Invasion
-
మరోసారి మణిశంకర్ అయ్యర్ వివాదాస్పద వ్యాఖ్యలు.. స్పందించిన కాంగ్రెస్
ఢిల్లీ: కాంగ్రెస్ మాజీ కేంద్ర మంత్రి మణిశంకర్ అయ్యార్ చేసిన వ్యాఖ్యలు మరోసారి వివాదాస్పదం అయ్యాయి. ఆయన మంగళవారం ఫారన్ కారెస్పండెంట్స్ క్లబ్లో నిర్వహించిన ఓ కార్యక్రమంలో మాట్లాడారు. ‘‘1962 అక్టోబర్‌లో చైనా భారత్‌పై దండయాత్ర చేసింది’’ అని అన్నారు. ఆ సమయంలో తాను ఇండియన్ ఫారిన్ సర్వీస్ (ఐఎఫ్ఎస్)కు తిరస్కరించబడిన విషయాన్ని కూడా పంచుకున్నారు.‘‘ఐఎఫ్ఎస్ పరీక్షలు లండన్‌లో ప్రారంభమయ్యాయి. అందులోనే పాస్ అయ్యాను. కానీ అడ్మిషన్ లేటర్ అందలేదు. దాంతో నేను నాకు జాయినింగ్ లెటర్ అందలేదని విదేశీ వ్యవహారాల శాఖకు తెలియజేశా. నేను అన్ని సర్వీసులకు తిరస్కరించబడినట్లు నాకు టెలిగ్రామ్ అందింది. అయితే నేను చైనా కోసం నిధులు సేకరించానని కొందరు నాపై ఆరోపణలు చేశారు. నాకు డిన్నర్ చేయడానికే ఆ రోజుల్లో డబ్బు లేదు. నేను ఎలా చైనాకు నిధులు సేకరిస్తాను?’’ అని అయ్యర్ వివరించారు.Mani Shankar Aiyar, speaking at the FCC, during launch of a book called Nehru’s First Recruits, refers to Chinese invasion in 1962 as ‘alleged’. This is a brazen attempt at revisionism.Nehru gave up India’s claim on permanent seat at the UNSC in favour of the Chinese, Rahul… pic.twitter.com/Z7T0tUgJiD— Amit Malviya (मोदी का परिवार) (@amitmalviya) May 28, 2024 అయితే.. భారత్‌పై చైనా దండయాత్ర చేసిందని అయ్యర్ చేసిన వ్యాఖ్యలను బీజేపీ నేతలు తీవ్రంగా ఖండించారు. లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో ఇటువంటి రెచ్చగొట్టె వ్యాఖ్యలు చేయటంపై మండిపడ్డారు. మణిశంకర్ వ్యాఖ్యలపై బీజేపీ ఐటీ సెల్ చీఫ్ అమిత్ మాల్వియా తీవ్రంగా ఖండిచారు. 1962లో చైనా భారత దండెత్తినట్లు వ్యాఖ్యలు చేయటం.. ఈ సమయంలో రెచ్చగొట్టే ప్రయత్నమేనని విమర్శించారు. గతంలో కాంగ్రెస్ చైనా అనుకూలంగా వ్యవహరించిందని ఘాటుగా విమర్శలు చేశారు. చైనా కాంగ్రెస్‌ను ప్రేమిస్తుందా? అని ప్రశ్నించారు.Mr. Mani Shankar Aiyar has subequently apologised unreservedly for using the term "alleged invasion" mistakenkly. Allowances must be made for his age. The INC distances itself from his original phraseology.The Chinese invasion of India that began on October 20 1962 was for… https://t.co/74oXfL1Ur2— Jairam Ramesh (@Jairam_Ramesh) May 28, 2024 అయ్యర్ చేసిన వ్యాఖ్యలపై తీవ్ర విమర్శలు వ్యక్తం కావటంలో కాంగ్రెస్ పార్టీ స్పందించింది. ఆయన చేసిన వ్యాఖ్యలకు పార్టీకి సంబంధం లేదని కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ జైరాం రమేష్ ‘ఎక్స్’లో తెలిపారు. ‘‘భారత్‌పై చైనా దండయాత్ర అనే మాట పొరపాటు అన్నానని అయ్యర్ క్షమాపణలు చెప్పారు. ఆయన వయసును బట్టి మనం స్వాగతించాలి. ఆయన చేసిన వ్యాఖ్యలకు పార్టీకి ఎటువంటి సంబంధం లేదు. అక్టోబరు20, 1962న ప్రారంభమైన భారతదేశంపై చైనా దండయాత్ర నిజమే. మే, 2020లో లడాఖ్‌లో చైనా చొరబాట్లు కూడా జరిగాయి. ఇందులో 20 మంది భారత సైనికులు కూడా అమరులయ్యారు. భారత్ చర్చలను చైనా బలహీనపరుస్తోందని జూన్ 19, 2020న ప్రధాని మోదీనే బహిరంగంగా తెలిపారు. దేప్సాంగ్, డెమ్చోక్లో పాటు 2000 చదరపు కిలో మీటర్ల భూభాగం సైతం భారత సైన్యానికి అధీనంలో లేదు’ అని జైరాం రమేష్ మండిపడ్డారు. -
సికాడాల దండయాత్ర.. వణుకుతున్న అమెరికా!
న్యూయార్క్: మిడతల దండును జ్ఞాపకం చేసుకుంటేనే భయం వేస్తుంది. గ్రీకు, అరేబియా గుండా వాయువ్య భారతదేశం వైపుగా మిడతల దండు ప్రయాణించి.. వ్యవసాయానికి అపార నష్టాన్ని కలిగించింది. అచ్చం అలాగే ఈ ఏడాది సికాడా అనే కీటకాల బెడద అమెరికాను వణికిస్తోంది.. అసలు ఈ సికాడా అంటే ఏంటో? వాటి ప్రమాదం ఏంటో తెలుసుకుందాం పదండి..! భూమిపై ఎన్నో రకాల జీవరాశులు ఉన్నాయి. వివిధ రకాల జీవన చక్రాలను కలిగి ఉన్నాయి. కొన్ని రాత్రిళ్లు పడుకుంటే మరికొన్ని మేల్కొంటాయి. కొన్ని భూమిలోపల ఉంటే మరికొన్ని భూమిపై, కొన్ని జీవనకాలమంతా పొదుగే దశలోనే ఉంటే మరికొన్నింటికి స్వల్పకాలం ఇలా ఎన్నో రకాల జీవులు ఉన్నాయి. ఇలానే ఓ విశిష్ట లక్షణాలు కలిగిన జీవరాశుల్లోనిదే సికాడా. సికాడాలు ఈ ఏడాది అమెరికా రాష్ట్రాలపై దండయాత్ర చేయనున్నాయి. సికాడా పేరులాగానే వీటి జీవనచక్రం కూడా వింతగా ఉంటుంది. సికాడా అంటే.. సికాడా అనేది కీటకాల సూపర్ ఫ్యామిలీ. సికాడొడియా, హెమిప్టెరా క్రమం. అంటే.. లీఫ్‌హాపర్స్(ఆకులను తినే జాతి), ఫ్రాగ్హాపర్(ఒకే ఎత్తు ఎగురుతూ, గెంతుతూ ఉండేవి). అవి సాధారణంగా మిడతల ఆకారంలో ఉంటాయి. సికాడాలు మానవులకు హానికరం కావు. కానీ చెట్ల ఆకులను, రసాలను పీల్చుతాయి. చెట్లుగా భావించి మనుషుల, జంతువుల శరీరాలపై వాలుతాయి. వ్యవసాయానికి తీవ్ర నష్టాన్ని కలిగిస్తాయి. నిద్రాణస్థితి నుంచి దండుగా ప్రయాణం.. సికాడా బ్రూడ్-XIX(19), సికాడా బ్రూడ్ XIII(13) అనే రెండు రకాల సికాడా గ్రూప్‌లు 2024లో ఉద్భవించనున్నాయి. ఈ సికాడాలకు ప్రతి 13 నుంచి 17 ఏళ్లకు ఒకసారి నిద్రాణస్థితి నుంచి బయటకు వచ్చే లక్షణం ఉంటుంది. ఈ ఏడాది 2024లో అమెరికాలోని దాదాపు 18 రాష్ట్రాల గుండా ఈ సికాడా కీటకాలు గుంపుగా ప్రయాణం చేస్తాయి. 15 రాష్ట్రాలపై ప్రభావం.. 'సికాడా బ్రూడ్ XIX(19)ను "ది గ్రేట్ సదరన్ బ్రూడ్"గా పిలుస్తారు. వీటికి 13 సంవత్సరాల జీవిత చక్రం ఉంటుంది. అమెరికా భౌగోళిక ప్రాంతం ఆధారంగా అతిపెద్ద గుంపు అని కనెక్టికట్ విశ్వవిద్యాలయంలోని పరిశోధకులు తెలిపారు. ఆగ్నేయ అమెరికాలో ఇవి సర్వసాధారణం. 15 రాష్ట్రాలపై ప్రభావం చూపుతాయి. మేరీల్యాండ్ నుండి జార్జియా వరకు అలాగే మిడ్‌వెస్ట్‌లో అయోవా నుండి ఓక్లహోమా వరకు గుర్తించబడ్డాయి. అలాగే ఇల్లినాయిస్ ఉత్తర ప్రాంతంలో కూడా కనిపిస్తాయి. 2011లో చివరిసారి ప్రయాణించాయని సికాడా మానియా అనే కీటకాల వెబ్సైట్ పేర్కొంది. అలబామా, అర్కాన్సాస్, జార్జియా, ఇల్లినాయిస్, ఇండియానా, కెంటుకీ, లూసియానా, మిస్సౌరీ, మిస్సిస్సిప్పి, నార్త్ కరోలినా, ఓక్లహోమా, సౌత్ కరోలినా, టేనస్సీ, వర్జీనియాల్లో ఈ ఏడాది సికాడా బ్రూడ్ XIX కనిపిస్తుంది. అవి మే మధ్యలో ప్రారంభమై జూన్ చివరిలో ముగుస్తాయి. భూమిలో 8 అంగుళాల నేలలో, 64 డిగ్రీల ఫారెన్‌హీట్ వాతావరణ పరిస్థితుల్లో బతుకుతుంటాయి. ఐదు రాష్ట్రాలపై సికాడా బ్రూడ్-XIII.. అలాగే సికాడా బ్రూడ్-XIII చివరిసారిగా 2007లో వచ్చాయి. ఇవి ప్రతీ 17 సంవత్సరాలకు ఒకసారి మాత్రమే దర్శనమిస్తాయి. సికాడా బ్రూడ్ XIII ఐదు రాష్ట్రాలను ప్రభావితం చేస్తుంది. అయోవా, విస్కాన్సిన్, ఇల్లినాయిస్, ఇండియానా, మిచిగాన్ రాష్ట్రాలపై ప్రభావం చూపుతాయి. ఎప్పుడు వస్తాయి? మే నెల అంతం జూన్ సమయంలో చెట్ల ఆకులు చక్కగా పెరుగుతాయి. ఐరిస్ పువ్వులు అదే సమయంలో చిగురిస్తాయి. ఈ సమయంలో వచ్చిన వర్షంతో ఈ సికాడాలు భూమి నుంచి బయటకు వస్తాయి. వీటిరాకతో వ్యవసాయానికి తీవ్ర నష్టం కలుగుతుంది. ఎందుకు బయటకు వస్తాయి..? సికాడాలు భూమిలో చెట్ల వేర్ల రసాలను పీల్చుతూ ఆహారాన్ని సమకూర్చుకుంటాయి. నేలలో బొరియలు చేసుకుంటూ నిద్రాణ స్థితిలో జీవనం సాగిస్తాయి. ఎప్పుడైతే తమ యవ్వన దశ రాగానే భూమి నుంచి బయటకు వస్తాయి. మిడతల దండు లాగే లక్షల్లో మగ సికాడాలు, ఆడ సికాడాలు కలిసి ప్రత్యేకమైన ధ్వనిని చేసుకుంటూ ప్రయాణం చేస్తాయి. ఆ సమయంలోనే మగసికాడాలు, ఆడ సికాడాలతో సంభోగం జరుపుకుంటాయి. ఆడ సికాడాలు తమ గుడ్లను చెట్ల బెరడుల్లో గుంతలు చేసి భద్రపరిచి వెళ్లిపోతాయి. అంతటితో వాటి జవనచక్రం ముగుస్తుంది. చెట్ల బెరడుల్లో ఉన్న గుడ్లు పొదిగి సికాడా కీటకాలు భూమిపై పడతాయి. అనంతరం భూమిలోపలికి ప్రయాణిస్తాయి. తగినంత ఉష్ణోగ్రత చేరుకోగానే ఆగిపోతాయి. నేలలనే నిద్రాణ స్థితిలో ఉండి మళ్లీ కాలవ్యవధి వచ్చే వరకు జీవనం సాగిస్తుంటాయి. పరిశోధకులకు సవాలు.. బ్రిటానికా ప్రకారం.. ధ్వనిని ఉత్పత్తి చేసే కీటకానికి రెండు జతల రెక్కలు ఉన్నాయి. ఒక ప్రముఖ కన్ను, మూడు సాధారణ కళ్లు ఉన్నాయి. 0.8 నుండి 2 అంగుళాల పొడవు పెరుగుతాయి. ప్రస్తుతం గుర్తించబడినవి మొత్తం 7 జాతులు, ఐదు వేర్వేరు బ్రూడ్లు ఉన్నాయని పరిశోధనలు తెలిపాయి. ప్రపంచవ్యాప్తంగా, 3,000 రకాల సికాడాలు ఉన్నాయి. వీటి జీవననిర్మాణాన్ని అర్థం చేసుకోవడం పరిశోధకులకు సవాలుగా మారింది. ఇదీ చదవండి: Pyramid Secrets: రోబో కంటికి అబ్బురపరచే పిరమిడ్ రహస్యాలు! -
ఉక్రెయిన్ యుద్ధాన్ని నిరసిస్తూ.. నగ్నంగా నిలబడి..
ఉక్రెయిన్ యుద్ధాన్ని నిరశిస్తూ ఓ వ్యక్తి విచిత్రమైన రీతిలో నిరసన తెలిపాడు. వాటికన్ సిటీలో ప్రసిద్ధగాంచిని బసిలికా అనే చర్చిని చూసేందుకు చాలా మంది పర్యాటకుల వస్తుంటారు. ఓ పర్యాటకుడి మాదిరిగా సందర్శించడానికి వచ్చి అకస్మాత్తుగా బట్టలు విప్పి..చర్చి ప్రధాన ద్వారం వద్ద నగ్నంగా నిలబడి ఉన్నట్లు సమాచారం. అతను ఉక్రెయిన్ యుద్ధానికి వ్యతిరేకంగా నిరసన తెలిపినట్లు వాటికన్ మీడియా పేర్కొంది. అతను ఉక్రెయిన్ పిల్లలను కూడా రక్షించమని తన వీపుపై ఒక శాసనాన్ని కూడా చిత్రించడానికి వెల్లడించింది. అతని శరీరంపై వేలిగోళ్లతో గాయపరుచుకున్న గుర్తులు కూడా ఉన్నట్లు తెలిపింది. భద్రతా సిబ్బంది ఆ వ్యక్తిని గుర్తించి ఇటాలియాన పోలీసులకు అప్పగించినట్లు స్థానికి మీడియాలు పేర్కొన్నాయి. అంతేగాదు పలు ఇటాలియన మీడియా వైబ్సైట్లు ఆ సంఘటనకు సంబంధించి..పర్యాటకులు తీసిన ఫోటోలను కూడా ప్రశారం చేశాయి. (చదవండి: వీడియో: తుళ్లి కిందపడ్డ అమెరికా అధ్యక్షుడు.. 25వ సవరణ ఉసెత్తిన ట్రంప్) -
మూడు రోజులు అనుకుంటే.. 365 రోజులయ్యింది!
