
న్యూఢిల్లీ: భారత సరిహద్దు ప్రాంతం డోక్లాం పీఠభూమి దగ్గర చైనా నిర్మాణాలు కొనసాగిస్తుండటంపై కాంగ్రెస్ పార్టీ ఆందోళన వ్యక్తంచేసింది. ఈ మేరకు పార్టీ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్ బుధవారం ఒక ప్రకటన విడుదలచేశారు. ‘‘డోక్లాం పీఠభూమికి అత్యంత సమీపంలో చైనా మిలటరీ నిర్మాణాలపై భారత సైన్యం తాజాగా మరింత ఆందోళన వ్యక్తంచేసింది.
ఒక్క అంగుళం భూమి కూడా ఎవరికో వదులుకునే ప్రసక్తి లేదని అమిత్ ప్రకటించారు. కానీ 2020 మే తర్వాత 2,000 కిలోమీటర్ల భారతభూభాగాన్ని గస్తీకాసే అవకాశాన్ని చైనా బలగాలు పోగొట్టాయి. మన డెప్సాంగ్, డెమ్‌చోక్, హాట్‌స్ప్రింగ్(కున్‌గ్రాంగ్ నళా), గోగ్రా పోస్టు వంటి పెట్రోలింగ్ పాయింట్లకు మన బలగాలు వెళ్లకుండా చైనా సైన్యం అడ్డుతగులుతోంది. దీనిపై మోదీ మౌనం వీడాలి’’ అని డిమాండ్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment