ముంబయిలో దారుణం చోటుచేసుకుంది. ఇంటిపనిచేయలేదని ఇద్దరు విద్యార్థులకు ఏ ఉపాధ్యాయులు వేయకూడని శిక్షను వేశారు.
ముంబయి: ముంబయిలో దారుణం చోటుచేసుకుంది. ఇంటిపనిచేయలేదని ఇద్దరు విద్యార్థులకు ఏ ఉపాధ్యాయులు వేయకూడని శిక్షను వేశారు. ఇద్దరు విద్యార్థుల బట్టలు విప్పించి తరగతి గదుల బయట నిలబెట్టించారు. అంతేకాకుండా, వారిని వీడియో తీసి వాట్సాప్ లో కూడా పెట్టారు.
ఈ విషయం కాస్త ముంబయి పోలీస్ ఉన్నతాధికారులకు తెలిసి ఆ ఇద్దరు ఉపాధ్యాయులపై కేసు పెట్టారు. ముంబయిలోని మాల్వానికి చెందిన ఓ ట్యూషన్ క్లాస్ కు రెండు, మూడు తరగతులు చదువుతున్న ఇద్దరు పిల్లలు వెళుతున్నారు. వారు తమ టీచర్లు ఇచ్చిన హోం వర్క్ చేయలేదు. దీంతో ఆ ఇద్దరు విద్యార్థుల బట్టలు విప్పించి క్లాస్ బయట నిలబెట్టారు. దీంతో వారిపై జువెనైల్ జస్టిస్ యాక్ట్ 82, 75 సెక్షన్ల ప్రకారం కేసు నమోదు చేశారు.