construction works
-
వేల కోట్ల అప్పులతో అమరావతి నిర్మిస్తున్న కూటమి సర్కారు
-
వైద్య, విద్యా ప్రాప్తిరస్తు
అమలాపురం టౌన్: చేరువలో చదువుల కోవెల ఉంటే.. ఆరోగ్యానికి పూర్తి భరోసా లభిస్తే ఆ ఆనందమే వేరు. అందుకే విద్య, వైద్య రంగాలకు ప్రభుత్వం ఎనలేని ప్రాధాన్యం ఇస్తోంది. పేదలకు సకల సౌకర్యాలూ కల్పిస్తోంది. ఇందులో భాగంగా జిల్లాకు ప్రభుత్వ వైద్య విద్య, ఉచిత ప్రభుత్వ వైద్య సేవలు త్వరలో మరింత చేరువ కానున్నాయి. అమలాపురం మండలం కామనగరువు, సమనస గ్రామాల సరిహద్దుల్లో రాష్ట్ర ప్రభుత్వం 54 ఎకరాలను సేకరించి రూ.450 కోట్లతో ప్రభుత్వ వైద్య కళాశాలను నిర్మిస్తోంది. పేద, మధ్య తరగతి కుటుంబాలకు చెందిన విద్యార్థులు సైతం ప్రభుత్వపరంగా వైద్య విద్యను అభ్యసించేందుకు మార్గం సుగమమవుతోంది.అమలాపురంలో ఈ వైద్య కళాశాలల నిర్మాణ పనుల వేగం పుంజుకుంది. ఇది అందుబాటులోకి వస్తే ఏటా దాదాపు 150 మెడికల్ సీట్లతో విద్యార్థులు వైద్యను అభ్యసించే అవకాశం ఏర్పడుతుంది. ఇంత వరకూ ప్రభుత్వ వైద్య విద్య కోసం ఇతర జిల్లాలు, ఇతర రాష్ట్రాలకు విద్యార్థులు వెళ్లాల్సిన పరిస్థితి ఉండేది. అమలాపురంలో నిర్మిస్తున్న ప్రభుత్వ వైద్య కళాశాల అందుబాటులోకి వస్తే ఈ పరిస్థితులన్నీ దాదాపు దూరం కానున్నాయి. పేద, మధ్య తరగతి కుటుంబాల్లో ఎవరైనా వైద్య విద్య అభ్యసించాలంటే రూ.లక్షల్లో ఖర్చు అవుతుంది.ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం అలాంటి విద్యార్థులకు వైద్య విద్యపరంగా జిల్లాలో ఓ భరోసాగా నిలువనుంది. ఇప్పటికే ఈ కళాశాల నిర్మాణ పనులు దాదాపు 65 శాతం పూర్తయ్యాయి. రాష్ట్ర వైద్య ఆరోగ్య మౌలిక సదుపాయాల కల్పన సంస్థకు చెందిన ఇంజినీర్లు ఈ భవనాలను త్వరితగతిన పూర్తి చేసే దిశగా శ్రమిస్తున్నారు. వచ్చే ఏడాది నాటికి మొత్తం నిర్మాణం పూర్తయ్యే అవకాశం ఉందని ఆ సంస్థ ఇంజినీర్ యోగి తెలిపారు.చకచకా సదుపాయాల కల్పనప్రభుత్వ వైద్య కళాశాలకు అనుబంధంగా జిల్లా బోధనా ఆసుపత్రిగా అమలాపురం ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిని ఎంపిక చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం 100 పడకలతో ఉన్న ఈ ఆసుపత్రి 650 పడకలుగా జిల్లా స్థాయిలో పెద్దాసుపత్రిగా సేవలు అందించనుంది. ఇప్పటికే ఇక్కడ మౌలిక సదుపాయాల కల్పన పనులు చకచకా జరుగుతున్నాయి. ఏరియా ఆస్పత్రిలో బోధనా ఆసుపత్రి కోసం అప్పుడే ఆపరేషన్ థియేటర్లు, కన్సల్టింగ్ వార్డులు సిద్ధమవుతున్నాయి.ఆ దిశగా యంత్ర పరికరాలు, ఇతర మౌలిక సదుపాయాల ఏర్పాటు జరుగుతోంది. ఇక ప్రభుత్వ వైద్య కళాశాలకు అనుబంధంగా ఈ బోధనా ఆసుపత్రి జిల్లా ప్రజలకు ఉచిత వైద్య సేవలు అందించనుంది. ఇప్పుడు ఆసుపత్రిలో 12 విభాగాలకు వైద్య నిపుణులు ఉంటే, అదే బోధనా ఆసుపత్రి హోదా వచ్చాక 24 విభాగాలు ఏర్పడి ఆయా విభాగాలకు ఒక్కో వైద్య నిపుణుడు అందుబాటులోకి రానున్నారు. ప్రభుత్వ వైద్య కళాశాలలో వైద్య విద్యనభ్యసించే విద్యార్థులు బోధనా ఆస్పత్రిలో కూడా సేవలు అందించి తమ వైద్య విద్యను పూర్తి చేయనున్నారు. ఇప్పటికే నాడు–నేడు పథకంలో రూ.570 కోట్లతో ఏరియా ఆసుపత్రిని పూర్తి స్థాయిలో ఆధునీకరించారు. ఈ అభివృద్ధి అంతా బోధనా ఆసుపత్రి అప్‌గ్రేడ్‌కు ఉపయోగపడుతోంది.వచ్చే ఏడాదికి అంతా సిద్ధంఅమలాపురంలో నిర్మిస్తున్న ప్రభుత్వ వైద్య కళాశాల, బోధనా ఆసుపత్రి వచ్చే ఏడాదికి జిల్లా ప్రజలకు అందుబాటులోకి రానున్నాయని అంచనా వేస్తున్నాం. ఏరియా ఆసుపత్రిలో బోధనా ఆసుపత్రికి అవసరమైన అన్ని సదుపాయాలూ సిద్ధమవుతున్నాయి. దీనివల్ల ప్రజలకు ఉచిత వైద్యం మరింత చేరువవుతోంది. మెడికల్ స్పెషలిస్ట్‌లు, మెడికల్ ఎక్యూప్మెంట్లు వంటి విషయాల్లో అప్‌గ్రేడ్ సదుపాయాలు వస్తాయి. –డాక్టర్ పద్మశ్రీరాణి, సమన్వయకర్త, జిల్లా ప్రభుత్వ ఆసుపత్రులు -
అంబేడ్కర్ స్మృతివనం చరిత్రాత్మకం
సాక్షి, అమరావతి: ప్రజల మధ్య ఐక్యతను, సుహృద్భావ వాతావరణాన్ని, సామరస్యాన్ని పెంపొందించడంలో అంబేడ్కర్ స్మృతివనం కీలకపాత్ర పోషిçస్తుందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఉద్ఘాటించారు. స్టాట్యూ ఆఫ్ సోషల్ జస్టిస్ (సామాజిక న్యాయానికి చిహ్నం) కాన్సెప్ట్‌గా అంబేడ్కర్ విగ్రహం, స్మృతివనం ఏర్పాటుచేస్తున్నామన్నారు. విజయవాడ స్వరాజ్య మైదానంలో జరుగుతున్న అంబేడ్కర్ విగ్రహం, స్మృతివనం నిర్మాణ పనులపై క్యాంపు కార్యాలయంలో సోమవారం ఆయన సమీక్ష నిర్వహించారు. స్మృతివనం, విగ్రహం ప్రారంభించే నాటికి ఏ ఒక్క పని కూడా పెండింగ్‌లో ఉండకూడదని అధికారులను ఆయన ఆదేశించారు. ఈ ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టు నిర్మాణం పూర్తిచేసే విషయంలో అధికారులకు ముఖ్యమంత్రి స్పష్టమైన ఆదేశాలిచ్చారు. అవి.. ►అంబేడ్కర్ స్మృతివనంలో కన్వెన్షన్ సెంటర్ పనులు కూడా పూర్తికావాలి. ఇందులో పక్కాగా మౌలిక సదుపాయాలు కల్పించాలి. దీని నిర్వహణను సమర్ధవంతంగా చేపట్టేలా చర్యలు తీసుకోవాలి. ►స్మృతివనం ప్రాంగణమంతా పచ్చదనం ఉట్టిపడేలా మంచి ఉద్యానవనాన్ని తీర్చిదిద్దాలి. ►నడకదారి పొడవునా గ్రీనరీ ఉండేలా చూడాలి. ►ఈ పనులన్నింటిపైనా నిరంతర పర్యవేక్షణ ఉండాలి. ► విగ్రహం, స్మృతివనం ప్రారంభించే నాటికి ఏ ఒక్క పని కూడా పెండింగ్ లేకుండా నిర్ధేశించుకున్న గడువులోగా కచ్చితంగా పూర్తిచేయాలి. జనవరి 15 నాటికి పనులు పూర్తిచేస్తాం అంబేడ్కర్ విగ్రహం, స్మృతివనాన్ని జనవరి 24న ప్రారంభించేలా ఏర్పాట్లుచేస్తున్నామని, అన్ని పనులను జనవరి 15 నాటికి పూర్తిచేస్తామని సీఎం వైఎస్ జగన్‌కు అధికారులు తెలిపారు. సమీక్ష సందర్భంగా పనుల పురోగతిని అధికారులు వివరించారు. స్మృతివనంలో 81 అడుగుల ఎత్తయిన పీఠంపై 125 అడుగుల అంబేడ్కర్ విగ్రహం ఉంటుందన్నారు. దీంతోపాటు విజయవాడ కృష్ణలంక ప్రాంతంలో కృష్ణా నదికి నిర్మించిన రక్షణ గోడ పొడవునా 1.2 కిలోమీటర్ల మేర సుందరీకరణ పనులకు సంబంధించిన ప్రతిపాదనలను అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. దానికి ఆనుకుని పార్కు, వాకింగ్ ట్రాక్ పనులు చురుగ్గా జరుగుతున్నాయని కూడా అధికారులు వివరించారు. ఈ సమీక్షా సమావేశంలో ఉపముఖ్యమంత్రి (దేవదాయ శాఖ) కొట్టు సత్యనారాయణ, పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగు నాగార్జున, పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ స్పెషల్ సీఎస్ వై. శ్రీలక్ష్మి, ఏపీఐఐసీ ఎండీ ప్రవీణ్‌కుమార్, ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఎస్. ఢిల్లీరావు, విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు. స్మృతివనం పనులు పరిశీలించిన మంత్రులు సమీక్ష సమావేశానంతరం అంబేడ్కర్ విగ్రహం, స్మృతివనం పనులను ఉపముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ, సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగు నాగార్జునతోపాటు ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఎస్. ఢిల్లీరావు, ఇతర అధికారులు సోమవారం పరిశీలించారు. ఈ సందర్బంగా కొట్టు సత్యనారాయణ మీడియాతో మాట్లాడుతూ.. అంబేడ్కర్ ఆశయాల స్ఫూర్తితో సీఎం వైఎస్ జగన్ పాలన సాగిస్తున్నారని, రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి విశేష కృషిచేస్తున్నారని కొనియాడారు. రాష్ట్రంలో సామాజిక అంతరాలను తొలగించి సమసమాజ స్థాపనకు కృషిచేస్తున్నారన్నారు. మంత్రి మేరుగు నాగార్జున మాట్లాడుతూ అంబేడ్కర్ స్ఫూర్తిని భావితరాలకు అందించేందుకు సీఎం జగన్ గొప్ప సంకల్పంతో స్మృతివనాన్ని నిర్మిస్తున్నారన్నారు. రూ.400 కోట్లతో అంబేడ్కర్ విగ్రహం, స్మృతివనం రూపుదిద్దుకుంటోందన్నారు. చివరి దశలో ఉన్న పనులను సత్వరం పూర్తిచేసి ప్రారంభోత్సవ వేడుకను ఘనంగా నిర్వహించనున్నట్లు తెలిపారు. -
గడువులోగా అంబేద్కర్ స్మృతివనం ప్రాజెక్టు పూర్తి చేయాలి: సీఎం జగన్
సాక్షి, తాడేపల్లి: విజయవాడ స్వరాజ్ మైదానంలో అంబేద్కర్ స్మృతివనం, అంబేద్కర్ విగ్రహ నిర్మాణ పనులపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షా సమావేశానికి మంత్రులు కొట్టు సత్యనారాయణ, ఆదిమూలపు సురేష్, మేరుగు నాగార్జున, పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ స్పెషల్ సీఎస్ వై.శ్రీలక్ష్మి తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం జగన్ ఏమన్నారంటే.. అంబేద్కర్ స్మృతివనం నిర్మాణం చారిత్రాత్మకమైనది ఇది అత్యంత ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టు సామాజిక న్యాయస్ఫూర్తికి ప్రతిబింబంగా నిలిచే ప్రాజెక్టు ఇది రాజ్యాంగ ఔన్నత్యం, ప్రజాస్వామ్య విలువలకు ప్రేరణగా నిలిచే గొప్ప కట్టడం ఇది ప్రజల మధ్య ఐక్యత, సుహృద్భావ వాతావరణాన్ని, సామరస్యాన్ని పెంపొందించడంలో ఈ ప్రాజెక్టు కీలకపాత్ర పోషిస్తుంది నిర్ధేశించుకున్న గడువులోగా అంబేద్కర్ విగ్రహం, స్మృతివనం పనులను పూర్తి చేయాలి స్మృతివనం, విగ్రహం ప్రారంభించేనాటికి ఒక్క పని కూడా పెండింగ్‌లో ఉండకూడదని ఆదేశాలు జారీ చేశారు. వచ్చే రిపబ్లిక్‌డే నాటికి పూర్తయ్యే విధంగా... పనులు చేపడుతున్నామన్న సీఎంకు తెలిపిన అధికారులు. జనవరి 15 నాటికి పనులు పూర్తి చేస్తామని తెలిపిన అధికారులు జనవరి 24న ప్రారంభోత్సవానికి అంబేద్కర్ విగ్రహం, స్మృతివనాన్ని సిద్ధం చేస్తామన్న అధికారులు కన్వెన్షన్ సెంటర్ పనులు కూడా పూర్తి కావాలన్న సీఎం కన్వెన్షన్ సెంటర్లో మౌలిక సదుపాయాలును పక్కాగా ఏర్పాటు చేయాలని ఆదేశం నిర్వహణను సమర్ధవంతంగా చేపట్టేలా చర్యలు తీసుకోవాలన్న సీఎం జగన్ స్మృతివనం ప్రాంగణమంతా పచ్చదనం ఉట్టిపడేలా మంచి ఉద్యానవనాన్ని తీర్చిదిద్దాలన్న సీఎం నడక దారి పొడవునా గ్రీనరీ ఉండేలా చూడాలని ఆదేశం పనులు నిర్ధేశించుకున్న గడువులోగా కచ్చితంగా పూర్తిచేయాలని అధికారులను ఆదేశించిన సీఎం ఆ మేరకు నిరంతరం పనుల పర్యవేక్షణ జరగాలన్న సీఎం అంబేద్కర్ విగ్రహ ఏర్పాటు పనుల పురోగతిని సీఎంకు వివరించిన అధికారులు. స్టాట్యూ ఆఫ్ సోషల్ జస్టిస్ కాన్సెప్ట్‌గా అంబేద్కర్ విగ్రహం, స్మృతివనం ఏర్పాటు. అంబేద్కర్ విగ్రహం పీఠం ఎత్తు 81 అడుగులు... విగ్రహం ఎత్తు 125 అడుగులు. కృష్ణలంక ప్రాంతంలో నిర్మించిన రక్షణ గోడ పొడవునా 1.2 కిలోమీటర్ల సుందీకరణ పనులపై పలు ప్రతిపాదనలను సీఎంకు వివరించిన అధికారులు. పార్క్, వాకింగ్ ట్రాక్ వంటివి ఏర్పాటు చేస్తున్నట్టు సీఎంకు వివరించిన అధికారులు. పనులు చురుగ్గా సాగుతున్నాయన్న అధికారులు -
‘దారి’తప్పిన ఈనాడు రాతలు
నాడు.. చంద్రబాబు హయాంలో రోడ్ల నిర్వహణ, నిర్మాణంలో అంతులేని నిర్లక్ష్యం.. అప్పులుచేసి మొదలెట్టిన పనులు అసంపూర్తిగా వదిలేసి కోట్లాది రూపాయల నిధులు మళ్లించిన వైనం.. ఆ ఐదేళ్లలో రోడ్ల నిర్మాణానికి రూ.2,953.81 కోట్లే ఖర్చు.. జాతీయ రహదారులకు నిధులు రాబట్టడంలోనూ అంతంతమాత్రమే.. ఒక్కమాటలో చెప్పాలంటే ఈ రంగాన్ని గాలికొదిలేసింది. నేడు.. టీడీపీ ప్రభుత్వ హయాంలో కంటే అత్యధికంగా నిధులు ఖర్చుచేస్తున్న సీఎం వైఎస్ జగన్ సర్కారు.. చంద్రబాబు వదిలేసిన పనులను పూర్తిచేస్తూనే ఆ సర్కార్ మిగిల్చిన అప్పులనూ తీరుస్తోంది.. ఒక్క పోయినేడాదిలోనే రూ.2,400 కోట్లతో 7,500 కి.మీ. రోడ్లను నిర్మించింది.. మొత్తం మీద ఈ నాలుగేళ్లలో రూ.4,148.59 కోట్లు వెచ్చించింది. జాతీయ రహదారులకూ పెద్ద మొత్తంలో అంటే.. రూ.25,304 కోట్లు రాబట్టి రోడ్లపై అత్యధిక ఫోకస్ పెట్టింది. సాక్షి, అమరావతి : అయినా సరే.. రాష్ట్ర ప్రభుత్వంపై ‘ఈనాడు’ రామోజీరావు వంకర రాతలు రాస్తూనే ఉంటారు. తనకు బాగా అలవాటైన రీతిలో అభూతకల్పనలు, అవాస్తవాలు రంగరించి రాష్ట్రంలో రోడ్ల పరిస్థితిపై తాజాగా కట్టుకథలు అల్లారు. రాష్ట్రంలో రోడ్ల నిర్వహణను టీడీపీ ప్రభుత్వం గాలికొదిలేసిందన్న వాస్తవాన్ని దాచిపెట్టి ప్రస్తుత వైఎస్సార్సీపీ ప్రభుత్వంపై బురదజల్లేందుకు తన శక్తియుక్తుల్ని ప్రదర్శించారు. కానీ, టీడీపీ ప్రభుత్వం ఐదేళ్లలో కంటే వైఎస్సార్సీసీ ప్రభుత్వం రోడ్ల నిర్మాణానికి అత్యధికంగా నిధులు వెచ్చిస్తోందన్నది వాస్తవం. చంద్రబాబు ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిన పనులను పూర్తిచేస్తూనే గత ప్రభుత్వం మిగిల్చిన అప్పులను తీరుస్తోందని రవాణా శాఖ రికార్డులు వెల్లడిస్తున్న పచ్చినిజం. అయిననూ.. రామోజీ కలం కాలకూట విషం చిమ్మవలె.. ఇది ఆయన సహజ లక్షణం కూడా. రాష్ట్రంలో రహదారుల స్థితిగతులపై దారితప్పిన ఈనాడు రామోజీ రాతలపై వాస్తవాలతో కూడిన ఫ్యాక్ట్‌చెక్ ఇది.. రోడ్లపై బాబు సర్కారు అంతులేని నిర్లక్ష్యం.. నిజానికి.. టీడీపీ ప్రభుత్వం తన ఐదేళ్లలో రాష్ట్రంలో రోడ్ల నిర్వహణ, నిర్మాణాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేసింది. ఏటా విడుదల చేయాల్సిన రోడ్ల నిర్వహణ నిధులను కూడా కేటాయించలేదు. అంతేకాదు.. 2017–18లో రోడ్ల నిర్మాణం కోసం తీసుకొచ్చిన రూ.3వేల కోట్ల రుణాన్ని కూడా ఇతర అవసరాలకు చంద్రబాబు మళ్లించారు. దాంతో రోడ్ల అభివృద్ధి పూర్తిగా కుంటుపడింది.. అటకెక్కింది కూడా. రహదారులకు వైఎస్సార్సీపీ ప్రభుత్వం పెద్దపీట.. కానీ, వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారం చేపట్టిన తరువాత రాష్ట్రంలో రోడ్ల అభివృద్ధికి అత్యధిక ప్రాధాన్యమిచ్చింది. కేవలం గత ఆర్థిక సంవత్సరంలోనే రూ.2,400 కోట్లతో 7,500 కి.మీ. మేర రోడ్లను నిర్మించింది. ప్రస్తుతం వర్షాకాలం ముగియడంతో రాష్ట్రంలో రోడ్ల నిర్మాణాన్ని వేగవంతం చేసింది. ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.1,121.92 కోట్లతో 3,432 కి.మీ. పనులు ప్రారంభించింది. అంతేకాదు.. టీడీపీ ప్రభుత్వంతో కంటే అత్యధికంగా రోడ్ల నిర్మాణానికి నిధులు కేటాయిస్తోంది. అలాగే.. ►టీడీపీ ప్రభుత్వం ఐదేళ్లలో రోడ్ల నిర్మాణానికి రూ.2,953.81 కోట్లు వెచ్చించింది. అంటే ఏడాదికి సగటున రూ.591 కోట్లు ఖర్చుచేసింది. కానీ, వైఎస్సార్సీపీ ప్రభుత్వం నాలుగేళ్లలోనే రూ.4,148.59 కోట్లు వెచ్చించింది. అంటే ఏడాదికి సగటున రూ.951కోట్లు చొప్పున ఖర్చుచేసింది. పైగా.. ఈ ఆర్థిక సంవత్సరం.. తొలి నాలుగు నెలల్లోనే రూ.346 కోట్లు ఖర్చుపెట్టింది. ►టీడీపీ ప్రభుత్వం రాష్ట్ర రహదారులు, జిల్లా ప్రధాన రహదారుల పునరుద్ధరణకు రూ.4,325 కోట్లే ఖర్చుచేస్తే.. అదే వైఎస్సార్సీపీ ప్రభుత్వం నాలుగేళ్లలో రోడ్ల పునరుద్ధరణ కోసం రూ.7,340 కోట్లు ఖర్చుచేసింది. ►ఇక రోడ్ల అభివృద్ధి సెస్ ద్వారా వచ్చిన రూ.3వేల కోట్లను టీడీపీ చేసిన అప్పులను తీర్చడానికే వైఎస్సార్సీపీ ప్రభుత్వం కేటాయించాల్సి వచ్చింది. సెస్ ద్వారా వచ్చిన మరో రూ.2వేల కోట్లకు అదనంగా రూ.2,500 కోట్ల రుణం తీసుకుని మొత్తం రూ.4,500 కోట్లతో 7,600 కి.మీ. మేర రోడ్లను నిర్మించింది. జాతీయ రహదారులపైనా బాబు నిర్లక్ష్యం.. మరోవైపు.. టీడీపీ ప్రభుత్వ హయాం కంటే వైఎస్సార్సీపీ ప్రభుత్వం రాష్ట్రంలో జాతీయ రహదారుల నిర్మాణానికి అత్యధిక ప్రాధాన్యమిచ్చింది. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉండగా 2014–19లో రాష్ట్రంలో జాతీయ రహదారుల కోసం రూ.13,353 కోట్లు మాత్రమే ఖర్చుచేశారు. అదే.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పూర్తిస్థాయి ప్రతిపాదనలను కేంద్ర ప్రభుత్వానికి సమర్పించి అత్యధిక నిధులు రాబట్టారు. దీంతో వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాం నాలుగేళ్లలోనే రూ.25,304 కోట్లతో జాతీయ రహదారులను నిర్మించడం విశేషం. రాష్ట్ర ప్రభుత్వం చురుగ్గా స్పందించి, త్వరితగతిన భూసేకరణ ప్రక్రియను పూర్తిచేయడం ఇందుకు ప్రధానంగా దోహదపడింది. -
చకచకా కొనసాగుతున్న భోగాపురం ఎయిర్ పోర్ట్ నిర్మాణ పనులు
-
పలు రైళ్లు రద్దు, దారి మళ్లింపు
రైల్వేస్టేషన్(విజయవాడ పశ్చిమ): సికింద్రాబాద్ డివిజన్లోని మాకుడి–సీర్పూర్ టౌన్ సెక్షన్ మధ్యలో నిర్మాణ పనుల కారణంగా ఆ మార్గంలో నడిచే పలు రైళ్లను రద్దు చేయంతో పాటు, మరికొన్నింటిని దారి మళ్లించి నడపనున్నట్లు రైల్వే అధికారులు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 21న ధనాపూర్–సికింద్రాబాద్ (03225), 22న హైదరాబాద్–గోరఖ్‌పూర్ (02575), 23న హైదరాబాద్–రక్షౌ ల్ (07051), 24న సికింద్రాబాద్–ధనాపూర్ (03226), గోరఖ్‌పూర్–హైదరాబాద్ (02576), 26న రక్షౌ ల్–హైదరాబాద్ (07052) రైళ్లను రద్దు చేశారు. ఈ నెల 22 నుంచి 25 వరకు ఎంజీఆర్ చెన్నై సెంట్రల్–అహ్మదాబాద్ (12656) రైలును పెద్దపల్లి, నిజామాబాద్, పూర్ణా, అకోలా మీదుగా దారి మళ్లించారు. అదే విధంగా ఈ నెల 22 నుంచి 25 వరకు యశ్వంత్‌పూర్– హజరత్ నిజాముద్దిన్ (12649) రైలును, అలాగే ఈ నెల 18, 19, 21, 23, 24, 25 తేదీల్లో హజరత్ నిజాముద్దిన్–యశ్వంత్‌పూర్ (12650) రైలును బళ్లారి, గుంతకల్లు, వాడి, మన్మడ్, ఖాండ్వా, ఇటార్సీ స్టేషన్ల మీదుగా దారి మళ్లించారు. -
ఎంఎస్ఎంఈలపై ప్రత్యేక దృష్టి: సీఎం జగన్
సాక్షి, గుంటూరు: రాష్ట్రంలో కొత్తగా నిర్మిస్తున్న పోర్టులు, హార్బర్ల నిర్మాణ పనులపై తాడేపల్లిలోని తన క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి గురువారం సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి మంత్రి గుడివాడ అమర్నాథ్, సీఎస్ జవహర్‌రెడ్డి, ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ, ఎంఎస్ఎంఈలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆదేశించారు. ఎంఎస్ఎంఈల ఉత్పత్తులకు మార్కెటింగ్‌పై ఫోకస్ పెట్టాలన్న సీఎం.. ఇతర దేశాల్లో ఎంఎస్ఎంఈల నిర్వహణ, నాణ్యమైన ఉత్పాదనల విధానాలను ఇక్కడ కూడా అమల్లోకి తీసుకురావాలన్నారు. వినూత్న ఉత్పాదనలు, సాంకేతిక పరిజ్ఞానం బదిలీపై దృష్టి పెట్టాలన్నారు. అలాగే ప్రపంచవ్యాప్తంగా మార్కెటింగ్ సౌకర్యంతో పాటు, అత్యుత్తమ సాంకేతిక పరిజ్ఞానాన్ని కూడా అందించగలగాలని సీఎం పేర్కొన్నారు. పోర్టులు, ఫిషింగ్ హార్బర్ల నిర్మాణ పనుల పురోగతిని సీఎంకు అధికారులు వివరించారు. రామాయపట్నం పోర్టు పనుల ప్రగతిని సీఎం అడిగి తెలుసుకున్నారు. ఇప్పటికే సౌత్ బ్రేక్ వాటర్, నార్త్ బ్రేక్ వాటర్ పనులు దాదాపుగా పూర్తయ్యాయన్న అధికారులు.. సెప్టెంబరు కల్లా డ్రెడ్జింగ్, రెక్లిమేషన్ పనులు పూర్తవుతాయని తెలిపారు. మచిలీపట్నం పోర్టు నిర్మాణ పనులను అధికారులు వివరించారు. చదవండి: చంద్రబాబు కొత్త డ్రామా.. సానుభూతి కోసం ఇంతకు దిగజారాలా? శ్రీకాకుళం జిల్లా మూలపేటలో పోర్టు నిర్మాణ పనుల ప్రగతిని వివరించిన అధికారులు.. సౌత్ బ్రేకింగ్ వాటర్ పనులు ప్రారంభం అయినట్లు అధికారులు తెలిపారు. కాకినాడ గేట్‌వే పోర్టు లిమిటెడ్ నిర్మాణ పనుల ప్రగతిని కూడా సీఎంకు అధికారులు వివరించారు. 10 ఫిషింగ్ హార్బర్ల నిర్మాణ పనులపై సీఎం సమీక్ష తొలి దశలో నిర్మిస్తున్న ఉప్పాడ, మచిలీపట్నం, నిజాంపట్నం, జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ల నిర్మాణాలపై సీఎం జగన్ సమీక్ష జరిపారు. జువ్వలదిన్నెలో 86 శాతం పనులు పూర్తి, నిజాంపట్నంలో 62 శాతం, మచిలీపట్నంలో 56.22 శాతం, ఉప్పాడలో 55.46శాతం పనులు పూర్తి కాగా, జువ్వలదిన్నెలో ఫిషింగ్ హార్బర్ మరో 40 రోజుల్లో సిద్ధం అవుతుందని అధికారులు తెలిపారు. -
Maharashtra Samruddhi Expressway: నిర్మాణ దశలో ఘోర ప్రమాదం
ముంబై: మహారాష్ట్రలో నిర్మాణంలో ఉన్న సమృద్ధి ఎక్స్‌ప్రెస్‌వే వద్ద ఘోర ప్రమాదం జరిగింది. వంతెనలోని శ్లాబులను యథాస్థానంలో కూర్చోబెట్టేందుకు వినియోగించే గిర్డెర్ లాంఛర్ కుప్పకూలడంతో ఈ ఘటన చోటుచేసుకుంది. సెగ్మెంట్ లాంచర్(క్రేన్)తో కలుపుకుని దాదాపు 700 టన్నుల బరువైన గిర్డెర్ లాంఛర్ 35 మీటర్ల ఎత్తునుంచి కిందకు కుప్పకూలింది. దీంతో అక్కడే పనిచేస్తున్న కార్మికులు, సిబ్బంది దాని కింద నలిగిపోయారు. ఈ ఘోర దుర్ఘటనలో 20 మంది ప్రాణాలు కోల్పోయారు. ముంబైను నాగ్‌పూర్‌ను కలుపుతూ 701 కిలోమీటర్ల పొడవైన సమృద్ధి మహామార్గ్ ఎక్స్‌ప్రెస్‌వేను నిర్మిస్తున్నారు. ముంబైకి 80 కి.మీ.ల దూరంలో థానె జిల్లాలో సార్లాంబే గ్రామం వద్ద సోమవారం అర్ధరాత్రిదాటాక ఈ ఘటన జరిగింది. ఘటనపై నిపుణులతో కూడిన దర్యాప్తు బృందాన్ని ఏర్పాటుచేసినట్లు ఉపముఖ్యమంత్రి ఫడ్నవిస్ చెప్పారు. పోతపోసిన బాక్స్ శ్లాబులను తర్వాతి రోజు నిర్మాణం కోసం సిద్ధంచేస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. మృతుల కుటుంబాలకు తలో రూ.2 లక్షల ఎక్స్‌గ్రేíÙయా ఇస్తామన ప్రధాని ప్రకటించారు. తలో రూ.5 లక్షల ఆర్థికసాయం అందిస్తామని రాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే చెప్పారు. దుర్ఘటన నేపథ్యంలో సంబంధిత ఇద్దరు కాంట్రాక్టర్లపై పోలీసులు కేసు నమోదుచేశారు. మొత్తం ఎక్స్‌ప్రెస్‌వేలో ఇప్పటికే 600 కి.మీ.ల మేర నిర్మాణం పూర్తయి రాకపోకలు సైతం మొదలయ్యాయి. ఈ 101 కి.మీ.ల నిర్మాణ పనులు కొనసాగుతాయి. ఈ ఎక్స్‌ప్రెస్‌వే మీద గత ఆరు నెలల్లో జరిగిన రోడ్డు ప్రమాదాల్లో 88 మంది ప్రాణాలు కోల్పోయారు. -
డిసెంబర్‌కు రెడీ!
సాక్షి, అమరావతి: రామాయపట్నం పోర్టును డిసెంబర్‌కి అందుబాటులోకి తేవాలని రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించుకుంది. ఇందుకనుగుణంగా పటిష్టమైన ప్రణాళికతో పనులను శరవేగంగా పూర్తి చేస్తోంది. రూ.3,736 కోట్లతో 850.79 ఎకరాల వీస్తీర్ణంలో ఏడాదికి 34.04 మిలియన్ టన్నుల సామర్థ్యంతో రామాయపట్నం తొలి దశ పనులను రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సంగతి తెలిసిందే. రూ.2,634.65 కోట్ల విలువైన పోర్టు నిర్మాణ కాంట్రాక్ట్‌ను నవయుగ–అరబిందో భాగస్వామ్య కంపెనీ చేపట్టింది. జూన్, 2022లో నిర్మాణ పనులు ప్రారంభించిన ఈ సంస్థ తొలి దశలో డిసెంబర్‌కి బల్క్ కార్గో బెర్త్‌ను అందుబాటులోకి తీసుకురావాలని లక్ష్యంగా నిర్దేశించుకుంది. మొత్తం 4 బెర్తులు నిర్మిస్తుండగా అందులో 2 మల్టిపర్పస్ బెర్తులు జేఎస్‌డబ్ల్యూ ఇన్ఫ్రా, ఒక మల్టీపర్సస్ బెర్తు ఇండోసోల్ క్యాపిటివ్ (సొంత) అవసరాలకు ప్రభుత్వం కేటాయించింది. బల్క్ కార్గో హ్యాండిల్ చేసే నాలుగో బెర్త్‌ను ఏపీ మారిటైమ్ బోర్డు నిర్వహించనుంది. పోర్టు నిర్మాణంలో కీలకమైన బ్రేక్ వాటర్, డ్రెడ్జింగ్ పనులు పూర్తి కావడంతో పాటు నార్త్ బ్రేక్ వాటర్‌ను ఆనుకొని బల్క్ కార్గో బెర్త్ నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. దీనికి అదనంగా సముద్రపు ఒడ్డుపై (ఆఫ్‌షోర్) అవసరమైన కస్టమ్స్, సెక్యూరిటీ, అడ్మినిస్ట్రేషన్ పనులతో పాటు కాంపౌండ్ వాల్ నిర్మాణ పనులను చేపట్టింది. డిసెంబర్‌కి పోర్టులో వాణిజ్య పరంగా కార్యకలాపాలను కొనసాగించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కేఎస్ జవహర్ రెడ్డి ఆదేశించారని, దీనికనుగుణంగా చర్యలు తీసుకుంటున్నట్లు రామాయపట్నం పోర్టు మేనేజింగ్ డైరెక్టర్ పి.ప్రతాప్ ‘సాక్షి’కి తెలిపారు. బెర్తుల నిర్మాణంలో కీలకమైన అప్రోచ్ టెస్టెల్ నిర్మాణ పనులు 80% పూర్తయ్యాయని, పోర్టు నిర్వహణకు అవసరమైన సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇన్‌డైరెక్ట్ ట్యాక్సెస్ అండ్ కస్టమ్స్ లేఖ రాయడంతో పాటు కస్టమ్స్ కార్యకలాపాల కోసం 27.88 ఎకరాలను కేటాయించినట్లు చెప్పారు. కస్టమ్స్ నిబంధనలు అనుసరించి సరుకు నిర్వహణ చేపట్టడం, రామాయపట్నం పోర్టును ఇమ్మిగ్రేషన్ ల్యాండింగ్ పాయింటింగ్ ప్రకటించడం వంటి దానికోసం కేంద్ర సంస్థలతో సంప్రదింపులు చేస్తున్నట్లు చెప్పారు. పోర్టు నిర్వహణకు అవసరమైన అన్ని అనుమతులు నవంబర్‌లోగా తీసుకువస్తామని తెలిపారు. మౌలిక వసతుల కల్పన పోర్టు నిర్మాణంతో పాటు పోర్టుకు అవసరమైన రహదారి, రైలు మార్గం, నీటి వసతి వంటివాటిపై ఏపీ మారిటైమ్ బోర్డు వేగంగా అడుగులు వేస్తోంది. జాతీయ రహదారి నుంచి రామాయపట్నం పోర్టును అనుసంధానిస్తూ 4 లైన్ల రహదారి పనులు వేగంగా కొనసాగుతున్నాయి. 5.5 కి.మీ పొడవైన రహదారి మార్గాన్ని కొత్తగా అభివృద్ధి చేస్తున్నారు. 5 కి.మీ రైల్వేలైన్ నిర్మాణానికి సంబంధించి రైల్వేతో చర్చిస్తున్నారు. పోర్టు నిర్వహణకు అవసరమైన నీటిని కావలి వాటర్ ట్యాంక్ నుంచి వినియోగించుకోవడానికి ప్రభుత్వం అనుమతించింది. -
ఒబెరాయ్ హోటల్ నిర్మాణ పనులకు సీఎం వైఎస్ జగన్ శంకుస్థాపన
-
శరవేంగంగా సాగుతున్న ఉప్పాడ ఫిషింగ్ హార్బర్ నిర్మాణ పనులు
-
దృశ్యం సినిమా రేంజ్లో హత్య..చివరకు..
ఓ వ్యక్తి తెలివిగా ప్రియురాలిని దృశ్యం మూవీ రేంజ్లో హతమార్చాడు. గుట్టుచప్పుడు కాకుండా పనికానిచ్చి దర్జాగా తిరుగుతున్నాడు. కానీ ఆమె ఫోన్ కాల్ డేటా ఆధారంగా పోలీసులకు చిక్కక తప్పలేదు. చివరికి అసలు నిజం బయటపడి కటకటాల పాలయ్యాడు. ఈ షాకింగ్ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో చోటు చేసుకుంది. అసలేం జరిగిందంటే..ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో ఓ వ్యక్తి ప్రియురాలిని గుట్టు చప్పుడు కాకుండా కడతేర్చాడు. ఆమె మృతదేహాన్ని నిర్మాణంలో ఉన్న తన ఇంటి ట్వాంకులో దాచిపెట్టాడు. బాధితురాలి కుటుంబ సభ్యులు ఆమె కనపించటం లేదంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఆమె కోసం గాలిస్తున్న పోలీసులు ఆమె చివరికాల్ డేటా ఆధారంగా అరవింద్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించడం ప్రారంభించారు. విచారణలో ఆమెను హత్య చేసినట్లు ఒప్పుకున్నాడు అరవింద్. ట్యాంకు వద్ద దాచిపెట్టిన మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్ట్‌మార్టం నిమిత్తం తరలించినట్లు పోలీసులు తెలిపారు. బాధితురాలిని 35 ఏళ్ల రాజ్ కేసర్‌గా గుర్తించారు పోలీసులు. నిందితుడు అరవింద్ దాదాపు 14 రోజుల క్రితమే కేసర్‌ను హత్య చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు. (చదవండి: బీఆర్ఎస్ మహిళా నేత ఆత్మహత్య.. వివాహ వేడుకలకు హాజరై..) -
మచిలీపట్నంలో శరవేగంగా జరుగుతున్న పోర్టు నిర్మాణపనులు
-
బందరు పోర్టు నిర్మాణ పనులు ప్రారంభించిన సీఎం వైఎస్ జగన్
-
విజయవాడలో ముమ్మరంగా అంబేడ్కర్ విగ్రహ ఏర్పాటు పనులు
-
‘డోక్లాం’ దేశ భద్రతకు పెనుముప్పు: కాంగ్రెస్
న్యూఢిల్లీ: భారత సరిహద్దు ప్రాంతం డోక్లాం పీఠభూమి దగ్గర చైనా నిర్మాణాలు కొనసాగిస్తుండటంపై కాంగ్రెస్ పార్టీ ఆందోళన వ్యక్తంచేసింది. ఈ మేరకు పార్టీ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్ బుధవారం ఒక ప్రకటన విడుదలచేశారు. ‘‘డోక్లాం పీఠభూమికి అత్యంత సమీపంలో చైనా మిలటరీ నిర్మాణాలపై భారత సైన్యం తాజాగా మరింత ఆందోళన వ్యక్తంచేసింది. ఒక్క అంగుళం భూమి కూడా ఎవరికో వదులుకునే ప్రసక్తి లేదని అమిత్ ప్రకటించారు. కానీ 2020 మే తర్వాత 2,000 కిలోమీటర్ల భారతభూభాగాన్ని గస్తీకాసే అవకాశాన్ని చైనా బలగాలు పోగొట్టాయి. మన డెప్సాంగ్, డెమ్చోక్, హాట్‌స్ప్రింగ్(కున్‌గ్రాంగ్ నళా), గోగ్రా పోస్టు వంటి పెట్రోలింగ్ పాయింట్లకు మన బలగాలు వెళ్లకుండా చైనా సైన్యం అడ్డుతగులుతోంది. దీనిపై మోదీ మౌనం వీడాలి’’ అని డిమాండ్ చేశారు. -
అధిక వ్యయాలతో రియల్టీ ప్రాజెక్టులు అసాధ్యం
న్యూఢిల్లీ: రియల్ ఎస్టేట్ ప్రాజెక్టుల అభివృద్ధి ఆచరణ సాధ్యం కాని పరిస్థితులు ఉన్నాయని టాటా రియాలిటీ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎండీ, సీఈవో సంజయ్ దత్ అన్నారు. భూమి ధరలు పెరిగిపోవడం, నిర్మాణ వ్యయం, నిధుల వ్యయాలు పెరిగిపోవడానికి అదనంగా ఆర్థిక అనిశ్చితులను ప్రస్తావించారు. రియల్ ఎస్టేట్ ప్రాజెక్టుల అనుమతులు నుంచి అభివృద్ది వరకు అన్ని సులభతరంగా సాగేందుకు భాగస్వాములను జవాబుదారీ చేయాలన్న అభిప్రాయాన్ని దత్ వినిపించారు. ‘‘రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులకు పెద్ద మొత్తంలో నిధులు అవసరం. మొదట భూమిని సమీకరించుకోవాలి. నేషనల్ క్యాపిటల్ రీజియన్ (ఎన్సీఆర్), ముంబై, బెంగళూరు తదితర ముఖ్య పట్టణాల్లో ప్రాజెక్టు వ్యయాల్లో భూమి వాటా 50 శాతం నుంచి 80–85 శాతం వరకు ఉంటోంది. ప్రాజెక్టు డిజైన్, అనుమతులు, నిర్మాణ ప్రారంభానికి 2–3 ఏళ్లు పడుతోంది. నిధుల వ్యయాలు ప్రముఖ సంస్థలకు 8.5 శాతంగా ఉంటే, పెద్దగా పేరులేని సంస్థలకు 18 శాతం వరకు ఉంటున్నాయి’’అని సంజయ్ దత్ వివరించారు. దీంతో ప్రాజెక్టు డెవలపర్లు ప్రస్తుత వ్యయాల ఆధారంగా ధరలను ప్రకటించినప్పటికీ.. ప్రాజెక్టు పూర్తయ్యే 5–6 ఏళ్లలో వ్యయాలు గణనీయంగా పెరుగుతున్నట్టు చెప్పారు. -
రోడ్డుపై నాలుగు పులులు
తాంసి: ఆదిలాబాద్ జిల్లా భీంపూర్ మండలం గొల్లఘాట్ శివారులో పంట చేలకు వెళ్లే రహదారిపై నాలుగు పులులు సంచరిస్తూ కనిపించాయి. గ్రామం సమీపంలో పిప్పల్‌కోటి రిజర్వాయర్ నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. ఈ పనుల కోసం భీంపూర్ మండలంలోని మార్కగూడ, రాంపూర్ గ్రామాల నుంచి మట్టిని టిప్పర్లలో తరలిస్తున్నారు. ఈ క్రమంలో గురువారం అర్ధరాత్రి డ్రైవర్ సాజిద్ టిప్పర్‌లో మట్టిని తీసుకొచ్చే క్రమంలో గ్రామానికి సమీపంలో ఉన్న మట్టి రోడ్డుపై నాలుగు పులులు కనిపించాయి. వెంటనే వాహనం నిలిపివేసి వాటిని వీడియో తీశాడు. ఈ సందర్భంగా అలికిడి కావడంతో అవి పంట చేల వైపు వెళ్లాయి. పులుల సంచారంపై అటవీశాఖ అధికారులకు సమాచారం అందించగా, ఫారెస్ట్ రేంజ్ అధికారి గులాబ్‌సింగ్, సెక్షన్ అధికారి అహ్మద్‌ఖాన్ పులులు సంచరించిన ప్రదేశాలను పరిశీలించి వాటి పాదముద్రల ఆనవాళ్లను గుర్తించారు. రెండు నెలల క్రితం ఇదే ప్రాంతంలో పిల్లలతో సంచరించిన పులి మళ్లీ వచ్చినట్లుగా అధికారులు ప్రాథమికంగా నిర్ధారించారు. పులుల సంచారం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు. -
రూ.1450 కోట్ల వ్యయంతో పనులు.. ‘సుంకిశాల’.. చకచకా
సాక్షి, హైదరాబాద్: మహానగర దాహార్తిని తీరుస్తున్న కృష్ణా మూడు దశల ప్రాజెక్టులకు ఈ ఏడాది చివరి నాటికి పుష్కలంగా తాగునీరు అందుబాటులోకి రానుంది. జలాలను తరలించేందుకు ఉద్దేశించిన సుంకిశాల ఇన్‌టేక్‌వెల్ నిర్మాణ పనులు చకచకా జరుగుతున్నాయి. నాగార్జున సాగర్ బ్యాక్‌వాటర్ సుంకిశాల వద్ద రూ.1470 కోట్ల అంచనా వ్యయంతో జలమండలి ఆధ్వర్యంలో పనులు జరుగుతున్నాయి. ఇప్పటివరకు సుమారు 50 శాతం.. అంటే రూ.760 కోట్ల మేర పనులు పూర్తయినట్లు నిర్మాణ సంస్థ తెలిపింది. ఈ ఏడాది నవంబర్– డిసెంబర్‌లోగా పనులు పూర్తి చేస్తామని పేర్కొంది. దాహార్తి దూరం.. ►ప్రస్తుతం కృష్ణా మూడు దశల ప్రాజెక్టుల ద్వారా నగరానికి నిత్యం 270 మిలియన్ గ్యాలన్ల (16.5 టీఎంసీలు) తాగునీటిని ఎలిమినేటి మాధవరెడ్డి కెనాల్ (ఏఎంఆర్పీ) నుంచి తరలిస్తున్నారు. ఏటా నాగార్జున సాగర్ ప్రాజెక్టులో నీటిమట్టాలు 510 అడుగుల కంటే దిగువనకు పడిపోయినపుడు డ్రెడ్జింగ్ ప్రక్రియ ద్వారా డెడ్‌స్టోరేజీ నుంచి నీటిని తరలించాల్సి వస్తోంది. ►ఈ నేపథ్యంలోనే ఈ ఇన్‌టేక్‌వెల్‌ను అత్యంత లోతున నిర్మిస్తున్నారు. సుమారు 170 మీటర్ల లోతు, 40 మీటర్ల వెడల్పున ఇన్‌టేక్ వెల్‌ను నిర్మిస్తున్నారు. పెరుగుతున్న జనాభా అవసరాల కారణంగా భవిష్యత్‌లో మొత్తంగా 20 టీఎంసీల కృష్ణా జలాలను నగరానికి తరలించేందుకు ఈ వెల్‌ను నిర్మిస్తుండడం విశేషం. మండువేసవిలోనూ ఎలాంటి ఆటంకాలు లేకుండా ఎండీడీఎల్(మినిమం డ్రాయల్ డౌన్ లెవెల్) కంటే దిగువ నుంచి కూడా నీటిని తరలించేందుకు సుంకిశాల ప్రాజెక్టు ఉపయోగపడనుందని జలమండలి వర్గాలు తెలిపాయి. ప్రాజెక్టు పురోగతి ఇలా.. ►అండర్ గ్రౌండ్ షాఫ్ట్ (వెట్ వెల్ డ్రై వెల్): అండర్ గ్రౌండ్ షాఫ్ట్ నిర్మాణం కోసం కీలకమైన రాతి తొలగింపు పనులు పూర్తయ్యాయి. ►8 మీటర్ల డయా వ్యాసార్థంతో యాక్సెస్ టన్నెళ్లు, లింక్ టన్నెళ్ల తవ్వకం పనులు కూడా దాదాపు పూర్తి కావచ్చాయి. మొత్తం 1100 రన్నింగ్ మీటర్లు (ఆర్ఎంటీ)లో 900 ఆర్ఎంటీ మేర పనులు పూర్తయ్యాయి. ఇన్ టేక్ టన్నెళ్ల తవ్వకం పనులు జరుగుతున్నాయి. ►ఎలక్ట్రో మెకానికల్ ఈక్విప్ మెంట్: ట్రాన్ కో నుంచి ప్రత్యేకంగా హెచ్ టీ ఫీడర్ మెయిన్ తీసుకున్నారు. పంపులు, మోటార్లు, ట్రాన్సా్ఫర్మర్, సబ్ స్టేషన్, ఇతర సామగ్రి కొనుగోలు ప్రక్రియ జరుగుతోంది. పంపింగ్ మెయిన్లు: 2375 ఎంఎం డయా ఎంఎస్ పైపులైన్‌కు ప్లేట్లు, పైపుల కొనుగోలు, తయారీ జరుగుతోంది. మొత్తం 5 కిలోమీటర్ల పైపులైన్లు తయారు కాగా, 3 కిలోమీటర్ల మేర పైపులైన్ ఏర్పాటు పూర్తయ్యింది. మొత్తం ప్రాజెక్టును 2023 నవంబరు– డిసెంబర్ నాటికి పూర్తి చేయనున్నారు. -
వేగంగా ‘సెంచురీ ప్యానల్స్’ నిర్మాణ పనులు
సాక్షి, అమరావతి: వైఎస్సార్ జిల్లా గోపవరం వద్ద 482 ఎకరాల్లో ఏర్పాటు చేస్తున్న సెంచురీ ప్యానల్స్ తయారీ యూనిట్ నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయి. ఈ యూనిట్ ఏర్పాటుకు పర్యావరణ, అటవీ అనుమతులు మంజూరు కావడంతో సెంచురీ ఫ్లై సంస్థ నిర్మాణ పనులు ప్రారంభించింది. సుమారు రూ.1,600 కోట్లతో ఏర్పాటుచేస్తున్న ఈ యూనిట్ ద్వారా ప్రత్యక్షంగా 2,000 మందికి పరోక్షంగా 4,000 మందికి ఉపాధి లభించనుంది. ఈ యూనిట్ నిర్మాణ పనులకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి 2021, డిసెంబర్ 24న భూమి పూజ చేసిన సంగతి తెలిసిందే. ఈ యూనిట్ తొలి దశ పనులను 2024 డిసెంబర్ నాటికి పూర్తిచేసి వాణిజ్యపరంగా ఉత్పత్తి ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. తొలుత తమిళనాడులో ఈ యూనిట్‌ను నెలకొల్పాలని భావించామని, కానీ ఏపీ ప్రభుత్వం వేగంగా అనుమతులు మంజూరు చేస్తుండటంతో గోపవరం వద్ద ఏర్పాటుచేస్తున్నట్లు సెంచురీ ప్లై చైర్మన్ సజ్జన్ భజాంకా శంకుస్థాపన సమయంలో ప్రకటించారు. తొలుత రూ.600 కోట్లతో యూనిట్ ఏర్పాటుచేయాలని భావించామని, కానీ ఇప్పుడు రూ.1,600 కోట్లు ఖర్చు పెడుతున్నట్లు ఆయన వెల్లడించారు. అత్యంత వెనుకబడిన ప్రాంతమైన గోపవరం వద్ద ఈ యూనిట్ ఏర్పాటు వల్ల కలప ఆధారిత అనుబంధ పరిశ్రమలు మరిన్ని వస్తాయని, తద్వారా స్థానికులకు పెద్ద ఎత్తున ఉపాధి లభిస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇదీ చదవండి: మరోసారి అలజడికి టీడీపీ నేతల యత్నం -
సికింద్రాబాద్ స్టేషన్‌కి కొత్త రూపు
సాక్షి, హైదరాబాద్: ఆధునిక వసతులతో నిర్మించబోతున్న సికింద్రాబాద్ కొత్త స్టేషన్ భవన నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం ఉన్న స్టేషన్ భవనాన్ని తొలగించి దాని స్థానంలో ఒకటో నంబర్ ప్లాట్‌ఫామ్ వైపు, పదో నంబర్ ప్లాట్‌ఫామ్ వైపు రెండు వేరువేరు భవనాలను నిర్మించనున్నారు. ఈ మేరకు ఢిల్లీకి చెందిన గిర్ధారిలాల్ కన్స్ట్రక్షన్ ప్రైవేట్ లిమిటెడ్‌కి ఇటీవలే కాంట్రాక్టు బాధ్యతను రైల్వే అప్పగించింది. నిర్మాణ సంస్థ వెంటనే పనులు ప్రారంభించేసింది. 36 నెలల్లో, అంటే 2025 అక్టోబర్ నాటికి ప్రాజెక్టును పూర్తి చేయాల్సి ఉంది. రూ.699 కోట్లతో చేపట్టే ఈ భవనాలకు సంబంధించి ఐఐటీ ఢిల్లీని ప్రూఫ్ కన్సల్టెంట్‌గా నియమించారు. తాజాగా నిర్మాణానికి సంబంధించి సైట్ టోపోగ్రాఫిక్ సర్వే పూర్తయింది. వివిధ స్థాయిలలో ప్రతిపాదిత ఉపరితలం ఎత్తును గుర్తించడానికి ఇది ఉపయోగపడుతుంది. బేస్మెంట్, గ్రౌండ్, మిడ్ ఫ్లోర్, మొదటి రెండో అంతస్తులు, ఫుట్ఓవర్ బ్రిడ్జీలు.. తదితరాలకు సంబంధించిన డిజైన్ 3డీ ప్లాట్‌ను రూపొందించేందుకు కూడా ఈ సర్వే ఉపయోగపడుతుంది. స్టేషన్ భవనం ఉత్తర–దక్షిణ టెర్మినల్స్‌లోని వివిధ ప్రదేశాలలో మట్టి నమూనాలను కూడా పరీక్షించారు. కొత్త నిర్మాణ పనులను ప్రారంభించేందుకు వీలుగా పాత రైల్వే క్వార్టర్స్‌ను కూల్చివేశారు. స్టేషన్ భవనానికి దక్షిణం వైపున సైట్ ఆఫీస్‌తో పాటు సైట్ లేబొరేటరీని ఏర్పాటు చేశారు. ప్రయాణికులకు ఆధునిక వస తులతో సౌకర్యవంతమైన ప్రయాణ ప్రాంగణాన్ని అందించటంతోపాటు మెట్రోతో కనెక్టివిటీ కల్పించేందుకు ఈ ప్రాజెక్టును చేపడుతున్నట్టు దక్షిణ మధ్య రైల్వే జీఎం అరుణ్‌కుమార్ జైన్ వెల్లడించారు. సకాలంలో పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటున్నామని సాక్షితో చెప్పారు. -
ఒక్కసారిగా రంగు మారిన సియాంగ్ నది.. చైనానే కారణం?
ఇటానగర్: అరుణాచల్ ప్రదేశ్‌లోని సియాంగ్ నది పూర్తిగా బురదమయమైంది. ఉపయోగించుకోలేని స్థితిలో నీరు కలుషితంగా, బురదతో నిండిపోయింది. అయితే, అందుకు ఎగువ ప్రాంతంలో చైనా చేపట్టిన నిర్మాణ కార్యక్రమాలే కారణమని, దీంతో సరిహద్దు ప్రాంత ప్రజలు ఆందోళన చెందుతున్నట్లు తూర్పు సింయాగ్ జిల్లాలోని పాసిఘట్‌కు చెందిన అధికారులు తెలిపారు. అరుణాచల్ ప్రదేశ్‌కు ప్రాణదాతగా ఉన్న సియాంగ్ నదిలోని నీరు గత మూడు రోజుల్లోనే రంగు మారిపోయి, బురదమయంగా తయారైనట్లు చెప్పారు. ‘కొద్ది రోజులుగా అసలు వర్షాలే లేవు. అయినా, ఈ నదిలోని నీరు బురదమయంగా మారిపోయి ప్రవహిస్తోంది. నీటి వనరుల విభాగం అధికారులతో కలిసి పరిస్థితులను నిశితంగా పరిశీలిస్తున్నాం. చైనాలో ఈ నదిని యార్లుంగ్ సాంగ్పోగా పిలుస్తారు. చైనా చేపట్టిన తవ్వకాల ఫలితంగా నీటిలో బురద ప్రవహిస్తోంది. చైనాలో సియాంగ్ నది ప్రవహిస్తున్న ప్రాంతంలో నిర్మాణ కార్యక్రమాలు జరుగుతున్నాయి. మరోవైపు.. ఎగువ భాగంలో కొండచరియలు విరిగిపడటమూ ఒక కారణంగా చెప్పొచ్చు.’ అని తెలిపారు తూర్పు సింయాంగ్ డిప్యూటీ కమిషనర్ త్యాగి టగ్గు. సియాంగ్ నదిలో ఒక్కసారిగా నీరు రంగుమారిపోవటంపై సమీప ప్రజలు ఆందోళన చెందుతున్నారు. చాలా వరకు మత్స్యకారులు, రైతులు ఈ నదిపైనే ఆధారపడుతున్నారు. బురదమయంగా మారిన నీటితో చేపలు చనిపోతాయని చెబుతున్నారు. ఈ పరిస్థితి చాలా మందిపై తీవ్ర ప్రభావం చూపనుందని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలోనూ కొన్ని సందర్భాల్లో ఈ నది బురదమయంగా మారింది. 2017, డిసెంబర్లో ఈ నది నల్లగా మారిపోయింది. దీంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. ఈ విషయంపై చైనాతో చర్చలు జరిపి పరిస్థితని చక్కదిద్దింది కేంద్ర ప్రభుత్వం. ఇదీ చదవండి: అసదుద్దీన్ ఓవైసీ ప్రయాణిస్తున్న వందే భారత్ రైలుపై రాళ్ల దాడి? -
కన్స్ట్రక్షన్ వర్కర్స్కు నెలకి రూ.5వేలు.. సీఎం కీలక నిర్ణయం!
సాక్షి, న్యూఢిల్లీ: కాలుష్యం పెరిగిపోతున్న క్రమంలో కొత్త నిర్మాణాలు, కూల్చివేతలపై ఢిల్లీ ప్రభుత్వం నిషేదం విధించింది. దీంతో వందల మంది కార్మికులపై తీవ్ర ప్రభావం పడింది. దీంతో కీలక నిర్ణయం తీసుకున్నారు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్. ప్రభుత్వ నిర్ణయంతో ప్రభావితమైన నిర్మాణ రంగ కార్మికులందరికీ ఆర్థిక సాయం అందించాలని కార్మిక శాఖ మంత్రి మనీశ్ సిసోడియాను ఆదేశించారు. ‘కాలుష్యం కారణంగా ఢిల్లీలో నిర్మాణ కార్యక్రమాలు ఆగిపోయాయి. నిషేదం తొలగించే వరకు నిర్మాణ రంగంలోని కార్మికులకు ఒక్కొక్కరికి నెలకి రూ.5వేలు ఆర్థిక సాయం అందించాలని లేబర్ మంత్రి మనీశ్ సిసోడియాను ఆదేశించాం.’అని ట్వీట్ చేశారు అరవింద్ కేజ్రీవాల్. ఎన్సీఆర్ పరిధిలో గాలి నాణ్యత పడిపోయిన క్రమంలో అక్టోబర్ 30న గాలి నాణ్యత నిర్వహణ కమిషన్ కీలక నిర్ణయం తీసుకుంది. దేశ రాజధాని ప్రాంతంలో నిర్మాణ కార్యకలాపాలను నిలిపివేస్తూ ఆదేశాలు జారీ చేసింది. Pollution के ख़िलाफ़ लड़ाई में CM @ArvindKejriwal का बड़ा फ़ैसला‼️ 🔹Construction पर लगी रोक के मद्देनज़र Construction मज़दूर को ₹5000-₹5000 आर्थिक मदद देने का फ़ैसला लिया। 🔹 दिल्ली में निर्माण पर पाबंदियां रहने तक मज़दूरों को आर्थिक सहायता दी जाएगी। AAP की सरकार-आप के साथ। — AAP (@AamAadmiParty) November 2, 2022 ఇదీ చదవండి: ‘అప్పుడు ఆజాద్.. ఇప్పుడు గెహ్లట్.. మోదీ ప్రశంసలు ఆసక్తికరం’.. పైలట్ సంచలన వ్యాఖ్యలు -
సాగర్ ఎడమ కాల్వకు మరమ్మతులు
నిడమనూరు: నాగార్జునసాగర్ ప్రాజెక్టు ఎడమ కాల్వకు అధికారులు మరమ్మతు పనులు ప్రారంభించారు. నల్లగొండ జిల్లా నిడమనూరు సమీపంలోని వేంపాడు వద్ద బుధవారం సాయంత్రం సాగర్ కాల్వ కట్ట తెగిన విషయం తెలిసిందే. శుక్రవారం అధికారులు కాల్వ కట్టకు ర్యాంప్ ఏర్పాటు చేశారు. దీని ద్వారా కాల్వలోకి మట్టి, ఇసుక బస్తాలను తరలిస్తున్నారు. కాల్వలో నీటిని నిలిపేందుకు ఇసుక బస్తాలను అడ్డుగా వేస్తున్నారు. దానిని ఆసరాగా చేసుకుని మట్టి కట్టను ఐదు అడుగుల ఎత్తు పోయనున్నారు. కాల్వలో వస్తున్న సీపేజ్ వాటర్‌ను నిలువరించిన వెంటనే గండిని పూడ్చే పనులను చేపట్టే అవకాశం ఉన్నది. సాగర్ ప్రాజెక్టు సీఈ శ్రీకాంత్‌రావు, ఎస్ఈ ధర్మా ప్రత్యక్ష పర్యవేక్షణలో పనులు జరుగుతున్నాయి. సీపేజ్ అంటే..: కాల్వకు నీరు నిలిపివేసిన తర్వాత కూడా అందులో ఉన్న నీరు పారుతుంటుంది. దీనినే సీపేజ్ వాటర్‌గా పేర్కొంటారు. -
సచివాలయ పనుల్లో జాప్యం వద్దు: కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: కొత్త సచివాలయ పనుల్లో ఎట్టి పరిస్థి తుల్లో జాప్యం జరగొద్దని, ఏకకాలంలో అన్ని విభాగాల పనులు పూర్తి చేసేలా ప్రణాళికాబద్ధంగా వ్యవహరించాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు. వేగంగా పనులు జరుపుతూనే నాణ్యతలో రాజీపడొద్దని సూచించారు. సీఎం బుధవారం సాయంత్రం సచివాలయ పనులను పరిశీలించారు. అక్కడే అధికారులతో సమీక్ష నిర్వహించి, పలు సూచ నలు చేశారు. పనులు జరుగుతున్న ప్రాంతాల్లో కలియదిరి గారు. నిర్దేశించిన డిజైన్లలో రూపొందుతున్నాయా లేదా తనిఖీ చేశారు. శ్లాబులు, భవనంపై గుమ్మటాల నిర్మాణం, ఇంటీరియర్ పనులు, ఫర్నిచర్ ఎంపిక తదితరాలపై పలు సూచనలు చేశారు. భవనం మధ్య ఉండే కోర్టుయార్డు, ముందు భాగంలోని ల్యాండ్ స్కేప్, ఇతర పచ్చిక బయళ్లను సుందరంగా తీర్చిదిద్దాలని సూచించారు. రాజస్తాన్ నుంచి తెప్పించిన ధోల్పూర్ ఎర్రరాయి ఏర్పాటు, మురుగునీటి పారుదల వ్యవస్థ, సందర్శకులు వేచిచూసే ప్రాంతం, గోడ వెంబడి మట్టి నింపే పనులు, పార్కింగ్ ఏర్పాట్లను పరిశీలించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఎక్కడా, ఎవరికీ, ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్నీ సౌకర్యంగా ఉండేలా తీర్చిదిద్దాలని ఆదేశించారు. నాణ్యమైన ఫర్నిచర్‌ను ఎంపిక చేయాలని సూచించారు. ముఖ్యమంత్రి వెంట మంత్రులు ప్రశాంత్‌రెడ్డి, మల్లారెడ్డి, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్‌కుమార్, ఎంపీ దామోదర్‌రావు, పలువురు ప్రజాప్రతి నిధులు, ముఖ్యమంత్రి కార్యదర్శి స్మితా సబర్వాల్, రోడ్లు భవనాల శాఖ ఈఎన్సీ గణపతిరెడ్డి, ప్రభుత్వ సలహాదారు సుధాకర్‌తేజ, నగర పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్, నిర్మాణ సంస్థ ప్రతినిధులు ఉన్నారు. -
పైడితల్లి అమ్మవారి సాక్షిగా మాటిచ్చారు.. ఆ మేరకు రూ.500 కోట్లతో..
సాక్షి, విజయనగరం: విజయనగరం జిల్లా గాజులరేగ సమీపంలో చేపట్టిన ప్రభుత్వ వైద్యకళాశాల నిర్మాణం చకచకా సాగుతోంది. మాస్ కాంక్రీట్ పనులను జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు, విజయనగరం ఎంపీ బెల్లాన చంద్రశేఖర్, ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్రస్వామిలు సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా జెడ్పీ చైర్మన్ మాట్లాడుతూ మాట మీద నిలబడే నేత సీఎం జగన్మోహన్ రెడ్డి అని పేర్కొన్నారు. ప్రతిపక్షనేతగా ప్రజాసంకల్పయాత్ర చేసిన సమయంలో విజయనగరంలో నిర్వహించిన బహిరంగ సభలో పైడితల్లి అమ్మవారి సాక్షిగా జిల్లాకు ప్రభుత్వ వైద్య కళాశాల మంజూరు చేస్తామని జగన్మోహన్రెడ్డి మాట ఇచ్చారన్నారు. ఆ మేరకు వైద్య కళాశాలకు శంకుస్థాపన చేశారని తెలిపారు. 70 ఎకరాల్లో రూ.500 కోట్ల వ్యయంతో పనులు సాగుతున్నాయన్నారు. వైద్యకళాశాల మొత్తం విస్తీర్ణం 14 లక్షల చదరపు అడుగులు కాగా, తొలివిడతగా 6 లక్షల చదరపు అడుగుల కాంక్రీట్ పనులను ప్రారంభించామని చెప్పారు. తమది చిత్తశుద్ధి ఉన్న ప్రభుత్వంగా పేర్కొన్నారు. మూడేళ్లలో వైద్య కళాశాల భవనాల నిర్మాణం పూర్తయ్యే అవకాశం ఉందని చెప్పారు. అంత వరకు 2023–24 విద్యా సంవతర్సం నుంచి జిల్లా కేంద్రాస్పత్రిలో బోధన తరగతులు ప్రారంభమవుతాయని తెలిపారు. కేంద్రాస్పత్రి ఆధునికీకరణ పనులు, ప్రీ ఇంజినీరింగ్ బిల్లిండ్ భవనాల నిర్మాణానికి ప్రభుత్వం రూ.35 కోట్లు మంజూరు చేసిందన్నారు. ఓ వైపు వైద్యకళాశాల నిర్మాణ పనులు చురుగ్గా సాగుతుంటే, వైద్య కళాశాల ఎక్కడని చంద్రబాబు ప్రశ్నించడం విడ్డూరంగా ఉందన్నారు. వైద్య కళాశాల నిర్మాణం జరుగుతున్న ప్రాంతానికి టీడీపీ నాయకులు వస్తే కళాశాల ఎక్కడ ఉందో తెలుస్తుందన్నారు. చంద్రబాబు మాదిరి ఎన్నికల ముందు ఉత్తుత్తి జీఓలను జారీ చేసి, ప్రజలను మోసం చేసే అలవాటు వైఎస్సార్సీపీ ప్రభుత్వానికి లేదన్నారు. 2014లో అసెంబ్లీ సాక్షిగా విజయనగరం జిల్లాలో ప్రభుత్వ వైద్య కళాశాల ఏర్పాటు చేస్తామని చంద్రబాబు, అప్పటి ఆరోగ్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాస్‌లు ప్రకటించారని, ఆ తర్వాత మూడేళ్లు పట్టించుకోలేదన్నారు. అనంతరం అశోక్‌గజపతిరాజు చైర్మన్‌గా ఉన్న మాన్సాస్ట్రస్టు వారు వైద్యకళాశాల నిర్మిస్తారని చెప్పారని, అది కూడా అమలు కాలేదన్నారు. 2019 ఏప్రిల్ 11లో ఎన్నికలు జరగాల్సి ఉండగా ఫిబ్రవరిలో వైద్య కళాశాలకోసం ఓ లేఖ విడుదల చేశారని, చంద్రబాబు మోసపూరిత మాటలను జనం బాగా గమనించి 2019 ఎన్నికల్లో గట్టిగా బుద్ధిచెప్పారన్నారు. వైద్య కళాశాల నిర్మించడం లేదని అప్పట్లో చంద్రబాబుకు కేంద్ర మాజీ మంత్రి అశోక్‌గజపతిరాజు లేఖరాసిన విషయం ఇప్పుడు ఎందుకు బయటపెట్టడంలేదని ప్రశ్నించారు. జిల్లాను పట్టించుకోని టీడీపీ నేతలు ఇప్పుడు ఏ ముఖం పెట్టుకుని ప్రజలవద్దకు వెళ్లారన్నారు. గరివిడి వేదికగా ఎన్టీఆర్‌ను గద్దెదించేందుకు పన్నాగం పన్నారని ఆరోపించారు. చంద్రబాబు దొడ్డిదారిన సీఎం అయ్యారని, ఆయన నాయకులు కూడా ఆవిధంగానే వ్యవహరిస్తున్నారని విమర్శించారు. ►ఎంపీ బెల్లాన చంద్రశేఖర్ మాట్లాడుతూ జిల్లాను ఏర్పాటు చేసిన దగ్గర నుంచి ప్రభుత్వ వైద్య కళాశాల కోసం ప్రజలు కలగంటున్నారని తెలిపారు. ప్రజల ఆశలను నేరవేరుస్తూ.. రాష్ట్రంలో మొత్తం 16 వైద్య కళాశాలలను సీఎం మంజూరు చేశారని చెప్పారు. త్వరలోనే జిల్లా ప్రజలకు బోధనాస్పత్రి సేవలు అందుబాటులోకి వస్తాయన్నారు. తోటపల్లి ప్రాజెక్టుకు కూడా చంద్రబాబు నాలుగు ఇటుకులు, రెండు సిమ్మెంట్ బస్తాలువేసి గొప్పలు చెప్పుకున్నారని విమర్శించారు. అప్పటి సీఎం వైఎస్సార్, మంత్రి బొత్సల కృషితో తోటపల్లి ప్రాజెక్టు కల సాకరమయిందని వివరించారు. భోగాపురం ఎయిర్‌పోర్టు భూసేకరణ చివరిదశకు వచ్చిందని, త్వరలో దీని నిర్మాణానికి శంకుస్థాపన చేస్తామని చెప్పారు. తమ ప్రభుత్వ హయంలో జిల్లాకు జేఎన్టీయూ గురజాడ విశ్వవిద్యాలయం మంజూరైందని, గిరిజన విశ్వవిద్యాలయం పనులు కూడా చేపడతామని చెప్పారు. మాజీ మంత్రి కిమిడి మృణాళిని కుటుంబం స్వయంగా డాక్టర్లు అయి ఉండి కూడా కోవిడ్ సమయంలో విశాఖపట్నంలో దాక్కొని జిల్లా ప్రజలను గాలికివదిలేశారని విమర్శించారు. ఒక్కపేదవాడికి పట్టెడు అన్నం పెట్టిన దాఖలాలు లేవన్నారు. ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్రస్వామి మాట్లాడుతూ రాష్ట్రంలో విద్య, వైద్యానికి సీఎం జగన్మోహన్ రెడ్డి అధిక ప్రాధాన్యమిస్తున్నారని గుర్తుచేశారు. జిల్లాకు ప్రభుత్వ వైద్య కళాశాలను మంజూరు చేసి ప్రజల చిరకాలవాంఛ తీర్చారన్నారు. తను సీఎంగా ఉంటే కరోనా వచ్చేదా అని చంద్రబాబు అనడం హాస్యాస్పదంగా ఉందన్నారు. కరోనా మహమ్మారికి ప్రపంచమే వణికి పోయిన విషయం హైదరాబాద్‌లో దాక్కొన్న చంద్రబాబుకు తెలియకపోవడం హాస్యాస్పదమన్నారు. వయసు పైబడడంతో మతితప్పి మాట్లాడుతున్నారని విమర్శించారు. టీడీపీ మాదిరి వైద్యకళాశాల కోసం తూతూమంత్రంగా ప్రకటనలు చేయలేదన్నారు. జిల్లా అభివృద్ధే లక్ష్యంగా మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలందరూ కలిసికట్టుగా సాగుతున్నట్టు వెల్లడించారు. కార్యక్రమంలో నగర మేయర్ వెంపడాపు విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ ఇసరపు భారతి, జేసీ మయూర్‌అశోక్, ఏపీఎంఎస్ఐడీసీ ఈఈ సత్యప్రభాకర్, కేవీ సూర్యనారాయణరాజు తదితరులు పాల్గొన్నారు. వైద్యకళాశాల కాంక్రీట్ పనులను ప్రారంభిస్తున్న జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు -
ఆరోగ్య ఉపకేంద్రం ‘రెడీ’మేడ్
తిర్యాణి(ఆసిఫాబాద్): అది దట్టమైన అటవీప్రాంతం.. రవాణా అంటే హైరానే.. బాహ్య ప్రపంచానికి బహుదూరంగా, నిర్మాణ సామగ్రి తరలింపు భారంగా మారడంతో 15 ఏళ్లుగా ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రం భవన నిర్మాణ పనులు నిలిచిపోయాయి. ఎట్టకేలకు అది రెడీమేడ్ తరహాలో సిద్ధమవుతోంది. కుమురంభీం జిల్లా తిర్యాణి మండలం గుండాల గ్రామపంచాయతీ ఏడు గూడేలతో ఉంటుంది. దట్టమైన అటవీప్రాంతం లోపల ఉండటంతో గ్రామస్తులు విద్య, వైద్యం, నిత్యావసర సరుకుల కోసం వేరే గ్రామానికి ఆరు కిలోమీటర్ల మేర కాలినడకన వెళ్లాల్సిన పరిస్థితి. ఈ నేపథ్యంలో ఈ గ్రామంలో పీహెచ్సీ సబ్ సెంటర్ భవన నిర్మాణానికి 2007లో ఐటీడీఏ ద్వారా రాష్ట్రీయ స్వయం వికాస్ యోజన కింద రూ.7 లక్షలు మంజూరయ్యాయి. నిర్మాణ సామగ్రి తరలింపులో ఇబ్బందులు తలెత్తడంతో కాంట్రాక్టర్ బేస్మెంటు స్థాయిలోనే పనులు నిలిపివేశాడు. 15 ఏళ్లుగా స్తంభించిన పీహెచ్‌ఎసీ భవనం పనులు ఇటీవల కలెక్టర్ రాహుల్‌రాజ్, అడిషనల్ కలెక్టర్ వరుణ్‌రెడ్డి, ఐటీడీవో పీవో అంకిత్ ప్రత్యేక చొరవతో మళ్లీ ప్రారంభమయ్యాయి. సాధారణ భవనం కట్టడానికి పరిస్థితులు అనుకూలించకపోవడంతో ఆ బేస్‌మెంట్‌పైనే కేరళకు చెందిన శాంతి మెడికేర్ ఇన్ఫర్మేషన్ సిస్టం అనే సంస్థ ద్వారా కృత్రిమ గోడల (సిమెంటు ఫైబర్ ప్యానెల్)ను ఏర్పాటు చేస్తున్నారు. ఈ తరహాలోనే ఆరోగ్య ఉపకేంద్రంలో విశ్రాంతి గది, ఫార్మసీ రూమ్, చికిత్స చేసే గది, హాలు, మరుగుదొడ్లు సిద్ధమవుతున్నాయి. ఇప్పటికే 80 శాతం పనులు పూర్తయ్యాయి. మరో వారం రోజుల్లో ప్రారంభిస్తామని డీఎంహెచ్‌వో కుడిమెత మనోహర్ తెలిపారు. ఇదే తరహాలో ఆసిఫాబాద్ మండలం గుండి గ్రామంలో అంగన్వాడీ కేంద్రాన్ని కూడా నిర్మించారు. -
పాతబస్తీ మెట్రోపై మళ్లీ కదలిక!
సాక్షి, హైదరాబాద్: పాతబస్తీకి మెట్రో ఏర్పాటుపై మళ్లీ కదలిక వచ్చింది. ఈ మార్గంలో మెట్రో ఏర్పాటుకు అడ్డు తొలగించాల్సిన ఆస్తుల గుర్తింపు, విద్యుత్ స్తంభాలు, కేబుల్స్, తాగునీరు, మురుగు నీటి పైపులైన్లను గుర్తించే ప్రక్రియను ప్రారంభించినట్లు విశ్వసనీయంగా తెలిసింది. కాగా మెట్రో మొదటి దశ ప్రాజెక్టులో భాగంగా చేపట్టాల్సిన ఎంజీబీఎస్–ఫలక్‌నుమా(5.5 కి.మీ)మార్గం ఏర్పాటు ప్రక్రియ అనేక అవాంతరాల నేపథ్యంలో నిలిచిపోయిన విషయం విదితమే. తాజా అంచనాల నేపథ్యంలో ఈ మార్గం పూర్తికి సుమారు రూ.1500 కోట్లు వ్యయం కానుందని ప్రాథమికంగా భావిస్తున్నారు. ఈ ఏడాది వార్షిక బడ్జెట్లో ప్రభుత్వం రూ.500 కోట్లు కేటాయించడంతో ఈ ప్రాజెక్టు పూర్తిపై ఆశలు చిగురిస్తున్నాయి. అడ్డంకులు వేనవేలు.. పాతనగరంలో మెట్రో మార్గాన్ని ఏర్పాటుచేసేందుకు సుమారు వెయ్యి ఆస్తులను సేకరించాల్సి ఉంది. వీటికి సుమారు రూ.వంద కోట్లకుపైగా నష్టపరిహారం చెల్లించాల్సి ఉంటుంది. ఎంజీబీఎస్– ఫలక్‌నుమా రూట్లో 5.5 కి.మీ మార్గంలో మెట్రో ప్రాజెక్టును ఏర్పాటు చేయడంతోపాటు సాలార్జంగ్ మ్యూజియం, చార్మినార్, శాలిబండ, ఫలక్‌నుమా, శంషీర్‌గంజ్ ప్రాంతాల్లో ఐదు మెట్రో స్టేషన్లను నిర్మించాల్సి ఉంది. ఇందుకు రూ.1500 కోట్లు వ్యయం చేయాల్సి ఉంటుందని అంచనావేస్తున్నారు. ఇక ఆస్తుల సేకరణ ఆలస్యమైతే పనులు చేపట్టేందుకు అవసరమైన రైట్ఆఫ్ వే స్థల సమస్యల కారణంగా ప్రాజెక్టు నిర్మాణ గడువు ఆలస్యమయ్యే ప్రమాదం పొంచి ఉంది. పనులు ఆలస్యమైతే నిర్మాణ వ్యయం కూడా భారీగా పెరిగే అవకాశం ఉంది. ఇక ఈ రూట్లో సుమారు 69 వరకు ఉన్న ప్రార్థనాస్థలాలకు నష్టం వాటిల్లుతుందన్న ఆందోళనలు సైతం వ్యక్తమౌతున్నాయి. ఈ సమస్యల కారణంగానే గతంలో తొలిదశ మెట్రో నిర్మాణ సంస్థ ఎల్అండ్టీ ఓల్డ్‌సిటీలో మెట్రో పనులు చేపట్టేందుకు విముఖత వ్యక్తం చేసిన విషయం విదితమే. తొలిదశ మెట్రో మార్గాల్లో పనుల ఆలస్యం కారణంగా వాణిజ్య బ్యాంకుల నుంచి సేకరించిన రుణాలపై వడ్డీ, ఇతరత్రా నిర్మాణ వ్యయాలు పెరగడంతో అదనంగా రూ.4 వేల కోట్లు నిర్మాణ వ్యయం పెరిగింది. ఈ మొత్తాన్ని సైతం తమకు రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాలని నిర్మాణ సంస్థ వర్గాలు ప్రభుత్వంతో గతంలో పలు మార్లు సంప్రదింపులు జరిపాయి. కనీసం సాఫ్ట్‌లోన్ అయినా మంజూరు చేయాలని విజ్ఙప్తి చేసినప్పటికీ ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన లభించలేదు. మరోవైపు ఈ మెట్రో మార్గాన్ని బహదూర్‌పూరా –కాలాపత్తర్– ఫలక్‌నుమా మీదుగా మళ్లించాలన్న డిమాండ్లు కూడా వినిపిస్తున్నాయి. ఈ అవాంతరాలను అధిగమించి మెట్రోను పూర్తిచేసి ఓల్డ్‌సిటీ వాసులకు మెట్రో కలను సాకారం చేయాలని సిటీజనులు కోరుతున్నారు. (చదవండి: 12 సీసీకెమెరాలు పెట్టినా...రూ.40 లక్షలు స్వాహా) -
ఢిల్లీలో టీఆర్ఎస్ భవన్ నిర్మాణం ప్రారంభం
సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీలో టీఆర్ఎస్ భవన నిర్మాణ పనులు శుక్రవారం ప్రారంభమయ్యాయి. కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి, ఎంపీ నామా నాగేశ్వర్రావుతో పాటు ఎండీపీ ఇన్ఫ్రా నిర్మాణ సంస్థ ప్రతినిధులు హాజరయ్యారు. భవన నిర్మాణానికి సంబంధించిన అన్ని రకాల అనుమతులు ఇప్పటికే తీసుకున్నట్లు మంత్రి ప్రశాంత్‌రెడ్డి తెలిపారు. నిర్ణీత గడువులోగా నిర్మాణం పూర్తవుతుందని వెల్లడించారు. -
కుంగిన సైదాబాద్–సంతోష్‌నగర్ ప్రధాన రహదారి
సాక్షి, సంతోష్‌నగర్: సైదాబాద్–సంతోష్‌నగర్ ప్రధాన రహదారిపై రోడ్డు గురువారం రాత్రి ఒక్కసారిగా కుంగిపోయింది. ఆ సమయంలో వాహనాల రాకపోకలు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. దీనిపై స్పందించిన పోలీసులు చర్యలు చేపట్టారు. ఐ.ఎస్.సదన్ చౌరస్తా నుంచి సంతోష్‌నగర్ వెళ్లే ప్రధాన రహదారిపై ఫ్లై ఓవర్ నిర్మాణ పనులు జరుగుతున్నాయి. ఈ క్రమంలో రోడ్డు మధ్యలో పిల్లర్ల కోసం గోతులు తీసి అలాగే వదిలేశారు. దీంతో భూమి కుంగిపోవడంతో రోడ్డుపై భారీగా గుంత ఏర్పడింది. అప్రమత్తమైన స్థానికులు ట్రాఫిక్‌ను నియంత్రించారు. ఫలక్‌నుమా ట్రాఫిక్ పోలీసులతో సంతోష్‌నగర్ లా అండ్ ఆర్డర్ పోలీసులు వాహనాలను దారి మళ్లించారు. రోడ్డుపై ఏర్పడిన గుంతను మట్టితో పూడ్చివేశారు. చదవండి: ఉగాదికి ఉద్యోగ నోటిఫికేషన్లు.. తొలివిడతలో భారీ సంఖ్యలో భర్తీ? -
దీన స్థితి: ఎంఏ, బీఈడీ చదివి మేస్త్రీ పనికి యువతి
ఈమె పేరు కన్నం వరలక్ష్మి. ఎంఏ బీఈడీ పూర్తి చేసి 2018లో విద్యావలంటీర్‌గా చెన్నారావుపేట మండలం బోజెర్వు పాఠశాలలో విధుల్లో చేరింది. వరలక్ష్మికి ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. కరోనా మహమ్మారి వల్ల 20 నెలలుగా వేతనాలు ఇవ్వలేదు. కనీసం రెన్యూవల్ చేయడంలోనూ జాప్యం జరుగుతోంది. దీంతో కుటుంబ పోషణ కోసం సుతారి పనికి వెళ్తున్నా. ప్రభుత్వం స్పందించి నాలుగు నెలల పాత వేతనాలు అందించి.. కరోనా కాలంలో ఆపత్కాలపు భృతి ఇచ్చి, రెన్యూవల్ చేయాలని వేడుకుంది. నర్సంపేట రూరల్: కరోనా మహమ్మారి వల్ల కూలీలుగా మారారు. పాఠశాలలకు వెళ్లి పాఠాలు బోధించాల్సిన విద్యా వలంటీర్లు తీరొక్క పనులు చేస్తూ పొట్టపోసుకుంటున్నారు. ప్రస్తుతానికి పాఠశాలలు తెరిచినా వీరిని రెన్యూవల్ చేయకపోవడంతో దిక్కుతోచని పరిస్థితుల్లో కొట్టుమిట్టాడుతున్నారు. అలాగే 2019 విద్యాసంవత్సరానికి సంబంధించి నాలుగు నెలల పెండింగ్ వేతనాలు రాకపోవడంతో ఇబ్బంది పడుతున్నారు. చదవండి: కీడు శంకించిందని గాంధీ విగ్రహాన్ని పక్కన పడేశారు కరోనా కాలంలో ప్రైవేట్ టీచర్లకు భృతి కల్పించిన ప్రభుత్వం.. విద్యావలంటీర్లను మరవడంతో తమ గోడు ఎవరికి చెప్పుకోవాలో అర్థంకాక కుమిలిపోతున్నారు. ఉన్నత విద్యాభ్యాసం చేసినా ప్రభుత్వ కొలువు రాకపోవడంతో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యావలంటీర్లుగా చేరారు. ప్రభుత్వ ఉపాధ్యాయులతో సమానంగా బోధిస్తూ విద్యార్థులను ఉన్నతంగా తీర్చిదిద్దుతున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో మొత్తం 3,749 ప్రభుత్వ పాఠశాలలు ఉండగా.. హనుమకొండ జిల్లాలో 94, వరంగల్ 44, జనగామ 120, జయశంకర్ భూపాలపల్లి, ములుగులో 931, మహబూబాబాద్ జిల్లాలో 340 చొప్పున మొత్తం 1,529 మంది విద్యావలంటీర్లు విధులు నిర్వర్తించేవారు. అయితే కరోనా మహమ్మారి వీరి ఉపాధిని దెబ్బతీసింది. ప్రస్తుత విద్యాసంవత్సరం రెన్యూవల్ కూడా చేయకపోవడంతో కుటుంబ పోషణ కోసం కూలీ పనులు చేసుకుంటున్నారు. చదవండి: తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో పాలమూరు బుడ్డోడు పట్టించుకోలేదని ఆవేదన.. 2020–21 విద్యా సంవత్సరంలో ప్రభుత్వం తమను çపట్టించుకోలేదని పలువురు వలంటీర్లు వాపోతున్నారు. పల్లె ప్రాంత విద్యార్థులకు సమాచార మాధ్యమాలు అందుబాటులో లేనప్పుడు కీలకంగా వ్యవహరించిన వీరిని ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన పీఆర్సీలో 30 శాతం ఫిట్మెంట్ వలంటీర్లకు వర్తింపజేస్తామన్నారు. గురుకులాల్లోని కాంట్రాక్ట్ ఉపాధ్యాయులు, గెస్టు టీచర్లు, సీఆరీ్పలకు విధులు అప్పగించి జీతాలు ఇస్తున్న ప్రభుత్వం అదే విద్యార్హతలున్న తమపై కనికరం చూపడంలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
‘కట్ట’లతోనే మమ!
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌లోని ట్యాంక్‌బండ్ మాదిరే గ్రామీణ ప్రాంత ప్రజలకు ఆహ్లాదం పం చేలా నియోజకవర్గానికి ఒకటి చొప్పున నిర్మించ తలపెట్టిన మినీ ట్యాంక్‌బండ్ పనులు ఎక్కడివక్క డే ఆగిపోయాయి. పనులు మొదలుపెట్టి నాలుగేళ్లయినా.. డబ్బులొచ్చే కట్టపనులు మాత్రమే చేసిన కాంట్రాక్టర్లు మిగతా సుందరీకరణ పనులు చేయకుండా చేతులెత్తేశారు. పనుల పూర్తిని పట్టించుకునే ప్రజాప్రతినిధులు లేక..నిధుల విడుదల్లేక ఆహ్లాదం పంచాల్సిన ట్యాంక్‌లు కళావిహీనంగా మారాయి. సగం మాత్రమే పూర్తి... చెరువుల పునరుద్ధరణకు ఉద్దేశించిన మిషన్ కాకతీయలో భాగంగా నియోజకవర్గానికి ఒకటి చొప్పున మినీ ట్యాంక్‌బండ్‌లను మంజూరు చేశారు. ఒక్కో చెరువును స్థానిక ఎమ్మెల్యే సూచనల మేరకు అభివృద్ధి చేసేందుకు ఎంపిక చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 100 మినీ ట్యాంక్‌బండ్‌లను రూ.571.53 కోట్లతో చేపట్టారు. అయితే ఈ పనుల్లో ఇప్పటివరకు రూ.290 కోట్ల మేర పనులే పూర్తయ్యాయి. 50చోట్ల మాత్రమే పూర్తిస్థాయి ట్యాంక్బండ్ల నిర్మాణం పూర్తవగా చాలా చోట్ల పనులు అసంపూర్తిగానే ఉన్నాయి. మట్టిపనితో కూడిన కట్ట నిర్మాణాలకే అధిక ప్రాధాన్యం ఇస్తూ ఆ పనులు మాత్రమే చేశారు. పూడికతీతలో భాగంగా చెరువులో నుంచి తీసిన మట్టినే కట్ట పనికి వినియోగించి, బిల్లులు తీసుకొని మమ అనిపించారు. ఇవి మినహా బతుకమ్మ ఘాట్లు, వాకింగ్ ట్రాక్‌లు, సైక్లింగ్ ట్రాక్‌ల పనులు చేయనేలేదు. చాలాచోట్ల కట్టలపై రోడ్డు నిర్మాణాలు జరుగక ట్యాంక్‌బండ్ దగ్గరకు సైతం వెళ్లే పరిస్థితులు కనిపించడం లేదు. కొన్నిచోట్ల పట్టణాల నుంచి మురుగు ట్యాంక్బండ్ల్లోకే వచ్చి చేరుతూ కంపుకొడుతున్నాయి. నిర్మాణ నిబంధనలు ఇవి.. మినీ ట్యాంక్ బండ్ చెరువుల మార్గదర్శకాల ప్రకారం... చెరువు కట్ట చుట్టూ వాకింగ్, సైక్లింగ్ చేసేలా తీర్చిదిద్దాలి. బెంచీలు, తిను బండారాల కేంద్రాలు, బోటింగ్ కోసం జెట్టీలు, బతుకమ్మ ఘాట్లను నిర్మించాల్సి ఉంటుంది. పిల్లల పార్కు ఏర్పాటు చేయవచ్చు. ఇక చెరువు కట్ట వెడల్పు 6 మీటర్ల నుంచి 6.5 మీటర్లతో నిర్మించి రోడ్డు వేయాలి. ఒకవేళ కట్ట పొడవు ఎక్కువగా ఉంటే అందులో 300 మీటర్ల పొడవు వరకు 8 మీటర్ల వెడల్పుతో కట్టను నిర్మించుకునే వెసులుబాటు కల్పించారు. నిధుల్లేక నీరసం... ట్యాంక్బండ్ల పనులు నత్తనడకకు నిధుల లేమి సైతం సమస్యగా మారింది. మిషన్ కాకతీయ సమయంలోనే ఈ పనులూ చేపట్టారు. చెరువుల పను లు చేసిన కాంట్రాక్టర్లే చాలా చోట్ల మినీ ట్యాంక్‌బండ్ పనులు చేపట్టారు. చెరువులు, మినీ ట్యాంక్‌బండ్‌లకు కలిపి మొత్తంగా రూ.500 కోట్ల మేర బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. ఇందులో మినీ ట్యాంక్‌బండ్‌లకు సంబంధించి రూ.100 కోట్ల మేర బిల్లులు చెల్లించాల్సి ఉంది. ఓ వైపు చెరువుల బిల్లు లు రాక, మినీ ట్యాంక్‌బండ్ బిల్లులు ఇవ్వకపోవడంతో కాంట్రాక్టర్లు పనులను పూర్తిగా నిలిపివేశారు. మహబూబాబాద్‌లోని నిజాం చెరువుకు రూ.5.50 కోట్లు కేటాయించారు. రెండున్నరేళ్ల క్రితం పనులు ప్రారంభమైనా నేటికి 30 శాతమే పూర్తయ్యాయి. కట్ట పనులు, పంట కాల్వ, మత్తడి పనులు పూర్తి కాగా.. పార్క్, వాకింగ్ ట్రాక్, బ్రిడి ఇతర పనులు చేయాలి. కాంట్రాక్టర్‌కు రూ.2 కోట్లు చెల్లించారు. గడువులు దాటుతున్నా పనులు సాగడం లేదు. చెరువు నుంచి గోపాలపురం వెళ్లే దారిలో బ్రిడ్జి నిర్మాణం కోసం తవ్వకాలు చేసి ఏడాదిన్నరయినా పనులు పూర్తి కాలేదు. మరమ్మతులు లేక తెగిపోయిన నిజాం చెరువుకట్ట భైంసాలోని సుద్ధవాగు(గడ్డెన్నవాగు) ప్రాజెక్టులోనే ఓ వైపు మినీ ట్యాంక్‌బండ్ పేరిట పనులను చేపట్టారు. 2017, మార్చి 9న శంకుస్థాపన చేశారు. రూ.3.64 కోట్లతో పనులు చేపట్టగా, రూ.2.42 కోట్ల పనులు పూర్తయినట్లు చూపారు. ప్రాజెక్టు పక్కనే లోతైన గుంతలతో ఉన్న ప్రాంతాన్ని మొరంతో నింపారు. నీళ్లున్నవైపు బతుకమ్మ ఘాట్ నిర్మించారు. చుట్టూ రెయిలింగ్ వేసి, పార్క్ ఏర్పాటు చేసినట్లు చెబుతున్నా.. అసలు ఆ ఆనవాళ్లు కూడా కనిపించడం లేదు. మధ్యలో సీసీ పేవ్మెంట్ వేసి వదిలేశారు. భైంసా పట్టణంలోని మినీ ట్యాంక్‌బండ్ -
‘పాలమూరు’ ప్రాజెక్టుల కథేంటి?
సాక్షి, హైదరాబాద్: కృష్ణా జలాలపై ఆధారపడి ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో చేపట్టిన ఎత్తిపోతల పథకాల నిర్మాణ పనుల్లో జరుగుతున్న జాప్యంపై ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు దృష్టి పెట్టారు. ముఖ్యంగా పదిహేనేళ్ల కింద చేపట్టిన కల్వకుర్తి, భీమా, నెట్టెంపాడు, గట్టు, తుమ్మిళ్ల ఎత్తిపోతల పథకాలు ఇంతవరకు వందశాతం పూర్తికాలేదు. దీనికిగల కారణాలపై ఒకట్రెండు రోజుల్లో ప్రాజెక్టు ఇంజనీర్లు, జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలతో సమీక్ష నిర్వహించాలని సీఎం నిర్ణయించారు. దీనిపై ఇప్పటికే ఇరిగేషన్ శాఖకు సీఎంఓ కార్యాలయం సమాచారం అందించింది. ఈ పథకాల ద్వారా ఉమ్మడి పాలమూరు జిల్లాలో 10 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీరిచ్చే అవకాశాలున్నా, ఎందుకు జాప్యం జరుగుతోందన్న దానిపై సమీక్షించి సీఎం మార్గదర్శనం చేసే అవకాశం ఉంది. నిధుల్లేక నీరసం జలయజ్ఞం ప్రాజెక్టులో భాగంగా చేపట్టిన కల్వకుర్తి ద్వారా సుమారు 5 లక్షలు, భీమా, నెట్టెంపాడుల ద్వారా చెరో 2 లక్షల ఎకరాలకు నీరందించే అవకాశం ఉంది. వీటికింద సుమారు 9 లక్షల ఎకరాల ఆయకట్టు ఉండగా, ఇప్పటికే 6.50 లక్షల ఎకరాలు ఆయకట్టులోకి వచ్చింది. భూసేకరణ, పిల్ల కాల్వల నిర్మాణం పూర్తి చేస్తే ప్రాజెక్టులు వందశాతం పూర్తవుతాయి. అయితే నిధుల కొరత వేధిస్తోంది. ఈ నేపథ్యంలో 2021–22 ఆర్థిక సంవత్సరంలో కనీసం రూ.1,500 కోట్లు నిధులు కేటాయించాలని ఇంజనీర్లు ప్రతిపాదించారు. అప్పుడు పెండింగ్ బిల్లులతో పాటు పూర్తిస్థాయిలో పనులు చేయొచ్చని పేర్కొన్నారు. అయినప్పటికీ అరకొరగా నిధుల కేటాయింపు జరిగింది. ముఖ్యంగా కల్వకుర్తి ప్రాజెక్టుకు రూ.75 కోట్లు మాత్రమే కేటాయించారు. నిజానికి దీనికింద రూ.80 కోట్లు పెండింగ్ బిల్లులు ఉండగా, భూసేకరణకు సంబంధించి మరో రూ.29 కోట్లు పెండింగ్‌లో ఉంది. ప్రస్తుత బడ్జెట్లో కేటాయించిన నిధులు పెండింగ్‌కే సరిపోతాయి. కాల్వ పనులు పూర్తిచేస్తే.. ముఖ్యంగా ప్యాకేజీ–29లో కాల్వ పనులు పూర్తి చేస్తే 57 వేల ఎకరాల ఆయకట్టుకు నీరందే అవకాశం ఉంది. అయితే ఇక్కడ భూసేకరణకు సం బంధించి రూ.18 కోట్ల నిధులు ఏడాదిగా ఇవ్వ డం లేదు. పెండింగ్ బిల్లులు మరో రూ.40 కోట్లు ఉన్నాయి. దీంతో పనులు ముందుకే కదలట్లేదు. దీనిపై గత సమీక్షల్లో జిల్లా మంత్రి నిరంజన్‌రెడ్డి ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. దీంతోపాటే పాలమూరు–కల్వకుర్తికి అనుసంధానం చేసే అంశం కొలిక్కి రావాల్సి ఉంది. ఇక నెట్టెంపాడు పరి«ధిలోని మరో 50 వేల ఎకరాలకు నీరందడం లేదు. ప్రాజెక్టుకు రూ.192 కోట్ల మేర కేటాయించినా, ఇక్కడ పెండింగ్ బిల్లులు రూ.25 కోట్లు ఉన్నాయి. భీమాలోనూ ఇదే పరిస్థితి. దీంతోపాటే పాలమూరులోని కర్వెన రిజర్వాయర్ నుంచి జూరాలకు నీటిని తీసుకెళ్లే ప్రతిపాదనకు తుది మెరుగులు దిద్దాల్సి ఉంది. గట్టు ఎత్తిపోతలను ఫైనల్ చేయాల్సి ఉంది. వీటన్నింటిపై సమగ్ర వివరాలతో రావాలని సీఎం ఆదేశించడంతో ఇంజనీర్లు ఆ పనిలో నిమగ్నమయ్యారు. చదవండి: టర్కీ డిజైన్‌లో సచివాలయం మసీదులు -
కొత్త సచివాలయ పనులు సీఎం కేసీఆర్ పరిశీలన
సాక్షి, హైదరాబాద్: అత్యాధునికంగా.. సకల సౌకర్యాలతో కొత్త సచివాలయ నిర్మాణం తెలంగాణ ప్రభుత్వం నిర్మిస్తోంది. దీనికి సంబంధించిన పనులను షాపూర్ పల్లోంజీ చేపడుతోంది. రూ.617 కోట్లతో చేపట్టిన ఈ నిర్మాణ పనులు ఇప్పటికే మొదలయ్యాయి. అయితే ఈ పనులను మంగళవారం సీఎం కేసీఆర్ ఆకస్మికంగా పరిశీలించారు. గణతంత్ర వేడుకల్లో పాల్గొన్న అనంతరం సీఎం కేసీఆర్ ట్యాంక్‌బండ్‌కు చేరుకుని సచివాలయ నిర్మాణ పనులను పరిశీలించారు. రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఉన్నతాధికారులు, ఇంజినీర్లతో సచివాలయ నిర్మాణ పనులపై సీఎం కేసీఆర్ వివరాలు అడిగి తెలుసుకున్నారు. సచివాలయ నిర్మాణ పనులను అక్కడున్న సిబ్బందిని అడిగి కొన్ని సూచనలు చేశారు. త్వరితగతిన ఈ పనులను పూర్తి చేయాలని ఆదేశించినట్లు తెలుస్తోంది. -
3 నెలలు.. వేల మందికి ఉపాధి
సాక్షి, హైదరాబాద్: దళిత నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు మెరుగు పర్చేందుకు రాష్ట్ర షెడ్యూల్డ్ కులాల ఆర్థిక సహకార సంస్థ (ఎస్సీ కార్పొరేషన్) సరికొత్త కార్యాచరణకు ఉపక్రమించింది. 2020–21 వార్షిక సంవత్సరం ఎక్కువ భాగం కోవిడ్– 19 భయంతో గడిచిపోగా.. మిగతా సమ యాన్ని సద్వినియోగం చేసుకుని ఉపాధి అవ కాశాలు పెంచే దిశగా అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా రాష్ట్రంలో డిగ్రీ చదివి నిరుద్యోగులుగా ఉన్న ఎస్సీ యువతకు శిక్షణ ఇచ్చి ఉపాధి కల్పించనుంది. ప్రస్తుత వార్షిక సంవత్సరం మరో మూడు నెలల్లో ముగియనున్న నేపథ్యంలో తక్కువ సమయంలో శిక్షణ పూర్తి చేసి ఉపాధి కల్పించే అవకాశాలపై దృష్టి సారించింది. ప్రస్తుతం విద్యాసంస్థలు, శిక్షణ సంస్థల నిర్వహణకు ప్రభుత్వం అనుమతి ఇవ్వడంలేదు. ఈ క్రమంలో శిక్షణతో కూడిన ఉపాధి అవకాశాల కల్పనకు సంబంధించిన ప్రతిపాదనలు రూపొందించిన ఎస్సీ కార్పొరేషన్ ప్రభుత్వానికి నివేదించి అనుమతి కోసం వేచి చూస్తోంది. ప్రస్తుత పరిస్థితుల్లో డిమాండ్ ఉన్న కన్స్ట్రక్షన్, హాస్పిటాలిటీ, హెల్త్ కేర్ రంగాల్లో నిరుద్యోగ ఎస్సీ యువతకు శిక్షణ ఇచ్చి ఉపాధి కల్పించాలని భావిస్తోంది. దీనికి సంబంధించి టాప్ కంపెనీలతో ఎస్సీ కార్పొరేషన్ ఇప్పటికే పలు ఎంవోయూలు చేసుకుంది. దీంతో ప్రభుత్వం అనుమతిస్తే శిక్షణ తరగతులను ప్రారంభించనుంది. దీని కోసం రూ.25.8 కోట్లు ఖర్చు చేసి మూడు నెలల్లో 3,135 మందికి శిక్షణ ఇచ్చే విధంగా కార్యాచరణ రూపొందించింది. నైపుణ్యాభివృద్ధి మాత్రమే కాకుండా ఉద్యోగాలు కల్పించేలా కార్యాచరణ రూపొందిచినట్లు ఎస్సీ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ పి.కరుణాకర్ తెలిపారు. -
ఫిబ్రవరి 23న అంతర్వేదిలో ఉత్సవాలు
సాక్షి, తూర్పుగోదావరి: అంతర్వేది శ్రీలక్ష్మీ నరసింహస్వామి ఆలయ నూతన రథం నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయని దేవదాయ శాఖ ప్రత్యేక కమిషనర్ అర్జున రావు తెలిపారు. డిసెంబరు నెలాఖరు నాటికి రథం నిర్మాణం పూర్తవుతుందని సోమవారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. తెలుగు క్యాలెండర్ ప్రకారం శ్రీలక్ష్మీ నరసింహ స్వామి వార్షిక రథోత్సవం ఫిబ్రవరి 23న వస్తుందని, ఆ రోజు నూతన రథంతో ఉత్సవాలు జరిపేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. సాంప్రదాయ మరియు ఆచార పద్ధతులన్నింటినీ అనుసరించి నూతన రథం రూపుదిద్దుకుంటోందని చెప్పారు. అధిక నాణ్యత గల బస్తర్ టేక్ వుడ్‌ను రథం తయారీకి ఉపయోగిస్తున్నట్లు తెలిపారు. (చదవండి: ‘అంతర్వేది’ రథ నిర్మాణం ప్రారంభం) -
అంతర్వేది నూతన రథం నిర్మాణానికి శ్రీకారం
సాక్షి, తూర్పుగోదావరి: అంతర్వేదిలో దగ్ధమయిన రథం స్థానంలో కొత్త రథం నిర్మాణ పనులకు ఆదివారం శ్రీకారం చుట్టారు. తొలుత తెల్లవారుజాము నుంచే ఆలయ ప్రాంగణంలో వైదిక కార్యక్రమాలు నిర్వహించారు. మంత్రులు కృష్ణదాస్, చెల్లుబోయిన వేణు గోపాలకృష్ణ , ఎమ్మెల్యేలు సతీష్, రాపాక వర ప్రసాదరావు హాజరయ్యారు. రథం నిర్మాణానికి ప్రభుత్వం రూ.95 లక్షలు కేటాయించింది. 1330 ఘనపుటడుగుల బస్తర్ టేకు కలప రథం నిర్మాణానికి ఉపయోగిస్తున్నారు. మూడు నెలల్లో రథం నిర్మాణం పూర్తి చేయాలని అధికారులు సంకల్పించారు. అచ్చం పాత రథాన్ని పోలినట్టే నూతన రధాన్ని నిర్మిస్తున్నామని దేవాదాయశాఖ ఇంజనీరింగ్ అధికారులు తెలిపారు. రోజూ అవసరమైన మేరకు కార్మికులను ఏర్పాటు చేసుకుని నూతన రథాన్ని నిర్మిస్తామని పేర్కొన్నారు. రానున్న సంక్రాంతి కల్లా రధాన్ని పూర్తి చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని వారు తెలిపారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ మాట్లాడుతూ అంతర్వేది ఘటనపై విచారణ జరుగుతోందని.. దోషులు ఎంతటివారైనా కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు. రాజకీయ లబ్ధికోసం కొన్ని పార్టీలు ప్రయత్నిస్తున్నాయని మండిపడ్డారు. జిల్లా కలెక్టర్ డి.మురళీధర్‌రెడ్డి మాట్లాడుతూ డిసెంబర్ లోపు రథం నిర్మాణం పూర్తి చేస్తామని తెలిపారు. -
అంతర్వేది నూతన రథం నిర్మాణానికి శ్రీకారం
-
ఆలయ స్వర్ణముఖ ద్వారానికి బంగారు తాపడం..
సాక్షి, యాదాద్రి : తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయ నిర్మాణం పనులు తుదిదశకు చేరుకుంటున్నాయి. ఆలయ నిర్మాణంలో పలు పనులకు బంగార తాపడం చేపిస్తున్నారు. ఇదే క్రమంలో యాదాద్రి ప్రధానాలయం గర్భాలయం స్వర్ణముఖ ద్వారానికి బంగారు తాపడం చేపించారు. బంగారు తాపడంతో ఉండే ద్వారాల నమూనా వీడియోను దేవాలయ అధికారులు మీడియాకు విడుదల చేశారు. దీనితోపాటు అత్యంత స్వర శోభతో ఉండే విధంగా వివిధ నరసింహుని రూపాలు, దేవత విగ్రహాలు,పద్మాలతో స్వర్ణ తాపడంతో ఆలయ ద్వారాలు వుండే వీడియో నమూనాను అధికారులు విడుదల చేశారు. (అద్భుతం.. అద్దాల మండపం) -
వరదల్లోనూ కొనసాగుతున్న పోలవరం పనులు
సాక్షి, అమరావతి : ఏపీలో బారీ వరదల్లోనూ పోలవరం ప్రాజెక్టు పనులు నిరాటంకంగా కొనసాగుతున్నాయి. భారీ వర్షాల నేపథ్యంలో ప్రణాళిక బద్ధంగా ప్రభుత్వం పనులను జరిపిస్తుంది. 902 హిల్‌లో 20 వేల క్యూబిక్ మీటర్ల కొండ తవ్వకం చేపట్టారు. గ్యాప్ 3 కాంక్రీట్ డ్యాం, మట్టితీత పనులతో పాటు గ్యాప్ 1 డాయఫ్రం వాల్ పనులు జరుగతున్నాయి. ముందస్తు ప్రణాళికతో స్పిల్ వేపై భాగంలో కార్మికులతో గడ్డర్ల తయారీ, కాంక్రీట్ డ్యామ్, డయా ఫ్రమ్ వాల్ పనులు నిర్వహిస్తున్నారు. అయితే స్పిల్ వే భారీ నీటి ప్రవాహం ఉన్నా స్పిల్ వే పై పనులు జరుపుతున్నారు. బారీ వరదల నేపథ్యంలో పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షించడానికి రెండు బోట్లు, గజ ఈతగాళ్లను పెట్టి పనులను చేపడుతున్నారు. -
లేబర్ సెస్‌ను వాడుకోండి!
సాక్షి, హైదరాబాద్: లాక్డౌన్ నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా నిర్మాణ పనులు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. దీంతో నిర్మాణ రంగ కార్మికుల జీవనోపాధికి ఆటంకం ఏర్పడింది. నిర్మాణ సంస్థలు చెల్లించే లేబర్ సెస్‌ను కార్మికుల సంక్షేమానికి వినియోగించుకోవాలని కాన్ఫడరేషన్ ఆఫ్ రియల్ ఎస్టేట్ డెవలపర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (క్రెడాయ్) తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. ఇటీవలే ప్రత్యక్ష ప్రయోజన బదిలీ (డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్–డీబీటీ) ద్వారా అసంఘటిత రంగంలోని కార్మికులకు ఆర్థిక, అనుబంధ ప్రయోజనాలను కల్పించడానికి లేబర్ సెస్‌ను వినియోగించుకోవాలని కేంద్రం అన్ని రాష్ట్ర, కేంద్ర పాలిత ప్రాంత ప్రభుత్వాలకు సూచించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం కేంద్ర కార్మిక మరియు ఉపాధి శాఖలో 3.5 కోట్ల మంది కార్మికులు నమోదయ్యారు. ఈ బోర్డులో సుమారు రూ.52 వేల కోట్ల కార్పస్ ఫండ్ ఉందని కేంద్ర కార్మిక మంత్రిత్వ శాఖ తెలిపింది. రూ.2 వేల కోట్ల లేబర్ సెస్.. గతేడాది మార్చి నాటికి తెలంగాణ కార్మిక సంక్షేమ బోర్డులో 13 లక్షల మంది భవన నిర్మాణ కార్మికులు నమోదయ్యారు. ఇందులో 10 శాతం మంది ఆంధ్రప్రదేశ్, బిహార్, ఉత్తరప్రదేశ్, అస్సాం, జార్ఖండ్ వంటి రాష్ట్రాల కార్మికులుంటారు. ప్రస్తుతం కార్మిక సంక్షేమ బోర్డులో రూ.1,800–2,000 కోట్ల లేబర్ సెస్ నిల్వ ఉందని తెలంగాణ కార్మిక సంక్షేమ బోర్డ్ సభ్యుడు గంధం ఆంజనేయులు తెలిపారు. గుర్తింపు కార్డ్ ఉన్నవాళ్లకు మాత్రమే లేబర్ సెస్ ప్రయోజనం వర్తిస్తుందని.. ఆయా కార్మికుల ఆధార్ కార్డ్ బ్యాంక్ అకౌంట్‌తో అనుసంధానమై ఉన్నాయి కాబట్టి ప్రభుత్వం నిర్ణయించే ప్రయోజన సొమ్ము నేరుగా ఖాతాలో జమ అవుతుందని పేర్కొన్నారు. కార్మికులందరికీ ప్రయోజనం.. భవన, నిర్మాణ రంగ కార్మికుల ఉపాధి నియంత్రణ మరియు సేవల చట్టం కింద కార్మిక సంక్షేమ బోర్డులు లేబర్ సెస్‌ను సమీకరిస్తుంటాయి. డెవలప్మెంట్ అథారిటీ, హౌసింగ్ బోర్డు లేదా మున్సిపల్ కార్పొరేషన్లు ప్రాజెక్ట్ వ్యయంలో 1 శాతం సెస్ రూపంలో డెవలపర్ల నుంచి వసూలు చేస్తుంటాయి. లాక్డౌన్ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా భవన నిర్మాణ కార్యకలాపాలు నిలిచిపోయాయి. దీంతో ఈ రంగంలోని కార్మికుల జీవనోపాధికి ఎలాంటి ఆటంకం కలగకుండా ఉండేందుకు లేబర్ సెస్‌ను వినియోగించుకోవాలని కాన్ఫడరేషన్ ఆఫ్ రియల్ ఎస్టేట్ డెవలపర్స్ అసోసియేషన్ (క్రెడాయ్) ప్రభుత్వాన్ని కోరింది. కార్మిక సంక్షేమ బోర్డులో నమోదైన వాళ్లకు మాత్రమే కాకుండా అసంఘటిత రంగంలోని కార్మికులందరికీ ఈ నిధుల ప్రయోజనం అందేలా చూడాలని క్రెడాయ్ తెలంగాణ ప్రెసిడెంట్ సీహెచ్ రామచంద్రా రెడ్డి కోరారు. శాశ్వత కార్మికులను మాత్రమే డెవలపర్లు కార్మిక సంక్షేమ బోర్డులో నమోదు చేస్తుంటారు. రోజూ వారీ వేతనం కింద కూలీలు, కాంట్రాక్ట్ వర్కర్లను వినియోగించుకుంటారు. కరోనా ‘కేర్’ నిర్మాణ ప్రదేశాల్లో కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు తెలంగాణ మున్సిపల్ పరిపాలన మరియు పట్టణాభివృద్ధి శాఖ డెవలపర్లకు పలు సూచనలను జారీ చేసింది. అవేంటంటే.. ► కరోనా వైరస్, దాని ప్రభావ తీవ్రత గురించి కార్మికుల్లో అవగాహన కల్పించాలి. ► సబ్బు, శానిటైజర్‌తో సాధ్యమైనన్ని ఎక్కువ సార్లు రెండు చేతులను మోచేతి వరకు శుభ్రం చేసుకోవాలి. ► కార్మికులు ఉండే ప్రదేశాలు, చుట్టుపక్కల ప్రాంతాలు శుభ్రంగా ఉండేలా చూసుకోవాలి. టాయిలెట్స్‌లను పరిశుభ్రంగా ఉంచుకోవాలి. ► ప్రాజెక్ట్ ప్రాంతాల్లో కార్మికులు గుంపులుగా ఉండకూడదు. వ్యక్తికి వ్యక్తికి మధ్య కనీసం 6 ఫీట్ల సామాజిక దూరాన్ని మెయిన్‌టెన్ చేయాలి. ► ప్రాజెక్ట్‌లు, లేబర్ క్యాంప్లలోకి బయటి వ్యక్తులను, అపరిచితులను రానివ్వకూడదు. ► లాక్డౌన్ ఉన్నన్ని రోజులు కార్మికులకు అవసరమైన బియ్యం, కూరగాయలు, పాలు వంటి నిత్యావసరాలన్నింటినీ ఒకేసారి సమకూర్చుకోవాలి. ఆయా నిత్యావసరాల కొనుగోలు కోసం అందరూ వెళ్లకుండా ఒక్కరు మాత్రమే వెళ్లాలి. ► ఎవరైనా కార్మికులు అనారోగ్యంగా ఉంటే అందరితో కలిసి కాకుండా ప్రత్యేకంగా వేరే షెడ్‌ను ఏర్పాటు చేసి.. క్వారంటైన్లో ఉండాలి. ముందుగా సంబంధిత ప్రభుత్వ విభాగానికి సమాచారం అందించాలి. ► నిర్మాణ కార్మికులుండే ప్రాంతాల్లో వైద్య బృందాలను ఏర్పాటు చేసి తరచుగా ఆరోగ్య పరీక్షలు నిర్వహించాలి. వినియోగ, తాగునీటి అవసరాలకు అంతరాయం లేకుండా చూసుకోవాలి. -
హౌసింగ్‌లోనూ రివర్స్ టెండరింగ్
