
ఉక్రెయిన్ యుద్ధాన్ని నిరశిస్తూ ఓ వ్యక్తి విచిత్రమైన రీతిలో నిరసన తెలిపాడు. వాటికన్ సిటీలో ప్రసిద్ధగాంచిని బసిలికా అనే చర్చిని చూసేందుకు చాలా మంది పర్యాటకుల వస్తుంటారు. ఓ పర్యాటకుడి మాదిరిగా సందర్శించడానికి వచ్చి అకస్మాత్తుగా బట్టలు విప్పి..చర్చి ప్రధాన ద్వారం వద్ద నగ్నంగా నిలబడి ఉన్నట్లు సమాచారం.
అతను ఉక్రెయిన్ యుద్ధానికి వ్యతిరేకంగా నిరసన తెలిపినట్లు వాటికన్ మీడియా పేర్కొంది. అతను ఉక్రెయిన్ పిల్లలను కూడా రక్షించమని తన వీపుపై ఒక శాసనాన్ని కూడా చిత్రించడానికి వెల్లడించింది. అతని శరీరంపై వేలిగోళ్లతో గాయపరుచుకున్న గుర్తులు కూడా ఉన్నట్లు తెలిపింది. భద్రతా సిబ్బంది ఆ వ్యక్తిని గుర్తించి ఇటాలియాన పోలీసులకు అప్పగించినట్లు స్థానికి మీడియాలు పేర్కొన్నాయి. అంతేగాదు పలు ఇటాలియన మీడియా వైబ్‌సైట్‌లు ఆ సంఘటనకు సంబంధించి..పర్యాటకులు తీసిన ఫోటోలను కూడా ప్రశారం చేశాయి.
(చదవండి: వీడియో: తుళ్లి కిందపడ్డ అమెరికా అధ్యక్షుడు.. 25వ సవరణ ఉసెత్తిన ట్రంప్)
Comments
Please login to add a commentAdd a comment