లండన్: ఉక్రెయిన్‌పై రష్యా దురాక్రమణ.. ఈ ఫిబ్రవరి 24వ తేదీకి ఏడాది పూర్తి చేసుకోనుంది. ఈ ఏడాది కాలంలో ఎన్నో ప్రాణాలను బలిగొంది ఈ యుద్ధం. అయితే ప్రస్తుత పరిస్థితులను బట్టి ఉక్రెయిన్ యుద్ధంపై రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ వెనక్కి తగ్గబోడని.. అవసరమైతే మరో ఏడాదిపాటు కొనసాగిస్తాడని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. తాజాగా బ్రిటన్ రక్షణ కార్యదర్శి బెన్ వాలెస్.. ఉక్రెయిన్ యుద్ధ పరిణామాలపై స్పందించారు. రష్యా, ఉక్రెయిన్ ప్రజల జీవితాల పట్ల మాత్రమే కాకుండా.. తన సొంత సైనికుల పట్ల పూర్తి నిర్లక్ష్యం చూపిందని ఆయన ఆరోపించారు. మేం ఇక్కడి పరిస్థితులను ఏడాది కాలంగా చూస్తున్నాం. లక్షా 88 వేలమంది రష్యా సైనికులు మరణించారు, గాయపడ్డారు. దీనికి పుతిన్ దూకుడు కారణం అని ఆయన అభిప్రాయపడ్డారు. రష్యాకు సంబంధించి 97 శాతం ఉక్రెయిన్ యుద్ధంలోనే ఏడాదికాలంపాటు లీనమైందని, యుద్ధ ట్యాంకర్లలో మూడింట రెండోవంతు పూర్తిగా నాశనం అయిపోయాయని, అయినా కూడా ఉక్రెయిన్ను ఆక్రమించుకోవడంలో పుతిన్ ఘోరంగా విఫలమయ్యాడని తెలిపారు బెన్ వాలెస్. అయినా పుతిన్ దురాక్రమణపై వెనక్కి తగ్గబోడని అంచనా వేశాడాయన. నరమేధం కొనసాగినా.. అంతర్జాతీయ సమాజం నుంచి ఎన్ని ఒత్తిళ్లు ఎదురైనా పుతిన్ తన వైఖరి మార్చుకోకపోవచ్చనే అంటున్నారాయన. 2022 ఫిబ్రవరి 24వ తేదీన రష్యా దురాక్రమణకు పుతిన్ రష్యా బలగాలను ముందుకు పంపాడు. ఆ సమయంలో పుతిన్ లక్ష్యం ఒక్కటే. మూడు వారాల్లో ఉక్రెయిన్‌లో ఉన్న అన్ని ప్రధాన నగరాలను ఆక్రమించేసుకోవాలని. పైగా మూడే రోజుల్లో రాజధాని కీవ్ నగరాన్ని హస్తగతం చేసుకోవాలనుకున్నాడు. తద్వారా యుద్ధం ముగుస్తుందని భావించాడు. కానీ, సీన్ రివర్స్ అయ్యింది. యుద్ధం 365 రోజులు సాగింది. తాను అనుకున్నవాటిల్లో ఒక్కటి కూడా సాధించలేకపోయాడని వాలెస్ తెలిపాడు. ఇదిలా ఉంటే.. ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల సంఘం నివేదిక ప్రకారం.. ఈ ఏడాది కాలంలో ఎనిమిది వేల మంది సాధారణ పౌరులు మరణించినట్లు, 14 వేలమంది దాకా గాయపడినట్లు నివేదిక వెల్లడించింది. మేం గెలుస్తాం ఉక్రెయిన్‌పై రష్యా దురాక్రమణకు ఏడాది పూర్తవుతున్న సందర్భంలో.. ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్స్కీ సోషల్ మీడియా ద్వారా ఓ వీడియో పోస్ట్ చేశాడు. ఉక్రెయిన్ విజయం తధ్యమని మరోసారి ధీమా వ్యక్తం చేశాడాయన. మేము విచ్ఛిన్నం కాలేదు. అనేక పరీక్షలను అధిగమించాము. మేం గెలిచి తీరతాం అని అన్నారాయన. యుద్ధమనే చెడును మా దేశానికి తెచ్చిన వాళ్లను నిలువరించిన తీరతామని ధీమా వ్యక్తం చేశాడాయన. -
ఒక్క నిమిషం పట్టదు.. పుతిన్‌పై సంచలన ఆరోపణలు
లండన్: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌పై బ్రిటన్ మాజీ ప్రధాని బోరిస్ జాన్సన్ సంచలన ఆరోపణలు చేశారు. ఉక్రెయిన్ దురాక్రమణకు కొన్నిరోజుల ముందు ఫోన్ చేసి మరీ తనపై వ్యక్తిగత దాడికి పాల్పడతానని బెదిరించాడని జాన్సన్ పేర్కొన్నారు. ఫిబ్రవరి 24 ఉక్రెయిన్ ఆక్రమణకు కొన్నిరోజుల ముందు నా కార్యాలయానికి ఓ ఫోన్ కాల్ వచ్చిందని, వ్యక్తిగతంగా తనపై మిస్సైల్ దాడికి పాల్పడతానని పుతిన్ తనను బెదిరించాడని బోరిస్ జాన్సన్ తాజాగా ఆరోపించారు. ఈ మేరకు బోరిస్ వ్యాఖ్యలతో కూడిన ఓ డాక్యుమెంటరీని బీబీసీ తాజాగా ప్రసారం చేసింది. ‘‘బోరిస్.. మిమ్మల్ని గాయపర్చడం నా ఉద్దేశం కాదు. కానీ, మీపై మిస్సైల్ దాడి తప్పదు. అందుకు ఒక్క నిమిషం చాలు. అలా అంతా అయిపోతుంది’’ అని పుతిన్ ఆ ఫోన్‌కాల్‌లో బెదిరించినట్లు జాన్సన్ పేర్కొన్నారు. అంతేకాదు.. ఆ ఫోన్‌కాల్‌లోనే ఉక్రెయిన్ నాటో చేరిక వ్యవహారం గురించి హాట్ హాట్‌గా పుతిన్ కామెంట్లు చేశాడని బోరిస్ తెలిపారు. ఆ సమయంలో తాను చాలా సహనంగా వ్యవహరించానని బోరిస్ గుర్తు చేసుకున్నారు. ఇదిలా ఉంటే.. ఉక్రెయిన్ ఆక్రమణను ఖండించిన పాశ్చాత్య దేశాల నేతల్లో బోరిస్ జాన్సన్ కూడా ఉన్నారు. యుద్ధం మొదలైన కొన్నాళ్లకు.. హఠాత్తుగా ఉక్రెయిన్ రాజధాని కీవ్‌లో ప్రత్యక్షమై ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచారు బోరిస్. -
రష్యా ఆక్రమిస్తోంది.. ‘నాటో’లో త్వరగా చేర్చుకోండి మహా ప్రభో!
కీవ్: ఉక్రెయిన్‌లోని నాలుగు ఆక్రమిత ప్రాంతాలను తమ దేశంలో అధికారికంగా విలీనం చేసుకున్నట్లు ప్రకటించింది రష్యా. ఈ క్రమంలో మిలిటరీ కూటమి నాటోవైపు చూస్తోంది ఉక్రెయిన్. రష్యా ఆక్రమణల వేళ నాటో సభ్యత్వ ప్రక్రియను వేగవంతం చేయాలని పశ్చిమ దేశాలను కోరినట్లు ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలొదిమిర్ జెలెన్స్కీ తెలిపారు. ఈ మేరకు జెలెన్స్కీ మాట్లాడిన వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది అధ్యక్ష కార్యాలయం. ‘ఇప్పటికే నాటో కూటమి ప్రమాణాలకు అనుకూలంగా ఉన్నామని మేము నిరూపించుకున్నాం. నాటోలో సభ్యత్వం వేగవంతం చేయాలని కోరుతూ చేసే దరఖాస్తుపై సంతకం చేస్తూ మేము నిర్ణయాత్మక అడుగు వేస్తున్నాం. వ్లాదిమిర్ పుతిన్ అధ్యక్షుడిగా ఉన్నంత కాలం రష్యాతో కీవ్ చర్చలు చేపట్టదు. కొత్త అధ్యక్షుడితోనే సంప్రదింపులు చేపడతాం.’ అని వీడియోలో మాట్లాడారు జెలెన్స్కీ. ఉక్రెయిన్‌లోని ఖేర్సన్, జపోరిజియా, లుహాన్స్క్, డొనెట్స్క్ ప్రాంతాలను రష్యాలో విలీనం చేస్తున్నట్లు ఆ దేశ అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ప్రకటించారు. పుతిన్ ప్రకటన వచ్చిన కొద్ది సేపటికే జెలెన్స్కీ ఈ మేరకు వీడియో విడుదల చేశారు. ఆక్రమిత ఉక్రెయిన్ ప్రాంతాల్లో ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టగా రష్యాలో చేరేందుకే ప్రజలు మొగ్గు చూపినట్లు అక్కడి నేతలు తెలిపారు. దీంతో ఉక్రెయిన్ ప్రాంతాలను అధికారికంగా తమలో విలీనం చేసుకుంది రష్యా. Ukrainian President Volodymyr Zelenskyy signs application for fast-track NATO membership after Russia's annexation of Lugansk, Donetsk, Kherson and Zaporizhzhia.#NATORussia #RussiaUkraineWar #UkraineRussianWar pic.twitter.com/i1YXuJ0B4I — Annu Kaushik (@AnnuKaushik253) September 30, 2022 ఇదీ చదవండి: రష్యా రక్తపిపాసి! ఉగ్రవాదులే ఇలా చేయగలరు: జెలెన్స్కీ -
ధనస్వామ్యం దండయాత్ర!
మన స్వరాజ్యానికి మొన్ననే అమృతోత్సవం జరుపుకొన్నాం. స్వరాజ్యం సురాజ్యం కావాలంటే ప్రజలే ప్రభువులు కావాలని మన రాజ్యాంగం చాటి చెప్పింది. ఆ రాజ్యాంగం అమల్లోకి వచ్చిన రిపబ్లిక్ డే కూడా మరో రెండేళ్లలో అమృతోత్సవం తలుపు తట్టబోతున్నది. ప్రజల కొరకు ప్రజల చేత ఏర్పడే ప్రజా ప్రభుత్వ పాలనే ప్రజాస్వామ్యమని అబ్రహాం లింకన్ చెప్పారు. అంబేడ్కర్ రాసిన భారత రాజ్యాంగంలోని అన్ని అధికరణాల్లో అణువణువునా ఇదే స్ఫూర్తి ప్రవహించింది. ప్రజలందరి చేత ఎన్నికైన ప్రజా ప్రభుత్వం ప్రజలందరి కోసం పని చేయాలి. భారత రాజ్యాంగానికి హృదయంగా భావించే పీఠిక ఇదే విషయాన్ని మూడు ముక్కల్లో చెప్పింది. కొన్ని చారిత్రక కారణాల వలన సమాజంలోని విశాల జనబాహుళ్యానికి వెనకబాటు తనం వారసత్వంగా లభించింది. వారందరినీ ముందు వరసలో ఉన్నవారి సరసన నిలబెట్టడానికి ప్రభుత్వం పూనుకోవాలని రాజ్యాంగం ఆదేశిస్తున్నది. అప్పుడే సమాజంలోని ప్రజలందరి మధ్యన ఆరోగ్యకరమైన పోటీ నెలకొంటుంది. రాజ్యాంగ ఆదేశాలు అటకెక్కిన ఫలితాన్ని ఇప్పుడు మనం అనుభవిస్తున్నాము. డబ్బున్నవాడే ప్రజా ప్రతినిధిగా ఎన్నిక కాగలిగే దుస్థితికి ప్రజాస్వామ్యం దిగజారుతున్నది. విద్య అంగడి సరుకైన ఫలితంగా నాణ్యమైన విద్య కలవారి బిడ్డలకే రిజర్వయి పోయింది. పేద పిల్లలకు నాసిరకం చదువు తప్ప గత్యంతరం లేదు. ఈ పరిస్థితిని చక్కదిద్దడానికి రాజ్యాంగ లక్ష్యాలకు అనుగుణంగా పరిపాలన చేయడానికి గతంలో ప్రయత్నాలు జరగకపోలేదు. ఈ సందర్భంగా కాలగమనంలోని ఒక కీలక ఘట్టాన్ని గుర్తుకు తెచ్చుకోవాలి. పి.వి. నరసింహారావు ఈ దేశానికి ప్రధానిగా బాధ్యతలు స్వీకరించే సమయానికి ఆర్థిక వ్యవస్థను సరళీకరించవలసిన అనివార్య పరిస్థితులు ఏర్ప డ్డాయి. ఈ కర్తవ్యాన్ని ఆయన వ్యక్తిగత శ్రద్ధతో నిర్వహించారు. క్రమంగా గ్లోబల్ ఎకానమీతో భారత ఆర్థిక వ్యవస్థ అనుసంధానం మొదలైంది. బహుళజాతి కంపెనీలు, వాటి గురుపీఠమైన ప్రపంచ బ్యాంకు రంగప్రవేశం చేశాయి. వారికి దేశంలో కమీషన్లు పుచ్చుకొని పనులు చేసిపెట్టగల రాజకీయ దళారుల అవసరం ఏర్పడింది. ప్రైవేటీకరణ జోరు పెరగడంతో గనులు, వనులు, సహజ వనరులపై పెత్తనానికి పెట్టుబడి దారులు పోటీపడ్డారు. కేంద్రంలో, రాష్ట్రాల్లో అధికారంలో ఉండేవారితో వారికి అవసరాలు పెరిగిపోయాయి. తమ ప్రయో జనాలకు అనుకూలంగా మెలిగే నాయకుల కోసం వారు అన్వేషించారు. ఆ సమయంలో ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్టీ రామారావు నాయకత్వంలోని తెలుగుదేశం పార్టీ భారీ మెజారిటీతో అధికారంలోకి వచ్చింది. ఆయనది సంక్షేమ ఎజెండా. పేదల అనుకూల ఫిలాసఫీ. స్వదేశీ విదేశీ పెట్టుబడి దారులకు పనికివచ్చే నాయకుడు కాదు. అదే సమయంలో హఠాత్తుగా తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే లందరికీ ఎన్టీ రామారావు పట్ల విరక్తి కలిగింది. ఆయన లక్ష్మీ పార్వతిని పెళ్లి చేసుకోవడం వారికి నచ్చలేదు. రాత్రికి రాత్రే తిరుగుబాటు చేశారు. కథ ఈ రకంగా ప్రచారంలోకి వచ్చింది. వాస్తవానికి ఎన్నికల కంటే రెండేళ్ల ముందుగానే ఎన్టీఆర్ పెళ్లి చేసుకున్నారు. తిరుపతిలో లక్షమంది సమక్షంలో లక్ష్మీపార్వతిని భార్యగా ప్రకటించారు. ఆ తర్వాత ఎన్నికల ప్రచార సభల్లో ఎన్టీఆర్‌తోపాటు లక్ష్మీపార్వతి కూడా పాల్గొని ప్రసంగించారు. అప్పుడు లేని ఆగ్రహం గెలిచిన తర్వాత ఏడాదిలోపే పార్టీ ఎమ్మెల్యేలకు కలగడం విడ్డూరమే. కానీ ఈ విడ్డూరమే చరిత్రగా నమోదైంది. అసలు జరిగింది వేరు. సరళీకరణతో అందివస్తున్న అవకాశాలను వేగంగా ఆక్రమించుకోవాలనుకునే స్వార్థపూరిత శక్తులకు చంద్రబాబులో ఒక నమ్మకమైన సేవకుడు కనిపించాడు. ప్రపంచ బ్యాంకు ఆకాంక్షల మేరకు లక్షలాది మంది రైతుల్ని వ్యవసాయ రంగం నుంచి తరిమేసేవాడు, విద్య – వైద్య రంగాలను కూడా ప్రైవేట్ రంగానికి అప్పగించగలిగేవాడు, ప్రభుత్వ ఉద్యోగుల్ని కోతకోసేవాడు చంద్రబాబులో కనిపించాడు. మీడియాతో సహా సమస్త వ్యవస్థలూ చంద్రబాబుకు సహకరించాయి. నిశ్శబ్దంగా ఎన్టీఆర్ పదవీచ్యుతుడయ్యారు. నిస్సహాయంగా ఆయన మరణించారు. చంద్రబాబు ఉమ్మడి రాష్ట్రానికి తొమ్మిదేళ్ల పాటు ముఖ్య మంత్రిగా పనిచేసిన కాలం గుర్తున్నవారికి నాటి సామాజిక సంక్షోభం కూడా గుర్తుండే ఉంటుంది. పంట పొలాలు మరు భూములుగా మారడం గుర్తుండే ఉంటుంది. ఫ్యాక్టరీల్లో, నిర్మాణ రంగాల్లో పనిచేయడానికి చీప్ లేబర్ దొరకాలంటే వ్యవసాయ రంగం నుంచి లక్షలాది మందిని బయటకు పంపాలి. అందువల్లనే ‘వ్యవసాయం దండగ’ అనే సిద్ధాంతాన్ని ప్రతిపాదించి కృత్రిమ సంక్షోభాన్ని సృష్టించాడు. ప్రభుత్వ విద్యారంగాన్నీ, వైద్యరంగాన్నీ నిర్లక్ష్యం చేసి ప్రైవేట్ వ్యాపారుల్ని ప్రోత్సహించాడు. ఫలితంగా పేదలు, రైతుల పరిస్థితి దుర్భరంగా తయారైంది. తాను అమలుచేస్తున్న విధానాలకు మద్దతుగా తన భావజాలాన్నీ, ఆలోచనల్నీ వివరిస్తూ ‘మనసులో మాట’ పేరుతో ఒక పుస్తకాన్ని కూడా రాశారు. సంక్షేమాన్ని పూర్తిగా గాలికి వదిలేసి ఆర్థిక రంగాన్ని మార్కెట్ శక్తులకు వదిలేయాలనేది ఆయన సిద్ధాంతం. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి వేగంగా పరిస్థితుల్ని చక్కదిద్ది, పెను సామాజిక సంక్షోభం నుంచి రాష్ట్రాన్ని గట్టెక్కించారు. మానవీయ అభివృద్ధి కోణాన్ని ఆవిష్కరించారు. అత్యున్నత స్థాయిలో సమాజాన్ని ప్రజాస్వామ్యీకరించడం కోసం, ప్రజాశక్తులను సాధికారం చేయడం కోసం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం ఆంధప్రదేశ్‌లో కొన్ని బృహత్తర కార్యక్రమాలను చేపట్టింది. ప్రజా సంక్షేమం, మానవీయ అభివృద్ధి విషయాల్లో ఆయన ఎన్టీ రామారావు, వైఎస్ రాజశేఖర రెడ్డిలను అధిగమించారు. ‘అధికారం అందరికీ – అభివృద్ధి అందరిదీ’ అనే దిశగా తన ప్రభుత్వ ప్రాథమ్యాలను ఆయన నిర్ధారించుకున్నారు. అధికార పీఠాలకు ఆమడదూరంలో ఉంటున్న అనేక సామాజిక వర్గాలను గుర్తించి వారి నుంచి ఎంపిక చేసిన వారికి వివిధ స్థాయుల్లో పదవులు కల్పించారు. ఆ వర్గాల అభివృద్ధికి ప్రత్యేక కార్పొరేషన్లు ఏర్పాటు చేశారు. స్థానిక సంస్థల దగ్గర్నుంచి రాష్ట్ర కేబినెట్ వరకు సింహభాగం పదవులను బలహీన వర్గాలకు కేటాయించారు. నామినేషన్ ద్వారా ఇచ్చే కాంట్రాక్టు పనుల్లోనూ, నామినేటెడ్ పదవుల్లోనూ ఈ వర్గాలకే పెద్దపీట వేశారు. అన్ని విభాగాల్లో అన్ని స్థాయిల్లోనూ మహిళలకు అర్ధభాగం పదవులను కేటా యించారు. రాజకీయ సాధికారత దిశగా బలహీనవర్గాల ప్రజలు, మహిళలు వేసిన తొలి అడుగులివి. విద్య, వైద్య, వ్యవసాయ రంగాల్లో ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలకు దేశవిదేశాల నుంచి ప్రశంసల వర్షం కురుస్తు న్నది. ఈ మూడేళ్లలో రెండేళ్ల కాలాన్ని కోవిడ్ కాటువేసినప్పటికీ సగటున ఒక్కో విద్యార్థి మీద వైఎస్ జగన్ ప్రభుత్వం లక్ష రూపాయల చొప్పున ఖర్చు చేసింది. ఇప్పుడు అదనంగా ఏటా 24 వేల రూపాయల విలువైన ‘బైజూస్’ కంటెంట్‌ను ఉచితంగా అందివ్వబోతున్నది. అన్ని వర్గాల నుంచి వచ్చే పిల్లలకు వారి ఆర్థిక స్థోమతతో సంబంధం లేకుండా అత్యంత నాణ్యమైన విద్యను ఉచితంగా రాష్ట్ర ప్రభుత్వం అందజేస్తున్నది. ప్రపం చంతో పోటీ పడగల మెరుగైన మానవ వనరులను తీర్చి దిద్దడమే లక్ష్యంగా పెట్టుకున్నది. ప్రజారోగ్య వ్యవస్థ కొత్త పుంతలు తొక్కబోతున్నది. ప్రతి ఇంటినీ గడువు ప్రకారం ఒక ఫ్యామిలీ డాక్టర్ సందర్శించే దిశగా, ప్రతి వ్యక్తి ఆరోగ్య ప్రొఫైల్ కంప్యూటర్లో నిక్షిప్తమయ్యే విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రతి గ్రామంలోనూ ఒక హెల్త్ సెంటర్ ఏర్పాటైంది. వ్యవసాయా భివృద్ధిలో రైతుకు అండగా నిలబడేందుకు ఏర్పాటుచేసిన ఆర్బీకే సెంటర్ల ప్రయోగాన్ని కళ్లారా చూసేందుకు నిత్యం ఇతర రాష్ట్రాల నుంచి ప్రతినిధి బృందాలు ఏపీకి వస్తున్నాయి. ప్రజల సాధికారత, ప్రభుత్వ వ్యవహారాల పారదర్శకత, అధికార వికేంద్రీకరణ అనే మూడు అంశాలు సమాజ ప్రజా స్వామ్యీకరణ స్థాయిని నిర్ధారిస్తాయి. అత్యున్నత స్థాయి ప్రజా స్వామ్యీకరణ మన రాజ్యాంగం నిర్దేశించిన లక్ష్యం. ఉన్నత స్థాయి ప్రజాస్వామ్యీకరణ ఉన్నత స్థాయి ఆర్థిక వృద్ధికి దోహదం చేస్తుందని ఇప్పుడు ఆర్థికవేత్తలు చెబుతున్నారు. ఇటీవల కేంద్రం విడుదల చేసిన జీఎస్డీపి గ్రోత్ రేట్ జాబితాలో అగ్రస్థానంలో నిలబడిన ఆంధ్రప్రదేశ్ ఇదే విషయాన్ని నిర్ధా రించింది. ప్రభుత్వ పథకాల అమలులో ఒక్క పైసా వృథా కాని విధంగా పారదర్శక పంపిణీ విధానాన్ని రూపొందించింది. అధికార వికేంద్రీకరణను గ్రామస్థాయికి తీసుకొనిపోయింది. గ్రామ సచివాలయాల ఏర్పాటు వికేంద్రీకరణలో చిట్టచివరి మెట్టు. ఈ వికేంద్రీకరణలో భాగంగానే రాష్ట్ర రాజధానిని కూడా విభిన్నమైన అభివృద్ధి దశల్లో ఉన్న మూడు భౌగోళిక ప్రాంతాల మధ్య విభజిస్తూ నిర్ణయం తీసుకున్నది. ఈ చర్య ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీకి నిద్ర పట్టనీయడం లేదు. విభజిత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రి కావడానికి చంద్రబాబుకు వివిధ కారణాలు దోహదపడ్డాయి. సంక్షోభాలను అవకాశాలుగా మలుచుకోవడం తన నైజమని అనేక సందర్భాల్లో ఆయనే స్వయంగా చెప్పుకున్నారు. కొత్త రాష్ట్రానికి రాజధాని లేని పరిస్థితిలో ఆయనకు సంక్షోభం కనిపించింది. దాన్ని సొంత అవకాశంగా మలుచుకునే ప్రయత్నంలోనే ఐదేళ్ల పదవీకాలం గడిచిపోయింది. తనమీద నమ్మకంతో 34 వేల ఎకరాల భూమిని స్వయంగా రైతులు ల్యాండ్ పూలింగ్‌కు అప్పగించారని ఆయన చెప్పుకుంటారు. ఈ భూమిలో చాలా భాగాన్ని బాబు అనుయాయులు ముందుగానే కొనుగోలు చేసి రైతుల పేరుతోనే పూలింగ్‌కు అప్పగించారని, మిగిలిన రైతులను తప్పనిసరిగా ఇచ్చి తీరవలసిన పరిస్థితికి నెట్టివేశారని స్థానికులు చెబుతున్నారు. ఈ కార్యక్రమానికంటే ముందుగానే పూలింగ్ ప్రాంతానికి వెలుపల వేలాది ఎకరాల భూమిని తన అనుయాయుల చేత, తన వర్గీయుల చేత కొనిపించారనీ, ఇది అక్షరాల ఇన్సైడర్ ట్రేడింగేనన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. రాజధాని పేరుతో ప్రపంచంలోనే పెద్దదైన ఒక రియల్ ఎస్టేట్ వెంచర్‌ను ఆయన ప్లాన్ చేశారు. ఈ వెంచర్‌పై కళ్లు చెదిరే లాభాలు ఆర్జించడం కోసం తన వారి చేత వేల కోట్లు పెట్టుబడులుగా పెట్టించినట్టు సమాచారం. ‘మదర్ ఆఫ్ ఆల్ స్కామ్స్’ అనే పేరు ఇప్పటికే ఈ వెంచర్‌కు స్థిరపడిపోయింది. మహిళా సాధికారతలో భాగంగా పేద వర్గాల మహిళల పేరుతో రాష్ట్రవ్యాప్తంగా 30 లక్షల మందికి వైఎస్ జగన్ ప్రభుత్వం ఇళ్ల పట్టాలిచ్చింది. ఇళ్లు నిర్మించే కార్యక్రమాన్ని తలకెత్తుకున్నది. అందులో భాగంగా రాజధాని ప్రాంతంలో కూడా ఒక 50 వేల మంది పేద వర్గాల మహిళలకు పట్టాలివ్వాలని నిర్ణయం తీసుకున్నది. దీంతో గగ్గోలు పుట్టిన తెలుగుదేశం పార్టీ ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ కోర్టు మెట్లెక్కింది. పేద వర్గాలకు పట్టాలివ్వడం వల్ల సామాజిక సమతుల్యత దెబ్బతింటుందని వాదించింది. ఇది పక్కా రియల్ ఎస్టేట్ వెంచరే అన్న అంశాన్ని ఈ చర్య నిర్ద్వంద్వంగా నిరూ పించింది. ఎట్టి పరిస్థితుల్లోనైనా పేదలకు పట్టాలివ్వాల్సిందేననీ, అందుకు అవసరమైన చట్ట సవరణలు చేయాలనీ రాష్ట్ర కేబినెట్ నిర్ణయించినట్టు ఇటీవల వార్తలు వచ్చాయి. దీంతో తెలుగుదేశం పార్టీ, దాని అనుబంధ మీడియా ఉలిక్కిపడ్డాయి. ఇప్పుడు రాజధాని రైతుల పేరుతో అమరావతి నుంచి ఉత్తరాంధ్రలోని అరసవిల్లి దాకా ఒక పాదయాత్రను ప్రకటించారు. ‘ఇది పాదయాత్ర కాదు, విశాఖకు పాలనా రాజధానిని దూరం చేయడానికి సాగిస్తున్న దండయాత్ర’గా అక్కడి రాజకీయ నాయకులు, ప్రజలు పరిగణిస్తున్నారు. ‘జనాభాలో ఎనభై శాతంగా ఉన్న పేద వర్గాలకు చోటులేని ప్రాంతాన్ని రాజధానిగా మేం ఎలా అంగీకరిస్తామ’ని ఆ వర్గం ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఈ పాదయాత్ర పేరుతో పేదవర్గాల ప్రయోజనాల మీద ధనస్వామ్యం దండయాత్ర చేస్తున్నదని వారు ఆరోపిస్తున్నారు. వైఎస్ జగన్ విజన్‌కు చంద్రబాబు ఆలోచనా విధానం పూర్తిగా వ్యతిరేకమైనది. ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఆవిష్కృతుడైన క్రమం, ఆయనే వెల్లడించుకున్న ఆయన ఫిలాసఫీ, అమలు చేసిన కార్యక్రమాలు ఈ విషయాన్ని వెల్లడిస్తున్నాయి. ఎన్టీఆర్‌ను పదవీచ్యుతుడిని చేసినప్పుడు ఆయన వెన్నంటి ఉన్న మీడియా, ఇతర వ్యవస్థలతో బాబు స్నేహ సంబంధాలు అలాగే కొనసాగుతున్నాయి. ఎన్టీ రామారావును గద్దె దించేంతవరకు మాయోపాయాలకు, మంత్ర విద్యలకే పరిమితమైన బాబు కోటరీ మీడియా ఆ తర్వాత యెల్లో మీడియాగా అవతరించింది. వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయ్యేసరికి గోబెల్స్ క్షుద్ర విద్యను ఆవాహన చేసి జనం మెదళ్లను కలుషితం చేయడాన్ని అలవాటు చేసుకున్నది. వైఎస్ జగన్ నేతృత్వంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఏర్పడినప్పటి నుంచీ యెల్లో మీడియా సంస్థలు విషసర్పాల అవతారం దాల్చాయి. ఆయన ముఖ్యమంత్రిగా బాధ్యతలను స్వీకరించిన దగ్గర్నుంచి ఈ మూడేళ్లలో విషం చిమ్మని రోజు లేదు. సకల జన సాధికారత కోసం జగన్మోహన్రెడ్డి చేపడుతున్న కార్యక్రమాల ఫలితంగా జనంలో ఆయనకు పెరుగుతున్న ఆదరణను సహించలేకపోతున్నది. ఆయన మీదా, ఆయన కుటుంబ సభ్యుల మీదా నిందా ప్రచారాలకు దిగజారుతున్నది. వారి సొంత ప్రయోజనాల కోసం పెట్టుకున్న రియల్ ఎస్టేట్ వ్యాపారానికి రైతాంగ పోరాటం అనే ముద్ర వేసి ప్రజలను తప్పుదారి పట్టించేందుకు ప్రయత్నిస్తున్నది. ఈ కుయుక్తులు ఇప్పుడు ప్రజలకు బాగా అర్థమవుతున్నాయి. చంద్రబాబు, ఆయన పార్టీ, యెల్లో మీడియా ఆగడాల మీద, దుష్ప్రచారాల మీద బలహీన వర్గాల ప్రజలు అతి త్వరలో ప్రజాకోర్టులో ఛార్జిషీట్లు దాఖలు చేయబోతున్నారు. తమ బిడ్డలకు ఇంగ్లిష్ మీడియం బోధనను వ్యతిరేకించినందుకూ, ‘అమ్మ ఒడి’పై దుష్ప్రచారం చేసినందుకూ అమ్మల సంఘం ఛార్జిషీటు సిద్ధ మవుతున్నది. బలహీన వర్గాల ఇళ్ల పట్టాలను కోర్టు ద్వారా అడ్డు కునే ప్రయత్నం చేసి నందుకు ఆ మహిళలంతా నేరారోపణ పత్రాన్ని రచిస్తున్నారు. రాజధాని ప్రాంతం నుంచి బలహీన వర్గాలను వెలివేస్తున్నందుకు ఆ వర్గాలు యెల్లో కూటమిపై అట్రాసిటీ అభియోగం చేయ బోతున్నాయి. ప్రజా కోర్టులో ఇక సందడే సందడి. ధనస్వామ్యం దండయాత్రలను పేదవర్గాలు చీల్చి చెండాడే సందడి. ‘ఇప్పుడు రాజధాని రైతుల పేరుతో అమరావతి నుంచి ఉత్తరాంధ్రలోని అరసవిల్లి దాకా ఒక పాదయాత్రను ప్రక టించారు. ‘ఇది పాదయాత్ర కాదు విశాఖకు పాలనా రాజధానిని దూరం చేయడానికి సాగిస్తున్న దండ యాత్ర’గా అక్కడి రాజకీయ నాయకులు, ప్రజలు పరిగ ణిస్తున్నారు. ‘జనాభాలో ఎనభై శాతంగా ఉన్న పేద వర్గాలకు చోటులేని ప్రాంతాన్ని రాజధానిగా మేం ఎలా అంగీకరిస్తామ’ని ఆ వర్గం ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఈ పాదయాత్ర పేరుతో పేదవర్గాల ప్రయోజనాల మీద ధనస్వామ్యం దండయాత్ర చేస్తున్నదని వారు ఆరోపి స్తున్నారు. జగన్ విజన్‌కు బాబు ఆలోచనా విధానం పూర్తిగా వ్యతిరేకమైనది. సీఎంగా చంద్రబాబు ఆవిష్కృ తుడైన క్రమం, ఆయనే వెల్లడించుకున్న ఆయన ఫిలా సఫీ, అమలుచేసిన కార్యక్రమాలు ఈ విషయాన్ని వెల్లడి స్తున్నాయి. ఎన్టీఆర్‌ను పదవీచ్యుతుడిని చేసినప్పుడు ఆయన వెన్నంటి ఉన్న మీడియా, ఇతర వ్యవస్థలతో బాబు స్నేహ సంబంధాలు అలాగే కొనసాగుతున్నాయి. ఎన్టీఆర్‌ను గద్దె దించేంతవరకు మాయోపాయా లకు, మంత్ర విద్యలకే పరిమితమైన బాబు కోటరీ మీడియా ఆ తర్వాత యెల్లోమీడియాగా అవతరించింది. వైఎస్ ముఖ్యమంత్రి అయ్యేసరికి గోబెల్స్ క్షుద్ర విద్యను ఆవాహన చేసి జనం మెదళ్లను కలుషితం చేయడాన్ని అలవాటు చేసుకున్నది. జగన్ నేతృత్వంలో వైఎస్సార్సీపీ ఏర్పడినప్పటి నుంచీ యెల్లో మీడియా సంస్థలు విష సర్పాల అవతారం దాల్చాయి. ఆయన సీఎంగా బాధ్యత లను స్వీకరించిన దగ్గర్నుంచి ఈ మూడేళ్లలో విషం చిమ్మని రోజు లేదు. సకల జన సాధికారతకోసం జగన్ చేపడుతున్న కార్యక్రమాల ఫలితంగా జనంలో ఆయ నకు పెరుగుతున్న ఆదరణను సహించ లేకపోతున్నది.’ ‘చంద్రబాబు ఉమ్మడి రాష్ట్రానికి తొమ్మిదేళ్ల పాటు ముఖ్యమంత్రిగా పనిచేసిన కాలం గుర్తున్నవారికి నాటి సామాజిక సంక్షోభం కూడా గుర్తుండే ఉంటుంది. పంట పొలాలు మరు భూములుగా మారడం గుర్తుండే ఉంటుంది. ఫ్యాక్టరీల్లో, నిర్మాణ రంగాల్లో పనిచేయడా నికి చీప్ లేబర్ దొరకాలంటే వ్యవసాయ రంగం నుంచి లక్షలాది మందిని బయటకు పంపాలి. అందు వల్లనే ‘వ్యవసాయం దండగ’ అనే సిద్ధాంతాన్ని ప్రతిపా దించి కృత్రిమ సంక్షోభాన్ని సృష్టించాడు. ప్రభుత్వ విద్యారంగాన్నీ, వైద్యరంగాన్నీ నిర్లక్ష్యం చేసి ప్రైవేట్ వ్యాపారుల్ని ప్రోత్సహించాడు. ఫలితంగా పేదలు, రైతుల పరిస్థితి దుర్భరంగా తయారైంది. తాను అమలుచేస్తున్న విధానాలకు మద్దతుగా తన భావ జాలాన్నీ, ఆలోచనల్నీ వివరిస్తూ ‘మనసులో మాట’ పేరుతో ఒక పుస్తకాన్ని కూడా రాశారు. సంక్షేమాన్ని పూర్తిగా గాలికి వదిలేసి ఆర్థిక రంగాన్ని మార్కెట్ శక్తులకు వదిలేయాలనేది ఆయన సిద్ధాంతం. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన డాక్టర్ వైఎస్ రాజ శేఖరరెడ్డి వేగంగా పరిస్థితుల్ని చక్కదిద్ది, పెను సామా జిక సంక్షోభం నుంచి రాష్ట్రాన్ని గట్టెక్కించారు. మాన వీయ అభివృద్ధి కోణాన్ని ఆవిష్కరించారు. అత్యున్నత స్థాయిలో సమాజాన్ని ప్రజాస్వామ్యీక రించడం కోసం, ప్రజాశక్తులను సాధికారం చేయడం కోసం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం ఆంధ్ర ప్రదేశ్‌లో కొన్ని బృహత్తర కార్యక్రమాలను చేపట్టింది. ప్రజా సంక్షేమం, మానవీయ అభివృద్ధి విషయాల్లో ఆయన ఎన్టీ రామారావు, వైఎస్ రాజశేఖర రెడ్డిలను అధిగమించారు. ‘అధికారం అందరికీ – అభివృద్ధి అందరిదీ’ అనే దిశగా తన ప్రభుత్వ ప్రాథమ్యాలను ఆయన నిర్ధారించుకున్నారు.’ వర్ధెల్లి మురళి vardhelli1959@gmail.com -
యుద్ధంపై విమర్శ... రష్యాన్ రాజకీయవేత్తపై వేటు..