సాక్షి ప్రతినిధి, ఒంగోలు: ప్రభుత్వం నిర్వహించే ప్రతి అభివృద్ధి పనిని ఎక్కువ ధరలకు అప్పజెప్పి కమీషనర్లు తీసుకోవడం... కాంట్రాక్టర్లకు ప్రభుత్వ ధనాన్ని దోచిపెట్టడం... నాణ్యత లేకుండా పనులు నిర్వహించినా పట్టించుకోకపోవడం... ప్రభుత్వ ఖజానాకు గండి కొడుతూ తమ అనుయాయుల జేబులు నింపడం... ఇదీ.. గత ప్రభుత్వ హయాంలో టీడీపీ నేతలు చేసిన నిర్వాకం. వైఎస్సార్ సీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రభుత్వం ద్వారా నిర్వహించే ప్రతి అభివృద్ధి పనికి పారదర్శకంగా టెండర్లు నిర్వహించి ప్రభుత్వానికి ఆదాయాన్ని సమకూర్చడమే కాకుండా గతంలో పెండింగ్‌లో ఉన్న పనులకు సైతం టెండర్లు రద్దు చేసి రివర్స్ టెండరింగ్ నిర్వహించి వందల కోట్ల రూపాయలు ప్రభుత్వానికి మిగిలేలా చేయడంలో సక్సెస్ అవుతున్నారు. జిల్లాలో ఇప్పటికే సాగునీటి ప్రాజెక్టుల్లో నిర్వహించిన రివర్స్ టెండరింగ్‌లో ఏకంగా రూ.104 కోట్లకు పైగా ప్రభుత్వానికి మిగిల్చారంటే పరిస్థితి ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు తాజాగా జిల్లాలో గత ప్రభుత్వ హయాంలో కాంట్రాక్టులు దక్కించుకుని ఇళ్ల నిర్మాణ పనులు బేస్మెంట్ లెవల్లో ఉన్నవాటిని గుర్తించి రివర్స్ టెండరింగ్ నిర్వహించేందుకు సమాయత్తమయ్యారు. జిల్లాలో నిర్మాణ దశలో ఉన్న 3,984 ఇళ్లకు సంబంధించి రూ.210.87 కోట్ల పనులకు గతనెల 28వ తేదీ నుంచి ఈనెల 15వ తేదీ వరకు ఏపీ టిడ్కో రివర్స్‌టెండరింగ్‌కు అవకాశం కల్పించింది. ఈనెల 15వ తేదీ రివర్స్‌టెండరింగ్ ద్వారా ప్రభుత్వానికి ఎంత ఆదా అయిందనే విషయం తేటతెల్లం కానుంది. దీనికి సంబంధించిన వివరాల్లోకి వెళితే... ప్రకాశం జిల్లాలో నగరం, పట్టణ ప్రాంతాల్లో పేదలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వాటాతో పాటు లబ్ధిదారుల వాటాతో కలిపి ఇళ్ల నిర్మాణం చేపట్టేందుకు ఓ కాంట్రాక్టు సంస్థకు పనులు అప్పగించారు. ఇళ్ల నిర్మాణాలను ఆంధ్రప్రదేశ్ టౌన్షిప్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ లిమిటెడ్ (ఏపీ టిడ్కో)కు పర్యవేక్షణ బాధ్యతలు అప్పగించిన విషయం తెలిసిందే. జిల్లాలోని ఒంగోలు నగరంతో పాటు కందుకూరు, మార్కాపురం, కనిగిరి, అద్దంకి, గిద్దలూరు పట్టణాల్లో 300 ఎస్ఎఫ్టీ, 365 ఎస్ఎఫ్టీ, 430 ఎస్ఎఫ్టీ విస్తీర్ణంతో 13,024 ఇళ్లను నిర్మించేందుకు పనులు కట్టబెట్టారు. అయితే వీటిలో కేవలం 6,628 ఇళ్లు మాత్రమే వివిధ దశల్లో నిర్మాణంలో ఉన్నాయి. వీటిలో 3,984 ఇళ్లు బేస్మెంట్ లెవల్లో ఉండగా 2,412 ఇళ్లు అసలు మొదలే పెట్టని పరిస్థితి నెలకొంది. దీనికి తోడు ఇళ్ల నిర్మాణానికి సంబంధించి లిఫ్ట్‌లు ఏర్పాటు చేయక పోవడం, నిర్మించిన ఇళ్లకు సైతం నీటి సౌకర్యం లేకపోవడం, ఇళ్లలో ఇంటీరియర్ కూడా ఏర్పాటు చేయకపోవడంతో వీటిని తీసుకునేందుకు లబ్ధిదారులు ఆసక్తి కనబరచని పరిస్థితి నెలకొంది. జిల్లాలో ఒంగోలు నగరంతో పాటు మిగతా పట్టణ ప్రాంతాల్లోని లబ్ధిదారులు వారి వాటా డబ్బులు చెల్లించడం కానీ, బ్యాంకు రుణాలు పొందడం కానీ చేయకుండా వదిలేశారు. ఇళ్ల నిర్మాణానికి రివర్స్ టెండరింగ్: జిల్లాలో ఒంగోలు నగరంతో పాటు వివిధ పట్టణాల్లో జరుగుతున్న ఇళ్ల నిర్మాణాల పనుల్లో రివర్స్‌టెండరింగ్ నిర్వహించేందుకు ప్రభుత్వం సమాయత్తమైంది. దీనికి సంబంధించి ఏపీ టిడ్కో ఇప్పటికే కార్యాచరణ ప్రారంభించింది. జిల్లాలో మొత్తం 13,024 ఇళ్ల నిర్మాణానికి గత ప్రభుత్వం టెండర్లు అప్పగించిన విషయం తెలిసిందే. అయితే మూడేళ్లు దాటినా కాంట్రాక్టు సంస్థ కేవలం 6,628 ఇళ్లను మాత్రమే వివిధ దశల్లో నిర్మిస్తుండడంతో ప్రస్తుతం బేస్మెంట్ లెవల్లో ఉన్న 3,984 ఇళ్లకు సంబంధించి రూ.210.87 కోట్ల పనులకు రివర్స్‌టెండరింగ్ నిర్వహించాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా ఇప్పటికే రివర్స్‌టెండరింగ్ ప్రక్రియను ఏపీ టిడ్కో ప్రారంభించింది. గత నెల 28వ తేదీ నుంచి ప్రారంభమైన రివర్స్‌టెండరింగ్ ఈనెల 15వ తేదీ వరకు జరగనుంది. 15వ తేదీ ఈ పనులకు సంబంధించి ప్రభుత్వానికి ఎంత ఆదా అయిందనే విషయం స్పష్టం కానుంది. రాష్ట్రంలోని నాలుగు జిల్లాల్లో ఇళ్ల నిర్మాణాలకు సంబంధించి రెండు రోజుల క్రితం ముగిసిన రివర్స్‌టెండరింగ్‌లో 15 శాతం తక్కువకు టెండర్‌ను దక్కించుకున్న విషయం తెలిసిందే. జిల్లాలో నిర్వహించిన రివర్స్ టెండరింగ్ ద్వారా ప్రభుత్వానికి ఎంత ఆదా అవుతుందనే దానిపై అంతా చర్చించుకుంటున్నారు. రివర్స్‌టెండరింగ్‌కు ఈనెల 15 వరకు గడువు: టిడ్కో ఈఈ వెంకటేశ్వర్లు జిల్లాలో బేస్మెంట్ లెవల్లో ఉన్న 3,984 ఇళ్ల నిర్మాణానికి సంబంధించి రూ.210.87 కోట్ల పనులకు గత నెల 28వ తేదీ నుంచి రివర్స్ టెండరింగ్ ప్రక్రియ ప్రారంభించాం. ఈనెల 15వ తేదీ వరకు టెండర్లు వేసుకునేందుకు అవకాశం ఉంది. మొదటి విడత నిర్వహించిన రివర్స్ టెండరింగ్‌లో 15 శాతం వరకు తక్కువ ధరకు టెండర్లు వేయడంతో ప్రభుత్వానికి భారీగా ఆదా అయిన విషయం తెలిసిందే. జిల్లాలో జరిగే రివర్స్ టెండరింగ్‌కు సైతం ఇదే స్థాయిలో ఆదా అవుతుందని ఆశిస్తున్నాం. -
ప్రభుత్వానికి రెండు వారాల గడువు
సాక్షి, విశాఖపట్నం: భవన నిర్మాణ కార్మికులను ఆదుకునేందుకు ప్రభుత్వానికి రెండు వారాల గడువు ఇస్తున్నామని జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ అన్నారు. ఇసుక సమస్యపై పోరాటంలో భాగంగా విశాఖ నగరంలోని మద్దిలపాలెం జంక్షన్ నుంచి వీఎంఆర్డీఏ సెంట్రల్ పార్క్ వరకు జనసేన నిర్వహించిన లాంగ్‌మార్చ్‌లో పవన్ కల్యాణ్ పాల్గొన్నారు. అనంతరం సెంట్రల్ పార్క్ సమీపంలో నిర్వహించిన సభలో ఆయన మాట్లాడారు. జనాలు ఇళ్లు వదిలి రోడ్డెక్కారంటే ప్రభుత్వం సరిగా పని చెయ్యనట్లేనని పవన్ విమర్శించారు. ఏడాది వరకూ ప్రభుత్వంపై ఎలాంటి విమర్శలు, పోరాటాలు చెయ్యనని అనుకున్నాననీ, అయితే భవన నిర్మాణ కార్మికులను పట్టించుకోకపోవడంతో కవాతు చెయ్యాల్సి వచ్చిందన్నారు. ఇసుక కొరత కారణంగా నిర్మాణ రంగం కుదేలవుతుంటే ప్రభుత్వానికి చీమకుట్టినట్లైనా లేదని వ్యాఖ్యానించారు. ప్రభుత్వం రెండు వారాల్లో స్పందించి.. ఇసుక సరఫరాపై సరైన నిర్ణయం తీసుకోవడంతో పాటు, ఒక్కో భవన నిర్మాణ కార్మికుడికి రూ.50 వేల పరిహారం, మృతి చెందిన కార్మికుల కుటుంబాలకు రూ. 5లక్షలు చొప్పున అందించాలని డిమాండ్ చేశారు. తనపై నమ్మకం లేకపోవడం, అనుభవం లేదనే కారణంతో తన అభిమానులు కూడా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఓటేశారని పవన్ కల్యాణ్ అన్నారు.ఈ కార్యక్రమంలో జనసేన ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావు, పార్టీ నాయకులు నాగబాబు, నాదెండ్ల మనోహర్‌తో పాటు, టీడీపీ మాజీ మంత్రులు చింతకాయల అయ్యన్నపాత్రుడు, కింజరాపు అచ్చెన్నాయుడు పాల్గొన్నారు. సభలో అపశృతి... పవన్ కల్యాణ్ లాంగ్ మార్చ్‌లో అపశ్రుతి చోటుచేసుకుంది. కవాతు ప్రారంభమైన మద్దిలపాలెం జంక్షన్ వద్ద జరిగిన తోపులాటలో అక్కడే విధులు నిర్వర్తిస్తున్న ఏఆర్ కానిస్టేబుల్ త్రిమూర్తులకు స్వల్పగాయాలయ్యాయి. సభా ప్రాంగణం వద్ద విద్యుదాఘాతం సంభవించి నలుగురు గాయపడ్డారు. వీరిలో రమణారెడ్డి అనే యువకుడిని అపోలో ఆస్పత్రికి తరలించారు. అందరూ సురక్షితంగా ఉన్నారు. పేరు లాంగ్ మార్చ్.. వాహనంపై నుంచే అభివాదం ఇసుక కొరతపై జనసేన నిర్వహించే లాంగ్ మార్చ్‌లో 2.5 కి.మీ. వరకు పవన్ కల్యాణ్ నడుస్తారని ముందుగా ఆ పార్టీ నాయకులు ప్రకటించారు. కానీ. పవన్ మాత్రం నడవకుండా వాహనం పైన నిలబడి అభివాదం చేశారు. దీనిపై ఆ పార్టీ నాయకుల్లోనే అసంతృప్తి నెలకొంది. -
నాడెప్ తొట్లకు అవినీతి తూట్లు
సేంద్రియ ఎరువుల ఉత్పాదనని ప్రోత్సహించేందుకు.. రైతులు ఇంటి వద్దనే ఎరువులు తయారు చేసుకోవాలనే ఉన్నత లక్ష్యంతో స్వచ్ఛభారత్ స్వచ్ఛత్‌లో భాగంగా ఎన్ఆర్ఈజీఎస్, వాటర్‌షెడ్ శాఖల ద్వారా నిర్మించిన నాడెప్ తోట్లు అవినీతి, అక్రమాలకు పరాకాష్టగా మారాయి. నేతల, అధికారుల అవినీతి, లబ్ధిదారులకు అవగాహన వైఫల్యంతో ప్రభుత్వ లక్ష్యానికి తూట్లు పడుతున్నాయి. నాడెప్ తొట్ల నిర్మాణానికి జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద నిధులు చెల్లిస్తున్నా... ఎన్ఆర్ఈజీఎస్, వాటర్షెడ్ల శాఖ పర్యవేక్షణలో నిర్మాణాలు చేపట్టారు. కనిగిరి (ప్రకాశం): జిల్లాలోని 56 మండలాల్లో 2016–17 సంవత్సరానికి 47,218 నాడెప్ తోట్లు మంజూరు కాగా ఇప్పటికి 16,664 నిర్మాణాలు పూర్తయ్యాయి. ఇందుకు గాను రూ.1657.34 లక్షలు ఖర్చు పెట్టినట్లు నివేదికలున్నాయి. అందులో 5,489 ఇన్ ప్రోగ్రస్‌లో ఉన్నాయి. 2017–18 ఏడాదికి గాను 17,893 మంజూరు కాగా, 5,436 పూర్తయ్యాయి. దీనికి గాను రూ.342.52 లక్షలు ఖర్చు పెట్టినట్లు నివేదికలున్నాయి. 3,775 ఇన్ ప్రోగ్రస్‌లో ఉన్నాయి. కనిగిరి నియోజకవర్గంలోని ఆరు మండలాల్లో 2016–17లో 7,040 మంజూరు కాగా, 2,283 పూర్తియ్యాయి. వీటికి గాను 221.41 లక్షలు ఖర్చుపెట్టినట్లు నివేదికలున్నాయి. 2017–18లో 2,760 మంజూరు కాగా, 1,088 పూర్తయ్యాయి. వీటిలో 30 శాతం నాడెప్ తొట్ల నిర్మాణాలు వాటర్‌షెడ్ పరిధిలో జరగ్గా, ఎన్ఆర్ఈజీఎస్ పరిధిలో 70 శాతం పనులు జరిగాయి. ఉపయోగం ఇలా.. 10/6 సైజులో కట్టిన నాడెప్ తొట్టిలో ఒక వరుస చెత్త, దానిపై మరో వరుస పుట్టమట్టి, దాని పేడ వేస్తారు. 40 రోజులు అలా వేస్తే సుమారు రెండున్నర టన్నుల సేంద్రియ ఎరువు ఉత్పత్తి అవుతుంది. వీటిని పొలాలకు ఎరువులుగా వాడటం వల్ల రసాయనిక ఎరువుల వాడకం తగ్గుతుంది. అయితే దీనిపై ఎక్కడా ఎన్ఆర్ఈజీఎస్, వ్యవసాయ అధికారులు లబ్ధిదారులకు అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేసిన దాఖలాలు లేవు. అక్రమం జరుగుతుంది ఇలా.. సన్న, చిన్న కారు రైతులకు, ఎస్సీ, ఎస్టీలకు నాడెప్ తొట్ల నిర్మాణాలకు అర్హులు. ఒక జాబ్ కార్డుకు ఒక నాడెప్ తొట్టిని శాంక్షన్ చేస్తారు. ఒక్కో దానికి (పొడవు 10 అడగులు, 6 అడుగుల వెడల్పు, 3 అడుగుల ఎత్తు, 9 ఇంచెల మందంలో గోడ) రూ.10,159లు ఇస్తారు. అందులో రూ.194లను మాత్రమే కూలి పేరుతో నగదు చెల్లింపు ఉంటుంది. మిగతా రూ.9,965లను మెటీరియల్ కాంపోనెంట్ (ఇసుక, ఇటుక, సిమెంట్, వగైరా వస్తువుల కొనుగోలు) కింద చెల్లిస్తారు. వీటిని జాబ్ కార్డ్ హోల్టరే నిర్మించుకోవచ్చు. కానీ కొన్ని చోట్ల రైతులు నిర్మించుకోలేని పరిస్థితి. దీంతో ప్రభుత్వ సప్లయర్స్ విధానంలో నిర్మించుకునే అవకాశం కల్పించింది. దీన్ని ఆసరా చేసుకుని అధికార పార్టీ నాయకులు, అధికారులు కుమ్మక్కై సప్లయర్స్ పద్ధతిలో 60 శాతంకు పైగా నాడెప్ తొట్ల నిర్మించి అక్రమార్జన చేసినట్లు తెలుస్తోంది. లక్షల్లో అవినీతి.. సప్లయర్స్ విధానాన్ని అసరాగా లక్షల్లో అవినీతి చోటు చేసుకుంటుంది. నాడెప్ తొట్టి శాంక్షన్ పొందిన లబ్ధిదారునికి అధికారులు వర్క్ కమిట్మెంట్ లెటర్ ఇస్తారు. సప్లయర్స్ విధానంలో నాడెప్ తొట్టిని నిర్మించుకునేందుకు ఇష్టపడుతున్నట్లు విల్లింగ్ లెటర్‌ను లబ్ధిదారుని నుంచి తీసుకుంటారు. ఈ క్రమంలో నాడెప్ తొట్టి నిర్మాణానికి వచ్చే రూ.10,159ని సప్లయర్స్ (కాంట్రాక్టర్) ఖాతాలోకి జమ చేస్తారు. అయితే నాడెప్ తొట్టి నిర్మాణానికి రూ.5 నుంచి రూ.6 వేలు మాత్రమే ఖర్చవుతుంది. మిగిలిన నగదును పర్సంటేజీల ప్రకారం అధికారులు, అధికార పార్టీ నాయకులు (సప్లయర్స్) పంచుకుంటున్నారనే ఆరోపణలున్నాయి. ఈక్రమంలో ఒక్క కనిగిరి నియోజకవర్గంలోనే 2016–17లో మొత్తం 2,283 నాడెప్ తొట్లకు రూ.221.41 లక్షలు చెల్లించినట్లు నివేదికలున్నాయి. ఇటీవల జరిగిన సామాజిక తనిఖీల్లో ఆడిట్ బృందం గ్రామాల్లో తిరిగి పరిశీలించగా.. కొన్ని చోట్ల నిర్మాణాలు కనిపించకపోగా.. మరి కొన్ని చోట్ల వాటి ఆనవాళ్లు మాత్రమే కన్పించడం గమనార్హం. -
‘డబుల్’ లేట్!
గూడులేని నిరుపేదలకు డబుల్ బెడ్రూం ఇళ్లు నిర్మించి ఇస్తామన్న ముఖ్యమంత్రి కేసీఆర్ హామీ నాలుగేళ్లు గడిచినా అమలుకు నోచుకోవడం లేదు. మంజూరైన ఇళ్లలో పది శాతం కూడా నిర్మాణాలు పూర్తి చేయలేకపోయారు. దీంతో పేదల సొంతింటి కళ.. కలగానే మిగిలిపోయింది. నిజామాబాద్‌అర్బన్ : అధికారంలోకి వస్తే పేదలకు డబుల్ బెడ్రూం ఇళ్లు నిర్మించి ఇస్తామని గత సార్వత్రిక ఎన్నికల సమయంలో టీఆర్ఎస్ హామీ ఇచ్చింది. టీఆర్ఎస్ అధికారంలోకి రావడంతో తమ సొంతింటి కళ నెరవేరుతుందని పేదలు ఆనందించారు. కానీ ప్రభుత్వం ఏర్పడి నాలుగేళ్లు గడుస్తున్నా నేటికీ కనీసం పదిశాతం ఇళ్లను కూడా నిర్మించలేకపోయారు. కొన్ని ప్రాంతాల్లో డబుల్‌బెడ్‌రూమ్‌ల లబ్ధిదారులకు కేటాయింపు జరిగినా.. 90 శాతం పనులు ఇప్పటి వరకు పూర్తికాకపోవడంతో అనేక మంది లబ్ధిదారులు ఇళ్లను పొందలేకపోతున్నారు. ఉమ్మడి జిల్లాలో ఇళ్ల నిర్మాణ పనులు నత్తనడకన సాగుతుండడంతో లబ్ధిదారులకు ఎదురుచూపులు తప్పడంలేదు. ఉమ్మడి జిల్లాలో ఇదీ పరిస్థితి ఉమ్మడి జిల్లాలో 15,533 వేల ఇళ్లను రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసింది. ఇందులో నిజామాబాద్ జిల్లాకు సంబంధించి 8,375 ఇళ్లను మంజూరు చేయగా, కామారెడ్డి జిల్లాకు 7,158 వేల ఇళ్లను మంజూరు చేసింది. అయితే ఇప్పటికీ కనీసం 10 శాతం ఇళ్లను సైతం నిర్మించలేకపోయారు. బాన్సువాడ నియోజక వర్గంలో 2,950 ఇళ్లును మంజూరు చేస్తే 2,195 ఇళ్ల నిర్మాణాలు నిర్మాణ దశలో ఉన్నాయి. వంద ఇళ్లను నిర్మించి లబ్ధిదారులకు కేటాయించారు. జిల్లాలో ఈ ఒక్క చోటనే కొన్ని నిర్మాణాలు పూర్తయ్యాయి. మంత్రి పోచారం సొంత నియోజకవర్గం కావడంతో ఆయన చొరవ తీసుకుని ఇళ్ల నిర్మాణాలు వేగంగా పూర్తి చేయించి కొందరు లబ్ధిదారులకు కేటాయించారు. మిగతా నియోజకవర్గాల్లో ఇళ్ల నిర్మాణాల పరిస్థితి దారుణంగా ఉంది. చాలా చోట్ల ఆలస్యంగా పనులు ప్రారంభమయ్యాయి. కొన్ని చోట్ల ఇప్పటి వరకు టెండర్లు పూర్తికాకపోవడం గమనార్హం. నిజామాబాద్ జిల్లాకు సంబంధించి ఆర్అండ్బీ ఆధ్వర్యంలో 6,454 ఇళ్లను మంజూరు చేశారు. 5,207 ఇళ్లకు టెండర్లు పిలిచారు. ఇందులో 3,765 ఇళ్లకు టెండర్లు పూర్తికాగా 1,442 ఇళ్లకు ఇంకా టెండర్లు ఖరారు కాలేదు. జిల్లా వ్యాప్తంగా 1,086 ఇళ్లు మాత్రమే నిర్మాణ దశలో ఉన్నాయి. పంచాయతీ రాజ్ ఆధ్వర్యంలో బోధన్, కామారెడ్డి, ఎల్లారెడ్డి, జుక్కల్, నిజామాబాద్‌లలో మంజూరైన ఇళ్లలో ఒక్క నిర్మాణం కూడా పూర్తి కాలేదు. కొన్నిచోట్ల ఇళ్ల నిర్మాణాలు కొనసాగుతుండగా, మరికొన్ని చోట్ల టెండర్లు కూడా ఖరారు చేయలేదు. ఇళ్ల నిర్మాణాలు మందకొడిగానే కొనసాగుతున్నాయి. నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గానికి మొత్తం 1,150 ఇళ్లు మంజూరయ్యాయి. ఇందులో ఆర్అండ్బీ శాఖకు సంబంధించిన 1,100 ఇళ్లు, పంచాయతీరాజ్ శాఖకు సంబంధించి 50 ఇళ్లు మంజూరయ్యాయి. ఆర్‌అండ్‌బీకి సంబంధించి 300 నిర్మాణాలు కొనసాగుతుండగా, పీఆర్‌కు సంబంధించినవి 50 నిర్మాణ దశలో ఉన్నాయి. మిగతా నిర్మాణాలు చేపట్టలేదు. దుబ్బ ప్రాంతంలో నిర్మించనున్న ఇళ్లకు నేల సక్రమంగా లేకపోవడం, తరచూ నీరు రావడంతో నిర్మాణాలకు ఆటంకాలు ఏర్పడుతున్నాయి. బోధన్ నియోజక వర్గంలో పీఆర్ ఆధ్వర్యంలో 1,871 ఇళ్లు మంజూరు కాగా 500 మాత్రమే నిర్మాణ దశలో ఉన్నాయి. నిజామాబాద్ రూరల్ నియోజక వర్గంలో 1,622 ఇళ్లకుగాను 210 ఇళ్లు మాత్రమే నిర్మాణ దశలో ఉన్నాయి. 50 ఇళ్లకు ఇంతవరకు టెండర్లు పిలువలేదు. ఆర్మూర్ నియోజక వర్గంలో 1,532 ఇళ్లకుగాను 180 ఇళ్లు మాత్రమే పనులు ప్రారంభమయ్యాయి. మరో 865 ఇళ్లకు టెండర్లు పిలిచారు. ఇంకా 392 ఇళ్లకు ఇంత వరకు టెండర్లు ఖరారు కాలేదు. బాల్కొండ నియోజక వర్గంలో 800 ఇళ్లకుగాను టెండర్లు పూర్తయిన ఒక్కటి కూడా నిర్మాణ పనులు ప్రారంభం కాలేదు. కామారెడ్డి నియోజకవర్గంలో 1,715 ఇళ్లు మంజూరయితే 1,239 ఇళ్ల నిర్మాణాలు సాగుతున్నాయి. ఎల్లారెడ్డి నియోజక వర్గంలో 893 ఇళ్లు మంజూరవగా 202 ఇళ్లు నిర్మాణ దశలో ఉన్నాయి. జుక్కల్ నియోజక వర్గంలో 1,600 ఇళ్లు మంజూరయితే 160 ఇళ్ల నిర్మాణాలు కొనసాగుతున్నాయి. బాన్సువాడ నియోజక వర్గంలో 2,950 ఇళ్లు మంజూరు కాగా.. 2,195 నిర్మాణాలు పురోగతిలో ఉన్నాయి. వంద ఇళ్లను నిర్మించి లబ్ధిదారులకు అందించారు. నిర్మాణం పూర్తయ్యేదెప్పుడో.. డబుల్బెడ్రూం ఇళ్ల నిర్మాణాలు ఎప్పుడు పూర్తవుతాయోనని లబ్ధిదారులు ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం వర్షకాలం మొదలైంది. దీనివల్ల పనులకు ఆటంకాలు కలుగుతున్నాయి. ముఖ్యంగా ఇళ్ల నిర్మాణానికి సంబంధించి నిజామాబాద్ జిల్లాలో ఇసుక కొరత తీవ్రంగా ఉన్నట్లు తెలుస్తోంది. జిల్లా అధికారులు 16 ప్రాంతాల ఇసుక రీచ్‌ల నుంచి ఇసుకను తీసుకవచ్చేందుకు అనుమతి ఇచ్చారు. కానీ కేవలం ట్రాక్టర్ల ద్వారా ఇసుకను తీసుకెళ్లాలన్న నిబంధన ఇబ్బందికరంగా మారిందని కాంట్రాక్టర్లు పేర్కొంటున్నారు. ఎక్కువ మొత్తంలో నిర్మాణాలు ఉండడంతో ట్రాక్టర్ల ద్వారా ఇసుక తీసుకురావడం ఇబ్బందికరంగా మారిందని, పనులు ఆలస్యంగా జరుగుతున్నాయని అధికారులు సైతం చెబుతున్నారు. మరో వైపు పనులు దక్కించుకున్న నిర్మాణదారులు పనులు మొదలు పెట్టకుండా కాలయాపన చేస్తున్నారు. పనులు దక్కించుకున్న వారిలో ప్రజాప్రతినిధులకు దగ్గరివారు, సంబంధీకులు ఉండడంతో అధికారులు సైతం ఏమీ చేయలేకపోతున్నారు. ఇళ్ల నిర్మాణం వారికి గిట్టుబాటు కాకపోవడమే ప్రధాన కారణమని తెలుస్తోంది. కొన్నిచోట్ల ప్రజాప్రతినిధుల ఒత్తిడి మేరకు నిర్మాణ పనులు కొనసాగిస్తున్నారు. పూర్తిస్థాయిలో పనులు జరగడం లేదు. ఆర్మూర్, బాల్కొండ నియోజక వర్గాల్లో ఇళ్ల నిర్మాణాల పరిస్థితి అధ్వానంగా ఉంది. టెండర్లు సైతం ఖరారు కాలేదు. అయినా చోట కూడా నిర్మాణాలు ప్రారంభంకాలేదు. ప్రజాప్రతినిధులు, అధికారులు ఇళ్ల నిర్మాణాలను పరిశీలిస్తున్నారే తప్పా పనులు పూర్తి చేసేందుకు పూర్తిస్థాయిలో చొరవతీసుకోవడం లేదని తెలుస్తోంది. పాలకులు, ఉన్నతాధికారులు చొరవ తీసుకుని పనులను త్వరగా పూర్తిచేయించి ఇళ్లు కేటాయించాలని నిరుపేదలు కోరుతున్నారు. పనులు కొనసాగుతున్నాయి జిల్లాలో డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణాలు కొనసాగుతున్నాయి. పనులకు కొన్ని చోట్ల ఆటంకాలు ఏర్పడినా నిర్మాణాలు ఆపకుండా చూస్తున్నాం. త్వరితగతిన ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేయిస్తాం. ఎలాంటి ఆటంకాలు ఉన్నా సమస్యలను పరిష్కరించి నిర్మాణాలు పూర్తయ్యేలా ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తాం. – హన్మంత్‌రావు, ఆర్అండ్బీ ఈఈ -
నాణ్యత.. నగుబాటు!
గోపాల్పేట : నాణ్యత నవ్వులపాలవుతోంది. పది కాలాలపాటు పదిలంగా.. రైతులకు అందుబాటులో ఉండాల్సిన ధాన్యం గోదాం నిర్మాణ పనులు నాసిరకంగా సాగుతున్నాయి. సుమారు 5వేల మెట్రిక్‌టన్నుల ధాన్యం నిల్వచేసే సామర్థ్యంతో మండల కేంద్రంలో రూ.3కోట్ల వ్యయంతో గోదాంను నిర్మిస్తున్నారు. అందులో రూ.1.50కోట్ల వ్యయంతో ఐరన్ పైకప్పు, మరో రూ.1.50కోట్లు వెచ్చించి గోడలు నిర్మిస్తున్నారు. పనులు సగానికిపైగా పూర్తికావస్తున్నా అధికారుల పర్యవేక్షణ లేకపోవడం, కాంట్రాక్టర్ కూడా అందుబాటులో లేకపోవడంతో సూపర్వైజర్ ఇష్టానుసారంగా పనులు చేయిస్తున్నాడనే ఆరోపణలు ఉన్నాయి. నాణ్యతలేని ఇటుకలు, రాతిపొడి నిర్మాణాకి నాణ్యత లేని ఇటుకలు, రాతిపొడిని వాడుకుతున్నారని స్థానికులు పేర్కొంటున్నారు. సమీపంలోని వ్యవసాయ బావి నుంచి నల్లాపైపు సాయంతో నామమాత్రంగా నీళ్లుపడుతూ క్యూరింగ్ చేస్తున్నారు. నీళ్లు సమపాళ్లలో పారకపోవడంతో గోడలు తడవడం లేదు. చుట్టుపక్కల లభించే నాణ్యత లేని ఇసుకలో తక్కువ మోతాదులో సిమెంట్‌ను కలిపి పనులు చేపడుతున్నట్లు స్పష్టమవుతోంది. ఇంత జరుగుతున్నా మార్కెటింగ్ అధికారులు అటువైపు వెళ్లడం లేదనే విమర్శలు ఉన్నాయి. రైతులకు భరోసా ఉమ్మడి గోపాల్పేట మండలంలో ఖరీఫ్, రబీ సీజన్లో ఎక్కువగా వరి, మొక్కజొన్న, వేరుశనగ, జొన్నలు, కందులు పండిస్తారు. గతేడాది మాత్రం వెయ్యి ఎకరాలకు పైగా రైతులు పత్తి పండించారు. ఒక సీజన్లో టన్నులకొద్దీ ధాన్యం పండించినా నిల్వచేసేందుకు గోదాంలు లేవు. గోదాంలు ఉంటే అందులో నిల్వచేసుకుని ఆశించిన ధర వచ్చిన సమయంలో అమ్ముకోవడానికి వీలుండేది. గతంలో బుద్దారం, రేవల్లిలో రైతులు సొంత ఖర్చులతో ఏర్పాటు చేసుకున్నారు. ప్రస్తుతం రేవల్లి గోదాములో వ్యవసాయ శాఖ వారు ఎరువులను నిల్వచేస్తున్నారు. బుద్దారంలో ఉన్న గోదాం శిథిలావస్థలో ఉంది. ప్రస్తుతం గోపాల్పేట మండల కేంద్రంలో రూ.మూడు కోట్ల వ్యయంతో గోదామును నిర్మిస్తున్నారు. దీన్ని ఖరీఫ్ నాటికి పూర్తిచేస్తే రైతులు ధాన్యం నిల్వచేసుకునేందుకు అనుకూలంగా ఉంటుంది. అలాగే రైతుబంధు పథకం రుణం పొందే అవకాశం ఉంది. పర్యవేక్షిస్తున్నాం.. ఈ విషయమై మార్కెటింగ్ డీఈ నాగేంద్ర ప్రసాద్‌ను ‘సాక్షి’ వివరణ కోరగా.. తమ పర్యవేక్షణలోనే గోదాం పనులు కొనసాగుతున్నాయని చెప్పారు. రెగ్యులర్‌గా ఇంజనీర్ వెళ్తున్నాడని, దీనిపై క్వాలిటీ కంట్రోల్ అధికారులు పరిశీలిస్తారని వెల్లడించారు. పనులు నాణ్యవంతంగా లేకపోతే మళ్లీ చేయిస్తామని చెప్పారు. -
సబ్-స్టేషన్ల ఏర్పాట్లు కలేనా!
రామచంద్రాపురం: పట్టణం, మండల పరిధిలో విద్యుత్ సమస్యలు పరిష్కరించేందుకు రెండు సబ్స్టేషన్లు మంజూరై ఏళ్లు గడుస్తున్న నిర్మాణ పనులు మాత్రం జరగడంలేదు. రామచంద్రాపురం పట్టణంలో విద్యుత్ వాడకం, కొత్త కొత్త కాలనీలు రావడంతో ఉన్న సబ్‌స్టేషన్‌పై లోడ్ పడుతుంది. దాని కారణంగా ఏప్పుడు కరెంట్ వస్తుందో పోతుందో తెలియని పరిస్థితి నెలకొంది. దీనితో పాటు లోఓల్టెజీ సమస్య ఏర్పడుతుంది. గతంలో ఒవర్‌లోడ్ కారణంగా లక్షల విలువచేసే పరికరాలు, కాలిపోయిన సంఘటనలు రామచంద్రాపురం సబ్‌స్టేషన్‌లో నెలకొన్నాయి. దీనిని దృష్టిలో పెట్టుకొని అధికారులు మరొక్క 33 కేవీ సబ్‌స్టేషన్ మంజూరు చేశారు. అందుకు రూ.రెండు కోట్ల నిధులు సైతం మంజూరై ఏళ్లు గడుస్తున్న నేటికి పనుల ప్రారంభోత్సవానికి నోచుకొలేదు. గత పాలకులు సబ్‌స్టేషన్ నిర్మాణానికి స్థలం చూపిస్తామంటూ కాలయాపన చేశారే తప్ప పూర్తి స్థాయిలో భూమిని కేటాయించడంలో విఫలం చెందారు. సుమారు ఏడేళ్లు గడుస్తున్న నేటికి భూమిని కేటాయించకపోవడతో ప్రజలకు మాత్రం విద్యుత్ సమస్యలు తప్పడంలేదు. మండల పరిధిలోని విద్యుత్‌నగర్ సబ్‌స్టేషన్ కింద అనేక గ్రామాలు ఉన్నాయి. ఆయా గ్రామాల పరిధిలో కొత్త కొత్త కాలనీలు రావడంతో ఉన్న సబ్‌స్టేషన్‌పై లోడ్ ఏక్కువ పడుతుంది. ఇక్కడ కూడా 33 కేవీ సబ్‌స్టేషన్ నిర్మాణం కోసం సుమారు రూ.రెండు కోట్లు మంజూరయ్యాయి. స్థలాన్ని చూపిస్తే సబ్‌స్టేషన్ నిర్మాణం పనులు ప్రారంభిస్తామని సంబంధిత అధికారులు, నేతలకు మొరపెట్టుకుంటున్నా వారు మాత్రం సబ్‌స్టేషన్ నిర్మాణానికి కావాల్సిన స్థలాన్ని మాత్రం చూపెట్టడంలేదు. దానితో ఈ రెండు ప్రాంతాల్లో సబ్‌స్టేషన్ నిర్మాణానికి నిధులు మంజూరైన ఫలితం మాత్రం రావడంలేదు. ఇప్పటికైన నేతలు స్పందించి సబ్‌స్టేషన్ నిర్మాణానికి భూమిని కేటాయించకపోతే రానున్న రోజుల్లో విద్యుత్ సమస్య జఠిలంగా మారే అవకాశం ఎక్కువగా ఉంది. -
అదిరిపోయే రీతిలో పోలీస్ టవర్స్
ట్విన్ టవర్స్ పనుల్లో కదలిక... ఎర్త్‌వర్క్ కాంట్రాక్టు అప్పగింత పనులు పూర్తి ప్రతి 21 రోజులకు ఓ శ్లాబ్ పడేలా ప్రణాళిక 20 అంతస్తులు...83.4 మీటర్ల ఎత్తుతో ఐసీసీసీ అత్యాధునిక హంగులతో నిర్మాణం గరిష్టంగా రెండేళ్ళల్లో పూర్తి! సాక్షి, సిటీబ్యూరో: ‘ట్విన్ టవర్స్’ పేరుతో నగరంలోని బంజారాహిల్స్‌లో నిర్మించనున్న సిటీ పోలీసు కమిషనరేట్ హెడ్–క్వార్టర్స్, ఇంటిగ్రేడెట్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ (హెచ్‌సీపీసీహెచ్‌క్యూ అండ్ ఐసీసీసీ) నిర్మాణం పనులు వచ్చే వారం ప్రారంభంకానున్నాయి. ప్రాథమికంగా రాళ్ళ తొలగింపు, భూమి చదును తదితర ఎర్త్వర్క్స్ చేయాలని అధికారులు నిర్ణయించారు. ఇప్పటికే దీని నిర్మాణానికి సివిల్ ఏవియేషన్, మున్సిపల్ శాఖల నుంచి అనుమతులు వచ్చిన నేపథ్యంలో గరిష్టంగా రెండు నెలల్లో భవన నిర్మాణానికీ శ్రీకారం చుట్టనున్నారు. రెండు సంవత్సరాల్లో నిర్మాణం పూర్తి చేసుకోనున్న ఈ ట్విన్ టవర్స్ నగరంలోనే అతి ఎల్తైన భవనంగా రికార్డులకు ఎక్కనుంది. నిర్ణీత కాలంలో, ప్రణాళికా బద్ధంగా, అందరికీ ఉపయుక్తంగా ఈ భవనాల నిర్మాణం పూర్తి చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని నగర పోలీసు కమిషనర్ ఎం.మహేందర్‌రెడ్డి ‘సాక్షి’తో అన్నారు. 83.4 మీటర్లకు పరిమితం... బంజారాహిల్స్ రోడ్ నెం.12లోని ఏడెకరాల సంస్థలో ఈ జంట భవనాలను 135 మీటర్ల ఎత్తుతో నిర్మించాలని తొలుత భావించారు. ఈ మేరకు అనుమతి కోరుతూ రాష్ట్ర పురపాలక శాఖకు దరఖాస్తు చేసుకున్నారు. ప్రస్తుతం అమల్లో ఉన్న నిబంధనల ప్రకారం బంజారాహిల్స్ ప్రాంతంలో 15 మీటర్లకు మించిన ఎత్తులో భవనాల నిర్మాణాలు జరపకుండా ఆంక్షలు అమల్లో ఉన్నాయి. ఈ ఆంక్షలను సడలిస్తూ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ భవనానికి ఆ శాఖ అనుమతిచ్చింది. మరోపక్క ఇంత ఎల్తైన భవనాలు నిర్మించాలంటే దానికి పౌర విమానయాన మంత్రిత్వ శాఖ నుంచి అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలోనే నగర పోలీసులు ఆ శాఖకు అనుమతులు కోరుతూ దరఖాస్తు చేసుకున్నారు. అయితే కొన్ని ప్రత్యేక పరిస్థితుల నేపథ్యంలో 83.4 మీటర్ల ఎత్తు నిర్మించుకోవడానికి సివిల్ ఏవియేషన్ శాఖ అనుమతించింది. వీటిని పరిగణనలోకి తీసుకున్న పోలీసు విభాగం 20 అంతస్తులతో 83.4 మీటర్ల ఎత్తులో నిర్మించడానికి సమాయత్తమైంది. ఎర్త్‌వర్క్‌ను వేరుచేసి వేగంగా... ఈ ట్విన్ టవర్స్ నిర్మాణానికి సంబంధించిన టెండర్లు ఆహ్వానించడం, వాటిని పరిశీలించడం, కాంట్రాక్టు అప్పగించడం తదితర వ్యవహారాలన్నింటినీ రహదారులు, భవనాల శాఖ పర్యవేక్షిస్తోంది. సాంకేతిక కారణాల నేపథ్యంలో ఈ భవనాల నిర్మాణాలు చేపట్టడానికి గరిష్టంగా రెండు నెలల కాలం పట్టే అవకాశం ఉంది. అప్పుడైనా తొలుత భూమి చదునుకు సంబంధించిన పనులతో ప్రారంభించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలోనే కాలయాపన జరుగకుండా ఎర్త్ వర్క్‌ను వేరుచేసి, మరో టెండర్‌ను ఆహ్వానించారు. దీన్ని ఓ ప్రైవేట్ సంస్థ దక్కించుకోవడంతో వచ్చే వారం పనులు ప్రారంభించడానికి కాంట్రాక్టర్లు సన్నాహాలు చేస్తున్నారు. ఆ స్థలంలో ఉన్న రాళ్ళ తొలగింపు, నేల చదును చేయడం తదితర పనుల్ని పూర్తి చేసే ఈ సంస్థ నిర్ణీత కాలంలో పోలీసు విభాగానికి అప్పగిస్తుంది. ఈ లోపు భవనాల నిర్మాణానికి సంబంధించి టెండర్లు, ఇతర ప్రక్రియలు పూర్తి కావడంతో తక్షణం నిర్మాణ పనులు చేపట్టే అవకాశం ఉంటుంది. ప్రతి 21 రోజులకు ఒక శ్లాబ్... లండన్, న్యూయార్క్ తరహాలో ఉత్తమంగా తయారయ్యే ఈ ఐసీసీసీ నిర్మాణం ప్రారంభమైన నాటి నుంచి గరిష్టంగా రెండేళ్ళల్లో పూర్తి చేయించడానికి పోలీసు విభాగం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. పోలీసులతో పాటు ఇతర ప్రభుత్వ విభాగాలకూ ఉపయుక్తంగా ఉండేలా దీన్ని నిర్మించనున్నారు. ఆద్యంతం ఆధునిక టెక్నాలజీని వినియోగించనున్నారు. నగర ప్రజల భద్రతే ప్రామాణికంగా ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్లీగా అందుబాటులోకి రానున్న ఈ ట్విన్ టవర్స్ నిర్మాణం ఆగస్టులో ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ప్రతి 21 రోజులకు ఒక స్లాబ్ చొప్పున పూర్తి చేస్తూ గరిష్టంగా రెండేళ్ళ కాలంలో దీని నిర్మాణాన్ని పూర్తి చేయడానికి ప్రణాళికలు చేస్తున్నారు. దీని నిర్మాణ వ్యయం దాదాపు రూ.1002 కోట్లు వరకు ఉంటుందని అంచనా వేస్తున్నారు. అధునాత హంగులు... ♦ ఈ ఐసీసీసీని పూర్తిస్థాయిలో డబుల్ ఇన్సులేటెడ్ గ్లాస్‌తో నిర్మించనున్నారు. ♦ టవర్స్‌లో ఉండే సోలార్ విద్యుత్ ఉత్పత్తి ప్యానెల్స్ అదనపు ఆకర్షణ. ♦ భవనం పైన హెలీప్యాడ్, భవనంలో పబ్లిక్ అబ్జర్వేషన్ డెస్క్, పోలీసు మ్యూజియం. ♦ 900 మంది కూర్చునే సామర్థ్యంతో ఆడిటోరియం, 740 వాహనాలకు పార్కింగ్ వసతి. ♦ పోలీసు శాఖకు చెందిన అన్ని విభాగాలూ ఒకే చోటకు.. ♦ కేవలం నగర పోలీసులకే కాకుండా ఇతర ప్రభుత్వ విభాగాలకూ ఇందులో భాగస్వామ్యం. ♦ భవనం 18వ అంతస్తులో నగర పోలీసు కమిషనర్ అధికారిక కార్యాలయం ఏర్పాటు. -
ఈ నెల 28, 29 తేదీల్లో పలు రైళ్లు రద్దు
హైదరాబాద్ : కాచిగూడ-నడికుడి రైలు మార్గంలో చేపట్టనున్న నిర్మాణ పనుల నేపధ్యంలో ఫిబ్రవరి 28, 29 తేదీల్లో పలు ప్యాసింజర్ రైళ్లను రద్దు చేయడంతో పాటు, కొన్నింటిని కాజీపేట్ మీదుగా మళ్లించనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్వో ఎం.ఉమాశంకర్ కుమార్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ మేరకు కాచిగూడ-మిర్యాలగూడ, పిడుగురాళ్ల-మిర్యాలగూడ ప్యాసింజర్ రైళ్లను ఆ రెండు రోజులు రద్దు చేయనున్నారు. కాచిగూడ-రేపల్లె డెల్టా ప్యాసింజర్, హైదరాబాద్-నర్సాపూర్ ఎక్స్‌ప్రెస్ రైళ్లను కాజీపేట్ మీదుగా మళ్లించనున్నారు. -
వేటు పడింది!
అనంతపురం : ఎట్టకేలకు అవినీతి అక్రమాల ఆరోపణలు ఎదుర్కొంటున్న పీటీసీ డీఎస్పీ ఏ. హనుమంతుపై సస్పెన్షన్ వేటు పడింది. ఈ మేరకు డీజీపీ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. ప్రభుత్వ బిల్డింగ్ నిర్మాణంలో కాంట్రాక్టర్ల నుంచి కమీషన్లు దండుకోవడం, ఉద్యోగులను వేధింపులు, అక్రమంగా హెచ్ఆర్ఏ నిధులు డ్రా చేయడం, ప్రభుత్వ వాహనాన్ని అనధికారికంగా ప్రైవేటుకు వినియోగించుకున్నట్లు తేలడంతో సస్పెన్షన్ వేటు పడింది. వివరాల్లోకి వెళ్తే...పీటీసీలో జరుగుతున్న నిర్మాణ పనుల్లో కమీషన్ ఇవ్వలేదనే కారణంతో డీఎస్పీ హనుమంతు నిర్మాణ పనులు ఆపించారని కాంట్రాక్టర్ షౌకత్ అలీఖాన్ గతంలో ఆరోపించారు. ఇదే విషయమై చివరకు టూటౌన్ పోలీసు స్టేషన్లో కేసు నమోదైంది. పీటీసీలో క్వాటర్స్‌ను సబ్ కాంట్రాక్ట్ తీసుకున్న తనను డీఎస్పీ హనుమంతు ఇబ్బందులకు గురి చేశాడని, చివరకు రూ. 25 వేలు కమీషన్ రూపంలో ఇచ్చానని తెలిపాడు. రోజూ పని వద్దకు వచ్చి మిగిలిన కమీషన్ ఇస్తేనే పని చేయాలని, లేదంటే పనులు చేయొద్దని ఒత్తిడి చేస్తుండడంతో కొద్దిరోజు పనులు కూడా ఆపేశామని అప్పట్లో ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు. దీనికి తోడు పీటీసీలో బిగ్లర్ హెడ్‌కానిస్టేబుల్‌గా పని చేస్తున్న ఎస్. ఇరుదయరాజ్ వెల్ఫేర్ స్టోరు హెల్పర్‌గా ఉంటున్నారు. డీఎస్పీ హనుమంతు వేధింపులు తాళలేక ఈయన కూడా గతంలో టూటౌన్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. ‘స్టోర్‌లో నీవెంత సంపాదించావు? నాకు రూ. లక్ష ఇవ్వాలి’ అని డిమాండ్ చేశాడని ఫిర్యాదులో పేర్కొన్నాడు. స్టోర్ ద్వారా ఎలాంటి అక్రమ సంపాదన చేయలేదని తెలిపితే ‘ నీ ఇష్టం. ఇవ్వకపోతే నీపై కేసు రాసి జైలుకు పంపుతా’నని బెదిరించాడని.. దీంతో భయపడి రూ. 45 వేలు డీఎస్పీకి ఇచ్చానని బాధితుడు ఆరోపించాడు. అంతటితో ఆగకుండా తక్కిన రూ. 55 వేలు కూడా ఇవ్వాలటూ గడువు విధించాడు. ఈ క్రమంలో తనను ఇబ్బందులకు గురి చేసిన డీఎస్పీపై చర్యలు తీసుకోవాలని ఇరుదయరాజ్ ఫిర్యాదు చేయడం అప్పట్లో కలకలం రేపింది. వీటన్నింటికీ తోడు హనుమంతు ప్రభుత్వ క్వాటర్సులోనే ఉంటూ హెచ్ఆర్ఏ డ్రా చేయడం, తన వ్యక్తిగత పనులకు ప్రభుత్వ వాహనం ఉపయోగించడం తదితర ఫిర్యాదులపై ఉన్నతాధికారులు సమగ్రంగా విచారణ చేయించారు. డీఎస్పీ హనుమంతు లీలలు నిగ్గు తేలడంతో చివరకు సస్పెన్షన్ వేటు వేశారు. కాగా...తనను డీఎస్పీ హనుమంతు డబ్బులు డిమాండ్ చేస్తున్నాడంటూ ఫిర్యాదు చేసిన హెడ్‌కానిస్టేబుల్ ఇరుదయరాజ్‌ను ఇదివరకే సస్పెన్షన్ చేయడం కొసమెరుపు. -
కుందూ-పెన్నా కాలువపనులు రద్దు
ప్రొద్దుటూరు: ప్రభుత్వ ఆదేశాల కారణంగా ప్రొద్దుటూరు పట్టణానికి తాగునీటిని అందించేందుకు మంజూరు చేసిన కుందూ-పెన్నా వరదకాలువ నిర్మాణ పనులు రద్దయ్యాయి. దీంతో ఈ పనులను అధికారులు నిలిపివేశారు. నిబంధనల ప్రకారం ఈ ఏడాది ఫిబ్రవరిలో ఈపనులు మంజూరుకాగా త్వరలో టెండర్లు నిర్వహించాల్సి ఉంది. అయితే మాజీ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి హయాంలోమంజూరు చేసిన పనులను ఆపాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్.కృష్ణారావు అన్ని శాఖలకు ఆదేశాలు జారీ చేశారు.దీంతో ఈనెల 4వ తేదీన జారీ చేసిన ఈ ఆదేశాల ప్రకారం చిన్న నీటిపారుదల శాఖ పరిధిలోని కుందూ పెన్నా కాలువ నిర్మాణ పనులురద్దయ్యాయి. ప్రొద్దుటూరు పట్టణానికి తాగునీరు అందించేందుకు దివంగత ముఖ్యమంత్రివైఎస్ రాజశేఖరరెడ్డి తొలుతగా 2007 మే24న రూ.72.53 కోట్ల నిధులు మంజూరుచేయగా రూ.60.59 కోట్లతో కాంట్రాక్టుఅగ్రిమెంట్ జరిగింది. అయితే అసంబద్ధంగా అలైన్మెంట్ మార్చి చేపడుతున్నఈ పనులను నిలిపివేయాలని రైతులుకోర్టును ఆశ్రయించడంతోపాటు ఇందుకురాజకీయ కారణాలు కూడా తోడయ్యాయి. ఈ కారణంగా పనులు సగం కూడా కాకముందే ఆగిపోయాయి. మొత్తం పెద్దముడియం మండలంలోని నాగరాజుపల్లెనుంచి 33.907 కిలోమీటర్ల పరిధిలోపనులు జరగాల్సి ఉండగా కేవలం 12.80కిలోమీటర్లు మాత్రమే పూర్తయ్యాయి.ఇంకా 21.107 కిలోమీటర్లు పనులు చేపట్టాల్సి ఉంది. అలాగే కాలువ నిర్మాణంలోభాగంగా 44 స్ట్రక్చర్లకుగాను రెండు కూడాపూర్తిగా నిర్మించలేదు. 924.95 ఎకరాలుభూసేకరణ చేయాల్సి ఉండగా కేవలం503.28 ఎకరాలు మాత్రమే పూర్తయింది.ఇంకా 421.67 ఎకరాల భూమిని సేకరించాల్సి ఉంది. ఇప్పటి వరకు అయినపనులకు రూ.28.327 కోట్ల నిధులు ఖర్చుచేశారు. ఈ నేపథ్యంలో మాజీ ఎమ్మెల్యేనంద్యాల వరదరాజులరెడ్డి అప్పటి ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి హయాంలో ఈపనులను పునరుద్ధరించేలా మళ్లీ కొత్తగాపనులు ప్రారంభించేందుకు అనుమతిమంజూరు చేయించుకున్నారు. జీఓ ఆర్టీనెంబర్ 118 ప్రకారం ఈ ఏడాది ఫిబ్రవరి6వ తేదీన రూ.183.2197 కోట్లతో ఈ పథకాన్ని పునరుద్ధరించారు. వెంటనే ఎన్నికలురావడంతో పనులు ముందుకు సాగలేదు.త్వరలో ఇందుకు సంబంధించి టెండర్లుపిలవాల్సి ఉండగా ప్రస్తుత ముఖ్యమంత్రిచంద్రబాబు నాయుడు దీనిపై ఆంక్షలువిధించారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధానకార్యద ర్శి ఆదేశాలు జారీ చేశారు. ఈమేరకు గత ఏడాది సెప్టెంబర్ నుంచిమంజూరైన పనులు ఆగిపోయాయి. మిగతా పనులతోపాటే ఆగిపోయాయి..ప్రభుత్వ ఆదేశాల ప్రకారం మిగతా పనులతోపాటే కుందూ-పెన్నా వరద కాలువపనులు ఆగిపోయాయి. పనులు తిరిగిప్రారంభించాలంటే ప్రభుత్వం ఉన్నతస్థాయిలో చర్చించి నిర్ణయం తీసుకోవాల్సిఉంటుంది. - పట్టాభి రామిరెడ్డి, ఇన్చార్జి డీఈ -
నిర్లక్ష్యానికి మూల్యం
సాక్షి, నెల్లూరు: ఎప్పటికి పూర్తవుతాయో తెలియని స్థితిలో నత్తనడకన సాగుతున్న భవన నిర్మాణ పనులు. పెపైచ్చు నాసిరక నిర్మాణాలు. మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా వారు తనిఖీ చేసే నాటికి సమకూరని వసతులు. వెరసి ఈ ఏడాది కూడా నెల్లూరు మెడికల్ కళాశాలలో సీట్ల భర్తీ కలగానే మిగలనుంది. మెడికల్ కళాశాలలో సకాలంలో వసతులు ఏర్పాటు పూర్తికాక పోవడంతో సింహపురి కళాశాలకు చెందిన 150 సీట్లతో పాటు రాష్ట్రంలో మొత్తం 350 ఎంబీబీఎస్ సీట్లను మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా రద్దు చేసిన విషయం విదితమే. ఇదే విషయంపై రాష్ట్ర వైద్య,ఆరోగ్య,వైద్యవిద్యా శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ మంగ ళవారం అధికారులతో సమీక్షించారు. రద్దైన ఎంబీబీఎస్ సీట్లు తిరిగి వచ్చే అవకాశం కనిపించడంలేదని ఆయన విలేకరులకు తెలిపారు. గత ప్రభుత్వం సకాలంలో నిధులు ఇవ్వకపోగా తీరా నిధులు వచ్చిన తర్వాత కాంట్రాక్టర్లు భవననిర్మాణాల విషయంలో మరింత నిర్లక్ష్యం వహించడం వల్లే ఈ దుస్థితి దాపురించింది. త్వరితగతిన నిర్మాణాలు పూర్తి చే యించాల్సిన అధికారులు సైతం ఏ మాత్రం పట్టించుకోక పోవడంతో మెడికల్ కళాశాల భవన నిర్మాణాలు మరింత ఆలస్యమయ్యాయి. పర్యవసానంగా ఈ నెల మొదట్లో మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా బృందం వచ్చేనాటికి వసతులు సమకూరక పోవడంతో వారు ఈ ఏడాది అడ్మిషన్లకు ససేమిరా అన్నట్లు తెలుస్తోంది. దీంతో రెండో ఏడాది కూడా సింహరి మెడికల్ కళాశాలలో సీట్లు భర్తీ చేసే అవకాశం లేకుండా పోయింది. మెడికల్ కళాశాల పనుల నాణ్యత సైతం ప్రశ్నార్థకంగా మారింది. నాలుగురోజుల క్రితం సాక్షాత్తు కలెక్టర్ శ్రీకాంత్ ఈ పనుల నాణ్యతను అడుగడుగునా పరిశీలించిన అధికారుల పై మండిపడ్డారు. ఇవేం పనులు అంటూ మండిపడిన విషయం తెలిసిందే. వైద్యకళాశాల నిర్మాణ పనులు యుద్ధ ప్రాతిపదికన పూర్తిచేసి 2013-14కు కళాశాలను ప్రారంభిస్తామన్న అప్పటి రాష్ట్ర ఆర్థిక మంత్రి ఆనం రామనారాయణరెడ్డి మాటలు నీటిమూటలుగానే మిగిలాయి. రూ.362 కోట్ల నిధులకు గాను తొలుత కేవలం నామమాత్రంగా రూ.20 కోట్లు మాత్రమే మంజూరు చేసి ఆయన చేతులు దులుపు కున్నారు. వైద్యకళాశాల పనులు ఎక్కడ వేసిన గొంగలి అక్కే అన్నట్టు ఉండిపోయాయి. ఇటీవల మరో రూ.80 కోట్లు నిధులు మంజూరు చేసినా నిర్మాణ పనులను అధికారులు, నేతలు పట్టించుకోక పోవడంతోనే వైద్యకళాశాల సకాలంలో పూర్తికాలేదన్న విమర్శలున్నాయి. ప్రస్తుతం వైద్యకళాశాలకు సంబంధించి పరిపాలన భవనం,సిబ్బంది వసతి గృహాలు, బాలురు, బాలికల వసతి గృహాల పనులు జరుగుతున్నాయి. ఈ పనులు పూర్తి కావడంతో పాటు ప్రొఫెషర్స్,అసిస్టెంట్ ప్రొఫెషర్స్,సిబ్బంది నియామకం, ఇన్ఫ్రాస్ట్రక్చర్ పూర్తి స్థాయిలో ఏర్పాటు చేయాలి. ఇవన్నీ సకాలంలో పూర్తి కావాల్సి ఉంది. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ పరిశీలించి సంతృప్తి చెంది గ్రీన్ సిగ్నల్ ఇస్తేనే వైద్యకళాశాల ప్రారంభ మౌతుంది. ఈ నెల ప్రారంభంలో ఇండియన్ మెడికల్ కౌన్సిల్ వచ్చి పరిశీలించే నాటికి పనులు పూర్తికాలేదు. పర్యవసానంగా ఈ ఏడాది సైతం విద్యార్థులు 150 సీట్లను కోల్పోవలసి వస్తోంది. కళాశాల మంజూరు: నెల్లూరుకు వైద్యకళాశాల మంజూరు చేస్తూ ప్రభుత్వం 2012లో జీఓ జారీ చేసింది. ప్రస్తుత డీఎస్సార్ ప్రభుత్వ ఆస్పత్రి ఆవరణలోని 80 ఎకరాల స్థలంలో రూ.362 కోట్లతో ప్రభుత్వ వైద్యకళాశాలను నిర్మించేందుకు అధికారులు నిర్ణయించారు. ఆంధ్రప్రదేశ్ మెడికల్ సర్వీసెస్ ఇన్పాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో కళాశాల నిర్మాణానికి అనుమతులు వెలువడ్డాయి. ఆర్భాటంగా ప్రకటించిన నాటి మంత్రి వైద్యకళాశాల నమూనాలను ఎస్ఎస్ కన్సల్టెంట్ తయారు చేయగా అప్పటి మంత్రి,వైద్య,ఆరోగ్యశాఖ అధికారులు నెల్లూరులో ఆర్భాటంగా సమావేశం నిర్వహించి కళాశాల నిర్మాణం తీరుతెన్నులను వివరించారు. తొలుత 150 సీట్లతో వైద్యకళాశాలను ప్రారంభించినా భవిష్యత్తు తరాల విద్యార్థుల అవసరాలను దృష్టిలో ఉంచుకొని 260 సీట్లకు కళాశాలను పెంచాలని నిర్ణయించినట్లు మంత్రి గొప్పలు చెప్పారు. అందుకు అనుగుణంగా భవనాల నిర్మాణాలను చేపడుతున్నామని, అవసరమై నిధులను ప్రభుత్వం కేటాయిస్తుందని కూడా నాడు మంత్రి ఆనం ప్రకటించారు. సకాలంలో నిధులు మాత్రం ఇవ్వక పోవడంతో మెడికల్ కళాశాల పనులు ఆలస్యమయ్యాయి. వైద్యవిద్యార్థులకు మొదటి సంవత్సరంలో అనాటమీ, ఫిజియాలజీ, బయోకెమిస్ట్రీ సబ్జెక్టులుంటాయి. అనాటమీకి థియేటర్, మిగిలిన వాటికి ల్యాబ్‌లు తప్పనిసరి. ఒక్కో విభాగానికి ఒక ప్రొఫెసర్, ముగ్గురు అసోసియేట్ ప్రొఫెసర్స్,ముగ్గురు అసిస్టెంట్ ప్రొఫెసర్స్‌తో పాటు పది మంది ట్యూటర్లు అవసరమవుతారు. వీరితో పాటు కార్యాలయాల సిబ్బంది సరేసరి. ఈ లెక్కన వందలాది మంది సిబ్బంది నియామకం జరగాల్సి ఉంది. నిబంధనల మేరకు కళాశాల నిర్మాణం పూర్తయి మౌలిక సదుపాయాలు, ఆధునిక వైద్యపరికరాలతో పాటు అన్ని సౌకర్యాలు ఉన్నాయని భారతీయ వైద్యమండలి కళాశాల నిపుణులు సంతృప్తి చెందితేనే విద్యార్థులకు వైద్యకళాశాలలో ప్రవేశాలు కల్పిస్తారు. ఈ లెక్కన మిగిలిన దాదాపు రూ.300 కోట్లు నిధులు ఇచ్చి త్వరితగతిన పనులు పూర్తి చేస్తే తప్ప వచ్చే ఏడాదైనా వైద్యకళాశాల ప్రారంభం అవుతుందా అన్నది అనుమానమే. -
గ్రామ పాలన.. నిర్లక్ష్య నీడన!
జిల్లాలోని పంచాయతీ భవనాలకు సొంత భవనాలు లేక పోవడంతో అనేక సమావేశాలు ఆయా గ్రామాల్లోని అంగన్వాడీ కేంద్రాలు, పాఠశాలలు, దేవాలయాలు, రచ్చకట్టలపైనే నిర్వహిస్తున్నారు. మరి కొన్ని ప్రాంతాల్లోని పంచాయతీ కార్యాలయ భవనాలు పూర్తి శిథిలావస్థకు చేరుకొని, కూలేందుకు సిద్ధంగా ఉన్నాయి. 2011-12 ఆర్థిక సంవత్సరంలో జిల్లాలో 420 గ్రామ పంచాయతీలకు పక్కా భవనాలు నిర్మించేందుకు ప్రణాళికలు రూపొందించారు. అయితే 387 భవన నిర్మాణ పనులు ప్రారంభించేందుకు అనుమతులు లభించాయి. ఒక్కో భవన నిర్మాణానికి రూ.10 లక్షల మేర రూ.38.70 కోట్లు మంజూరు చేశారు. ప్రస్తుతానికి 286 భవన నిర్మాణాలు మాత్రమే పూర్తి అయ్యాయి. 22 ప్రాంతాల్లో స్థల సమస్య అడ్డురాగా, వివిధ కారణాలతో 11 ప్రాంతాల్లో నేటికి పనులు ప్రారంభం కాలేదు. మిగిలిన ప్రాంతాల్లో నిర్మాణాలు వేర్వేరు దశల్లో కొనసాగుతున్నాయి. పంచాయతీ భవన నిర్మాణాల పనులను పర్యవేక్షించాల్సిన పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండడంతో పనుల్లో తీవ్ర జాప్యం నెలకొంది. అనేక గ్రామ పంచాయతీలకు సొంత భవనాలు ఉన్నా, ఆయా కార్యాలయాల్లో తగిన ఫర్నీచర్ సౌకర్యం లేదు. కొన్ని కార్యాలయాల్లో కేవలం రెండు, మూడు కుర్చీలే గతి. వార్డు సభ్యులతో పాటు, వివిధ సమస్యలపై కార్యాలయాలకు వచ్చే ప్రజలు కూడా నిలబడే ఉండాల్సి వస్తోంది. మరి కొన్ని కార్యాలయాలకు విద్యు సౌకర్యం లేకపోవడం గమనార్హం. పంచాయతీ భవనాల పరిస్థితి ఇది: ఆదోని మండల పరిధిలోని సంతెకుళ్లూరు, మధిరె, హానవాలు, పాండవగల్లు, గణేకల్, బసాపురం, బసరకోడు గ్రామాల్లో పంచాయతీ భవనాలు శిథిలావస్థకు చేరుకున్నాయి. సంతెకుళ్లూరు భవనం పైకప్పు పెచ్చులూడి ప్రమాదకరంగా ఉంది. ఆళ్లగడ్డ మండలంలో 18 పంచాయతీలు ఉండగా ఒక్క పంచాయతీకి కూడా సచివాలయం భవనం లేదు. కోటకందుకూరు, బత్తలూరు, చింతకొమ్మదిన్నె గ్రామాల్లో పంచాయతీ, రెవెన్యూ అధికారులు ఒక్కటే భవనంలో ఉన్నారు. చాగలమర్రి మండలంలో 18 పంచాయతీలు ఉండగా రెండు భవనాలు శిథిలావస్థకు చేరుకున్నాయి. 12 పంచాయతీలకు భవనాల్లేవు. శిరివెళ్ల మండలంలో 13 పంచాయతీలు ఉండగా మూడు పంచాయతీల్లో స్థలం సమస్యతో భవన నిర్మాణాలు ప్రారంభించలేదు. ఐదు పంచాయతీల్లో పాతభవనాలు శిథిలావస్థకు చేరుకోగా మిగిలిన ఐదు పంచాయతీల్లో భవన నిర్మాణాలు నత్తనడకన సాగుతున్నాయి. రుద్రవరం మండలంలో 20 పంచాయతీలకుగాను 9 పంచాయతీ కార్యాలయాలకు భవనాలు పూర్తి కాగా, ఆరు గ్రామాల్లో స్థలం సమస్యతో భవన నిర్మాణాలు ప్రారంభం కాలేదు. ఐదు పంచాయతీల్లో భవన నిర్మాణాలు ఏళ్లు గడుస్తున్నా పూర్తికాలేదు. ఆలూరు మండలంలో 14 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. వీటిలో హుళేబీడు, మూసానపల్లి తదితర గ్రామ పంచాయతీలతో పాటు మరో ఆరు గ్రామ పంచాయతీలకు కార్యాలయాలు లేవు. ఆస్పరి మండలంలోని బనవనూరు, పి.కోటకొండతో పాటు మరో నాలుగు గ్రామ పంచాయతీల్లో పంచాయతీ భవన నిర్మాణాలు కొనసాగుతునే ఉన్నాయి. హాలహర్వి మండలంలోని బాపురం, హాలహర్వి తదితర గ్రామాలతో పాటు మరో 11 గ్రామ పంచాయతీలకు ప్రభుత్వం కొత్త భవనాల ఏర్పాటుకు ముందుకొచ్చింది. వివిధ కారణాల చేత ఆ భవనాలు ఇంకా పూర్తి కాలేదు. గూళ్యం గ్రామంలో స్థల సమస్య ఉంది. చిప్పగిరి మండలంలోని దౌల్తాపురం, ఖాజీపురం, గుమ్మనూరు, డేగులపాడు, చిప్పగిరి తదితర గ్రామాల్లో భవన నిర్మాణాల పనులు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. దేవనకొండ మండలంలోని తెర్నెకల్, ఐరన్‌బండ, అలారుదిన్నె, కప్పట్రాళ్ల, పి.కోటకొండతో పాటు మరో రెండు గ్రామ పంచాయతీల్లో కార్యాలయాలు లేవు. ్ల నెల్లిబండ, చెల్లిచెలమల గ్రామాల్లో పనులు మధ్యలో ఆగిపోయాయి. ఆత్మకూరు మండలంలోని ఇందిరేశ్వరం, శ్రీపతిరావుపేట, కరివేన, బాహ్మణాంతపురం, ముష్టపల్లి పంచాయతీ భవనాలు శిథిలావస్థకు చేరాయి. వెలుగోడు మండలంలోని వెలుగోడు, అబ్దులాపురం, మాధవరం, వేల్పనూరు గ్రామపంచాయతీ కార్యాలయాలు పాతభవనంలోనే కొనసాగుతున్నాయి. రేగడగూడూరు, బోయరేవుల, మోత్కూరు గ్రామపంచాయతీ కార్యాలయాలు అద్దె భవనాలలో నడుస్తున్నాయి. బండి ఆత్మకూరు మండలంలో ఏ కోడూరు, పరమటూరు, ఈర్నపాడు, కడుమలకాల్వ తదితర గ్రామాల్లో పంచాయతీ భవనాలు అద్దె భవనాల్లో కొనసాగుతున్నాయి. నెలకు రూ. 1000 చొప్పున అద్దె చెల్లిస్తున్నారు. బేతంచెర్ల మండలంలోని హెచ్ కొట్టాలలో భవన నిర్మాణం జరుగుతుండగా, ముద్దవరం గ్రామంలో స్థల పరిశీలనలో ఆగిపోయింది. మేజర్ గ్రామపంచాయతీలైన బేతంచెర్ల, సిమెంట్‌నగర్, సాధారణ పంచాయతీ బుగ్గానిపల్లె ,గోర్లగుట్ట మినహా మిగతా వాటికి నేటి వరకు విద్యుత్ సౌకర్యం లేదు. కోడుమూరు మండలంలో 9, గూడూరులో 6, సి.బెళగల్లో 5, కర్నూలు మండలంలో 21 గ్రామ పంచాయతీ భవన నిర్మాణాల్లో నేటికి 9 భవన నిర్మాణాలు పూర్తి కాలేదు. 32 భవన నిర్మాణాలు పూర్తైప్పటికీ ప్రహరీ నిర్మించలేదు. కోవెలకుంట్ల మండలంలోని 17 గ్రామ పంచాయతీల్లో కోవెలకుంట్ల, గుంజలపాడు గ్రామంలో మాత్రమే సచివాలయాలు ఉన్నాయి. మిగిలిన 15 గ్రామ పంచాయతీల్లోని పెద్దకొప్పెర్ల, భీమునిపాడు, కంపమల్ల, పొట్టిపాడు గ్రామాల్లో భవనాలు పూర్తి అయినా అరకొర వసతుల మధ్య ప్రభుత్వ కార్యకలాపాలను కొనసాగిస్తున్నారు. సంజామల మండలంలోని సంజామల, ఆల్వకొండ గ్రామాల్లో నిర్మాణాలు అసంపూర్తిగా మిగిలిపోయాయి. దీంతో గ్రామ పాలన చావిళ్లు, సత్రాలు, పాడుబడిన భవనాల్లో నిర్వహిస్తున్నారు. పేరుసోమలలో సొంతభవనం లేక పాడుబడిన పశువైద్యశాలలో సచివాలయ కార్యకలాపాలు జరుగుతున్నాయి. మంత్రాలయం మండలంలోని రచ్చుమర్రి, పరామాన్దొడ్డి తండా, చిలకల డోణా గ్రామాల్లో పంచాయతీ భవనాలు లేవు. సూగూరులో పంచాయతీ భవనం పూర్తయినా తలుపులు తెరచుకోలేదు. కోసిగి మండలంలోని జంపాపురం, బెళగల్ , బొంపల్లి, కామన్‌దొడ్డి గ్రామాల్లో భవనాల పనులు నత్తనడకన సాగుతున్నాయి. జుమ్మలదిన్నె గ్రామంలో పంచాయతీ కార్యలయాన్ని నిర్మించలేదు. -
నిబంధనలకు టెండర్!
ఎచ్చెర్ల క్యాంపస్, న్యూస్‌లైన్ : డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ యూనివర్సిటీ వైస్‌చాన్సలర్‌గా ప్రొఫెసర్ హనుమంతు లజపతిరాయ్ ఈ ఏడాది మే 17న బాధ్యతలు స్వీకరించారు. అప్పటినుంచి వర్సిటీలో చేపడుతున్న నిర్మాణ పనుల ను టెండర్లు పిలవకుండా నామినేటెడ్ పద్ధతిలో ఇచ్చేస్తున్నారు. ఎచ్చెర్లకు చెందిన జరుగుళ్ల కృష్ణమూర్తి, శ్రీకాకుళానికి చెందిన పైడి నిర్మల్కుమార్లకే వీటిని కట్టబెడుతుండటంపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. నిబంధనల మేరకు అవసరమైతే పనులను ముక్కలు చేస్తున్నారు తప్ప టెండర్లు పిలవటం లేదు. ఇదీ పనుల పరిస్థితి పార్కింగ్ షెడ్, ఆంధ్రాబ్యాంకు పక్క గేటు నిర్మాణ పనులు పూర్తయ్యాయి. గేటును రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్ ఎల్.వేణుగోపాల్‌రెడ్డి, పార్కింగ్ షెడ్ ను వీసీ లజపతిరాయ్ ప్రారంభించారు. ప్రారంభ శిలాఫలకాలపై అంచనా వ్యయమెంతో రాయటం లేదు. అంచనాల్లో తరచూ మార్పులు చోటు చేసుకోవటమే దీనికి కారణమని సమాచారం. మహిళా వసతిగృహంపై అదనపు గదుల నిర్మాణ పనులను నాలుగు భాగాలుగా విభజించి ఇద్దరు కాంట్రాక్టర్లకు అప్పగించారు. ఇంత భారీ పనికి టెండర్లు ఎందుకు పిలవలేదని ప్రశ్నిస్తే పనులు వేగంగా పూర్తవుతాయని ముక్కలు చేసి అప్పగించామని అధికారులు కథలు చెబుతున్నారు. సీసీ రోడ్డు, ఎగ్జామినేషన్ గోదాం, మహిళా వెయిటింగ్ హాల్ నిర్మాణ పనులు వివిధ దశల్లో ఉన్నాయి. నాణ్యతపై సందేహాలు మరోపక్క నిర్మాణ పనుల్లో నాణ్యతపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. వర్సిటీ ఇంజినీరింగ్ అధికారిగా విశ్రాంత ఇంజినీర్ పని చేస్తుండటంతో జవాబుదారీతనం ఉండటం లేదని పలువురు అంటున్నారు. సిమెంటు, ఇసుకలను సరైన నిష్పత్తిలో వాడటం లేదని, శ్లాబు నిర్మాణానికి పీపీసీ బదులు ఓపీసీ సిమెంటు వాడుతున్నారని, వాటరింగ్ సరిగా చేయటం లేదని ఆరోపణలు ఉన్నాయి. పనుల నాణ్యతపై ఎలాంటి పర్యవేక్షణ లేకపోవటంతో కాంట్రాక్టర్లు ఇష్టమొచ్చినట్టు చేస్తున్నారని అంటున్నారు. పర్సంటేజీలే కారణం? టెండర్ల ద్వారా ఇచ్చే పనులకు వచ్చే పర్సంటేజీ కన్నా నామినేటెడ్ పనులకు ఎక్కువ పర్సంటేజీ వస్తుండటం వల్లే ఇలా జరుగుతోందని వర్సిటీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. నామినేటెడ్ పద్ధతిలో పనులు ఇస్తే 28 శాతం (కాంటాక్టర్‌కు 40 శాతం మిగిలే అవకాశం ఉందట), టెండర్ల ద్వారా ఇస్తే 14 శాతం(కాంట్రాక్టర్‌కు 20 శాతం మిగిలే అవకాశం ఉందట) సొమ్ము వస్తుందని అంటున్నారు. మరోవైపు.. వర్సిటీ ఇంజినీరింగ్ అధికారి కూడా పనుల్లో పరోక్షంగా పెట్టుబడి పెడుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఇప్పటికైనా ప్రభుత్వం జోక్యం చేసుకోకుంటే పరిస్థితి మరింత దారితప్పే అవకాశం ఉందని వర్సిటీ శ్రేయోభిలాషులు అంటున్నారు. నిబంధలకు లోబడే చేస్తున్నాం.. ఈ విషయమై రిజిస్ట్రార్ ప్రొఫెసర్ వడ్డాది కృష్ణమోహన్‌ను ‘న్యూస్‌లైన్’ వివరణ కోరగా ఇప్పటివరకు అత్యవసర పనులను మాత్రమే చేయించామని, ప్రతి పనికీ విశ్వవిద్యాలయాల పర్యవేక్షణ, ఆభివృద్ధి మండలి అనుమతులు తీసుకుంటున్నామని చెప్పారు. అన్ని పనులు నిబంధనలకు లోబడే చేస్తున్నామని, ఎలాంటి అవినీతి అక్రమాలు చోటు చేసుకోవటం లేదన్నారు. త్వరలో రూ.18 లక్షలతో నిర్మించనున్న భవనాల పనులకు టెండర్లు ఆహ్వానిస్తామని చెప్పారు.