Tutorial Class
-
అంతర్జాతీయ ప్రవేశ పరీక్షలపై ‘ట్యూటరూట్’ ట్యూషన్లు
ఎడ్యుటెక్ స్టార్టప్ ‘ట్యూటరూట్ టెక్నాలజీస్’ ఇంటర్నేషనల్ ఎగ్జామ్ ఎక్స్లెన్స్ సెంటర్ (ఐఈఈసీ)ను ప్రారంభించింది. అంతర్జాతీయ స్కూళ్లలో ప్రవేశాల కోసం పరీక్షలు రాసే విద్యార్థులకు ఈ కేంద్రం ద్వారా ట్యూషన్లు చెప్పనుంది. ముందుగా సెకండరీ, సీనియర్ సెకండరీ పరీక్షలైన ఐజీసీఎస్ఈ, ఐబీడీపీలు రాసేందుకు కావాల్సిన నైపుణ్యాల బోధనపై ఐఈఈసీ దృష్టి సారించనున్నట్టు కంపెనీ ప్రకటించింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్నత విద్యా కోర్సులు, యూనివర్సిటీల్లో ప్రవేశాల కోసం పోటీపడే విద్యార్థులకు ట్యూషన్లు అందించడానికి ఐఈఈసీ ప్రాధాన్యం ఇస్తుందని ట్యూటరూట్ టెక్నాలజీస్ వ్యవస్థాపకుడు సత్యేంద్ర మంచాల తెలిపారు. చదవండి: Income Tax Return: ఇన్ కం ట్యాక్స్ చెల్లింపులు: ‘పే లేటర్’ జోలికి వెళ్లకండి, ఎందుకంటే! -
బట్టలు విప్పించి బయట నిలబెట్టారు
ముంబయి: ముంబయిలో దారుణం చోటుచేసుకుంది. ఇంటిపనిచేయలేదని ఇద్దరు విద్యార్థులకు ఏ ఉపాధ్యాయులు వేయకూడని శిక్షను వేశారు. ఇద్దరు విద్యార్థుల బట్టలు విప్పించి తరగతి గదుల బయట నిలబెట్టించారు. అంతేకాకుండా, వారిని వీడియో తీసి వాట్సాప్ లో కూడా పెట్టారు. ఈ విషయం కాస్త ముంబయి పోలీస్ ఉన్నతాధికారులకు తెలిసి ఆ ఇద్దరు ఉపాధ్యాయులపై కేసు పెట్టారు. ముంబయిలోని మాల్వానికి చెందిన ఓ ట్యూషన్ క్లాస్ కు రెండు, మూడు తరగతులు చదువుతున్న ఇద్దరు పిల్లలు వెళుతున్నారు. వారు తమ టీచర్లు ఇచ్చిన హోం వర్క్ చేయలేదు. దీంతో ఆ ఇద్దరు విద్యార్థుల బట్టలు విప్పించి క్లాస్ బయట నిలబెట్టారు. దీంతో వారిపై జువెనైల్ జస్టిస్ యాక్ట్ 82, 75 సెక్షన్ల ప్రకారం కేసు నమోదు చేశారు.