![Russian Invasion Samantha Hails Ukrainian President Volodymyr Zelensky - Sakshi](/styles/webp/s3/article_images/2022/02/28/samantha1.jpg.webp?itok=uXBpmDSR)
ఉక్రెయిన్‌పై రష్యా సైనిక చర్యను ఇప్పటికే పలువురు సినీ తారలు తప్పుపట్టారు. బాహుబలిలాంటి రష్యా పసికూన ఉక్రెయిన్‌పై మూకుమ్మడిగా దాడిచేస్తోందని ఖండించారు. ఏ కారణాలతో యుద్ధం వచ్చినా అది పౌరుల, సైనికుల ప్రాణాలను పణంగా పెట్టడమేనని ఆక్షేపించారు. ఇక ఇదే విషయమై రెండు రోజుల క్రితం స్పందించిన సమంత తాజాగా మరోసారి ఇన్‌స్టా స్టోరీస్‌లో ఓ పోస్టు షేర్ చేశారు.
‘యోధుడైన ఉక్రెయిన్ అధ్యక్షుడిని చరిత్ర కనుగొంది.. అతని తెగువ, ధైర్యసాహసాలే దానికి సాక్ష్యం’ అని ఉన్న న్యూస్ ఆర్టికల్‌కు సంబంధించిన స్క్రీన్ షాట్‌ని ఆమె షేర్ చేసింది. బాలీవుడ్ హీరోయిన్ అమీ జాక్సన్ సైతం ఉక్రెయిన్ రష్యా ఉద్రిక్తతలపై రియాక్ట్ అయింది. బాధిత దేశంలో ఇబ్బందులు పడుతున్న పిల్లలకు సాయం అందించాలని ఆమె ప్రజలను అభ్యర్థించింది.
(చదవండి: అది మా హక్కు.. ఈయూ ఎదుట జెలెన్ స్కీ కీలక డిమాండ్)
అప్పుడే పుట్టిన బిడ్డలకు ఎన్ని కష్టాలో! అని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. ఈమేరకు ఉక్రెయిన్‌లోని ఓ ఆస్పత్రి ఐసీయూ నుంచి నవజాత శిశువులను బాంబ్ షెల్టర్‌లోకి తీసుకువెళ్తున్న వీడియోను ఆమె షేర్ చేసింది. కాగా, గత ఐదు రోజులుగా ఉక్రెయిన్ రష్యా బలగాల మధ్య భీకర పోరు కొనసాగుతున్న సంగతి తెలిసిందే.
(చదవండి: ఉక్రెయిన్ పరిస్థితులపై సమంత, కాజల్ ఎమోషనల్ పోస్ట్‌లు)
Comments
Please login to add a commentAdd a comment