మాస్కో: ఉక్రెయిన్ పై యుద్ధం చేయడం గురించి రష్యన్ రాజకీయవేత్త ఒకరు విమర్శించారు. ఇలా ఉక్రెయిన్ పై అమానుషంగా యుద్ధం చేసి అమాయకుల ప్రాణాలను పొట్టనబెట్టుకోవడం తప్పు అంటూ పలు విమర్శలు చేశారు. అంతే సదరు రాజకీయవేత్త, మాజీ మేయర్ యెవ్జెనీ రోయిజ్ మాన్ పై రష్యాన్ అధికారులు సీరియస్ అవ్వడమే కాకుండా అతన్ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఇలాంటి చర్యలు రష్యా బలగాలను అప్రతిష్టపాలు చేసేలా చేయడమేనంటూ మండిపడ్డారు. అతను ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు ఎందుకు చేశాడని కూలంకషంగా రష్యా అధికారులు దర్యాప్తు చేయడం ప్రారంభించారు. అతను రష్యాలో ప్రధాన ప్రతిపక్షం అభ్యర్థి, పైగా పలు మేయర్ పదువులను అలంకరించిన ప్రముఖ వ్యక్తి. వాస్తవానికి రష్యా ఉక్రెయిన్ పై చేస్తున్న దురాక్రమణ యుద్ధాన్ని ప్రత్యేక సైనిక చర్యగా అభివర్ణించుకుంటోంది. ఈ తరుణంలో ఎవరైన క్రెమ్లిన్‌ని తప్పుపట్టేలా అనుచిత వ్యాఖ్యలు చేస్తే కన్నెరజేస్తోంది రష్యా. ఆయా వ్యక్తుల పై కఠిన చర్యలు తీసుకోవడమే కాకుండా అరెస్టు చేయడం వంటి చర్యలు తీసుకుంటోంది. గతంలో ఒక యాంకర్ కూడా ఇలానే యుద్ధం వద్దంటూ ప్లకార్డులు పట్టుకున్నందుకు ఆమెను రష్యా భధ్రతా బలగాలు అదుపులోకి తీసుకుని అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. మరోవైపు ఉక్రెయిన్ దళాలు కూడా ఈ దాడిని ప్రతిఘటించడమే కాకుండా రష్యా తన బలగాలను ఉపసంహరించుకునేలా పశ్చిమ దేశాలు రష్యా పై కఠిన ఆంక్షలు విధించాయి కూడా. ఆఖరికి ఐక్యరాజ్యసమితి విజ్ఞప్తిని తోసిపుచ్చి తనదైన శైలిలో ఉక్రెయిన్ పట్ల దురుసుగా వ్యవహరిస్తోంది. (చదవండి: ఉక్రెయిన్‌ని విడిచిపెట్టి వచ్చేయండి!... హెచ్చరించిన యూఎస్) -
అంతర్జాతీయ సంఘీభావమే ఆయుధం
రష్యన్ నియంత పుతిన్‌కి వ్యతిరేకంగా నిలబడాలంటే మాకు ప్రస్తుతం ఉన్న గొప్ప ఆయుధాలు ఏవంటే – అంతర్జాతీయ సంఘీభావం, మద్దతు మాత్రమే! బయటినుంచి మద్దతు లేకుండా మేం గెలుపు సాధించలేం. ఉక్రెయిన్ చరిత్రలోనే కాదు, ప్రజాస్వామ్య రక్షణ కోసం కూడా ఇది కీలకమైంది. ఇది ఉక్రెయిన్‌కి, రష్యాకి మధ్య ప్రాంతీయ ఘర్షణ ఏమాత్రం కాదు. నిరంకుశత్వానికీ, సామ్రాజ్యవాదానికీ వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటం ఇది. ఉక్రెయిన్ కోసం మేం చేస్తున్న పోరాటంలో విజయం అనివార్యమని నేను బలంగా నమ్ముతున్నాను. తమ స్వాతంత్య్రం కోసం, ఆత్మగౌరవం కోసం సామాన్యులైన ఉక్రెయిన్ పౌరులు తమకు సంబంధించిన సమస్తాన్నీ అందిస్తున్నప్పుడు, విజయం ఒక్కటే మాకు దక్కాల్సి ఉంది. మక్సీమ్ కురొచ్కిన్ ఒక నాటక రచయిత. ఈయన, మరో 20 మంది నాటక రచయితలు కలిసి పాత కీవ్ నడిబొడ్డున ఒక కొత్త రంగస్థలాన్ని నిర్మించాలని దాదాపు మూడేళ్లుగా ప్లాన్ చేస్తున్నారు. మార్చి 12న నాటక రచయితల థియేటర్ని ప్రారంభించడం కోసం, ఒక అద్భుతమైన పాత నిర్మాణాన్ని వారు కనుగొన్నారు. కానీ ఫిబ్రవరి 24నే మక్సీమ్, ఆయన సహచరులు భీతి కలిగించే బాంబుల శబ్దాలకు మేలుకున్నారు. ఆ తర్వాత మార్చి 12 వచ్చి అలా వెళ్లిపోయింది. తామను కున్న కొత్త థియేటర్ని ఘనంగా ప్రారంభించడానికి బదులుగా మక్సీమ్ ఇప్పుడు రష్యన్ దురాక్రమణదారులను ఓడించడానికి అవసరమైన సైనిక వ్యూహాలను రచిస్తున్నారు. తన చేతిలో కలానికి బదులుగా ఇప్పుడాయన ఆయుధాన్ని పట్టుకుని మోస్తున్నారు. రష్యన్ సైన్యం చట్టవిరుద్ధంగా మా సరిహద్దులను దాటి వచ్చి ఇప్పటికి రెండు నెలలయింది. ఉక్రెయిన్ను ఆక్రమించడానికి వారు చేస్తూవచ్చిన అన్ని ప్రయత్నాల్లోనూ వారు ఓడిపోతూనే ఉన్నారు. ఇంతటి తీవ్రమైన, వీరోచితమైన ప్రతిఘటనను వారు ఊహించలేక పోవడమే వారి వైఫల్యానికి కారణాల్లో ఒకటి. మన అత్యాధునిక సైన్యం, రష్యన్ ఆక్రమణ దాడి వాస్తవాన్ని గ్రహించి పోరాడటానికి ఆయుధాలు చేత పట్టాలని నిర్ణయించుకున్న మక్సీమ్ వంటి స్థానిక రక్షకులే ఉక్రెయిన్ గడ్డపై రష్యన్ల వైఫల్యానికి కారణం. మనపై ఇప్పుడు పడుతున్న బాంబులకు కారణం వాటి బటన్లు నొక్కుతున్న రష్యన్ హస్తాలేనని ప్రజలకు వివరించడానికి నేను అవిరామంగా ప్రయత్నిస్తున్నాను. ఉక్రెయిన్‌లోని మరీయూపోల్లో షెల్టర్‌గా ఉపయోగిస్తున్న థియేటర్‌పై మార్చి 18న రష్యన్ సైన్యం ప్రయోగించిన బాంబు దాడిలో 300 మంది ప్రజలు మరణించారు. నా కుమార్తెతో సహా ఈ సాహసోపేతులైన ప్రాదేశిక రక్షకులలో చాలామంది యుద్ధం ప్రారంభమైన తక్షణం యుద్ధంలో పాల్గొనాలని నిర్ణయించుకున్నారు. వీరిలో ఏ ఒక్కరికీ సైనిక శిక్షణ లేదు, అంతకు ముందు ఎలాంటి సైనిక ఘర్షణల్లోనూ పాల్గొన్న అనుభవమూ లేదు. ప్రాదేశిక రక్షక బలగంలో చేరడానికి తమ పెళ్లిని సైతం వాయిదా వేసుకున్న యువ జంట గానీ, ఆనారోగ్యం బారినపడిన వృద్ధులకు సహాయపడే పనుల్లో ఉండి ఫైటర్‌గా మారాలని నిర్ణయించుకున్న ఆ కమెడియన్ గానీ... ఉక్రెయిన్ ప్రజల చెదరని స్ఫూర్తిని ప్రపంచానికి ప్రదర్శించారు. వీరిలో కొందరు విషాదకరంగా ఈ సమరంలో నేల కూలారు. ఇక బుచా, ఖార్కివ్, మరీయూపోల్ వంటి నగరాల్లో పోరాడుతున్న వారిని రష్యన్ సైనికులు చంపేశారు. సామూహిక ఖనన స్థలాలను తిరిగి తవ్వి, ధ్వంసమైపోయిన మా నగరాల శిథిలాలను తొలగిస్తే తప్ప మా పౌరుల్లో ఎంతమంది చనిపోయిందీ మాకు తెలిసే అవకాశం లేదు. ఈ కథనాలన్నీ వినడానికే షాక్ కలిగిస్తున్నాయి. నియంత వ్లాదిమిర్ పుతిన్ నేతృత్వంలోని క్రూర రష్యన్ సైన్యం నుంచి సరిగ్గా దీన్నే మేం ఊహించాము. 2000 సంవత్సరంలో పుతిన్‌తో నాకు పరిచయం కలిగింది. అప్పట్లో నేనూ, పుతిన్ ఇరువురం మా భూభాగాలకు ప్రధానమంత్రులుగా వ్యవహరించాము. 2004లో నేను ఉక్రెయిన్ అధ్యక్షుడిగా పోటీ చేసినప్పుడు పుతిన్ నాకు వ్యతిరేకంగా ప్రచారం చేశారు. తాను కోరుకున్నది సాధించడానికి పుతిన్ ఎంతకైనా తెగిస్తారన్నది అప్పుడే నాకు స్పష్టమైంది. కానీ అందుకు నేను అవకాశం ఇవ్వలేదు. ఆ ఎన్నికల్లో నేను గెలిచాక, తూర్పున ఉన్న మా పొరుగుదేశం నేతగా ఆయనతో ఫలప్రదమైన సంబంధాలను కొనసాగించాల్సిన అవసరం ఉందని నేను గుర్తించాను. పుతిన్‌కి వ్యతిరేకంగా మాకు ప్రస్తుతం ఉన్న గొప్ప ఆయుధాలు ఏవంటే అంతర్జాతీయ సంఘీభావం, మద్దతు మాత్రమే. ఇదే నన్ను వాస్తవానికి కలతపెడుతోంది. ఉక్రెయిన్‌లో యుద్ధం ప్రపంచ వార్తలుగా మారుతున్నప్పుడు, పలు వారాలపాటు అంతర్జాతీయ చర్చనీయాంశమవుతున్నప్పుడు మా ప్రాదేశిక రక్షకుల పోరాట గాథలపై ఆసక్తి తగ్గిపోతూ వచ్చింది. యుద్ధానికి సంబంధించిన భయానక వాస్తవాలు సాధారణం. సిరియాలో, యెమెన్‌లో, మా సొంత డాన్‌బాస్‌లో మేం వీటిని చూశాం కూడా. కానీ ఉక్రెయిన్‌లో ఉన్న మేం ఎంతమాత్రం అలసట చెందలేదు. అలా అలసిపోవడమే జరిగివుంటే మేం విజయాన్ని కోల్పోయి ఉండేవాళ్లం. మా బలమే ఇప్పుడు మాకు అన్నిటికంటే ముఖ్యం. రష్యన్లు పలుచోట్ల వెనుకంజ వేయడం జరుగుతున్నప్పటికీ, రష్యన్ బలగాలు తిరిగి సమీకృతం అవుతున్నారనీ, తమ దాడిని కొనసాగించడానికి ప్లాన్ చేస్తున్నారనీ మేం వింటున్నాం. ఇప్పుడు మేం ఈ యుద్ధంలో గెలుపొందడానికి మరింత కృతనిశ్చయంతో ఉండాలి. అయితే బయటినుంచి మద్దతు లేకుండా మేం ఇప్పుడు గెలుపు సాధించలేం. ఈ యుద్ధం ఒక నిర్ణయాత్మక ఘటన. ఉక్రెయిన్ చరిత్ర లోనే కాదు, ప్రజాస్వామ్య రక్షణ కోసం కూడా ఇది కీలకమైంది. ఇది ఉక్రెయిన్‌కి రష్యాకి మధ్య ప్రాంతీయ ఘర్షణ ఏమాత్రం కాదు. నిరంకుశత్వానికీ, సామ్రాజ్యవాదానికీ వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటం ఇది. మా మిత్రదేశాలన్నింటినుంచి మా సైన్యానికి ఇప్పుడు ఆయుధాలు, ఇతర సైనికపరమైన సామగ్రి మాకు చాలా అవసరం. మా బలమైన ఆర్థిక వ్యవస్థను చిన్నా భిన్నం చేసిన యుద్ధ గాయాలను మాన్పడానికి ద్రవ్యపరమైన సహాయం మాకు ఇప్పుడు చాలా అవసరం. మా దేశ నాయకత్వం రష్యాతో యుద్ధంలో ముందుపీఠిన ఉండటమే కాదు, అంతర్జాతీయ కార్యాలయాలను, సంస్థలను కాపాడేందుకు కూడా, సమరరంగంలో మా నాయకత్వం నిలబడి పోరాడుతోంది. ఉక్రెయిన్‌లో శాంతిని నెలకొల్పి స్వాతంత్య్రాన్ని పునరుద్ధరించడానికి మాకు అవసరమైన మిత్రుల మద్దతును పొందడానికి వారి కార్యాలయాలను కాపాడటం కూడా మాకు ఎంతో అవసరమే. అదే సమయంలో, మా ప్రాదేశిక రక్షకులకు తగిన సరఫరాలను తప్పక అందించాల్సిన వలంటీర్ల సేన కూడా మాకు ఉంది. యుద్ధ రంగంలో పోరాడేందుకు అవసరమైన రక్షణ సామగ్రిని వారికి అందించడం ఎంతో అవసరం. ఉక్రెయిన్ వరల్డ్ కాంగ్రెస్ వంటి పౌర సమాజ సంస్థలు మా ప్రాదేశిక రక్షకులకు ప్రాణాంతకం కాని సరఫరాలను అందించడంలో అవిరామంగా కృషి చేస్తున్నాయి. మాకు ఎంతో అవసరమైన ఆయుధాలను మా మిత్ర దేశాలు పంపిం చేందుకు తగిన సూచనలు అందించడంలో వీరు నిరవధికంగా చేస్తున్న ప్రయత్నాలు ఎన్నదగినవి. రష్యన్ దురాక్రమణను ఓడించ డానికి అవసరమైన దిగ్బంధన, ఆంక్షల విధింపులో కూడా వీరు సహకరిస్తున్నారు. మేం తుది విజయం సాగించేవరకు మా ప్రాదేశిక రక్షకులు పోరాడుతూనే ఉంటారు. అదే సమయంలో మా మద్దతు దారులు మాకు చేయదగిన ప్రతి సహాయాన్ని చేస్తూనే ఉంటారన డంలో సందేహమే లేదు. ఉక్రెయిన్ కోసం మేం చేస్తున్న పోరాటంలో విజయం అనివార్య మని నేను బలంగా నమ్ముతున్నాను. తమ స్వాతంత్య్రం కోసం, ఆత్మగౌరవం కోసం సామాన్యులైన ఉక్రెయిన్ పౌరులు తమకు సంబంధించిన సమస్తాన్నీ అందిస్తున్నప్పుడు, విజయం ఒక్కటే మాకు దక్కాల్సి ఉంది. ఈ యుద్ధం చివరకి ముగిసిపోయే రోజు కోసం నేను ఎక్కువకాలం వేచి ఉండలేను. మక్సీమ్, అతడి సహచరులు తమ థియేటర్‌ను ప్రారంభించి, కొత్త నాటకాలను ప్రదర్శించే రోజు కోసం ఎదురు చూస్తున్నాను. వారి తాజా రచనలు కేవలం ప్రచారానికి సంబంధించినవి కాదు. అవి వారి స్వరాలు, వారి భావల సమాహారం. మేం ఈరోజు స్వాతంత్య్రం కోసం పోరాడు తున్నాం. రేపు ఉక్రెయిన్ అంటే ఏమిటో నిర్వచిస్తూ స్వాతంత్యాన్ని గెల్చుకున్న మా రచయితలు ప్రదర్శించే నాటకాలను కూడా మేం తిలకిస్తాము. విక్టర్ యుష్చెంకో ,వ్యాసకర్త ఉక్రెయిన్ మాజీ అధ్యక్షుడు (‘ద గార్డియన్’ సౌజన్యంతో) -
‘మాస్కోవా’ ఏం చెబుతోంది?
