మరోసారి మణిశంకర్‌ అయ్యర్‌ వివాదాస్పద వ్యాఖ్యలు.. స్పందించిన కాంగ్రెస్‌ | Mani Shankar Aiyar China allegedly invaded India in 1962 stirs row | Sakshi
Sakshi News home page

మరోసారి మణిశంకర్‌ అయ్యర్‌ వివాదాస్పద వ్యాఖ్యలు.. స్పందించిన కాంగ్రెస్‌

Published Wed, May 29 2024 9:27 AM | Last Updated on Wed, May 29 2024 10:10 AM

Mani Shankar Aiyar China  allegedly invaded India in 1962 stirs row

ఢిల్లీ: కాంగ్రెస్‌ మాజీ కేంద్ర మంత్రి మణిశంకర్‌ అయ్యార్‌ చేసిన వ్యాఖ్యలు మరోసారి వివాదాస్పదం అయ్యాయి. ఆయన మంగళవారం ఫారన్‌ కారెస్పండెంట్స్‌ క్లబ్‌లో నిర్వహించిన ఓ కార్యక్రమంలో మాట్లాడారు. ‘‘1962 అక్టోబర్‌లో చైనా భారత్‌పై దండయాత్ర చేసింది’’ అని అన్నారు. ఆ సమయంలో తాను ఇండియన్ ఫారిన్ సర్వీస్‌ (ఐఎఫ్‌ఎస్‌)కు తిరస్కరించబడిన  విషయాన్ని కూడా పంచుకున్నారు.

‘‘ఐఎఫ్‌ఎస్‌ పరీక్షలు లండన్‌లో ప్రారంభమయ్యాయి. అందులోనే  పాస్‌ అయ్యాను. కానీ అడ్మిషన్‌ లేటర్‌ అందలేదు. దాంతో నేను నాకు జాయినింగ్‌ లెటర్‌ అందలేదని విదేశీ వ్యవహారాల శాఖకు తెలియజేశా. నేను అన్ని సర్వీసులకు తిరస్కరించబడినట్లు నాకు టెలిగ్రామ్ అందింది. అయితే నేను చైనా కోసం నిధులు సేకరించానని కొందరు నాపై ఆరోపణలు చేశారు. నాకు డిన్నర్ చేయడానికే ఆ రోజుల్లో డబ్బు లేదు. నేను ఎలా చైనాకు నిధులు సేకరిస్తాను?’’ అని అయ్యర్‌ వివరించారు.

 

అయితే.. భారత్‌పై చైనా దండయాత్ర చేసిందని అయ్యర్‌ చేసిన వ్యాఖ్యలను బీజేపీ నేతలు తీవ్రంగా ఖండించారు. లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో ఇటువంటి రెచ్చగొట్టె వ్యాఖ్యలు చేయటంపై మండిపడ్డారు. మణిశంకర్‌ వ్యాఖ్యలపై బీజేపీ ఐటీ సెల్ చీఫ్‌ అమిత్ మాల్వియా తీవ్రంగా ఖండిచారు. 1962లో చైనా భారత​ దండెత్తినట్లు వ్యాఖ్యలు చేయటం.. ఈ సమయంలో రెచ్చగొట్టే ప్రయత్నమేనని విమర్శించారు. గతంలో కాంగ్రెస్‌ చైనా అనుకూలంగా వ్యవహరించిందని ఘాటుగా విమర్శలు చేశారు. చైనా కాంగ్రెస్‌ను ప్రేమిస్తుందా? అని ప్రశ్నించారు.

 

అయ్యర్‌ చేసిన వ్యాఖ్యలపై తీవ్ర విమర్శలు వ్యక్తం కావటంలో​ కాంగ్రెస్‌ పార్టీ స్పందించింది. ఆయన చేసిన వ్యాఖ్యలకు పార్టీకి సంబంధం లేదని కాంగ్రెస్‌ జనరల్‌ సెక్రటరీ జైరాం రమేష్‌  ‘ఎక్స్‌’లో  తెలిపారు. ‘‘భారత్‌పై చైనా దండయాత్ర అనే మాట పొరపాటు అన్నానని అయ్యర్‌ క్షమాపణలు చెప్పారు. ఆయన వయసును బట్టి మనం స్వాగతించాలి. ఆయన చేసిన వ్యాఖ్యలకు పార్టీకి ఎటువంటి సంబంధం లేదు. అక్టోబరు20, 1962న ప్రారంభమైన భారతదేశంపై చైనా దండయాత్ర నిజమే. మే, 2020లో లడాఖ్‌లో చైనా చొరబాట్లు కూడా జరిగాయి. ఇందులో 20 మంది భారత సైనికులు కూడా అమరులయ్యారు. భారత్‌ చర్చలను చైనా బలహీనపరుస్తోందని జూన్ 19, 2020న ప్రధాని మోదీనే బహిరంగంగా తెలిపారు. దేప్సాంగ్, డెమ్‌చోక్‌లో పాటు 2000 చదరపు కిలో మీటర్ల భూభాగం సైతం భారత సైన్యానికి అధీనంలో లేదు’ అని జైరాం రమేష్‌ మండిపడ్డారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement