తోంది నానమ్మ. వాళ్లమ్మ కళ్లలాగానే చెంపకు చారడేసి ఉన్నాయి... అంటూ మనవడి అందంలో తన కూతురి భాగస్వామ్యాన్ని గుర్తు చేస్తోంది బిడ్డ అమ్మమ్మ. పోలికలు ఎవరివైతేనేం... ఎలా ఉంటేనేం... కన్నొంకర కాలొంకర లేకుండా సక్కంగా పుట్టాడు... బంగా...రయ్య... వీడి తాతలాగానే మంచిపేరు తెచ్చుకోవడం నా కళ్లతో చూడాలి... అంటూ బిడ్డ తాతమ్మ మంచంలో కూర్చుని బుడ్డోడి భవిష్యత్తును రీళ్లురీళ్లుగా విజువలైజ్ చేసుకుంటోంది. బిడ్డను చూడడానికి వచ్చి వెళ్లే బంధువులు, స్నేహితులతో ఇల్లు సందడిగా ఉంది. అందరిలా ఆ ఊళ్లోని ఒకామె కూడా వచ్చి బిడ్డను చూసి, తల్లిని పరామర్శించి చాలాసేపు ఉంది. ఆనక వెళ్లలేక వెళ్లలేక, తిరిగి తిరిగి చూస్తూ వెళ్లిపోయింది. మరుసటి రోజు కూడా వచ్చింది. బిడ్డ మంచాన్ని వదలకుండా దగ్గరే కూర్చుంటోంది. కొంతసేపటికి అయిష్టంగా వెళ్తోంది. నాలుగైదు రోజులు గడిచాయి. హటాత్తుగా ఒకరోజు నుంచి రావడం మానేసింది. ఇంట్లో ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. కానీ బిడ్డ తాతమ్మ ఊరుకోలేదు. కోడలికి రహస్యంగా ఏదో చెప్పింది. ఆమె గొంతులో ఆదుర్దా, ముఖంలో ఆందోళన. చెప్పడం పూర్తి కాకనే కోడలి ముఖంలోనూ రంగులు మారాయి. ఆవేశంతో ముఖం జేపురించింది. భర్త కోసం వెతికింది. ఆ రోజు సాయంత్రానికి రచ్చబండ దగ్గర ఇసుకేస్తే రాలనంత జనం. అందరి ముఖాలూ ఆగ్రహావేశాలకు ప్రతీకల్లా ఉన్నాయి. అందరి చూపు ఒక మహిళ మీదనే కేంద్రీకృతమై ఉన్నాయి. ఆమె పెడరెక్కలు విరిచి, చెట్టుకి కట్టేశారు. ఆమె జుట్టు రేగి చింపిరిగా చిందరవందరగా ఉంది. దుస్తులు చిరిగి ఉన్నాయి. చెమటలు కారుతున్నాయి. ఒంటి మీద దెబ్బల వాతలు, నెత్తుటి చారికలు. ఆమె మాట్లాడే ఓపిక కూడా లేనట్లు తల వాల్చేసి నిస్సహాయంగా ఉంది. ఇంతకీ ఆమె చేసిన తప్పేంటి? బాణామతి... ‘నిజమే ఆమె బాణామతి చేస్తోంది’ అందరి ఆరోపణా అదే. ‘ఆమె బాణామతి చేయడం మీరు చూశారా’ అని జనవిజ్ఞాన వేదిక కార్యకర్తలు అడిగిన ప్రశ్నకు సమాధానంగా మరోప్రశ్న అంతే సూటిగా వచ్చింది. ‘పురిట్లో బిడ్డ పక్కకేసిన కోకను చింపుకెళ్లినామె బాణామతి చేయకపోతే ఇంకేం చేస్తుంది’ ఆగ్రహంగా ప్రశ్నించాడు బిడ్డ తాత. ఆ పక్కనే వాళ్ల బంధువులు ఆమె మీదకురకడానికి సిద్ధంగా ఉన్నారు. మాట్లాడడానికి నోరు పెగలని స్థితిలో తనకేమీ తెలియదన్నట్లు తల అడ్డంగా ఊపుతోందామె. అత్త ఆరళ్లకు భయపడి... ఆ అమాయకురాలి గతంలోకి వెళ్తే... ఆమెకి పెళ్లయి పదేళ్లయినా పిల్లలు పుట్టలేదు. మన గ్రామాల్లో ఒక మహిళను రాచి రంపాన పెట్టడానికి ఈ ఒక్క కారణం చాలు. ‘నీకు పిల్లలు పుట్టేట్టు లేరు. నా కొడుక్కేం తక్కువ... మరో పెళ్లి చేస్తే ఏడాది తిరక్కుండా తండ్రవుతాడు’ అంటూ అత్త సాధింపులు. ఇంట్లో తన స్థానం పదిలంగా ఉండాలంటే ఓ బిడ్డను కనితీరాలి. బిడ్డలు పుట్టే మంత్రం ఏదైనా ఉంటే బావుణ్ను. ఆమె ఆలోచనలు పరిపరి విధాల పోతున్నాయి. ఇలాంటి అమాయకుల కోసమే కాచుకుని ఉండే మంత్రగాడు ఆ క్షణంలో ఆమెకు ఆపద్బాంధవుడిలా కనిపించాడు. వారం వారం అతడిని దర్శించుకుంటోంది. పండ్లు, ప్రదక్షిణలు, దక్షిణలు సమర్పించుకుంటూనే ఉంది. ఆమె కాయకష్టం చేసి దాచుకున్న పైసలు అయిపోయాయి. పుట్టింటి వాళ్లు పెట్టిన బంగారమూ అయిపోయింది. ఆమె అమాయకంగా అడిగే ప్రశ్నలతో సహజంగానే స్వామీజీ మీద ఒత్తిడి పెరిగింది. ఆ ప్రెషర్ తగ్గించుకోవడానికి స్వామీజీ ఓ ప్లాన్ వేశాడు. ‘పురిట్లో బిడ్డ పక్క చించి చిన్న ముక్క తెస్తే దాంతో పూజ చేస్తాను. అప్పుడు నీకు బిడ్డలు పుడతారు’ అని నమ్మబలికాడు. ఆమె నమ్మింది. మంత్రగాడు చెప్పినప్పటి నుంచి ఊళ్లో ఎవరు బిడ్డను కంటారా అని ఎదురు చూసింది. తనకు తెలిసినావిడ నెలతప్పినప్పటి నుంచి ఆమె ప్రసవం కోసం ఎదురు చూసింది. కొన్నాళ్లకు ఆ రోజు రానే వచ్చింది. బాలింతను పరామర్శించి, బిడ్డను చూడాలనే వంకతో ఆ ఇంటికి తరచూ వెళ్లేది. ఓ రోజు తననెవరూ చూడట్లేదనుకుని రహస్యంగా బిడ్డ పక్కకేసిన పాత చీర నుంచి చిన్న ముక్కను చించుకుని వెళ్లిపోయింది. ఎంత జాగ్రత్తగా చేసినా, మంచంలో ఉన్న పెద్దావిడ కంట్లో పడనే పడింది. ఎందుకిలా చేసిందనే సందేహాలు కూడా తలెత్తాయి. బాణామతి చేయడానికేమోనని అనుమానించారు. తనకు బిడ్డల్లేరు. కాబట్టి బిడ్డలు పుట్టిన వాళ్లను చూసి ఓర్వలేక బాణామతి చేస్తోందేమో! అని మరో సందేహం. అది కేవలం సందేహమే, అయితే ఇదే నిజమని ఊరు ఊరంతా ఆరోపించింది. బాణామతి ఉందని కానీ లేదని కానీ వాళ్లలో ఎవరూ చెప్పలేరు. కానీ ఒక అమాయకురాలిని వధ్యశిల మీద నిలబెట్టడానికి మాత్రం ఎవరూ వెనుకాడలేదు. తల్లి కావాలనే ఆరాటంతో ఆమె మంత్రగాడిని ఆశ్రయిస్తే, ఆ మంత్రగాడి మోసం, అవకాశవాదం ఆమెను ఊరి ముందు దోషిలా నిలిపాయి. ఏం జరిగిందో తెలుసుకున్న తర్వాత ఆమెను వదిలి పెట్టారు. ఇక్కడ మనసును కలిచి వేసే లౌక్యమూ ఉంది. నిందారోపణలతో శిక్షించడానికి వెనుకాడని జనం, పొరబడ్డామని ఒప్పుకోవడానికి ముందుకురావు. అజ్ఞానాంధకారంలో మూర్ఖంగా ప్రవర్తించాం- అని ఒప్పుకోవడానికి అహం అడ్డు వస్తుంది. పైగా అదే అహం ముసుగులో ఊరంతా కలిసి ‘పాపం అమాయకురాలు క్షమించేద్దాం’ అని తీర్మానించేశారు. - వాకా మంజులారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి నచ్చచెప్పడం చాలా కష్టం అయింది ఇది నల్గొండ జిల్లా, చిట్యాల మండలంలోని శివనేనిగూడ గ్రామంలో జరిగింది. ఊళ్లో ఒకావిడను కట్టేసి కొడుతున్నారని తెలిసిన వెంటనే మా జనవిజ్ఞానవేదిక మిత్రులు అలర్ట్ అయ్యారు. ఆ ప్రాంతానికి వెళ్లి విచారణ మొదలు పెట్టగానే స్థానికులు మా వాళ్ల మీద విరుచుకు పడ్డారు. కొట్టినంత పని చేశారు. మీరు నచ్చినట్లే చేద్దురు కానీ ముందు ఆమెని మాట్లాడనిద్దాం... అని వారిని సమాధాన పరిచాం. ఆమె నోరు విప్పిన తర్వాత అందరిలో సానుభూతి వ్యక్తమైంది. అయినప్పటికీ... బాణామతి అనేది మూఢనమ్మకం అని ఊరి వారిని సమాధానపరచడం మాత్రం చాలా కష్టమైంది. అదే ప్రదేశంలో సమావేశం పెట్టి మంత్రతంత్రాలు ఉండవని చెప్పాం. ఆమె భర్త, అత్తగారికి విడిగా కౌన్సెలింగ్ ఇచ్చాం. డాక్టర్‌కు చూపించుకుని భార్యాభర్తలిద్దరూ వైద్యం చేయించుకోవాలని సూచించాం. మా ప్రయత్నంతో ఆమె కాపురం చక్కబడింది. - టి. రమేశ్, ప్రధాన కార్యదర్శి, ఆల్ ఇండియా పీపుల్స్ సైన్స్ నెట్వర్క్ -
బైక్ రైడర్లపై సరికొత్త అస్త్రం
చెన్నై: తమిళనాడులో రోడ్డు ప్రమాదాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా ద్విచక్ర వాహన ప్రమాదాలు అధికమవుతున్నాయి. హెల్మెట్ పెట్టుకుని సురక్షితంగా డ్రైవింగ్ చేయాలని మద్రాసు హైకోర్టు సుద్దులు చెప్పినా వాహనదారులు తలకెక్కించుకోవడం లేదు. దీంతో తమిళనాడు పోలీసులు... ఉల్లంఘనులపై సరికొత్త అస్త్రం ప్రయోగించారు. నిబంధనలు ఉల్లంఘించిన 14 మంది బైకు రైడర్ల బట్టలిప్పించి డ్రాయర్లతో 9 గంటల పాటు నిర్బంధించారు. మితిమీరిన వేగంతో మహాబలిపురం టౌన్ లోని వస్తున్న వీరిని ఆదివారం ఉదయం 6.30 గంటల ప్రాంతంలో పోలీసులు పట్టుకున్నారు. 19 నుంచి 25 మధ్య వయసున్న వీరిని అదుపులోకి తీసుకుని బట్టలిప్పించి 9 గంటల పాటు పోలీసు స్టేషన్ లో ఉంచారు. అంతేకాకుండా ఒక్కొక్కరికి రూ.1200 జరిమానా కూడా విధించారు. వారి నుంచి స్వాధీనం చేసుకున్న హైఎండ్ బైకులు ఒకరోజు స్టేషన్ లోనే ఉంచారు. పోలీసుల చర్యను మానవ హక్కుల కార్యకర్తలు తప్పుబట్టారు. ఉల్లంఘనులకు కళ్లెం వేసేందుకు అప్పుడప్పుడు ఇలాంటివి చేస్తుంటామని పోలీసులు తమ చర్యని సమర్థింకున్నారు. -
వివస్త్రను చేసి ఓ మహిళను చితకబాదారు...
పాట్నా: ఇద్దరు వ్యక్తులను కిడ్నాప్ చేసిందనే ఆరోపణలతో ఓ మహిళను బహిరంగ ప్రదేశంలో వివస్త్రను చేసి గ్రామస్తుల సమక్షంలో చితకబాదిన ఘటన పాట్నాలో సంచలనం రేపింది. పాట్నాకు సమీపంలోని నిజాముద్దీన్ పూర్ గ్రామంలో భూమికి సంబంధించిన వ్యవహారంలో ఇద్దరు వ్యక్తులను కిడ్నాప్ చేశారని బుధవారం రాత్రి బహిరంగ ప్రదేశంలో సంగీతాదేవి అనే మహిళ బట్టలూడదీసి విచక్షణారహితంగా దాడికి పాల్పడినట్టు స్థానికులు తెలిపారు. ఇంటి నుంచి బయటకు ఈడ్చి గ్రామస్థుల సమక్షంలో వివస్త్రను చేసి దాడి చేసినట్టు పోలీసులు తెలిపారు. తీవ్రగాయలతో ఉన్న సంగీతాదేవిని చికిత్స కోసం ఆస్పత్రిలో చేర్పించారు. ఈ ఘటనపై ఎఫ్ఐఆర్ నమోదు చేసి కేసు దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు. అయితే కిడ్నాప్ గురైన ఇద్దరు హత్యకు గురయ్యారని.. వారి మృతదేహాలు నిజాముద్దీన్ పూర్ లో గురువారం ఉదయం లభ్యమైనట్టు పోలీసులు తెలిపారు.