‘మీకు మీ గురించీ తెలియాలి... శత్రువు గురించీ తెలియాలి. అది కొరవడితే ప్రతి యుద్ధంలోనూ ఓటమి తప్పదు’ అంటాడు చైనా పురాతన సైనిక నిపుణుడు సన్ ట్జూ. ఉక్రెయిన్‌పై వెనకా ముందూ చూడకుండా విరుచుకుపడి దురాక్రమణకు సిద్ధపడిన రష్యాకు తన గురించి మాత్రమే కాదు... తన ప్రత్యర్థి గురించి కూడా ఏమీ తెలియదని ఇప్పటికే అందరికీ అర్థమైంది. ఈలోగా దురాక్రమణ యుద్ధం మొదలై యాభై రోజులు కావొస్తున్న తరుణంలో నల్ల సముద్రంలో లంగరేసిన రష్యా యుద్ధనౌక ‘మాస్కోవా’లో గురువారం ఉదయం హఠాత్తుగా పేలుళ్లు సంభవించి కుప్పకూలింది. ఉక్రెయిన్ దళాల దాడిలో అది నాశనమైందా... లేక అగ్ని ప్రమాదమే దాన్ని దహించిందా అన్నది వెంటనే తెలియకపోయినా ఈ ఉదంతం రష్యా సామర్థ్యాన్ని సందేహాస్పదం చేసింది. మాస్కోవా రష్యా అమ్ములపొదిలో ప్రధానమైన యుద్ధ నౌక. 16 సూపర్ సోనిక్ దీర్ఘ శ్రేణి క్షిపణులను మోసుకెళ్లగల, ప్రత్యర్థులపై అవిచ్ఛిన్నంగా ప్రయోగించగల సామర్థ్యమున్న యుద్ధ నౌక. 2015లో సిరియా సేనలకు మద్దతుగా రష్యా సైన్యం దాడులు నిర్వహించినప్పుడు, అంతకు చాన్నాళ్లముందు 2008లో దక్షిణ ఒసేతియా, అబ్ఖాజియా ప్రాంతాలపై రష్యా నిప్పుల వాన కురిపించినప్పుడు మాస్కోవా పాత్రే ప్రధానమైనది. ఫిబ్రవరిలో ఉక్రెయిన్‌పై విరుచుకుపడి నల్ల సముద్రంలోకి ఆ దేశ నావికాదళం ప్రవేశించకుండా చూడటంలోనూ మాస్కోవాదే కీలకపాత్ర. పైగా ఈ మహమ్మారి నౌకను ముంచింది ఉక్రెయిన్‌కు చెందిన చిన్నపాటి మానవరహిత యుద్ధ విమానం అంటున్నారు. మాస్కోవా లాంటి భారీ యుద్ధ నౌకను ఇలా దెబ్బతీయడం అసాధారణమైంది. ఆ నౌకను కంటికి రెప్పలా కాపాడుకునేందుకు అందులో పటిష్టమైన ఆత్మరక్షణ వ్యవస్థ ఉంటుంది. వాయుమార్గంలో రాగల ఎలాంటి ప్రమాదాన్నయినా దూరంలో ఉండగానే రాడార్లు పసిగడతాయి. ఆ వెంటనే ఆత్మరక్షణ వ్యవస్థ అప్రమత్తమై క్షిపణుల్ని ప్రయోగించి వాటిని ధ్వంసం చేస్తుంది. కానీ ఉక్రెయిన్ వ్యూహం ముందు మాస్కోవా నిస్సహాయగా మారింది. దాడి జరిగిన రోజు ఆ ప్రాంతంలోని కల్లోల వాతావరణాన్ని ఉక్రెయిన్ సానుకూలంగా మలుచుకుని దొంగ దెబ్బ తీయగలిగిందంటున్నారు. ఈ కథనాలు నిజమే అయితే మాస్కోవాతోపాటు రష్యా పరువు కూడా నల్లసముద్రం పాలైనట్టే. నల్ల సముద్ర ప్రాంతం రష్యాకు అనేకవిధాల కీలకమైనది. అటు మధ్యధరా సముద్రంలోకి ప్రవేశించేందుకు ఉపయోగపడటంతోపాటు ఇటు నాటో దేశాలతో అదొక తటస్థ ప్రాంతంగా ఉంటున్నది. నల్లసముద్రానికి తూర్పున రష్యా, జార్జియా, దక్షిణాన టర్కీ, పశ్చిమాన రుమేనియా, బల్గేరియాలుంటే... ఉత్తర, వాయువ్య ప్రాంతాల్లో ఉక్రెయిన్ ఉంటుంది. అక్కడ రష్యా యుద్ధ నౌకల సంచారానికి రెండున్నర శతాబ్దాల చరిత్ర ఉంది. అనేకానేక రష్యా యుద్ధ నౌకలు మోహరించి ఉండే ప్రాంతంలో ఒక ప్రధాన యుద్ధ నౌకను గురి చూసి కొట్టడమంటే మాటలు కాదు. ఏం మాట్లాడాలో తెలియని అయోమయ స్థితిలో రష్యా పడిపోవడం స్పష్టంగా కనబడుతోంది. నౌకలో ఉంచిన ఆయుధాలు పేలడంతో అగ్ని ప్రమాదం చోటు చేసుకుందనీ, నౌకలో ఉన్న 500 మంది నావికాదళ సభ్యులనూ సురక్షితంగా తీసుకురాగలిగామనీ రష్యా అధికారికంగా చెబుతోంది. క్షిపణి వాహకాలు సురక్షితంగా ఉన్నాయంటున్నది. గత నెలలో రష్యా ఆక్రమించుకున్న బెర్డిన్స్క్లోని అజోవ్ నౌకాశ్రయంలో ఉన్న ఆ దేశ యుద్ధ నౌకను ధ్వంసం చేశామని ఉక్రెయిన్ ప్రకటించింది. కానీ ఇంత వరకూ దానిపై రష్యా పెదవి విప్పలేదు. మాస్కోవా ఉదంతం అనేకవిధాల రష్యాను కుంగదీసింది. నల్ల సముద్ర ప్రాంతంలో రష్యా మోహరించిన నౌకలను చూసి నాటో దేశాలు బెంబేలెత్తేవి. దాంతో లడాయి బయల్దేరితే అది సమస్యాత్మకమవుతుందని భయపడేవి. రష్యా సైతం అక్కడి నౌకా శ్రేణులను గర్వకారణంగా భావించుకునేది. కానీ మాస్కోవా దెబ్బతినడంతో అదంతా గాలికి కొట్టుకుపోయింది. ఈ ఉదంతం వల్ల ఆ దేశం పైకి కనిపించేంత శక్తిమంతమైనది కాదనీ, దానికి యుద్ధ సంసిద్ధత సరిగా లేదనీ అందరికీ తేటతెల్లమైంది. అలాగే రష్యా తయారీ రక్షణ సామాగ్రి సామర్థ్యాన్ని మాస్కోవా ఉదంతం ప్రశ్నార్థకం చేస్తున్నది. ఏ దేశం ఉత్పత్తి చేసే రక్షణ సామగ్రికి ఏపాటి శక్తిసామర్థ్యాలున్నాయో నిగ్గుతేలేది యుద్ధ భూమిలోనే. ఆచరణలో ఏదైనా సరిగా అక్కరకు రావడం లేదని తేలితే ఆ రక్షణ సామగ్రికి గిరాకీ పడిపోతుంది. ఇప్పుడు మాస్కోవా ఉదంతం రష్యా తయారీ యుద్ధ నౌకల విషయంలో అలాంటి సందేహాలనే రేకెత్తిస్తోంది. వర్తమాన నాగరిక యుగంలో యుద్ధాలు దేనికీ పరిష్కారం కాదు. దురాక్రమణ ప్రారంభించిన నాటినుంచీ ఆంక్షల చట్రంలో చిక్కుకుని రష్యా ఆర్థికంగా విలవిల్లాడుతోంది. ఇప్పుడిప్పుడే దాని తాలూకు సెగలు అక్కడ కనబడుతున్నాయి. తనకున్న అపార చమురు, సహజవాయు నిక్షేపాలను ఎగుమతి చేస్తూ లక్షలాదిమందికి ఉపాధి కల్పించడంతోపాటు ఆర్థికంగా సుస్థిరమైన స్థానంలో ఉన్న రష్యాకు ఈ దురాక్రమణ గుదిబండలా మారింది. అటు రష్యా దాడుల పరంపరతో ఉక్రెయిన్ జనావాసాలన్నీ నాశనమవుతున్నాయి. వేలాదిమంది పౌరులు ప్రాణాలు కోల్పోయారు. ఉక్రెయిన్ అన్నివిధాలా దెబ్బతింది. ఇప్పటికైనా యుద్ధం వల్ల కలిగే అపారమైన నష్టాన్ని అందరూ గుర్తించాలి. ఇదిలాగే కొనసాగితే మూడో ప్రపంచ యుద్ధంగా ముదిరి, అణ్వాయుధాల ప్రయోగం వరకూ పోయే ప్రమాదం ఉన్నదని అమెరికాతోసహా అందరూ అర్థం చేసుకోవాలి. ఆయుధ సరఫరా కాదు... తక్షణ శాంతికి మార్గం వెదకాలని గ్రహించాలి. -
Russia-Ukraine War: పుతిన్‌ను బోనెక్కించగలరా?
ఉక్రెయిన్‌పై రష్యా దండయాత్ర విచక్షణారహితంగా సాగుతోంది. బుచా పట్టణంలో సాధారణ పౌరుల్ని వెంటాడి వేటాడిన తీరుపై ప్రపంచవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రష్యా మిలటరీపైనా , అధ్యక్షుడు పుతిన్‌పైనా యుద్ధ నేరాల కింద విచారణ జరిపించాలని ప్రపంచ దేశాలు గర్జిస్తున్నాయి. యుద్ధం అంటేనే ఒక ఉన్మాద చర్య. అలాంటప్పు డు అందులో నేరాలుగా వేటిని పరిగణిస్తారు ? రష్యా అధ్యక్షుడు పుతిన్‌పై యుద్ధ నేరాల విచారణ సాధ్యపడుతుందా ? ఇప్పుడు దీనిపైనే సర్వత్రా చర్చ జరుగుతోంది. ఉక్రెయిన్‌లో రష్యా మిలటరీ సాగిస్తున్న అరాచకాలు అన్నీ ఇన్నీ కావు. బుచా పట్టణం శవాల దిబ్బగా మారింది. రక్తమోడుతూ, మసిబొగ్గుల్లా మారిన 300 మంది అన్నెం పున్నెం ఎరుగని పౌరుల మారణహోమం వీడియో అందరినీ కంటతడి పెట్టిస్తోంది. ఏ క్షణంలో ఏమవుతుందోనన్న భయంతో చిన్నారుల శరీరాలపై తల్లిదండ్రులు వారి వివరాలు రాయడం మనసుని పిండేస్తోంది. గత నెలలోనే మారియూపోల్‌లోని ప్రసూతి ఆస్పత్రి, థియేటర్లపై బాంబు దాడులతో రష్యా యుద్ధ నేరాలకు దిగింది. తాజాగా బుచా పట్టణంలో రష్యా మిలటరీ చేసిన మారణకాండతో ఆ దేశాన్ని అంతర్జాతీయ న్యాయస్థానం బోనులోకి ఎక్కించాలన్న డిమాండ్లు ఊపందుకుంటున్నాయి. అయితే రష్యా మాత్రం బుచాలో తాము జరిపింది మిలటరీ ఆపరేషనేనని ఉక్రెయిన్ చూపిస్తున్న ఫొటోలు, వీడియోలు అన్నీ ఉక్రెయిన్ కవ్వింపు చర్యల్లో భాగమేనని ఎదురుదాడి చేస్తోంది. యుద్ధ నేరాలు అంటే ..? ఆయుధ బలం ఉంది కదాని ఒక దేశం ఇష్టారాజ్యంగా మరో దేశాన్ని నాశనం చేస్తామంటే కుదరదు. బలవంతుడి చేతిలో బలహీనులు బలికాకుండా ఉండడం కోసం 19వ శతాబ్ది ప్రారంభంలోనే అంతర్జాతీయ మానవతా చట్టం ద్వారా కొన్ని నిబంధనలు అమల్లోకి వచ్చాయి. రెండో ప్రపంచ యుద్ధం ముగిసిన తర్వాత యుద్ధ నేరాలపై ప్రపంచ దేశాలు విస్తృతంగా చర్చించి ఒక అవగాహనకి వచ్చాయి. 1949 ఆగస్టు 12న జరిగిన జెనీవా ఒప్పందం యుద్ధ నేరాల గురించి స్పష్టతనిచ్చింది. వివిధ ఒడంబడికల ఆధారంగా యుద్ధ నేరాలుగా వేటిని పరిగణించాలో యూఎన్ సభ్యదేశాలు నిర్ణయించాయి. దీని ప్రకారం యుద్ధ నేరాలంటే.. ► యుద్ధంలో పాల్గొనని పౌరుల్ని ఉద్దేశపూర్వకంగా చంపడం ► సాధారణ పౌరుల్ని హింసించడం, గాయపరచడం, వారిపట్ల అమానవీయంగా ప్రవర్తించడం ► ఆసుపత్రులు, స్కూళ్లు, ప్రార్థనాలయాలపై దాడులు జరపడం ► పౌరుల్ని బందీలుగా పట్టుకోవడం, ఆస్తుల్ని ధ్వంసం చేయడం. యుద్ధప్రభావం పౌరులపై పడేలా ధ్వంసం సృష్టించడం ► కొన్ని రకాల మారణాయుధాలు, రసాయన బాంబుల్ని వాడడం ఇవన్నీ యుద్ధ నేరాలుగానే పరిగణిస్తారు. యుద్ధ నేరాలకు సంబంధించి జెనీవా ఒప్పందంలో ఉన్నవన్నీ తమకు సమ్మతమేనని 1954లోనే నాటి సోవియట్ యూనియన్ (యూఎస్ఎస్ఆర్) అంగీకరించింది. 2019లో కూడా రష్యా ఈ ఒప్పందాలకు కట్టుబడి ఉంటామనే స్పష్టతనిచ్చింది. యుద్ధనేరాల కేసు ముందుకెళుతుందా ? రష్యా మిలటరీ లేదంటే ఆ దేశ అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌పై యుద్ధ నేరాల కేసుని ముందుకు తీసుకువెళ్లడం అంత సులభం కాదని న్యాయనిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈ కేసులో నేరారోపణల్ని నమోదు చేయడానికే కనీసం మూడు నుంచి ఆరు నెలలు పడుతుంది. ఉక్రెయిన్ నుంచి యుద్ధ నేరాలకు సంబంధించిన ఆధారాలను సేకరించడం అంత సులభంగా జరిగే అవకాశం లేదని హార్వార్డ్ లా స్కూల్ ప్రొఫెసర్ అలెక్స్ వైటింగ్ అభిప్రాయపడ్డారు. అందుబాటులో ఉన్న సాంకేతిక పరిజ్ఞానంతో ఫొటోలు, వీడియోలు వంటి ఆధారాలు సేకరించినప్పటికీ ఆ మారణకాండకి ఆదేశాలు ఇచ్చిన నాయకులెవరని రుజువు చేయడం సులభం కాదన్నారు. అందుకే నేరారోపణలు నమోదైన తర్వాత కూడా విచారణకు ఏళ్లకి ఏళ్లు పట్టే అవకాశం ఉంది. నెదర్లాండ్స్‌లోని ద హేగ్ కేంద్రంగా పనిచేసే స్వతంత్ర సంస్థ ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టు (ఐసీసీ) యుద్ధనేరాలు, మారణకాండలు, ఊచకోతలపై విచారణ జరుపుతూ ఉంటుంది. ఐసీసీ చీఫ్ ప్రాసిక్యూటర్ కరీమ్ ఖాన్ గత నెలలోనే రష్యా యుద్ధనేరాలపై దర్యాప్తు ప్రారంభించారు. ఐసీసీలో 123 దేశాలకు సభ్యత్వం ఉన్నప్పటికీ రష్యా, ఉక్రెయిన్ సభ్య దేశాలు కాదు. రష్యా ఐసీసీని కనీసం గుర్తించలేదు సరికదా ఆ కోర్టు విచారణకు సహకరించకూడదని నిర్ణయం తీసుకుంది. ఐసీసీ ఏర్పాటైన దగ్గర్నుంచి యుద్ధ నేరాలకు సంబంధించి 30 కేసుల్ని విచారించింది. – నేషనల్ డెస్క్, సాక్షి -
Ukraine Russia War: వ్యూహం మార్చిన రష్యా?
వాషింగ్టన్/కీవ్: నెల దాటుతున్నా ఉక్రెయిన్‌పై పోరులో పెద్దగా సాధించిందేమీ లేకపోగా ఆర్థికంగా, సైనికంగా భారీ నష్టాలు ఎదురవుతుండటంతో రష్యా వ్యూహం మార్చిందా? ముఖ్యంగా అస్సలు కొరుకుడు పడని రాజధాని కీవ్‌ను వదిలి డోనెట్స్క్, లుహాన్స్క్ తదితర వేర్పాటువాద ప్రాంతాల సమాహారమైన పారిశ్రామిక హబ్ డోన్బాస్‌పై పూర్తి పట్టు సాధించాలన్న నిర్ణయానికి వచ్చిందా? అవుననే అంటున్నారు అమెరికా రక్షణ నిపుణులు. అక్కడినుంచి వీలును బట్టి యుద్ధాన్ని విస్తరించడమో, గౌరవప్రదంగా వెనుదిరగడమో చేయాలన్నది రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కొత్త ఎత్తుగడగా కన్పిస్తోందని వారు చెబుతున్నారు. ఏదేమైనా రష్యా ఇప్పటికే వెనక్కు తగ్గినట్టేనని, ఒకరకంగా ఇది ఉక్రెయిన్ విజయమేనని వారంటున్నారు. ‘‘అమెరికా, పశ్చిమ దేశాలు భారీగా అందజేస్తున్న అత్యాధునిక ఆయుధాల సాయంతో ఉక్రేనియన్ దళాలు రెట్టించిన ఉత్సాహంతో విరుచుకుపడుతున్నాయి. రక్షణకే పరిమితమైన స్థాయిని దాటి గేరు మార్చి ఎక్కడికక్కడ భారీగా ఎదురుదాడికి దిగుతున్నాయి. దీనికి వనరుల లేమి, నిత్యావసరాల కొరత తోడవడంతో రష్యా సైన్యం బాగా నీరసించింది. నిరాశా నిస్పృహల్లో కూరుకుపోయింది. దాంతో రష్యాకు రూటు మార్చడం తప్ప మరో మార్గం కన్పించడం లేదు’’ అని విశ్లేషిస్తున్నారు. ఉక్రెయిన్ సైనిక సంపత్తిని బాగా దెబ్బతీయడంతో యుద్ధం తాలూకు తొలి దశ ముగిసినట్టేనన్న రష్యా సైనిక ప్రతినిధి కల్నల్ జనరల్ సెర్గీ రుడ్స్కోయ్ చేసిన ప్రకటన ఇందుకు అద్దం పడుతోందని వారు చెబుతున్నారు. ఇక తమ ప్రధాన లక్ష్యమైన డోన్బాస్ విముక్తిపై దృష్టి సారిస్తామని ఆయన చెప్పడం పుతిన్ వ్యూహంలో మార్పును చెప్పకనే చెబుతోందంటున్నారు. రష్యా తీరులో వచ్చిన మార్పును పసిగట్టిన ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ వెంటనే మరోసారి సంధి ప్రతిపాదన చేశారు. అయితే డోన్బాస్తో పాటు తమ భూభాగంలో అంగుళం కూడా వదులుకునేది లేదని స్పష్టం చేశారు. అయితే డోన్బాస్ ప్రాంతం ఇప్పటికే దాదాపుగా రష్యా అధీనంలోనే ఉందని పశ్చిమ దేశాలు గుర్తు చేస్తున్నాయి. 2014 నుంచీ రష్యా దన్నున్న వేర్పాటువాదుల ప్రభుత్వాలే అక్కడ నడుస్తున్నందున కేవలం దానిపై పట్టుతో సంతృప్తి పడటం రష్యాకు ఓటమి కిందే లెక్క అంటున్నాయి. సైన్యాన్ని ఉక్రెయిన్ అంతటా విస్తరించి అన్నివైపుల నుంచీ దాడికి దిగడం ద్వారా రష్యా దిద్దుకోలేని పొరపాటు చేసిందని విశ్లేషిస్తున్నాయి. ‘‘అఫ్గానిస్తాన్‌తో పదేళ్ల యుద్ధంలో నష్టపోయినంత కంటే ఎక్కువ మంది సైనికులను నెలలోపే రష్యా కోల్పోవడం ఆశ్చర్యమే. రెండు దశాబ్దాల ఆధునీకరణ తర్వాత కూడా రష్యా సైన్యంలో ఎంతటి లోటుపాట్లున్నాయో, సైనిక విభాగాల మధ్య ఎంత సమన్వయ లోపముందో ఈ యుద్ధంతో స్పష్టమైంది’’ అని రక్షణ నిపుణులు అంటున్నారు. చెహిర్నివ్లో ధ్వంసరచన రేవు పట్టణం మారియుపోల్‌ను దాదాపుగా నేలమట్టం చేసిన రష్యా దళాలు చెహిర్నివ్పైనా అదే తీవ్రతతో విరుచుకుపడుతున్నాయి. నిత్యావసరాలు, కరెంటు, ఇతర మౌలిక సదుపాయాల లేమితో నగరం ఇప్పటికే అల్లాడుతోంది. కీవ్‌తో కలిపే కీలక బ్రిడ్జిని ఇటీవల రష్యా ధ్వంసం చేయడంతో పరిస్థితి మరింత విషమించింది. జనం రోడ్ల మీద పొయ్యిలు పెట్టి వండుకుంటున్నారు! దాదాపు 3 లక్షల జనాభాలో సగానికి పైగా ఇప్పటికే వలస బాట పట్టింది. మృతుల సంఖ్య వేలల్లో ఉంటుందని చెప్తున్నారు. ఇళ్లు, ఆస్పత్రులు, పౌర ఆవాసాలపై విచక్షణారహితంగా దాడులు జరుగుతున్నాయి. ఇతర నగరాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొందని సమాచారం. డోన్బాస్‌పై ప్రధానంగా దృష్టి కేంద్రీకరిస్తూనే నగరాలపై దాడిని కొనసాగించాలన్నది రష్యా ఎత్తుగడగా కన్పిస్తోందని ఇంగ్లండ్ రక్షణ శాఖ అంటోంది. కీవ్‌కు పశ్చిమాన 50 కిలోమీటర్ల దూరంలోని యస్నోహోర్దొకా గ్రామం నుంచి కూడా రష్యా దళాలను ఉక్రెయిన్ సైనికులు తాజాగా తరిమేసినట్టు సమాచారం. అమెరికా, పశ్చిమ దేశాలు తమకు మరిన్ని ఆయుధాలివ్వాలని జెలెన్స్కీ చీఫ్ ఆఫ్ స్టాప్ కోరారు. మరోవైపు రష్యా యుద్ధ నేరాలకు సాక్ష్యాలను సేకరించే ప్రయత్నం పెద్ద ఎత్తున జరుగుతోంది. ఇళ్లు, ఆస్పత్రులు, పౌర ఆవాసాలు, అంగీకరించిన సేఫ్ కారిడార్లు, అణు విద్యుత్కేంద్రాలపై రష్యా ఉద్దేశపూర్వకంగా దాడులు చేస్తోందని, నిషేధిత క్లస్టర్ బాంబుల ప్రయోగానికీ దిగిందని అమెరికా, పశ్చిమ దేశాలతో పాటు ఐరాస వంటి అంతర్జాతీయ సంస్థలు కూడా ఆరోపిస్తుండటం తెలిసిందే. ఉక్రెయిన్‌లో ఆస్పత్రులు, అంబులెన్సులు, వైద్య సిబ్బంది, రోగులపై రష్యా సేనలు పదేపదే దాడులు చేస్తున్నాయని ఏపీ వార్తా సంస్థ పేర్కొంది. నెల రోజుల్లో 34 సార్లు ఇలాంటి దాడులకు పాల్పడ్డట్టు చెప్పింది. అణు దాడికి దిగితే ఖబడ్దార్: నాటో ఉక్రెయిన్‌పై జరుపుతున్న ఆటవిక యుద్ధంలో పుతిన్ విజయం సాధిచలేరని నాటో ఉప ప్రధాన కార్యదర్శి మిర్కా జెనా అన్నారు. రసాయన, అణు దాడికి దిగితే అదే మోతాదులో నాటో నుంచి ప్రతి చర్యలు తప్పవన్నారు. నాటో అణ్వాయుధ కూటమి అని గుర్తుంచుకోవాలన్నారు. ఉక్రేనియన్లు రష్యా సేనలకు స్వాగతం పలుకుతారని బహుశా పుతిన్ పగటి కలలు కన్నారని ఎద్దేవా చేశారు. ఉక్రెయిన్ సైనిక సంపత్తిని, యూరప్ ఐక్యతను తక్కువగా అంచనా వేసి భారీ తప్పిదం చేశారన్నారు. -
Russia-Ukraine war: కలకలానికి నెల!
మాస్కో: ఉక్రెయిన్‌పై రష్యా దాడి ఆరంభమై నెల రోజులైంది. ఇప్పటివరకు ఈ సంక్షోభ కారణంగా వేలాది మంది మరణించగా, లక్షలాది మంది నిరాశ్రయులయ్యారు. ప్రపంచ వ్యాప్తంగా ఈ యుద్ధం పెను ప్రకంపనలు సృష్టిస్తోంది. ఉక్రెయిన్ను నిస్సైనికీకరణ చేయడమే లక్ష్యంగా దాడి చేస్తున్నట్లు రష్యా పేర్కొంది. ఉక్రెయిన్‌లో నియో నాజీ జాతీయవాదులు పెరిగారని, వీరిని అదుపు చేయడమే తమ లక్ష్యమని పుతిన్ చెప్పారు. ఉక్రెయిన్ మిలటరీ, మౌలిక సదుపాయాలపై మిస్సైల్ దాడులకు ఆదేశించారు. రష్యా దురాక్రమణకు నిరసనగా అమెరికా, యూరప్‌దేశాలు ఆంక్షల కత్తి ఝళింపించాయి. ఆంక్షల ఫలితంగా రష్యా వద్ద ఉన్న విదేశీ నిల్వల్లో దాదాపు సగం వాడుకునే వీలు లేకుండా పోయింది. రష్యా ఇంధన దిగుమతులను నిలిపివేయాలన్న డిమాండ్‌కు కూడా యూరప్ నుంచి మిశ్రమ స్పందన వచ్చింది. రష్యా చర్చలకు వస్తే నాటోలో చేరే డిమాండ్‌ను వదులుకుంటామని జెలెన్స్కీ ప్రకటించారు. రష్యాకు ఎదురు దెబ్బలు కీవ్ వరకు వేగంగా వచ్చిన రష్యా దళాలకు అక్కడినుంచి భీకర ప్రతిఘటన ఎదురైంది. పాశ్చాత్య దేశాలందించిన ఆయుధాలతో ఉక్రెయిన్ బలగాలు రష్యన్లను ఎక్కడికక్కడ నిరోధించాయి. దీంతో పలు చోట్ల రష్యాకు తీవ్ర నష్టం వాటిల్లినట్లు సమాచారం. ఉక్రెయిన్ వైమానిక స్థావరాలను ధ్వంసం చేసినట్లు రష్యా చెప్పినా, ఇప్పటికీ ఉక్రెయిన్ నింగిపై రష్యాకు పట్టు చిక్కలేదు. మారియోపోల్ వంటి నగరాలను రష్యన్లు స్వాధీనం చేసుకోగలిగినా ఇంకా కీలక నగరాలు రష్యాకు చిక్కలేదు. నాటో అంచనా ప్రకారం యుద్ధంలో దాదాపు 15వేల మంది రష్యన్లు మరణించారు. కాగా, అణు, జీవ, రసాయన ఆయుధాలు రష్యా ప్రయోగించే ప్రమాదముందని భయాలు పెరిగాయి. తర్వాతేంటి? ఆంక్షల ప్రభావంతో రష్యా ఆర్థికంగా తీవ్రంగా ప్రభావితమవుతోంది. అయినా పుతిన్ వెనక్కి తగ్గలేదు. రష్యాలో పుతిన్‌పై అభిమానం తగ్గడం లేదు. ఇరు పక్షాల మధ్య జరిగిన చర్చలు నిష్ఫలంగా ముగిశాయి. ఉక్రెయిన్ తటస్థంగా ఉండాలని, నిస్సైనికీకరణకు అంగీకరించాలని, క్రిమియాపై రష్యా ఆధిపత్యాన్ని ఒప్పుకోవాలని, తూర్పు రిపబ్లిక్ల స్వయం ప్రతిపత్తిని గుర్తించాలని పుతిన్ కోరుకుంటున్నారు. సెక్యూరిటీ గ్యారెంటీలిస్తే తటస్థ స్థితిపై చర్చిస్తామని, నాటోలో చేరమని జెలెన్స్కీ తాజాగా ప్రకటించారు. అయితే క్రిమియా, తూర్పు రిపబ్లిక్ అంశాలపై కాల్పుల విరమణ, రష్యన్ బలగాల ఉపసంహరణ తర్వాత చర్చిద్దామని ప్రతిపాదించారు. ఉక్రెయిన్‌పై మరింత పట్టు సాధించిన అనంతరం పుతిన్ మెట్టుదిగివస్తాడని యుద్ధ నిపుణులు అంచనా వేస్తున్నారు. యుద్ధం ఆరంభం: ఫిబ్రవరి 24 ఉక్రెయిన్ను వీడిన శరణార్థులు: 35 లక్షలు నిరాశ్రయులైనవారు: కోటిమంది. ఉక్రెయిన్ ఆర్థిక నష్టం: సుమారు రూ. 8 లక్షల కోట్లు ఉక్రెయిన్ వైపు మరణాలు: 691 మంది పౌరులు. గాయపడిన వారు: 1,143 మంది (ఐరాస లెక్కల ప్రకారం) రష్యా వైపు మరణాలు: 15,800 మంది సైనికులు (ఉక్రెయిన్ రక్షణశాఖ గణాంకాలు). -
ఉక్రెయిన్‌పై రష్యా సైన్యం దూకుడు.. చర్చలంటూనే ముట్టడి
కీవ్/వాషింగ్టన్: ఒకవైపు చర్చలు.. మరోవైపు క్షిపణుల మోతలు. ఉక్రెయిన్–రష్యా మధ్య ప్రస్తుతం ఇదీ పరిస్థితి. ఉక్రెయిన్‌పై రష్యా బలగాలు విరుచుకుపడుతన్నాయి. దండయాత్ర మొదలై మూడు వారాలవుతున్నా ఇంకా లక్ష్యం పూర్తికాకపోవడంతో అసహనంగా ఉన్న రష్యా సైన్యం దూకుడు పెంచింది. ప్రధానంగా రాజధాని కీవ్‌పై దృష్టి పెట్టింది. కీవ్ చుట్టుపక్కల ప్రాంతాలతోపాటు నగరం లోపల సైతం బుధవారం రష్యా బలగాలు నిప్పుల వర్షం కురిపించాయి. సెంట్రల్ కీవ్‌లో 12 అంతస్తుల ఓ అపార్టుమెంట్ భవనం మంటల్లో చిక్కుకుంది. చివరి అంతస్తు పూర్తిగా ధ్వంసమైంది. ఈ ప్రాంతమంతా దట్టమైన పొగలు వ్యాపించాయి. సమీపంలోని భవనం కూడా ధ్వంసమయ్యింది. ఈ ఘటనలో ఇద్దరు మరణించినట్లు తెలిసింది. కీవ్ శివార్లపైనా రష్యా భీకర దాడులు సాగిస్తోంది. బుచాతోపాటు జైటోమిర్ పట్టణంపై బాంబులు ప్రయోగించింది. కీవ్‌కు ఉత్తరంవైపు 80 కిలోమీటర్ల దూరంలోని ఇవాంకివ్ నగరాన్ని రష్యా పూర్తిగా స్వాధీనం చేసుకుంది. బెలారస్ సరిహద్దుల్లోని ఉక్రెయిన్ భూభాగాలపై పట్టు సాధించింది. రష్యా నావికా దళం మారియుపోల్, ఒడెశా పట్టణాలపై దాడులు జరిపినట్లు ఉక్రెయిన్ అధికార వర్గాలు తెలిపాయి. రష్యా సేనలను తమ బలగాలు గట్టిగా ప్రతిఘటిస్తున్నాయని ఉక్రెయిన్ అధ్యక్ష కార్యాలయం వెల్లడించింది. రష్యా అధీనంలో ఉన్న ఖేర్సన్ ఎయిర్‌పోర్టు, ఎయిర్‌బేస్‌పై తమ సైన్యం దాడి చేసిందని, రష్యా హెలికాప్టర్లు, సైనిక వాహనాలను ధ్వంసం చేసిందని తెలిపింది. రెండో పెద్ద నగరమైన ఖర్కీవ్‌లోకి రష్యా జవాన్లు అడుగుపెట్టకుండా అడ్డుకుంటున్నట్లు వివరించింది. ఉక్రెయిన్‌కు చెందిన 111 ఎయిర్‌క్రాఫ్ట్‌లు, 160 డ్రోన్లు, 1,000కి పైగా మిలటరీ ట్యాంకులతోపాటు ఇతర వాహనాలను తమ సైనికులు ధ్వంసం చేసినట్లు రష్యా రక్షణ శాఖ అధికార ప్రతినిధి ఇగోర్ కొనాషెంకోవ్ ప్రకటించారు. ► ఉక్రెయిన్ నుంచి తమ దేశానికి ఇప్పటిదాకా 47,153 మంది శరణార్థులుగా వచ్చారని, వీరిలో 19,069 మంది మైనర్లు ఉన్నారని ఇటలీ బుధవారం వెల్లడించింది. ► ఉక్రెయిన్‌తో జరుపుతున్న చర్చల్లో.. ఆ దేశ సైన్యానికి తటస్థ హోదా కోసం తాము ఒత్తిడి పెంచుతున్నామని రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్ చెప్పారు. ఉక్రెయిన్ భద్రతకు హామీనిస్తూ అక్కడి సైన్యానికి తటస్థ హోదా ఉండాలని తాము సూచిస్తున్నామని తెలిపారు. ► ఉక్రెయిన్‌కు సైనిక బలగాలను పంపించే ఉద్దేశం తమకు లేదని నాటో సెక్రెటరీ జనరల్ జెన్స్ స్టోల్టెన్‌బర్గ్ మరోసారి స్పష్టం చేశారు. ► చెర్నీహివ్ నగరంలో ఆహారం కోసం బారులు తీరిన ప్రజలపై రష్యా కాల్పులు జరిపిందని ఉక్రెయిన్ అధికారులు ఆరోపించారు. ఈ కాల్పుల్లో 10 మంది పౌరులు మృతిచెందారని తెలిపారు. ► తమ దేశంలో మరో మేయర్, ఉప మేయర్‌ను రష్యా సైన్యం అపహరించిందని రష్యా విదేశాంగ మంత్రి దిమిత్రో కులేబా ఆరోపించారు. అమెరికా సాయం వెంటనే కావాలి రష్యాపై జరుగుతున్న యుద్ధంలో అమెరికా సాయం మరింత కావాలని జెలెన్స్కీ కోరారు. తమకు వెంటనే సాయం అందించాలంటూ అమెరికా పార్లమెంట్(కాంగ్రెస్)కు విన్నవించారు. ఈ మేరకు జెలెన్స్కీ విజ్ఞప్తిని అమెరికా పార్లమెంట్లో ప్రత్యక్ష ప్రసారం చేశారు. మిలటరీ ఆపరేషన్ సక్సెస్: పుతిన్ ఉక్రెయిన్‌లో తమ సైనిక చర్చ విజయవంతమైందని రష్యా అధ్యక్షుడు పుతిన్ అన్నారు. తమ దేశంపై పశ్చిమ దేశాలు విధించిన ఆంక్షలు పూర్తిగా విఫలమయ్యాయని చెప్పారు. ఉక్రెయిన్‌పై రష్యా సైనిక చర్యను ‘కౌన్సిల్ ఆఫ్ యూరప్’ ఖండించింది. తమ కౌన్సిల్ నుంచి రష్యాను తొలగిస్తున్నట్లు ప్రకటించింది. ఉక్రెయిన్–రష్యా శాంతి ప్రణాళిక! యుద్ధానికి ముగింపు పలికే దిశగా ఉక్రెయిన్–రష్యా దేశాలు శాంతి ప్రణాళికను రూపొందిస్తున్నట్లు ఫైనాన్షియల్ టైమ్స్ వెల్లడించింది. కాల్పుల విరమణ, ‘నాటో’లో చేరాలన్న ఆకాంక్షలను ఉక్రెయిన్ వదులుకుంటే రష్యా దళాలు పూర్తిగా వెనక్కి తగ్గడం, సైనిక బలగాల సంఖ్యను కుదించుకోవడానికి ఉక్రెయిన్ అంగీకారం.. వంటివి ఈ ప్రణాళికలో ఉన్నాయని తెలియజేసింది. యుద్ధం ఆపాలని అంతర్జాతీయ న్యాయస్థానం ఆదేశం ఉక్రెయిన్‌పై యుద్ధాన్ని ఆపాలని ఐక్యరాజ్య సమితికి చెందిన ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్(ఐసీజే).. రష్యాను ఆదేశించింది. రష్యాపై ఉక్రెయిన్ ఐసీజేకు రెండు వారాల క్రితమే ఫిర్యాదు చేయడం తెల్సిందే. ఈ కేసులోనే కోర్టు రష్యాను ఆదేశించింది. ఈ కేసులో ఐసీజేలో భారతీయ న్యాయమూర్తి దల్వీర్ భండారీ రష్యాకు వ్యతిరేకంగా ఓటేయడం గమనార్హం. -
ఉక్రెయిన్ ప్రెసిడెంట్‌పై సమంత పోస్టు.. ఏమందంటే?
