బైక్ రైడర్లపై సరికొత్త అస్త్రం | Cops strip, fine speeding bikers | Sakshi
Sakshi News home page

బైక్ రైడర్లపై సరికొత్త అస్త్రం

Published Wed, Jun 17 2015 11:10 AM | Last Updated on Sun, Sep 3 2017 3:53 AM

బైక్ రైడర్లపై సరికొత్త అస్త్రం

బైక్ రైడర్లపై సరికొత్త అస్త్రం

చెన్నై: తమిళనాడులో రోడ్డు ప్రమాదాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా ద్విచక్ర వాహన ప్రమాదాలు అధికమవుతున్నాయి. హెల్మెట్ పెట్టుకుని సురక్షితంగా డ్రైవింగ్ చేయాలని మద్రాసు హైకోర్టు సుద్దులు చెప్పినా వాహనదారులు తలకెక్కించుకోవడం లేదు. దీంతో తమిళనాడు పోలీసులు... ఉల్లంఘనులపై సరికొత్త అస్త్రం ప్రయోగించారు. నిబంధనలు ఉల్లంఘించిన 14 మంది బైకు రైడర్ల బట్టలిప్పించి డ్రాయర్లతో 9 గంటల పాటు నిర్బంధించారు.

మితిమీరిన వేగంతో మహాబలిపురం టౌన్ లోని వస్తున్న వీరిని ఆదివారం ఉదయం 6.30 గంటల ప్రాంతంలో పోలీసులు పట్టుకున్నారు. 19 నుంచి 25 మధ్య వయసున్న వీరిని అదుపులోకి తీసుకుని బట్టలిప్పించి 9 గంటల పాటు పోలీసు స్టేషన్ లో ఉంచారు. అంతేకాకుండా ఒక్కొక్కరికి రూ.1200 జరిమానా కూడా విధించారు. వారి నుంచి స్వాధీనం చేసుకున్న హైఎండ్ బైకులు ఒకరోజు స్టేషన్ లోనే ఉంచారు. పోలీసుల చర్యను మానవ హక్కుల కార్యకర్తలు తప్పుబట్టారు. ఉల్లంఘనులకు కళ్లెం వేసేందుకు అప్పుడప్పుడు ఇలాంటివి చేస్తుంటామని పోలీసులు తమ చర్యని సమర్థింకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement