మార్చి 19 తర్వాత సర్కార్‌పై దండయాత్రే
తమ్మినేని వీరభద్రం
గరిడేపల్లి: ప్రజలకిచ్చిన హామీలను మార్చి 19లోగా నెరవేర్చకపోతే ప్రభుత్వంపై దండయాత్ర చేస్తామ ని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభ ద్రం అన్నారు. మహాజన పాదయాత్ర శనివా రం సూర్యాపేట జిల్లా గరిడేపల్లికి చేరుకుంది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలం గాణ అభివృద్ధిపై చర్చించేందుకు తమ పార్టీ ఎప్పటికీ సిద్ధమని, దమ్ముంటే సీఎం కేసీఆర్ సిద్ధం కావాలని సవాల్ విసిరారు. తాము చేపట్టిన ఈ పాదయాత్రతో వణుకు పుట్టిన కేసీఆర్ కులాల పేరుతో వరాలు ప్రకటిస్తున్నారని చెప్పారు.
కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ, డబుల్ బెడ్‌రూం ఇళ్లు , దళితులకు మూడె కరాల భూ పంపిణీ, కేజీ టు పీజీ విద్య, లక్ష ఉద్యోగాలు తదితర హామీల మొక్కులు ఎప్పుడు తీరుస్తారో ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. కాగా, టీఆర్‌ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కొత్త పరిశ్ర మలు, ఉద్యోగాల మాటేమో కాని ఉన్న పరిశ్రమల్లో స్థానికులకు ఉపాధి లభించడం లేదని వీరభద్రం పేర్కొన్నారు. ఈ మేరకు శనివారం కేసీఆర్‌కు లేఖ రాశారు.