ఉక్రెయిన్‌పై రష్యా సైనిక చర్యను ఇప్పటికే పలువురు సినీ తారలు తప్పుపట్టారు. బాహుబలిలాంటి రష్యా పసికూన ఉక్రెయిన్‌పై మూకుమ్మడిగా దాడిచేస్తోందని ఖండించారు. ఏ కారణాలతో యుద్ధం వచ్చినా అది పౌరుల, సైనికుల ప్రాణాలను పణంగా పెట్టడమేనని ఆక్షేపించారు. ఇక ఇదే విషయమై రెండు రోజుల క్రితం స్పందించిన సమంత తాజాగా మరోసారి ఇన్‌స్టా స్టోరీస్‌లో ఓ పోస్టు షేర్ చేశారు. ‘యోధుడైన ఉక్రెయిన్ అధ్యక్షుడిని చరిత్ర కనుగొంది.. అతని తెగువ, ధైర్యసాహసాలే దానికి సాక్ష్యం’ అని ఉన్న న్యూస్ ఆర్టికల్‌కు సంబంధించిన స్క్రీన్ షాట్‌ని ఆమె షేర్ చేసింది. బాలీవుడ్ హీరోయిన్ అమీ జాక్సన్ సైతం ఉక్రెయిన్ రష్యా ఉద్రిక్తతలపై రియాక్ట్ అయింది. బాధిత దేశంలో ఇబ్బందులు పడుతున్న పిల్లలకు సాయం అందించాలని ఆమె ప్రజలను అభ్యర్థించింది. (చదవండి: అది మా హక్కు.. ఈయూ ఎదుట జెలెన్ స్కీ కీలక డిమాండ్) అప్పుడే పుట్టిన బిడ్డలకు ఎన్ని కష్టాలో! అని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. ఈమేరకు ఉక్రెయిన్‌లోని ఓ ఆస్పత్రి ఐసీయూ నుంచి నవజాత శిశువులను బాంబ్ షెల్టర్‌లోకి తీసుకువెళ్తున్న వీడియోను ఆమె షేర్ చేసింది. కాగా, గత ఐదు రోజులుగా ఉక్రెయిన్ రష్యా బలగాల మధ్య భీకర పోరు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. View this post on Instagram A post shared by Amy Jackson (@iamamyjackson) (చదవండి: ఉక్రెయిన్ పరిస్థితులపై సమంత, కాజల్ ఎమోషనల్ పోస్ట్‌లు) -
మమ్మల్ని అన్ని దేశాలు ఒంటరిని చేశాయి: జెలెన్స్కీ
-
రష్యా టార్గెట్ అదే! కన్నీటి పర్యంతమైన ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ
కీవ్: ఉక్రెయిన్ను ఆక్రమించడమే లక్ష్యంగా రష్యా బలగాలు మరింత ముందుకొచ్చాయి. రష్యన్ సేనలు కీవ్‌ను చేరుకున్నాయి. ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్స్కీ ఈ విషయాన్ని అధికారికంగా వెల్లడించారు. ఈక్రమంలో నగరంపై వైమానిక దాడులు జరిగే ప్రమాదం ఉందని... ప్రజలు తక్షణమే సురక్షిత ప్రాంతాల్లో తలదాచుకోవాలని ఆయన హెచ్చరికలు జారీచేశారు. నమ్ముకున్న దేశాలన్నీ తమను నట్టేట ముంచాయని నాటో సభ్య దేశాలను ఉద్దేశించి జెలెన్స్కీ ఓ వీడియో సందేశంలో ఆవేదన వ్యక్తం చేశారు. క్షమాపణలు చెబుతున్నా ‘మమ్మల్ని అన్ని దేశాలు ఒంటరి చేశాయి. చాలా దేశాల ప్రధానులతో మాట్లాడాం. ఎవరూ సాయం అందించేందుకు ముందుకు రావడం లేదు. రష్యాకు అన్ని దేశాలు భయపడుతున్నాయి. 27 యూరోపియన్ దేశాలను రక్షించమని అడిగాం. నాటో దళాలను నమ్ముకున్నా ఫలితం లేదు. ఉక్రెయిన్ ప్రజలకు క్షమాపణలు చెబుతున్నా’ అని ఆయన పేర్కొన్నారు. (చదవండి: నా పదవీకాలంలో అత్యంత విషాద క్షణాలు!) రష్యా టార్గెట్ అదే! తనను చంపడమే రష్యా తొలి టార్గెట్ అని, తన కుటుంబాన్ని అంతమొందించడం రెండో టార్గెట్ అని జెలెన్స్కీ భావోద్వేగానికి గురయ్యారు. రష్యాతో పోరాటంలో తాము ఒంటరివారమయ్యామని ఆయన కన్నీటిపర్యంతమయ్యారు. ఏదేమైనా తాను తన దేశాన్ని విడిచి వెళ్లనని ఆయన స్పష్టం చేశారు. కాగా, నల్ల సముద్రంలో ఉక్రెయిన్‌కు చెందిన స్నేక్ ఐలాండ్‌ను రష్యా స్వాధీనం చేసుకుంది. ఈ క్రమంలో ద్వీపంలో ఉన్న 13మంది ఉక్రెయిన్ బోర్డర్ గార్డ్స్‌ను రష్యా దళాలు చంపేసినట్టు అధ్యక్షుడు జెలెన్స్కీ తెలిపారు. ఉక్రెయిన్ పరిపాలనా భవనాలపై రష్యా జెండాలు ఎగిరాయి. (చదవండి: గ్యాసో లక్ష్మణా!.. యుద్ధంతో యూరప్ ఉక్కిరిబిక్కిరి) -
సామాన్యుడి నెత్తిన మరో పిడుగు..!
ఉక్రెయిన్ ఆక్రమణకు రష్యా సైనిక చర్య ప్రారంభించడంతో ఇప్పుడు ఆ ప్రభావం అన్నింటి మీద పడుతుంది. ఇప్పటికే పెట్రోల్, డీజిల్ ధరలు బంగారం ధరలు పెరగడంతో పాటు స్టాక్ మార్కెట్, క్రీప్టో మార్కెట్లు కూడా భారీగా పతనమయ్యాయి. అయితే, వాటితో పాటు ఇప్పడు ఉక్రెయిన్-రష్యా సంక్షోభ ప్రభావం వంటనూనె ధరల మీద కూడా పడనుంది. ముఖ్యంగా పొద్దుతిరుగుడు నూనె సరఫరాలో అంతరాయం కారణంగా ధరలు భారీగా పెరగనున్నట్లు తయారీదారులు పేర్కొన్నారు. 80 శాతం సన్-ఫ్లవర్ ఆయిల్‌ను మన దేశం మాజీ సోవియట్ రిపబ్లిక్ నుంచి దిగుమతి చేసుకుంటుంది. గత ఏడాది నవంబర్-అక్టోబర్ మధ్య కాలంలో భారతదేశం మొత్తం 18.93 లక్షల టన్నుల ముడి సన్-ఫ్లవర్ ఆయిల్‌ను దిగుమతి చేసుకుంది. ఇందులో 13.97 లక్షల టన్నులు ఉక్రెయిన్ నుంచి దిగుమతి చేసుకోవడం గమనర్హం. ఇంకా, అర్జెంటీనా (2.24 లక్షల టన్నులు), రష్యా (2.22 లక్షల టన్నులు) నుంచి దిగుమతి చేసుకున్నట్లు గణాంకాలు పేర్కొంటునాయి. గణాంకాల ప్రకారం, ఉక్రెయిన్ సన్-ఫ్లవర్ ఆయిల్‌ను భారతదేశానికి ఎగుమతి చేసే ఏకైక ప్రధాన సరఫరాదారు. వంటనూనె తయారీదారుల అత్యున్నత సంస్థ సాల్వెంట్ అండ్ ఎక్స్ ట్రాక్టర్స్ అసోసియేషన్(సీ) అధ్యక్షుడు అతుల్ చతుర్వేది మాట్లాడుతూ.. వంటనూనె ధరలు భారీగా పెరిగే అవకాశం ఉన్నట్లు భావిస్తున్నారు. "ఉక్రెయిన్, రష్యా నుంచి సన్ ఫ్లవర్ ఆయిల్ ఎక్కువగా మనదేశానికి వస్తుంది. ఇప్పుడు ఈ సంక్షోభం వల్ల దాని సరఫరాలో అంతరాయం కలిగితే ధరలు ఊహించని స్థాయిలో పేరుగుతాయని భావిస్తున్నారు. మేము నెలకు దాదాపు 2.0 లక్షల టన్నుల సన్ ఫ్లవర్ ఆయిల్ దిగుమతి చేసుకుంటాము" అని చతుర్వేది అన్నారు. ఇప్పటికే దేశంలో వంటనూనె కొరత ఉన్న సమయంలో ఈ సంక్షోభం తలెత్తడం ఆందోళన కలిగిస్తుంది అని ఆయన అన్నారు. రిటైల్ మార్కెట్లో శుద్ధి చేసిన సన్ ఫ్లవర్ ఆయిల్ ధర లీటరుకు రూ.145.03తో పోలిస్తే ప్రస్తుతం లీటరుకు రూ.161.94కు పెరిగిందని కేంద్ర వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రైస్ మానిటరింగ్ సెల్ తెలిపింది. సప్లై ఛైయిన్ అంతరాయం వల్ల ధరలు గణనీయంగా పెరుగుతాయి అని కూడా పేర్కొంది. అర్జెంటీనా ప్రత్యామ్నాయ సరఫరాదారుగా ఉన్నప్పటికీ, దేశీయ డిమాండ్ తీర్చే సామర్ధ్యం ఆ దేశానికి లేదు అని చతుర్వేది అన్నారు. రిటైల్ ఆహార ద్రవ్యోల్బణం దేశంలో ఒక ప్రధాన సమస్యగా మారింది. వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ దీనిని నియంత్రించడానికి అనేక చర్యలు తీసుకుంది. అలాగే, మన దేశంలో ఉత్పత్తి పడిపోవడంతో మహారాష్ట్రలోని లాతూర్ హోల్ సేల్ మార్కెట్ వద్ద సోయాబీన్ క్వింటాల్ ధర రూ.6,200గా ఉంటే గత రెండు రోజుల నుంచి క్వింటాల్'కు రూ.7,000/ చేరుకున్నాయి. ఇప్పటికే ఆయిల్ సరఫరాదారులు ఇండోనేషియా ఎగుమతుల ఆంక్షల నేపథ్యంలో తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయి. పామ్ ఆయిల్ ఎక్కువగా ఈ దేశంలోనే ఉత్పత్తి అవుతోంది. దక్షిణ అమెరికాలో కరువు కారణంగా సోయా ఆయిల్ ఉత్పత్తి కూడా పడిపోయింది. దీని వల్ల ఇప్పటికే ఆయిల్ సరఫరా అంతంత మాత్రంగానే ఉంది. ఇప్పుడు ఈ రష్యా, ఉక్రెయిన్ ఉద్రిక్త పరిస్థితుల దెబ్బకి ఆయిల్ వంటనూనె ధరలు ఏ రేంజ్లో పెరుగుతాయో చూడాలి మరి. (చదవండి: బంగారం కొనేవారికి భారీ షాక్.. భగ్గుమన్న ధరలు..!) -
వైరస్ దండయాత్ర ఇలా..
కరోనా వైరస్ బయటి పొర కొవ్వులతో తయారై ఉంటుంది. అక్కడక్కడా ముళ్ల వంటి స్పైక్ ప్రొటీన్లు ఉంటాయి. వైరస్ మధ్యభాగంలో ఉండచుట్టుకుపోయిన జన్యుపదార్థం (ఆర్ఎన్ఏ) ఉంటుంది. ఊపిరితిత్తి కొమ్మపై పెరిగిపోయిన వైరస్లు నెమ్మదిగా శ్లేష్మం (మ్యూకస్) ద్వారా శరీర కణాలకు అతుక్కుపోతాయి. వైరస్ల కంటే బాగా పెద్దసైజులో ఉండే కణాలు వైరస్‌లను అడ్డుకునే ఏర్పాట్లు ఉన్నా.. ఓ చిన్న లోపమూ ఉంటుంది. కణాలపైన పొడుచుకుని బయటకు వచ్చి ఉండే ఏస్–2 రిసెప్టర్లకు కరోనా వైరస్ అతుక్కుపోతుంది. ఈ దశలోనే వైరస్ తాలూకు ఆర్ఎన్ఏ కణంలోకి చేరిపోతుంది. దీంతో వైరస్ దండయాత్ర మొదలవుతుంది! -
ఎందుకో ఈ మౌనం.. ఏమిటో ఆ అంతరార్థం
పేదలు గూడు కోసం ఓ చిన్నపాక వేసుకుంటే హడలెత్తిస్తారు రెవెన్యూ అధికారులు. వరదయ్యపాళెం మండలం చిన్న పాండూరు శోత్రియ భూముల్లో 200కు పైగా గుడిసెలు అక్రమంగా వేసుకున్నా రెవెన్యూ అధికారులు నోరు మెదపడం లేదు. పైగా అక్కడ గుడిసెలు ఏర్పాటు చేసుకున్న వారందరూ ఈ ప్రాంతానికి చెందిన వారు కాకపోవడం గమనార్హం. షికారీల పేరిట గుడిసెలు ఏర్పాటు చేయడం వెనుక పెద్ద నాటకీయ పరిణామాలే జరుగుతున్నాయి. దీనికి నాయకత్వం వహిస్తున్న మాఫియా లీడర్లు గుడిసెకో రేటు విధించి వసూలు చేస్తున్నారు. పైగా ఇంటి స్థలం మొదలు సాగుభూమి వరకు తీసిస్తామని భరోసా ఇస్తుండడం విమర్శలకు తావిస్తోంది. ఇంత జరుగుతున్నా కట్టడి చేయాల్సిన రెవెన్యూ యంత్రాంగం మౌనముద్రలో ఉండడం పలు అనుమానాలకు తావిస్తోంది. వరదయ్యపాళెం: జిల్లాలో చిన్న పాండూరు పేరు వింటూనే నూతనంగా నిర్మించే అపోలో టైర్ల పరిశ్రమ, హీరో ద్విచక్ర వాహనాల పరిశ్రమలు గుర్తుకొస్తాయి. దీంతో ప్రస్తుతం రియల్టర్ల చూపంతా ఈ ప్రాంతం వైపే ఉండడంతో భూములకు ఒక్కసారిగా విలువ పెరిగింది. దీన్ని అదునుగా భావించిన అక్రమార్కులు ఎంచక్కా ఇంటి స్థలాల పేరిట వందలాది ఎకరాల ఆక్రమణకు పన్నాగం పన్నుతున్నారు. షికారీలను రంగంలోకి దించి చిన్న పాండూరు శోత్రియ భూముల్లో ఏడాదిన్నర కాలంలో 200కుపైగా గుడిసెలు ఏర్పాటు చేశారు. భూముల నేపథ్యమిలా.. చిన్న పాండూరు పంచాయతీ పాదిరికుప్పం రెవెన్యూలో సర్వే నెంబర్లు 1 నుంచి 84లలో 1,060 ఎకరాలు శోత్రియ భూములు ఉన్నాయి. చిన్న పాండూరు, వడ్డిపాళెం, పాదిరికుప్పం, రామలక్ష్మ మ్మకండ్రిగ గ్రామాలకు చెందిన స్థానికులు సంబంధిత భూములను అనధికారికంగా సాగుచేసుకుంటూ అనుభవదారులుగా కొనసాగుతున్నారు. ఈ భూములకు సంబంధించి ప్రభుత్వానికి ప్రైవేటు వ్యక్తులకు మధ్య కోర్టులో వివాదం జరుగుతోంది. గతంలో ప్రభుత్వానికి అనుకూలంగా జాయింట్ కలెక్టర్ సెటిల్మెంట్ కోర్టులో తీర్పు వెలువడడంతో సంబంధిత భూములు ప్రభుత్వానికి చెందినవిగా బోర్డులు కూడా రెవెన్యూ శాఖ ఏర్పాటు చేసింది. ప్రైవేటు వ్యక్తులు ఆ తీర్పును వ్యతిరేకిస్తూ మరోసారి కోర్టును ఆశ్రయించడంతో ప్రస్తుతం ఇరువర్గాల మధ్య కేసు కొనసాగుతోంది. మౌనముద్రలో రెవెన్యూ శాఖ.. శోత్రియ భూముల్లో అక్రమార్కులు గుడిసెలు ఏర్పాటు చేసుకుంటున్నా రెవెన్యూ శాఖ తమకేమీ పట్టనట్లు ఉండడం సర్వత్రా విమర్శలకు దారితీస్తోంది. ఆక్రమించిన వారు ఏకంగా ఆ ప్రాంతా నికి నక్కలమిట్టగా నామకరణం చేయడం, ఆ ప్రాంతంలో మౌలిక వసతులు ఏర్పాటు చేయాలని, ఇంటి పట్టాలు ఇవ్వాలని ప్రతివారమూ తహసీల్దార్ కార్యాలయం వద్ద నిరసనలకు దిగడం షరా మామూలుగా మారింది. ఏడాది క్రితం ఆక్రమణల తొలగింపు.. శోత్రియ భూముల్లో వెలసిన గుడిసెల తొలగింపుకు జిల్లా అధికార యంత్రాంగం ఆదేశాలు జారీ చేయడంతో సరిగ్గా గత ఏడాది సెప్టెంబర్ 13న సుమారు 100మంది పోలీసు బలగాలతో డీఎస్పీ స్థాయి అధికారి పర్యవేక్షణలో మండల రెవెన్యూ యంత్రాంగం అక్రమ గుడిసెలను బలవంతంగా తొలగించింది. అయితే ఆక్రమణకు పాల్పడిన వారు మాత్రం ఆ ప్రాంతాన్ని విడిచి వెళ్లకుండా అక్కడే ఉన్నారు. పది రోజుల పాటు ఆ భూములలో ప్రవేశించకుండా రెవెన్యూ యంత్రాంగం కూడా కాపలా ఉంది. ఆపై పర్యవేక్షణ గాలికొదిలేయడంతో సమస్య మళ్లీ మొదటికొచ్చింది. మరో మారు అక్రమ గుడిసెలు ఏర్పాటు కొనసాగుతోంది. అక్రమ గుడిసెల ఏర్పాటు తగదు.. సంవత్సరాల తరబడి తమ అనుభవంలో ఉన్న భూములలో గుడిసెలు ఏర్పాటు చేయడం తగదని చిన్న పాండూరు ప్రాంత అనుభవదారులు చెబుతున్నారు. ప్రభుత్వం నిర్లక్ష్యధోరణి అవలం బించడం వల్లే గుడిసెలు పుట్టుకొస్తున్నాయంటున్నారు. అడవిగా ఉన్న భూములను సొంత ఖర్చులతో చదును చేసి, సాగులోకి తెచ్చుకున్నామని, ఈ క్రమంలో ఇలాంటి చర్యలకు పాల్పడటం సరైన పద్ధతి కాదని అంటున్నారు. ప్రభుత్వం స్పందించకుంటే ఆందోళన చేయాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నారు. పూర్వీకులు ఇక్కడ ఉండేవారు.. 40 సంవత్సరాల క్రితం చిన్నపాండూరు సమీపంలోని శోత్రియ భూముల్లో ఒకచోట తమ పూర్వీకులు పది కుటుంబాల వారు ఉండేవారని ప్రస్తుతం గుడిసెలు ఏర్పాటు చేసుకున్న కొందరు చెబుతున్నారు. ఈ ప్రాంతాన్ని నక్కలమిట్ట అని కూడా అనేవారని పేర్కొంటున్నారు. వివిధ కారణాలతో క్రమేణా వేరే ప్రాంతాలకు తమ పూర్వీకులు వలస వెళ్లారని, వారి కుటుంబ సభ్యులుగా తమకు ఈ ప్రాంతంలో ఇళ్ల స్థలాలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. -
పేదల జాగాలో పెద్దల పాగా
జిల్లాలో ప్రభుత్వ భూముల ఆక్రమణకు కేంద్ర బిందువుగా మారిన పీలేరులో గూడులేని నిరుపేదల ఆవాసం కోసం సేకరించిన స్థలంలో రూ. పెద్దలు పాగా వేశారు. రూ.మూడుకోట్ల విలు వైన భూములను దర్జాగా ఆక్రమించేశారు. పేదల ఇళ్ల నిర్మాణానికి రెండుసెంట్లు భూమి చూపడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించే రెవెన్యూ అధికారులు కోట్లాది రూపాయల విలువైన ప్రభుత్వ భూములు అన్యాక్రాంతమవుతున్నా నోరుమెదపకపోవడం విమర్శలకు తావిస్తోంది. పీలేరు: చాలీచాలనీ కూలితో అద్దె ఇళ్లలో మగ్గుతున్న నిరుపేదల కోసం ఇందిరమ్మ కాలనీ నిర్మించాలని నిర్ణయించిన చిత్తూరు మార్గంలోని కోళ్లఫారం మిట్టన ఉన్న స్థలం పెద్దల చేతిలోకి వెళ్లిపోయింది. కోళ్లఫారం మిట్టన సర్వే నంబర్లు 1076, 1078, 1079/1, 1131/4, 1136, 1137, 1138, 1139, 1140/1, 1144/2, 1145, 1146/4లో 86.35 ఎకరాల స్థలాన్ని రైతుల నుంచి సేకరించి ప్రభుత్వం 2007లో స్వాధీ నం చేసుకుంది. ఇక్కడ 2,322 ఇళ్ల నిర్మాణానికి లేఅవుట్ తయారు చేశారు. మొదటి విడతగా 2006–07లో 1,700 ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేశారు. కాలనీ నిర్మాణం కోసం అప్పటి పీలేరు ఎమ్మెల్యే, ప్రస్తుతం పుంగనూరు నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి 2007 అక్టోబర్ 25వ తేదీన శిలాఫలకం వేశారు. ఒక్కో రెండు సెంట్ల చొప్పున 1,700 ఇళ్లకు 34 ఎకరాలు ఇచ్చారు. 632 పట్టాలకు సంబంధించి సుమారు 12 ఎకరాల స్థలం ఖాళీగా ఉంచారు. కమ్యూనిటీ అవసరాల కోసం 7.80 ఎకరా లు, కాలనీ రోడ్ల నిర్మాణానికి 10 నుంచి 15 ఎకరాలు కేటాయిం చారు. అనంతరం మారిన సమీ కరణల నేపథ్యంలో ఒత్తిళ్లకు తలొగ్గిన అధికారులు భవిష్యత్ అవసరాల కోసం కేటాయించిన స్థలంలో 3 సెంట్లు చొప్పున సుమారు 600 పట్టాలు అక్రమంగా ఇచ్చి నట్లు ఆరోపణలున్నాయి. గృహ నిర్మాణ శాఖ ఆధీనంలో ఉన్న ఖాళీ స్థలం నిబంధనల మేరకు ఇళ్లు మంజూరైన లబ్ధిదారులకు మాత్రమే కేటాయించాలి. రూ.లక్షలు తీసుకుని స్థలాన్ని సంతర్పణ చేశారనే ఆరోపణలు ఉన్నాయి. ప్రధానంగా సర్వే నంబర్ 1136/5లో భారీగా అక్రమాలు జరిగినట్టు సమాచారం. కాలనీ కోసం రైతుల నుంచి సేకరించిన 86.35 ఎకరాల స్థలానికి ఇప్పటివరకు సరిహద్దులు నిర్ధారించకపోవడంతో మూడు కోట్ల విలువ గల సుమారు 10 నుంచి 14 ఎకరాల స్థలం ఆక్రమణకు గురైంది. సరిహద్దులు నిర్ణయించాలని పలుమార్లు రెవెన్యూ అధికారుల దృష్టికి తీసుకెళ్లినా సర్వేలు, విచారణ పేరిట 2007 నుంచి కాలయాపన చేస్తున్నారు. ఇందిరమ్మ కాలనీ నిర్మాణం కోసం సేకరించిన స్థలాన్ని ఇప్పటి వరకు రెవెన్యూ అధికా రులు హౌసింగ్ అధికారులకు స్వాధీనం చేయకపోవడంపై విమర్శలు వస్తున్నాయి. పీలేరు పట్టణానికి అన్ని వైపులా 5 కిలోమీటర్ల లోపు సుమారు 100 కోట్లకు పైగా విలువ గల ప్రభుత్వ భూములు ఆక్రమణకు గురైనట్లు సింగిల్ విండో మాజీ అధ్యక్షుడు బీడీ.నారాయణరెడ్డి లోకాయుక్త కోర్టులో ఫిర్యాదు చేయడం గమనార్హం. కాలనీ స్థలం ఆక్రమణపై భారీ ఎత్తున ముడుపులు చేతులు మారడం వల్లే రెవెన్యూ అధికారులు విచారణ పేరిట కాలయాపన చేస్తున్నారనే ఆరోపణలు గుప్పుమంటున్నాయి. రెవెన్యూ అధికారులు మాత్రం కాలనీలో సర్వే నిర్వహించామని, ఒకటిన్నర ఎకరా ఆక్రమణకు గురైనట్లు గుర్తించి, ఇందులో గోడౌన్ నిర్మాణానికి ఎకరా స్థలం కేటాయించామని తెలు పుతున్నారు. హౌసింగ్ అధికారులు మాత్రం కాలనీ స్థలం ఇప్పటివరకు రెవెన్యూ ఆధీనంలోనే ఉందని చెబుతున్నారు. -
రేపు డీఈఓ కార్యాలయ ముట్టడి
అనంతపురం ఎడ్యుకేషన్ : ఉపాధ్యాయులకు గుదిబండగా మారిన వెబ్‌కౌన్సెలింగ్, పర్ఫార్మెన్స్ పాయింట్లు, రేషలైజేషన్ కు వ్యతిరేకంగా రాష్ట్ర ఫ్యాప్టో, జాక్టో పిలుపుమేరకు ఈ బుధవారం తలపెట్టిన డీఈఓ ఆఫీస్ ముట్టడిని జయప్రదం చేయాలని నాయకులు ఓ సంయుక్త ప్రకటనలో పిలుపునిచ్చారు. పర్ఫార్మెన్స్ పాయింట్లకు సంబంధించి చాలా అంశాల్లో స్పష్టత లేదని, ఇప్పటిదాకా ఖాళీల సంఖ్య, వివరాలపై ఉపాధ్యాయులకు అవగాహన రాలేదని పేర్కొన్నారు. ప్ర భుత్వ తీరుకు నిరసనగా బుధవారం 9 గంటలకు ఆర్ట్స్ కళాశాల నుంచి డీఈఓ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించి అనంతరం కార్యాలయాన్ని దిగ్భందిస్తామని వివరించారు. -
మార్చి 19 తర్వాత సర్కార్‌పై దండయాత్రే
తమ్మినేని వీరభద్రం గరిడేపల్లి: ప్రజలకిచ్చిన హామీలను మార్చి 19లోగా నెరవేర్చకపోతే ప్రభుత్వంపై దండయాత్ర చేస్తామ ని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభ ద్రం అన్నారు. మహాజన పాదయాత్ర శనివా రం సూర్యాపేట జిల్లా గరిడేపల్లికి చేరుకుంది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలం గాణ అభివృద్ధిపై చర్చించేందుకు తమ పార్టీ ఎప్పటికీ సిద్ధమని, దమ్ముంటే సీఎం కేసీఆర్ సిద్ధం కావాలని సవాల్ విసిరారు. తాము చేపట్టిన ఈ పాదయాత్రతో వణుకు పుట్టిన కేసీఆర్ కులాల పేరుతో వరాలు ప్రకటిస్తున్నారని చెప్పారు. కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ, డబుల్ బెడ్రూం ఇళ్లు , దళితులకు మూడె కరాల భూ పంపిణీ, కేజీ టు పీజీ విద్య, లక్ష ఉద్యోగాలు తదితర హామీల మొక్కులు ఎప్పుడు తీరుస్తారో ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. కాగా, టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కొత్త పరిశ్ర మలు, ఉద్యోగాల మాటేమో కాని ఉన్న పరిశ్రమల్లో స్థానికులకు ఉపాధి లభించడం లేదని వీరభద్రం పేర్కొన్నారు. ఈ మేరకు శనివారం కేసీఆర్‌కు లేఖ రాశారు. -
ఖబరస్థాన్ స్థలం ఆక్రమణ
పత్తి చెట్లు ధ్వంసం బోరున విలపించిన కౌలు రైతు ఉప్పరపల్లి(చెన్నారావుపేట) : మండలంలోని ఉప్పరపల్లి గ్రామంలోని ఖబరస్థాన్ స్థలంను ఓ రైతు ఆక్రమించాడు. అంతేగాక ఆ స్థలంలో పత్తి చేను వేసుకున్న కౌలు రైతు పంటను ధ్వంసం చేసిన సంఘటన శనివారం జరిగింది. గ్రామానికి చెందిన ముస్లింలకు గ్రామశివారులోని సర్వే నంబర్ 234/ఆ లో ఎకరం 30 గుంటల భూమి ఉంది. అందులోని 10 గుంటల భూమిలో సమాధులు ఉన్నాయి. మిగిలిన ఎకరం 20 గుంటల భూమిని ముస్లింల అభివృద్ధికి గ్రామానికి చెందిన మహ్మద్ రాజమహ్మద్కు కౌలుకు ఇచ్చారు. అతడు అందులో పత్తి సాగు చేశాడు. శుక్రవారం గ్రామానికి చెందిన మహ్మద్ మహబూబ్(80) అనారోగ్యంతో మృతిచెందాడు. అతడిని సమాధి చేయడానికి తీసుకెళ్తుండగా ఇదే గ్రామానికి చెందిన కుక్కల రాజాలు తన భూమిలో నుంచి శవాన్ని తీసుకెళ్లద్దంటూ అడ్డుకున్నాడు. రాజాలు భూమికి ఆనుకొని ఖబరస్థా¯Œæకు వెళ్లే దారి ఉంది. రాజాలు దారిని ఆక్రమించుకొని ఖబరస్థాన్‌కు వెళ్లడానికి దారి లేదన్నాడు. దీంతో అతడితో వాగ్వాదం చోటుచేసుకుంది. అనంతరం శవాన్ని ముస్లింలు సమాధి చేశారు. దీన్ని దృష్టిలో పెట్టకొని రాజాలు శుక్రవారం రాత్రి ఖబరస్థాన్‌లో సాగు చేస్తున్న పత్తి మొక్కలను ధ్వంసం చేశాడని బాధిత రైతు మహ్మద్ రాజమహ్మద్ వాపోయాడు. తమకు న్యాయం చేయాలని కోరుతూ పోలీస్‌స్టేçÙన్లో, ఆర్డీఓ, కలెక్టర్‌కు ఫిర్యాదు చేసినట్లు కౌలు రైతు రాజమహ్మద్, పెద్దలు ఖాదర్, మౌలానా, రహిమోద్దిన్, యాకూబ్‌పాషా, షరీఫ్, తదితరులు తెలిపారు. -
పునాదికే నాలుగేళ్లు.. గోపురానికి ఇంకెన్నాళ్లో!
శ్రీకాళహస్తీశ్వరాలయంలోని గాలి గోపురం నాలుగేళ్ల క్రితం కూలిపోయింది. రెండేళ్లలో దాన్ని పునర్ నిర్మిస్తామని అప్పటి ముఖ్యమంత్రి రోశయ్య చెప్పారు. నాలుగేళ్లు గడిచినా పునాదులు కూడా దాటని పరిస్థితి. పనులు నత్తనడకన సాగుతుండడంపై స్థానికులు, భక్తులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. శ్రీకాళహస్తి, న్యూస్‌లైన్: పరమశివుని దర్శనానికి ముందు ఆరుగురిని దర్శించుకోవాలని పురాణాలు చెబుతున్నాయి. గోపురం, శిఖరం, ఆలయ ద్వారం, ప్రాకారం, బలి పీఠం, అర్చకుడిని దర్శించుకున్న తర్వాత శివుని దర్శించుకుంటే మోక్షం లభిస్తుందనేది నమ్మకం. దీనికి సంబంధించిన స్తోత్రాన్ని కూడా అర్చకులు భక్తులకు వినిపిస్తుంటారు. శ్రీకాళహస్తికి తలమానికంగా ఉన్న గాలిగోపురం 2010 మే 26వ తేదీన కూలిపోవడంతో ఆ దర్శనం భక్తులకు కరువైంది. కూలిపోయి నాలుగేళ్లు అవుతున్నా కేవలం పునాది పనులు మాత్రమే పూర్తి చేశారు. మూడేళ్ల క్రితం అప్పటి ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య గాలిగోపురం పనులకు శంకుస్థాపన చేసి, రెండేళ్లలో నిర్మాణం పూర్తి చేస్తామని చెప్పారు. రూ.46 కోట్ల వ్యయంతో గోపురం నిర్మాణాన్ని 16 నెలల్లో పూర్తి చేసేందుకు కృషి చేస్తామని కాంట్రాక్టర్లు, ఇంజనీరింగ్ సిబ్బంది పేర్కొన్నారు. 48 నెలలు అయినా పనులు నత్తనడకన సాగుతున్నాయి. 1516లో శ్రీకృష్ణదేవరాయలు దక్షిణ భారతదేశ దండయాత్ర ముగించుకుని శ్రీకాళహస్తీశ్వరస్వామి ఆశీస్సుల కోసం వచ్చి మూడేళ్లపాటు శ్రమించి ఏడు అంతస్తులతో, 135 అడుగుల ఎత్తుతో గాలిగోపురం నిర్మించినట్లు చరిత్ర చెబుతోంది. రాయల హయాంలో నిర్మించడం వల్ల ఆయన కాంస్య విగ్రహాన్ని కూడా గోపురానికి ముందుభాగంలో ఏర్పాటు చేశారు. శ్రీకాళహస్తికే తలమానికంగా ఉన్న ఈ గోపురం 15 కిలోమీటర్ల వరకు కనిపించేది. అది కూలిపోవడంతో శ్రీకాళహస్తి బోసిపోయింది. పునర్ నిర్మించేందుకు నవయుగ కన్స్ట్రక్షన్స్ ముందుకొచ్చిన విషయం తెలిసిందే. పునాదుల అనంతరం ఏడాదిపాటు పనులు జరగలేదు. ఇటీవల తిరిగి ప్రారంభమైనా నత్తనడకన సాగుతున్నాయి. నాలుగు దశల్లో పునాది పనులు.. నాలుగు దశల్లో 39.5 అడుగుల పునాదుల పనులు మాత్రమే చేపట్టారు. మొదట దశలో ఎర్రగుల్ల, రెండో దశలో వెట్మిక్చర్, మూడో దశలో సిమెంట్ కాంక్రీటు, నాలుగో దశలో కాశిరాళ్ల పనులు చేపట్టినట్లు ఇంజనీరింగ్ సిబ్బంది వెల్లడించారు. పునాదులు భూమి మట్టానికి చేరుకున్నాయి. ఇక పై భాగంలో చిత్రవనం పనులు (గోపురంపనులు) చేయాల్సి ఉంది. ఇందుకోసం గుంటూరు జిల్లా చిలకలూరిపేట వద్దనున్న కోటప్పకొండ క్వారీల నుంచి నల్లరాళ్లను తీసుకువస్తున్నారు. నిర్మాణంలో సున్నపురాయితోపాటు బెల్లం, కరక్కాయి వంటి వాటిని వాడనున్నారు. శ్రీకృష్ణదేవరాయల విగ్రహానికి నీడ కరువు గాలిగోపురాన్ని నిర్మించిన విజయనగర సామ్రాజ్యాధీశుడైన శ్రీకృష్ణదేవరాయల విగ్రహానికి నాలుగేళ్లుగా నీడ కరువైంది. రాజగోపురం కూలిపోవడంతో అక్కడున్న శ్రీకృష్ణదేవరాయల విగ్రహాన్ని సుపథ మండపం వద్ద ఏర్పాటు చేశారు. నాలుగేళ్లుగా ఎండకు ఎండుతూ..వానకు తడుస్తున్నా పట్టించుకునే వారే కరువయ్యారు. విగ్రహం వద్ద ఆయన వివరాలు కూడా నమోదు చేయలేదు. దీనిపై భక్తులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.